8, అక్టోబర్ 2023, ఆదివారం

యక్షుడి ప్రశ్న.

 *'ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఆశ్చర్యకరమైనదేది?'* అన్నది యక్షుడి ప్రశ్న. 


నిత్యం అనేకమంది తన కళ్ళముందే చనిపోతున్నా తాను మాత్రం చిరంజీవినని అనుకుంటూంటాడు మనిషి. ఇంతకన్న ఆశ్చర్యం ఇంకేముంటుంది?' బదులిస్తాడు యుధిష్ఠిరుడు.

         ప్రతి మనిషికీ మరణం తప్పదు. అయినా తాను మాత్రం శాశ్వతంగా బతకబోతున్నట్టు ప్రవర్తిస్తుంటాడు. తనకేదో రోజున హఠాత్తుగా రాబోయే మరణం గురించి తెలుసుకోవటానికి మనిషికి క్షణం కూడా తీరికలేదు.

                  మనిషికి తన పుట్టుక గురించి తెలుసు. కాని, మరణం గురించి బొత్తిగా తెలియదు. దాన్నించి తప్పించుకోవటం అసంభవమనీ తలంచడు. చనిపోయాక ఏమవుతుంది? మరణం తరవాత మనిషి ఎక్కడికి వెడతాడు? అసలు మానవ జన్మకు ప్రయోజనమేమిటి? ఆత్మ అన్నది ఉన్నదా? శరీరాన్ని వదిలేశాక ఆత్మ ఎక్కడికి వెడుతుంది?

        జీవితం మీద జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషికీ ఎదురయ్యే ప్రశ్నలివి. జీవించటంలో మునిగిపోయి ఈ ప్రశ్నలకు జవాబుల గురించి అన్వేషించడు. చివరికి ప్రాణాంతకమైన జబ్బుచేసినా, ఆఖరి క్షణాలు ఆసన్నమవుతున్నా- ఇంకా జీవితాన్ని ఎలా పొడిగించాలా అన్న ఆలోచనే తప్ప, జన్మాంతర జీవితం గురించి తలంచడు.

              వాస్తవంగా తల్లి గర్భంలో పడినప్పటినుంచి మరణంవైపు మనిషి ప్రయాణం ఒక్కొక్క అడుగే సాగుతూంటుంది. ఓ క్షణం ముందుకు నడుస్తోందంటే ఆయుష్షులో ఓ క్షణం తరిగిపోతున్నట్టే కదా! బ్రహ్మ జ్ఞానులకు ఇది అసంబద్ధమనిపించదు. ఎందుకంటే, మరణానంతర జీవితం గురించి మన వేదాలు ఘోషిస్తున్నాయి కనుక. ఈ జీవితం ఎంత ముఖ్యమో, ఆ జీవితమూ అంతే అవసరం!

     కొన్ని మతాలు మరణానంతర జీవితం గురించి భయపెడుతుంటాయి. జీవితం ఎంత స్వేచ్ఛాసుఖాలతో అనుభవించవచ్చో మరణం కూడా అంత స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో ముగించవచ్చని మన వేదాలు చెబుతున్నాయి.

           కొందరు మతస్తులు మనిషికి ఒకే జన్మ ఉంటుందని, మానవ జన్మ తక్కువ సమయంలో ముగిసిపోతుంది కనుక వస్తు రూపేణా దొరికే సుఖాలన్నీ ఈ జన్మలోనే తనివి తీరా అనుభవించేయాలని బోధిస్తారు. మనిషికొకే జన్మ అని అనుకోవటంలో ప్రమాదమే అది. రేపో, ఎల్లుండో ఎలాగా పోతాం కనుక త్వరత్వరగా అన్నీ అనుభవించేయాలని పిచ్చి పరుగులు పెడుతుంటారు వాళ్ళు.

          వేద పరిజ్ఞానమున్నవారిని మరణం భయపెట్టదు. వస్తురూపంగా చవిచూసే గుణాలకన్న మానసికంగా దొరికే ఆనందమే వారికి ముఖ్యం. జీవితం దారి జీవితానిదే! మరణం దారి మరణానిదే! మరణం జీవితానికి ఆఖరిమెట్టు. ఆత్మ జీవితం అనంత వాహిని. ఒక జన్మ ఆత్మ వేసుకునే వస్త్రం మాత్రమే! ఆత్మకు చావులేదు.

      భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 'అర్జునా! ప్రతి దేహంలో నివసించే దేహి లేక ఆత్మ నిత్యుడు. అవధ్యుడు. మరణమనగా దేహంనుంచి దేహి బయటికి వెళ్ళడం. దేహం ధరించే వస్త్రం లాంటిది. ఈ రెండింటి సంయోగం క్షణికమే! పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరించటం వంటిదే! ఆత్మ తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది' అని స్పష్టంగా చెప్పాడు.

       ఏదో క్షణంలో ఈ జీవితం ముగిసిపోవచ్చు. ఈ ప్రశ్నలకు జవాబులు దొరక్కుండానే సమయం అంతం అయిపోవచ్చు. అందుకే, వస్తువుల ద్వారా దొరికే సుఖసౌఖ్యాలన్నీ కేవలం తాత్కాలికమేనని, శాశ్వతంగా లభించే ఆనందం వేరే ఉందని మనసులో జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి. అప్పుడే ఈ మానవ జన్మకు ముక్తిమార్గం లభ్యమవుతుంది. దివ్యజ్ఞానం దక్కుతుంది. ఈ ఆత్మ పరమాత్మకెంతో దగ్గరని అర్థమవుతుంది.

ఆది వారం* *08-10-2023*

 *భాను వాసరః*

     *ఆది వారం* *08-10-2023*

    *రాశి ఫలితాలు*

*మేషం*

మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అధికారులతో సమస్యలుంటాయి.కొన్ని పనులలో శ్రమ తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో  ప్రతిబంధకాలు తప్పవు. ఇంటాబయట ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

*వృషభం*

ఉద్యోగమున సమస్యలు నుంచి బయటపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు.  కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది.

*మిధునం*

విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. స్వల్ప  అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.  వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది.

*కర్కాటకం*

సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

*సింహం*

చేపట్టిన పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి.

*కన్య*

స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది. సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.  వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 

*తుల*

మొండి బాకీలు వసూలవుతాయి. దాయదులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు.

*వృశ్చికం*

బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

*ధనస్సు*

కొన్ని వ్యవహారాలలో ఇతరులతో అప్రమత్తంగా వ్యవహారించాలి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

*మకరం*

ముఖ్యమైన పనులలో ఆలోచించి ముందుకు  సాగడం మంచిది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.

*కుంభం*

సోదరులతో స్థిరస్తి  ఒప్పందాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

*మీనం*

ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని చికాకులు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయటా కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు.

🕉️

సూర్యుని నమస్కరించుచున్నాను.

 ద్యుమణిం భాస్కరం సూర్యం,

సస్యోత్పాదకకారకమ్।

అపామాయతనం సూరం,

ఉష్ణరశ్మిం నమామ్యహమ్ ।।

భావం-అంతరిక్షమునందు మణివలె ప్రకాశించేటటువంటి,ప్రకాశమును కలిగించేటటువంటి,పంటలు పండుటకు కారణభూతుడైనటువంటి,నీటికి మార్గమును కలిగించేటటువంటి,జగదుత్పత్తికి కారకుడైనటువంటి,వేడికిరణములు కలిగినటువంటి సూర్యుని నమస్కరించుచున్నాను.

*కంచినాథమ్*

శుభోదయం.🌷🍅🙏

Avcel piston pump


 

LED tube light repair


 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  -  నవమి - పుష్యమి -  భాను వాసరే* (08.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/-jrwR-jYkwE?si=bvFUvPslWvOvDXwL



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కులద్వేషి

 *సుభాషితం*- 

---------------


*విషదరోతోsఫ్యతివిషమః*

     *ఖల ఇతి న మృషా వదంతి విద్వాoసః ౹*

     *యదయం నకులద్వేషీ* 

*కులవిద్వేషి పునః పిశునః ౹౹🌺*


        *విషం నిండిన పాముకన్నా దుష్టుడు ఎక్కువ చెడ్డవాడు అని విద్వాంసులు అంటారు.ఎందుకంటే పాము నకుల ద్వేషి అయితే ముంగీసకు శతృ,తన కుల ద్వేషి కాదు.అయితే దుష్ట మనిషి కులద్వేషి.*

🌺✍🏼

Garuda gammana


 

నీకంటే అలవాటు



నీకంటే అలవాటు

తండ్రి: ఎందుకు ఏడుస్తున్నావురా? కొడుకు: అమ్మ కొట్టింది నాన్నా... తండ్రి: అమ్మే కదరా కొట్టింది... ఏడవకు...

 కొడుకు: నీకంటే అలవాటయ్యింది. నాన్నా... నాకు నొప్పిగా ఉంది మరి...

😁😄

AMRUTHA HASTAM BRAHMIN TRUST*

 *

My name is Rama Rao..iam a pharma distributor. Iam one of the trustee to *AMRUTHA HASTAM BRAHMIN TRUST*  Hyd zone.


We coordinate to provide the servises like


1. Cooks and caterers 

2. Brahmin male female care takers.

3. Matrimony services

4. Nursing services 

5. Oldage home requirements 

6. Other required services to members.

7. Legal assistance 


Our main motto is to strengthen the Brahmin community like other communities.. *all the service  requests are free.. we don't charge any membership fee also*.. we only request you to save our number in your contacts.. and tell about us in your near and dear groups so that they can also avail the trust services...all the activities we do..you can see in our status updates.. 

*Pls spend little time for our Brahmins unity* 🙏

Our number: *9182057592*