ఫేస్ బుక్ సేకరణ:::
..... మైండ్ రిగ్గింగ్.!
.
>> మొన్న ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్త ప్రభంజనం తరవాత ఎంఐఎం అధినేత "అసదుద్దీన్ ఒవైసీ" ఒక విచిత్రమైన కామెంట్ చేశాడు.
.
"ఈ ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే. దేశంలో హిందూ ఓటుబ్యాంకు ఉందనడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఈ హిందూ ఓటు బ్యాంకును సంతృప్తిపరచడంకోసమే అన్ని చర్యలూ తీసుకొంటున్నారు. ఈవీఎం లకు ఏమీ కాలేదు. హిందువుల మైండ్ లు రిగ్గింగ్ అయ్యాయి"
.
>> అన్యాపదేశంగా అన్నాడో లేక తత్వం బోధపడిందో కానీ, సరిగ్గా అసలు విషయాన్ని ఒక్కలైన్లో తేల్చేశాడు.
.
>> "సంతృప్తిపరచే రాజకీయాలు - Appeasement Politics " అన్నవి మొదలుపెట్టింది ఎవరు ? దశాబ్దాలుగా మతం పేరుతో పకడ్బందీ ఓటు బ్యాంకు ను నిర్మించుకొన్నది ఎవరు ? అందిపుచ్చుకొన్నది ఎవరు ? దానికి బలియైనది ఎవరు ?
.
>> ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం కులం,మతం, ప్రాంతం పేరుతొ ఓట్లు అడగకూడదు - కానీ ఇక్కడ ఓట్ల పండగలో జరుగుతున్నదే అది కదా.. ?
.
>> దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి, నేటివరకూ ఈ మత రాజకీయాలను ఇంతింతై వటుడింతై రీతిలో పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ అన్నది నగ్నసత్యం. - ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా, పొగిడినా తెగిడినా, మేధావి ముసుగులో ఖండించడానికి ప్రయత్నించినా సత్యం సత్యమే.. నిష్టురసత్యమే ఇది.
.
>> కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ మత రాజకీయాలను చేస్తూ మతపరమైన ఓటు బ్యాంకు ను పెంచిపోషిస్తూ వస్తూంది అంటూ ఉదాహరణలతో వివరించే వ్యర్థప్రయత్నం ఇక్కడ చేయడంలేదు. - అదొక ఓపెన్ సీక్రెట్. అయితే ప్రధాని హోదాలో "మన్మోహన్ సింగ్" గారు అప్పట్లో అన్నమాట "Muslims must have first claim on resources" - ఈ దేశ వనరుల మీద ముస్లింలకే మొదటి హక్కు ఉండాలి"
.
>> ఆయన ఏ ఉద్దేశ్యంతో అన్నారో, ఆయన "మైనారిటీలకు" అన్నాడో లేక ప్రత్యేకించి ముస్లిములకు అన్నాడో అన్నది జనాలకి అనవసరం. ఆ మాట ఒక శరంలా మెజారిటీ హిందువుల్లో గుచ్చుకొంది. - ఇలా అనడం "సంతృప్తిపరచే రాజకీయాలు - Appeasement Politics" కాక మరేమిటి ? - కాదు కాదు అది సెక్యులర్ భావన అని ఎవరైనా అన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా "మేధావులే".
.
>> దేశంలో మెజారిటీ జనాలకి మేధావులు ఏమనుకొంటున్నారో - మేధావులు ఎలా ఆలోచిస్తున్నారో అన్నది అనవసరం. వాళ్ళ దృష్టిలో ఇలాంటివన్నీ మతరాజకీయాలే. ఇంకోరకంగా చెప్పాలంటే జనాల ఆలోచనాసరళికి పూర్తి భిన్నంగా ఆలోచించేవాళ్లనే "మేధావులు" అనవచ్చు.
.
>> ఈ సెక్యులర్/లిబరల్ మేధావులు ఎలాంటివాళ్ళంటే కాంగ్రెస్ పార్టీ చేస్తే అవి Secular రాజకీయాలు - అదే బీజేపీ చేస్తే మాత్రం Communal రాజకీయాలు - ఎందుకలా ?? వై ??
.
>> ఒకప్పటి జనతాపార్టీ అధ్యక్షుడు - నేటి బీజేపీ ఎంపీ, హార్వార్డ్ ప్రొఫెసర్ అయిన "డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి " ప్రకారం, ఈ దేశంలో అధికారాన్ని నిర్ణయించేవి ఆర్థికపరమైన అంశాలో లేక అభివృద్ధి అంశాలో కావు - "కేవలం భావోద్వేగాలు" - సరిగ్గా ఇదే తత్వాన్ని బీజేపీ 2009ఎన్నికల తరవాత పూర్తిగా అర్థంచేసుకొన్నది.
.
>> బీజేపీ లో మొదటితరం నాయకత్వం "అద్వానీ - వాజపేయి" గారి "ఉదారవాద - మతరాజకీయాలు" బీజేపీ ని ఎన్నటికీ అధికారానికి దూరంలోనే ఉంచుతాయి అన్న సత్యాన్ని 2009 ఎన్నిలక ఓటమి తరవాత పూర్తిగా గ్రహించారు. 2014 ఎన్నికలకంతా వారికి పూర్తి క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖం కోసం చూశారు. మోడీ కనిపించారు. పాచిక వేశారు. మోడీకి ఉన్న ముద్ర - ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక మోడీ వ్యహరించిన విధానం, పూర్తి అగ్రెసివ్ ప్రచార శైలి ఇవన్నీ దేశవ్యాప్తంగా హిందువులను మెస్మరైజ్ చేశాయి, ప్రత్యేకించి ఉత్తరాది జనాలను. - ఫలితం, 2014 లో బీజేపీ మహాద్భుతవిజయం. హిందూ ప్రధాని అని ఆకాశానికెత్తేశారు. మోడీ కి తిరుగులేకుండా పోయింది. దీన్నే మేధావులంతా Polarisation అన్నారు. - ఇందాకనే చెప్పుకున్నట్లుగా మేధావుల ఆలోచనావిధానంతో సామాన్య జనాలకు పనిలేదు.
.
>> ఇక మోడీ అధికారం చేపట్టాక ఈ లిబరల్ మేధావులు అనబడేవాళ్ళూ - సోకాల్డ్ విద్యావంతులూ - వివిధ రంగాల్లో ప్రఖ్యాతి సాధించిన పెద్దమనుషులూ ఏకమైపోయి సెక్యులర్ ముసుగులో మోడీ మీద విపరీతమైన ద్వేషపూరిత ఆరోపణలు చేశారు. మోడీ నాయకత్వంలోని భారతదేశం సర్వనాశనమైపోతుందనీ - అరాచకం తాండవిస్తుందనీ - మైనారిటీలకు, ప్రత్యేకించి ముస్లిములకు రక్షణ లేకుండా పోయిందనీ - దళితులూ, ఆదివాసీలూ ఊచకోతకు గురవుతున్నారనీ ఇలా ఒకటేమిటి ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారం చేసేశారు. మరొకడుగు ముందుకేసి "అవార్డు వాపసీ" అంటూ ఆయా రంగాల్లో వారికి ఇదివరకటి ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులను తిరిగిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఇదంతా మోడీ ఎన్నడో ఊహించాడు. వీళ్ళ గంగవెర్రులెత్తడాన్ని చూసీ చూడనట్లు తనపని తానూ చేసుకొంటూనే పోయాడు తప్ప వీళ్ళని అస్సలు పట్టించుకోలేదు.
.
>> దీంతో మరింత అసహనానికి గురైన ఈ బ్యాచీ దేశంలో "Intolerence - అసహనం, ద్వేషం" పెరిగిపోయిందంటూ మరింతగా దుష్ప్రచారం ముమ్మరం చేసేశారు. ఎవ్వరుచూసినా మోడీని హిదూ అతివాది అంటూ ఈయనవల్ల మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందనీ, "లించింగ్" అనే ఒక కొత్తతరహా పదప్రయోగాన్ని ప్రాచుర్యంచేసేశారు. ఎక్కడ దాడులు జరిగినా దాన్ని "లించింగ్ - లించింగ్" అంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టేశారు. తోడుగా "గో రక్షక సంఘాలు" చేస్తున్న దాడులను కూడా మోదీనే చేయిస్తున్నాడంటూ మరింత రెచ్చిపోయి దేశం ఒక ఉన్మాదిచేతిలో నాశనమవుతూ ఉందంటూ, సెక్యులర్ స్ఫూర్తి లేదంటూ ఒకటే గగ్గోలు పెట్టడం, అల్లరి చేయడం - తోడుగా చింపి చాట చేయడానికి సోకాల్డ్ సెక్యులర్ / లిబరల్ మీడియా ఉండనే ఉంది .
.
>> చివరకి ఇది ఎంతవరకూ వెళ్లిందంటే యూనివర్సిటీలోని కమ్యూనిస్ట్ వాదులైన విద్యార్థి సంఘాలను రెచ్చగొట్టి, టెర్రరిస్టులకు అనుకూల కార్యక్రమాలు చేయడానికి ఆజ్యంపోసింది. ఇవన్నీ చూస్తూ ప్రభుత్వం నోరుమూసుకుని ఉండాలి, చర్యలు తీసుకొంటే మరీ గగ్గోలు పెట్టడం.. మైనారిటీ, దళిత, ఆదివాసీలకు రక్షణ లేదు అంటూ గుండెలు బాదుకోవడం.. నానా అల్లరీ చేయడం. వీళ్లకు పరామర్శగా వచ్చిన కమ్యూనిస్ట్ , కాంగ్రెస్, కేజ్రీవాల్, ఇలా ఒకరేమిటి ప్రతిఒక్కరూ తలోమాట అనడం, మోడీ మురాదాబాద్ అనడం, దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది అంటూ విపరీతమైన దాడిచేయడం - మీడియాలో అతి ప్రచారం.. అలా పుట్టుకొచ్చిన వాడే "ఆజాదీ కన్హయ్య" - మొన్న "బేగు సరాయ్" లో పోటీచేసి లక్షలాది ఓట్ల తేడాతో మట్టి కరిచాడు.
.
... ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్ళ ఈ అల్లరికి కారణం ఒక్కటే, "దశాబ్దాలుగా వస్తున్న వీళ్ళ సాంప్రదాయ ఓటు బ్యాంకుకు దీటుగా తనకంటూ ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ను మోడీ గట్టిపరచడం"
.
[ MODI KNOWS WHAT HE WANT ]
.
>> వీళ్ళ బిల్లిబిత్తిరి వేషాలకు మోడీ తొణకలేదు - బెణకలేదు. ఆయన దారిలో ఆయన తన ఓటు బ్యాంకు ను మరింత పటిష్టపరిచే కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేశాడు.
.
>> దశాబ్దాల కమ్యూనిష్టుల కంచుకోటను ధ్వంసం చేసిన "మమతా బెనర్జీ" పశ్చిమ బెంగాల్ మీద మోడీ కన్ను పడింది. 2014 నుండీ లెక్కలేనన్ని కార్యక్రమాలు బెంగాల్లో చేశారు. అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు మరో ఐదేళ్ళలో బెంగాల్లో మమతా కంచు కోటకు బీటలు పడనున్నాయని. మోడీదంతా వృధా ప్రయాస అనుకొన్నారు, ఎదురులేని మమతకు ఎదురుపోవడం మోడీ కి ఆత్మహత్యా సదృశం అంటూ హేళన చేశారు. అయితే మోడీ వ్యూహం వేరు. అక్కడ దాదాపు 30% ఉన్న ముస్లిం జనాభానే నాకు అధికారాన్ని తిరిగి తిరిగి సాధించిపెడుతుంది అంటూ విర్రవీగుతున్న మమతకు దిమ్మతిరిగేలా మిగతా 70% ఉన్న జనాభాలో మెజారిటీ వారిని తమవైపుకు గణనీయంగా తిప్పుకోవడా నికి అనితరసాధ్యమైన కృషిచేసింది బీజేపీ . ఈ ప్రయత్నాల్లో భాగంగానే కేంద్రంలో అధికారంలో ఉండీ కూడా తాను ఒక "బాధితుడు" అన్న ఇమేజ్ ను సొంతం చేసుకొనేలా బీజేపీ వేసిన ఉచ్చులో ఇరుక్కొన్న మమతా బెనర్జీ వ్యవహరించింది. బెంగాల్లో జరిగే ఏ ఇష్యూ అయినా సరే చిన్నదైనా పెద్దదైనా మీడియా లో వచ్చేలా చూసుకొంది బీజేపీ . అమిత్ షా - యోగి ఆదిత్యనాథ్ లాంటి అగ్రనాయకుల హెలికాఫ్టర్ దించడానికి అనుమతివ్వకుండా తిప్పి పంపడం నుండి ఏకంగా అమిత్ షా పైనే దాడిచేసేంతలా జరిగిన సంఘటనలన్నీ హిందువుల్లో విపరీతమైన ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే ఈ సంఘటనల్లో బీజేపీ ని మనం అమాయకురాలు గా భావించకూడదు. ఎందుకంటే, బీజేపీ బాధితుడు అన్న ఇమేజ్ రావాలంటే వీళ్ళు ఆజ్యం పోయాలి, కానీ అవి తెరమీద కనపడకూడదు - ఛాపర్ కు అనుమతి ఇవ్వకపోవడం, అమిత్ షా ర్యాలీలకు మమతా నిరాకరిస్తే కోర్టుల అనుమతి ద్వారా చేసుకోవడం , మొహర్రం ఉంది కాబట్టి హిందువుల ర్యాలీలను పోస్ట్ పోన్ చేసుకోవాలని మమతా ప్రభుత్వం హుకుం జారీ చేయడం, (అలాగే జై శ్రీరామ్ అనకూడదు అన్నారు అని విన్నాను, నాకైతే వాస్తవం తెలియదు)దానికి బీజేపీ సంఘర్షించడం, తద్వారా మతపరమైన ఘ ర్షణలు చెలరేగడం ఇలాంటి సంఘటనలు గత ఐదేళ్ళలో కోకోల్లలుగా జరిగేలా చేసి, వాటిని ప్రముఖంగా మీడియా లో వచ్చేలా చూసుకోవడంలో బీజేపీ 100% సఫలీకృతమయ్యింది. వీటన్నిటికీ తోడు మొన్న "ఫోనీ " తుఫాను సందర్బంగా ప్రధాని మోడీ ఏర్పాటు చేసినరివ్యూ కార్యక్రమానికి మమత గైరుహాజరు కాకపోవడమే కాకుండా, ఏకంగా నేను ఈ ప్రధానిని గుర్తించడం లేదు అంటూ దిక్కుమాలిన తింగరి వ్యాఖ్య చేసింది. పైగా మోడీ కి ప్రజాస్వామ్యపు చెంపుదెబ్బ రుచించిచూపిస్తాం అంటూ వాగింది. ఇలా మరెన్నో విషయాల్లో మోడీ మీద అనవసరపు, అర్థంలేని మాటల దాడులు చేస్తూ.విపరీతమైన ద్వేషంతో వ్యవహరించింది. వీటన్నిటికీ పరాకాష్ట ఏమిటంటే అక్షయ్ కుమార్ తో ఇంటర్వ్యూ లో మోడీ అన్న మాట "మమతా గారు నాకు కుర్తాలు లడ్డూలు పంపుతారు" - దీనికి స్పందిస్తూ, మమతా అన్నమాట "మట్టితో చేసిన రసగుల్లాలు పంపుతాం" - ఏమైనా అర్థముందా అసలు ?? - పిచ్చి మమత, అర్థంలేని ఆవేశంతో తెలివితక్కువగా వ్యహరించి భారీమూల్యాన్ని చెల్లించుకొంది. - 2014 లో బెంగాల్లో కేవలం రెండు ఎంపీ సీట్లున్న బీజేపీ 2019 లో ఏకంగా 18 ఎంపీ సీట్లను గెలవడమంటే మామూలువిషయం కాదు. - బీజేపీ తన ఓటు బ్యాంకు ను గణనీయంగా పెంచుకోంది .
.
>> ఇకపోతే, ఎన్నడూ లేనివిధంగా ఈ రాహుల్ "మేమూ బాంబలమే - మాకూ జంధ్యం ఉంది" అంటూ ఆలయాల సందర్శనం - నుదురు కనపడకుండా విభూతి - కుంకుమ పెట్టుకోవడం, అర్ధనిమీలిత నేత్రాలతో - ముకుళిత హస్తాలతో ఆలయాల్లో ప్రత్యేకంగా కనిపించడం - భజనలు చేయడం" - మానససరోవర యాత్ర దీనికి అదనం. ఇలాంటి కార్యక్రమాల్లో రాహుల్ బాబాని చూసిన జనాలు అడ్డెడ్డెడ్డెడ్డే.... మోడీ దెబ్బకు వీళ్ళకి హిందూ దేవుళ్ళు గుర్తుకొచ్చారా, భలే భలే, ఇన్నేళ్లూ ఎక్కడ చచ్చారో అంటూ ఈసడించుకోవడం, అప్పటికే కాంగ్రెస్ మీదున్న చెడు అభిప్రాయం మరింతగా బలపడడం మొదలయ్యింది - రాహుల్ టెంపుల్ రన్ అనేది రాహుల్ కీ కాంగ్రెస్ కీ ఒక్కశాతం కూడా మేలుచేయకపోగా పైగా చావుదెబ్బ తీసింది.
.
>> దేశం మొత్తం బీజేపీ ఇదే సూత్రాన్ని అమలుచేసింది. దెబ్బకి ఉత్తరాది మొత్తం (పంజాబ్ మినహాయిస్తే) కషాయమైపోయింది. ఉత్తరప్రదేశ్ లో పచ్చగడ్డివేస్తే భగ్గుమనే సమాజ్ వాదీ (ములాయం-అఖిలేష్) - బహుజన్ సమాజ్(మాయావతి) పార్టీలు కలిసి పోటీచేసినా వారికి చిప్ప చేతిలో పెట్టారు జనాలు. సింధియాలను లక్షల ఓట్ల తేడాతో ఘోరంగా ఓడించారు. ఆఖరికి గాంధీని హతమార్చిన గాడ్సే ని పొగిడిన సాధ్వీ ప్రగ్యా సింగ్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. - ఒకటా రెండా, బీజేపీ చేస్తున్న అశ్వమేధయాగంలో వదిలిన "హిందూ యాగాశ్వాన్ని" అడ్డుకొనే మొనగాడే లేకుండాపోయాడంటే అతిశయోక్తి కాదు.
.
>> ఇక దక్షిణాదిలో కర్ణాటక కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక తెలంగాణలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు సాధించిందంటే ఏ స్థాయిలో వాళ్ళు పట్టుసాధించారో ఆలోచించండి. తెలంగాణలో బీజేపీ కి ఈ స్థాయిలో ఓట్లు పాలవ్వడానికి కారణం ఒకటే "బీజేపీ హిందూ అజెండా - కెసిఆర్ అర్థంలేని మాటలు" - "గీ హిందూ గిందూ ఎవడ్రా భయ్ , ఆల్లేంది మనకు నేర్పేది, మనకు తెల్వదా " లాంటి మాటలకు తోడు, ఎంఐఎం వారి సాహచర్యం కలిసి జనాల్లో ఒళ్ళు మండేలా చేసింది. - ఫలితం బీజేపీ కి నాలుగు ఎంపీ సీట్లు. - ఈ ఓట్లన్నీ, ఎక్కువగా తెరాస కు చెందిన హిందూ ఓట్లే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం కూడా తనకి ఉన్న టీడీపీ/కాంగ్రెస్ ఓట్లతో పాటు, తెరాస కి ఉన్న మెజారిటీ హిందూ ఓట్లన్నీ బీజేపీ కి వెళ్లడడమే - అసదుద్దీద్ మాటల్లో చెప్పాలంటే "హిందూ మైండ్ రిగ్గింగ్" జరిగింది . - మిగిలింది, కేరళ, తమిళనాడు, ఆంధ్రా - మరో పదేళ్లలో ఖచ్చితంగా కబళించేస్తారు.
.
>> ఇలా ఒకటేమిటి రాష్ట్రానికొక వ్యూహం - నియోజకవర్గాలను అనుసరించి వ్యూహాలు - ప్రాంతాలను అనుసరించిన వ్యూహాలు ఇలా పక్కా ప్రణాళికతో గత ఐదేళ్ళలో "మోడీ - షా" ద్వయం అత్యద్భుతంగా హిందూ ఓటు బ్యాంకు ను పటిష్టం చేసుకొన్నది .
.
>> "మోడీ - షా" ల వ్యూహాలకు ఉత్ప్రేరకంగా పనిచేసింది మాత్రం ఈ లిబరల్/సెక్యులర్ మేధావి వర్గం ముసుగులో చేసిన హిందూ వ్యతిరేక ప్రచారం . ప్రతి అడ్డమైన వాడూ హిందూ మతాన్ని విమర్శించేవాడే. హిందూ మతం హింసతో కూడుకొన్నది అంటూ కూసిన సీతారాం ఏచూరి మాటలని ఏ ఒక్క మేధావీ ఖండించలేదు - కానీ జనాలు మాత్రం ఆ ఏచూరి పార్టీకి కుర్రు కాల్చి కోలుకోలేని వాత పెట్టారు. ఎన్నడూ లేని విధంగా సుమారు 23 పైచిలుకు పార్టీలన్నీ మూకుమ్మడిగా "మోడీ ని అధికారం చేపట్టనీయకూడదు" అన్న సింగిల్ పాయింట్ అజెండాతో విపరీతమైన ద్వేషాన్ని కక్కాయి. విషం చిమ్మాయి. కానీ మోడీ మాత్రం తాను చేయాల్సింది చేసుకొంటూ పోయాడు. ఎలా మాట్లాడితే జనాల్లో భావోద్వేగాలు రెచ్చిపోతాయో అలా చేసుకొంటూ పోయాడు. - అలా చేయడం తప్పుగదా అంటూ ప్రశ్నిస్తే - మరి మిగతా వాళ్ళు చేస్తే కరెక్టా ?? - నువ్వు ఒక్కటంటే నేను వంద అంటాను అన్నది మోడీ సూత్రం - అదొక యుద్ధ తంత్రం. - ఇక్కడ తప్పొప్పులను ఎంచడం వృధాప్రయాసే .
.
>> ఆఖరికి మొఖానికి రంగులేసుకొని తైతక్కలాడే "కమలహాసన్ - ప్రకాష్ రాజ్" లాంటి అర్భకులు కూడా హిందూ మతాన్ని ద్వేషించేవాళ్లే . ఏమిటీ వీళ్ళ ధైర్యం ? హిందువులను ఏమైనా అనవచ్చు, వాళ్ళను ఎన్ని కూతలు కూసినా ఏ రాజకీయ జీవీ ప్రశ్నించడు. ప్రశ్నించేవాళ్లంతా "హిందూ అతివాదులు - కాషాయ తీవ్రవాదులే". ఇలాంటి రాజకీయ పరమైన అనాధ అయిన హిందూ ఆశాదీపంలా బీజేపీ అవతరించింది. జనాల్లో ఉన్న ఈ అసంతృప్తిని పూర్తిగా సద్వినియోగం చేసుకొన్నది.
.
>> "డాక్టర్ సుబ్రహ్మణ్యన్ స్వామి " అన్నట్లు "ఈ దేశంలో అధికారాన్ని నిర్ణయించేవి ఆర్థికపరమైన అంశాలో లేక అభివృద్ధి అంశాలో కావు - "కేవేలం భావోద్వేగాలు" - ఇది 100% వాస్తవం .
.
>> అలాగే అసదుద్దీన్ అన్నట్లు "బీజేపీ హిందువుల మైండ్ ను రిగ్గింగ్ చేసింది - ఇదికూడా 100% వాస్తవం.
.
>> చివరగా ఒక్కమాట, తాను కరడుగట్టిన హిందూ వాది ని అన్న విషయాన్ని మోడీ ఎన్నడూ దాచుకోలేదు - దాచుకొనే ప్రయత్నం చేయలేదు"
.
>> జనాలు (మేధావులు కాదు) "మోడీ ని హిందూ భావజాలానికి అసలైన ప్రతినిధిగా" భావించారు - మరోవైపు "రాహుల్ నూ, ఆయన వందిమాగద బ్యాచీనీ (మోడీ పరిభాషలో టుక్డే-టుక్డే గ్యాంగ్) "అవకాశవాద - నకిలీ హిందువులు" గా భావించారు. - ఫలితం కాంగ్రెస్ పార్టీనీ, టుక్డే-టుక్డే గ్యాంగ్ నీ కిలోమీటర్లలోతున పాతిపెట్టి, అఖండమైన మెజారిటీతో మోడీ నీ ప్రధాని పీఠం మీద పట్టాభిషేకం చేశారు.
.
>> ఇదంతా చదివాక, "నువ్వు మోడీనీ , ఆయన మతపూరితమైన భావజాలాన్నీ సమర్థిస్తావా" అని అడిగితె, నా సమాధానం "దశాబ్దాలుగా సెక్యులర్ ముసుగులో అణచివేయబడిన హిందూ భావజాలాన్ని తట్టి లేపి, అసలైన రాజకీయం ఎలా ఉంటుందో తెలియజేసిన బీజేపీ కి రుణపడి ఉంటాను" అని చెబుతాను. .. "జై శ్రీరామ్" - "జై హింద్".
.
మన వేదాల్లో చెప్పబడిన ఈ క్రింది శాంతి వచనమే నాకు ఆదర్శం.. అదే నా జీవనవిధానం
.
ఓమ్।।
పృథివీ శాంతిః।
అంరిక్షగ్ం శాంతిః।
ద్యౌః శాంతిః।
దిశః శాంతిః।
అవాంతరదిశాః శాంతిః।
అగ్నిః శాంతిః।
వాయుః శాంతిః।
ఆదిత్యః శాంతిః।
చంద్రమాః శాంతిః।
నక్షత్రాణి శాంతిః।
ఆపః శాంతిః।
ఓషధయః శాంతిః।
వనస్పతయః శాంతిః।
గౌః శాంతిః।
అజా శాంతిః।
అశ్వః శాంతిః।
పురుషః శాంతిః।
బ్రహ్మ శాంతిః।
బ్రాహ్మణః శాంతిః।
శాంతిరేవ శాంతిః।
శాంతిర్మే అస్తు శాంతిః।।
|
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
28, మే 2019, మంగళవారం
15, మే 2019, బుధవారం
9, మే 2019, గురువారం
సాధనేన సాధ్యతే సర్వం
సాధనేన సాధ్యతే సర్వం : ప్రతి పని ముందు మొదలుపెట్టడంతో మొదలయ్యి సఫలం అవటంతో ముగించాలి. కానీ తన మీద తనకు నమ్మకం లేని వాళ్ళు కొందరు ముందు పని మొదలుపెట్టటానికి వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తారు. అటువంటప్పుడు ఆ పని ఎలా ముగుస్తుంది. మంచి ఫలితాన్ని ఎలా ఇస్తుంది. పరీక్షలు వ్రాయటానికి ముందు ఆ పరీక్షలకు సంబందించిన సలబసు పూర్తిగా కులంకుశంగ చదివితే ఎలాంటి ప్రశ్న పాత్రనైనా సాదించ గలరు. తన ప్రేపరషన్ సరిగా లేనివాళ్లు మాత్రమే పరీక్షలంటే భయపడతారు. మనం రోజు చూస్తున్నాము ఒక తండ్రిగారు తన కుమార్తెను లేక కుమారుణ్ణి స్క్యూటర్ మీద తీసుకొని పరీక్షా కేంద్రానికి వెళుతుంటే సదరు విదార్థి వెనుక సీటులో కూర్చొని తీవ్రంగా చదువుతుంటాడు. అదిచూస్తే చూసేవారికి ఆ పిల్ల ఎంతో తీవ్రంగా ప్రిపేర్ అవుతున్నది అనుకుంటారు. నిజానికి అటువంటి చదువు నిరోధకం ఎందుకంటె ఏడాది చుడండి ఒక్క నిముషంలో అది కుదుపు వేస్తున్న స్క్యూటర్ మీద కూర్చొని చదివితే ఏమి రాదు. పైగా ఇంతకు ముందు చదివింది కూడా పోతుంది. ఇక కొంత మంది రేపు పరీక్షా అంటే ఆ క్రితం రోజు రాత్రంతా మేలుకొని తీవ్రంగా చదువుతారు. అదికూడా మంచిది కాదు. మరుసటి రోజు పరీక్షా హాలులో నిద్ర పోయి పరీక్షా ఫెయిల్ ఆయన వాళ్ళు ఎందరో, ఇక కొందరు పరీక్షా ఇంకా అర్ధ గంట ఉందనగా తన తోటి విద్యార్థిని ఆ ప్రెశ్న తెలుసా ఏ ప్రశ్న తెలుసా అని అడిగి దానికి వాడు ఏదో కొత్త ప్రెశ్న చెపితే అరె అది నేను చదవలేదని అప్పుడు గైడు ముందరేసుకొని చదవటానికి ప్రయత్నం చేస్తారు. దానితో ఆ టెంక్షన్తో చదివింది మొత్తం యెగిరి పోతుంది. మైండు పూర్తిగా బ్లాంక్ అవుతుంది. సాధన వల్ల అన్ని సాధ్యం అంటే దాని అర్ధం తానూ చేసే ప్రయత్నం పటిష్టంగా దృఢంగా ఉండాలి. నిజానికి సమస్తరం మొదటి నుండి పాఠాలని శ్రద్ధగా విని ఆకళింపు చేసుకొని చదివే విద్యార్థికి చివరి క్షణంలో చదవలసిన అవసరం ఉండదు. విద్యార్థులు కోర్సు మొదటి రోజునించీ చదవటం మొదలు పెడితే ఏక్షణంలోనైనా పరీక్షా పెట్టినా వ్రాయగలరు. మంచి మార్కులు సంపాదించగలరు.
20, ఏప్రిల్ 2019, శనివారం
ది!! 18-4-2019 నాడు నేను న్యాయ సలహాలు కార్యక్రమంలో పాల్గొన్నాను అంశం " ప్రామిసరీ నోటు - చట్ట నిబద్ధత" క్రింది లింకు క్లిక్ చేస్తే ఆ వీడియో చూడగలరు
https://www.youtube.com/watch?v=Ku7Vc_Uhnhk
https://www.youtube.com/watch?v=Ku7Vc_Uhnhk
15, ఏప్రిల్ 2019, సోమవారం
WILL DEED.
WILL DEED is one of the important document in one's life. Because this the one document which is the last time to be executed by a person in his last minute. Many people does not recognize the importance of Will Deed, due to which after the demise of the head of family the children ( Successors) will face many problems. It is always better to execute a WILL DEED when a person attains the age of 65 or more.
WHO SHOULD WRITE WILL DEED: any person who is having movable, immovable properties, cash, ornaments or any type of assets shall write a WILL DEED so as to transfer the same to his family members/Legal Representative.
HOW TO WRITE A WILL: WILL DEED is a simple deed it can be written on any paper, but it should be attested by two major witnesses.
IS IT COMPULSARY TO REGISTER A WILL DEED: NO it is not compulsory to register a will deed even a WILL DEED can be executed on a white paper. But I sincerely advise the parties to register a WILL DEED to avoid future complications.
WHY REGISTRATION: Because WILL DEED should be presented in many Government and Municipal offices to get mutate the names of Legal Representatives. In the Government offices to avoid un necessary litigation and to have perfection and to avoid risk usually prefer a Registered WILL DEED. So it is always safe to register a WILL DEED.
గమనిక: తెలుగులో కూడా వీలునామా వ్రాయ వచ్చు వివరాలకు క్రింది ఫోన్ నెంబరులు సంప్రదించండి
if you have any doubts with regard to drafting, execution of WILL DEED you can contact 9848647145, 6281412621- Sarma
1, ఫిబ్రవరి 2019, శుక్రవారం
KCR నా పెద్ద కొడుకు
రెండు రోజుల క్రిందట నేను ఒక లోకల్ బస్సులో ప్రయాణిస్తూ ఒక 70 సంత్సరాల మహిళ ప్రక్క కూర్చోటం జరిగింది. పేదరాలైన ఆమె మాటల మధ్యలో తనకు కొడుకులు ఉన్న ఎవ్వరు తనని పట్టించుకోటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్ తనని ఆదుకొంటున్నదని తానూ ఇంకా జీవించి ఉన్నానంటే కేవలం ఆ పెన్షన్ మరియు రూపాయి కిలో బియ్యం అని అశ్రు నయనాలతో చెప్పింది. నాకొడుకులు నా కొడుకులు కారు KCR నా పెద్ద కొడుకు అన్నది. పేదవాళ్ల కష్టాలు తెలుసుకొని తీసుకొన్న నిర్ణయం బహుదా ప్రశంసనీయం. పేదవారికి, రైతులకి అలాగే అన్ని కులాల్లోని పేదవారిని ఆదుకోటం ప్రశంసనీయం.
డ్వాక్రా మహిళలకు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవటానికి కొత్త పధకాలు పెడితే చాల బాగుంటుంది. ఉదాహరణకు సమిష్టిగా కరం పొడి తయారీ. దీనికోసం కొద్దీ పెట్టుబడిలో ఒక దంపుడు మిషన్ కొనుక్కుంటే టోకులో ఎండు మిర్చి కొని పొడి చేసి దానిని ప్యాక్ చేసి అమ్మవచ్చు. ప్రభుత్వం రేషన్ దుకాణాలలో కూడా విక్రయించ వచ్చు.
అలాగే ఇతర పిండ్లు కూడా చేయ వచ్చు.
డిస్పోసబుల్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర సామాగ్రి తయారు చేయవచ్చు,
ఊదు బత్తిల తయారీ
సామూహికంగా కోఅప్రతివే స్టోర్ నడపటం మెదలైనవి నడప వచ్చు.
ప్రజల దీవెనెలు దానికి తోడు ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేయటం తో అటు ప్రజల అండ ఇటు దైవ బలము తోడు వుంటటంతో KCR విజయ పధంలో పయనిస్తారనటం అతిశేయోక్తి కాదు.
20, జనవరి 2019, ఆదివారం
మేనిఫెస్టో
సాహితి సంగమం
మానవీయ విలువలకోసం
సృష్టిస్తున్న చరిత్ర
కులదురహంకార హత్యలకు నిరసన
అంతరంగం ఒక ప్రణయ తుఫాన్
తస్మాత్ జాగ్రత్త సమసమాజ స్థాపన దిశగా పయనం
కుల నిర్ములనం కోసం ప్రజా పొలికేక
ఇదొక తిమిరంతో పయనం
ఇప్పుడు పరవాన్ని పరిహసించిన పరువు
ఏమో చెప్పలేము
దీపధారి చేస్తున్నాడు బీషణ సమరం
ప్లీజ్ ఇంజెక్టమీ మహమ్మారికి నరకం
మనిషి శిలయా కాదు మనిషి తెలివైన జంతువు
ఓ చిన్న మాట
కళ ప్రజలకోసం అనే రెండు పదాల
మేనిఫెస్టో ఈ సాహితి సంగమం
మానవీయ విలువలకోసం
సృష్టిస్తున్న చరిత్ర
కులదురహంకార హత్యలకు నిరసన
అంతరంగం ఒక ప్రణయ తుఫాన్
తస్మాత్ జాగ్రత్త సమసమాజ స్థాపన దిశగా పయనం
కుల నిర్ములనం కోసం ప్రజా పొలికేక
ఇదొక తిమిరంతో పయనం
ఇప్పుడు పరవాన్ని పరిహసించిన పరువు
ఏమో చెప్పలేము
దీపధారి చేస్తున్నాడు బీషణ సమరం
ప్లీజ్ ఇంజెక్టమీ మహమ్మారికి నరకం
మనిషి శిలయా కాదు మనిషి తెలివైన జంతువు
ఓ చిన్న మాట
కళ ప్రజలకోసం అనే రెండు పదాల
మేనిఫెస్టో ఈ సాహితి సంగమం
10, నవంబర్ 2018, శనివారం
రాముడు కృష్ణుడు
పూర్వం సీతానగరం అనే ఒక చిన్న గ్రామంలో ఒక ఆమె ఉండేది ఆమె పేరు పార్వతి. ఆమెకు ఒక చిన్న పిల్లవాడు పేరు రాముడు. దాదాపు 10 సంవత్సరాల లేత వయస్సు వాడు వుండే వాడు. ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆమె వక్కతె తన పిల్లవాడితో జీవితాన్ని గడుపుతున్నది. ఊర్లో యేవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళ బ్రతుకు యిడుస్తున్నరు. పిల్లవాడికి ఇప్పుడిప్పుడే ఊహలు వస్తున్నాయి. వాళ్ళ ఊరిలో పాఠశాల లేనందున అక్కడికి దగ్గరలోని కొంచం పెద్ద ఊరుకి వెళ్లి చదువుకోవాలి. రాముడిని కూడా పార్వతి ప్రక్కవూరైన నాగలూరుకి పిల్లవాన్ని పాఠాశాలలో చదివించటానికి పంపింది. ఆ రెండు ఊర్ల మధ్య ఒక దట్టమైన అడవి వున్నది. ఆ అడ్డవి దాటితేనే కానీ నాగలూరు రాదు. రాముడు చిన్న పిల్ల వాడు మరియు వాళ్ళు పేదవారు కావటంతో రాముడిని వెంట తీసుకొని వెళ్ళటానికి మిగితా పిల్లలు వప్పుకొనెవారు కాదు. పాపం పార్వతి ఎంతోమంది పిల్లలని వాళ్లతోపాటు తన రాముడిని కూడా తీసుకొని వెళ్ళమని వేడుకొనేది కానీ వాళ్ళు సరే అన్న రాముడిని మాత్రం వెంట తీసుకొని వెళ్లే వారు కాదు. దానితో ఎంతో ప్రేమగా రాముడితో పార్వతి నాన్నా నీవు పెద్ద వాడివి అయ్యావు నీకు ఏమి భయం లేదు నీవు వంటరిగా వెళ్లగలవు అని ఎన్నో రకాలుగా చెప్పి చూసింది. సరే అనిఅన్నా రాముడికి ఆ అడవి దాటాలంటే చాలా భయం వేసేది. యేవో సాకులు చెప్పి తరచూ బడి ఎగ్గొట్టేవాడు. దానితో పార్వతికి ఏమి చేయాలో తోయక ఒకరోజు ఈ విధంగా చెప్పింది. నాన్న రాము నీకు అడవిలో ఒక అన్నయ్య వున్నాడు అతని పేరు కృష్ణుడు. నీకు అడవి దాటి వెళ్ళేరప్పుడు నీకు తోడుగా ఉండమని నేనుచెప్పాను. నీకు భయం వేస్తే నీవు పిలిస్తే వెంటనే నీకు సాయంగా వస్త్తాడు అని ఇంట్లో వున్నా కృష్ణుని విగ్రహం చూపించింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే రాముడు లేచాడు కాలకృత్యాలు తీర్చుకొని ఉత్సాహంగా తయారయ్యాడు. చద్దన్నం పెట్టి పిల్లవాడి రెండు బుగ్గలని ఎడమచేతితో పట్టుకొని బొట్టుపెట్టి రాముడిని బడికి పంపింది పార్వతి. పార్వతికి రాముడి ఉత్సాహంచూసి ముచ్చటేసింది. రాముడు ఒంటరిగా అడవిదారి నుండి బడికి బయలుదేరాడు. అతని కన్నులు తన కొత్త అన్నయ్య క్రిష్నుడి కోసం వెతక సాగయ్యే. నిజంగా కృష్ణ అన్నయ్య ఉన్నాడా తాను వచ్చి తనను అడవి దాటిస్తాడా అని ఆలోచిస్తూ అడవిలో నడుస్తున్నాడు రాముడు. ఇంతలో ఎక్కడినుండి వచ్చిందో ఒక పెద్ద శబ్దం ఏదో క్రూరమృగం అరుపు. ఆ అరుపుకి రాముడి ఫై ప్రాణాలు పైనే పోయాయి. వెంటనే పెద్దగా అన్నయ్య కృష్ణ అన్నయ్య అని తన శెక్తి ఉన్నంత పెద్దగా పిలిచాడు. ఎవ్వరు రాలేదు భయంతో వణికి పోతున్నాడు. ఏమి చేయాలో పాలు పోలేదు. మళ్ళా బిగ్గరగా కృష్ణ అన్నయ్య అని పిలిచాడు. ఈసారి తన గొంతే కొండలనుండి తెరిగి తనకి వినిపించింది. రాముడు అరచి అరచి సొమ్మసిల్లి మూర్ఛ పోయాడు. ఏమైందో ఏమో తాను లేచే సరికి తన ప్రక్కన ఎంతో ప్రశాంతంగా వున్నా ఒక వ్యక్తి వున్నాడు. ఆటను అచ్చంగా ఇంట్లో వున్నా క్రింష్ణుడి విగ్రహంలానే వున్నాడు. వెంటనే రాముడు అన్నయ్య కృష్ణ అన్నయ్య అన్నాడు అప్రయత్నంగా దానికి తమ్ముడు నేను వచ్చాను నీకు ఏమి భయం లేదు అన్నాడు. తన అన్నయ్య తన తోడు వున్నాడన్న ధైర్యం రాముడి మొఖంలో కొట్టొచిన్నట్లు కనపడ్డాడు. రాముడు కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. అన్నయ్య నీవు నన్ను వదిలి పోవద్దు అన్నాడు. కృష్ణుడు రాముడి భుజం తట్టి రాము నీకేమి భయం లేదు ఈ అడవి దాటె వరకు నీకు తోడుగా వుంటాను, అంతేకాదు నీకు మంచి మంచి కథలు చెపుతాను అని రాముడి భుజం మీద చేయి వేసి నడుస్తూ భాగవతంలోని కథలు చెప్పుతూ అడవి దాటించాడు. ఆ రోజునించి రాయుడు ఏ విధమైన గొడవ చేయకుండా ప్రతి రోజు బడికి వెళ్లటం పార్వతికి ఆనందాన్ని ఇచ్చింది. కాని రాముడు భయం లేకుండా అడవి ఎలా దాటుతున్నాడో మాత్రం ఆమెకి తెలియలేదు.
రాముడికి బడికి సెలవ ఇస్తే చికాగుగా ఉండేది. అమ్మా రోజు బడి వుంటే యెంత బాగుంటుంది అన్నాడు. వాడికి చదువు మీద కలిగిన శ్రద్ధకు పార్వతి నివ్వెర పోయింది. రోజుకొక భాగవత కథ తల్లికి వినిపించేవాడు రాముడు. దానికి కారణం ఏమిటో పార్వతికి అర్ధం కాలేదు. నాన్న నీకు ఇన్ని కథలు ఎవరు చెప్పుతున్నారు. మీ స్నేహితులకి ఎవరికి ఇవి తెలియవుకథ అన్నది పార్వతి. దానికి రాముడు అమ్మ నీవు చెప్పినట్లే నాకు అడవిలో కృష్ణ అన్నయ్య నాతొ పాటు వచ్చి అడవి దాటించటమే కాకుండా నాకు రోజుకొక కధ చెపుతున్నాడు. అమ్మ అన్నయ్య చాల మంచివాడు అన్నాడు. అది విని పార్వతి నివ్వర పోయింది. పిల్లవాడు చెప్పేది నిజామా కాదా అని ఆలోచనలో పెద్దది. వాడు చెప్పింది నిజం కాకపోతే వాడికి అన్ని భాగవత కధలు ఎలా వస్తాయి? మీ అన్నయ్య ఎలా వున్నాడు అని వాడిని అడిగింది పార్వతి అమ్మ అచ్చంగా మన ఇంట్లో వున్నా కృష్ణుడిలాగానే వున్నాడు అన్నాడు రాముడు. సందేహం లేదు తన పిల్లవానికి కృష్ణ భగవానుడు కనపడ్డాడు అనుకున్నది ఆ తల్లి.
రాముడి తోటి పిల్లలకి కూడా రాముడు కొత్తకొత్త కధలు చెప్పటంతో నీకు ఎవరు ఇన్ని కథలు చెప్పారు అన్నారు. రాముడు తన అన్న అడవిలో వున్నదని ఆ అన్నయ్యే కధలు చెప్పారు అన్నాడు. ఐతే మీ అన్నయ్యని మాకు చూపించమని తోటి పిల్లలు రాముడిని అడిగారు. రాముడు అడవికి వాళ్ళని తీసుకొని వెళ్లి రోజు అన్నయ్యని కలిసే చోట పెద్దగా అన్నయ్య అన్నయ్య అని పిలిచాడు. వాళ్ళకి వాడి గొంతే కొండలకి తాకి ప్రతిధ్వనించింది. మళ్ళి మళ్ళి బిగ్గరగా పిలిచాడు రాముడు. ఏమి ప్రయోజనం లేదు ఎంతసేపు పిలిచినా కృష్ణుడు రాలేదు. అందరు రాముడిని నీకు అన్నయ్య లేడు ఎవరు లేరు నీకు పిచ్చి పట్టింది అని ఎగతాళి చేశారు. రాముడు ఏడ్చుకుంటూ వాళ్ళ వెంట తన ఇంటికి వచ్చాడు. ఏమి చేయాలో పాలు పోలేదు. ఎందుకు అన్నయ్య తనకి ఈరోజు కనపడలేదు. తనని తన స్నేహితులముందు చులకన చేసాడు అని వాడికి కృష్ణుడి పైన కోపం వచ్చింది. వెంటనే తన ఇంట్లో కృషుడి విగ్రహం వున్నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని పెద్దగా ఏడవ మొదలు పెట్టాడు. కానీ కృష్ణుడు కనపడలేదు. అప్పుడు రాముడు తన తలను కృష్ణుడి విగ్రహం కాళ్ళ దగ్గర బాదుకోసాగాడు. తలా పగిలి రక్తం కారుతుంది అట్లా కొంత సేపు ఐన తరువాత తమ్ముడు అనే పిలుపు వినిపించింది. అదే పిలుపు తన అన్న కృష్ణుడి పిలుపు కానీ కళ్ళు తెరిచే ఓపిక లేదు తల మొత్తం రక్తంతో తడిసి వుంది. అతి కష్టంగా కళ్ళు తెరచి చూసాడు రాముడు. తన తలని వడిలో పెట్టుకొని నిమురుతూ వున్నాడు కృష్ణ అన్నయ్య. అన్నయ్య చెయ్యి పడగానే రక్తం మొత్తం కనిపించకుండా పోయంది కొత్త శక్తీ వచినట్లయంది రాముడికి. అన్నయ్య నీ మీద నాకు కోపం వచ్చింది నా స్నేహితుల ముందర నన్ను అవమానపరచవు అన్నాడు రాముడు. తమ్ముడు నేను అందరికి కనపడను కేవలం నీ లాంటి మంచి వాళ్లకి మాత్రమే కనపడతాను. నీ స్నేహితులు నీ లాగా మంచి వాళ్ళు కాదు వళ్ళంతా నిజమైన భక్తి లేని వాళ్ళు. అందుకే నేను వాళ్లకు కనపడనని అన్నాడు. రాముడికి తన అన్న మళ్ళి కనపడి తనను ఊరడించినందుకు చాల సంతోషం వేసింది. అప్పడి నుండి రాముడు తన అన్న విషయం ఎవ్వరికీ చెప్పకుండా తాను తనలో తానే దాచుకొని అన్నయ్య ప్రేమను పొందాడు.
ఈ కథగుర్చి:-
నేను 1977 వ సంవత్సరంలో చదివిన ఇంద్ర ధనస్సు అనే మా అమ్ముమ్మ(జి. సీత దేవి) గారి చిన్ననాటి తెలుగు పుస్తకంలోని ఒక కధ ఆ పుస్తకంలో ఐదు కధలు వున్నాయి అన్ని ఒకదానికి మించి ఒకటిగా ఉంటాయి. బహుశా 1930 దశకంలో అముమ్మ గారు చదివినది కావచ్చు నాకు జ్ఞ్యాపకం ఉన్నంత వరకు నా ఊహతో చెప్పిన కధ, అసలు కధ కొంచెం భిన్నంగా వుండి ఉండవచ్చు.
రాముడి తోటి పిల్లలకి కూడా రాముడు కొత్తకొత్త కధలు చెప్పటంతో నీకు ఎవరు ఇన్ని కథలు చెప్పారు అన్నారు. రాముడు తన అన్న అడవిలో వున్నదని ఆ అన్నయ్యే కధలు చెప్పారు అన్నాడు. ఐతే మీ అన్నయ్యని మాకు చూపించమని తోటి పిల్లలు రాముడిని అడిగారు. రాముడు అడవికి వాళ్ళని తీసుకొని వెళ్లి రోజు అన్నయ్యని కలిసే చోట పెద్దగా అన్నయ్య అన్నయ్య అని పిలిచాడు. వాళ్ళకి వాడి గొంతే కొండలకి తాకి ప్రతిధ్వనించింది. మళ్ళి మళ్ళి బిగ్గరగా పిలిచాడు రాముడు. ఏమి ప్రయోజనం లేదు ఎంతసేపు పిలిచినా కృష్ణుడు రాలేదు. అందరు రాముడిని నీకు అన్నయ్య లేడు ఎవరు లేరు నీకు పిచ్చి పట్టింది అని ఎగతాళి చేశారు. రాముడు ఏడ్చుకుంటూ వాళ్ళ వెంట తన ఇంటికి వచ్చాడు. ఏమి చేయాలో పాలు పోలేదు. ఎందుకు అన్నయ్య తనకి ఈరోజు కనపడలేదు. తనని తన స్నేహితులముందు చులకన చేసాడు అని వాడికి కృష్ణుడి పైన కోపం వచ్చింది. వెంటనే తన ఇంట్లో కృషుడి విగ్రహం వున్నా గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని పెద్దగా ఏడవ మొదలు పెట్టాడు. కానీ కృష్ణుడు కనపడలేదు. అప్పుడు రాముడు తన తలను కృష్ణుడి విగ్రహం కాళ్ళ దగ్గర బాదుకోసాగాడు. తలా పగిలి రక్తం కారుతుంది అట్లా కొంత సేపు ఐన తరువాత తమ్ముడు అనే పిలుపు వినిపించింది. అదే పిలుపు తన అన్న కృష్ణుడి పిలుపు కానీ కళ్ళు తెరిచే ఓపిక లేదు తల మొత్తం రక్తంతో తడిసి వుంది. అతి కష్టంగా కళ్ళు తెరచి చూసాడు రాముడు. తన తలని వడిలో పెట్టుకొని నిమురుతూ వున్నాడు కృష్ణ అన్నయ్య. అన్నయ్య చెయ్యి పడగానే రక్తం మొత్తం కనిపించకుండా పోయంది కొత్త శక్తీ వచినట్లయంది రాముడికి. అన్నయ్య నీ మీద నాకు కోపం వచ్చింది నా స్నేహితుల ముందర నన్ను అవమానపరచవు అన్నాడు రాముడు. తమ్ముడు నేను అందరికి కనపడను కేవలం నీ లాంటి మంచి వాళ్లకి మాత్రమే కనపడతాను. నీ స్నేహితులు నీ లాగా మంచి వాళ్ళు కాదు వళ్ళంతా నిజమైన భక్తి లేని వాళ్ళు. అందుకే నేను వాళ్లకు కనపడనని అన్నాడు. రాముడికి తన అన్న మళ్ళి కనపడి తనను ఊరడించినందుకు చాల సంతోషం వేసింది. అప్పడి నుండి రాముడు తన అన్న విషయం ఎవ్వరికీ చెప్పకుండా తాను తనలో తానే దాచుకొని అన్నయ్య ప్రేమను పొందాడు.
ఈ కథగుర్చి:-
నేను 1977 వ సంవత్సరంలో చదివిన ఇంద్ర ధనస్సు అనే మా అమ్ముమ్మ(జి. సీత దేవి) గారి చిన్ననాటి తెలుగు పుస్తకంలోని ఒక కధ ఆ పుస్తకంలో ఐదు కధలు వున్నాయి అన్ని ఒకదానికి మించి ఒకటిగా ఉంటాయి. బహుశా 1930 దశకంలో అముమ్మ గారు చదివినది కావచ్చు నాకు జ్ఞ్యాపకం ఉన్నంత వరకు నా ఊహతో చెప్పిన కధ, అసలు కధ కొంచెం భిన్నంగా వుండి ఉండవచ్చు.
5, నవంబర్ 2018, సోమవారం
శ్రీ రామాయణ రైలు
మన దేశంలో మొట్టమొదటిసారిగా మన సంస్కృతికి నిదర్శనంఐన రామాయణ ఘట్టాలను ఒకే ఒక రైలు ప్రయాణంలో చూసే అవకాశం మన కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ కల్పిస్తున్నది. ఈ రైలుకి శ్రీ రామాయణ రైలు అని పేరు పెట్టటం విశేషం. ఈ రైలు ఛార్జి రూ. 15,120 రైలు ఈ నవంబర్ 14వ తారీకునుండి నడుస్తుంది. ఈ రైలు ఢిల్లీ లోని స్ఫదరగంజి స్టేషన్ నుండి బయలుదేరి 16 రోజుల ప్రయాణం ముగించుకొని తిరిగి వాపసువస్తుందిముందుగా డిల్లీ నుండి ప్రారంభమై ఆయొధ్య, నందిగ్రాం, జనకపూర్, సీతామర్రి, ప్రయాగ, వారణాసి, చిత్రకూట్, శ్రింగవేరపుర్, నాసిక్, హంపి ల మీదగా రామేశ్వరం చేరుతుంది …. మరలా అక్కడి నుండి భక్తులను, విమానాల ద్వారా శ్రీలంకకు తీసుకువెళతారు. శ్రీలంకలొని సీతమ్మవారు ఉన్న అశొకవనం ప్రదేశాలను, రాయాయణ యుద్ధం జరిగిన ప్రదేశాలను, అత్యంత ప్రసిద్ధి చెందిన మునేశ్వరం దేవాలయం, రంబొడా, చిలావ్ లను చూపించి, తిరిగి విమానంలొ మన దేశానికి తీసుకు వస్థారు.
ఈ పర్యటనమెత్తం, రైల్వే అధికారులే దగ్గరుండి, ప్రయాణికులకు అన్నీ క్షేత్రాలను చూపిస్థారు. రైల్వే స్టేషన్ల నుండి బస్సుల ద్వారా, ఆయా పవిత్ర క్షేత్రాలకు తీసుకువెళ్ళి దైవదర్శనం, చారిత్రాత్మక కట్టడాలను, గురుతులను దగ్గరుండి చూపిస్థారు. అంతేకాకుండా ఈ క్షేత్రాలలొని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలొ రాత్రి పూట బసచేసే అవకాశం కల్పిస్థారు. బుకింగులు మొదలైనాయి. వివరాలకోసం irctc సైటు చుడండి.
17, అక్టోబర్ 2018, బుధవారం
వీక్షిణులకు విజ్ఞప్తి
ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లాగును వీక్షిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు. రోజు రోజుకు పెరుగుతున్న వీక్షిణికుల సంఖ్య నాకు కొండత అండగా వుంది. దయచేసి మీరు మీ మీఅభిప్రాయాలను కామెంట్ రూపంలో వ్రాయగలరు. అది నాకు ఈ బ్లాగును ముందుకి తీసుకొని పోవటానికి సాయపడుతుంది. మీరు సహృదయంతో సూచనలను చేయ మనవి. ఈ బ్లాగ్ తెలుగు సాహిత్యలోకానిది మీరు దీనిలో భాగస్వాములు కండి.
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)