ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
30, జులై 2023, ఆదివారం
భార్యలు - భిన్న స్వభావాలు
*ॐ భార్యలు - భిన్న స్వభావాలు*
*కౌసల్యామాత సీతాదేవితో*
*అసత్యశీలా వికృతా*
*దుర్గ్రాహ్యహృదయాస్సదా I*
*యువత్యః పాపసంకల్పాః*
*క్షణమాత్రాద్విరాగిణః ৷৷*
*అయోధ్య 38/22*
దుష్టాలోచనలుగల యువతులు సర్వదా కపట వచనములను పలుకుతూ ఉంటారు.
కోపతాపాది వికారములకు లోనగుతూ ఉంటారు.
వారి మనస్సులలోగల భావాలు దుర్గ్రాహ్యాలు.
వారు చిన్నచిన్న సంఘటనలకే పతులపై అలుకవహించి, వారికి దూరమవుతూ ఉంటారు.
Evil-minded young ladies are infidels.
They are of perverted nature.
They are inscrutable.
In an instant they lose their love (for their husbands).
*న కులం న కృతం విద్యాం*
*న దత్తం నాపి సంగ్రహమ్ I*
*స్త్రీణాం గృహ్ణాతి హృదయమ్*
*అనిత్యహృదయా హి తాః ৷৷*
*38/23*
అట్టి స్త్రీలకు
- భర్తయొక్క అభిజాత్యము (గొప్ప వంశమున జన్మించడం) గానీ,
- అతడు చేసిన ఉపకారాలుగానీ,
- అతనియొక్క విద్యావైభవములుగానీ,
- అతడు తెచ్చిపెట్టిన వస్త్రాభరణాదులుగానీ,
- ప్రేమతో అతడు తనను చేపట్టిన రీతిగానీ జ్ఞాపకమునకే ఉండవు.
ఎందుకంటే వారి స్వభావములు చంచలములు. వారికి పతికంటే సంపదలే ముఖ్యము.
అంతేకాదు "స్థూణానిఖనన" న్యాయమున వారు పాతవిషయమలను త్రవ్వుతూ భర్తతో ఎల్లప్పుడును గిల్లికజ్జాలాడుతూ ఉంటారు.
Neither family traditions
nor benefits received,
nor education
nor affection
nor gifts
nor even accumulated wealth attract women's hearts.
Their minds are unstable indeed.
*సాధ్వీనాం హి స్థితానాం*
*తు శీలే సత్యే శ్రుతే శమే I*
*స్త్రీణాం పవిత్రం పరమం*
*పతిరేకో విశిష్యతే ৷৷*
*38/24*
సాధ్వీమణులరీతి దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
వారు తమ వంశమర్యాదలకు తగినట్లుగా ప్రవర్తిస్తారు.
గురువుల (పెద్దల) ఉపదేశాలను అనుసరించి నడుచుకొంటారు.
శాంత స్వభావం కలిగియుంటారు.
వారికి పతియే దైవము. వారి జీవితాలు పరమ పవిత్రాలు.
But for those virtuous women whose minds are fixed in
- chastity,
- truth,
- scriptures and
- stability,
the husband occupies a distinguished place and is considered supremely holy.
*స్థూణానిఖననన్యాయము*
గుంజని పాతేటప్పుడు చాలాసార్లు నేలని తవ్వుతూ, గుంజని(స్తంభాన్ని) అటూఇటూ కదులుస్తూంటారు.
పోట్లాడే స్వభావంగలవారు తాము మాట్లాడుచున్న విషయానికి సంబంధంలేకుండా పాతవిషయాలను పదేపదే త్రవ్వుతూ ఎదుటివారిని నొప్పిస్తూంటారు.
ఎంతకీ వారు తమ మొండివాదాన్ని వీడరు. ఇది దుష్టుల లక్షణం.
దీనినే "స్థూణానిఖనన న్యాయం" అంటారు.
=x=x=x=
— రామాయణం శర్మ
భద్రాచలం
మనస్సు మాత్రం ఈశ్వరునిపైనే ఉంటుంది
QUOTE OF THE DAY
🌷Practising the Presence of God🌷
July 30
No matter which way you turn a compass, its needle points to the north. So it is with the true yogi. Immersed he may be in many activities, but his mind is always on the Lord. His heart constantly sings: “My God, my God, most lovable of all!”
🌷– Sri Sri Paramahansa Yogananda “Sayings of Paramahansa Yogananda”
నేటి సూక్తి
🌷దైవసాన్నిధ్య అభ్యాసము🌷
July 30
దిక్సూచిని ఎటుపైపు తిప్పినా, దాని ముల్లు ఉత్తరంపైపే చూపుతుంది. నిజమైన యోగి కూడ అంతే. అతడు అనేకమైన కార్యక్రమాలలో నిమగ్నుడై ఉన్నా, అతడి మనస్సు మాత్రం ఈశ్వరునిపైనే ఉంటుంది. అతని హృదయం నిరంతరం గానం చేస్తూ ఉంటుంది: ”నా దైవమా, నా దైవమా, ప్రియాతి ప్రియతమా!”
🌷– శ్రీ శ్రీ పరమహంస యోగానంద, “Sayings of Paramahansa Yogananda”
అష్టదిక్పాలకులు
అష్టదిక్పాలకులు....వారి రాజ్యాలు..
1. తూర్పు- ఇంద్రుడు- పాలించే పట్టణం: అమరావతి..
2. ఆగ్నేయం - అగ్నిహోత్రుడు - తేజోవతి..
3. దక్షిణం - యమ ధర్మరాజు- సంయమని.
4. నైరుతి - నిరుతి - కృష్ణాంగన..
5. పడమర -వరుణుడు - శ్రద్ధావతి...
6.వాయువ్యము - వాయువు - గంధవతి.
7.ఉత్తరము - కుబేరుడు - అలకాపురి..
8. ఈశాన్యము - శివుడు - కైలాసము...
పిడకల వేట*
*పిడకల వేట*
బౌద్ధ గ్రంథాలలో మనకి ఉపనిషత్తులు లాగే వాళ్ళకి పీఠకాలు అని ప్రత్యేకంగా ధర్మసూత్రాలు ఉంటాయి. ఒక ప్రవచన కర్త రామాయణం చెప్తున్న సమయంలో మధ్యలో ఒక బౌద్ధ సన్యాసి పీఠకాలు ఏ కాండలో ఉన్నాయో కాస్త చూసి చెప్తారా? అని అడిగాడట. అప్పటి నుండి రామాయణంలో పీఠకాల వేట అనే నానుడి మొదలై, కాలక్రమేణా పీఠకాలు కాస్తా పిడకలు అని పలకడం అలవాటు అయిపోయింది.
అద్భుతమైన మందు
ప్రతి రోగము నకు మందు వున్నట్లే తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పుకు లేదా పాపానికి అద్భుతమైన మందు భగవాన్ స్మరణ యే.
సమస్త దుఃఖాలను పోగొట్టేది నారాయణ స్మరణయే .విష్ణు సహస్రనామం లో సంకీర్త నారాయన సబ్ధమాత్రం విముక్త
దుఃఖ సుఖినో భవంతు.
కలియుగము లో అనేక కోట్ల కోట్ల జన్మపాపములను పోగొట్టేది వొక్క నామస్మరణం మాత్రమే.
అందుకే కలియుగాన్ స్మరనే న ముక్తి అన్నారు.
అతి సులభ సాధ్యం. పైసా ఖర్చు లేనిది. ఏటువంటి పూజలతో పనిలేని అతి సులభంగా మోక్ష సాధన నామస్మరణం.
అందరూ ఆచరణలో వుంచి తరించాల్సింది గా ప్రార్థన..
ఓం నమఃశివాయ.





















