24, మే 2024, శుక్రవారం

Telugu


 

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, పేటియం లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

శనివారం*🍁 🌹 *మే 25, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

           🍁 *శనివారం*🍁

       🌹 *మే 25, 2024*🌹

       *దృగ్గణిత పంచాంగం*                

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంతఋతౌః* *వైశాఖమాసం - కృష్ణపక్షం*

*తిథి : విదియ* సా 06.58 వరకు ఉపరి *తదియ*

వారం :*శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం : జ్యేష్ఠ* ఉ 10.30 వరకు ఉపరి *మూల*

*యోగం  : సిద్ధ* ఉ 10.07 వరకు ఉపరి *సాధ్య*

*కరణం   : తైతుల* ఉ 07.14 గరజి సా 06.58 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 10.30 - 12.30 సా 04.30 - 06.00* 

అమృత కాలం :*రా 04.12 - 05.48 తె*

అభిజిత్ కాలం :*ప 11.38 - 12.30*

*వర్జ్యం : సా 06.36 - 08.12*

*దుర్ముహుర్తం : ఉ 05.35 - 07.19*

*రాహు కాలం : ఉ 08.50 - 10.26*

గుళిక కాలం :*ఉ 05.35 - 07.12*

యమ గండం :*మ 01.42 - 03.19*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి : *వృశ్చికం/ధనస్సు*

సూర్యోదయం :*ఉ 05.35* 

సూర్యాస్తమయం :*సా 06.34*

*ప్రయాణశూల  :‌ తూర్పు* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.35 - 08.11*

సంగవ కాలం :*08.11 - 10.46*

మధ్యాహ్న కాలం :*10.46 - 01.22*

అపరాహ్న కాలం :*మ 01.22 -03.58*

*ఆబ్ధికం తిధి:వైశాఖ బహుళ విదియ*

సాయంకాలం :*సా 03.58 - 06.34*

ప్రదోష కాలం :*సా 06.34 - 08.46*

నిశీధి కాలం :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

______________________________

          🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

*బుద్ధిర్బలం-యశోధైర్యం నిర్భయత్వమరోగతా ।*

*అజాడ్యం-వాఀక్పటుత్వం చ హనుమస్స్మరణాద్-భవేత్ ॥*


*జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః ।*

*రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః ॥*


*దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః ।*

*హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ॥*🍁🙏🍁🙏🍁🙏🍁🙏🍁


🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

Doctor to treat knee pain

 


జడ్చర్ల తరువాత కొత్తకోట అనే ప్లేస్ వస్తుంది... కొత్తకోట బస్టాండ్ near by రాములు..ఆయుర్వేదిక్ అని అడగండి మీకు అడ్రస్ చెబుతారు..హైదరాబాద్ నుండి nearly 120 to 130 km ఉంటుంది.. Bangalore హైవే లోనే ఉంటుంది ఈ ప్లేస్

Panchaag



రసధార పాటలూరి వేటూరి

 *రసధార పాటలూరి వేటూరి.* డా.వేదుల శ్రీరామ శర్మ 'శిరీష ' 9866050220

*భువన వేణువు గగనం గాలి యైన అక్షర దీప్తి,

సుమధురపాటలసుందర స్పూర్తి రామమూర్తి.

గంగమ్మ తలపులఝరి ఉప్పొంగే గోదావరి వేటూరి.

ఓంకారనాద సంధాన శంకర వేదగాన లహరి రసభావనల,

ఉచ్చ్వాస వాయులీన రాగవిరి.

మనోహర శిల్ప ఎడపదాల విఙ్ఞత, 

స్త్రీశక్తిఉత్తేజభావగాన వేటూరి.

*అభినవ శ్రీనాథ జీవనప్రబంధ 

అద్వితీయ మాధుర్య పాటవసిరి.

నిప్పుకన్ను నిద్రోయి నుదుటి బొట్టవడం, నెలవంక తలపాగా 

పట్టుదలరసరమ్యపట్టువేటూరి.

(మనోజ్ఞ కవనశిల్ప కవిశ్రేష్ట వేటూరి కి సహృదయ నీరాజనాలు..డా.శిరీష

వైశాఖ పురాణం - 16.

 వైశాఖ పురాణం - 16.


16వ అధ్యాయము - వైశాఖవ్రత మహిమ


నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుని మాటలను విని శ్రుతకీర్తి మహారాజు శ్రుతదేవమునీ! వైశాఖ ధర్మములు సులభములు అఖండ పుణ్యప్రదములు విష్ణుప్రీతికరములు ధర్మాధిధర్మార్థపురుషార్థ సాధకములు. ఇట్టియుత్తమ ధర్మములు శాశ్వతములు వేదనిరూపితములు కదా ఇట్టి యుత్తమధర్మములు లోకమున నెందుకని ప్రసిద్ధములు కాలేదు? రాజస, తామస ధర్మములు కష్టసాధ్యములు అధికధనసాధ్యములు అట్టి ధర్మములు లోకమున ప్రసిద్దములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు. కొందరు చాతుర్మాస్యముల నుత్తమములనియందురు. వ్యతీపాతాది ధర్మములను మరికొందరు ప్రసంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నానని యడిగెను.


శ్రుతదేవుడును మహారాజా! వైశాఖ ధర్మములెందుకని ప్రసిద్ధములు కాలేదో యితర ధర్మములకెందుకు ప్రసిద్ధి కలిగెనో వివరింతును వినుము. లోకములోని జనులు చాలమంది ఐహికభోగములను, పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజసతామసగుణప్రధానులు. ఇంతమందిలో నెవడో యొకడు యేదో యొక విధముగ స్వర్గము కావలయునని యజ్ఞాది క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాది క్రియలు కష్టసాన్నిధ్యములైనను స్వర్గవ్యామోహముతో వానినే అతికష్టముపై చేయగోరుచున్నాడు. కాని ఒకడును మోక్షమునకై ప్రయత్నించుటలేదు. చాలామంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధికకర్మలు చేయుచు కామ్యసాధనకై యత్నించుచున్నారు. కావున రాజసతామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణుప్రీతికరములగు సాత్త్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్త్వికకర్మలు నిష్కామకర్మలు కాని ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమునిచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులునగు మూఢులు యీ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నతపదవి సిద్దించినచో వాని మనోరధమ్ములన్నియు తీరినవనియనుకొనుచున్నారు. వ్యామోహనమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు. వృద్ధినందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును.


వైశాఖ ధర్మములు సాత్త్వికములు అవి నిగూఢములుగ యెవరికిని దెలియకయున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడనువాడు కలడు. అతడు నృగమహారాజు కుమారుడు ఇక్ష్వాకు వంశరాజులలో ఉత్తముడు. కీర్తిశాలి. అతడు యింద్రియములను జయించినవాడు. కోపము నెరుగనివాడు. బ్రహ్మజ్ఞాని. అతడొకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి యాశ్రమ ప్రాంతమును చేరెను.


అతడు వెళ్లిన కాలము వైశాఖమాసము. వశిష్టమహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడనిచ్చు చెట్టును, మరికొందరు దిగుడు బావులను, యేర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడలయందు కూర్చుండబెట్టి విసనకఱ్ఱలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను యిచ్చుచుండిరి. మధ్యహ్నకాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును యిచ్చుచుండిరి. చెట్లనీడలయందు, యింటి ముంగిళ్లయందు మండపములయందు యిసుకను పరచి కూర్చుండుటకు వీలుగచేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని జూచి యిదేమని ప్రశ్నించెను. వారును వైశాఖమాసమున చేయవలసిన ధర్మములివి. మానవులకు సర్వపురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్టులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేమీ పనులను గురువుల యాజ్ఞననుసరించి చేయుచున్నాము. మీకింకను వివరములు కావలసినచో మా గురువులనడుగుడని సమాధానమిచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్టుని యాశ్రమమునకు వెళ్లెను.


అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును జూచి వశిష్ఠ మహర్షి సాదరముగ రాజును వాని పరివారమును అతిధి సత్కారములతో నాదరించెను. రాజు మహాముని యిచ్చిన ఆతిధ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షీ! మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిధిసత్కారములు ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందులకు చేయుచున్నారని నేను వారి నడిగితిని. వారును మహారాజా! దీనిని వివరించునవకాశము లేదు. మా గురువుల యాజ్ఞననుసరించి శుభకరములగు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులనడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని. అతిధి సత్కారమును కోరు పరిస్థితిలోనుంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు ఆతిధి సత్కారములు విస్మియమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు. శ్రేష్ఠుడవు. సర్వధర్మములనెరిగినవాడవు. నేను మీకు శిష్యుడను దయయుంచి నాకీ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.


వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మజిజ్ఞాసకు వినయవిధేయతలకు సంతసించెను. రాజా! నీ బుద్ధికిగల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణుకధా ప్రసంగమునందు విష్ణుప్రీతికరములగు ధర్మములనెరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును. వినుము. వైశాఖమాస వ్రత ధర్మ విషయములను వినిన సర్వపాపములును నశించును. ఇతర ధర్మముల కంటె వైశాఖ ధర్మములు మిక్కిలి యుత్తమములు. వైశాఖమాసమున బహిస్నానము చేసినవారు శ్రీమహావిష్ణువునకు ప్రియమైనవారు అన్ని ధర్మముల నాచరించి స్నానదానార్చనములెన్ని చెసినను వైశాఖమాస ధర్మముల నాచరింపనిచో అట్టివారికి శ్రీహరి దూరముగ నుండును. వారు శ్రీహరికి ప్రియులుకారని భావము. వైశాఖమాసమున స్నానదానములు, పూజాదికములు మానినవారెంత గొప్ప కులమున జన్మించిననువారు కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మకలవారని యెరుగుము. వైసాఖమాస వ్రత ధర్మముల నాచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికల నిచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాధుడునగు శ్రీమహావిష్ణువు సర్వపాపముల నశింపజేయువాడు సుమా! వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనములచేతను శ్రీహరి సంతసింపడు. భక్తి పూర్వకముగ నారాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్పపూజకైనను స్వల్పకర్మకైనను సంతసించును. భక్తిలేని కర్మయెంత పెద్దదైనను అతడు సంతసించును సుమా. అధికకర్మకు అధికఫలము, స్వల్పకర్మకు స్వల్పఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తియధికమైనచో స్వల్పకర్మకైనను అధికఫలమునిచ్చును. భక్తిలేని కర్మయే అధికమినను ఫలితముండదు. కర్మమార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా! వైశాఖమాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయప్రయాసలు చేయబడినను భక్తిపూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషమును కలిగించును కావున రాజా! నీవును వైశాఖమాస ధర్మములను యెక్కువ తక్కువలనాలోచింపక భక్తిపూర్ణముగ నాచరింపుము. నీ దేశప్రజలచేతను చేయింపుము. వారికిని శుభము కలుగును. వైశాఖధర్మములనాచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగ శిక్షింపుము అని వశిష్ఠమహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖమాసవ్రత ధర్మములు వానియంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను.


ఆ రాజు వశిష్ఠమహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీ వాద్యమునుంచి దానిని మ్రోగించి భటులచే గ్రామ గ్రామమున ప్రజలారా వినుడు. ఎనిమిది సంవత్సరముల వయసు దాటిన వారు యెనుబది సంవత్సరముల లోపువారు ప్రాతఃకాలమున స్నానము చేసి వైశాఖమాసమున వైశాఖమాసవ్రత ధర్మము నాచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును. లేదా దేశమునుండి బహిస్కరింతునని చాటించెను. వైశాఖవ్రతము నాచరింపని వారు తండ్రియైనను, పుత్రుడైనను, భార్యయైనను, ఆత్మబంధువైనను తీవ్రదండన కర్హులేయనియు ప్రకటించెను. వైశాఖమున ప్రాతఃకాలస్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యధాశక్తిగ దానము చేయవలయును. చలివెంద్రములు మున్నగు వాని నేర్పాటు చేయవలయును అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలిసికొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖవ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై అయిదు గ్రామముల కోక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున పది మంది అశ్వికులనుంచెను. ఈ విధముగ నా మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖమాస వ్రతము సుస్థిరమయ్యెను. ఈ రాజు ప్రారంభించిన నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యెను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు, బాలురు, పురుషులు అందరును యిహలోక సుఖములనందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖమాసమున ఏ కారణముచే ప్రాతఃకాలస్నానము చేసినను పాపవిముక్తులై శ్రీహరి లోకమును చేరుచుండిరి.


ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరును వైశాఖ మహత్మ్యమున శ్రీహరి లోకమునకు పోవుటచే యమ ధర్మరాజ్యమునకు(నరకమునకు) పోవువారెవరును లేకపోయిరి. ప్రతిప్రాణియు లోగడ చేసిన పాపములన్నిటిని చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగ చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుత కొట్టివేయుట జరిగి అతడూరకనుండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసినవారైనను వైశాఖస్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నియు వచ్చు వారు లేక శూన్యములై యుండెను. అంతే కాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాదుల నెవరును చేయక వైశాఖమాస వ్రతములను ధర్మముల నాచరించుచుండుటచే వారును విష్ణులోకమును చేరుటచే స్వర్గలోకములును శూన్యములై యుండెను. ఈ విధముగ యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము వచ్చువారెవరును లేక శూన్యములై యుండెను.


వైశాఖ పురాణం 16వ అధ్యాయం సమాప్తం.

⚜ శ్రీ వెంకటరమణ దేవాలయం

 🕉 మన గుడి : నెం 327


⚜ కర్నాటక  :-కార్‌స్ట్రీట్ - మెంగళూరు


⚜ శ్రీ వెంకటరమణ దేవాలయం 



💠 శ్రీ వెంకటరమణ దేవాలయం మంగళూరులోని కార్-స్ట్రీట్‌లో ఉంది.

ఈ ఆలయం శ్రీ మధ్వాచార్య (శ్రీమద్ ఆనంద తీర్థ)చే ప్రకటించబడిన మాధ్వ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తుంది



🔆 చరిత్ర


💠 శ్రీ వెంకట్రమణ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. ఈ ప్రదేశంలో వైశ్యులు ప్రధాన నివాసులు మరియు పోర్చుగీసు వారు ఈ ప్రదేశాన్ని ఆక్రమించినప్పుడు, వైశ్యులు దక్షిణం వైపు వెళ్ళవలసి వచ్చింది. ఇలా చాలా మంది మంగళూరులో స్థిరపడ్డారు. 

శ్రీ వెంకట్రమణ ఈ ప్రాంతపు వైశ్యుల ప్రధాన దేవుడు మరియు ఆలయాన్ని వారి సంఘం సభ్యులు నిర్మించారు.


💠 ఒక మూలం ప్రకారం 1804 లో, ఒక పరిధీయ సన్యాసి మంగళూరును సందర్శించారు. కార్‌ స్ట్రీట్‌లో తాత్కాలిక ఆశ్రయం కల్పించి, తాను పూజించే వీర వెంకటేశుని అందమైన బొమ్మను ఉంచి, ప్రజల అర్పణలతో జీవించేవాడు. 

అతను సాహుకర్ మ్హాల్ పాయ్ యొక్క దుకాణంలో విగ్రహాన్ని (బట్టతో కప్పి) ఉంచాడు, అతను త్వరలో తిరిగి వస్తానని మరియు అతను కొద్ది రోజుల్లో తిరిగి రాకపోతే గుడ్డ  తెరవాలని అన్నాడు.

లోపల ఏముందో తెలియక, ఈ ప్యాకెట్ నుండి పొగలు ఎగసిపడే వరకు ఎవరూ దాని గురించి బాధపడలేదు. గుడ్డ తీసివేసినప్పుడు లోపల వేంకటరమణ భగవంతుని అందమైన చిత్రం కనిపించింది.


💠 ఈ విగ్రహాన్ని శ్రీ కాశీ మఠంలోని శ్రీమద్ విభుదేంద్ర తీర్థ స్వామీజీ వద్దకు తీసుకువెళ్లారు, వారు అందమైన చిత్రాన్ని మెచ్చుకున్నారు మరియు మంగళూరులోని శ్రీ వెంకటరమణ ఆలయంలో దాని ప్రతిష్టాపనకు ఆమోదం తెలిపారు, సమాజంలోని నలుగురు ప్రముఖ పురోహితులు మూడు రోజుల పాటు నిరంతరంగా పూర్వ ప్రతిష్ఠాపనను నిర్వహించి, ప్రతిష్టించారని చెబుతారు.


💠 గర్భ గృహ స్థలంలో శ్రీ వీర వెంకటేశ స్వామి, శ్రీ వీర విట్టల, ఉత్సవ శ్రీ శ్రీనివాస,

శ్రీ మూల వెంకటరమణ , శ్రీ గోపాలకృష్ణ , శ్రీ హయగ్రీవ  మరియు శ్రీ నాగదేవర విగ్రహాలు ఉన్నాయి.


💠.పంచలోహ విగ్రహం విజయనగర వాస్తుశిల్పం. పీఠంతో సహా దాని ఎత్తు దాదాపు 2 అడుగులు. విగ్రహం దాని కుడి నడుముకి కటారి (కత్తి) జోడించబడింది.

 అందుకే భగవంతుని బిరుదుకు 'వీర' అనే పేరు ఉపసర్గ పెట్టబడింది.


💠 పురాణాల ప్రకారం, విజయనగర సామ్రాజ్యం యొక్క చక్రవర్తులు ఏదైనా యుద్ధంలో పాల్గొనే ముందు ఈ విగ్రహానికి తమ ప్రార్థనలు చేశారు. అన్ని వైష్ణవ దేవతలతో సమానంగా ఈ విగ్రహం నుదుటిపైన ముకుట కిరీటాన్ని కలిగి ఉంటుంది, వివాహ సమయంలో వరుడు ధరించే బాసింగ ఉంటుంది.

భగవంతుడు శ్రీ పద్మావతి దేవితో తన వివాహం వైపు కవాతు చేస్తున్నాడని మరియు అతని నడుముపై కటారి తన మార్గానికి ఆటంకం కలిగించే దుష్ట & రాక్షస మూలకాలను పారద్రోలేందుకు ఉద్దేశించబడ్డాడని ఇది సూచిస్తుంది. 


💠 భగవంతుని రెండు చెవులకు మకర కుండల మరియు చెవికి పైన రత్నం వంటి పుష్పం ఉంటాయి. , ఈ విగ్రహం విజయనగర కాలానికి చెందినదని రుజువు చేస్తుంది. 

ఇది మెడపై లాకెట్టుతో చిన్న నెక్లెస్ & దండ కూడా ఉంది.

విగ్రహం భుజాలపై స్కంద మాల కూడా ఉంటుంది. ఈ విగ్రహం కుడిచేతి పైభాగంలో చక్రముతోనూ, ఎడమవైపు పైభాగంలో శంఖంతోనూ అలంకరించబడి ఉంటుంది. 

దిగువ కుడి చేతిలో వరద ముద్ర పాదాల వైపు క్రిందికి చూపుతుంది మరియు దిగువ ఎడమ చేతిని నడుము క్రింద ఉంచబడుతుంది. భగవంతుని సేవలో ఉన్న భక్తులు సంసారం అనే భయంకరమైన సముద్రంలో మునిగిపోరని ఇది సూచిస్తుంది. ఈ విధంగా విగ్రహం పైన పేర్కొన్న అన్ని లక్షణాలతో ప్రకాశిస్తుంది.

అందుకే, వీర వెంకటేశ భగవానుడు ఇప్పటివరకు తన ప్రకాశవంతమైన అనుగ్రహంతో భక్తులందరినీ పోషిస్తున్నాడు.


💠 ప్రధాన దేవత పక్కన శ్రీదేవి మరియు భూదేవి వంటి ఇతర దేవతలు ఉన్నారు. ఈ దేవతలు పంచలోహముతో చేయబడినవి - అంటే, విగ్రహాల తయారీకి ఐదు లోహాలు ఉపయోగించబడ్డాయి. భగవంతుడు వెంకట్రమణ తన కుడి చేతిలో చక్రాన్ని మరియు ఎడమ చేతిలో శంఖాన్ని కలిగి ఉన్నాడు. 

దేవత శ్రీదేవి శ్రేయస్సు మరియు సంపదకు ప్రతీక మరియు భూదేవి పవిత్రత, ప్రకృతి మరియు విజయానికి స్వరూపిణి.


💠 ఈ ఆలయం  మంగళూరు నగరం నడిబొడ్డున ఉంది. సిటీ బస్సులు మరియు ఆటో రిక్షాలు అందుబాటులో ఉన్నందున ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు.

అపర శంకరులు

 అపర శంకరులు ఆ పరమాచార్యులు !



మే 24 చంద్రశేఖరేంద్ర స్వామి జయంతి

నడిచే దైవంగా జగత్‌ ప్రసిద్ధులైన ఆధ్యాత్మిక గురువు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. ఆదిశంకరాచార్యులు స్థాపించిన కంచి పీఠానికి 87 సంవత్సరాల పాటు పీఠాధిపత్య బాధ్యతలు వహించిన మహనీయులు. అపర శంకరులుగా పూజలందుకున్న ప్రేమస్వరూపులు. 1894 వైశాఖ బహుళ పాడ్యమి నాడు తమిళనాట విల్లిపురంలో జన్మించిన చంద్రశేఖరేంద్రుల అసలు పేరు స్వామినాథన్‌. పదమూడేళ్లకే కంచి పీఠాధిపతి అయిన కారణజన్ములు వారు.

నడిచే దేవుడు: ఆదిశంకరాచార్యుల మార్గాన్నే అనుసరిస్తూ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కాలినడకనే దేశమంతా పర్యటించి తమ అనుగ్రహాన్ని వర్షింపజేశారు. ‘ఇలా నడవటం వల్ల నా ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలనూ కలుసుకోగలుగుతున్నాను. ఇంతకంటే కావల్సింది ఏముంది?’ అనేవారు. అందుకే భక్తులంతా ‘నడిచే దేవుడు’ అనేవారు ఆరాధనాభావంతో.

అప్పుడే లక్ష్మీకటాక్షం: ‘లోకంలో ఎందరో దుఃఖితులూ, దారిద్య్రం అనుభవిస్తున్న వారూ ఉన్నారు. కనీస అవసరాలైనా తీరని అలాంటివారిని చూస్తూ కూడా, మనం వృథాగా డబ్బు ఖర్చుచేయటం.. పాపంతో సమానం. దీనుల వేదనను కొంతైనా తగ్గిస్తే, మన సంపదకు సార్థకత లభిస్తుంది. సంపద ఉన్నంతలో సరిపోదు. అది పరోపకారానికి ఉపయోగపడుతోందా? అని ఆలోచించాలి. అలా సంపద సద్వినియోగం అయ్యే కొద్దీ లక్ష్మీకటాక్షం సమృద్ధిగా లభిస్తుంది’ అనేవారు పరమాచార్యులు.

దోషాలు ఎంచకూడదు: ఇతరుల్లో దోషాల్ని వెతికేవారు ఎన్నటికీ ఆధ్యాత్మికంగా పురోగమించలేరని చెప్పేవారు చంద్రశేఖరేంద్రులు. ‘ఈశ్వరుడు పాలసంద్రంలో పుట్టిన కాలకూట విషాన్నీ, చంద్రుణ్ణీ స్వీకరించాడు. చంద్రుని శిరస్సున ధరించి, విషాన్ని పైకి రానీయక కంఠంలోనే దాచుకున్నాడు. అలాగే ఉత్తములు పరుల సుగుణాలను అందరి ముందూ శ్లాఘిస్తూ, దోషాలను తమ మనసులోనే దాచుకుంటారు’ అన్నారు కంచి పరమాచార్యులు.

భగవద్భక్తితోనే దేశప్రగతి: భక్తిని మించిన పారమార్థిక పురోగమనం మరేదీ లేదనేవారు చంద్రశేఖరేంద్ర స్వామి. ‘మనకు కావలసింది సర్వరుగ్మతల నివారిణి అయిన భక్తే! ఈశ్వరభక్తి- అతడి బిడ్డలైన సకల జీవుల మీద ప్రేమగా పరిణమిస్తుంది. అప్పుడు సేవాభావం తప్ప మరి దేనికీ చోటుండదు. ఆ దయాగుణంతోనే సార్థకత. ఆ అన్నపూర్ణాదేవి ప్రేమస్వరూపమైన జ్ఞానాన్ని భిక్షగా వేయాలని ప్రార్థిద్దాం. ఆనాడు ఆదిశంకరాచార్యులు ఆ దేవిని అర్థించింది ఇలాంటి జ్ఞానాన్నే!’ అన్నారు పరమాచార్యులు.

మన పతాకానికి మహాస్వామి నిర్వచనం: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా చంద్రశేఖరేంద్ర స్వామి కంచిపీఠంలో ప్రసంగిస్తూ ‘మన జాతీయ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులున్నాయి. కాషాయరంగు సౌభాగ్యాలనిచ్చే మహాలక్ష్మిది. తెలుపు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే సరస్వతీదేవిది. ముదురుపచ్చ మనల్ని రక్షించే పరాశక్తి రూపమైన దుర్గాదేవిది. దేవీశక్తుల ప్రతీకలే మూడు చారలుగా కనబడటం విశేషం. అపార ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి కావలసిన శక్తిని ప్రసాదించాల్సిందిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి. సముపార్జించుకున్న స్వాతంత్య్రాన్ని భగవదనుగ్రహంతోనే కాపాడుకోగలం. పరమాత్మ కృపతోనే సమస్త మానవాళీ ఆనందమయమైన జీవితాన్ని గడపగలదు’ అన్నారు.

రమణమహర్షిపై పూజ్యభావం వ్యక్తం చేసేవారు కంచి పరమాచార్యులు. వారి భక్తుల్లో ఒకరి పుత్రుడికి మతి భ్రమించింది. అప్పుడు చంద్రశేఖరేంద్ర ‘ఇతన్ని రమణుల సన్నిధిలో పది రోజులు ఉంచండి. అంతా సర్దుకుంటుంది’ అన్నారు. ఆ రమణుడి వద్దకు వెళ్లిన యువకుడు ‘నన్నందరూ పిచ్చివాడు అంటున్నారు’ అని విన్నవించుకున్నాడు. రమణులు కరుణతో ‘అలాగా! నన్ను కూడా ఒకప్పుడు పిచ్చివాడనే అన్నారు. నువ్వు నాకు తోడు ఉన్నావన్న మాట! చాలా సంతోషం’ అన్నారు. అలా మహర్షి సన్నిధిలో పదిరోజులున్న అతడికి స్వస్థత చేకూరింది.

చంద్రశేఖరేంద్ర సరస్వతి 1994 జనవరి 8న, తమ 99వ ఏట భౌతికంగా ఈ లోకాన్ని విడిచినా, ఆధ్యాత్మిక గురువుగా చిరస్థాయిగా నిలిచిపోయారు.

Digital Medicine for Heart

 


Digital Medicine for Heart

(Heart can be recycled without cardiac transplant)


Ultra modern English medicine without knife and blood.


*1) No angiogram *


2) No bypass surgery


3) No angioplasty or stent


Two super modern machines have been discovered

1)CT-700

2)EECP


1) The most modern machine called CT-700 has been discovered to detect heart blockage without angiogram..


Two minutes is enough for this.

No need to stay in hospital for this


This cost is also less

This is done in two places only in Chennai.


Early heart blockage detection in early stages

There is a great chance of healing through pills..


And that now

2) Heart can be cured and recycled without bypass surgery and stent through the sophisticated machine called EECP.


Government approved medical system


To know the truth

* Sri Vivekananda Hospital *

Chennai

08925015666

08778463371

09500037040

04443192129


DR.G. Vivekanandan in Doctors Conference Interview

This is the news published


Millions of diabetes and heart patients benefited from this.


Share this to everyone you know without any block.


*One share can save lives of many heart patients , PLEASE  DO SHARE MAXIMUM *

Thank you 🙏🙏🙏