14, ఏప్రిల్ 2025, సోమవారం

జంటపదములు

 *" జంటపదములు "*


ఏతావాతా, దానాదీనా, తాడోపేడో, వాడివేడి, రాతకోతలు, గిల్లికజ్జాలు, గంపగుత్తగా, ఒళ్ళూపై, తిమ్మిని బమ్మిని, తాడూ బొంగరం, వావివరస, కన్నీరుమున్నీరు, ఆదరాబాదరా, కరాకండీ [కరాఖండీ], కన్నూమిన్నూ, ఉబ్బితబ్బిబ్బు, తత్తరబిత్తర, యిలాంటి జోడీలు జాడీలకొద్దీ ఉన్నాయి మనకి. అయితే అవి యిలా ఎందుకు జతలు కట్టాయో చెప్పగలిగితే సంతోషం. కొన్నింటి అర్థాలూ తెలియవుగా మరి!


రెండు అదే పదాలు వస్తే ఆమ్రేడితం అంటారు, రెండు సంబంధం ఉన్న లేక లేని పదాలూ జంటగా వాడతారు. రెండూ అర్థం కలిగినవి వాడతారు, ఒకొక సారి ధ్వనికోసం వాడతారు, నొక్కి చెప్పడానికి వాడతారు. 


1. ఏతావాతా = ఏతావత్ అనేది సంస్కృతం శబ్దం = So much, so far ఏతావదుక్త్వా అని రామాయణంలోనూ భారతంలోనూ చాల సార్లు వస్తుంది. 'ఇంతవరకు చెప్పి' - అని అర్థం. ఇది గోదావరిజిల్లా వాడుకలో ఏతావాతా అయింది. ఇంతకూ - అని అర్థం, ఏతావాతా చెప్పొచ్చేదేమంటే = ఇంతకూ చెప్పవచ్చేదేమంటే. 


2. దానాదీనా = దాన్నీ దీన్ని = అదీ ఇది = మొత్తము మీఁద = on the whole, దానా దీనా పదిలక్షలు ఖర్చు అయింది. 


3. తాడోపేడో తేల్చు = అటో యిటో పరిష్కరించు, either this or that "ఈ వ్యవహారం ఈ రోజు తాడోపేడో తేల్చుకొని కాని ఇక్కడినుండి కదలను."


4. రాతకోతలు, వ్రాఁతకోతలు – Writing the sale deed (రాత) after the final hard bargain and the final cut (కోత) in the price. 


5. తిమ్మినిబమ్మినిచేయు = క్రిందిది మీదికి - మీదిది క్రిందికి చేయు వ్యవహారములో దక్షత చూపు. ఇక్కడ తిమ్మి అంటే తిమ్మడు (కోతి) బమ్మి అంటే బ్రహ్మ లేదా బమ్మి (బ్రాహ్మడు). "మొత్తానికి తిమ్మిని బమ్మిచేసి మా వాడికి ఉద్యోగం ఇప్పించాను."


6. వావీ వరుసా = వావి అంటే బంధుత్వము relation, వరుస అంటే "ఆ అమ్మాయి నాకు వరుసకు మరదలు ఔతుంది" distant but equivalent relationship. సుందరకాండలో మైనాకుడు హనుమను నీకు పినతండ్రిని అంటాడు. అది వరుస కలపడం. 


7. అమీతుమీ = నేనా నువ్వా, బెంగాలీ పదాలు, ఈ రోజు అమీతుమీ తేల్చుకుందాం.


8. తత్తర బిత్తర = కంగారు; తత్తర పడడం = అంటే తొట్రు పడడం, కంగారు పడడం, బిత్తర పోవడం = అంటే ఆశ్చర్య పడడం, తెల్లబోవడం, మానసిక స్థితిని వర్ణించడానికి రెండూ కలిపి వాడతాం.


9. కన్నీరు, మున్నీరు = సముద్రం, కన్నీరు మున్నీరుగా విలపించడం అంటే దుఃఖ సముద్రంలో పడుటకు చిహ్నం.


10. ఆదరాబాదరా = తగినంత ఆలోచన, వ్యవధి లేకుండా; హడావుడిగా hurry burry, ఆవార్తవిని ఆదరాబాదరాగా బయలుదేరి వచ్చాము. ఆదరా బాదరాగా = కంగారుగా, ఉన్న పళంగా,అద్ధంతరంగా, బాదర బందీలు ఉండగానే.


జంట పదాలను లెక్కించడం సాధ్యం కాదు.  

కొన్ని ఇక్కడ ఇస్తున్నాను. వీటి వివరణలకు ఒక సిద్ధాంత వ్యాసం కావాలి.


ఒక్క కూలీ నాలీ చూదాం:  

"కూలి" తెలిసిన పదమే. విశేషణం (కూలిపని), నామవాచకము (నీకెంత కూలి కావాలి?) మన సాఫ్టువేరు ఇంజనీర్లను - techno కూలీలుగా వర్ణించాడు ఒక IAS గారు. South Africa గాంధీ గారిని కూలీ బారిస్టరు అనేవారు. నాలి విశేషణమే కుత్సితము, కుచ్చితము, (ఉదా - నాలి ముచ్చు) hypocrite, hook or crook కూలో నాలో చేసుకు బ్రతుకు అంటే live - by hook or crook


మచ్చుకు మరికొన్ని:-


అన్నెం పున్నెం, అండ దండ, అందం చందం, అడపా తడపా, అలుపూ సొలుపూ, అభం శుభం, అదురు బెదురు (నదురు బెదురు), అవాకులు చెవాకులు, అణా కానీ, అప్పో సొప్పో, అల్లా టప్పా, అతుకు బొతుకు, ఇరుగు పొరుగు, ఊరూ వాడా, ఎండా కొండా, ఒళ్ళూ పై, కలొ గంజో, కల్ల బొల్లి, కరాఖండీ, కఱ్ఱా బుఱ్ఱా, కన్నూ మిన్నూ, కాసర బీసర, కిందా మీదా, కూలీ నాలీ, కూరా నారా, చదువూ చట్టుబండా, చిన్నా చితకా, పిల్లా జెల్లా, చెట్టూ చేమా, చెత్తా చెదారం, చెదురు మదురు, చిన్నా చితకా, చిన్నం చిదరా, చిందర వందర, గంపగుత్తం, గొడ్డూ గోదా, బీదా బిక్కీ, తలాతోకా, వంపు సొంపు, తట్టా బుట్టా, తీరూ తెన్నూ, మొక్కా మోడూ, నెత్తీ నోరూ, నోరూ వాయీ, వంటా వార్పూ, వెనకా ముందూ, వింతా విడ్డూరం, వింత విశేషం, గందర గోళం, గిన్నీ గిట్రా, డబ్బు దస్కం, నగా నట్రా, పొలం పుట్రా, పెట్టీ బేడా, పిల్లా పీచూ, పెట్టూపోతా, పెళ్ళీ పెటాకులు, పుట్టు పూర్వోత్తరాలు, రసాభాస, రాయీ రప్పా, గిల్లి కజ్జా, సింగినాదం జీలకఱ్ఱ, వంకర టింకర, పుణ్యం పురుషార్థం, లెక్కా పత్రం, ముద్దూ ముచ్చట, మాటామంతీ, రానూపోనూ, అదీయిదీ ..... 


ఇలా ఇంకా ఎన్ని ఉన్నాయో!!! మరో భాషలోనికి యథా తథంగా అనువదించలేనివి ఇవి.  

తెలుగు సోయగం ఇది.


(డాక్టర్ చెల్లూరి కృష్ణమూర్తి గారి సౌజన్యంతో....) 

       - ఎలక్ట్రాన్


రచన లోగిలి నుండి

నేనొక నిరంతర ప్రవాహిని...!

 నేనొక నిరంతర ప్రవాహిని...!!


నేనొక నిరంతర ప్రవాహిని 

నీటి ఊటలా జన్మించి తరించా 

ఈ నేలపై దిమ్మరిలా తిరుగుతూ 

సజీవ గీతాన్ని ఆలపిస్తున్నాను...


వాగుల్ని వంకల్ని కలుపుకుంటూ 

నా ఆకారం పెద్దదిగా చేసుకుంటూ 

నా బలాన్ని బలగాన్ని పెంచుకుంటూ 

నేలపై నా నడకలు కొనసాగిస్తున్నాను..


ఆకుపచ్చ అందాలను సృష్టించి 

పంటచేల మధ్య పరవశిస్తూ 

రైతన్న బ్రతుకులకు రాగాన్ని 

అనంత రాశులకు వర్తమాన గీతాన్ని...


గత చరిత్రకు ఆనవాళ్లుగా 

భవిష్యత్ తరాలకు సంస్కృతిగా 

నన్ను నేను రూపాంతరం చెందుతూ 

విరామ మెరుగక ప్రవహిస్తున్నాను..


నా స్వేచ్ఛ నాకే సొంతం 

నన్ను బంధిస్తేనే ప్రళయం 

పూజిస్తే పుణ్యఫల ప్రదాయినినీ 

మీ ఇంట సిరులు సమకూర్చే సంపదను..


కొండల గట్టులతో చెలిమి చేస్తూ 

జలపాతపు సొంపుల సోయగంతో కదులుతూ 

మృదంగ నాదంలా దూకుతూ 

సరిగమలై సరసరా కదలి పోతాను..


నా ఊపిరిని మీ ఎదపై వీణలా వినిపిస్తూ 

పచ్చని అనురాగాల గాలులను స్పర్శిస్తూ 

అనుభూతుల మాధుర్యాన్ని పంచుతూ 

ప్రకృతిలో మమేకమై కొనసాగుతాను..


మట్టి భాషలో మాట్లాడుతూ 

అమ్మలా అనురాగాలు పంచుతూ 

పల్లెల్లో కబుర్లు చెప్పుకుంటూ 

అనంత ఆనందాన్ని సమకూర్చుకుంటా...


నా దారి సముద్ర గమ్యం వరకు 

విముక్తి గీతాన్ని ఆలపిస్తూ 

ముక్తికై వడివడిగా అడుగులు వేస్తూ 

అమృత ధారలను పంచి నేలను విడుస్తాను..


కానీ నా పుట్టుకకు దారులు మళ్లిస్తూ

అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తూ 

నన్ను నన్నుగా తిరగనీయకుండా

కబంధ హస్తాల్లో బంధిస్తున్నారు...


నా ప్రవాహం నేడొక ప్రశ్నార్థకం? 

నాలో విషాన్ని చేర్చి క్షీణింప చేస్తూ 

నా కడుపు నిండా కాలుష్యాన్ని నింపుతూ 

నా ప్రాణాలను చిన్నగా హరిస్తున్నాడు ఈ మనిషి...


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

పంచాయతన మూర్తయేనమః

 *కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన మూర్తయేనమః*

         కనీసం *11₹* పంపి దేవాలయాభివృధ్ధిలో పాలుపంచుకోండి.11₹ అంటే మరీ తక్కువ అనే ఆలోచన తో ఎక్కువ పంపాలని వాయిదా వేయడం కన్నా 11₹ పంపడం ఉత్తమం,కావాలంటే తరువాత పరిస్థితి బాగున్నప్పుడు మరింత విరాళం ఇవ్వవచ్చు అని కూడా ఒకసారి ఆలోచించండి.

 రాజమహేంద్రవరం రూరల్ కాతేరు శివారు సీతారామ అగ్రహారం లో ప్రతిష్ఠించబడిన మన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి పూర్వపు అభీష్ట గణపతి ఆలయంతో స్లాబ్ కలపకపోవడం వలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం క్రుంగుతోంది. ఆర్థిక వనరులు సరిపడకపోవడంతో పునాది మాత్రమే కలిపి నిర్మాణం పూర్తిచేసి ప్రతిష్ఠా మహోత్సవం పూర్తి గావించాము. కానీ ఇప్పుడు స్లాబ్ భాగం కూడా సాధ్యమైనంత త్వరలోనే కలిపి రెండు ఆలయాలకు శిఖర నిర్మాణాలు చేయడానికి సంకల్పం చేసాము. తద్వారా దేవాలయం పటిష్ఠమై వర్ధిల్లగలదు. దయచేసి భక్తులు యధాశక్తి ఆర్థిక సహాయం చేయగలరని ఆకాంక్షించడమైనది.

*ఈ నిర్మాణం కొరకై ప్రతీ భక్తుడు కనీసం 11₹ పంపి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని పిలుపునిచ్చుచున్నాము.*

ఈ దేవాలయంలో నిత్యాభిషేకాద్యర్చనలతో బాటుగా *ప్రతీ పున్నమికి గోమయపు ప్రమిదలలో "సంధ్యాదీపోత్సవం",ప్రతీ సంకష్టహర చతుర్థి నాడు "పల్లకి సేవ" ,ప్రతీ మాస శివరాత్రికి "మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం" నిర్వహించబడుచున్నాయి.* ఇవియేకాక నిత్య వేదపారాయణం మరియు అనేక వైదిక క్రతువులు కూడా నిర్వహించబడుతున్నాయి. 

ప్రతి ఒక్కరూ కూడా ఒక్క *11₹* చొప్పున పంపి ఈ మహాకార్యంలో భాగస్వామ్యం తీసుకుని మన దేవాలయ అభివృద్ధి కి సహకరించగలరని ఆకాంక్షిస్తున్నాము.

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

*ABHEESTA GANAPATHI ALAYA TRUST*

మా గూగుల్ పే/ఫోన్ పే/UPI and WhatsApp number 9492050200 on the name of K.Srinivasa Sarma, FPCA of the trust.


*A/C No: 011712010001038*

*IFSC : UBIN0801178* 

*Devi Chowk Branch, Rajamahendravaram*.

దయచేసి విరాళాలు పంపిన వారు UPIరసీదు సాఫ్ట్ కాపీని మాకు వాట్సాప్ చేయగలరు.

Panchaag


 

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: నాల్గవ అధ్యాయం

జ్ఞానయోగం: శ్రీ భగవానువాచ


కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః 

అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః (17)


కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః 

స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ (18)


కర్మ అంటే ఏమిటో, శాస్త్రాలు నిషేధించిన వికర్మ అంటే ఏమిటో, ఏపనీ చేయకపోవడమనే అకర్మ అంటే ఏమిటో తెలుసుకోవడం అవసరం. కర్మతత్వాన్ని గ్రహించడం కష్టసాధ్యం. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చూసేవాడు మానవులలో బుద్ధిమంతుడు; యోగి; సమస్తకర్మలూ ఆచరించేవాడు

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

                    

                      𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


       *య: ప్రీణయే త్సు చరితై: పితరం స పుత్రో*

       *య ద్భర్తురేవ హిత మిచ్ఛతి త త్కళత్రమ్ |*

       *త న్మిత్ర మాపది సుఖే చ సమక్రియం య* 

       *దేత త్రయం జగతి పుణ్యకృతో లభంతే ॥*


𝕝𝕝 *తా* 𝕝𝕝  *ఎవడైతే తన సత్ప్రవర్తనతో తండ్రిని సంతోషపెడతాడో అతడే పుత్రుడు. తన భర్త హితాన్ని సదా కాంక్షించేదే భార్య. ఆపదలయందు, సుఖముల యందు సమానంగా వ్యవహరించేవాడే మిత్రుడు. ఈ మూడూను లోకంలో పుణ్యాత్ములకే లభిస్తాయి.*


 ✍️💐🌺🌹🙏

16-10-గీతా మకరందము

 16-10-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః |  

వెూహాద్గృహీత్వాఽసద్గ్రాహాన్ ప్రవర్తన్తేఽశుచివ్రతాః ||


తాత్పర్యము:- (ఆసురీసంపదగల)వారు తనివితీరని కామమునాశ్రయించి, డంబము, అభిమానము, మదము గలవారలై, అవివేకము వలన చెడుపట్టుదలల నాశ్రయించి, అపవిత్రములగు వ్రతములు (నీచవృత్తులు) గలవారై ప్రవర్తించుచున్నారు.


వ్యాఖ్య:- “దుష్పూరమ్” - ఎంత అనుభవించినను తనివితీరనిదియగుటచే కామము దుష్పూరమని చెప్పబడినది. అనగా నింపశక్యముకానిది. "దుష్పూరేణ అనలేన చ" అని ఇదివఱలో 3వ అధ్యాయమున దీనిని గుఱించి  ప్రస్తావించబడెను. ఇట్టి  దుష్పూరమగు కామమును ఆశ్రయించినందువలన వారు అసఫలమనోరథులై తత్ఫలితముగ అశాంతికిలోనై యుందురు.


“దమ్భమానమదాన్వితాః” - దంభ, అభిమాన, మదములలో ఏ ఒక్కటి యున్నను జీవునకు వినాశమేకలుగుచుండ ఇక మూడును కలిగియున్నవారి విషయము వేఱుగచెప్ప వలయునా? వారేల ఈ ప్రకారముగ దుష్టాచరణశీలురై యుందురు? "మోహాత్” - అవివేకమువలన, అజ్ఞానమను ‘కైపు'లో వారు చేయరాని పనులన్నిటిని చేయుదురనియు, గ్రహించదగనివానినన్నిటిని గ్రహించుదురనియు భావము.


"అశుచివ్రతాః” - వారు నింద్యములై, అపవిత్రములైనట్టి మద్యసేవన, మాంసభక్షణాదివ్రతములను గలిగియుందురు. అనగా ప్రతిరోజు ఆ యా కార్యములను చేయవలెనను పట్టుదలగలిగియుందురు. వ్రతము, పట్టుదల యనునవి మంచివే అయినను అవి ఉత్తమ పదార్థములకు, పవిత్రకార్యములకు సంబంధించినవియగునపుడే సత్ఫలముల నొసంగ గల్గును. కావున వానిమార్గమును త్రిప్పవలెను.

శుచివ్రతములనే ఆచరించవలెనుగాని అశుచివ్రతములను గాదు. సద్గ్రహణమే గల్గియుండవలెనుగాని అసద్గ్రహణముకాదు.


ప్రశ్న:- కామ మెట్టిది?

ఉత్తరము:- పూరింప శక్యముకానిది (దుష్పూరమ్).

ప్రశ్న:- ఆసురీసంపదగలవారి మఱికొన్ని లక్షణములను జెప్పుము?

ఉత్తరము:- వారు (1) అంతులేని కామమును ఆశ్రయించుదురు (2) డంబము, అభిమానము, మదము గల్గియుందురు (3) అవివేకము గల్గియుందురు (4) చెడ్డపట్టుదలలు (నీచప్రవృత్తులు), అపవిత్రవ్రతములు శీలించుదురు.

తిరుమల సర్వస్వం -208*

 *తిరుమల సర్వస్వం -208*

 *మాధవుడు చేసే మానవ సేవ -5*

 *వేద విద్యాబోధన* 


 వేదాలంటే పుక్కిటి పురాణాలు కాదు. విజ్ఞాన నిక్షేపాలు. వేలసంవత్సరాల క్రితం హైందవజాతి ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన కరదీపికలు. నేడు మానవజాతిని పట్టిపీడిస్తున్న అనేక సామాజిక, శారీరక, మానసిక ఋగ్మతలకు తరచి చూస్తే మన వేదాలలో సత్వరమైన, ఖచ్చితమైన, సులభసాధ్యమైన పరిష్కారమార్గాలు కానవస్తాయనేది కాదనలేని సత్యం. కానీ, పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్న చందంగా, వేదాలను ఉపేక్షించి, పాశ్చాత్య పోకడలను అనుసరించడం వల్ల ఇప్పటికే మనమెంతగానో కోల్పోయాం.


 ఈ నేపథ్యంలో మహత్తరమైన వేదసంస్కృతి వ్యాప్తికి తి.తి.దే. అవిరళ కృషి సలుపుతోంది. దానిని వివరించే ముందు, ఏ వేదంలో ఏం చెప్పబడిందో క్లుప్తంగా తెలుసుకుంటే, వేదాల పట్ల ఆసక్తి, అనురక్తి పెరుగుతాయి.


 *ఋగ్వేదం* ఐదు శాఖల సమాహార మైనప్పటికీ, ప్రస్తుతం 'శాకల' అనబడే ఒక శాఖ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దీనిలో.... *మానవుని సామాజిక నడవడి (సోషల్ బిహేవియర్), రోగ చికిత్సా పద్ధతులు, కృత్రిమ అవయవాల అమరిక (ఆర్టిఫిషియల్ లింబ్స్), సూక్ష్మ శస్త్రచికిత్స (మైక్రో సర్జరీ), వర్షాలకోసం చేపట్టవలసిన పద్ధతులు, మొదలైనవి చెప్పబడ్డాయి.* 


 *యజుర్వేదం* లో ప్రాణహింస కూడదని, బలులు నిషిద్దమని చెప్పబడింది. యాగాలు చేసే పద్ధతులు కూడా పేర్కొనబడ్డాయి.


 *సామవేదం* లో కళలు, సంగీతం, వాద్యపరికరాలు, సాహిత్యం మొదలగు వాటిని వివరించడంతో పాటుగా; సృష్టి సమస్తం శూన్యం నుండి ఉద్భవించి, శూన్యం లోనే ఐక్యమై పోతుందని ప్రతిపాదించబడింది. ఈనాటి బ్లాక్ హోల్ సిద్ధాంతానికి సామవేదం లోని సూత్రీకరణలే ప్రాతిపదికలని కొందరు అభిప్రాయ పడతారు.


 *ఆథర్వణ వేదం* లో ఆత్మలు, ప్రేతాత్మలు, యుద్ధవిద్యలు, విషశాస్త్రం, శతృసైనికులను క్రిమికీటకాలతో హతమార్చటం (బయో వార్) వంటి విషయాలపై విస్తృతమైన సమాచారం ఉంది. ఇంతే కాకుండా, జ్వరం, అతిసారం, అతిమూత్రం, వాతం, పిత్తం, శ్లేష్మం, విషజ్వరం, క్షయ, బొల్లి, కుష్టు వ్యాధులకు; తేలుకాటు, పాముకాటుకు; సుఖప్రసవానికి, సంతానలేమికి; శిరస్సు, ముక్కు, చెవి, కంఠానికి (నేటి ఇ.ఎన్.టి) వచ్చే వ్యాధులకు ఔషధాలు, ఉపశమనాలు చెప్పబడ్డాయి.


 *వేదపాఠశాల* 


 తిరుమల ప్రధానాలయం నుండి దాదాపు ఐదారు మైళ్ళ దూరాన ఉన్న *'ధర్మగిరి'* అనే ప్రదేశంలో, తి.తి.దే. వారి ఆధ్వర్యంలో, తిరుపతి లోని వేదవిశ్వవిద్యాలయానికి అనుబంధంగా, ఓ సువిశాలమైన ప్రాంగణంలో *'వేదపాఠశాల'* నడుపబడుతోంది. 


 1884వ సంవత్సరంలో ఒక చిన్న కుటీరంలో ప్రారంభింపబడ్డ ఈ పాఠశాల, దినదిన ప్రవర్థమానమవుతూ, నేడున్న ప్రాంగణంలోకి మారింది. వాహనమార్గం ద్వారా ప్రయాణించి, శిలాతోరణం ఉద్యానవన సముదాయాన్ని దాటిన తరువాత, ప్రకృతిశోభతో ఉట్టిపడుతున్న ప్రశాంత వాతావరణంలో నెలకొన్న ఈ పాఠశాలను చేరుకోవచ్చు. పచ్చని పరిసరాలతో మమేకమై సాంప్రదాయ వేషభాషలతోనున్న చిన్నారులు వేదాలను వీనులవిందుగా వల్లె వేస్తున్న దృశ్యం నయనానందకరంగా, కర్ణపేయంగా గోచరిస్తుంది. వీరందరూ పంచెకట్టుతో, నుదుటిపై నామాలతో, శిరస్సుపై శిఖతో అభినవ బృహస్పతుల వలె తేజరిల్లు తుంటారు.


 సనాతన కాలం నుంచి, ప్రపంచం నలుమూలల లోని కోట్లాది ప్రజలు అవలంబిస్తున్న హైందవమత మనుగడకు మూలం 'వేదం'.


 చతుర్వేదాలు శేషాచల సానువుల్లో బండశిలలుగా అవతరించాయని అన్నమాచార్యుల వారు తన కీర్తనలో పేర్కొన్నట్లుగా ఇంతకుముందే చెప్పుకున్నాం. 


 నాలుగు వేదాలే ఆనందనిలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులుగా అవతరించాయని కూడా పురాణాలలో చెప్పబడింది. ఎందరెందరో కవులు, గాయకులు, మహాభక్తులు శ్రీవేంకటేశ్వరుణ్ణి వేదపురుషునిగా అభివర్ణించారు. అంతటి మహత్తరమైన, ఘనచరిత్ర గల వేదాలను పరిరక్షించడంలో తి.తి.దే. తనవంతు పాత్రను అద్వితీయంగా పోషిస్తోంది. అందులో భాగంగా ఆసక్తి, అర్హత గల బాలురకు అతి చిన్నవయసు నుండే వేద విద్యాభ్యాసం గావించడం ఈ పాఠశాల ప్రధానోద్దేశ్యం.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*346 వ రోజు*


*కర్ణ సహదేవుల పోరు*


కర్ణుడు సహదేవునితో తలపడ్డాడు. సహదేవుడు కర్ణుని తొమ్మిది బాణములతో కొట్టాడు. కర్ణుడు సహదేవుని నూరు బాణములతో మర్మస్థానములలో కొట్టి సహదేవుని ధనస్సును ముక్కలు చేసాడు. సహదేవుడు మరొక విల్లందుకున్నాడు. కర్ణుడు సహదేవుని సారథిని, రథాశ్వములను చంపాడు. సహదేవుడు కత్తి డాలు తీసుకున్నాడు. కర్ణుడు వాటిని ముక్కలు చేసాడు. సహదేవుడు కర్ణుని మీద గదాయుధాన్ని విసిరాడు. కర్ణుడు ఆ గదను మధ్యలోనే తుంచాడు. సహదేవుడు కర్ణుని మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసాడు. ఇక చేసేది లేక సహదేవుడు రథచక్రాన్ని కర్ణుని మీద వేసాడు. కర్ణుడు దానిని కూడా తన బాణ్ములతో ముక్కలు చేసాడు. కర్ణునితో యుద్ధం చేయలేక సహదేవుడు అక్కడ నుండి తప్పుకుంటున తరుణంలో కర్ణుడు అతడిని వెంబడించి పట్టుకుని చంపబోయి కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి చంపకుండా వదిలి హేళనగా " సహదేవా! నీ బలం ఎదుటి వాని బలం తెలుసుకుని యుద్ధం చెయ్యి. నీ కన్నా బలవంతులతో యుద్ధం చెయ్యడం అవివేకమని తెరులుసుకో పో " అని పంపాడు. సహదేవుడు అవమానభారంతో కుమిలి పోతూ అక్కడ నుండి వేరొక రథము ఎక్కి వెళ్ళాడు.


*శల్యవిరాటుల యుద్ధం*


శల్యుడు విరాటునితో యుద్ధం చేస్తూ విరాటుని అశ్వములను చంపాడు. శల్యుని మీద విరాటుడు శరములు గుప్పించాడు. విరాటుని తమ్ముడు శతానీకుడు అన్నకు సాయంగా వచ్చి విరాటుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. శల్యుడు వాడి అయిన బాణమును ప్రయోగించి శతానీకుని సంహరించాడు. తమ్ముని మరణం విరాటునిలో భయం కలిగించినా పైకి ధైర్యంగా ఉండి శల్యుని ఎదుర్కొన్నాడు. శల్యుడు పదునైన బాణమును ప్రయోగించి విరాటుని మూర్చిల్లేలా కొట్టాడు. విరాటుని రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు. విరాటుని సేనలు శల్యుని ధాటికి ఆగ లేక పక్కకు తొలిగాయి. అది చూసి అర్జునుడు ఆ సైన్యములను ఆపి శల్యునితో తలపడ్డాడు. అలంబసుడిని ఎదుర్కొన్న అర్జునుడు అతడి విల్లు కేతనమును విరిచి, హయములను చంపాడు. అలంబసుడు ఒక కత్తి తీసుకుని అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు ఆ కత్తిని విరిచి నాలుగు భయంకరమైన బాణములతో ఆ రాక్షసుని కొట్టాడు. అర్జునుడి ధాటికి ఆగ లేక అలంబసుడు పారి పోయాడు. నకులుడి కుమారుడు శతానీకుడు సుయోధనుడి తమ్ముడైన చిత్రసేనుడిని ఎదుర్కొని చిత్రసేనుడి కవచమును చీల్చి, కేతనము విరిచి, విల్లు విరిచాడు. చిత్రసేనుడు వేరొక విల్లందుకుని శతానీకుని మీద బాణ ప్రయోగం చేసాడు. శతానీకుడు చిత్రసేనుడి రథాశ్వములను, సారథిని చంపాడు. చిత్రసేనుడు శతానీకుని ఇరవై అయిదు బాణములతో శరీరం తూట్లు పడేలా కొట్టాడు. శతానీకుడు ఒకే బాణంతో చిత్రసేనుడి విల్లు విరిచి రథమును విరిచాడు. చిత్రసేనుడు రథము నుండి దూకి పక్కనే ఉన్న హార్దిక్యుడి రథము ఎక్కి పారిపోయాడు. ద్రుపదుడు కర్ణుని కుమారుడైన వృషసేనుని ఎదుర్కొన్నాడు. ద్రుపదుని మీద వృషసేనుడు పైచేయిగా ఉన్నాడు. ద్రుపదుని నిస్సహాయత చూసి పాంచాల సేనలు వృషసేనుడితో తలపడ్డాయి. కాని వృషసేనుడితో తలపడ లేక పారి పోయారు. దుశ్శాసనుడు ధర్మజుని కుమారుడైన ప్రతి వింధ్యుని ఎదుర్కొని అతడి ధ్వజమును, విల్లును విరిచి, సారథిని, హయములను చంపాడు. ప్రతివింధ్యుని సోదరులు అతడికి సాయంగా వచ్చి పోరుతున్నారు. భీముని కుమారుడైన శ్రుతసేనుడు ప్రతి వింధ్యుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. ప్రతివింధ్యుడు మరొక విల్లందుకుని దుశ్శాసనుడితో తలపడ్డాడు.  

*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కీర్తనలు/భజనలు/పాటలు సంబంధ 55 పుస్తకాలు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*కీర్తనలు/భజనలు/పాటలు  సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

సంకీర్తన లక్షణము-1 www.freegurukul.org/g/Keerthanalu-1


సంకీర్తన మీమాంస www.freegurukul.org/g/Keerthanalu-2


ఆంధ్రుల కీర్తన వాంగ్మయ కళాసేవ www.freegurukul.org/g/Keerthanalu-3


నాచన సోమన అన్నమయ్య www.freegurukul.org/g/Keerthanalu-4


సంకీర్తనల్లో తిరుమల శ్రీనివాసుని ప్రశంస-ఒక పరిశీలన www.freegurukul.org/g/Keerthanalu-5


అమృతసారము www.freegurukul.org/g/Keerthanalu-6


అన్నమయ్య విన్నపాలు www.freegurukul.org/g/Keerthanalu-7


నిత్యపారాయణ పాశురాలు www.freegurukul.org/g/Keerthanalu-8


మంగళాశాసన పాశురములు www.freegurukul.org/g/Keerthanalu-9


చిత్రముల తిరుప్పావై www.freegurukul.org/g/Keerthanalu-10


తిరుప్పావై www.freegurukul.org/g/Keerthanalu-11


విడిచిన విరిదండ -తెలుగు తిరుప్పావు www.freegurukul.org/g/Keerthanalu-12


గోదా గీత మాలిక www.freegurukul.org/g/Keerthanalu-13


అన్నమాచార్య సంకీర్తనామృతము-1,2 www.freegurukul.org/g/Keerthanalu-14


అన్నమయ్య కీర్తనలు www.freegurukul.org/g/Keerthanalu-15


భావయామి వేంకటేశం - 1,2,3,4,5,6 www.freegurukul.org/g/Keerthanalu-16


హరి నీమయమే అంతాను - 1,2,3,4 www.freegurukul.org/g/Keerthanalu-17


హరి సేవకే వేంకటేశ మకుటం - 1,2 www.freegurukul.org/g/Keerthanalu-18


హరి యేమనెనో అలిగెనో - 1,2,3,4 www.freegurukul.org/g/Keerthanalu-19


ముకుందమాల www.freegurukul.org/g/Keerthanalu-20


అమృత రామాయణం www.freegurukul.org/g/Keerthanalu-21


అన్నమాచార్యులు అమృతవర్షిణి www.freegurukul.org/g/Keerthanalu-22


కృష్ణ దాసి -మధుర భక్తి గేయములు www.freegurukul.org/g/Keerthanalu-23


తెలుగు తమిళ లాలిపాటలు www.freegurukul.org/g/Keerthanalu-24


స్త్రీల నవీన మంగళ హారతులు www.freegurukul.org/g/Keerthanalu-25


మంగళ హారతులు www.freegurukul.org/g/Keerthanalu-26


పల్నాటి సీమలో కోలాటం www.freegurukul.org/g/Keerthanalu-27


కోలాటము పాటలు ఇతర భజనలు www.freegurukul.org/g/Keerthanalu-28


పిల్లన గ్రోవి పిలుపులు www.freegurukul.org/g/Keerthanalu-29


హంసధ్వని -లలిత గీతాలు www.freegurukul.org/g/Keerthanalu-30


పెళ్లి పాటలు-1 www.freegurukul.org/g/Keerthanalu-31


శ్రవణానంద మంగళహారతులు www.freegurukul.org/g/Keerthanalu-32


స్త్రీ ల వేడుక పాటలు www.freegurukul.org/g/Keerthanalu-33


సర్వదేవతా భజనలు www.freegurukul.org/g/Keerthanalu-34


108 దివ్య దేశప్పాసుర క్కుటిప్పు www.freegurukul.org/g/Keerthanalu-35


అన్నమయ్య సంకీర్తనా స్రవంతి www.freegurukul.org/g/Keerthanalu-36


అన్నమాచార్య సంకీర్తనములు-1000 www.freegurukul.org/g/Keerthanalu-37


అన్నమాచార్యులవారి అధ్యాత్మ శృంగార సంకీర్తనలు-1,2,3 www.freegurukul.org/g/Keerthanalu-38


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు-10 www.freegurukul.org/g/Keerthanalu-39


అధ్యాత్మ సంకీర్తనలు-1,2,3,4,5,7,9,10 www.freegurukul.org/g/Keerthanalu-40


అభినవ శ్రీ కృష్ణ లీలలు www.freegurukul.org/g/Keerthanalu-41


ఆనంద మంగళం - మధుర భక్తి గీతములు www.freegurukul.org/g/Keerthanalu-42


ఎంకి పాటలు www.freegurukul.org/g/Keerthanalu-43


కాలజ్ఞాన తత్వములు www.freegurukul.org/g/Keerthanalu-44


కృష్ణ తాండవము గోపికా లాస్యము www.freegurukul.org/g/Keerthanalu-45


కృష్ణ లీలలు www.freegurukul.org/g/Keerthanalu-46


కృష్ణ లీలా తరంగిణి www.freegurukul.org/g/Keerthanalu-47


గీత గోవిందము-ఆంధ్రష్టపది www.freegurukul.org/g/Keerthanalu-48


చూతపురీ విలాసము www.freegurukul.org/g/Keerthanalu-49


తాళ్ళపాక అన్నమయ్య పాటలు www.freegurukul.org/g/Keerthanalu-50


తెలుగు మీరా www.freegurukul.org/g/Keerthanalu-51


త్యాగరాజ కీర్తన హారము www.freegurukul.org/g/Keerthanalu-52


త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు www.freegurukul.org/g/Keerthanalu-53


త్యాగరాజ హృదయము www.freegurukul.org/g/Keerthanalu-54


త్యాగరాజ కీర్తనలు-3 www.freegurukul.org/g/Keerthanalu-55



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀