29, ఏప్రిల్ 2025, మంగళవారం

తాము శ్రమమ్ము నందియు వదాన్యత మేలునుఁ జేయఁ జూతు రా

ఉ॥

తాము శ్రమమ్ము నందియు వదాన్యత మేలునుఁ జేయఁ జూతు రా 

కామిత కార్యదక్షులు నకారణ వత్సలపూర్ణచిత్తులై 

ప్రేముడి నీడనిచ్చి పెనువేసవిఁ బండ్ల నొసంగు వృక్షముల్ 

భూమిని నిల్చునట్లు సురభూజములౌగద! యుత్తముల్ మహిన్ 

*~శ్రీశర్మద*

తెలుగు భాషావిర్భావము

 🙏తెలుగు భాషావిర్భావము-వాఙ్మయ వికాసము🙏

             మొదటి భాగము 

తెలుగు మాట్లాడేవారు వారిని తెలుగు వారు అని అంటారు తెలుగుకు పాత రూపాలు తెనుంగు తెలింగా, తెనుగు అనునవి.

తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు.

శాసనాలను పరిశీలించిన అచ్చులలో అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఎ,ఒ అను నెనిమిది మాత్రమే గానవచ్చును.'ఐ'కి బదులు అయి 'ఔ'కు బదులు అవు, అగు అనునవి వాడబడుచుండెను. శకము 898 నాటి, అనుమల శాసనములో 'ఐన' అని ఐ వాడబడెను. 'ఔ'అక్షరము యొక్క ఉపయోగము కనిపించదు. హల్లులలో వర్గాక్షరములందల్ప ప్రాణములు, అనునాసికములగు ఙ,ఞా,ణ,న,మ,లు విశేషముగ గానవచ్చును. య,ర,ల,వ,శ,,స,హ,ళ.వర్ణములు వాడుకయందుండెను. కాగా అందుశకట రేఫము ఒకటి.ఇది ఇప్పటివరకు వాడబడుచున్నను ప్రస్తుతము దాని ఉపయోగము తగ్గిపోవు చున్నది.సుమారు క్రీస్తు పదవశతాబ్ది అంతము వఱకు అనగా నన్నయ భట్టారకుడు గ్రాంథికభాషను శాసించువఱకు శాసనములందు 'ఱ'అనురూపమున వ్రాయబడు అక్షరముండెడిది.ఇది బండి 'ఱ' లోని అడ్డుగీటును తొలగించి వ్రాసినట్లు శాసనములందు కనుపించును. దీనిని గూర్చి కీర్తిశేషులు జయంతి రామయ్య పంతులుగారు,వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, మల్లంపల్లి సోమశేఖర శర్మగారు మున్నగు పలువురు పరిశోధనలు జరిపి అది మనకిప్పుడు వాడుకలో లేని వేరొక అక్షరమని నిర్దారణము గావించిరి. అదిక్రమముగా కొన్నిచోట్ల 'డ'గాను,కొన్ని చోట్ల 'ళ'గాను,మరికొన్ని చోట్ల 'ద' గాను మార్పునొంది అదృశ్యమైనట్లు చెప్పిరి.ఈ సందర్భమున వారి అభిప్రాయ భేదములెట్లు న్నను ఈయక్షరమొకటి పూర్వము తెలుగు భాషలో గలదని నిశ్చయముగా శాసనములనుబట్టి తెలియుచున్నది.అది 'చోఱ' 'పదములలో(ఱలో లోపలి గీత తొలగించగా మిగిలిన అక్షరము దాన్ని డ్జ గా పలికే వారు ఈ వ్యాసములో ఎక్కడ ఱ వ్రాసినను బండి ర గా పలక కూడదు డ్జ గా పలకాలి పూర్తి సంయుక్తము గా కాకుండా కొంచెం తేలికగా పలకాలి ఈ విషయం మరచిపోవద్దు ) 'చోఱ ( చోడ్జ గా పలకాలి కన్నడిగుల వల్లనే డ్జ అని పలకాలని ఉచ్చారణ తెలిసింది ఈ అక్షరం కన్నడం లో ఎక్కువ కాలము ఉంది.) అనే పదం చోడ' లేక 'చోళ' అనియు;'నోఱంబ' పదములో 'నోళంబ' అనియు,ఱెందలూరు అనుచోట దెందులూరు గాను, క్టిన్ద అనునది క్రిన్ద(క్రింద) గాను 'ఱ' క్ఱొచె'అనుపదము 'క్రొచ్చె';వ్ర్ ​కన్నడములోకూడ చాల కాలముముండినట్లు నిఘంటువు లందిదిగల పదములనేకములు చేర్చబడి యుండుట వలన తెలియుచున్నది. తమిళమునందిది 'వాళైప్పళం'(=అరటిపండు) వంటి పదము లలో వాడబడుచున్నదని కొందరు భావించారు.తెలుగు శాసనములలో చొఱ అని వ్రాయ బడిన కాలమునకు చెందిన పుణ్యకుమారుని చోళకేరళానామధిపతిః' అని 'ళ' కారము వ్రాయబడింది. కనుక 'ఱ' ( బండి ర కాదు డ్జ) అనేది తెలుగు భాషకి చెందిన అక్షరమే; సంస్కృత ములో 'ళ'గనో 'డ'గనో మారుచుండెడిది.

 అయినా కూడా, క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు అని చరిత్రకారులు పేర్కొన్నారు . పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2,400 సంవత్సరాలనాటిది అని తెలుస్తోంది

                          సశేషం .

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

28, ఏప్రిల్ 2025, సోమవారం

తంత్ర శాస్త్రం వివరణ

 తంత్ర శాస్త్రం వివరణ - చిట్టి తంత్రాలు - 2. 


. మునపటి పోస్ట్ నందు మంత్రం, యంత్రం, తంత్రం గురించి వివరించాను. ఇప్పుడు మీకు తంత్రంలోని బేదాల గురించి వివరిస్తాను. వీటిలో ముఖ్యమైనవి 7 రకాలు. అవి. 


•. సజీవ తంత్రాలు. - 


. జీవము గల పదార్ధాలు, జీవ రాశులతో చేయు తంత్రాలు. 


•. ఔషదీ తంత్రాలు. = 


. వనమూలికలు, దివ్య ఔషధులతో చేయబడినవి. 


•. గర్భిత తంత్రాలు. -. 


. భూమిలో నుండు వస్తువులతో ఆచరింబడునవి. 


•. మంత్రమయ తంత్రాలు. - 


. కొన్ని మంత్రాల కలయిక కలిగి ఉండునవి.  


•. యంత్రిక తంత్రాలు. -. 


. కొన్ని యంత్రాలతో పెనవేసుకొని ఉన్నవి. 


°. మిశ్రమ తంత్రాలు. -. 


. అనేక విధాలైన ప్రక్రియలతో సంభంధం కలిగినవి. 


°. స్వతంత్ర తంత్రాలు. -. 


. మంత్ర, యంత్రాలతో గాని, ఔషదాలతో గాని, జీవ పదర్దాల తో గాని ఏ విధమైన సంభంధం లేకుండా అతిసారమైన ప్రక్రియలతో కూడి ఉండునవి.  


. ఇవేకాక వాక్ తంత్రాలు, ఉచిత తంత్రాలు, ఆశా తంత్రాలు, కుతంత్రాలు అనేవి కూడా ఉన్నాయి. వీటిని యుద్ధముల యందు, ప్రజా విప్లవముల యందు పూర్వీకులు ప్రయోగించి ఉన్నారు.  


. ఇప్పుడు ఈ తంత్రాలలో కొన్ని ముఖ్యమైన వాటిని మీకు తెలియచేస్తాను. 


•. నాలుగు చిన్న మేకులు తీసుకొని నృసింహ మంత్రాన్ని చెప్తూ మీ సింహ ద్వారానికి ఇరుప్రక్కలా దించండి. ఎలాంటి దుష్టత్మాలు మీ ఇంట్లో ప్రవేశించవు.  


•. ఇంట్లో వచ్చే ముందు ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవవద్దు. 


•. ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడే వారు భైరవుని పేరు మీద కొంచం మద్యాన్ని తీసుకొని భైరవాష్టాకం చదివి తాగేవారికి ఇవ్వండి. 


•. తాంబూలం లో కొద్దిగా జాజికాయ కలిపి వేసుకోవడం ద్వారా ముఖములో చక్కని వర్చస్సు పొందగలరు. 


•. కొన్ని తెల్ల ఆవాలు తీసుకొని భైరవ మంత్రం చదువుతూ మీ ఇంటికి ఎనిమిది ప్రక్కలా చల్లండి. భైరవుడు మీకు రక్షణగా ఉంటాడు.  


•. శుక్రవారం రాహు కాలంలో రెండు రొట్టెలు వాటిలో కొద్దిగా బెల్లం కలిపి ఆవుకి తినిపించండి. రాహు గ్రహ దోషాల నుండి విముక్తి కలుగును. 


•. గణపతి ప్రీతి కొరకు మీకు వీలైనప్పుడల్లా పిల్లలకు తీపి పదార్ధాలు పంచండి. 


 •. బ్యాంకు నందు డబ్బు వేసే ముందు లక్ష్మి మంత్రాన్ని జపించండి. 


•. డబ్బుని పొదుపు చేయడం భరణి నక్షత్రంలో మొదలుపెట్టండి. 


•. ఆర్ధికముగా అర్ధం కానీ పరిస్థితి ఏర్పడినప్పుడు నిత్యం సుందరాకాండ పారాయణం చేయండి. 


•. చిన్నపిల్లలు రాత్రిపూట 

దడుచుకుంటున్నచో తలగడ వైపు ఒక నిమ్మకాయ ఉంచండి.  


•. ఇంటిలో పెద్దవారు ఆకాల మరణం చెందుతుంటే సర్పశాపముగా భావించి తగు పరిహారాలు చేయించండి. 


•. తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే. కుజ గ్రహ సంబంధ పూజలు చేయించుకోండి. 


•. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురైనా శని గ్రహ పూజలు చేయించుకోవాలి.  


. ఇలా కొన్ని వందల తాంత్రిక సంబంధ చిట్కాలు ఉంటాయి. కొన్నింటిని మాత్రమే మీకు వివరించాను.  


. సమాప్తం.  


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 

  

 గమనిక -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            

. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   

. ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                

. ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      

. ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

             

. కాళహస్తి వేంకటేశ్వరరావు  

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                    

. 9885030034

Vaisakha Puranam -- 1

 Vaisakha Puranam -- 1


వైశాఖ పురాణం - 1.


1వ అధ్యాయము - వైశాఖమాస ప్రశంస


నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |

దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||


సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవులాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.


నారదుడును రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది. విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.


అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను,అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింపజేయుచుందురు.


వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము.

మూడు విషయాలు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏       🏵️జీవితంలో మూడు విషయాలు గుర్తు పెట్టుకోవాలి.. నీ మీద నమ్మకం లేని వారికి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు.. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు.. నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వారి కోసం ఆసలు బాధ పడనవసరం లేదు🏵️విలువ లేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది.. ప్రాణం లేని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు బోదించినా ఒక్కటే..నిజాలు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటారు.. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పే వారి మాయలో ఈజీగా పడిపోతారు.. నిజాన్ని తెలుసుకునే లోపు  మంచిగా మాట్లాడే నా అనుకునే వాళ్ళని దూరం చేసుకుంటావు🏵️నీకు తప్పు అనిపించేది ప్రతిదీ తప్పు కాదు.. అలాగే ఒప్పు అనిపించేది ఒప్పు కాదు.. ఆది కేవలం నువ్వు చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది.. జీవితం శాశ్వతం కాదు.. డబ్బు శాశ్వతం కాదు.. శాశ్వతంగా నిలిచేది ఒక్కటే.. మన మంచితనం.. ప్రేమగా ఒక పలకరింపు🏵️🏵️మీ *అల్లంరాజు భాస్కరరావుశ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్ D .N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారికి రాలేను వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9182075510* 🙏🙏🙏

అమృతాన్ని ఆరగించాలి

 Sreenivasa Murthy Chittamuri:

అమృతాన్ని ఆరగించాలి

అన్నం పరబ్రహ్మ స్వరూపం' అనే మాట భారతీయులందరికీ తెలిసినదే.


'అన్నాద్భవన్తి భూతాని...' అని ప్రాణికోటి ఉత్పత్తికి ఆధారం అన్నమని తెలిపారు. తిన్న అన్నంలో అత్యంత స్థూలభాగం మాలిన్యంగా వెలికి వస్తుందనీ, సూక్ష్మ సూక్ష్మాంశాలు క్రమంగా ప్రాణశక్తిగా, తేజస్సుగా, మనస్సుగా మారుతాయని ఉపనిషద్వచనం. అందుకే అన్న విషయంలో అనేక నియమాలను ఏర్పరచారు మన పూర్వీకులు, మన అలసత్వంతో, చాపల్యంతో వాటిని 'చాదస్తాల'ని కొట్టేసి - నియమరహిత ఆహారాన్ని సేవించి బుద్ధినీ, శరీరాన్ని కాలుష్యపరచుకుంటున్నాం.


అన్న వ్యాపారం పెరిగి - వీథికో 'శీఘ్రహారకేంద్రాలు' వెలిశాయి. జిహ్వచాపల్యంతో మనుషులు వాటి ముందు బారులు, గుంపులు కడుతున్నారు. ఇంటిలో వండుకొనే అవకాశం లేని దరిద్రులు, లేదా పనిపై ప్రయాణంలో భాగంగా క్రొత్త ఊరికి చేరుకున్నవారు కడుపు నింపుకొనడానికై వాటిని స్వీకరించడం ఫరవాలేదు. గతిలేని పరిస్థితులవి.


కానీ ఉన్న ఊళ్లో, వండుకొనే అవకాశం ఉన్న గృహిణులు కూడా ఇంటిల్లిపాదితో కలసి హెూటళ్లకి పోయేలా ప్రేరేపించి 'ఎంగిలి - అంట్ల' నియమాల్లేని కూడు కోసం కక్కుర్తిగా మందవిందులకు ఎగబడడం శోచనీయమే. పెళ్ళిళ్ళలో ఆప్యాయంగా వండి వడ్డించడాలు పోయి, 'బఫే' పేర్లతో అనాచార, అనారోగ్య ఆహారాన్ని విందుల పేర్లతో ఆరగించడం బాధాకరం.


మన గృహస్థ సంప్రదాయం ప్రకారం శుచిగా అన్నాన్ని వండి భగవంతునికి నివేదించి, అతిథులకు వీలైనంత పెట్టి తాము తినడం పవిత్రం.... అని భావిస్తాం.


'యజ్ఞ శిష్టాశినః అమృతభుజః' అని శాస్త్రవచనం. “యజ్ఞము చేయగా మిగిలినది అమృతం. దానిని అరగించాలి". పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా మార్చడం వలన, భగవత్ప్రసన్నతాశక్తి మనలో ప్రసరిస్తుంది. తద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, మంచి సంతానం కలుగుతాయి.


ఆచార సంపన్నుల గృహాలలో అంట్లు ఎంగిళ్లు... అనే నియమాలుండేవి. సంస్కృతి, నాగరికత ఉన్నచోట్ల నియమాలు, నిబంధనలు పెరుగుతాయి. ఎంతో నాగరికతని సాధించిన దేశం కనుక - ఈ దేశంలో ఆహార నియమాలు బాగా ఉన్నాయి. వైజ్ఞానికంగా ఆలోచించినా - ఇంటి వంట ఒంటికి మంచిదని ఋజువవుతున్నదే. మంది భోజనాలు ప్రమాదకరమే. కేవలం బ్రతకడం కోసం కడుపులో కూడు పడేసుకోవడం పశుప్రవృత్తి. అంతేకాదు... ఇళ్లల్లో కూడా అంట్ల-ఎంగిలి నియమాలు వదులుకుంటున్నారు. కాస్త నాలికపై క్షణకాలం నిలిచే రుచికోసం ఉదరాన్ని హింసించి మానసిక శారీరక రోగాలకు బలవుతున్న దుఃస్థితులు నేడు కనిపిస్తున్నాయి.


చక్కగా స్నానం చేసి, తడిపి ఆరవేసిన పొడిబట్టను కట్టుకుని, శుభ్రపరచిన పొయ్యిపై భగవత్ స్మరణంతో వంట వండి, దేవుని దగ్గర దీపం వెలిగించి, ఆ అన్నాన్ని నివేదించితే అది అమృతమే అవుతుంది. దానిని ఆరగించడం శ్రేయస్కరం. వండేవారి మనః ప్రవృత్తి కూడా వంటపై ప్రభావం చూపిస్తుంది కనుక, శుచిగా దైవనామంతో వండుతున్నప్పుడు, ఆ దేవతాశక్తి అన్నానికి కూడా ఆవహిస్తుంది.


ఆహారాన్ని అరగించేటప్పుడు కూడా మనలో జఠరాగ్ని రూపంలో ఉన్న పరమేశ్వరునికే నివేదిస్తున్నాం అనే భావన ఉండాలి. అందుకే పరిషేచన, దేవతాస్మరణ చేసి అన్నాన్ని తినడం ఈ దేశ సంప్రదాయం.


మన కడుపులోని అగ్నిహోత్రంలో అన్నాన్ని ఆహుతులుగా సమర్పిస్తున్నామనే భావనలో ఎంతో సంస్కారం గోచరిస్తోంది. ఈ స్ఫురణతో అన్నాన్ని స్వీకరించడం యజ్ఞం చేస్తున్నట్లే. జఠరాగ్నిలో పచనమైన ఆహారం రసంగా, శక్తిగా పరిణమించి ఇన్ద్రియ దేవతలకు చైతన్యాన్ని ప్రసాదిస్తోంది.


ఈ దర్శనం చేతనే మనకి అన్న నియమాలు, అన్నదానాలు ఏర్పడ్డాయి. పవిత్రమైన అన్నం పవిత్రమైన ఆలోచనలనిస్తుంది. 'అభక్ష్య భక్షణ'(తినరానివి తినడం) మహాపాపం... అని మన శాస్త్రాలు పదే చెబుతున్నాయి. అన్నానికి భౌతికమైన దోషాలను పోగొట్టడానికై వండే ముందు పదార్థాలను శుభ్రపరచడం చేస్తాం.


అవికాక - అన్న సంపాదనలో మనకు తెలిసీ, తెలియక జరిగిన దోషాలు, అన్న పచనంలో తప్పనిసరిగా జరిగిన హింస... మొదలైన సూక్ష్మమైన దుర్లక్షణాలను - భగవన్నివేదన వలన పరిహరించవచ్చు. తద్వారా శుద్ధమైన సంస్కారాలు మనలో మేల్కొంటాయి.


స్నానం కూడా చేయకుండా, పడుకుని లేచిన వస్త్రాలతోనే వంట వండి, ఆ అనాచార భోజనాన్ని 'కేరీజ్'లో సర్దుకుని పరుగు పరుగున ఆఫీసులకి దౌడుతీసి, ఏదో కడుపు నింపుకునే పద్ధతి నుండి కాస్త శ్రద్ధను ఉపయోగించి సదాచార విధానంలోకి మళ్లేందుకు ప్రయత్నించాలి.


మహాభారతంలాంటి ఇతిహాసాల్లో కూడా అన్న నియమాలు చాలా చెప్పబడ్డాయి. సాత్విక - రాజస-తామసాహారాల గురించి భగవద్గీతలో పరమాత్ముడే అద్భుతంగా వివరించాడు. భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక ప్రగతికి సాత్వికాహారం శ్రేష్ఠం. వండిన వెంటనే ఎక్కువ ఆలస్యం కాకుండా భుజించడం శ్రేష్ఠమని కృష్ణవచనం. నాలుగు గంటలకు పైగా ఉన్న అన్నం చెడుతుంది. ఎంత 'చల్ల బీరువా'లో దాచినా దాని రసం క్షీణిస్తుంది. వైద్య, ఆరోగ్య శాస్త్రాలు కూడా వీటిని నిషేధించాయి.


మాంసాహార నిషేధం కలిగినవారు కూడా అతి లవణ, అతి కటు, అతి ఆమ్లా(పులుపు) కాని శాకాహారాన్ని భుజించడం మంచిదంటారు. మాంసాన్ని స్వీకరించేవారు కూడా ఆదివారం, శుక్రవారం లాంటి పవిత్ర దినాలలో మాంసాన్ని భుజించరాదని శాస్త్రం చెబుతోంది. పూర్ణిమ, అమావాస్య, సప్తమి, ఏకాదశి, ద్వాదశి, పండుగ దినాలు, జన్మదినం వంటి ప్రత్యేక దినాలలో- మాంసాహారం తినరాదన్నారు. అంతేకాదు - ఆషాఢం నుండి నాలుగు నెలలు (చాతుర్మాస్యం) మాంసం తినకూడదని మహాభారతం చెబుతోంది. ఇది 'నిర్మూలన' కన్నా 'నియంత్రణ'ని అందిస్తుంది. దీని ద్వారా రాజస - తామస భావాల నిగ్రహణ సాధ్యమౌతుంది. క్రమక్రమంగా మాంసం తినే అలవాటున్న జాతులవారు కూడా మాంసాన్ని మానడం వలన యజ్ఞఫలం లభిస్తుందని వ్యాసుని మాట.


ఇక - ఏ ఆహారం స్వీకరించినా... 1. నిలబడి తినరాదు. 2. ఎంగిలి తినరాదు. 3. తినే పళ్లానికి ఎడమ చేయి తగల్చరాదు. 4. పళ్లానికి ఎడమ చేయి తగిలితే తిరిగి కడుక్కోవాలి. కడగకుండా అదే చేత్తో, లేదా తింటున్న చేత్తో ఆహార పదార్ధాన్ని ముట్టుకుంటే అది కూడా ఎంగిలవుతుంది. ఆ ఎంగిలి భోజనం మరొకరు తినరాదు. 5. చెమ్చాలతో తిన్నా ఆ చేయి ఎంగిలి చేయే. 6. ఆహారం (ఫలహారమైనా, అన్నమైనా) స్వీకరించాక పళ్ళెరాన్ని తీశాక, ఆ చోట నీటితో శుద్ది పెట్టాలి. ఆ నీటిలో పెరుగు చుక్కలైనా పసుపైనా వేసి శుద్ధి చేయాలి. 7. తాను తింటూ వడ్డించరాదు.... ఇవన్నీ శాస్త్ర నియమాలు.


'ఇవి చాదస్తాలు' అని పొగరెక్కిన బుద్ధులతో ఎంగిలి మంగలాలను దేవుకుంటున్న పశుప్రాయులు తాము ఏం కోల్పోతున్నారో తెలుసుకోవడం లేదు. తప్పనిసరై, ఆరోగ్యాది హేతువుల కోసం కొన్ని నియమాలను అతిక్రమించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇబ్బందిలేని కొన్ని చిన్న చిన్న ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పారు. ఆహారశుద్ధి వలన సత్త్వ(ప్రాణశక్తి )శుద్ధి, సత్త్వశుద్ధి వలన చిత్తశుద్ధి... సమకూరతాయని సంప్రదాయం. 'ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?' అని అన్నప్పటికీ, ఆచారం లేనిదే ఆత్మశుద్ధి రాదన్నదీ వాస్తవమే. న్యాయంగా ఆర్జించినది, శుచిగా వండినదీ, ఈశ్వరునికి నివేదించినదీ మాత్రమే మనిషి తినవలసిన ఆహారం.


అతిథులకు, పేదలకు కూడా అటువంటి ఆహారాన్నే సమర్పించాలి, అది మనుష్య యజ్ఞం. మనమెంత నియమంగా వండినా, ఎక్కడ ఎలా తిన్నా భగవంతుని స్మరించితే అది పూర్ణశుచిని పొందుతుంది. "అన్నం బ్రహ్మా రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః" అని స్మరించి, ఇష్టదేవతా ప్రార్ధనతో భోజనం చేయడం ఉత్తమం. ఆచారం ఆయువును రక్షిస్తుంది. సదాచార సంపన్నమైన ఆహారం వలన మానవజాతిని తీర్చిదిద్దగలిగే బుద్ధిశక్తి సంపన్నులు ఆవిర్భవిస్తారు.

Beautiful Lines

 Beautiful Lines👍

-------------------------------

"భూమి " అనే రెండక్షరాల పైన పుట్టి 

"ప్రాణం "అనే రెండక్షరాల జీవం పోసుకుని 

రెండక్షరాల "అవ్వ "తాత "

"అమ్మ ""నాన్న " "అన్న ""అక్క "

అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ 

రెండక్షరాల "గురు " వు దగ్గర 

రెండక్షరాల "విద్య "ని నేర్చుకుని 

రెండక్షరాల "డబ్బు " ని సంపాదించి 

రెండక్షరాల "భార్య" "బిడ్డ" అనే 

బంధాలను ఏర్పరచుకొని

రెండక్షరాల "ప్రేమ"ను పంచుతూ 

రెండక్షరాల "స్నేహం" పెంపొందించుకుంటూ 

రెండక్షరాల "బాధ "ని భరిస్తూ 

రెండక్షరాల "కోపం "ను దూరం చేసుకుని 

రెండక్షరాల "నేను "అనే అహంకారాన్ని మరచి 

రెండక్షరాల "మనం "అనే మమకారాన్ని పెంచి 

రెండక్షరాల "జాలి..దయ '" లను కొండంత పెంచుతూ 

రెండక్షరాల "తీపి "అనుభవాలను గుర్తు చేసుకుంటూ 

రెండక్షరాల "చేదు "సంఘటనలను మర్చిపోతూ 

రెండక్షరాల "ముప్పు " వచ్చి

రెండక్షరాల "చావు " వచ్చే వరకు 

రెండక్షరాల "ముఖం "పైన 

రెండక్షరాల "నవ్వు "ఉంటే 

రెండక్షరాల "స్వర్గం "మన 

అరచేతిలో ఉన్నట్లే..!!

ఈ సత్యాలను తెలుసుకుని జీవించగలిగేతే 

ఉన్నప్పుడైనా, పోయాకైనా మన కోసం 

నలుగురుంటారు.....🙏😊


*ఇది నిజంగా అద్భుతం *


భారతదేశంలోని నేటి 29 రాష్ట్రాల పేర్ల మొదటి అక్షరా లను ఒక దోహాలో క్రమంగా పేర్కొన్నాడు.అత్యంత ఆశ్చర్యం

కలిగిస్తుంది ఈ అంశు. దోహాలోని అక్షరాల వరుసనూ కింద పేర్కొన్న రాష్ట్రాల మొదటి అక్షరాలనూ పరిశీలించండి.


"రామ నామ జపతే 

అత్రి మత గుసి ఆవు"


"పంక మే ఉగోహమి 

ఆహి కే ఛబి ఝాఉ"


రా - రాజస్థాన్

మ - మహారాష్ట్ర

నా - నాగాలేండ్

మ - మణిపూర్

జ - జమ్మూ కాశ్మీర్

ప - పశ్చిమ బెంగాల్

తే - తెలంగాణ

అ - అస్సామ్

త్రి - త్రిపుర

మ - మధ్యప్రదేశ్

త - తమిళనాడు

గు - గుజరాత్

సి - సిక్కిం

ఆ - ఆంధ్రప్రదేశ్

ఉ - ఉత్తర ప్రదేశ్

పం -పంజాబ్

క - కర్నాటక

మే -మేఘాలయ

ఉ - ఉత్తరాఖండ్

గో - గోవా

హ - హరియాన

మి - మిజోరమ్

అ - అరుణాచల ప్రదేశ్

కే - కేరళ

ఛ - ఛతీస్ ఘడ్

బి - బిహార్

ఝా - ఝార్ఖండ్

ఉ - ఉడిసా


ఇది నిజంగా అధ్బుతమైన అక్షరాలు 

రామ నామ మంత మధురానుభూతిని కలిగిస్తుంది.

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత:  ఐదవ అధ్యాయం

కర్మసన్యాసయోగం: శ్రీ భగవానువాచ:


సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ 

తయోస్తు కర్మసన్న్యాసాత్ కర్మయోగో విశిష్యతే (2)


జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే (3)


అర్జునా.. కర్మత్యాగమూ, కర్మయోగమూ కూడా మోక్షం కలగజేస్తాయి. అయితే ఈ రెండింటిలో నిష్కామకర్మయోగం మేలు. దేనిమీదా ద్వేషం, కోరిక లేనివాడు నిత్యసన్యాసి. సుఖదుఃఖాది ద్వందాలు లేకుండా అలాంటివాడు సులభంగా భవబంధాల నుంచి విముక్తి పొందుతున్నాడు.

శ్రీ దులాడియో ఆలయం

 🕉 మన గుడి : నెం 1094


⚜ మధ్యప్రదేశ్  : ఖజురహో


⚜  శ్రీ దులాడియో ఆలయం



💠 దులాడియో దేవాలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ఉన్న ఆలయం.  

ఈ ఆలయం లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడింది 


💠 'దులోడియో' అంటే "పవిత్ర వరుడు" అని అర్థం.

ఈ ఆలయాన్ని "కున్వర్ మఠం" అని కూడా అంటారు.  

ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంది మరియు  1000–1150 నాటిది.  చండేల కాలంలో నిర్మించిన దేవాలయాలలో ఇది చివరిది.  

ఈ ఆలయం ఏడు రథాల ప్రణాళికలో (సప్తరధ) వేయబడింది.  


💠 ఖజురహోలోలో  శివునికి ఉన్న 22 దేవాలయాలలో దులాడియో దేవాలయం ఒకటి, మధ్య భారతదేశంలోని చండేలా పాలకులచే సృష్టించబడిన 87 దేవాలయాలలో ఇవి కూడా ఉన్నాయి.  


💠 కున్వర్ మఠం అని కూడా పిలువబడే దులాడియో ఆలయం, జైన దేవాలయాల సమూహానికి నైరుతి దిశలో 700 మీటర్ల దూరంలో , ఖుదర్ నదికి సమీపంలో ఉంది.


💠ఇది ఖజురాహోలోని గొప్ప దేవాలయాలలో చివరిదని నమ్ముతారు, ఇది 1130 లో చందేల్ల రాజు మదనవర్మన్ పాలనలో నిర్మించబడింది.


💠 ఆలయ లోపలి భాగం ఖజురాహోలో కనిపించే మునుపటి దేవాలయాల కంటే చాలా సరళంగా ఉంటుంది మరియు పాశ్చాత్య భారతీయ నిర్మాణ సంప్రదాయాల ప్రభావాలను చూపిస్తుంది.

గర్భగుడిలో లింగం యొక్క కేంద్ర చిహ్నం ఉంది, ఇది ఆలయానికి సమకాలీనమైనదిగా పరిగణించబడదు కానీ తరువాత భర్తీ చేయబడింది.


💠 ఆలయ గర్భగుడిలో ఒక అందమైన శివలింగం ఉంది. 

ఆలయం యొక్క ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే, పవిత్రమైన శివలింగం ఉపరితలంపై చెక్కబడిన 999 లింగాలు ఉన్నాయి. 

శివలింగం యొక్క ప్రదక్షిణ  తీసుకోవడం 1000 ప్రదక్షిణలకు సమానమని నమ్ముతారు. 


💠 శివలింగంతో పాటు, ఆలయంలో గణేశుడు, పార్వతి దేవి మరియు గంగా దేవి వంటి ఇతర దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలు ఉన్నాయి.


💠 ఈ ఆలయంలోని శిల్పాలు ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలోని జామ్సోర్‌లోని ఒక ఆలయ అవశేషాలలో లభించిన శిల్పాలతో బలమైన గుర్తింపును కలిగి ఉన్నాయి . ఈ సారూప్యత నుండి రెండు ప్రదేశాలలోని శిల్పాలు ఒకే శిల్పుల చేతిపని అని మరియు అవి 1060 నుండి 1100 వరకు, కీర్తివర్మన్ పాలనలో సృష్టించబడ్డాయని ఊహించబడింది . 


💠 ఆలయంలోని అనేక ప్రదేశాలలో లిఖించబడిన వాసల అనే పేరును బట్టి, ఆ పేరు శిల్పాలను సృష్టించిన ప్రధాన శిల్పి పేరు అని ఊహించవచ్చు.


💠 ఈ ఆలయాన్ని నిరంధార ఆలయంగా వర్గీకరించారు . 

నిరంధార అంటే సంచార మార్గం లేని ప్రదేశము అని అర్ధం.

ఇందులో సంచార స్థలం లేని గర్భగుడి, వసారా, ప్రధాన హాలు ( మహా-మండపం ) మరియు ప్రవేశ ద్వారం ఉన్నాయి. 

ఆలయములో  ప్రదక్షిణ మార్గం లేదు, ఇది 12వ శతాబ్దంలో చందేల పాలనలో నిర్మించబడిన దేవాలయాలలో చివరిది కావడం వల్ల కావచ్చు, ఆ సమయంలో వాటి నిర్మాణ దశ గరిష్ట కాలం గడిచిపోయింది.


💠 ఆలయ శిఖరం మూడు వరుసల చిన్న శిఖరాలలో సృష్టించబడింది .

 దీని లక్షణాలు సాధారణంగా ఖజురాహో సముదాయంలోని ఇతర దేవాలయాల కోసం స్వీకరించబడిన వాటికి అనుగుణంగా ఉంటాయి. స్మారక చిహ్నాల భౌతిక లక్షణాల ప్రకారం వర్గీకరణ ఒక ఎత్తైన స్థావరాన్ని కలిగి ఉంటుంది, ఇది ఒక ఉప నిర్మాణం, దానిపై గొప్పగా అలంకరించబడిన నిర్మాణం పైకి లేచి గొప్ప శిల్పాలతో కప్పబడి ఉంటుంది. 

నిర్మాణ శైలి నాగర , ఇది శివుని నివాసమైన కైలాస పర్వతాన్ని సూచిస్తుంది .


💠 ఆలయంలోని ప్రధాన హాలు చాలా పెద్దది మరియు అష్టభుజాకార ఆకారంలో ఉంటుంది. 

దీని పైకప్పు సొగసైన చెక్కబడిన దివ్య నృత్యకారులు ( అప్సరాలు ) ఉన్నారు. అప్సరసలతో చెక్కబడిన ఇరవై బ్రాకెట్లు ఉన్నాయి, ప్రతి బ్రాకెట్‌లో ఒకదానికొకటి రెండు లేదా మూడు అప్సరసలు ఉన్నాయి మరియు పైకప్పులో వృత్తంలో అమర్చబడి ఉన్నాయి. 


💠 చెట్ల చుట్టూ నృత్యం చేసే ఆడపిల్లలు మరియు శృంగార భంగిమల్లో ఉన్న మహిళలు కూడా ఆలయ నిర్మాణంలో భాగం.

 ఇది "ఖజురహో నిర్మాణ మరియు శిల్ప నైపుణ్యం యొక్క చివరి ప్రకాశం" అని చెప్పబడింది. 

ముఖభాగంలోని పై వరుసలలో అతీంద్రియ జీవుల ( విద్యాధార ) శిల్పాలు శక్తివంతమైన రీతిలో ఉన్నాయి. 


💠 సమయాలు:

 ఉదయం 6 నుండి సాయంత్రం 5 వరకు.



రచన

©️ Santosh Kumar

17-07-గీతా మకరందము

 17-07-గీతా మకరందము.

           శ్రద్ధాత్రయ విభాగ యోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక మూడువిధములైన ఆహారము, యజ్ఞము, తపస్సు, దానములను గూర్చి చెప్పుచున్నారు - 


ఆహార స్త్వపి సర్వస్య 

త్రివిధో భవతి ప్రియః | 

యజ్ఞస్తపస్తథా దానం 

తేషాం భేదమిమం శృణు || 


తాత్పర్యము:- ఆహారముకూడ సర్వులకును (సత్త్వాది గుణములనుబట్టి) మూడు విధములుగ ఇష్టమగుచున్నది. ఆలాగుననే యజ్ఞము, తపస్సు, దానముకూడ జనులకు మూడువిధములుగ ప్రియమై యుండుచున్నది. ఆ యాహారాదుల ఈ భేదమును గూర్చి (చెప్పెదను) వినుము.


వ్యాఖ్య:- ఆహారాదులను నాలుగింటిని గుఱించి చెప్పదలంచి భగవానుడు వానిలో ఆహారమును గూర్చియే మొట్టమొదట ప్రస్తావించుట గమనింపదగినది. జీవుని ఆధ్యాత్మిక సాధనక్రమములో ఆహారశుద్ధి ప్రప్రథమమైనది. ఆహారశుద్ధిచే చిత్తశుద్ధి, చిత్తశుద్ధిచే జ్ఞానోదయము సంభవించును. ఆహారము శుద్ధముగలేనిచో మనస్సున్ను మలినముగానుండుటవలన దానివలన లక్ష్యప్రాప్తి చేకూరకయేయుండును.


ప్రశ్న:- ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము జనులకు ఎన్నివిధములుగ ప్రియమై  యుండును? 

ఉత్తరము:- వారివారి గుణముననుసరించి మూడు విధములుగ ప్రియమైయుండును (సత్త్వగుణము గలవారికి సాత్త్వికాహారము - ఈ ప్రకారముగ).