30, జూన్ 2025, సోమవారం

రామాయణం

 🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹

*🪷బుధవారం 25 జూన్ 2025🪷*

``

            *రామాయణం*


ఒకసారి చదివినంత 

మాత్రాన మన సమస్త 

పాపాలని తీసేస్తుంది.

``

    *వాల్మీకి రామాయణం*                 

            *79వ భాగం*

```

ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ జయ మంత్ర శ్లోకాలని చెప్పాడు 

“రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు” అని జయ మంత్రాన్ని చెప్పాడు.


అప్పుడా 80,000 కింకరుల మూక హనుమంతుడి మీదకి రకరకములైన ఆయుధములను వేశారు. చండ ప్రచండుడైన హనుమంతుడు ఆ తోరణానికి ఉన్న ఇనుప పరిఘని ఒకదాన్ని పీకి వాళ్ళందరినీ దానితో కొట్టాడు. కళ్ళు మూసి తెరిసేలోగా అక్కడ ఆ రాక్షసుల మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో ఆ ప్రాంతం నిండిపోయింది.   

మళ్ళీ ఆయన తోరణం ఎక్కి కూర్చున్నాడు, అప్పుడాయనకి దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రాసాదం కనపడింది. అప్పుడాయన ఆ ప్రాసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు. ఆ నాదం వినేసరికి లంకా పట్టణంలో కొన్ని వేలమంది గుండెలు బద్దలయ్యి, చెవుల వెంట, ముక్కుల వెంట నెత్తురు కారి చనిపోయారు. అప్పుడాయన తొడలు కొట్టాడు, ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు. తరువాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరగిర తిప్పితే, ఆ వేగానికి అందులోనుంచి అగ్ని పుట్టి ఆ ప్రాసాదం అంతా కాలిపోయింది. ఆ ప్రాసాదానికి కాపలా ఉన్న 100 మంది రాక్షసులని కూడా కొట్టి చంపేశాడు.


అప్పుడాయన “మా వానరములలో 10 ఏనుగుల బలం కలిగినవారు, 100 ఏనుగుల బలం కలిగినవారు, 1000 ఏనుగుల బలం కలిగినవారు, 10,000 ఏనుగుల బలం కలిగినవారు, అంతకన్నా ఎక్కువ బలం కలిగినవారు ఉన్నారు. భూమికి అడ్డంగా ఎగరగలిగేవాళ్ళు, నిలువుగా ఎగరగలిగేవాళ్ళు ఈ భూమండలం అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు, వాళ్ళెవరూ మిమ్మల్ని విడిచిపెట్టరు. సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగుపెట్టిననాడు, ఈ లంక లేదు, మీరు లేరు, ఆ రావణుడు లేడు. ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు” అని చెప్పి మళ్ళీ తోరణం మీదకి వచ్చి జయ మంత్రం చెప్పాడు.


80,000 మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు. గాడిదలు పూన్చిన రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. 


అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరాడు. బాణములతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు. 


తరువాత హనుమంతుడు ఒక సాల వృక్షాన్ని పీకి విసిరాడు, కాని ఆ చెట్టు మీద పడకముందే దానిని జంబుమాలి ఖండ ఖండములుగా కొట్టాడు. తరువాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద, వక్షస్థలం మీద బాణములతో కొట్టాడు, ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది. హనుమంతుడు మళ్ళీ ఒక పరిఘని పీకి, గిరగిర తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడిమీద పడి ఆ పరిఘతో కొట్టాడు. 


ఆ దెబ్బకి జంబుమాలి రథం, శిరస్సు, చేతులు, గాడిదలు మొదలైనవి ఏమి కనపడలేదు. మళ్ళీ ఆయన తోరణం ఎక్కి జయ మంత్రం చెప్పడం ప్రారంభించాడు. 


అక్కడున్న రాక్షసులందరినీ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు, మోకాళ్ళతో కుమ్మేశాడు, చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు.


“జంబుమాలి, జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యము అంతా మరణించారు” అని రావణుడికి కబురు వెళ్ళింది. 


అప్పుడు రావణుడు తన 7 గురు మంత్రుల కొడుకులని హనుమ పైకి యుద్ధానికి పంపించాడు. వాళ్ళు అన్ని వైపులనుండి హనుమ మీదకి బాణ ప్రయోగం చేశారు. 


అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు. 


ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు, మిగిలినవారి గుండెల్ని తన గోళ్ళతో గిల్లేసి చంపేశాడు. కొంతమందిని పళ్ళతో కొరికి చంపేశాడు. అప్పుడా ప్రాంతం తెగిపోయిన తలలతో, చచ్చిపోయిన ఏనుగులతో, పచ్చడైపోయిన శరీరాలతో, విరిగిపోయిన రథాలతో ఉంది.


వెళ్ళిన మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది, అప్పుడాయన 5 గురు సేనాగ్ర నాయకులని పిలిచి “మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి, అది సామాన్యమైన వానరం కాదు. నేను ఎందరో మహర్షులను బాధ పెట్టాను, వాళ్ళందరూ తమ తపోశక్తులని ధారపోసి సృష్టించిన మహా భూతం అయి ఉంటుంది” అన్నాడు. 


విరూపాక్ష, యూపాక్ష, దుర్ధర, ప్రఘస, భాసకర్ణ అనే 5గురు సేనా నాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు. వాళ్ళల్లో దుర్ధరుడు వేసిన మూడు ఇనుప బాణములు హనుమంతుడి తలలో తగిలాయి. ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు. ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడని ఆ సేనా నాయకులు అలా చూశారు అంతే, ఆయన గబుక్కున ఆ దుర్ధరుడి రథం మీద పడిపోయాడు. హనుమంతుడి శరీరం కింద దుర్ధరుడు, ఆయన రథం, అన్నీ పచ్చడయిపోయి ఉన్నాయి. మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు పరుగులు తీసారు, అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకలించి దానితో ఆ ఇద్దరినీ కొట్టాడు. ఆ దెబ్బకి ఆ ఇద్దరూ మరణించారు. తరువాత మిగిలిన ఇద్దరినీ సంహరించాడు.


ఈ వార్త విన్న రావణుడు సభలో అటూ ఇటూ తేరిపారి చూసి తన చిన్న కుమారుడైన అక్ష కుమారుడి మీద ఆయన చూపులు ఆగాయి. తండ్రి తన వంక చూడగానే ఆ అక్ష కుమారుడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే 

‘ఈ పిల్లవాడు ఎంత బావున్నాడు రా, చిన్నవాడే కాని చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు. కాసేపు వీడిని యుద్ధం చెయ్యనిద్దాము' అని హనుమంతుడు అనుకున్నాడు. 


అక్ష కుమారుడు వేసిన బాణ పరంపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు. అక్ష కుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు. 


అప్పుడు హనుమంతుడు 

‘దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు, కాని ఇంట్లో అగ్ని ఉందని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది. ఇక వీడిని చంపవలసిందే' అనుకొని, ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్దది చేసి కింద పడ్డాడు. 


అప్పుడు గుర్రాలు, రథం, సారధి చనిపోయారు కాని అక్ష కుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయి, ఆకాశం నుండి యుద్ధం చేశాడు. 


అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్ష కుమారుడి పాదాలని పట్టుకొని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు. 


ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి, తలకాయి వెయ్యి ముక్కలయ్యింది, కడుపు బద్దలయిపోయి పేగులు బయటకి వచ్చాయి.


తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విన్న రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏంటో, భయం అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పుడాయనకి ఎవరిని పంపాలో అర్ధం కాక ఇంద్రజిత్ వంక చూసి… “నిన్ను పంపకూడదు, కాని ఇవ్వాళ నిన్ను పంపక తప్పడంలేదు. చాలా జాగ్రత్తగా వెళ్ళు, లంకా పట్టణం భద్రత అంతా నీ చేతులలో ఉంది. ఒకసారి అస్త్రాలన్నిటిని మననం చేసుకుంటూ వెళ్ళు. ఎలాగైనాసరే ఆ వానర వీరుడి వేగం తగ్గించి పట్టుకో, అవకాశం దొరికితే వాడిని సంహరించు” అని చెప్పి పంపాడు. ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు.


ఇంద్రజిత్, హనుమంతుడు ఒకరికి ఒకరు దొరకకుండా యుద్ధం చేసుకుంటున్నారు. ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి, అనుకొని ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. 

ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం(ఏ అస్త్రము నిన్ను ఏమి చెయ్యలేదు) జ్ఞాపకం వచ్చి ‘ఇది బ్రహ్మాస్త్రం, బ్రహ్మగారి పేరు మీద ఉన్న అస్త్రం, నేను దీనిని గౌరవించాలి. నేను ఆయనని తలుచుకొని నమస్కరించగానే ఇది నన్ను వదిలేస్తుంది. కాని నేను దీనికి కొంతసేపు కట్టుబడి ఉంటాను' అనుకున్నాడు. 


బ్రహ్మాస్త్రానికి కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు. ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనపడ్డ గుడ్డ ముక్కలతో హనుమంతుడి కాళ్ళు, చేతులు కట్టేసి, కర్రలతో కొట్టారు. 


అప్పుడు హనుమంతుడు ‘ఇలా ఈ రాక్షసులను ఎంతసేపు చంపుతాను, ఒకసారి రావణుడిని చూస్తాను' అనుకొని అలా ఉండిపోయాడు.


కాని ఇంద్రజిత్ అనుకున్నాడు… 'ఈ రాక్షసులు బుద్ధిహీనులు. బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు. బ్రహ్మాస్త్రం చేత నిర్భంధింపబడ్డ వ్యక్తిని వేరొకదానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది. ఒకసారి బ్రహ్మాస్త్రం వెయ్యబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యేవరక పనిచెయ్యదు. ఇప్పుడీయన తలచుకుంటే ఏమన్నా చెయ్యగలడు. కాని ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలీలేదు, వీళ్ళు కట్టేయడం వలన ఇంకా ఆ బ్రహ్మాస్త్రమే పట్టుకుని ఉందనుకుంటున్నాడు” అని అనుకొని సంతోషపడ్డాడు.


వాళ్ళు హనుమంతుడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దగ్గర నిలబెట్టారు. ఒక నల్లని మబ్బుని కాని, ఒక కాటుక కొండని కాని తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో, అలా రావణుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. రత్నములు, వజ్రములు, స్ఫటికములు తాపడము చెయ్యబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు.  


రావణుడికి… వానరమైన హనుమంతుడితో మాట్లాడడం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి… 

“ఎక్కడినుంచి వచ్చాడు? ఎందుకొచ్చాడు? ఎవరివాడు? నాకు ఇష్టమైన అశోక వనాన్ని ఎందుకు నాశనం చేశాడు? సీతతో ఎందుకు మాట్లాడాడు? ఏమి మాట్లాడాడు? ఈ విషయాలు మీరు ఆ వానరాన్ని అడిగి కనుక్కోండి. నిజం చెబితే వాడి ప్రాణాలు ఉంటాయి, అబద్ధం చెబితే ప్రాణాలు పోతాయి” అన్నాడు.


అప్పుడు ప్రహస్తుడు లేచి “నువ్వేమి భయపడకు. మా ప్రభువు ధర్మాత్ముడు. నిజం చెప్పు, నిన్ను పంపించేస్తాము. నిన్ను అగ్ని పంపించాడా? యముడు పంపించాడా? కుబేరుడు పంపించాడా? విష్ణువు పంపించాడా? ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు? ఎందుకు అశోక వనాన్ని నాశనం చేశావు?” అని ప్రశ్నించాడు.


అప్పుడు హనుమ రావణుడి వంక చూసి “ఏమి కాంతి, ఏమి ద్యుతి, ఏమి పరాక్రమం, నిజంగా వీడి దగ్గరే కాని మహా పతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతే వీడు మూడు లోకములను శాసించగలిగినవాడు కదా” అన్నాడు.


హనుమని చూసిన రావణుడు భయపడి 'ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు, ఇంతకుముందు నేను జాంబవంతుడిని, వాలిని, సుగ్రీవుడిని, సుషేణుడిని, నీలుడిని చూశాను, కాని వాళ్ళెవరికీ ఇంత పరాక్రమము, సామర్ధ్యం లేవు. బహుశా ఆనాడు నేను కైలాస పర్వతాలని కదిపేస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు, 

'వానరులు నా కొంప ముంచుతాయని!' బహుశా నందీశ్వరుడే వచ్చాడేమో' అనుకొన్నాడు.


అప్పుడు హనుమంతుడు అన్నాడు “నేను రామ దూతగా ఇక్కడికి వచ్చాను. నా యదార్ధ స్వరూపము వానర స్వరూపమే. నన్ను హనుమ అంటారు, సుగ్రీవుడి సచివుడిని. కిష్కిందా రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా, ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. నీకు-వాలికి ఉన్న స్నేహబంధం వల్ల సుగ్రీవుడు నీకు సోదరుడి వరస అవుతాడు, ఆ సుగ్రీవుడు 

నీ కుశలమడిగానని చెప్పమన్నాడు. నేను రాక్షసుడిని కాదు, రాముడిలా నరుడిని కాదు. నేను తటస్థమైనవాడిని, వానరుడిని. అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెబుతాను, విన్నావా బాగుపడతావు, లేకపోతే నాశనమయిపోతావు. నిన్ను చూడడానికి వేరొక ఉపాయము లేదు, అందుకని దండోపాయంతో అశోక వనాన్ని నాశనం చేశాను. అప్పుడు నీ వాళ్ళు నా మీదకి యుద్ధానికి వచ్చారు, దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను, వాళ్ళు చనిపోయారు.


పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడం కోసం లక్ష్మణుడు, సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టావు, సీతమ్మ ఎవరో నాకు తెలీదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాకు. నేను సీతమ్మని అశోకవనంలో చూశాను, నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు. సీతమ్మ అయిదు తలల పాము, నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు, సుగ్రీవుడు ఒక్కడే నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్ని సాక్షిగా స్నేహం ఉంది, కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు 'నర వానరములతో తప్ప' అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా, సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, దేవత కాదు, రాక్షసుడు కాదు, ఆయన కేవలం వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకి సంబంధించిన ఫలితాలని పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకి కాంచన లంకని పొందావు, వేల మంది కాంతలతో సుఖాలని అనుభవించావు, ఇంతమంది రాక్షసులకి ప్రభువుగా నిలబడ్డావు. కాని నువ్వు ఇవ్వాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు, ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్ర శస్త్రములు తెలుసు, ఋషుల దగ్గర శిక్షణ పొందినవాడు, మహా ధర్మాత్ముడు, అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణములు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు లక్ష మంది వచ్చినా రాముడి ముందు నిలబడలేరు.


ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటే, శివుడు తన కాలి బొటను వేలితో ఆ పర్వతాన్ని తొక్కగా నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అటువంటి శివుడి ధనుస్సుని రాముడు హేలగా విరిచేశాడు. నిన్ను ముప్పతిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులని జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా. అయినా నిన్ను చంపడానికి రాముడు ఎందుకు, నేను చాలు. మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు, లేదా చచ్చిపోతావు” అన్నాడు.


ఒక నిండు సభలో తనని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చి “ఈ వానరాన్ని చంపెయ్యండి" అన్నాడు.


అప్పుడు విభీషణుడు లేచి… 

“అన్నయ్యా! నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు. దూతకి వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి, అవి తల గొరిగించడం, అవయవాన్ని తీసెయ్యడం, వాత పెట్టడం. అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతలివారికి ఎలా తెలుస్తుంది. అందుకని వచ్చిన దూతని చంపద్దు” అన్నాడు.


విభీషణుడి మాటలు విన్న రావణుడు… “వానరాలకి తమ తోక అంటే చాలా ఇష్టం. అందుకని వీడి తోకకి నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపినవారి దగ్గరికి వెళుతుంది, అప్పుడు ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి 'తోకలేని కోతి, తోకలేని కోతి' అని ఏడిపిస్తారు” అన్నాడు.


అప్పుడు వాళ్ళు పాత బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి, నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి, రథం ఎక్కించి నాలుగు కూడళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి కర్రలతో కొడుతూ 'గూఢచారి, గూఢచారి' అని ప్రకటించారు. 


ఆ లంకా పట్టణంలో మేడల మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు.


అప్పుడు హనుమంతుడు ‘వీళ్ళు నన్ను కొడితే కొట్టారులే కాని, రాత్రి వేళలొ ఈ లంకా పట్టణాన్ని అన్వేషించాను. ఒకసారి పగటిపూట ఈ రావణుడి బలం ఏమిటో, లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెబుతాను' అనుకున్నాడు. 


వాళ్ళు హనుమని ఆ లంకా పట్టణం అంతా తిప్పాక ఆయన ఒక్కసారి కట్లని విడిపించుకొని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు. అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వెళ్ళి “నీతో కిచకిచలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు” అన్నారు.


సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్ధన చేసి … “నేను సర్వకాలములయందు రాముడికే సేవ చేసిన దాననయితే, రాముడినే మనసులో పెట్టుకున్న దాననయితే, నాకు భాగ్యవిశేషం మిగిలి ఉంటె, రాముడికి నామీద ప్రేమ ఉంటె, సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపడం యదార్ధమయితే, హనుమ యొక్క తోకకి నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగా” అంది.


వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలా చల్లగా అయిపోయింది. 


అప్పుడాయన అనుకున్నాడు… 

'అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిధ్యం ఇచ్చాడు, సముద్రుడు నమస్కారం చేశాడు. రాముడి పేరు, సీతమ్మ పేరు చెబితే ప్రకృతిలో ఉపకరించనిది ఏముంటుంది. నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు, అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు' అని అనుకుని, ‘ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను' అనుకొని, మొదట ప్రహస్తుడి ఇంట్లో నిప్పు పెట్టాడు. 


అలా అన్ని ఇళ్ళ మీదకి దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు. 


రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపుమండిపోయి ఉన్న దిక్పాలకులు అవకాశం దొరికిందని ఆనందపడ్డారు. హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్ని దేవుడు కాల్చేస్తున్నాడు, వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ళమీద వేసేశాడు. కొన్ని చోట్ల ఆకుపచ్చగా, కొన్ని చోట్ల పచ్చగా, కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంక అంతా కాలిపోతోంది. ఆ లంకలో అందరూ “హా తాతా, హా పుత్రా, హా తల్లీ” అని అరుచుకుంటూ దిక్కులుపట్టి పరుగులు తీశారు. 


అప్పుడు హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూటాచల పర్వతం మీద నిలబడి చూసేసరికి, ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది.


అప్పుడాయన… “అరరే ఎంతపని చేశాను. అగ్నిని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు. పాము కుబుసాన్ని విడిచినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను. ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది. ఏ సీతమ్మ తేజస్సు చేత నా తోకని అగ్ని కాల్చలేదో, అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా. సీతమ్మే అగ్ని, అగ్నిని అగ్ని కాలుస్తుందా" అని అనుకున్నాడు. 


ఇంతలో అటుగా వెళుతున్న చారణులు(భూమికి దగ్గరగా ఆకాశంలో ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవ గాయకులు) “ఏమి ఆశ్చర్యం, ఇవ్వాళ ఒక వానరుడైన హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకా పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ లంక అంతా కాలిపోతుంది, కాని శింశుపా వృక్షము, ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జరగలేదు. అలాగే విభీషణుడి ఇల్లుకి కూడా ఏమి జరగలేదు” అన్నారు.


అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కిందన కూర్చున్న సీతమ్మ దగ్గరికి వచ్చి… “అమ్మా లంకంతా కాల్చేశాను. రావణుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను, నువ్వేమి బెంగపెట్టుకోకు. వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు. రాముడి కోసం వాడిని వదిలేశాను, లేకపోతే వాడి పది తలకాయలు గిల్లేసేవాడిని. అమ్మా! నేను బయలుదేరతాను, తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది, శోకమునకు గురికాకు” అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో, ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి, అక్కడినుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది.```


        *రేపు…80వ భాగం*


*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*                           

       *🙏జై జై శ్రీ రామ్.!🙏*


                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

అంతర్ముఖంగా చూడాలి*

 *ఎవరిలోనైనా భౌతిక సౌందర్యాన్ని చూడరాదు - అంతర్ముఖంగా చూడాలి*


ఒకానొక సమయంలో పరమభాగవతోత్తముడు , త్రిలోకసంచారియైన నారదమహర్షి , 

పర్వత మహర్షి, ఒక మహారజు  భవనంలో ఆతిధ్యం  స్వీకరించి అక్కడ

నివసించారు. 

మహా రాజు

ఆ మునుల సేవలకై తన పుత్రిక అయిన దమయంతిని నియమించాడు. 


అందం, వినయం, తెలివి తేటలు, కలిగిన దమయంతి నారదునికి అధికంగా సేవలు చేసేది.

ఇది పర్వత మహర్షి కి ఈర్ష్య , ఆగ్రహం కలిగించింది.

నారదుడు అందంగా వున్నందునే దమయంతి అతనికి అధిక సేవలు చేస్తోందని మహర్షి భావించాడు. 


నారదుని ముఖం వానర ముఖంగా మారాలని శపించి  అక్కడ నుండి  యాత్రలకు బయలుదేరి వెళ్ళి పోయాడు.


ఆ ముని శాపం వలన నారదుని ముఖం కోతి గా మారిపోయింది.

అయినా , 

దమయంతి  తన నిర్మలమైన సేవలను ఆపలేదు. 


ఆమె నారదుని

భౌతిక సౌందర్యాన్ని చూడలేదు. 

నారదుని ఆంతరంగిక  సౌందర్యాన్ని

కోరుకుంది.  


నారదుడు ఆమె గుణాలకు  సంతోషంపొంది, దమయంతి ని తనకిచ్చి వివాహం చేయమని మహారాజును  అడిగాడు.


నారదుని కోరికను మన్నింప మహారాజు సందేహించాడు, కానీ , ఆయన కుమార్తె

దమయంతి నారదుని భగవత్చింతన, సద్గుణాలను తండ్రికి తెలిపి, ఒప్పించింది. 


మహారాజు కూడా ఆనందంతో

దమయంతి వివాహం

నారదునితో జరిపించాడు.


కొన్నాళ్ళ తర్వాత ,తిరిగి వచ్చిన పర్వత మహర్షి , జరిగినది తెలుసుకొని తన తప్పుకు చింతించి నారదుని క్షమాపణలు కోరి ,నారదుని కి శాప విమోచనం కలిగించాడు.


భౌతిక  సౌందర్యానికి మైమరచి అహంకారపూరితులు కాకుండా , యింద్రియ నిగ్రహంతో ఆత్మ జ్ఞానాన్ని  సంపాదించాలని

జగద్గురువు ఆది శంకరాచార్యులవారు

బోధించారు నీతి సందేశం....


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

దేవుడున్నాడు

 *ఈ మాయా ప్రపంచం లో - పంచాక్షరి మహా మంత్రం ఏమిటి??*


       *_"దేవుడున్నాడు "_*

ఈ సృష్టి క్రమాన్ని పరిశీలిస్తే అర్ధమయ్యేది, ఏమిటంటే ఈ సృష్టి కి మూలాధార మైనది 'మహత్తు' అంటాము, *అదే దైవం*...

ఆ దైవశక్తే తన దివ్య శాసనాన్ననుసరించి, సృష్టి స్థితి, లయములను నడుపుతోంది. 

జరిగేది సర్వం దైవసంకల్పమే, స్వయం కృషితో పైకి వచ్చానని గర్వపడకు, బాగా పరిశీలిస్తే, భగవంతుని అదృశ్య హస్తం గోచరిస్తుంది...

దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడని సతతం స్మరించు, అదే పంచాక్షరి మహా మంత్రం...

అలా స్మరిస్తుంటే ఆయన నీలోనే ఉన్న అనుభవం కలుగుతుంది.

సుఖాలలో దైవాన్ని విస్మరించి, కష్టాలలో శాంతి వ్రతాలు చేయడం అవివేకం. 


కష్టాలకు కృంగకు,

అదినీకర్మ ఫల ప్రక్షాళన గా భావించు,

దైవ విశ్వాసము ఉంటే అది భరించే శక్తి నీకు వస్తుంది, బాగా తెలుసుకో, నీకున్న నిస్వార్థ బంధువు భగవంతుడు ఒక్కడే. 


ఈ ప్రాపంచిక బంధములన్నీ ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యాపార సూత్రం మీద ఆధారపడినవే, అంతే కానీ ఏదీ శాశ్వతం కాదు, భగవంతుడు ఒక్కడే శాశ్వతం.

మౌనం మహా భాగ్యం*

 *మౌనం మహా భాగ్యం*

```

రోజూ ఒక్క అరగంట లేదా కనీసం పది నిమిషాలు మౌనంగా ఉంటే చాలు. 

చక్కటి శారీరక, మానసిక ఆరోగ్యం 

మీ సొంతమవ్వటమే కాదు... 

మీ ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు అన్నీ నెరవేరతాయి. 


ఇదెలా సాధ్యం అంటే, ప్రయత్నిస్తే తెలుస్తుంది- ఎలా సాధ్యమో. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఎంతసేపు మనం మాట్లాడతాం? ఎంత సేపు మౌనంగా ఉంటాం?


మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ లేదా ఏ టీవీలోని కార్యక్రమాన్ని చూస్తూనో, కంప్యూటర్ ముందు కూర్చునీ పనిచేయడం కాదు. మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం. 


ఈ పనులన్నీ చేస్తున్నప్పుడు మన నోరు మాట్లాడకపోయినా, మనసులో ఆలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అంటే మన మెదడు పనిచేస్తూనే ఉంటుంది. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయి.


అదే కళ్ళు మూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి. కనీసం ఓ పదినిమిషాలు చాలు. కళ్ళు తెరిచాక ఎంతో హాయిగా ఉంటుంది. మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. మనమంటే ఏమిటో మనకు తెలియజేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు అరుపులు అక్కడితో అయిపోతుందా, అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మౌనంగా ఉండటాన్ని ధ్యానం, మెడిటేషన్, ప్రాణాయామం ఏదైనా పిలవండి ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు. ఆ తర్వాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు ఇట్టే మాయమవుతుంది. అంతే కాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి.

29, జూన్ 2025, ఆదివారం

Panchaag

 


ఆకలి లేనివారికోసం

 ఆకలి లేనివారికోసం సులభ యోగాలు - 


 * మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.


 * వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .

 

* యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.

 

* బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .

 

* పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .

 

* కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.

         

. పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు. అగ్నిమాంద్యం అనగా ఆకలి లేకపోవడమే.

 

అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -

 

•. తినవలసినవి -

 

తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .

 

•. తినకూడనవి -

        

. కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .

        

. పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.

      

. మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 

    

గమనిక -

      

. నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

           

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ క్రింద ఇచ్చిన ఫోన్ నెంబర్ నందు సంప్రదించగలరు.

                   

            కాళహస్తి వేంకటేశ్వరరావు .

         

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                         

. 9885030034

అరసున్న

 అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:


అరుఁగు = వీధి అరుగు


అరుగు = వెళ్ళు, పోవు


అఱుగు = జీర్ణించు


ఏఁడు = సంవత్సరం


ఏడు = 7 సంఖ్య


కరి = ఏనుగు


కఱి = నల్లని


కాఁపు = కులము


కాపు = కావలి


కాఁచు = వెచ్చచేయు


కాచు = రక్షించు


కారు = ఋతువు, కాలము


కాఱు = కారుట (స్రవించు)


చీఁకు = చప్పరించు


చీకు = నిస్సారము, గ్రుడ్డి


తఱుఁగు = తగ్గుట, క్షయం


తఱుగు = తరగటం(ఖండించటం)


తరి = తరుచు


తఱి = తఱచు


తీరు = పద్ధతి


తీఱు = నశించు, పూర్తి(తీరింది)


దాఁక = వరకు


దాక = కుండ, పాత్ర


నాఁడు = కాలము


నాడు = దేశము, ప్రాంతము


నెరి = వక్రత


నెఱి = అందమైన


నీరు = పానీయం


నీఱు = బూడిద


పేఁట = నగరములో భాగము


పేట = హారంలో వరుస


పోఁగు - దారము పో( గు


పోగు = కుప్ప


బోటి = స్త్రీ


బోఁటి = వంటి [నీబోఁటి]


వాఁడి = వాఁడిగా గల


వాడి = ఉపయోగించి


వేరు = చెట్టు వేరు


వేఋ = మరొకవిధము


మడుఁగు = వంగు, అడఁగు


మడుగు = కొలను, హ్రదము


మొదలైనవీ ఉన్నాయి.


అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!


[డాక్టర్ ద్వా. నా. శాస్త్రి )

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి) 


సర్వథా సుకరం మిత్రం 

దుష్కరం పరిపాలనమ్.

అనిత్యత్వాచ్ఛ చిత్తానాం 

ప్రీతిరల్పేపి భిద్యతే

(4.32.7)


*అర్థం:*

స్నేహితుడిని సంపాదించుకోవడం సులభం, కానీ ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవడం కష్టం. మనసులోని చంచలత్వం వల్ల, చిన్న చిన్న కారణాల వల్ల కూడా స్నేహం తెగిపోతుంది.


"జయ జనార్ధన కృష్ణ రాధికా పతే, నంద నందనా కృష్ణ రుక్మిణీ పతే" అంటూ శ్రీ కృష్ణుని స్తుతిస్తూ.... శుభోదయం.


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః 


శుభ శనివారం

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝 *సత్యం వేదేషు జాగర్తి ఫలం సత్యే పరం స్మృతమ్l*

             *సత్యాద్ధర్మో దమశ్చైవ సర్వం సత్యే ప్రతిష్ఠితమ్ll*


                             *... మహాభారతమ్ …*


తా𝕝𝕝 "వేదాలలో సత్యమే నిలచి ఉంటుంది. సత్యఫలమే శ్రేష్ఠమైన ఫలం. సత్యం ద్వారానే ధర్మం, ఇంద్రియ నిగ్రహం కలుగుతాయి. *సర్వమూ సత్యము మీదనే ఆధారపడి నిలుస్తుంది".*

                   

 ✍️VKS ©️ MSV🙏

పంచాంగం 28.06.2025

 ఈ రోజు పంచాంగం 28.06.2025

Saturday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష తృతీయ తిథి స్థిర వాసర పుష్యమి నక్షత్రం హర్షణ యోగః గరజి తదుపరి వణిజ కరణం


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 




నమస్కారః , శుభోదయం