23, నవంబర్ 2025, ఆదివారం

పంచాంగం

పంచభూతాలు – ఆహారంలో ఉన్న శక్తులు*

 .

*పంచభూతాలు – ఆహారంలో ఉన్న శక్తులు*

*ముందుమాట:*  

మన శరీరం పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) ఆధారంగా పనిచేస్తుంది. తినే ఆహారంలో కూడా ఈ భూతాల సమతుల్యత ఉంటుంది. ఏ భూతం ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. అందుకే పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకుంటే శరీరం సమతుల్యం అవుతుంది మరియు రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.

1) *భూమి తత్త్వం (Earth Element) – స్థిరత్వం ఇచ్చే ఆహారం*  

ఈ తత్త్వం శరీరానికి బలం, స్థిరత్వం, నిర్మాణం ఇస్తుంది. అన్నం, గోధుమ, రాగి, జొన్న, బంగాళాదుంప, వేరుశనగ వంటి భూభాగంలో పెరిగే ఆహారాలు ఇందులోకి వస్తాయి. వీటివల్ల శరీరానికి శక్తి, బలం, నిండిన అనుభూతి కలుగుతుంది. అధికంగా తీసుకుంటే బరువు పెరుగుతుంది, కాబట్టి పరిమాణం ముఖ్యం.

2) *నీటి తత్త్వం (Water Element) – శరీర ద్రవాల సమతుల్యం*  

శరీరానికి హైడ్రేషన్ ఇచ్చే అన్ని ఆహారాలు ఈ తత్త్వంలో పడతాయి. నీరు, మజ్జిగ, పండ్ల రసాలు, కీరా, పుచ్చకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. ఈ తత్త్వం రక్త ప్రసరణ, చర్మ కాంతి, జీర్ణం కోసం అవసరం. తక్కువైతే డీహైడ్రేషన్ వస్తుంది.

3) *అగ్ని తత్త్వం (Fire Element) – జీర్ణశక్తి + వేడి*  

ఈ తత్త్వం శరీరంలో జీర్ణశక్తి, శక్తి ఉత్పత్తి మరియు ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. మిరపకాయ, అల్లం, మసాలాలు, తేనె, కుంకుమపువ్వు వంటి పదార్థాలు అగ్ని తత్త్వాన్ని పెంచుతాయి. ఇవి శరీరాన్ని తేలికగా ఉంచుతాయి మరియు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. ఎక్కువైతే వేడి, యాసిడ్ సమస్యలు వస్తాయి.

4) *గాలి తత్త్వం (Air Element) – కదలిక, ఊపిరితిత్తుల శక్తి*  

ఈ తత్త్వం మనం ఊపిరి పీల్చే విధానం, రక్త ప్రసరణ, శరీర చలనం మీద ప్రభావం చూపుతుంది. ఆకుకూరలు, మొలకలు, తేలికపాటి పండ్లు, వేపిన శెనగలు, కందిపప్పు వంటి పదార్థాలు గాలి తత్త్వాన్ని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని తేలికగా, చురుకుగా ఉంచుతాయి. ఎక్కువైతే గ్యాస్, ఊబకాయం, నరాల బలహీనత వస్తాయి.

5) *ఆకాశ తత్త్వం (Space Element) – శరీర ఖాళీల నియంత్రణ*  

శరీరంలో స్థలం, ఖాళీలు, మానసిక స్థిరత్వం ఈ తత్త్వం మీద ఆధారపడి ఉంటాయి. కొబ్బరి నీరు, తేలికపాటి పండ్లు, మిలెట్స్, కీరా, బాదం, వాల్‌నట్స్ ఆకాశ తత్త్వాన్ని సమతుల్యం చేస్తాయి. ఇవి మనసును ప్రశాంతం చేస్తాయి. అధిక ఆకాశ తత్త్వం ఆకలి తగ్గడం, బలహీనతకు దారితీస్తుంది.

6) *పూర్ణాన్నాలు పంచభూతాల సమతుల్యాన్ని ఇస్తాయి*  

బియ్యం, రాగి, జొన్న, క్వినోవా, ఓట్స్ వంటి పూర్ణ ధాన్యాలు ఐదు తత్త్వాల్లో బ్యాలెన్స్ కలిగిస్తాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి మరియు నిద్రమత్తు లేకుండా శక్తినిస్తాయి.

7) *పండ్లు – నీరు + గాలి తత్త్వాల ఆధారం*  

పండ్లలో నీరు అధికం, తేలికగా జీర్ణమయ్యేవి. కాబట్టి ఇవి నీరు, గాలి తత్త్వాల సమతుల్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ రెండు రకాల పండ్లు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి.

8) *కూరగాయలు – గాలి + భూమి తత్త్వాలు*  

పచ్చి కూరలు గాలి తత్త్వాన్ని పెంచుతాయి, వేరుజన్య కూరగాయలు భూమి తత్త్వాన్ని పెంచుతాయి. రెండు రకాలూ శరీరానికి అవసరం. ఇవి శరీరానికి విటమిన్లు, మినరల్స్ అందిస్తాయి.

9) *పప్పులు – భూమి + అగ్ని తత్త్వాలు*  

పప్పులు బలం, ప్రోటీన్, జీర్ణశక్తి ఇస్తాయి. అధిక అగ్ని తత్త్వం ఉన్నవారికి తక్కువగా తినటం మంచిది. శాకాహారులకి ఇది ప్రధాన ప్రోటీన్ వనరు.

10) *పాలు – భూమి + నీటి తత్త్వాలు*  

పాలు శరీరానికి చల్లదనం, బలం ఇస్తాయి. రాత్రి గోరు వెచ్చని పాలులో తుమ్మెర కలిపితే అగ్ని తత్త్వం కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఇది నిద్రను మెరుగుపరుస్తుంది.

11) *మసాలాలు – అగ్ని తత్త్వాన్ని పెంచేవి*  

మసాలాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి మరియు జీర్ణక్రియను చురుకుగా చేస్తాయి. కానీ ఎక్కువైతే ఆమ్లత్వం వస్తుంది కనుక పరిమాణం ముఖ్యం.

12) *కొబ్బరి – నీరు + ఆకాశ తత్త్వాలు*  

కొబ్బరి నీరు, కొబ్బరి పాలు శరీరానికి చల్లదనం, తేలికనిచ్చే ఆహారం. ఇది శరీర వేడి తగ్గించి నాడీవ్యవస్థను ప్రశాంతం చేస్తుంది.

13) *నూనెలు – భూమి + అగ్ని తత్త్వాలు*  

తక్కువ మోతాదులో నూనె శరీరానికి అవసరం. నూనెలో ఉన్న భూమి + అగ్ని తత్త్వాలు కీళ్ళను లూబ్రికేట్ చేస్తాయి. అధికంగా తీసుకుంటే అగ్ని తత్త్వం పెరిగి acidity, బరువు పెరుగుదలకు దారితీస్తుంది.

14) *ప్రోటీన్ ఫుడ్స్ – భూమి తత్త్వం బలోపేతం*  

పప్పు, పాలు, గుడ్లు, చేపలు వంటి ఆహారం శరీర నిర్మాణానికి అవసరం. ఇవి పెరుగుదల, మరమ్మత్తు, బలం కోసం ముఖ్యమైనవి.

15) *మిలెట్స్ – పంచభూతాల సమతుల్యం*  

జొన్న, రాగి, కొర్ర వంటి మిల్లెట్స్ శరీరానికి బలం, నీరు, శక్తి అన్నిటినీ సమతుల్యం చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరం.

*ముగింపు:*  

పంచభూతాలను అర్థం చేసుకుని ఆహారాన్ని ఎంచుకోవడం ఆరోగ్యం కోసం చాలా కీలకం. శరీరంలో భూతాలు బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడు జీర్ణం మెరుగుపడుతుంది, నిద్ర బాగుంటుంది, రోగాలు దూరంగా ఉంటాయి. ప్రతి రోజు భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం తత్త్వాలు ఉన్న ఆహారం తీసుకుంటే జీవితం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటుంది.

పంచభూతాలు

మార్పుకు భయపడకూడదు

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥 *మనము మార్పుకు భయపడకూడదు.. ప్రతిఘటించకూడదు.. మనము ఉన్నచోట చాలా సురక్షితముగా ఉందని భావించవచ్చు.. మనం దాని నుండి బయటకి రాకపోతే వేరే ప్రపంచం ఒకటి ఉందని, మనం దానిని కోల్పోతున్నామని మనకు ఎప్పటికీ తెలియదు..చిన్న తనంలో దేనినైనా పట్టుకుని నిలబడాలి.. పెద్దయ్యాక దేనినైనా తట్టుకొని నిలబడగలగాలి.. నీ జీవితాన్ని మార్చేది నీవు పడే కష్టం కాదు నీ ఆలోచన*🔥 పక్క వ్యక్తి జీవితంలోకి తొంగి 

 చూసి పది తప్పులు వెతికే మనం మన జీవితంలో 100 తప్పులు ఉన్నాయని విషయాన్ని గాలికి వదిలేస్తాం... గర్వం ఏ విషయానికైనా సంబంధించినదైతే అది కూడిపోతుంది.. అది శరీరానికి కావచ్చు.. లేదా ధనానికి కావచ్చు.. అందమైన జీవితానికి ఒకటే సూత్రం.. మన వలన ఎవరికి బాధ, వ్యధ, కష్టం కలపకుండా ఉండటమే🔥🔥మీ *అల్లం రాజు భాస్కర శర్మ శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజెన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి. 

22, నవంబర్ 2025, శనివారం

నేను

 నేను

మనసును మదించి అడిగాను నేను ఎవరు అని

శరీరమా అహంకారమా అభిమానమా ఎవరు నేను మనసును అదుపు ఉంచి ధ్యానించాను

 నేను ఎవరు అని 

చీకటి వెలుతురు సమ్మేళనం అంతా శూన్యం

 ఈ జన్మలో తెలియదు నేను ఎవరు అని 

వచ్చే జన్మలో తెలియదు నేను ఎవరు అని

 తెలియని దానికోసం వెతుకులాట

 వృధా ప్రయాస

 భగవంతుని చేరువ కోసం చేసే ప్రయాసే జీవిత లక్ష్యం

 అదే జీవిత పరమార్ధం 

సి శారద

పంచాంగం

చమత్కారం

 చమత్కారం అంటే ఏమిటి?

ఓ విషయం చెబితే " ఇదేమిటి, అదెలా, అలా ఎలా " అని ఉత్సుకత కలిగించాలి. దీనిలో ఏదైనా మతలబు ఉందా అనిపించాలి. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత కలిగించాలి. విషయం అలా చెప్పడం చమత్కారం అంటారు.

 ఓ గ్రామం లో సర్వమంగళశాస్త్రి గారని ఓ వేదపండితుడు ఉండేవారు. వారి మనుమడికి ఉపనయనం చేస్తూ ఆహ్వానపత్రికలో 

" మా మనుమడి ఉపనయనానికి మీరందరూ విచ్చేసి వటువుని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలెను.

 భోజనాల తరువాత నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా వీక్షించి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాను " 

అని వ్రాసారు; అందరికీ ఆశ్చర్యం వేసింది --

 మనుమడికి

వడుగు వరకు సరే, 

ఈయనకు మళ్ళీ  

వడుగు ఏమిటీ అని.

సరే ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తితో మొత్తం బంధువులందరూ వచ్చేసారు. భోజనాలయాయి. శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు, బంధువులు, అతిధులు ఎదర చాపలమీద ఆశీనులయారు.

శాస్త్రిగారి భార్య ఓ చిన్న అందమైన పెట్టె తెచ్చి శాస్త్రిగారికి ఇచ్చారు. ఆయన ఆ పెట్టె మెల్లిగా తెరచి అందులోనుంచి ఓ కళ్ళజోడు తీసారు.

అందరికీ చూపెట్టి " నాకు చత్వారం వచ్చింది. ఈ మధ్యనే, డాక్టర్ గారు ఈ కళ్ళజోడు పెట్టుకోమన్నారు. ఈరోజు ముహూర్తం బాగుందని పెట్టుకుంటున్నాను. మీరందరూ నా ఈ ఉప_నయనం ( నయనం అంటే కన్ను, ఉప అంటే దగ్గరగా ఉండేది ) కార్యక్రమం కూడా చూసి వెడుతూన్నందుకు ధన్యవాదాలు " అని అది పెట్టుకున్నారు.

లేచామా, తిన్నామా, టీవీ ఫోన్ చూసినామా, పడుకున్నామా అనికాకుండా ప్రతీ పనిలోనూ హాస్యాన్ని ఆస్వాదించాలి.

🙏😀శుభమస్తు

ప్రశ్నాపత్రం

ప్రశ్నాపత్రం నిర్వహణ చేరువేల భార్గవ శర్మ ఈ క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క దానికి నాలుగు సమాధానాలు ఉన్నాయి సరియైన దానిని ఎంచుకోండి 

1. ఈ క్రింది వాటిలో చాయాగ్రహం ఏది

Aచంద్రుడు

Bబుద గ్రహం

Cరాహువు

Dకుజుడు

2. దిక్పాలకులు ఎంతమంది

Aఏడు

B తొమ్మిది 

C ఎనిమిది

 D నాలుగు

3. ముందు కాలాలలో జరిగే వాటిని గురించి తెలిపే పురాణం ఏది

A పద్మ పురాణం

 B కార్తీక పురాణం

 C మార్కండేయ పురాణం

D భవిష్య పురాణం

4.  ఈశ్వరుని ఆత్మ లింగం ఉన్న క్షేత్రం ఏది

A కర్ణాటకలోని మురుడేశ్వరం.

B శ్రీశైలంలోని శివలింగం

C త్రయంబకేశ్వరం లోని శివలింగం 

D. నాసిక్ లోని శివలింగం

4. రామాయణంలో ధర్బలతో జన్మించిన వాడు ఎవడు

A లక్ష్మణుడు 

B లవడు 

C కుసుడు 

D రావణాసురుడు

5. మన శాస్త్రాల ప్రకారము భూమిమీద ఎన్ని జీవరాసులు ఉన్నాయి

A 82 లక్షలు

B 83 లక్షలు

C 84 లక్షలు 

D 95 లక్షలు

6. మనం తినే ఆహారంలో జీవపదార్థం కానిది ఏది

A పెరుగు

B లవణము

C కారము

 D. మామిడికాయ

7. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఈ మొక్క ఉండాలని అంటారు

A. దర్భ

B. గంజాయి

c. తులసి

D. మల్లె

8. ఉపనిషత్తుల సారం అని దీనిని అంటారు

A. భారతం

B. రామాయణం

C. భగవద్గీత

D. ప్రశ్న ఉపనిషత్తు

9. పుష్పాల గురించి రాసిన కవి పేరు ఏమిటి

A. శ్రీ శ్రీ

B. ఉషశ్రీ

C. కరుణశ్రీ

D. పానుగంటి లక్ష్మీనరసింహారావు

10. కంసాలి వారు బంగారాన్ని కరిగించే ద్రావకంలో ఇవి ఉంటాయి

A. సెల్ఫీ రిక్ ఆసిడ్ నైట్రిక్ యాసిడ్

B. హైడ్రోక్లోరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్

C. సెట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్

D. బెంజోయ్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్

ఈ ప్రశ్న పత్రాన్ని  పూరించి మీ జవాబులను కామెంట్ల రూపంలో పెట్టగలరు.

పంచాంగం

శ్రీ కళ్యాణవేంకటేశ్వర ఆలయం:

 🕉 🕉

🔅 చిత్తూరు జిల్లా : శ్రీనివాసమంగాపురం 

🔅 శ్రీ కళ్యాణవేంకటేశ్వర ఆలయం: 

     శ్రీనివాస మంగాపురం:

👉 శ్రీనివాస మంగాపురం తిరుపతి కి 12 కి.మీ. దూరంలో ఉంది. 

ఇక్కడ శ్రీ కళ్యాణవేంకటేశ్వరస్వామి వేంచేసి ఉన్నారు.

🔅 స్వామివారికి ఆ పేరు ఎందుకు వచ్చింది ? 

👉తిరుమలలో శ్రీవారి పాదాల వద్ద ప్రవహించే నది " విరజా నది" . ఆ నది తిరుమల గిరుల నుండి ప్రవహించి కిందకు వచ్చాక రెండుగా చీలిపోతుంది . అవే స్వర్ణముఖి మరియూ కల్యాణి.

ఇతిహాసాల, పురాణాల ప్రకారం స్వామి నారాయణవనం లో కళ్యాణం చేసుకొని, 

శాస్త్రప్రకారం పెళ్లయిన దంపతులు ఆరు నెలలపాటు కొండలు ఎక్కడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కూడదని అగస్త్యమహర్షి చెప్పడంతో తిరుమల కొండ మీద వెలసే ముందు పద్మావతి అమ్మవారితో ఇదే కల్యాణి నది ఒడ్డున 6నెలల పాటు కాపురం చేసాడు...కనుకనే కల్యాణవేంకటేశ్వర స్వామి అనే సార్థక నామధేయం వచ్చింది; ఇక్కడి స్వామిని దర్శిస్తే యువతి యువకులకు పెళ్లిళ్లు అవుతాయి అనే నమ్మకం వల్ల కల్యాణ వేంకటేశ్వరస్వామి అని వ్యావహారిక నామధేయం వచ్చింది .

👉 ఇక్కడి స్వామి వారి విగ్రహం ముమ్ముర్తుల తిరుమల శ్రీవారిని పోలి ఉంటుంది మరియు ఇక్కడి మూలవిరాఠ్ తిరుమలలోని మూలవిరాఠ్ కన్నా పెద్దది. తిరుమలో జరిగే అన్ని పూజాదికాలు ఇక్కడ కూడ జరుగుతాయి. ఇక్కడ భక్తుల తాకిడి అంతగా లేనందున ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు.

 పాకాల -- తిరుపతి రైలు మార్గంలో శ్రీనివాసమంగాపురం వద్ద గతంలో రైల్వే స్టేషన్ వుండేది. ఆ దారిన వచ్చే భక్తులు అందరు శ్రీనివాసమంగాపురంలొ దిగి అక్కడి స్వామి వారిని దర్శించుకొని 

ఇక్కడికి దగ్గరలోని తిరుమల కొండల పాధ భాగాన వున్న శ్రీవారి మెట్టు వద్దకు వెళ్లి అక్కడి నుండి ప్రారంబమౌ నూరు మెట్ల దారి గుండా తిరుమలకు వెళ్లెవారు. తిరుపతిలోని అలిపిరి వద్దనున్న మెట్ల దారికంటే ఈ మెట్ల దారి అతి దగ్గర. 

👉 ఈ ఆలయాన్ని 16వ శతాబ్ధంలో తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడు తాళ్లపాక చినతిరుమలయ్య పునరుద్ధరించారు.

👉ఈ క్షేత్రానికి ఎక్కువగా అవివాహితులు తమ తల్లిదండ్రులతో కలిసివచ్చి కల్యాణోత్సవం చేయిస్తుంటారు.

చివరలో అర్చకులే ఇచ్చే ‘‘కల్యాణకకంణం’’ ధరించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ కారణంగానే ఈ ఆలయంలో రోజూ ఎంతోమంది యువతీ యువకులు తమ తల్లిదండ్రులతో కలిసి కల్యాణోత్సవం చేయిస్తుంటారు. తిరుమల క్షేత్రానికి వెళ్లలేనివారు ఇక్కడే స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. 

👉తిరుమలలో శ్రీవారికి నిర్వహించే అన్ని అర్జితసేవలు ఇక్కడ కూడా నిర్వహిస్తుంటారు.

ఎన్నో వ్యవయప్రయాలకు ఓర్చి రోజుల తరబడి ఎదురు చూసినా తిరుమలలో క్షణకాంల శ్రీనివాసుడి దర్శనభాగ్యం కలిగితే అదే మహాభాగ్యంగా భక్తులు భావిస్తుంటారు. ఆ లిప్తపాటు దర్శనానికి వెళ్ళలేనివారు ఇక్కడ స్వామివారిని తనివితీరా ఎక్కువసేపు దగ్గరగా దర్శించుకుని తృప్తిపొందుతారు.

 ఈ క్షేత్రానికి దగ్గరలోనే శ్రీనివాసుడు తిరుమల కొండకు నడిచి వెళ్ళిన శ్రీవారిమెట్లు కలవు. 

👉యోగం, భోగం, వీరం, అభిచారిక అనే నాలుగురకాల మూర్తుల్లో ఏదో ఒక మూర్తిని వైష్ణవాలయాలలో ప్రతిష్టిస్తారు. కాని తిరుమల శ్రీవేంకటేశ్వరుడు స్వయంభువు కాబట్టి శ్రీనివాసుడు ఈ రూపాలకు అందనివాడూ, అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన విగ్రహం ఏ శాస్త్రాలకు అందని అర్ఛావతారం. శ్రీనివాస మంగపురంలో శ్రీనివాసుడు కూడా అర్ఛావతార స్వరూపుడే.

👉తిరుమలకు వెళుతూ శ్రీనివాసుడు తన భక్తులకు రెండువరాలు ప్రసాదించాడని చెబుతారు. తిరుమలకు వచ్చి తనను దర్శించుకోలేని భక్తులకు శ్రీనివాసమంగాపురంలో అర్చావతార స్వరూపంతో దర్శనభాగ్యం కల్పిస్తాననీ, పద్మావతీదేవిని పరిణయమాడిన వెంటనే తాను విడిది చేసిన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి సకల శుభాలు, పెళ్లికానివారికి కల్యాణ సౌభాగ్యాన్ని అనుగ్రహించినట్లు చెబుతారు.

👉కాంచీపురంలో ఉన్న సుందరరాజస్వామి అనే అర్చకునికి స్వామికి కలలో కన్పించి తాను శ్రీనివాసమంగాపురంలో ఉన్నానని తనుకు పూజాదికాలు నిర్వహించమని చెబుతారు. అప్పటినుండి మళ్లీ ఆలయం కళకళలాడుతుంది. ఆయనకు స్వామివారు కలలో కనిపించిన రోజున సాక్షాత్కార వైభవోత్సావాన్ని మూడురోజుల పాటు జులై మాసంలో వైభవంగా నిర్వహిస్తుంటారు.

బ్రహ్మోత్సవాలు : తిరుమలలో లాగానే ఇక్కడకూడా ఏటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. ధ్వజారోహణంతో మొదలై తొమ్మిదిరోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 

స్వామివారు తిరుమలకు వెళుతూ దగ్గర్లోని సువర్ణముఖీ నదిలో అగస్త్య మహాముని ఆశ్రమంలో పెట్టిన పాదాన్ని భక్తులు "విష్ణుపాదం" గా కొలుస్తుంటారు.

అన్నమయ నిత్యం తన ఇంట్లో పూజించే అలమేలు మంగ , శ్రీనివాస విగ్రహాలు ఎవరో దొంగిలించి పోయ్యారు.

 అయితే ఇది అన్నమయ జీవితం లో 5 సార్లు జరిగినట్టు చరిత్ర చెప్తోంది .

ఒకసారి హనుమ , ఒకసారి గరుడ , ఒకసారి విశ్వసేన , ఒకసారి పూరీ జగన్నాద స్వామి ,ఒకసారి శ్రీవారి అనుగ్రహం తో అన్నమయ వద్దకు వచ్చాయి .

👉ఇప్పటికీ వారు పూజించిన విగ్రహాలు శ్రీనివాస మంగాపురం లో చూడవచ్చు