28, నవంబర్ 2025, శుక్రవారం

మదురై మీనాక్షిదేవి కోవెల..!!

మదురై మీనాక్షిదేవి కోవెల..!!

మీనాక్షి- మీనముల వంటి

కనులు కలిగినది మీనాలు నిద్ర పోవు. 


శక్తి రూపమైన మీనాక్షి దేవి తన కంటి రెప్పలు మూసుకున్న మరుక్షమణమే యీ అండ పిండ బ్రహ్మాండములోని చరా చరములు నశిస్తాయి. అటువంటి దుస్థితి యీ లోకానికి ఏర్పడకుండా వుండడం కోసమే మీనాక్షి దేవి కంటి రెప్ప మూయకుండా 

సకల ప్రపంచాన్ని కాపాడుతున్నది.

మదురై నగర అధిదేవత

మీనాక్షి దేవి . ఆదేవత రెప్ప వేయకుండా కాపాడుతుండడం వలనే, 

మదురై ప్రజలు రాత్రనక , 

పగలనక కష్టపడి పనిచేస్తారు.

మదురైని నిద్రపోని నగరంగా పిలుస్తారు. అత్యంత ఆశ్చర్య కరమైన

అధ్యాత్మికాద్భుతాలతో నిండి వున్న ఆలయంగా మదురై మీనాక్షి దేవి ఆలయం ప్రఖ్యాతి గాంచింది.

పది హేడు ఎకరాల స్ధలంలో ఈ బ్రహ్మాండమైన ఆలయం నిర్మించబడినది. ఈ ఆలయం ఆది కాలంలోనే ఇంద్రునిచే నిర్మించబడినది. 

వృత్తాసురుని వధించిన

ఇంద్రునికి బ్రహ్మ హత్యా

పాతకం చుట్టుకున్నది. ఆ దోషంనుండి విముక్తి పొందడానికి ఇంద్రుడు కదంబవనంగా వున్న యీ దివ్య స్ధలంలో వెలసిన స్వయంభూ సుందరేశ్వరుని పూజించి తరించాడు.

ఇంద్రుడే యీ దేవాలయాన్ని నిర్మించినట్లుగా 

తిరువిళయాడల్ పురాణం తెలియ పరుస్తోంది. మలయధ్వజుడనే మహారాజు సంతానం కోసం

పుత్రకామేష్టి యాగం చేశాడు. మలయధ్వజుడి భార్య అయిన కాంచనమాల అంబిక కి పరమ భక్తురాలు , పూర్వ జన్మలో అంబికనే తన పుత్రికగా కావాలని కోరుకుంది. ఆవిడ కోరికను తీర్చడానికి అంబిక ఆ యాగ గుండము 

నుండి మూడుసంవత్సరాల బాలికగా ఆవిర్భవించింది. 

అప్పుడు కాంచనమాలకి

పోయిన జన్మలో శ్యామలాంబిక తనకు యిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. వరప్రసాదంగా లభించిన ఆ పుత్రికకు శ్యామల అనే పేరుతో అపురూపంగా పెంచారు.

కొడుకేలేని కారణంగా ఆ పుత్రికనే పుత్రుడుగా భావించి, సకల శాస్త్రములు , విద్యలు

నేర్పించారు. ఆ బాలిక యవ్వనవతి అయినది.

తమ పుత్రిక అతిశయంగా మూడు వక్షోజాలుకలిగి వుండడం చూసిన కాంచనమాల దిగ్భ్రాంతి చెందినది.

భగవంతుడు ఇచ్చిన సంతానసంపద , అంబికే పుత్రికగా జన్మించినదని సంతోషిస్తున్త తరుణంలో యీ విపరీతం ఏమిటని భార్యా భర్తలుచింతిస్తూండగా 

ఒక అశరీరవాణి

వినిపించింది. " రాజా ! విచారించకండి, ఎప్పుడైతే మీ పుత్రిక తన కాబోయే భర్తని చూస్తుందో, అప్పుడు మూడవ స్ధనం మాయమై పోతుంది " అని పలికింది.

తమ చింత తీరినందుకుభార్యా భర్తలు ఇద్దరూసంతోషించారు.

మలయధ్వజుడు తన తదనంతరం మీనాక్షిని పాండ్య రాజ్యానికి

రాణిని చేశాడు. శ్యామల 

ఎంతో భాధ్యత గా కంటికి రెప్ప వేయకుండా తన ప్రజలను ,మదురై ని

కాపాడుతూ రాజ్యం చేసినందున , ఆమెను "మీనాక్షి" అనే పేరుతో ప్రజలంతా పిల్చుకోవడం మొదలుపెట్టారు. 

ఆ తరువాత శ్యామల అని పెట్టిన పేరు మీనాక్షి దేవిగా మారింది. మీనాక్షి స్త్రీయేయైనా ఎంతో దక్షతతో సమర్ధవంతంగా పురుషులకు సమానంగా , ప్రజా రంజకంగా రాజ్యపాలన చేసింది.

ఈ నాటికీ, తమిళనాడులో గృహిణి ఆధిక్యత వున్న ఇంటిని'మదురై' అని కీర్తించి చెప్తున్నారంటే, మీనాక్షి దేవి పరిపాలన ఎంత విశిష్టంగా వుండేదో అర్ధమవుతుంది.  

తల్లి తండ్రుల మరణానికి

ముందే, చాలా చిన్న వయసులోనే పాండ్యరాజ్యాన్నేలింది.

భూలోకంలోని రాజులెందరితోనో పోరాడి విజయం పొందింది.

దేవతలు కూడా మీనాక్షి శక్తిసామర్ధ్యాలకు తలవంచారు.

చివరికి దేవతల తరఫున

వచ్చిన ఈశ్వరుని కూడా మీనాక్షి ఎదిరించింది. శివుని చూడగానే ఆమె యొక్క మూడవ

స్ధనము మాయమైపోయింది.

మీనాక్షి సుందరేశ్వర రూపంలో వున్న పరమేశ్వరుడిని వరించింది.

తరువాత, మీనాక్షి సుందరేశ్వరుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 


మహారాజుగా సుందరేశ్వరుడు, మహారాణిగా మీనాక్షి అనుగ్రహించిన స్ధలమే మదురై.

ఈ సంఘటనలన్నీ దృశ్యాలు గాను అష్టశక్తి మండపంలో వర్ణచిత్రాలుగానూ చిత్రీకరించబడి వున్నాయి.

మదురై మీనాక్షి దేవాలయంలో 

ఆగమశాస్త్రముల ప్రకారం

అష్టకాలపూజలు జరుగుతాయి.

ప్రతి నెలా ఎన్నో రకాల ఉత్సవాలు

జరగడమే ఈ ఆలయ

ప్రత్యేకత. అందులో ముఖ్యంగా చెప్పబడేది చిత్తిర తిరువిళా. 

ఈ ఉత్సవం చైత్రమాసం శుక్లపక్షములోతొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా జరుగుతుంది.

మొదటి రోజు ధ్వజారోహణ. 

తరువాత ప్రతి రోజూ 

మీనాక్షి, సుందరేశ్వరులను పలు వాహనాల మీద ఊరేగిస్తారు.

ఎనిమిదవ రోజు మీనాక్షీదేవి కి పట్టాభిషేకం. ఆ రోజు సాయంకాలం , అమ్మవారి సన్నిధిలోని ఉత్సవ విగ్రహానికి, పట్టు వస్త్రాలు ఆభరణాలు ధరింపచేస్తారు.

మహారాణులు ధరించే కిరీటాన్ని అలంకరిస్తారు. నివేదన చేసి పూజలు చేస్తారు. తరువాత , ఆలయ ధర్మ కర్తలు, అర్చకులు శివాచార్యులవారు 

సుందరేశ్వరుల సన్నిధికి

వెళతారు. 

స్వామి సన్నిధిలో ని నవరత్న ఖచితమైన రాజ దండాన్నిమేళ తాళాలతో , తీసుకుని వచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందు పెడతారు.

 ఇదే అమ్మ వారి పట్టాభిషేక మహోత్సవం. (ఆ రోజు నుండి, నాలుగు మాసాలు చైత్రం, వైశాఖం, 

జ్యేష్టం, ఆషాఢం మాసాలు మీనాక్షి దేవి పరిపాలనగా చెప్తారు.)

శ్రావణమాసం మూలా నక్షత్రం నాడు సుందరేశ్వరస్వామి పట్టాభిషేకం జరుపుతారు. 

అదే నెలలో తొమ్మిదవ రోజున మీనాక్షిసుందరేశ్వరుల

వివాహమహోత్సవాన్ని కన్నులపండువగా మహావైభవంగా జరుపుతారు.,

పంచాంగం

 


బలవంతుడిననో, ధనవంతుడిననో,

 నాకు యెదురు లేదు నరులందు ననబోకు

నాల్గు దినము లుండు నరుడు నీవు

మంచి పంచి బతుకు మదిలోన నిలిచేవు

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఓ మానవులారా! ఈ లోకంలో ఎవ్వరూ కూడా నేను చాలా బలవంతుడిననో, ధనవంతుడిననో, రాజకీయంగా, ఉద్యోగ పరంగా గొప్ప అధికార హోదా ఉందనో, మదమెక్కి, ఇతరులను హీనంగా తక్కువ చూపు చూస్తూ, కొవ్వెక్కిన మాటలాడుతూ ఉండకూడదు! ఈ భూమి మీద ఎవ్వరూ కూడా శాశ్వతంగా జీవించి ఉండిపోరు, అలాగే ఎప్పుడూ ఒకే విధంగా ఉండరు! ఒకరిని మించిన వారు ఒకరు వస్తూనే ఉంటారు, స్ధితులు, పరిస్థితులు మార్పుకు గురౌతూనే ఉంటాయి! మన డబ్బూ, పదవీ, అధికారం ఏ క్షణమైనా మన వదిలి పోవచ్చు! అలాగే ఎప్పుడు ఎవరము పోతామో ఎవరికీ తెలియదు! పోయేలోపు పదిమందితో మంచిగా ఉంటూ, మంచి పనులు చేస్తూ పోవాలి! మనం పోయాక మన కుటుంబానికి మంచి పేరుని, గౌరవాన్నీ ఇచ్చి పోవాలి! మనం మంచిగా పది మంది మనసులో నిలిచి పోవాలి! అంతే గానీ పదిమందిలో వెధవ అనిపించుకొని పోకూడదు! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(

27, నవంబర్ 2025, గురువారం

పక్షి ప్రకరణం*

 *పక్షి ప్రకరణం* 

               ➖➖➖✍️

 ```

శ్రీ TN శేషన్ గారు భారత దేశ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆయన తన భార్యతో కలిసి పిక్నిక్ కోసం ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణిస్తున్నారు. 


దారిలో పిచ్చుక గూళ్ళతో నిండి సందడిగా ఉన్న ఒక పెద్ద మామిడి తోటను వాళ్ళు చూశారు. 


వాటిని చూసి ముచ్చట పడిన శేషన్ గారి భార్య ఓ రెండు పిచ్చుక గూళ్ళను ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంది. 


ఆమె అడిగిందే తడవుగా, పొలాల్లో ఆవుల్ని మేపుతున్న ఒక బాలుడ్ని పోలీసుల ఎస్కార్ట్ పిలిచి, గూళ్ళను దించాలని డిమాండ్ చేశారు. 


పిచుక గూళ్ళను తీసినందుకు 10 రూపాయలు చెల్లిస్తామని ఆ పిల్లాడ్ని ఆశ పెట్టారు. 


కానీ ఆ బాలుడు అందుకు ససేమిరా అన్నాడు,

వారి ఆదేశాన్నినిరాకరించాడు. 


దీనితో మరి కొద్దిగా రేటు పెంచి 50 రూపాయలు ఇస్తామని శేషన్ బాలునితో అన్నారు.


శేషన్ పెద్ద అధికారి కావడంతో పోలీసులు బాలుడ్ని పిచ్చుక గూళ్ళు చెట్టు పైనుంచి దింపమని వత్తిడి చేయడం మొదలు పెట్టారు. ఒక దశలో వారి బలవంతపు ప్రయత్నం ఆదేశంలా మారిపోయింది. 


ఆ బాలుడు శేషన్, అతడి భార్యతో ఇలా అన్నాడు... “మీరు 50 రూపాయలే కాదు. ఎంత ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లోను పిచుక గూళ్ళను తీసి ఇవ్వలేను సాబ్ జీ! నాకు మీ పైసలు అక్కర్లేదు.” అంటూ ఎంతో ధీమాగా చెప్పాడు. 

అంతే కాకుండా “ఆ పిచుక గూళ్ళను తొలగిస్తే ఆ గూళ్ళ లోపల, పిచ్చుకల పిల్లలు ఉంటాయి, నేను మీకు ఆ గూళ్ళు ఇస్తే అందులో ఉన్న పిచుక పిల్లలు ఏమవుతాయి? అవెక్కడుంటాయి? అలాగే ఈ సాయంత్రం వాటి తల్లి పిచ్చుక తన పిల్లలకు ఆహారం తీసుకు వచ్చినప్పుడు తన పిల్లలు కనిపించకపోతే ఆ తల్లి ఎంతగా తల్లడిల్లిపోతుందో, ఏడుస్తుందో ఆలోచిస్తే నాకే కాదు మీలాంటి సదువుకున్న వాళ్లకు కూడా మాటలు రావు. ఇలాంటి పాపపు పనిచేసి ఇపుడు ఆ తల్లి పిచుకకు, 

ఇంటికెళ్లాక మా అమ్మకు నేను మొహం ఎలా చూపించగలను? ఆ పిచుక పిల్లల, తల్లి బాధ చూడటానికి నాకు గుండె ధైర్యం లేదు.”


ఇది విన్న శేషన్, అతని భార్య షాక్ అయ్యారు. 


‘నా స్థానం, హోదా, నా సర్వీసు, నా చదువు, నా IAS అన్నీ కూడా ఆ ఆవుల్ని కాస్తున్న బాలుని ముందు కరిగిపోయాయి’ అంటూ శేషన్ చెప్పారు. ‘నేను అతని ముందు ఈదురుగాలికి కొట్టుకుపోయే ఆవపిండిలా ఉన్నాను. ఆ బాలుడు నా కళ్ళు తెరిపించాడు. ఫలితంగా మా కోరికను వదులుకున్నాం. తిరిగి వచ్చిన తరువాత, ఈ సంఘటన మమ్మల్ని అపరాధభావంతో రోజుల తరబడి వెంటాడుతూనే ఉంది.’ ‘విద్య యొక్క స్థానం, సాంఘికస్థితి మానవత్వం యొక్క కొలతకు ఎప్పుడూ గజ స్టిక్ (స్కేల్) కానే కాదు’ అనే చావులేని నిజాన్ని జీవితంలో మొదటిసారి, ఏ మహోన్నత గ్రంధాలు రిఫర్ చేయకుండా, ఏ మహాత్ముని బోధలు వల్లెవేయకుండా, సుదీర్ఘమైన జప ధ్యానాలూ చేయకుండా తెలుసుకున్నాను’ అన్నారు.


విజ్ఞానం అనేది ప్రకృతిని తెలుసుకునేందుకు, సమగ్రమైన, మానవ జాతికి, సమస్త ప్రకృతికీ ఉపయుక్తమైన సమాచారాన్ని సేకరించేందుకు, అంతరించని విలువలను తెలుసుకునేందుకు, ఆచరించేందుకు పనికొచ్చే ఒక జ్ఞాననేత్రం లాంటిది! 


ప్రక్కవాడి కొంప కూల్చకుండా, సాటివాడు కూడా సంతోషంగా ఉండేందుకు ఉపయోగపడినప్పుడే అలాంటి జ్ఞాననేత్రానికి ఒక విలువ ఉంటుందని ఆ బాలుడు నాకు ఆచరణలో నేర్పాడు" అని శేషన్ అన్నారు. 


ఆచరణ యోగ్యత లేని జ్ఞానం గురించి ఎంత చెప్పుకున్నా, అవి కేవలం మాటలుగానే మిగిలిపోతాయి. అలాంటి కార్యాచరణ లేని జ్ఞానంతో ఏమి చేసినా ఉపయోగం లేదని, తద్వారా ఏమీ సాధించలేమని పేర్కొన్నారు.✍️`

శివలింగ పూజా సంఖ్యా తత్ఫలం*

 *శివలింగ పూజా సంఖ్యా తత్ఫలం*                        


*శ్లో:ఏకలింగ తథా మోక్షం వ్యాధిరూపం ద్వయం భవేత్ ।।*                           


అర్థం:ఒకే ఒక లింగం ఉంటే అది మోక్షప్రదం అవుతుంది అంటే భక్తునికి శాశ్వత విమోక్షఫలాన్ని ఇస్తుంది.

రెండు లింగాలు ఉంటే అది వ్యాధిరూపం, అంటే శరీర లేదా మనసు సంబంధమైన వ్యాధులను కలిగిస్తుంది.  


*శ్లో:లింగత్రయం తథా కుర్యాత్ భోగమోక్షప్రదాయకమ్।।*


 అర్థం:మూడు లింగములు ఉంటే భక్తునికి భోగమును మరియు మోక్షమును రెండూ ప్రసాదిస్తాయి, అంటే ఈ లోకంలో సుఖ జీవనమూ, పరలోకంలో విమోక్షమూ లభిస్తాయి. 


 *శ్లో:చతుర్లిఙ్గత్తు యత్రైవ తత్ర శ్రీకీర్తిహానిదమ్ ।।*


 అర్థం:నాలుగు లింగాలు ఉంటే అది శ్రీహానికరమనే అర్ధం — ధన, కీర్తి, వైభవ హానిని కలిగిస్తుంది.    


 *శ్లో:పఞ్చలిఙ్గమితి శ్రేష్ఠం పఞ్చపాతకనాశనమ్।*


 అర్థం:ఐదు లింగములు అత్యంత శ్రేష్ఠమైనవి. అవి పంచమహాపాతకములు నశింపజేస్తాయి — అంటే అత్యంత దుష్కర్మాలను కూడా నాశనం చేస్తాయి.  


 *శ్లో:షష్ఠశ్చేమార్రణం కుర్యాత్ సప్తమం వైరనాశనమ్ ।।*


 అర్థం:ఆరు లింగములు అయితే మరణాన్ని కలిగిస్తాయి, అనగా ఆయుర్హానిని కలిగించే సూచనం.

ఏడు లింగములు ఉంటే వైరానాశనం, అంటే శత్రువులు నశిస్తారు.       


*శ్లో:అష్టమస్తు మహావ్యాధిరథవా శత్రువర్ధనమ్ ।*        


 అర్థం:ఎనిమిది లింగములు ఉంటే అది మహావ్యాధి (భారీ వ్యాధులు) లేదా శత్రువుల వృద్ధిని కలిగిస్తుంది.        


 *శ్లో:నవలింగ తథా చేష్టా శివలోకే మహీయతే ।*


అర్థం:తొమ్మిది లింగములు ఉంటే ఆ విధమైన పూజ శివలోక ప్రసాదానికి దారి తీస్తుంది, అంటే భక్తుడు శివలోకంలో మహిమతో కీర్తింపబడతాడు.                


 *నవరత్నలింగపూజాఫలం*    


 *చింత్యవిశ్వే*


*శ్లో :మరతకం పుష్టిదం ప్రోక్తం పద్మరాగం ధనార్థినాం।ఆయుష్యం ఋద్ధివైడూర్యం స్ఫటికం పుత్రవర్ధనం॥*

*శ్లో:స్థంభనం పుష్యరాగం స్యాద్రాష్ట్రవశ్యం ప్రవాలకం కర్షణం స్యత్తు వజ్రాఖ్యం మాణిక్యం సర్వసిద్ధిదం॥*

*శ్లో :ఇంద్రనీలంతు మోక్షార్థం రత్నజానాం ఫలం భవేత్॥*


 అర్థం:మరతకం (ఎమెరాల్డ్) — దీన్ని పూజిస్తే శరీరపుష్టి, ఆరోగ్యవృద్ధి వర్తిస్తుంది.

పద్మరాగం (రూబీ రకం) — ధనము, వైభవమును ఇస్తుంది.

వైడూర్యం (క్యాట్స్‌ఐ) — దీర్ఘాయుష్కుని చేస్తుంది, ఐశ్వర్యవృద్ధిని కలిగిస్తుంది.

స్ఫటికం (క్రిస్టల్) — పుత్రప్రాప్తి, సంతానవృద్ధి కలుగుతుంది.

పుష్యరాగం (టోపాజ్) — శత్రు స్థంభన, విఘ్ననివారణం కలుగుతుంది.

ప్రవాలకం (ముత్యపు రంగు రత్నం / కొరల్) — రాజ్యవశ్యము, ప్రజానుకూలత లభిస్తుంది.వజ్రం (డైమండ్) — ఆకర్షణశక్తి, మనోనిగ్రహం, సమస్త సిద్ధి లభిస్తుంది.

మాణిక్యం (రూబీ) — అన్ని సిద్ధులు ప్రసాదిస్తుంది.ఇంద్రనీలం (సఫైర్) — మోక్షప్రాప్తి కలుగుతుంది.                 


*రత్నలింగమానమ్*  


 *శ్లో :అంగుళ్యాది వితస్త్యంతం కుర్యాల్లింగం తు రత్నజమ్ ||*          


 అర్థం: రత్నాలతో తయారు చేయబడిన శివలింగాన్ని ఒక అంగుళం నుండి ఒక జాన (వితిస్తి - సుమారు 9 అంగుళాలు) కొలత వరకు చేయవచ్చు.                 

       

*శ్లో:ఆయామసదృశం నాహం శిరోవర్తనసంయుతమ్ । స్వప్రమాణేన కర్తవ్యం రత్నలింగస్య వీరకా ||* 


అర్థం: ఓ వీరకా! రత్నలింగం యొక్క చుట్టుకొలత (నాహం) దాని పొడవుకు (ఆయామము) సమానంగా ఉండాలి. అది పైభాగంలో వృత్తాకార ఆకారం (శిరోవర్తన) తో కూడి ఉండాలి. ఈ కొలతలను తమ సొంత ప్రమాణం (స్వప్రమాణం) ప్రకారం నిర్ణయించుకోవాలి.


            *సంకలనం*          

     *సింగరాజు బాలసుబ్రమణ్య శాస్త్రి శ్రీకాళహస్తి*

హనుమంతుడు అష్ట సిద్ధుల

  హనుమంతుడు అష్ట సిద్ధులను ఎప్పుడెప్పుడు ఉపయోగించాడు?

హనుమంతుడు తన అష్ట సిద్ధులను శ్రీరామ కార్యం కోసం, నిస్వార్థ సేవ కోసం మాత్రమే ఉపయోగించారు. ఈ సిద్ధులను ఆయనకు సీతామాత వరంగా ఇచ్చింది.


హనుమంతుడు అష్ట సిద్ధులను (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం) ఉపయోగించిన ముఖ్యమైన సందర్భాలు మరియు సిద్ధులు కింద ఇవ్వబడ్డాయి:


# సుందరకాండలో అష్ట సిద్ధుల ఉపయోగం


హనుమంతుడు సీతాదేవిని వెతకడానికి లంకకు వెళ్ళిన సందర్భంలో, అనగా సుందరకాండలో, ఈ సిద్ధులను ప్రధానంగా ఉపయోగించారు.


| సిద్ధుల పేరు | ఆ సిద్ధి అర్థం | ఎప్పుడు ఉపయోగించారు? |


|---|---|---|


| 1. అణిమ | అత్యంత చిన్న అణువులా మారిపోయే శక్తి. | లంకలోకి ప్రవేశించేటప్పుడు: రాక్షస సైనికులకు కనపడకుండా, రహస్యంగా లంక నగరంలోకి ప్రవేశించడానికి హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నదిగా (అణువుగా) మార్చుకున్నారు. |


| 2. మహిమ | శరీరాన్ని అత్యంత పెద్దదిగా విస్తరించగల శక్తి. | లంకలో లంకిణిని ఎదుర్కొన్నప్పుడు మరియు సముద్రాన్ని దాటేటప్పుడు: అసాధ్యమైన సముద్రాన్ని దాటడానికి, అలాగే లంకిణిని (లంకా పట్టణ రక్షకురాలు) ఎదుర్కొన్న తరువాత, తన శక్తిని ప్రదర్శించడానికి తన రూపాన్ని మహత్తుగా (పెద్దదిగా) పెంచారు. |


| 3. లఘిమ | శరీరాన్ని అత్యంత తేలికగా మార్చుకోగల శక్తి. | సముద్రాన్ని దాటేటప్పుడు: భారీ పర్వతాల వలె ఉన్నప్పటికీ, వేగంగా, తేలికగా సముద్రం మీదుగా లంఘించడానికి ఈ శక్తిని ఉపయోగించారు. |


| 4. గరిమ | శరీరాన్ని అత్యంత బరువుగా మార్చుకోగల శక్తి. | లంకలో బంధించినప్పుడు: రావణుడి సభలో రాక్షసులు తనను కదపలేనంత బరువుగా మారడానికి ఈ శక్తిని ఉపయోగించారు. (మహాభారతంలో భీముడి గర్వాన్ని అణచడానికి కూడా ఉపయోగించారు). |


| 5. వశిత్వం | సకల జీవరాశులను మరియు ఇతరులను వశం చేసుకునే లేదా ప్రభావితం చేయగల శక్తి. | లంకా దహనం మరియు సభా సన్నివేశం: రావణుడి సభలో ఉన్నప్పుడు రాక్షసులను తన మాటలకు ప్రభావితం చేయడానికి, అలాగే లంక దహనం సమయంలో అగ్ని శక్తులను నియంత్రించడానికి ఈ శక్తిని ఉపయోగించారు. |


| 6. ఈశిత్వం | ప్రకృతిపై, దిక్పాలకులపై ఆధిపత్యాన్ని లేదా నియంత్రణను కలిగి ఉండే శక్తి. | యుద్ధంలో: వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించడానికి మరియు శత్రువులను శాసించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించారు. |


| 7. ప్రాకామ్యం | తాను కోరుకున్నది సాధించగల శక్తి. | సీతాన్వేషణ మరియు సంజీవని: సీతాన్వేషణలో, అలాగే యుద్ధంలో సంజీవని పర్వతాన్ని తీసుకురావాలనే కోరికను సాధించడానికి ఉపయోగించారు. |


| 8. ప్రాప్తి | ఎక్కడైనా, ఏ వస్తువునైనా తక్షణమే పొందగల శక్తి. | సంజీవని పర్వతం కోసం: అత్యంత వేగంగా ఎక్కడైనా చేరుకోగలిగే శక్తిని ఉపయోగించి ద్రోణగిరి పర్వతాన్ని సులభంగా తెచ్చారు. |


# హనుమాన్ చాలీసాలో కూడా ఈ విషయాన్ని "అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా! ఆస వర దీన్హా జానకీ మాతా!!" అనే పంక్తి వివరిస్తుంది.

🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

మహాభారతం

  🕉️. *🔔మహాభారతం చదువుతున్నప్పుడు ఒక అనుమానం కలుగుతుంది. కురువంశంలో కోడలిగా అడుగుపెట్టిన ఒక్క మహిళైనా సుఖ పడిందా?*


*🔔. సత్యవతీ* *ముందుగా సత్యవతీ దేవితో ప్రారంభిద్దాం. ఒక బెస్తవారింట పెరుగుతూ గంగా నదిని గడవేసి పడవ నడుపుతూ దాటించే శ్రామికురాలు. కురువంశ చక్రవర్తి అయినా శంతన మహారాజు ఆమెను వలచాడు. ఆమె తండ్రి దాశరాజు సత్యవతి కుమారులకే రాజ్యం సంక్రమించే షరతు మీదనే వివాహానికి అంగీకరించాడు. ఆమెకు ఇద్దరు కుమారులు కలిగారు. మొదటివాడు వివాహం కాకుండానే మరణించాడు. రెండవవాడు వివాహమైన కొంతకాలానికి మరణించాడు. ఎంత దుర్భరమైన పరిస్థితి?*


*నిజానికి సత్యవతి బెస్తవారింట పుట్టలేదు. ఆమె తండ్రి ఉపరిచరవసువు ఒక శాపగ్రస్త అప్సరస ద్వారా కన్న కుమార్తె ఆమె. కారణమేమైనా ఆమెను బెస్తవారింట పెంపకానికి ఇచ్చేశాడు. రాజకుమార్తెగా జీవించవలసిన ఆమె మత్స్యకారుల ఇంట్లో పెరిగింది. ఒక మహారాజు భార్య అయినప్పటికీ ఆమె జీవితంలో సుఖసంతోషాలు లేవు. కొడుకులిద్దరూ మరణించారు. ఏ స్త్రీకైనా అంతకన్నా పెద్ద కష్టం ఉంటుందా?*


*అయినప్పటికీ రాజ్యం కోసం కోడళ్లకు నియోగం ద్వారా సంతానం కలిగేలా చేసింది. ఆ సంతానంలో ఒకరు గుడ్డివాడు, మరి ఒకడు పాండు రోగంతో పుట్టాడు. సత్యవతీ దేవి జీవితంలో సుఖమన్నమాట ఉన్నదా?*


*🔔అంబిక, అంబాలిక*

*ఇక రెండవ తరంలోని కోడళ్ళు అంబిక, అంబాలిక. భర్త చిన్న వయసులోనే మరణించాడు. అత్తగారి ఆజ్ఞను అనుసరించి నియోగం ద్వారా పిల్లలను కనవలసి వచ్చింది. సంతానం అనుగ్రహించేది ఎవరో కూడా వారికి తెలియదు. వ్యాస మహర్షిని చూసి వారు భయపడటంలో ఆశ్చర్యమేమున్నది? కలిగిన సంతానమిద్దరూ వికలాంగులు.*


*🔔గాంధారి, కుంతి, మాద్రి.*

*మూడవ తరంలో ఆ ఇంటి అడుగుపెట్టిన కోడళ్ళు గాంధారి, కుంతి, మాద్రి.*

 *భర్త మరణానికి తానే కారణమని నమ్మిన మాద్రి చిన్న వయసులోనే సహగమనం చేసింది. తన పిల్లలను, సవతి పిల్లలను కుంతి పెంచవలసి వచ్చింది. హాయిగా పుట్టింట్లో ఉండి ఆమె పిల్లలను పెంచలేదు. తన అత్తవారింటనే ఉంది. అన్ని రకాల అవమానాలను భరించింది. చివరకు కొడుకులు బిచ్చమెత్తుకుని బతుకుతున్నా కూడా ఆమె చూడవలసి వచ్చింది. ఆ పైన కొన్నాళ్లు వారికి రాజ్యాధికారం ఉంది. ఆ తరువాత అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె అంతఃపురంలో కాకుండా విదురుడింట ఉండవలసి వచ్చింది. కుంతి జీవితంలో సుఖం అన్న మాట ఉన్నదా?*


*గాంధారి మాత్రం ఏం సుఖపడింది?*

*తాను వివాహం చేసుకోబోయేది ఒక అంధుడని కూడా ఆమెకు తెలియదు. భర్తతో సమంగా ఆమె కూడా అంధత్వాన్ని అనుభవించింది. కుమారుల మరణాన్ని చూసింది. అల్లుడి చావును చూసింది. ఆమె పిల్లలను సరిగా పెంచలేదు అని ఈనాడు ఎవరైనా అనవచ్చు కానీ పెంపకానికీ, గుణగణాలకీ సంబంధం ఉన్నదా?*


*కుంతి గురించి చెప్పేటప్పుడు ఎంతసేపూ ఆమె కర్ణుడికి చేసిన అన్యాయం గురించే మాట్లాడుతారు.*

 *ఆమె తన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడింది?*

 *వృష్ణివంశస్థుడు అయిన శూరసేనుడి కుమార్తెగా జన్మించిన ఆమె చిన్న వయసులోనే కుంతి భధ్రుడికి దత్తతగా వెళ్ళింది. దూర్వాసుడిచ్చిన వరాన్ని బాల్య చాపల్యంతో పరీక్షించపోయి కర్ణుడికి తల్లి అయింది. ఆమె పెంపకానికి వెళ్లకుండా సొంత తల్లిదండ్రుల దగ్గరే ఉంటే వారికి విషయం చెప్పుకోగలిగేదేమో. ఈ సంగతి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించి ఉంటారా?*


*నాలుగవ తరంలో ఆ ఇంట అడుగుపెట్టిన ద్రౌపది జీవితంలో కష్టాలను పడడమే కాక లెక్కపెట్టలేనన్ని అవమానాలను అనుభవించింది.*

*నిండు సభలో వస్త్రాపహరణం, పతిత అన్న తిట్లు, నా ఊళ్ళో కూర్చో అన్న సైగ. ఎంత అవమానం అయినప్పటికీ ఆమె ధృతరాష్ట్రుని తన భర్తల బంధవిముక్తిని కోరింది కానీ తన విషయంలో ఏమీ అడగలేదు. అయినా 12 ఏళ్లు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. 13వ ఏట దాసీవృత్తి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా కీచకుడు వంటి వారు ఆమెను మోహించి నానారభస చేశారు. అన్నీ పూర్తి అయి కురుక్షేత్ర సంగ్రామంలో భర్తలు నెగ్గే సమయానికి ఆమె కుమారులను కోల్పోయింది.*


 *అర్జునుడికి మరో భార్య అయిన సుభద్రకు అదే పరిస్థితి. ఏకైక కుమారుడు మరణించాడు. అర్జునుడి మరో భార్య ఉలూపి కుమారుడు మరణించాడు. కౌరవుల భార్యలందరూ భర్తలను కోల్పోయి నిస్సహాయంగా మిగిలారు.*


*ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఉత్తర గురించి.*


*ఆమెను అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు. భర్త సమక్షంలో కొన్ని రోజులు మాత్రమే గడిచి ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ దయవల్ల ఆమె కుమారుడు మిగిలాడు. అంతకుమించి ఆనందమన్నది ఆమెకు తెలియదు.*


*కురువంశం మొత్తానికి ఒకే ఒక్క ఆడపడుచు దుశ్శల.*

 *ఆమె గాంధారి, ధృతరాష్ట్రుల కుమార్తె. సైంధవునితో వివాహమైంది. అటువంటి పరమ దుర్మార్గుడుతో ఆమె కాపురం ఎలా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. అతడు ద్రౌపదీ దేవిని ఎత్తుకొని పోయే ప్రయత్నం చేసాడు. భీమార్జునులు అతనిని బంధించి వెనక్కి తీసుకురాగా చెల్లెలు జీవితం సుఖంగా ఉండాలన్న కోరికతో ధర్మరాజు అతనిని క్షమించి వదిలిపెట్టాడు. కానీ తనకు జరిగిన అవమానం మరిచిపోని సైంధవుడు అభిమన్యుడి చావుకి పరోక్షంగా కారకుడు అయ్యాడు. అర్జునుడి చేతిలో మరణించాడు.*


*కురుక్షేత్ర సంగ్రామం తరువాత దుశ్శల కుమారుడు సురథుడు రాజయ్యాడు. అశ్వమేధ యాగం జరుగుతున్న సమయంలో అర్జునుడు సింధు దేశానికి రాగా సురథుడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు దుశ్శల తన మనవడిని తీసుకుని రణ రంగానికి వచ్చి అర్జునునికి తన కష్టం చెప్పుకుంది. అర్జునుడు ఆ చిన్న పిల్లవాడిని సింధు రాజ్యానికి రాజుగా ప్రకటించాడు.* 


*దుశ్శల జీవితంలో సుఖం కానీ శాంతి కానీ ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా?*


*కురువంశంలో అడుగుపెట్టిన కోడళ్లు అయితేనేమి, ఆ ఇంటి పుట్టిన ఏకైక కుమార్తె దుశ్శల అయితే ఏమి సుఖము అన్నమాట ఎరుగరు.*


*ఇదంతా ఏదో కురువంశంలో మాత్రమే ఆడవాళ్లు కష్టపడ్డారని చెప్పడానికి కాదు.*


 *ఏ స్త్రీ అయినా కష్టం వచ్చినప్పుడు "నాకే ఇలా అయింది ఏమిటి?" అని దుఃఖించకుండా ఉండడానికి మాత్రమే.*


స్వస్తి

🔔🔔🔔🙏🙏🙏

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో 𝕝𝕝      *ఆగమోపః ప్రజా దేశః*

              *కాలః కర్మ చ జన్మ చ* l

              *ధ్యానం మంత్రోఽథ సంస్కారో* 

              *దశైతే గుణహేతవః* ll


తా𝕝𝕝 *ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము - ఈ పదిన్ని వ్యక్తులలోని గుణములకు కారణములగుచున్నవి.....* 


✍️💐🌸🌹🙏

*నిద్ర లేకపోవడం

      *నిద్ర లేకపోవడం*

                ➖➖➖✍️```


"నిద్ర లేకపోవడం".. అనేది మీరు అనుకున్నదానికంటే చాలా ప్రమాదకరం: ఒక కొత్త పరిశోధన ప్రకారం, తగినంత నిద్ర లేనప్పుడు మెదడు దాని స్వంత కణాలు.. తినడం ప్రారంభిస్తుంది. మీరు తగినంత నిద్రపోకపోతే, మీరు ఊహించలేని పరిణామాలకు మీరు ఎదుర్కొంటరు.


నిద్ర లేమి మెదడులోని భాగాలను ఎక్కువగా ప్రేరేపించగలదు మరియు శాశ్వత మెదడు దెబ్బతినడానికి కూడా దారితీస్తుంది,

మెదడు స్వయంగా తినడం యొక్క లక్షణాలు?

తలనొప్పి..జ్వరం.. మెడగట్టి.. ఆకలి.. వాంతులు, మూర్ఛలు,

కోమా.  

ఒత్తిడి మరియు METABOLISM మెదడు కణాలను చంపడానికి మరియు మెదడు పరిమాణాన్ని కూడా తగ్గించడానికి కొన్ని కారణాలు. 


పౌష్టికాహారం కారణంగా మంచి నిద్రను పొందడం ద్వారా మనం మెదడు తినడం మానివేయవచ్చు.

నిద్ర మెరుగుపరచడానికి పడుకునే ముందు కొన్ని ఆహారాలు మరియు పానీయాలు తీసుకోవచ్చు.... 


అది... బాదం, కివి, చెర్రీ,

చేప, అక్రోట్లు, పాలు...

కాబట్టి ఈ గ్లోబలైజ్డ్ జీవితాల్లో నిద్రకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి.


అధిక కొవ్వు పదార్ధాలను పరిమితం చేయండి, హెవీ, స్పైసీ ఫుడ్స్ పట్ల జాగ్రత్త వహించండి, రాత్రి 8 గంటలకు ద్రవాలను తగ్గించండి. విశ్రాంతి తీసుకోవడానికి ధూమపానం చేయవద్దు.


నిద్ర ఆరోగ్యానికి అవసరం, గాఢ నిద్ర అనేది విశ్రాంతి అనుభూతి మరియు ఆరోగ్యంగా ఉండేందుకు అన్నింటికంటే చాలా అవసరం. సగటున 8 గంటల రాత్రి నిద్ర 1 నుండి 2 గంటల వరకు గాఢ నిద్ర ముఖ్యమైనది. పెద్దలు రాత్రి 7 నుండి 9 గంటల వరకు నిద్రపోవడం మంచిది. 


#మంచి నిద్ర లక్షణాలు:

రాత్రి పడుకోగానే 30 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ సమయంలో నిద్రపట్టడం.

రాత్రిలో ఒకసారి 5 నిమిషాల కంటే తక్కువ సమయం మేల్కొడం. మీరు బెడ్‌పై గడిపే మొత్తం సమయంలో 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ సమయం నిద్రపోవడం. 

రాత్రిపూట 20 నిమిషాలలోపు మేల్కొని ఉండటం. కలలు రాకుండా నిద్రపోవడం సహజం, 

కానీ, మీరు కలలు కంటున్నట్లయితే, అది సాధారణంగా మీకు మంచి నిద్ర వస్తున్నట్లు సంకేతం. మనలో చాలామంది వివిధ కారణాల వల్ల రాత్రి సమయంలో మూడు నుండి నాలుగు సార్లు మేల్కొంటారు. ఇది సాధారణ నిద్రలో భాగమే. మెలటోనిన్ మరియు మెగ్నీషియం సహజ నిద్రను ప్రోత్సహించే మూలకాలు. 

మెలటోనిన్ ఒక హార్మోన్ మరియు మెగ్నీషియం విటమిన్.. చెర్రీస్, బెర్రీలు, గుడ్లు, పాలు, చేపలు మరియు గింజలలో మెలటోనిన్ పుష్కలంగా ఉంటుంది. 

గుమ్మడి గింజలు, బాదం, పాలకూర, జీడిపప్పు, వేరుశెనగల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 


మంచి నిద్ర కోసం: గోధుమ లేదా ఓట్ మీల్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లను పడుకునే ముందు తినండి. ఈ ఆహారాలు నిద్ర హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తాయి.✍️

#ఇది కేవలం సేకరణ మాత్రమే!```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సంపూర్ణ మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ప్రధమ భాగం*


*572 వ రోజు*


*ఆధ్యాత్మము ఆదిభౌతికము ఆది దైవతము*


ఇక ఆది భూతము, ఆది దైవతము, ఆధ్యాత్మము గురించి చెప్తున్నాను. మన శరీరంలోని పాదము, ఆపానము, జననేంద్రియము, చేతులు, నాలుక ఆధ్యాత్మము. అవి వరుసగా నడచుట, విసర్జించుట, సృష్టించుట, కార్యనిర్వహణ అనునవి అది భూతములు. వీటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు అది దేవతలు. అలాగే కళ్ళు, నాలుక, ముక్కు, చర్మము, చెవి ఆధ్యాత్మములు. వాటి గుణములైన దృష్టి, రుచి, వాసనా, స్పర్శ, శబ్ధములు అధిభూతములు. వాటికి వరుసగా సూర్యుడు, వరుణుడు, భూమి, వాయువు, ఆకాశము అదిదేవతలు. మనసు ఆధ్యాత్మము, మనసు విషయాలను గ్రహించడం స్పందించడం అనేవి అది భూతములు. మనసుకు అదిదేవత చంద్రుడు. ఇది వేదప్రమాణము. బుద్ధి ఆధ్యాత్మము విషయ పరిజ్ఞానము, శాస్త్రపరిజ్ఞానము దానికి అధిభూతములు. బుద్ధికి క్షేత్రజ్ఞుడు అదిదైవతము. అహంకారము ఆధ్యాత్మము. బుద్ధికి అభిమానము, స్వాతిశయము అధి భూతము. దానికి అదిదేవత బ్రహ్మము.


*ప్రకృతి పురుషుడు*


ఇంక ప్రకృతి పురుషుడు గురించి వివరిస్తాను. ప్రకృతి తన ఇష్టం వచ్చిన విధంగా త్రిగుణాల ఆధారంగా అనేక రకములైన వికృతులను ఒక ఆటగా పెంపొందిస్తూ ఉంటుంది. ఒక దీపము అనేక దీపములు వెలిగిస్తున్నట్లు ఈ ప్రకృతి అనేక రూపములను ఆవిష్కరిస్తుంది. సంతోషము, ఆనందము, ఆరోగ్యము, కోపరహితమైన స్వభావం, మంచి నడవడి, పరిశుభ్రత, ప్రకాశవంతంగా ఉండటం, మనసు స్థిరంగా ఉండటం, అహింస, నీతి నియమము, సిగ్గు, శ్రద్ధ, సత్యము, శుచి, ఆచారము, కరుణ, లోభరహిత నడవడి, కామవాంఛలు, ఇతరుల మీద చాడీలు చెప్పని గుణం సత్వ గుణాలు. తగవులాడుట, అహంకారము, గర్వము, కామవాంఛలు, కోపము, నిర్ధయ, మాత్సర్యము, భోగలాలసత, దుఃఖము ఇవి రజోగుణ లక్షణాలు. సదా ఏడుపు, అధికమైన మోహంతో ఉండటము, ఎప్పుడూ తింటూ ఉండటం, అనవసరమైన వాదనకు దిగడం, మూర్ఖత్వం, ఒకరితో ఒకరికి కలహాలు పెట్టడం ఇవి తమోగుణ లక్షణాలు. జీవాత్మ ఈ గుణములకు అతీతుడు కాని జీవుడు అనేక రూపములతో కళంకితుడౌతున్నాడు. జీవుడు చైతన్య మూర్తి ప్రకృతి చైతన్య రహితమైనది. జీవుడి ప్రకాశంతో ఎప్పుడూ వెలుగుతున్నా జీవుడు ప్రకృతికి వశవర్తియై ఉంటాడు. జీవాత్మ తన నిజ స్థితిని తాను తెలుసుకోలేదు. జీవాత్మ ప్రకృతికి లోనై త్రిగుణాత్మకమైన కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. సత్వగుణ ప్రధాన కర్మలను ఆచరించి స్వర్గ లోక ప్రాప్తి పొందుతూ ఉంటుంది. రజోగుణ ప్రధాన కర్మలను ఆచరించి మానవజన్మ ఎత్తుతుంది. తమోగుణ ప్రధానకర్మలను ఆచరించి రౌరవాది నరకములను పొందుతుంది. తనను తాను తెలుసుకున్న జీవుడు ఈ త్రిగుణములలో చిక్కు కొనక అంతర్ముఖుడై అక్షర రూపమైన ప్రబ్రహ్మ పదమును పొందుతాడు అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.


*జీవుడు జీవాత్మ*


జనకుడు " మునివర్యా ! పురుషుడు చైతన్యవంతుడని ప్రకృతి జడమని చెప్పారు కదా దానిని వివరించండి " అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు " జనకమహారాజా ! సగుణము అగుణము కాదు. అగుణము సగుణము కాదు. త్రిగుణాత్మకము అవ్యక్త్యమైన ఈ ప్రకృతి చైతన్యవంతమైన జీవాత్మ స్థితి ఎలా పొందుతుంది. జీవాత్మ సహజ స్థితి తెలుసుకునే జ్ఞానం ప్రకృతకి లేదు. కాని పురుషుడికి ప్రకృతి దాని స్వభావము తెలుసు. కనుక ఈ ప్రకృతి అచేతనము. పురుషుడు చేతనత్వం కలవాడు. సదా ప్రకృతిలో విహరిస్తున్న పురుషుడికి దాని వికారములు అంటవు. ఇది ప్రకృతి పురుషుల సంబంధము. సదా నీటిలో ఉండే తామర రేకులకు నీరు అంటదు. అలాగే పురుషుడు ప్రకృతిలో లీనమై ఉన్నప్పటికీ ప్రకృతి వికారములు అంటవు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*