8, మే 2021, శనివారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*మంత్రోపదేశం ..ఆశ్రమ నిర్మాణ కర్త ఆగమనం..*


*(ఇరువై ఒకటవ రోజు)*


ఆశ్రమ నిర్మాణానికి వేరే వారు పూనుకుంటారనీ..మీరేమీ ఆలోచించవద్దనీ శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారు తెలియచెప్పి..


"అమ్మా!..నీ దేవీపూజ కోటి పూర్తి అయిందా?.." అని ప్రభావతి గారిని అడిగారు..


"నాయనా..నా పదమూడో ఏట, మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను..అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవమంత్రమూ జపిస్తున్నాను..లెక్క పెట్టుకోలేదు.." అన్నారు ప్రభావతి గారు..


"అయితే..నీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవమంత్రం ఉపదేశిస్తాను.. దీక్షతో చేయి  తల్లీ!..శ్రీధరరావు గారూ మీకు ఈశ్వరాంశం మంత్రం ఉపదేశించనా?..లేక వైష్ణవమంత్రమా?.."అన్నారు నవ్వుతూ..


"స్వామీ!..నాకు ఏ మంత్రాలూ వద్దు..నేను ఈ దీక్షలు చేయలేను..అదేదో ఆవిడకు బోధించండి..తపనతో చేస్తూ ఉంటుంది..నేను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతాను...మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..మీ తపస్సు, దాని ఫలితాలు..నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను..అందుకు నేను దోహదకారిగా వుంటాను..అంతే కాని..ఈ జపాలు వగైరాలు నాకు సరిపడవు!.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామి వారు పక పకా నవ్వారు.."చూసావా అమ్మా!..శ్రీధరరావు గారు మంత్రోపదేశం వద్దన్నారు..పోనీలే అమ్మా..నీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను..కొనసాగిద్దువు గానీ.." అని..మళ్లీ కూడా ఆ ఇద్దరికీ ఆశ్రమ నిర్మాణం గురించి చింత వద్దని చెప్పి, ఆశీర్వదించి పంపించివేశారు..దంపతులిద్దరూ తేలిక పడ్డ మనసుతో మొగలిచెర్ల చేరారు..


ప్రక్కరోజు ఆదివారం.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీధరరావు గారింటికి వచ్చారు..రాగానే, శ్రీధరరావు గారికి నమస్కారం చేసి.."అయ్యా..నా పేరు బొగ్గవరపు చిన మీరా శెట్టి..ఇతను నా మిత్రుడు!..మాది, వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామం.." అన్నాడు..


శ్రీధరరావు గారు వారిని సాదరంగా వరండాలో కూర్చోబెట్టి..వచ్చిన పని ఏమిటో చెప్పమన్నారు..


"నేను..మాలకొండ లో తపస్సు చేసుకుంటున్న స్వామివారికి ఆశ్రమం నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో వున్నాను..ఆ విషయమై మీతో మాట్లాడాలని వచ్చాను.." అన్నారు..శ్రీధరరావు గారికి ఒక్కక్షణం తాను ఏం వింటున్నానో అనే సందేహం కలిగింది..వెంటనే ప్రభావతి గారిని పిలిచారు..ఇద్దరూ కూర్చున్న తరువాత, చిన మీరాశెట్టి గారు మళ్లీ అదేవిషయం..తాను శ్రీ స్వామివారికి ఆశ్రమ నిర్మాణం చేయదలచానని చెప్పారు..


నిన్న శనివారం  సాయంత్రం శ్రీ స్వామివారు తమతో ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు..ఈరోజు సాయంత్రానికల్లా ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు..దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు..


చిన మీరాశెట్టి గారిని..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అని అడిగారు..


శ్రీ స్వామివారు  ఎర్రబల్లె గ్రామం లో ఉన్నప్పటి నుంచీ తెలుసుననీ.. శ్రీ స్వామివారు వ్యాసాశ్రమం వెళ్లి వచ్చిన తరువాత కూడా ఒకటి రెండు సార్లు తాను, తన భార్యా శ్రీ స్వామివారిని కలిసామని..శ్రీ స్వామివారు మాలకొండ లో తపోసాధన కు వెళ్లిన తరువాత ఆయనతో కలవడం కుదరలేదనీ..మీరాశెట్టి గారు చెప్పారు..


నిన్నరాత్రి తనకు స్వప్నంలో కనిపించి..ఆశ్రమ నిర్మాణం చేయమని ఆదేశించారని..ముందుగా మిమ్మల్ని కలువమని కూడా ఆజ్ఞాపించారని కూడా మీరాశెట్టి గారు చెప్పారు..శ్రీ స్వామివారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు తన స్నేహితుడిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల చేరారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఇదంతా కలలా ఉంది..దైవలీలలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి..తాము నమ్మిన ఆ లక్ష్మీనృసింహుడే..ఇదంతా నడిపిస్తున్నాడనీ..లేకుంటే..ఒకానొక సాధకుడు, తన తపోసాధనకు తమ సహకారం కోరి..తమ జీవితాలకు ఒక అర్ధం కల్పించడం..లీల కాక మరేమిటి?..


మీరాశెట్టి గారిని, వారి స్నేహితుడిని..ఆ రాత్రికి తమ ఇంటిలోనే వుండమని చెప్పి, తెల్లవారగానే మాలకొండకు వెళ్లి శ్రీ స్వామివారిని కలుద్దామని చెప్పారు శ్రీధరరావు గారు..మీరాశెట్టి గారూ అందుకు అంగీకరించారు..


అందరూ సోమవారం నాడు ఉదయాన్నే..మాలకొండకు బయలుదేరి వెళ్లారు..


ఆశ్రమ నిర్మాణానికి సూచనలు..బావి లో జలకళ..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

ఏదిసూనృతం

 **ఏదిసూనృతం,,ఏది అనృతం..మన తక్షణ కర్తవ్యమేమిటి*** 


************************************

Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

*********************************************

**ఫ్లాష్ బ్యాక్ - బ్లాక్ అండ్ వైటులో**** 


1918 సంవత్సరం 


స్పానిష్ ఫ్లూ...(అప్పట్లో ఇన్ఫ్లు యంజా వైరస్-ఇప్పటి కొరోనా వైరస్ అక్క) తో భారత దేశం అతలాకుతలం అవుతోంది 


మహాత్మా గాంధి గారు తన 48 వ ఏట ఆశ్రమంలో కేవలం ద్రవ రూప ఆహారాన్ని తీసుకుంటూ ఆ కొరోనా అక్కతో పోరాడు తున్నాడు.. శబర్మతీ ఆశ్రమంలో ఎందరికో జ్వరం, దగ్గు పోరాడుతున్నారు.. పత్రిక లలో *గాంధీ జీవితం గాంధీది కాదు.,అది భారతీయులది* అని రాసుకున్నాయి.,, 


గంగా నదిలో శవాల గుట్టలుగా తేలుతున్నాయి.. వాటిని కాల్చేకి కట్టెలు లేక గంగలో తోసేస్తున్నారు..దానికి తోడు వర్షాలు రాక కరువు వచ్చింది,, అందరూ పట్టణాలకు ఆకలితో వలస వెళ్తున్నారు..అది వైరస్ ను ఇంకా వ్యాప్తి చేస్తుంది అని సూర్యకంట త్రిపాఠీ తన పుస్తకం లో వ్రాసుకున్నాడు.. 


ఆకాలంలో ఇప్పటిలా వ్యాక్సిన్ లు లేవు వ్యాపారం లేదు.. ఆంటిబయాటిక్సు, వెంటిలేటర్లు లేవు.. అసలు పాశ్చాత్య విధానాన్ని నమ్మే వాళ్ళే లేరు.. అంతా సొంఠి, అల్లం, మిరియాలు, జిలకర, ఆవాలు, తులసి, తాయత్తులు బ్యాచు వైద్యమే.... 


మొదట ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువగా మంది భారత దేశంలో ఈ మహమ్మారితోనే చనిపోయారు.. 17 - 18 మిలియన్లమంది చనిపోయారు... ప్రపంచంలో 100 మిలియన్లు చనిపోయారు,.6% జనాభా అంతరించి పోయింది... 


బొంబాయిలో ఒక షిప్ లో వచ్చిన సైనివల్ల సెకెండు వేవు వచ్చిందని వైద్యాధికారులు, లేదు మీ మురికి అలవాట్ల వల్లనే వచ్చిందని బ్రిటిష్ అధికారులు యధావిదిగా తిట్టిపోసుకున్నారు.. అందరినీ గాలికొదలేసి పర్వత ప్రాంతాల కు అధికారులు పారిపోయారు ప్రాణభయంతో.. భారతీయ అక్క చెల్లెల్లు తినడానికి తిండిలేక, తమ భర్తల ప్రాణాలను కాపాడలేక చిక్కి శల్యమై ఎముకల గూడులా మారి ప్రాణాలు వదిలారు... 


బయట తిరగకండి,,ఇళ్ళల్లోనే ఉండండి,,,,,.. ప్రశాంతంగా నిద్రపోండి., ఎక్కువగా చింతించకండి అని టైమ్సు ఆఫ్ ఇండియాలో కధనాలొచ్చాయి,.. 


**మరి మన భారతదేశం ఎలా ఎదుర్కొంది,,ఈ మహమ్మారిని...** 


ప్రజలు అంతా సంఘటితమయ్యారు.., 


ఆంటి ఇన్ఫ్లుయంజా కమిటీలు వేసుకున్నారు... 


పాతిక పరక సేకరించారు... 


చిన్న చిన్న షెల్టరు వైద్యాలయాలు స్ధాపించారు... 


అందరికీ మందులు, కూడు, గుడ్డ పెట్టారు... 


శవాలను తొలగించారు...తగలబెట్టారు..,, 


అందరినీ మోటివేటు చేసి హెల్తు గురించి పెద్దఎత్తున భారతదేశ చరిత్రలో లేని విధంగా అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు.,,వైద్యసిబ్బంది భయపడ్డారు.,వారి కొరత ఎక్కువగా ఉంది.... 


ప్రతి ఒక్క భారతీయుడు తన అక్కచెల్లెల్లను అన్నదమ్ములను కాపాడుకోవాడానికి భుజం భుజం కలిపి పోరాడారు.... మహమ్మారి అంతం చూసారు...ప్రజలను ఆ సెకండు వేవు కొరోనా అక్క ఇన్ఫ్లుయంజా నుంచి కాపాడుకున్నారు... ఇదే నిజమైన భారతీయుల యుద్ధం..మొదటి ప్రపంచ యుద్ధంకంటే పెద్ద వైద్యయుద్దంలో భారతీయులు గెలిచారు...

*************************************

ప్రస్తుతం...ఈస్ట్ మన్ కలర్,.DTS లో 


*********************----******************* 


2020 సంవత్సరం... 


ఇన్ఫ్లుయంజా చెల్లి దేశంలో 2020 లో వచ్చింది,., 


ఆంటిబయాటిక్సు, ఆంటివైరల్సున్నాయి, వెంటిలేటర్లున్నాయి... ఆక్సిజను,స్టీరాయిడ్సు ఉన్నాయి., పాశ్చాత్య వైద్యం అందరికీ ఆమోదమే,,. కాని తులసి మిరియాలు పసుపు శొంఠి బ్యాచులు ఉన్నాయి... అయినా మాస్కు, దూరం దూరం, శానిటైజర్, లాక్డౌన్ లు పక్కా ప్లానింగ్ తో మొదటి వేవును భారతదేశం అంతం చేసింది....

******************************************** 


2021 సంవత్సరం..... 


ఆత్మ విశ్వాసం పెరిగింది... ఈ కొరోనా రెండవ వేవు ఏమి చేయగలదు అని రొమ్ము విరుచుకు తిరిగాము.. మాస్కు శానిటైజర్ దూరం దూరం అనే నినాదాలను పట్టించుకోలేదు... మత విశ్వాసాలే ఎక్కువయ్యాయి.. అందరూ గుంపులు గుంపులుగా మాస్కు లు వదిలేసి చెలరేగారు... పండగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు పేరంటాలు, మేళాలు తాళాలు, గుళ్ళు గోపురాలు, తమ అస్తిత్వం పోతుందని చెలరేగిపోయారు.... 


వ్యాక్సిన్ ఉన్నా సరిగ్గా  ఉపయోగించ లేదు... వైద్యసహాయం చేసేకి సన్నద్దం చేసుకోలేదు.,.

ఎన్నికలు, కౌంటింగులు అయినాక తీరిగ్గా కొరోనా ను నలిపి పారేస్తాం అనుకున్నారు... అడ్డపడ్డారు... దిక్కుతోచక అందరినీ అడుక్కుంటూ బెంబేలెత్తి పోతున్నారు

******************-************************

Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

******************************************

అదను చూసి సెకండు వేవు విరిసిన పంజాకు దిమ్మ తిరిగి మేకపోతు గాంభీర్యం ప్రదర్సిస్తున్నారు,., బాబ్బాబు మాకు వ్యాక్సిన్ ఇవ్వు, ఆక్సిజన్ ఇవ్వు అని దేబురించాల్సిన పరిస్థితులు వచ్చాయి.,. 


మరలా భారతీయులందరూ భుజం భుజం కలిపి అక్కచెల్లెల్లకోసం అన్నదమ్ములకోసం పోరాడాల్సిన చారిత్రాత్మక సమయం వచ్చింది... 


మరలా మనమందరూ **కోవిడ్ ఆర్మీగా** మారాల.. 7th సైన్సు సినిమాలోలా మన జెనిటిక్ కోడును ఆక్టివేటు చేసుకోవాల.. పిరికి తనం వదిలెయ్యాల.. 


*ఇక సోషియల్ మీడియాలో అందరినీ తిట్టేది, అలాచేయండి, ఇలా చేయండి, మాకు బెడ్డు దొరకల, ఆక్సిజన్ దొరకల, మేమిచ్చాం, మేమే తెచ్చాం  అని ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల నుండి పార్టీల పరంగా తిట్టిపోసి వీరాభిమానం చాటుకున్నది చాలు..* 


వైద్యసిబ్బంది, కలెక్టరు ల నుంచి బంట్రోతుల వరకు కొరోనాలో పని చేసే వారిని మీ సావు మీరు సావండి అని ఇంట్లో కూర్చుని తిట్టింది చాలు... 


*ఇక నడవండి..కోవిడ్ ఆర్మీ గా మారి సోషియల్ సర్వీసు చేయండి,,,* 


1. 130 కోట్ల మంది ఇంట్లో కూర్చో కుండా "covid army 🪖" గా మారాలి మాస్కు, భౌతికదూరం పాటిస్తూ అందరికీ ఎంతో కొంత సహాయంగా ఉంటే మంచిది 


2. టీచర్లు, విద్యా సంస్థలు పనిచేసేవారు, చదువుకున్న వాళ్ళు దగ్గర శిక్షణ  తీసుకొని ఎంతో కొంత  సహాయం చేయడం. 


3. చదువుకున్న ప్రజలు covid army 🪖 లో వైద్యసిబ్బంది చెయ్యగల పనులు మీరు చేయవచ్చు., 


4. ఊరికే టెన్షన్ పెంచే నెగటివ్ వార్తలు వ్యాప్తి చెంద కుండా చూడాలి 


5. ఇంట్లో నుంచే తెలిసిన వారిని భయపడకుండా ధైర్యం చెప్పి పర్యవేక్షణ  చేయచ్చు.. మందులు, ఆక్సిజను అవసరాన్ని తెలియ చేస్తూ హోమ్ఐసోలేషన్ కు సహాయం చేయవచ్చు.. మరణాల సంఖ్య పెరగ కుండా చేయ వచ్చు.,బెడ్లు అందరికీ అందేలా చేయవచ్చు.. 


6. హెల్తు వర్కర్సు, శానిటేషన్ వర్కర్సు, వారి కుటుంబాలకు ఎంతో కొంత సహాయం చేయండి.. వాళ్ళేం ఆస్తులు పెంచుకోరు.. తినడానికి సహాయం చేసి మే మున్నాం మీకు అని భరోసా కల్పించండి.. 


7. కోవిడ్ మీద అవగాహన, తేవచ్చు.. ప్రజలు  పానిక్  కాకుండా ఉండేందుకు కారులో మైకు పెట్టుకొని చుట్టూ పక్కల వారికి ఙ్ఞానం చెప్పవచ్చు 


8.చెరువులు కాలువలు శుభ్రం చేయ వచ్చు.. 


9. మాస్కు, భౌతిక దూరం పాటిస్తూ తో వీధి చివరున యోగ, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సరసైజులు చేయించచ్చు.. 


10. అందరూ సాఫ్టువేరు ఇంజనీరులు కంప్యూటర్ లో బెడ్ ల వివరాలు సేకరించి, ఎక్కడ ఖాళీలున్నాయో ప్రజలకు సమాచారం చేయవచ్చు,, 


11. కోవిడ్ రికవరీ అయిన యువకులు, ఊరికే ఉండకుండా కోవిడ్ కేర్ సెంటర్లలో వాలంటరీగా సహాయకులుగా ఉండచ్చు... 


12. ఆంబులెన్సులు, ఓమ్నీ వ్యాన్లు ఉన్నవారు దినం మూడుగంటలు ఆసుపత్రి లలో పేషెంటులను వార్డులు మార్చేకి సహాయం చేయచ్చు.,, 


13. మీ ఊర్లలో ఉండే పెద్ద హాలులను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ లుగా మార్చి సేవలందించచ్చు.., 


14.. ఈ బ్లాక్ మార్కెటింగ్ నాయాళ్ళ తోలు తీయవచ్చు.. 


*ఇలా చేసే ధైర్యం, దమ్ము, మనసు, ఈ కొరోనా యుద్ధంలో పాలుపంచుకొనే సామర్ధ్యం ఈ ఉక్కునరాల ప్రజలకుందా?* 


ఎవరికోసమో ఎదురు చూడకుండా సమాజహితం కోసం నీ సోదరులకోసం పని చేయమన్న *బాబాసాహెబ్* చెప్పినది పాటించే తెగువ ఉందా? 


ఉక్కునరాల యువకులే దేనినైనా సమర్ధవంతంగా చేసి సాధిస్తారు అన్న *వివేకానందుని* మాటలు ఆచరించ గలరా?

**************************************** 


ముగింపు మాట.,, 


చీకటిలో చిక్కుకున్నప్పుడు అందరినీ తిడితే బయటపడం... ఒక చిరు దీపం వెలిగించు కోవాల...

అలాగే మీ రాజకీయాలు, ఓట్లు, నోట్లు, తరువాత చూసుకోవచ్చు,,దానికి సమయం ఉంది... బ్రతికి తే అందరం మరలా 2024 ఎన్నికల లో కొట్టుకుందాం...

బ్రతకడమే ముఖ్యం ... ఎలాగైనా.... ఆ పాశ్చాత్య మీడియా ఇలా అంది.. వారు రిజైన్ చేయాల.. వీరు తోపు,.వాడు వీకు.. అనేటివి పక్కకు పెట్టి భుజంభుజం కలిపి పోరాడాల.... 


Dr.C.  ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)

గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు 

కర్నూలు. ఆంధ్రప్రదేశ్.

7, మే 2021, శుక్రవారం

టిఫిన్ తినండి

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

నాకు నచ్చిన ఓ వాట్సాప్ సందేశం.

               🌷🌷🌷

"టిఫిన్ తినండి" అంటూ  మా ఆవిడ అందించిన  ప్లేట్ లోకి  ఉప్మా యేమో అని ఆశగా  తొంగి చూస్తే   తెల్లటి నాలుగు ఇడ్లీ లు కనపడ్డాయి.


ఉస్సురంటూ "ఉప్మా చేయలేకపోయావా" అన్నాను  ప్లేట్ అందుకుంటూ


"మొన్నంతా కడుపు గాభరాగా ఉందని, పడుతూ లేస్తూ ఆపసోపాలు పడ్డారనిన్ను, తేలికగా అరుగుతాయనిన్ను, ఇడ్లీ చేసాను" అంది శంకరాభరణం లో అల్లు గారిలాగ.


 "అబ్బే...గ్యాస్ ప్రాబ్లెమ్ ...అంతే... ఆ సాయంకాలానికే సెట్ అయిపోయింది కదా"అన్నాను ఇడ్లీ తుంచి అల్లప్పచ్చడి లో అద్దుకుంటూ


"వెధవ ఉప్మా కి ఏముంది...రేపు చేస్తాను లెండి. ఇవాళ్టికి ఇవి కానీండి"


"అయ్యో...  ఉప్మా ని ఎంత మాట అనేశావ్.. వెధవఉప్మా నా?? లెంపలు వేసుకో.

ఇంత అల్లం పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి జారుగా బొంబాయి రవ్వతో మంచి ఉప్మానే చేయి.. 

ఇంతకీ వంటేమిటి చేస్తున్నావు?"

అన్నాను రేపు ఉప్మా చేస్తుంది అన్న వాగ్దానం దొరికిన ఆనందంతో నవ్వుతూ


"రామచంద్రా...టిఫిన్ ఇంకా తినడం కాలేదు...అప్పుడే మధ్యాహ్నం భోజనం గురించి , రేపటి టిఫిన్ గురించి ఆలోచన....ఇంక మొదలెట్టండి.. కోరికల చిట్టా విప్పండి"


"అరటికాయ అల్లం పచ్చి మిర్చి వేసి ఉప్మా కూర వండవోయి" అన్నాను అర్ధనీమీలనేత్రాలతో


"మీ ఉప్మా పిచ్చితో చచ్చిపోతున్నా బాబోయ్....అయినా ఈ హైదరాబాద్ లో దొరికే అరటికాయలు తో కూర చేస్తే ఎందుకో  బాగుండదు. ఎంత ఉడకబెట్టినా మంచిగా ఉడకవు, రాళ్ళల్లా ఉంటాయి. కూర తిన్నట్టే ఉండదు.  అదే మా బాపట్ల  ఇంట్లో అరటికాయల తో చేస్తే ఎంత కమ్మగా ఉండేదో కూర.... గెల లోంచి ఓ  రెండు కాయలు అప్పటికప్పుడు కోసి మా అమ్మ వండితే ఇంట్లో ఆరుగురు తృప్తిగా తిన్నా, ఇంకొంత మిగిలేది కూర...అంత పెద్దగా ఉండేవి కాయలు"ఎక్కడికో వెళ్ళిపోతోంది మా ఆవిడ


నేను కూడా ఆలస్యం చేయకుండా ఆవిడ కొంగు కొట్టుకుని ఆవిడ వెనకాలే వెనకటి రోజుల్లోకి అడుగులేస్తూ "అవును. నాకూ జ్ఞాపకమే. నాలిక మీదే ఉంది ఆ కూర రుచి. మీ బాపట్లలో ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర ,  ఎంత లేతగా ఉండేదో..దానితో మజ్జిగ పులుసు పెడితే...నా సామి రంగా...అద్భుతం అనుకో"అన్నాను పెదాలు తడుపుకుంటూ😋😋😋


"ఒక్క తోటకూర అనేమిటి అన్ని ఆకు కూరలు బాగుండేవి.  బచ్చలికూర ఎంత బాగుండేది?  మా అమ్మ వండిన  కంద బచ్చలి కూర మర్చిపోయారా?"


"ఎలా మరుస్తాను అనుకున్నావు..ఇంక ఎక్కడా దొరకని మీ బాపట్ల స్పెషల్ వంకాయల మాటేమిటి? అంత పెద్దగా ఉన్నా గుత్తి వంకాయ కూర వండితే లేహ్యంలా ఉడికేది కాదూ" లొట్టలు వేస్తూ అన్నాను


"మరే...మీకిష్టమని మా అమ్మ మీరున్నన్నాళ్లు అదే వండేది. మేము తినలేక విసుక్కునేవాళ్ళం"


"దంత సిరి లేనివాళ్ళే విసుక్కుంటారు"అన్నాను నవ్వుతూ


"ఇంకా నయం..ఎంత ఇష్టమైనా, రోజూ ఎక్కడ తినగలం ఆ వంకాయని"


"అందుకేగా..'వదిలేయమంటే మీకు బాగా ఇష్టమైన కూర వదలాలి...అంతే గానీ మీరు తిననివి కాదు' అని ఆ బ్రాహ్మడు గారు గయలో చెబితేనే గదా పెద్ద మనసు చేసుకుని వంకాయని త్యాగం చేసాను"అన్నాను గొప్పగా


"అదే చెబుతున్నా. వదిలేసిన  శాకాన్ని మళ్లీ మళ్లీ  తలుచుకోకూడదుట.

స్థితప్రజ్ఞత పాటించాలిట. లేకపోతే ఫలితం దక్కదుట. టీవీ లో ఎవరో చెబుతుంటే విన్నాను"


"అవును..నిజమే"అన్నాను అపరాధ భావంతో లెంపలు వేసుకుంటూ


"సరే  చప్పున చెప్పండి... ఏమి వండను?"


"నిజమే, నువ్వన్నట్లు ఇక్కడి  అరటి కాయలు బాగుండవు కనక, అవి క్యాన్సల్. పోనీ దొండకాయలు చీలికలు చేసి ఉల్లికారం వేసి కూర చేయి" అన్నాను 


"మీ తిండి గోలలో

పడి వారం, వర్జ్యం , తిథి కూడా మర్చిపోతున్నారు..ఇవాళ ఏకాదశి, 

పైగా శనివారం.. నో ఉల్లి నో వెల్లుల్లి"


"అదొకటి ఉంది గదా..మర్చిపోయా..పోనీ క్యాప్సికం చీలికలు చేసి సెనగపిండి కూరి గుత్తుల్లా చేసేస్తావేమిటి...బాగుంటుంది"

గుత్తుల కూరలంటే తెగ ఇష్టపడే నేను  అడిగాను గుటకలు వేస్తూ


"రామచంద్రా...గాస్ అని మొన్నంతా బాధ పడ్డారు...మళ్లీ సెనగపిండి తోనా...వద్దులెండి...మళ్లీ వారం చేసుకుందాము"


"అదీ నిజమే...మరి ఏం చేస్తానంటావు?"

అడిగాను బిక్క మొహం వేసి


"పోనీ బీరకాయ గుత్తులు వండనా... కొంచెం తక్కువ కారం వేసి?"


"బీరకాయా....వద్దులే నీళ్లొడుతూ ఉంటుంది కూర" అన్నాను మొహం అదోలా పెట్టి


"పోనీ బెండకాయలు వేయించనా?"


"బెండకాయ వేపుడు ఎప్పుడూ  వేడివేడిగా డిన్నర్ లోకి బాగుంటుంది...లంచ్ లోకి కాదు. ఇంకో మాట చెప్పు"


"లంచ్ కూర, డిన్నర్ కూర అని కూడా ఉందా?...చస్తున్నా బాబోయ్ మీ కోరికల తోటి..పోనీ కారట్, కొబ్బరి కోరు వేసి కూర చేయనా?"


"ఆబ్బే...పిల్లకాయలు తినే కూర అది...కేరట్ పైగా కొబ్బరి తోటి.. తియ్యగా ఉంటుంది..వద్దు"


"ప్రతీదానికి ఇలా వంక పెడితే కష్టం.. పక్కింటి లలితమ్మ గారి మొగుడు ఏమి వండినా మాట్లాడకుండా తింటాడుట. ఇలా కడుపుతో ఉన్నవాళ్ళల్లా సవా లక్ష కోరికలు కోరడుట" అంది కోపంగా


"హలో...ఆయనకి  అజీర్తి సమస్య. ఏమి తిన్నా   హరాయించుకోలేడు. అందుకే ఆవిడే చప్పటి పత్యం వంటలు వండుతుంది. ఆయన మాట్లాడకుండా తింటాడు. ఆవిడ  ఆ అసలు విషయం దాచేచి నా మొగుడిలా, నా మొగుడలా అంటూ గొప్పలు చెప్పుకుని ఉంటుంది నీ 

 దగ్గిర" అన్నాను అక్కసుగా


"ఆదా సంగతి...సర్లెండి. వాళ్ళ గొడవ మనకెందుకు గానీ, ఇంక ఫ్రిజ్ లో  మనకు నిషిద్ధాక్షరి అయిన వంకాయలు తప్ప ఏమీ లేవు..." అంటూ దీర్ఘం తీసింది


"మరి  మనం తినకూడనివి ఎందుకు కొన్నావు?" ఆడిగాను ఉక్రోషంగా


"బాగుంది ...వెనకటికి సామెత చెప్పినట్లు...మనం వదిలేస్తే ఇక ఇంట్లో ఎవరూ తినకూడదని రూలు ఉందా?

కొడుకు కోడలు మనవడు ఇష్టంగా తింటారు. మీ మనవడు అయితే రోజూ వంకాయ చేసినా తింటాడు"


"సరే...ఎదో నీ ఇష్టం వచ్చింది చేయి" అన్నాను నీరసంగా


"కమ్మగా బీరకాయ పత్యం కూర చేస్తాను 

నిమ్మకాయ పచ్చడి తీసి తాజాగా పోపు పెడతాను. వాము, జీలకర్ర, మెంతులు వేసి మెంతి మజ్జిగ పెడతాను. గ్యాస్ గీస్ పోతాయి. చక్కగా తిని పడుకోండి"అంది


"సరేలే...ఏంచేస్తాను.. నీ దయ..నా ప్రాప్తం..అలాగే కానీ"అన్నాను నీరసంగా.


చిట్టాలో ఇంకా చాలానే ఉన్నాయి


పనసపొట్టు కూర


కంద బచ్చలి


బంగాళదుంప ఉప్మా కూర....


వగైరా

కానీ ఏది చెప్పినా మొన్నటి సంగతి ఎత్తుతుందే....?


 సరే ఏమి చేస్తాము..ఒక నాలుగు రోజులు ఆగుదాము అనుకుంటూ  సోఫాలో వెనక్కి వాలి పేపర్ తీసాను.


😂😂😂😂😂😂


అందుచేత మిత్రులారా, పైన లిస్టులో చెప్పిన వంటకాలలో మీ కిష్టమైనవి వండుకునో, వండించుకునో తృప్తిగా కడుపు నిండా భోంచేసి హాయిగా  నిద్రపోండి.. ఎలాగూ బయటికి వెళ్లే పరిస్థితి లేదు మనకి...

😋😋😋😂😂😂


ఈ గంభీర వాతావరణం లో మనం పడుతున్న  టెన్షన్ లను పక్కన పడేసి సరదాగా కాసేపు మిమ్మల్ని నవ్విద్దామనే నా ఈ ప్రయత్నం. సఫలీకృతుడిని అయ్యానో లేదో మీరే చెప్పాలి...


సేకరణ: వాట్సాప్.

*కర్మ ఫలం

 🌷🙏*కర్మ ఫలం*🙏🌷


ఒక అడవిలో కొంతమంది ఆటవికులు ఒక గుడి కట్టుకున్నారు. వారికి రాతి విగ్రహాలు దొరకవు కనుక ఒక చెక్క దుంగని విగ్రహంలా చేసి పసుపు కుంకుమలు అలిమి వస్త్రం కప్పి దానికే పూజలు చేసేవారు. అమ్మవారు కూడా ప్రసన్నమై కోరిన కోర్కెలు తీర్చేది. ఆగుడికి ఒక పూజారిని మాట్లాడి నిత్యం పూజలు చేయించేవారు. అతడు అక్కడికి 5మైళ్ళ దూరం నుండి రోజు వచ్చి పూజలు చేసి వెళుతూ ఉండేవాడు. ఒక్కనాడు కూడా విసుక్కోలేదు.. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు భోరున వర్షం కురిసింది. కుంభవృష్టి లా మారింది..


ఆరోజు ఆగుడికి దగ్గర్లోకి కట్టెలు కొట్టుకునేవాడు ఒకడు వచ్చాడు. వర్షం కురుస్తూ ఉండడం వలన నిలువడానికి నీడలేక చుట్టూ వెదికితే దగ్గరలో ఈ గుడి కనబడింది. వెంటనే గుడిలోకి వెళ్ళాడు. ఎదురుగా చూస్తే పెద్ద దుంగ కనబడింది. వెంటనే ఆహా! వర్షం వచ్చి చెట్లన్నీ తడిసిపోయాయి ఈరోజు కడుపుకి తిప్పలే అనుకుంటున్న తరుణంలో ఎదురుగా ఇంత పెద్ద దుంగ దొరకడం అదృష్టం అనుకొని ఆటవికులు పూజించే ఆదుంగని కొట్టబోయాడు. వెంటనే "ఒరేయ్ నన్ను కొట్టకు అంది,అందులో ఉన్న అమ్మ.. వీడికి దేవుడు దెయ్యం అంటే ఏమిటో తెలియని నిషాదుడు కనుక "ఎవర్రా దుంగ వెనుక దాక్కొని మాట్లాడుతుంది? రండి బయటికి అన్నాడు అమ్మవారు అని తెలియని అజ్ఞానంతో..


అప్పుడు ఆ దుంగ నుండి అమ్మవారు బయటికి వచ్చి నేను అమ్మని.. నన్ను కొట్టకు అనగానే! ఐతే నిన్ను కొట్టకపోతే నాకడుపు సంగతి ఏంటి? అంటే! ఇదిగో నీకు వంద బంగారు నాణేలు ఇస్తాను అని ఒక మూట అక్కడ పడేసి మాయమయింది. ఆ మూటలో ఉన్న బంగారు నాణేలు చూసేసరికి చేతిలో ఉన్న గొడ్డలి అక్కడ పడేసి మూట తీసుకొని వేగంగా అక్కడి నుండి వెళ్ళి పోయాడు. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న పూజారికి ఒక సందేహం వచ్చింది. రోజు నేను అంత దూరం నుండి వచ్చి పూజలు చేస్తుంటే నాకు మాత్రం ఏమి ఇవ్వదా! గొడ్డలితో కొట్టబోయే ఆబోయవాడిని కనికరించిందా! అని,పూజారి ఆ  గొడ్డలితో అమ్మవారిని నరకబోయాడు. గొడ్డలి ఎత్తాడో లేదో, పూజారి కళ్ళు పోయాయి. చూపు పోయింది.


అమ్మా! ఎంత అపచారం చేశాను! తల్లి నన్ను క్షమించు అనగానే అమ్మవారు ప్రత్యక్షమై "వాడు అజ్ఞాని. దేవుడంటే ఏమిటో తెలియదు. నన్ను చూసి ఒట్టి కట్టెముక్క అనుకోని కొట్టబోయాడు. నువ్వు జ్ఞానివి. నిత్యం నన్ను పూజిస్తున్నావు. అజ్ఞాని నరకబోగా కనికరించాను అని, నువ్వుఅనుకొని నువ్వు కూడా అదేపని చేయబోయావు. ఏమితెలియని అజ్ఞాని చేసిన పని అన్ని తెలిసిన నువ్వు చేస్తే ఎలా? పైపెచ్చు దేవతగా కొలిచే నన్నే నువ్వు నరకబోయావు. అందుకే కళ్ళు మాత్రమే తీసేశాను. చూపు తీయకపోతే నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవాడివి.. అనగానే అమ్మా! క్షమించు. మరొక సారి ఇలాంటి పొరబాటు చేయను. దయచేసి చూపు ప్రసాదించు, అని పలుమార్లు పూజారి వేడుకొనగా, అమ్మ  కనికరించి చూపు ఇచ్చి వాడికి సంపద దొరికిందని నువ్వు పొరబాటు పడుతున్నావు. అకారణంగా వచ్చే సంపాదన ఉపయోగపడదు. అక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. వెళ్ళు,వెళ్లి అక్కడ ఏమి జరుగుతుందో చూడు అనగానే, ఆ బోయవాడిని అనుసరిస్తూ వెనుకే వెళ్ళాడు పూజారి..


బోయవాడు తన ఇంటికి చేరుకొని భార్యని పిలిచి "జరిగింది చెప్పి ఇదిగో 100 బంగారు నాణేలు" అని చూపించగానే భార్యకి బంగారం మీద ఆశపుట్టి నాకు ఒడ్డాణం చేయించు, ఉంగరం చేయించు, బొంగరం చేయించు అని భర్తని అడిగింది. భర్త వినలేదు. ఇంతలో కొడుకు వచ్చాడు. వాడు వ్యసనపరుడు. రోజంతా పూర్తిగా త్రాగుతూనే ఉంటాడు. అప్పటికే బాగా త్రాగి ఉన్నాడు. ఆ బంగారు నాణేలు చూసి "నాన్నా! అవి నాకు ఇవ్వు. నేను జూదమాడాలి.బాగా త్రాగాలి ఆ ధనం ఇలా ఇవ్వు అన్నాడు. భార్యని కొడుకుని బయటికి గెంటి లోపల ఉన్న బీరువాలో ధనాన్ని దాచాడు. భార్య లోపలికి వచ్చింది. ఇద్దరికీ వాదోపవాదాలు బాగా జరుగుతున్నాయి. ఇంతలో కొడుకు ఒక గొడ్డలి తీసుకొచ్చి తల్లిదండ్రులను ఇద్దరిని నరికేసి ఆ బంగారు నాణేలు తీసుకెళ్లిపోయారు.. అకారణంగా వచ్చిన సంపద ఆకారణంగానే పోయింది. ఆసంపదతో పాటు ప్రాణాలు కూడ పోయాయి. అది చూసి చలించిపోయిన పూజారి వెంటనే గుడికి వెళ్లి అమ్మ పాదాలపై పడి క్షమాపణలు కోరుకున్నాడు.


మనకు ఏది కావాలో మనకు తెలీదు. 

మనల్ని సృష్టించిన పరమాత్మకు మనకు ఎప్పుడు ఏది ఇవ్వాలో తెలుసు. పరమాత్మని కొలిచేటప్పుడు కష్టం రావచ్చు కానీ నువ్వు చేసిన పూజ ఫలితం వచ్చేవరకు వేచి చూడాల్సిందే.. ఏదో ఒకరోజు ఫలం వచ్చి తీరుతుంది. ఫలితం రాకుండా మాత్రం ఉండదు. 


దైవానికి ఎవరిమీద పక్షపాతం ఉండదు. చేసే ప్రతిపనికి ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు పరిపూర్ణుడివి కావాలంటే ముందుగా నువ్వు శుద్ధం అవ్వాలి. బంగారాన్ని పుటం పెట్టిన తరువాత ఎంత అద్బుతంగా తయారవుతుందో చేసిన పాపాలు ప్రక్షాళన అయ్యేవరకు కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి కర్మ శుద్ధం అవగానే పరిపూర్ణత్వం వస్తుంది అప్పుడు ఎంచక్క

ప్రతి క్షణం ఒకే స్థితి..ఆనందమే ఆనందం..ఆ తండ్రి పాదాల చెంత చేరే వరకు. 🙏

షణ్ముఖుడు-శుద్ధవాచాలత

             🌷🌷🌷

*షణ్ముఖుడు-శుద్ధవాచాలత ( పాత హాస్యకథ)* 


తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేదపాఠశాలలో మహోపాధ్యాయులు విద్యార్ధులను మౌఖికంగా పరిక్షిస్తున్నారు. 


మంచి బ్రహ్మవర్చస్సుతో కనిపించిన ఓ ఎనిమిదేళ్ళ పిల్లాడిని పిలిచి.." ఏవోయ్! నచికేతుడెవరో చెప్పగలవూ?" అంటూ ముద్దుగా ప్రశ్నించారు. 


వెంఠనే ఆ పిల్లవాడు.." ఆర్యా! వాజశ్రవుడి కొడుకు వాడు. వాళ్ళ నాన్న విశ్వజితయజ్ఞం చేస్తూ... పనికిరాని ఆవుల్ని బ్రాహ్మణులకు దానంచేస్తుంటే... వీడు వెళ్ళి...."... అప్పటికే పిల్లవాడి ఉపనిషత్తు జ్ఞానానికి మురిసి ముక్కలవుతున్న పండితులవారు.. " ఆ చెప్పు నాయనా! వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి నచికేతుడు హేవన్నాడూ? ".... అని అడిగారో లేదో వాడు......


.." బుద్ధీజ్ఞానం లేదా నాన్నా? అన్నం తింటున్నావా? గడ్డితింటున్నావా? ఈ వట్టిపోయిన ఆవుల్ని వీళ్ళనమొహానపడేస్తే...పాలా? పేడా?  వాళ్ళకు గడ్డిదండగ! యజ్ఞం చేస్తున్నావా? వట్టిఆవులు వదిలించుకుంటున్నావా? కళ్ళుపోయి గుడ్డిముండాకొడుకువి అయిపోగలవు.. ఇలాంటి వెధవపాపాలు చేస్తే! నువ్వు ముసలయ్యాకా నేనూ అదే పనిచేస్తే! ఆపుతావా లేక నువ్వు చేస్తున్నది నలుగురికీ చెప్పమంటావా?! "...... అంటూ... వీరావేశంతో..ఆ పిల్లవాడు ఇంకా చెప్పేవాడే.. ఈలోపునే గురువులు వాడి నోరుమూసేసి ఈడ్చుకుని పోయారు. 


మహోపాధ్యాయుల వారు కందగడ్డవంటి ముఖబింబంతో..." ఈ బాలుడు వాచాలుడు. వాగుడుకాయ! అత్యుత్సాహి! గెంటివేయుడు! "... అని టీసీ ఇచ్చేసి వాళ్ళూరు విశాపట్నం పంపేసారు. 


అన్నగారి పంచను తలచెడి చేరిన పిల్లాడితల్లి.." హేవిటన్నయ్యా ఈ ప్రారబ్దం?" అనగానే..


" ప్రారబ్దం కాదూ, ఆబ్దీకం కాదే చెల్లాయ్.. ఇదంతా ఆ ముత్తాతగారి వారసత్వం. ఆయన మహాపండితుడే! ఆరోజుల్లో తన పాండితీప్రకర్షతో రాజులను ఆకర్షించి..సరిగ్గా వాళ్ళతో గండపెండేరాలు తొడిగించుకునే సమయానికి...నాలికమీద సరస్వతి తొలిగిపోయి శనిమహాదేవుడు తిష్టవేసేవాడు. 


ఇక చూసుకో....ఆ మహారాజుల్ని.. ఆశీర్వదించడం మాని.. " వెధవల్లారా! బడుద్దాయిల్లారా! మీ దినం పెట్టా! ఇదిట్రా మీరు నాకు ఇచ్చేది. సన్మానాలేవి? సత్కారాలేవి? అగ్రహారాలేవి? అపరంజి పళ్ళాలేవి? మీ మొహాలుమండా!మీ మొహాలు  కుమ్మొంకాయలా పచ్చడయిపోనూ...చూస్తా! నువ్వూ నీవంశస్థులూ...వైతరణి ఎలా దాటతారో చూస్తా! !".... అంటూ వైనవైనాలుగా దూషణభాషణాలతో వారిని  ఎదురు సత్కరించి... ఉన్న అగ్రహారాలు కూడా ఊడగొట్టుకున్నాడు. 


విచిత్రంగా ఆయన నోరుపడేసుకున్న జమీందారు చక్రవర్తి అయ్యేవాడుష! ...మళ్ళీ ఆ వారసత్వం ఇదిగో ఈ వెధవాయికి వచ్చింది. ఎవడికి తప్పినా నాకు తప్పదు కదా వీడి బాధ్యత".... అంటూ నెత్తినేసుకున్నాడు ఆ మేనమావ , ప్రముఖ పౌరహిత్యబ్రహ్మ  రామశాస్త్రి గారు... తన దురాలాప ప్రేలాప ...మేనల్లుడు షణ్ముఖశాస్త్రిని! 


     ఇహ మా భాగ్యవశాత్తు ... మా ఇంటి సర్వకార్యాలకూ ఈ మామాఅల్లుళ్ళు రావలసిందే పుణ్యంతో పాటూ పురిషెడు వినోదం అందించాలిసిందే! 


ఒకేడు వినాయకచవితికి... తనకు మినిస్టర్ గారింట్లో పూజ ఉండడంతో తప్పనిసరయి... వందవార్నింగులిచ్చి షణ్ముఖుడిని పంపారు రామశాస్త్రిగారు! 


అసలే మా మావగారు పరమకోపిష్టి. అకారణంగానే అగ్నిహోత్రావధాని అవగలిగే అవలక్షణం మెండుగా ఉన్నవారు! పురోహితుడు చూస్తే షణ్ముఖుడు. మాకు ఆ గణపతే దిక్కని ఆశలు వదిలేసుకున్నాం పూజమీద. 


ఊహలు తారుమారుచేస్తూ ధ్యానావాహనాది షోడశోపచారాలతో, నీరాజన, మంత్రపుష్పాలతో మహాద్భుతంగా చేయించాడు పూజ! 


కధ వినడానికి ఉపక్రమించాం! శ్రీకృష్ణుడు, సాంబుడు, ధర్మరాజు వరకూ సవ్యంగానే సాగింది! ఇక " మన వినాయకుడు ఉండ్రాళ్ళు ఎక్కువగా తిని... ఆపసోపాలు పడుతూంటే … ఆయన పొట్టపగిలింది...అది చూసి చంద్రుడు నవ్వాడుట..."... ఆ ఘట్టం వచ్చేసరికి మన మర్కటశాస్త్రికి మెల్లగా తోక మొలవడం మొదలు పెట్టింది. అంతే కధ మారిపోయింది. 


వినాయకుడు:- అమ్మా ఈ బాబాయ్  చూడు ఎలా నవ్వుతున్నాడో. నువ్వు గాట్టిగా శపించు! 


పార్వతి:- ఏడవకు నా చిట్టినాన్నా. ఈరోజు నీ హేపీబడ్డే కూడా. నేను చెప్తాగా బాబాయ్ పని. ఏవండీ! మీ మెడలో ఓ పాము ఇలా విసరండి. ఇంట్లో దారం కనబడ్డం లేదు... పెద్దబాబు పొట్టకుట్టడానికి! 


వినా:- అమ్మా! బాబాయ్ మళ్ళీ నవ్వాడే! 


పా:- ఏవయ్యా మరిదీ! చంటిపిల్లాడిని అదియునూ వాని పుట్టినరోజున … చూసి నవ్వడానికి సిగ్గులేదూ! సిగ్గే ఉంటే నా ఇరవైయేడుగురు చెల్లెళ్లను ఎందుకు పెళ్ళి చేసుకుంటావులే! చేసుకున్నావే ఫో! ఆ రోహిణిని తప్పా మిగిలిన ఇరవై ఆరుగుర్నీ కాల్చుకుతిన్నావు! మళ్ళీ ఆ గురుపత్ని తారను చేరదీసావు! ఇన్ని వెధవ్వేషాలేస్తుంటే మానాన్న శాపమిస్తే మా ఆయన నెత్తినెక్కావు. మా ఇంట్లో తింటూ , మా నెత్తినుంటూ....నాబిడ్డ నంటావా! ఉండు నీ పని చెప్తా! ఓ మాంఛి శాపం పడేస్తే... నాకొడుకు కాళ్ళు పట్టుకుంటావ్! బాబూ గణేష్ ఏం శాపమిద్దాం నీ బడ్డే గిఫ్టుకింద బాబాయికీ...!.... అంటూ పార్వతి వినాయకుడిని అడిగింది! 


అప్పుడు గణేషు.....ఏమన్నాడంటే...”అంటూ శుద్ధ వాడుకభాషలోకి దిగిపోయాడో లేదో... సాంప్రదాయాలను వెంట్రుకవాసి తప్పినా ఒప్పుకోని మా మావగారు  ఆగ్రహోదగ్రులై షణ్ముఖుడిని ఆయనకున్న మూడోనాలుగో కన్నులు పెట్టి కాల్చేస్తున్నారు పళ్ళునూరుకుంటూ! 


బ్రహ్మహింసాపాతకం ఎక్కడ చుట్టుకుంటుందా అని మా అత్తగారు వణికిపోతూ...గణగణగణా గంట వాయించేసి... హారతి వెలిగించి...షణ్ముఖుడిని ఈలోకంలోకి తెచ్చి పూజ అయింది అనిపించారు. 


మేము మాత్రం  ...పడీపడీ నవ్వుకుని పొరపాటున చవితిచంద్రుడిని చూసేసాం ఆయేడు! 


ఆయేడే సహస్రచంద్రదర్శనం చేసుకోబోతున్న మా మావగారు.. ఇంట్లోజరిగిన ఈ చంద్రదూషణ వలన చంద్రుడు హర్టయ్యి ఆయన ఆరోగ్యాన్ని ఎక్కడ కెలుకుతాడా అని మహాభయపడిపోయారు. 


అయితే ఆయన దివ్యమైన ఆరోగ్యంతో తొంభై ఎనిమిదేళ్ళు చులాగ్గా లాగించేసి  వెళ్ళిపోయారు. అది అప్రస్థుతం! 


ఆ  సంఘటన తరువాత ఓ ఐదేళ్ళు షణ్ముఖుడిని  చూడలేదు మేము! సింహాచలంలో శ్రీ నరసింహశాస్త్రిగారు షణ్ముఖుడికి వేదం, స్మార్తం, జ్యోతిష్యశాస్త్రాలలో బాగా తర్ఫీదు ఇస్తున్నారని చెప్పారు అతని మేనమామ! 


మళ్ళీ అతన్ని చూసింది... నా స్నేహితురాలింట్లో... కొత్తగా పెళ్ళయిన తన కొడుకూ కోడలితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తూ! 


నన్ను చూస్తూనే.. చేస్తున్న పూజ ఆపేసి.." రండి! రండమ్మా! మా ప్లీడరుగారి మూడవకోడలుగారు! మహా దొడ్డయిల్లాలు!"... అంటూ నన్ను సర్టిఫై చేసి మరీ ఆహ్వానించాడు షణ్ముఖ. పాతరోజుల్లో మా మావగారు కోప్పడ్డవన్నీ మర్చిపోయిన అతని మనసులోని స్వచ్ఛతకు ముచ్చటేసింది నాకు! 


అంతలో పూజ మొదలుపెట్టాడు! ఆ పూజచేయిస్తున్న విధం, మంత్రోచ్ఛరణ చూస్తుంటే... ఇదివరకటి షణ్ముఖశాస్త్రి కాదని , గురువుగారు బాగా సాగదీసారని అర్ధమయ్యి పరమానందపడిపోయా! 


పూజానంతరం...అందరికీ అక్షింతలు పంచి వ్రతకధ మొదలుపెట్టాడు. మొదటి రెండు అధ్యాయాలూ సంస్కృతశ్లోక పూర్వకంగా చక్కగా చెప్పాడు. 


మూడవ, నాల్గవ, ఐదవ అధ్యాయాలు సాధువు అనే శ్రేష్టిగారి కధకదా. నా స్నేహితురాలు వైశ్యులు! వెంఠనే మన షణ్ముఖుడు.." సోరీ శ్రేష్టిగారూ! ఇలా కులాల పేర్లతో కధలు చెప్పాలంటే మహాఇబ్బంది సుమండీ. మీరూ వైశ్యులు. అయితే మాత్రం ధర్మప్రభువులు. అబ్బాయి పెళ్ళికి మా దక్షిణలే ఏభైవేల వరకూ ఇచ్చినవారు! ఈకధలో వర్తకశ్రేష్టుడు పొదుపరి! స్వామివారి వ్రతం వాయిదాలు వేస్తూ అష్టకష్టాలు పడ్డాడు. మీముందు ఆకధ చెప్పాలంటే మొహమాటంగా ఉందంటే నమ్మండి"... అని అన్నాడో లేదో... నా కుడికన్ను అదరడం మొదలుపెట్టింది. 


అయితే నా మిత్రురాలి భర్త చక్కని క్రీడాస్ఫూర్తితో... " కానీయండి స్వామీ! " అని పర్మిషన్ ఇవ్వడమేంటి  విజృంభించేసాడు. కధలు వింటూ అందరూ నవ్వులే నవ్వులు. 


  " ఆగండాగండి! అసలు కధ మరోటుంది "..అన్నాడు... అప్పటికే అతని మెదడులో మరలు కాస్త వదులవుతున్నాయని నేను పసికట్టగలిగేను. ఆ కధ ఇలా సాగింది! 


తుంగధ్వజుడనే రాజు అడివికెళ్ళి, అక్కడ గోపాలకులిచ్చిన సత్యనారాయణస్వామి ప్రసాదాన్ని తీసుకోకుండా... " ఎంత ధైర్యంరా మీకు.ఈదేశాన్నేలే రాజుగారికే ప్రసాదం పెట్టేంత వాళ్ళయ్యారా మీరు? మర్యాదగా నా ఆవులు నాకప్పగించేసి ఫోండి. మీ ఉద్యోగాలు ఊడిపోయాయి! హయ్! " అని కసిరి ముందుకెళ్ళిపోతాడు. 


ఈ లోపున భటులొచ్చి.." రాజుగారూ! రాజుగారూ! మీ సహస్ర భార్యలంతా రోగంతో పోయారనగానే రాజు.." పోతే పోయారు ముసలిరాణులు. ఎప్పుడూ రోగాలే! నా సగం సంపద వీళ్ళ వైద్యాలకే సరిపోయింది! ఈసారి మాంచి పడుచురాకుమార్తెలను పెళ్ళాడతాను... "...అనుకుని ఆనందంగా సాగిపోతుంటే.." రాజా! మీ నూరుగురు కొడుకులూ సడన్ గా చనిపోయారు"... అంటూ మంత్రులు వచ్చారట! 


అప్పుడు రాజు..." పీడాపోయింది. వెధవలు నా సింహాసనం కోసం కొట్టుకు చస్తున్నారు! మళ్ళీ పిల్లలను కంటాను"... అంటూ తన రాజ్యం వేపుకు వెళ్తుంటే.." హే రాజన్! నీ రాజ్యం శత్రువుల పాలయ్యింది. నేనిప్పుడు వాళ్ళ సైన్యాధికారిని. మా గుర్రం మాకిచ్చేయ్"... అని సైన్యాధికారి తుంగధ్వజుడిని గుర్రం మీంచి లాగి తోసేయగానే... రాజుగారికి జ్ఞానోదయం అయ్యి... వెనక్కెళ్ళి గోపాలకులిచ్చిన దేవుడి  ప్రసాదం కళ్ళకద్దుకుని తినడంతో మళ్ళీ ఆయన పోగొట్టుకున్నవన్నీ ఆయనకు తిరిగొచ్చాయి...! " 


చూసారా మోష్ట్ పవర్ ఫుల్ గాడ్ శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామివారు. ఆయనతో పెట్టుకోకండి".... అంటున్న ...షణ్ముఖుడి వాక్ప్రవాహం కట్టలుతెంచుకుంటోందని గ్రహించి….. నేనే పూనుకుని...గబగబా…గణగణమని గంట వాయించేసి కుర్రాడిని ఇహలోకంలోకి తెచ్చాను! 


           ఇలా అన్నిచోట్ల...వానరవాలం బయటపెట్టుకుని... పానకంలో పుడకపడ్డట్టు...చక్కని పాండిత్యమున్నా... తన అస్థవ్యస్థ కధాప్రవచనాలతో...అన్ పాప్యులర్ అయిపోయాడు షణ్ముఖశాస్త్రి. 


ఈ మధ్యలో మేనమావ కూతురితో పెళ్ళికూడా అయ్యింది! ఒకసారి మా అమ్మాయి పెళ్ళిముహుర్తాలు పెట్టించుకోడానికి రామశాస్త్రిగారితో పనిపడి వారింటికి వెళ్ళా! వీధివీధంతా... ఖరీదయిన కారులబారు! వారిల్లుకూడా రీమోడల్ చెయ్యబడి రిచ్చుగా కనపడుతోంది. 


ఇంటిముందు... "దీర్ఘదర్శి- దూరదర్శి- జ్యోతిష్యప్రబుద్ధ -విద్వాన్ శ్రీషణ్ముఖశాస్త్రి అని పెద్దబోర్డ్ ఉంది. ఇంట్లోకి అడుగుపెట్టబోతుంటే లోపల్నుండి పెద్దపెద్ద అరుపులు వినిపిస్తున్నాయి.


 " హేవిటీ! నువ్వు సూపర్నెంట్ అవ్వాలా? మొహం చూడూ ఎలా ఉందో!మలేరియాదోమలు కుట్టి ఫైలేరియా వచ్చినదానిలా!  ఏరోజయినా వైద్యం చేసిన మొహవేనా అది! నీలాంటి లంచగొండి సూపర్నెంట్ అయితే ఆస్పత్రి గతి అధోగతే! ముందు ఇండీషన్ చెయ్యడం నేర్చుకో! ఆనక సూపరెంటు అవ్వచ్చు! " ...


ఆ అరుపులకు జవాబుగా... " చిత్తం స్వామీ! మీదయ! మీరెంత తిడితే అంత ఆనందం నాకు! మరికాస్త తీవ్రంగా తిట్టచ్చు కదా ఈ దీనుడిని".... అంటూ గోముగా వేడుకున్న... ఒకాయన బ్రహ్మానందంతో బయటకొచ్చి బెంజ్ కారు ఎక్కి చక్కాపోయాడు! 


ఈసారి మరెవరినో…మరింత తీవ్రస్థాయిలో దుర్భాషలు వినిపిస్తున్నాయి. ఎవరో రాజకీయనాయకుడనుకుంటా! కాసేపట్లో…ఆయన పరమానందంగా బయటకొచ్చి... వేచివున్న తన అనుచరగణాలతో... " స్వామివారు పిచ్చబూతులు తిట్టారు. ఎంఎల్యే ఏం ఖర్మ...ఇహ  మినిస్టర్ నే అయిపోతాను! ".... అనుకుంటూ కండువా సవరించుకుంటూ ఊరేగింపుగా సాగిపోయాడు.


 " ఎవరీ స్వామి! ఏంటి కధాకమామీషు "..అనుకుని లోపలికి వెళ్ళా! మన షణ్ముఖుడే! " ఏవిటండీ ఇదంతా"... అన్నానో లేదో.."


 నా ప్రారబ్దం ఉమాదేవిగారూ! వాక్శుద్ధి అబ్బిందట. రెండేళ్ళ క్రితం ఒకపెద్దాయన కాస్త విసికిస్తే... నీ దినంపెట్టా! నీ పిండాకూడు! అని నోరుపారేసుకున్నా. ఎక్కడో అడివిలో మందుపాతర పేలి అందరూ చచ్చి ఈయన బయటపడ్డాడు. మినిస్టరయ్యి... నాకాళ్ళ మీద పడ్డాడు! ఇదిగో అప్పటినుండి ఈ పాపభూయిష్ట చరిత్రులంతా నామీద పడ్డారు. 


విద్య ప్రసాదించిన అమ్మవారు నాలుకకి తేలుకొండి తగిలించింది. ఇప్పుడు నా మాట కాటుకు ఈ పాతకులంతా పావనులవుతున్నారు! ఐ యాం నాటెటాల్ హేపీ ఉమాదేవిగారూ! మరికాస్త ధనం సంపాదించుకుని నార్త్ ఇండియా మైగ్రేట్ అయిపోదామనుకుంటున్నా!మనమేం తిట్టినా ఆ కుంకలకు తెలీదు! పైగా  హిందీలో పెద్దగా తిట్లుకూడా రావుగా మనకు"! .... అంటూ అమాయకంగా...కొంత నవ్వు, కొంత విషాదం కలిపి చెప్తున్న ఆ షణ్ముఖుడు నాకెప్పుడూ ఇష్టుడే! 


తన ప్రమేయం లేకుండానే... బుర్రకంట్రోల్ తప్పి..తను నమ్మిన నిజాలను హాస్యం మేళవించి... తన ధోరణిలో...చెప్తూ..నవ్వించే అతనికి ఎక్కడో అక్కడ నిజమైన మనశ్శాంతి, అతని వైదుష్యానికి తగిన మన్నన దొరకాలి... అని ప్రార్ధించుకున్నా మనసులో!  


ధన్యవాదాలతో! 


*శశికళ ఓలేటి* 


..🙏🙏స్వీయ అనుభవాల ఆధారంగా రాసినది. కల్పితం కాదు.

6, మే 2021, గురువారం

ప్రియంచనానృతం బ్రూయాత్

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

🥀  *సత్యంలోని సత్యం*🥀


🌻 *"నబ్రూయాత్ సత్యమప్రియం"🌸* సత్యమును కఠినంగా ఉండేట్లు, బాధపడేట్లు చెప్పకండి, చెప్పకండి. సత్యాన్నే చెప్పండి, ఎదుటివాడు బాధపడేట్లు సత్యాన్ని చెప్పకండి. 


ఎదుటివాడు ఒక తప్పు చేశాడనుకోండి. శిష్యుడే అనుకోండి, నలుగురిలో పట్టుకొని నువ్విలా చేస్తావా అనకండి. కనుక "సత్యార్జవే" సత్య ప్రవర్తనం, కష్టంగా ఉండేటట్లు చెప్పకండి సత్యం. శిష్యుడు ఇట్లా చేశాడు. "ఏరా! ఇలా చేశావు? బుద్దుందా, లేదా నీకు? ఎన్ని మాట్లు చెప్పాలి నీకు? మందమతీ,చవట వెధవా" అనరాదు. తప్పు అని, వాణ్ణి లోపలికి, ఇంట్లోకి పిలిచి, ఎవ్వరూ వినకుండా, వాడు ఒక్కడ్నీ పిలిచి, చెప్పేటువంటి సద్బుద్ది మన దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది? వీళ్ళందరి ఎదురుగుండా వాడితో చెప్పాననే దురద మనకు తీరాలంటే? జంతుత్వం, పశుత్వం మనం తీర్చుకుంటున్నాం వాడి యందు. 


మనం ఏమన్నా కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరని నలుగురిలో ఒకడ్ని పట్టుకొని మనం తిడుతున్నామంటే అర్థమేంటి? మనలో ఉన్న జంతుత్వాన్ని, మనలో పశుత్వాన్ని బయట పెట్టుకుంటున్నామని అర్థం. మనలో మానవత్వం ఉంటే వాడ్ని వేరే ఒంటరిగా పిలిచి చెప్పి ఉండేవాళ్ళం, కొడుకైనా సరే, శిష్యడైనా సరే, తమ్ముడైనా సరే, మిత్రుణ్ణయినా సరే, ఎవరయినా సరే హృదయంలో ఉన్న పరమాత్మను మనం గుర్తించటం కనుక నేర్చుకున్నట్లయితే, నలుగురు ఎదురుగుండా పట్టుకొని అదీ ఇదీ అనిఉండేవాళ్ళం కాదు. అంటే మన దగ్గర్నుంచి బయలుదేరాలి ఆచరణ అనేది. 


కనుక సత్యం ఎప్పుడూ కూడా అప్రియంగా చెప్పకు, "ప్రియంచనానృతం బ్రూయాత్" చాలా మధురంగా ఉంటుంది గదా అని అబద్ధమూ చెప్పవద్దన్నారు. *సత్యాన్ని అవతలివాడు ప్రేగులు తెగేటట్లు చెప్పకూడదు‌.* చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి అసత్యమూ చెప్పకూడదు.........!

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

అంతా డాక్టర్లే

 దేశం అంతా డాక్టర్లే

🤔🤔🤔🤔🤔🤔


శ్రీ కృష్ణ దేవరాయలు

ఓక రోజున సభ నిర్వహిస్తూ

మన రాజ్యం లో

ప్రజలు ఏక్కువ మంది ఏ వృత్తీ లో ఉన్నారు

అని ప్రశ్నించేరు.

తమ ఏలుబడిలో

వ్యవసాయ వృత్తీ లో

ఏక్కువ మంది ఉన్నారని కోందరు

వర్తకం చేస్తూ ఏక్కువ మందీ ఉన్నారని కోందరు .రకాల వృత్తు లవారూ ఏక్కువ మంది ఉన్నారని కోందరు రకరకాలుగా చేప్పేరు

ఆఖరున వికట కవి లేచి 

మహారాజా

మీ రాజ్యంలో అందరి కన్నా ఏక్కువ మంది వైద్యులు ఉన్నారని

శ్రీ కృష్ణ దేవరాయల వారికీ విన్నవించేడు.

తేనాలి రామ లింగడు.

వేటకారం చేస్తున్నాడని భావించిన మహారాజు

వ్యవసాయము లో ఏక్కువ మంది ప్రజలు ఉండవఛు.వ్యాపారం లో ఉండవచ్చు. నువ్వేంటీ వైద్య వృత్తీ లో ఏక్కువ మంది ఉన్నారని అంటున్నావు

నాతోనే వేటకారమా రామ లింగా..

కాదు. మహారాజా. నేను చేప్పేది నిజం

నిరూపించ గలను మహారాజా అని 

వికట కవి అనగానే

రామ లింగా నువ్వు అన్నది నిరూపించు

లేకుంటే నీకు శిరశ్చేదన దండన 

శిక్ష విధీస్తాను.అని సభ చాలిఁచారు.

మరునాడు తేలవారకుండా

రామలింగడు

మహా రాజును

తీసుకుని తలకు శీరోభార ము ఉన్నట్లుగా నుదుటీకీ

కట్టు కట్టి మారు వేషాల్లో నగర సంచారం  ప్రారంభించగానే

గుడిలో అర్చకుడు ఏదురు పడి

అయ్యా మీకు శీరో భారమా నుదీటీకీ

కట్టు కట్టేరు.. దీనికి

తులసి రసం నుదుటి కీ రాస్తే శీరోభారం చీటికలో తగ్గిపోతుంది.

అని అయాచితంగా సలహా ఇఛీ ముందుకు కదీలేడు

రాజు గారు వికట కవి మరో నాలుగు అడుగులు ముందుకు కదలగానే

నాగలి భుజాన వేసుకుని రైతు

తారస పడి

బాబు తల పోటా

ఏమి రాసేవూ

నేను ఓ చిట్కా చేపుతాను చేయ్యి

ఇలా తీసేసీనట్లు

తగ్గి పోతుంది

ఆవూనేయ్య హారతి కర్పూరం రంగరించి నుదుటీన పట్టు వేయ్యి

చీతీకలో తల నోప్పి పోతుందని చేప్పి మందుకు కదీలేడు

ఇలా వికట కవి. మహారాజుకు ఏదురు పడ్డ ప్రతి వ్యక్తీ వీరికి ఉచిత వైద్య సలహా ఇస్తూనే ఉన్నారు.

ఇదంతాచూసీ చూసి

రాజు ఆశ్చర్యం చేంది

వికట కవి చేప్పింది నిజమే నని ఓప్పుకుని

ఓక అగ్రహారం బహుమతి గా ఇఛేరు

ఆ అగ్రహారం పేరు

అయాచితవైద్యఅగ్రహారం గా నిన్న మోన్నటి వరకూ పిలవ బడేదీ.


ఈ కధ అదేనండి సోది

ఏందుకూ అంటే ...


నిన్న. నేడు. రేపు

ఏ న్యూసుపేపరు చూసినా

ఏ న్యూస్ చానల్ చూసీనా

waats app గ్రూప్ చూసినా

ఏక్కడ చూసినా

ఏక్కడకు వేళ్ళినా

కరోనా ఉచితవైద్యసలహాలే


దేశం అంతా కరోనా

రోగ మయం 

కాదు.. కాదు

అందరూ అయాచితంగా

వైద్య సలహా మయం

దేశం అంతా డాక్టర్ల మయం.😟

ఓంకారం అంటే....

 ఓంకారం అంటే....


🧘🏻‍♀️🧘🏻‍♀️🙏🙏🧘🏻‍♀️🧘🏻‍♀️🙏🙏🧘🏻‍♀️🧘🏻‍♀️



🌺 పంచభూతాల్లో శబ్దం ముందు ఉంది. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారమే


🌺 ఓంకారం దేహంలో ఉంది. 'ఓం' అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం పులకితమవుతుంది. దివ్య ప్రకంపనలు శరీరాన్ని చుట్టుముడతాయి. అప్పుడు శరీరం సహజ ధ్యానంలోకి అత్యంత సహజంగా వెళుతుంది. ఆ తరవాత నిశ్శబ్దంలో ఓలలాడుతుంది.


🌺 ఓంకారానికి, ఓంకారానికి మధ్య ఏర్పడుతున్న నిశ్శబ్దాన్ని సాధకుడు గమనించాలి. అక్కడ మనసు ఆగిపోతుంది. ఆ నిశ్చలత్వమే ఓంకారాన్ని ఉద్దీపింపజేస్తుంది. ప్రయత్నపూర్వకంగా ప్రతి రోజూ ఓంకారాన్ని జపిస్తే, కొంతకాలం గడిచాక మనసులో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది.


🌺 'ప్రశాంతత కావాల్సినవారు ఓంకార ధ్యానం చేయాలి' అంటారు ఓషో. నమ్మకం ఉన్నవారైనా, లేనివారైనా ఓంకారాన్ని జపిస్తూ అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. 'అ'కార, 'ఉ'కార, 'మ'కారాలు కలిసి 'ఓంకారం' అయిందని పండితులు చెబుతారు.


🌺 ఔషధాన్ని నమ్మనివారైనా, దాన్ని తీసుకున్నప్పుడు దాని పని అది చేస్తుంది. ఓంకారమూ అంతే! ఆ శబ్దాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టగానే, అది సాధకుల్ని చక్కగా పట్టుకుంటుంది. ఆరోగ్యం కలిగించేవరకు అది విడిచిపెట్టదు - అంటారు యోగ నిపుణులు.


🌺 వేదభూమికి ఆధారం ఈశ్వరుడు. ఆయనకు శబ్దరూపం ఓంకారం. ఓంకారంతో ధ్యానంలోకి ప్రవేశిస్తే చాలు. ఆనందం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం లేదని ఉపనిషత్తులు చెబుతున్నాయి.


🌺 ఓంకారం అంటే, ఆనంద స్వరూపం. అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ఆనందమయ కోశాల్ని దాటి వెలుగులీనుతూ ఉంటుంది అది. ఎవరు ఆ ప్రణవ శబ్దం చేస్తారో, వారితో సులువుగా కలుస్తుంది. వారిని తనలో కలుపుతుంది.


🌺 ఓంకారం ప్రాణం. చైతన్యం, సత్యం, ఆనందం... అన్నీ ఓంకారమే.


🌺 ప్రతి స్తోత్రమూ ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ప్రతి శ్లోకమూ ఓంకారంతోనే జీవిస్తుంది. ఓంకారంతోనే విశ్వం ప్రారంభమైంది. అది చివరికి ఓంకారంలోనే లీనమవుతుంది. 'ఓం' అని ధ్యానిస్తే పరమేశ్వరునికి మోకరిల్లినట్లే...🙏


🧘🏻‍♀️🧘🏻‍♀️🙏🙏🧘🏻‍♀️🧘🏻‍♀️🙏🙏🧘🏻‍♀️🧘🏻‍♀️

కరోనాను సులువుగా జయించడానికి

 కరోనాను సులువుగా జయించడానికి 13 సూత్రాలు.


1. లక్షణాలు కనబడిన  మొదటి రోజే హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్మెంట్ మొదలు పెట్టండి.

2. లక్షణాలు కనబడిన మొదటి రోజే ఒక డాక్టర్(online/offline) పర్యవేక్షణ లో ఉండండి. 

3. లక్షణాలు కనబడిన రెండో రోజు RTPCR test ఇవ్వండి. దాని రిజల్ట్ గురించి ఆందోళన వద్దు.

RTPCR లో పాజిటివ్ రాగానే కంగారు పడుతూ హాస్పిటల్స్ కి పరిగెత్తకండి. 

RTPCR లో నెగెటివ్ వచ్చినా ప్రస్తుత పరిస్థితుల్లో దానిని కరోనా కాదని ఊహించకండి. ఒక పదిరోజులు కరోనానే అనుకుని జాగ్రత్తగా ఉండటం వలన ప్రపంచం ఏమీ తల్లకిందులైపోదని గుర్తించుకోండి.


4. లక్షణాలు కనబడిన ఐదవరోజు వరకు రక్తపరీక్షలు, చెస్ట్ ఎక్స్ రే, సీటీ స్కాన్ల అవసరం ఉండదు.


5. లక్షణాలు ఉన్నా తగ్గినా ఐదు లేదా ఆరవ రోజు రక్త పరీక్షలు డాక్టర్ సూచించినట్టు చేయించుకోండి. 


6.అవసరం ఐతే చెస్ట్ ఎక్స్ రే లేదా సీటి స్కాను ఐదు నుంచి పది రోజుల మధ్య చేయించే అవకాశం ఉంటుంది. అది ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ మీ లక్షణాలనుబట్టి వచ్చిన రక్త పరీక్షల రిపోర్ట్ లను బట్టి నిర్ణయిస్తారు.

7. లక్షణాలు మొదలైన ఐదవ రోజునుంచి ప్రతి మూడు గంటలకొకసారి పల్స్ ఆక్సీమీటర్ ను చూసుకుంటూ ఉండండి. ఆక్సిజన్ శాతం 94% కన్నా తక్కువగా ఉన్నా పల్స్ రేట్ 120/మినిట్ కన్నా ఎక్కువగా ఉన్నా మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళండి.


8. లక్షణాలు కనబడ్డ ఐదో రోజు నుంచి పదో రోజు వరకు జ్వరం పెరిగుతున్నా లేదా జ్వరం కంట్రోల్ కి రాకున్నా దగ్గు పెరుగుతున్నా లేదా దగ్గు కంట్రోల్ కి రాకున్నా మీ డాక్టర్ దృష్టికి తీసికెళ్ళండి. 


9. Oxygen శాతం 93% కంటే తక్కువగా ఉంటేనే హాస్పిటల్ అడ్మిషన్ అవసరం. 90-93% ఉన్నప్పుడు ఆయాసం లేకపోతే  ఆందోళన అవసరం లేదు. ఆ సమయంలో మీ డాక్టర్ తో మాట్లాడండి. నింపాదిగా ఉంటూ ఎక్కడైనా బెడ్ దొరకగలదేమో ప్రయత్నించండి. కంగారు పడుతు పేషంట్ ని కంగారు పెట్టడం వలన ఆక్సిజన్ శాతం మరింత వేగంగా పడిపోయే ప్రమాదం ఉంది. 


10. 93%కంటే తక్కువగా ఆక్సిజన్ పడిపోవడమన్నది పదిమందిలో ఒకరికి జరిగే అవకాశం ఉంది. కాబట్టి భయం అనవసరం. సంయమనంతో కంగారు పడకుండా ఉండేవాళ్ళలో 90% కి తగ్గి కూడా మెల్లిగా మళ్ళీ అదేంతకు అదే ఒకరోజులో మామూలు స్థితికి వస్తుంది. కాబట్టి ఆక్సిజన్ శాతం తగ్గినపుడు ఆందోళన పడకపోవడం చాలా చాలా ముఖ్యం.


11. హోం ఐసోలేషన్లో సరిగా తినని వాళ్ళు కరోనానుండి కోలుకోవడాని చాలా సమయం పడుతోంది. సరిగా తినని వాళ్ళలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ కూడా తగినంత స్థాయిలో ఉండటం లేదు. అంతే కాక వీళ్ళలో కరోనా వలన విపరీతమైన నీరసం ఆవహిస్తున్నది. కరోనా తగ్గాక కూడా మూడు నెలలు ఈ నీరసం బాధపెడుతున్నది. కాబట్టి ప్రతి మూడుగంటలకు ఎంతో కొంత తినడం ముఖ్యం. షుగరు జబ్బు ఉన్నవారు తగినంత ఆహారం తీసుకుంటూ ఇంట్లో రెండు పూటలా షుగర్ టెస్టు చేసుకుంటూ మీ డాక్టర్ సూచించానట్టు ఏ రోజుకారోజు షుగరు మందుల డోసు అడ్జస్ట్ చేసుకోవచ్చు. 


12. హోం ఐసోలేషన్ లో ఉన్నపుడు వీలైనంత పడుకోవడమూ అవసరం. అనవసర శక్తి ప్రదర్శన వ్యాయామాలు చేస్తూ తాము బాగానే ఉన్నామని అనుకోకూడదు. ఏ జ్వరం వచ్చినపుడైనా పూర్తి విశ్రాంతి చాలా అవసరం. శరీరం విశ్రాంతిలో తిరిగి పుంజుకున్నంతగా ఎందులోనూ పుంజుకోదనే విషయం మనకందరికి తెలుసు. కాబట్టి నిద్రను ఎట్టి పరిస్థితుల్లో అలక్ష్యం చేయకూడదు. 12-14 గంటల నిద్ర హోం ఐసోలేషన్లో అవసరం. రాత్రి ఎనిమిది గంటలకంటే ముందే నిద్రపోతున్న వారిలో కరోనా లక్షణాల తీవ్రత ఉండటం లేదు. ఎనిమిది తరువాత టీవీలు సెల్ఫోన్లు చూస్తూ రాత్రిళ్ళు మేలుకొంటూ, ఆందోళన చెందేవారిలో వైరస్ ని చంపే గుణం గల మెలటోనిన్ ఉత్పత్తి జరగడంలేదు. అందుకే త్వరగా కోలుకోవడమూ లేదు.


13. భయంగొలిపే వార్తలకు దూరంగా ఉండటం చాలా అవసరం.మంచి సంగీతం..సరదా జోక్సు మనసును తేలికపరుస్తాయి. బంధు మిత్రులు ఆందోళన పడుతూ ఇచ్చే సలహాలు వృథా అని గుర్తించండి. వాళ్ళు ఆందోళన పడుతూ మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తూ చివరికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లనూ ఆందోళన పెడుతూ ఉంటారు. ట్రీట్మెంట్ విషయంలో పదిమంది చేతులు పెట్టకుండా చూసుకోవడం అవసరం. ఒక డాక్టర్ చాలు.


ఇవి పాటిస్తే..కరోనా కింగ్ or కరోనా క్విన్ మీరే.

_కధ_ఇప్పుడే_మొదలైంది


#_కధ_ఇప్పుడే_మొదలైంది


కంటికి కూడా కనిపించని #_Corona 

అనే సూక్ష్మాతి సూక్ష్మ క్రిమి 

నీ ఊపిరితిత్తులలో చొరబడ్డాక మొదలయ్యే కధే ఇది 


నీ గొంతునెవరో నొక్కేసినట్టు

నీ ఉదరకోశాలనెవరో మెలిపెట్టి తిప్పేసినట్టు

శ్వాస కూడా అందని పరిస్థితి లో 

వాటిలో ద్రవాలు ఇరుక్కుంటాయి

 #_Fluids_stucked_lungs 

దీనివల్లే కొంతమందికి నోటినుండి నురుగొస్తుంది

దానివల్ల గాలి పీల్చుకోవడం అతి కష్టంగా మారి 

మూలుగు లాంటి ఒక శబ్ధం వస్తుంది

దాన్నే  #_Death_rattle అంటారు 


అప్పటి వరకూ రోజూ తెల్లగా అవ్వడం కోసం 

#_Cream లు పూసిన నీ శరీరం 

నల్లగా మారడం మొదలుపెడుతుంది 

ముట్టుకుంటే చల్లగా వుంటుంది...

ఇక ఏ #_Moisturiser లు రాయాల్సిన అవసరం లేదు


రక్త కణాలు #_RBC అన్నీ తెగిపోయి 

ఎక్కడివి అక్కడే నిల్చిపోయి రక్తస్రావం లా మారిపోతాయి మెల్లిగా...నీ గుండె చప్పుడు ఆగిపోయింది

పక్కనున్న #_ECG_monitor_Uniform గా గోలపెడుతుంది (కనీసం అదైనా దాని పని నిజాయితీగా చేస్తుంది!)


#_Doctor లు కూడా #_sorry అని చేతులెత్తేసినప్పుడు

#_Background లో మెల్లగా నీ వాళ్ళ ఏడుపు మొదలయ్యి దాని #_decibel_count అంతకంతకూ పెరుగుతూ పైకప్పు లేసిపోతుందేమో అన్నంత భయంకరంగా మారుతుంది


అదృష్టవంతుడివి. ఈ #_Drama అంతా తప్పించుకున్నావు #Doctor లు, #_Hospital_Equipment ల దృష్టిలో 

నువ్వు చచ్చిపోయావు 

దీన్నే #_Technical గా  #_Medical_terminology లో #_Clinical_Death అంటారు


కానీ...

నీ ఆత్మ మహాప్రస్థానానికి ఇంకా

నాలుగు నుండి ఆరు నిముషాల సమయం వుంది

ఒక చిన్న చేప పిల్ల గాజు పాత్రలో వేగంగా 

అటూ ఇటూ తిరుగుతున్నట్టు

అది నీ శరీరంలోని ప్రతి అణువు తిరుగుతుంటుంది


పిచ్చిగా...వేగంగా... 

ఏదో మర్చిపోయినదాని కోసం వెతుకుతున్నట్టు

కలలో ఎవరో తరుముతున్నట్టు బయటపడడానికి ఇష్టంలేక 

లోపలే దాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్టు తిరుగుతూ ఉంటుంది అదే నీ నిజమైన అంతిమయాత్ర


ఆరవ నిముషం ముగిసే లోపల నీ మెదడులోని 

ఏ ఒక్క కణం #_cell కూడా ప్రాణంతో మిగలదు

అన్నీ పూర్తిగా సమాధి అవుతాయి

#_oxygen కరువై  క్షణంలో లక్షోవంతులో 

అవన్నీ ఒక్కసారిగా చచ్చిపోతాయి

మంచు ముద్దలు ఎండకు కరిగినట్టు

నిప్పు తునకలు నీటికి ఆరినట్టు


'నువ్వు' అనబడే నీ ప్రాణం శూన్యం లో కలిసిపోతుంది

సరిగ్గా అదే సమయంలో నీకెవరో ఆహ్వానం పలుకుతుంటారు

అది శంఖచక్రాలు ధరించిన నారాయణుడో 

లేక పాశం విసిరి ప్రాణం తీసిన యమకింకరుడో 

అది ఎవరనేది ...నువ్వు బ్రతికిన బ్రతుకు నిర్ణయిస్తుంది


తెలుసుకో...

చావు కేవలం ఒక ద్వారం మాత్రమే

అది ఏ  క్షణమైనా నీకోసం తెరుచుకోవచ్చు మిత్రమా

చచ్చాక నీ శరీరం  #_Decompose అయ్యేదాకా కాదు

నీ శవాన్ని కూడా నీ వాళ్ళు తీసుకోలేరిప్పుడు


నేస్తమా...గుర్తుందా....

నిన్నటి వరకూ ఎన్ని కుట్రలు ...కుతంత్రాలు

నమ్మక ద్రోహలు...పగలు..ప్రతీకారాల నడుమ

అసూయ అనే నిశీధి నీడలో బ్రతికేస్తూ

నా అనుకునే నలుగురినీ హేళన చేస్తూ 

నిత్యం విద్వేషపు చితిలో రగిలిపోయావో


నేడు

రేపటి వరకూ బ్రతికుంటే చాలనుకుంటున్నావు.. ప్చ్

తెలుసుకో నేస్తం.....ఇంతే జీవితం


చెట్టూ..పుట్టనే కాదు

మంచీ...మానవత్వాన్ని కూడా నిలువునా నరికేసి

నేనూ..నాది అని నిన్నటి వరకూ 

స్వార్థంతో పరుగులు తీసిన ఓ మనిషీ


నీ ఆటలూ...పాటలూ

సంతోషాలు...ఆనందాలే కాదు

నేడు నీ దుఖః కూడా నిషేధమే

ఎందుకంటే దుఖః సముద్రమైన నీ దేహం

ఊపిరి అందక ఒరుగుతున్న నీ బంధాలను 

చూసి ఏడ్చి ఏడ్చి ఎండిన కన్నీటి వాగయ్యింది

ఇప్పుడు నీ చుట్టూ ఉన్నది కళేబరాల దిబ్బలే కాదు

శవాల ప్రవాహాలు కూడా


#_Corona ఖతమైపోతుందని అనుకోకు

దాని కధ ఇప్పుడే మొదలైంది

చూస్తుండు నీలోని చెడుని చంపేదాకా

భయంతో చస్తూ బతకడం కన్నా

చావే నయమనిపించేలా చేస్తుంది


ఓ మనిషీ ఇకనైనా మారు

నీ చుట్టూ ఉన్న సమస్తాన్ని  ప్రేమించు

చావులో కూడా బ్రతకడం నేర్పించు.

   Mangu venkat 💐💐