ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
31, మే 2021, సోమవారం
అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 .
ఆయుర్వేదము నందు గల అష్టమస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ - 2 .
హస్తనాడి గురించి మీకు అంతకు ముందు పోస్టు నందు వివరించాను. ఇప్పుడు మరింత విలువైన సమాచారం మీతో పంచుకుంటున్నాను .
ముందుగా ఆయుర్వేదం నందు నాడిని చూసే విధానం గురించి తెలియచేస్తాను . వైద్యుడు నాడిని ఉదయమున పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి మూడువేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున చక్కగా నాడిని పరీక్షించవలెను .
పురుషులకు కుడిచేతి యందు , స్త్రీలకు ఎడమ చేతి యందు నాడిని పరీక్షించవలెను . దీనికి ప్రధాన కారణం పురుషులకు నాభి కూర్మము అధోముఖముగా , స్త్రీలకు నాభి కూర్మము ఊర్ధ్వ ముఖంగా ఉండును. ఈ బేధము చేతనే స్తీపురుషుల హస్తనాడులు బేధముగా ఉన్నవి. అనుభవము మరియు శాస్త్రము నందు చెప్పబడిన దాన్ని బట్టి చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరం రెండో చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది .
పాదనాడి పరీక్షించుట వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువుగా ఉండునా లేక తేలికగా ఉండునా మరియు జ్వరము విడిచి స్వస్థత చేకూరినదా వంటి విషయాలు తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను .
హస్తనాడి అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతిని ఆకలిగొనుటను , చెడిపోయిన వాతపిత్తకఫములను తెలియచేయును . అందుచే వైద్యులు ప్రధానముగా దీనినే పరీక్షించెదరు .
కంఠనాడి గాయములు , భయము మున్నగు బాహ్యాకారణముల చేత వచ్చు జ్వరమును , తృష్ణను , ఆయాసమును స్త్రీసంగమము , భయము , దుఃఖము , కోపము అనువాటిని ఈ కంఠనాడి తెలుపును . దీనిని పరీక్షించుటకు ప్రత్యేక నైపుణ్యత అవసరము . సామాన్యులు దీనిని పరీక్షించలేరు .
నాసా నాడి చనిపోవుటయు , జీవించి ఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములను గురించి తెలియచేయును .
అప్పుడే స్నానము చేసినవారికి భుజించినవారికి , తలస్నానం చేసినవానికి , ఈదినవానికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవానికి నాడిని పరీక్షించిన బాగుగా తెలియదు . కావున అప్పుడు నాడిని చూడరాదు .
తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం అందించడం జరుగును.
గమనిక -
నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి. పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కొరోనా వైరస్ సృష్టికర్తలు
హరిః ఓమ్, Odde Sivakesavam. హరిః ఓమ్.
*కొరోనా వైరస్ సృష్టికర్తలు - ఒక మగ పిశాచం , ఒక ఆడ రాక్షసి* ?
బయటపడుతున్న ఆశ్చర్యకరమైన నిజాలు !
ఈ వ్యాసాన్ని ఒక ముఖ్యమైన వ్యాసంగా నేను అనుకొంటున్నాను ఎందుకంటే ఇది మన చావు బ్రతుకులతో ముడిపడివున్న ఒక సమస్యపై వ్రాస్తున్న వ్యాసం , ప్రపంచం లో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన ఒక విపత్తుపై వ్రాస్తున్న వ్యాసం.
ఇది చదివినపుడు , ఇది మీకు నచ్చితే , మీరు ఇతరులతో ఈ విషయాలు చర్చించడానికి , వాళ్ళకు వివరించడానికి సులభంగా వుండాలని ఈ వ్యాసాన్ని ఒక నోట్సు లాగా చిన్న చిన్న పేరాలుగా / పాయింట్లుగా వ్రాస్తున్నాను.
ఈ వ్యాసం వ్రాస్తున్న ఈ సమయానికి ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య *35, 47, 858.(~35.5 lakhs)*
అమెరికా లో మరణాల సంఖ్య 6 , 09 , 417. భారత్ లో ఈ సంఖ్య 3, 25 , 998. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 17, 06,09, 535.
ఇంతమందిని పొట్టనపెట్టుకొన్న ఈ కోవిడ్ మహమ్మారి ప్రకృతి లో సహజంగా వచ్చినది కాదు , *ఇద్దరు వ్యక్తులు ఒక చైనా ప్రయోగశాలలో సృష్టించిన [man made] మహా ప్రళయం*.
ఆ ఇద్దరు వ్యక్తుల పాపిష్టి ముఖాలను క్రింద ఫోటోలో చూడవచ్చు.
*ఆమె పేరు Shi Zhangli [ షీ జంగ్ లీ - చైనా ] , అతని పేరు Peter Daszak [ పీటర్ దస్జాక్ - అమెరికా* ]
ఈ కోవిడ్ వైరస్ ను మొదట నవంబరు - 2019 లో గుర్తించినపుడు ఇది చైనా లోని Wet Market లో జంతువుల ద్వారా వచ్చిందని అన్నారు.
[బ్రతికివున్న మూగ జంతువులను , పాములు , గబ్బిలాలు , కప్పలు మొదలగు ప్రాణులను , అప్పటికప్పుడు చంపి అమ్మే దుర్మార్గపు మార్కెట్లను wet markets అంటారు. ఇలా చేసే నీచ నికృష్ట దేశం ప్రపంచంలో చైనా ఒక్కటే అని అంటారు].
ఈ వైరస్ 2002 లో వచ్చిన SARS లాంటిది అని దీనికి SARS-2 అని పేరు పెట్టారు.
తరువాత WHO వాళ్ళు Novel Corona Virus అని అన్నారు , చివరికి CO అంటే Corona అని , VI అంటే virus అని , D అంటే Disease అని చెప్పి , వచ్చిన ఏడాది 2019 కాబట్టి *COVID - 19 అని నిర్ధారించారు*.
*షి జంగ్ లీ* అనే ఆవిడ [ కింద ఫోటో లో చూడవచ్చు] చైనా లోని WIV [ Wuhan Institute of Virology ] లో శాస్త్రవేత్త , పరిశోధకురాలు.
ఆమె గబ్బిలాల [Bats] మీద విశేషంగా రీసెర్చి చేస్తుంటారు. అందుకే ఆమెను Bat Lady అని పిలుస్తుంటారు.
ఈ వైరస్ గబ్బిలాల వల్ల వచ్చిందని అని మొదట్లో తప్పుడు ప్రచారం చేసారు.
మనుషులు చేసిన ఘోరమైన పాపాన్ని , పాపం గబ్బిలాల మీదకు తోసారు.
ఈ *జంగ్ లీ* , అలాగే ఇతర శాస్త్రవేత్తలు ప్రచారం చేసినట్టు ఈ వైరస్ ఊహాన్ లో గబ్బిలాల ద్వారా రావడానికి అవకాశం లేదు.
*ఎందుకంటే ఊహాన్ లో గబ్బిలాలు లేవు*.
"అవి వుండేది దక్షిణ చైనా
లోని Yunnan ప్రాంతంలో."
మన మనసులో ఒక ప్రశ్న పుట్టవచ్చు - Yunnan నుండి Wuhan కు గబ్బిలాలు రావచ్చు కదా ? అని.
*రావు ఎందుకంటే రాలేవు ! ఎందుకు ?*.
"యున్నాన్ ( Yunnan) కు ఊహాన్( Wuhan) కు మధ్య దూరం 1500 కి.మీ."
*గబ్బిలాలు 50 కి.మీ. కంటే ఎక్కువ దూరం ఎగరవు అని వాటిని అధ్యయనం చేసిన సైంటిస్టులు చెపుతున్నారు.*
మరి అవి ఊహాన్ కు ఎలా వచ్చాయి ? అంటే , వాటిని తెచ్చారు.
*ఎవరు ?*.
" ఇంకెవరు ఈ Bat lady నే".
ఎపుడు తెచ్చిందో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం.
"2015 లో యున్నాన్( Yunnan) గుహలలోంచి వాటిని *జంగ్ లీ* ఊహాన్ ( Wuhan) కు తెచ్చింది."
*ఎన్ని తెచ్చింది ?*
"100 గబ్బిలాలు తెచ్చింది".
2015 కు ముందు , ఆ తరువాత ఆమె యున్నాన్ (Yunnan ) గుహలకు అనేకమార్లు వెళ్ళిందని అఫిషియల్ రికార్డులు చూపిస్తున్నాయి.
*గబ్బిలాలు తెచ్చి ఏమి చేసింది ?*.
అమెరికా లో North Carolina రాష్ట్రంలోని *North Carolina State University* లో శాస్త్రవేత్త అయిన *Ralph S Baric* ను సంప్రదించింది.
"ఆయన ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్టుల్లో ముఖ్యుడు".
గబ్బిలాల లోకి , మనుషులు , ఇతర ప్రాణుల శరీరాల్లోకి ప్రవేశించే వైరస్ ను ఎలా జొప్పించాలి అనే విషయంలో ఈ *జంగ్ లీ* కి ఆయన పాఠాలు చెప్పాడు.
*ఎలా ప్రవేశ పెడతారు ?*-
అనే ప్రశ్నకు చాలా వివరంగా చెప్పాల్సివుంటుంది.
*దాన్ని చిన్నగా టెక్నికల్ భాషలో చెపుతాను* :
"SARS -1 సూక్ష్మజీవి లోని *spike protein* ను తొలగించి దాని స్థానంలో గబ్బిలాలలోవుండే ఒక కణాన్ని ప్రవేశపెడతారు."
"ఇది మానవ శరీరంలోని సూక్ష్మ కణజాలాన్ని త్వరగా , వేగంగా infect చేస్తుంది".
*ఇంత ప్రమాదకరమైన పనిని ఎందుకు చేసారు ?*
"ఈ ప్రశ్నకు జంగ్ లీ , WIV వాళ్ళు తెలివైన జవాబు ఇచ్చారు."
SARS-1 మహమ్మారి ఇంకోసారి భవిష్యత్తులో మరికొన్ని వ్యాధులకు దారి తీయకుండా వుండేందుకు , ఆ వ్యాధులు ఎలా వ్యాప్తి చెందుతాయో తెలుసుకొనేందుకు ఈ ప్రయోగాలు చేసాము అని వారు అన్నారు.
*ఈ అంశాన్ని వైరాలజీ లో Gain of Function అంటారు*.
" ఇది వింటే వాళ్ళ పని తప్పు అనిపించదు కదా ?"
*కాదు*.
"ఈ ప్రయోగాలు వారు చెపుతున్నట్టు 'ముందుముందు వచ్చే వ్యాధులకు సంబంధించింది' కాదు."
*మరేమిటి ?*
"ఇది ప్రపంచం మీదకు దుష్ట చైనా ఎక్కుపెట్టిన విషపు బాణం."
*ఎలానో వ్యాసం చివరన చూద్దాం.*
"మరి వ్యాసం మొదట్లో చెప్పిన *Peter Daszak* ఎవరు" ?
*ఈ వ్యక్తి అమెరికాకు చెందిన వైరాలజిస్టు.*
"అమెరికా పొలిటీషియన్ల దగ్గర పరపతి ఎక్కువ వున్న వాడు."
ఈ మొత్తం ' పరిశోధనలకు ' అవసరమయ్యే లక్షలకొద్దీ డాలర్ల కాంట్రాక్టును ఈ *పీటర్* దక్కించుకొన్నాడు.
దాన్ని *జంగ్ లీ* కి సబ్ కాంట్రాక్ట్ చేసాడు. అత్యంత ఎక్కువ ఇన్ ఫెక్టివిటి వున్న కొరోనా వైరస్ ను ల్యాబ్ లో సృష్టించే ప్రయత్నంలో లీ కి అండ దండ ఈయనే !
డిశెంబరు 9 , 2019 న ఇచ్చిన ఇంటర్వ్యూ లో '' *ఈ వైరస్ కు వ్యతిరేకంగా వ్యాక్సినేట్ చేయలేం , ఇది untreatable వైరస్* '' అని వెన్నులో వణుకు పుట్టించే సంగతులు బయటపెట్టాడు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే *మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చైనా తో* చాలా సన్నిహితంగా వుండేవాడు.
2005 నుండి 2019 వరకూ US National Institute of Health కు నిరాటంకంగా నిధులు అందాయి.
2009 నుండీ 2017 వరకూ [ *అంటే ఒబామా ప్రెసిడెంట్ గా వున్న సమయం* ] ఈ నిధులు మరింత ఎక్కువగా అందాయి.
ఈ సంస్థ నుండి *జంగ్ లీ* కి నిధులు అందేలాగా *పీటర్* సహకరించాడు.
"తెలిసో , తెలియకో *ఒబామా* కూడా ఈ పాపం లో భాగం అయ్యాడు !"
"ఆయనకు చైనా పట్ల వున్న ప్రేమ ఎంత పని చేసింది !".
"కొరోన వైరస్ మొదలయ్యింది ఊహాన్ [ చైనా ] కదా , దీన్ని చైనీస్ వైరస్ , వూహాన్ వైరస్ అనకుండా WHO రాజ్యాంగం లో వున్న ఒక క్లాజ్ ను జంగ్ లీ , మరియు చైనా ప్రభుత్వంతెలివిగావాడుకొన్నాయి".
అదేమంటే '' ఏదైనా ఒక ప్రాంతంలో మొదలైన వైరస్ ను ఆ ప్రాంతం / దేశం పేరుతో గుర్తించడం , పిలవడం ఆ ప్రాంత / దేశ ప్రజలను అవమానించినట్టు అవుతుంది ''.
అనే ఈ క్లాజును చూపి WHO ఈ వైరస్ ను *కోవిడ్ -19* గా పిలిచేలా *చైనా ' మ్యానేజ్* ' చేసింది.
"అంతేకాదు , ఈ పాపిష్టి పనిలో చైనా తప్పు ఏమీ లేదు అని ప్రపంచాన్ని నమ్మించేందుకు చైనా ప్రపంచ ప్రఖ్యాత దినపత్రికలు , చానెళ్ళకు రచయితలకు పెద్ద మొత్తంలోడబ్బులుకుమ్మరించింది."
*భారత్ లో కూడా సుమారుగా 60 మందికి ఈ డబ్బులు అందినట్టు సమాచారం.*
"ప్రపంచ వ్యాప్తంగా ఇలా డబ్బులు అందుకొన్న వాళ్ళ పని ఏమంటే : *వాళ్ళ వాళ్ళ దేశాల ప్రభుత్వాలు కోవిడ్ ను నియంత్రించడంలో విఫలమయ్యాయని* , వున్నవి , లేనివి అన్నీ కలిపి *అర్ధ సత్యాలు , అసత్యాలను పేపర్లు , చానెళ్ళ ద్వారా ప్రచారం చేయడం*.
[ *భారత్ లో అరుంధతీ రాయ్ , రాణా అయూబ్ , బర్ఖా దత్ లాంటి దేశ వ్యతిరేక , లెఫ్టిస్టు రచయితలు ఈ వర్గం కిందకు వస్తారు*.]
"మన దేశంలో కోవిడ్ తో మరణించిన వారి శవాలను సామూహికంగా దహనం చేస్తున్న దృశ్యాలను ఈ వర్గం జర్నలిస్టులు ఫొటోలు తీసి *ఒక్కో ఫోటోను 80 వేలు , ఒక లక్ష రూపాయలకు*, విదేశీ [ ప్రత్యేకించి అమెరికా , ఇంగ్లాండ్ కు] పత్రికలు , చానెళ్ళకు అమ్మిన విషయం *మనలో ఎంతమందికి తెలుసు* ?".
"మనకేం తెలుసు" అంటే -ఇంత పెద్ద దేశంలో , ఇంతటి భయంకర మహమ్మారిని , *అడుగడుగునా విమర్శలు గుప్పిస్తూ , అడ్డుపడుతున్న ప్రతిపక్షాల మధ్య*- ప్రభుత్వాలు సమస్యను హాండిల్ చేయడంలో జరిగిన ఒకటి రెండు తప్పులను- *భూతద్దంలో చూపించడం మాత్రం మనకు తెలుసు* !
"నేను గమనిస్తున్నాను , చాలా మంది నిష్పక్షపాతంగా , నిజాయితీగా , లోతుగా అధ్యయనం చేసి కాకుండా ' పాపులర్ ' కావాలని సోషియల్ మీడియా లో కనిపించాలనే కోరికతో మాట్లాడుతున్నట్టు , వ్రాస్తున్నట్టు వుంది."
[ *అందరూ కాదు , చాలామంది*]
మళ్ళీ వ్యాసం లోకొద్దాం.
తాను దక్కించుకొన్న కాంట్రాక్ట్ ను *జంగ్ లీ* కి సబ్ కాంట్రాక్ట్ చేసినది ఎవరు ? - *పీటర్ దస్జాక్*.
*జంగ్ లీ* ని తెగ మెచ్చుకొన్నది ఎవరు ? *పీటర్ దస్జాక్.*
ఊహాన్ లోని ల్యాబ్ నుండీ ఈ వైరస్ బయటికిపంపబడిందా , లేదా అని నిర్ధారించేందుకు WHO ఏర్పాటు నియమించిన కమిటీ లో ముఖ్యమైన సభ్యుడు ఎవరు ?- *పీటర్ దస్జాక్.*
"ప్రాణాంతకమైన ఈ వైరస్ ను సృష్టించింది తామే అని *ప్రపంచానికి తెలిసింది కాబట్టి, ఇబ్బందులొస్తాయని ఊహించి *చైనా ఊహాన్ లోని జంగ్ లీ ల్యాబ్ లను సీల్ చేసాము* అని చెప్పుకొంటోంది.
"కానీ, ఇప్పటికే ఆమె వైరస్ ను సృష్టించడంలో విజయం సాధించింది కదా !"
*ఇక ల్యాబ్ ను మూస్తే ఏమిటి ? మూయకపోతే ఏమిటి* ?
*ఇపుడు అసలు విషయం.
ఇదంతా చైనా ఎందుకు చేసింది ? కమ్యూనిస్టు చైనా ప్రభుత్వం యొక్క సైన్యం పేరు People's Liberation Army [ PLA ] 2015 నుండీ ఈ PLA ఊహాన్లోని WIV తోకలిసి రహస్యంగా పనిచేస్తున్నదట.
*వీళ్ళ లక్ష్యం Bio weapons ను తయారుచేసుకోవడం*.
"దేనికి ?".
*మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే లాగా పరిస్థితులు కల్పించి* , ఆ యుద్ధమే వస్తే అందులో తాము గెలిచి *మొత్తం ప్రపంచాన్ని గుప్పిట్లో వుంచుకోవాలని* కామ్రేడ్ల సామ్రాజ్యవాద రాక్షస ఆకాంక్ష.
"ఎవరి చేత , ఎలా , ఎందుకు కొరోనా వైరస్ సృస్టించబడిందో తెలిసింది కదా ! "
*ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది చావుకు కారణమయ్యి , వేలాదిమందిని అనాథలను చేసిన పాపం వూరికేపోతుందా*?
"కచ్చితంగా పోదు."
"నాకెందుకో నా ఇంట్యూషన్ చెపుతున్నట్టు అనిపిస్తోంది - భవిష్యత్తులో చైనా నాలుగైదు ముక్కలు అయ్యి [టిబెట్ స్వేచ్చను పొంది ] , బలహీనపడి దెబ్బతింటుందేమోనని."
*ఆ శుభ ఘడియలను మీరూ , నేనూ చూస్తామా , లేదా చెప్పలేను*.
"కానీ,జరగక మానదని నా నమ్మకం."
గమనిక - ఇదంతా [ చివరి పేరా కాకుండా ] నీవు చూసినట్టు వ్రాసావే అనేవాళ్ళు కూడా వుంటారు.
*అలా ఏమీ లేదండి.*
" Nature , Science , The NewYork Times లాంటి ప్రఖ్యాత పత్రికలకు ఎడిటర్ గా , Science Correspondent గా అనేక ఏళ్ళు పనిచేసిన Nicholas Wade అనే రచయిత May 5 , 2021 న Bulletin of Atomic Scientists అనే పత్రికలో The Origin of COVID - Did People or Nature - *open Pandora's Box at Wuhan* ? అనే అద్భుతమైన investigative వ్యాసం లోని అంశాలను ఈ వ్యాసానికి ఆధారం చేసుకొన్నాను.
*ఆ గొప్ప వ్యాసాన్ని చదివాక ఇలాంటి జర్నలిస్టులు మన దేశంలో ఎందుకు లేరబ్బా అని బాధ కూడా కలిగింది.*.
In late 1960s, Brahmananda Reddy, the then CM of AP, told :" It is not enough if follow the rules of the Road, but you must also be vigilant to observe the *violators of the Road rules, because you would also be involved as a victim in any road accident that ensues*".
So, it is not enough if you very keenly study about India, but you should also *study the intentions of the World about India*.
" All that glitters is not Gold. Sweet & pep talk is *not really sweet in taste*.
"Beware of the World around you & its real Intentions."
హరిః ఓమ్.