25, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ఇతో న కించిత్

 🌄🛕

*_-|¦¦|శుభోదయమ్-సుభాషితమ్|¦¦|-_*

🛕🌅


శ్లోకము!!! 

ఇతో న కించిత్ పరతో న కించిత్ 

యతో యతో యామి తతో న కించిత్ 

విచార్య పశ్యామి జగన్న కించిత్

ఆత్మావ బోధాత్ అధికం న కించిత్!!!!!!!! 


తాత్పర్యము!!! 

*ఈ లోకంలో ఏమీ లేదు పరలోకంలో ఏమీ లేదు ఎన్ని లోకాలు తిరిగినా ఏమీ లేదు బాగా విచారిస్తే ఈ జగత్తు అంతా మిథ్య అని అర్థమవుతుంది*.... 

ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆత్మావగాహన చేసుకున్నప్పుడు ఇదంతా అర్థం అవుతుంది అని దీని అర్థం...

పాంచజన్యం వెనుక కథ

 శ్రీకృష్ణుడి శంఖం పాంచజన్యం వెనుక కథ


#శ్రీకృష్ణుడి_శంఖం_పాంచజన్యం_వెనుక_కథ


శ్రీకృష్ణ భగవానుడి చేతిలో ఒక శంఖం ఉంటుంది .. దానికి 'పాంచజన్యం' అని పేరు. ఈ పాంచజన్యం వెనుక పురాణ సంబంధమైన ఒక ఆసక్తికరమైన కథ వుంది. బలరామ కృష్ణులు సాందీప మహర్షి ఆశ్రమంలో ఉంటూ సకల విద్యలు నేర్చుకుంటారు. విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురుదక్షిణగా ఏమి కావాలని అడుగుతారు. మరణించిన తన కుమారుడిని బ్రతికించి తెచ్చి ఇవ్వమని సాందీపుడు కోరతాడు. గురుపుత్రుడు సముద్ర స్నానానికి వెళ్లి మరణించాడని తెలుసుకుని బలరామ కృష్ణులు అక్కడికి వెళతారు.


సముద్రుడిని పిలిచి తమ గురుపుత్రుడిని అప్పగించమని కోరతాడు కృష్ణుడు. ఆ పిల్లవాడిని 'పంచజనుడు' అనే రాక్షసుడు మింగాడనీ, సముద్ర గర్భంలోనే అతను ఉన్నాడని సముద్రుడు చెబుతాడు. సముద్ర గర్భంలోకి ప్రవేశించిన కృష్ణుడు .. ఆ రాక్షసుడి పొట్ట చీల్చగా ఒక శంఖం బయటపడుతుంది. పంచజనుడి పొట్ట నుంచి వచ్చింది కనుకనే అది 'పాంచజన్యం' అయింది. కృష్ణుడు యమలోకానికి వెళ్లి ఆ శంఖాన్ని పూరించగా, ఆయన వచ్చిన పనియేమిటో యమధర్మరాజుకు తెలిసిపోతుంది. ఆయన సాందీపని కుమారుడిని బ్రతికించి కృష్ణుడికి అప్పగిస్తాడు. ఆ పిల్లవాడిని తీసుకొచ్చి గురువుగారికి గురు దక్షిణగా సమర్పిస్తాడు కృష్ణుడు.      


🚩 #డైలీ_విష్ 🚩


ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వాట్సాప్ లో పొందడానికి కింద ఉన్న లింక్ ద్వారా సబ్ స్కైబ్ చేసుకోండి.


అలాగే మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు ఈ పేజ్ ని లైక్ చేయమని ఆహ్వానించండి.


వాట్సాప్ 

http://bit.ly/2V5ESsI

జీవితం చాలా "ప్రశాంతంగా" ఉంటుంది

 అద్భుతమైన సందేశం. తప్పకుండా చదవండి.


యవ్వనం  &  ముసలితనం


నేను యవ్వనంలో ఉన్నప్పుడు "మొటిమల్ని" గురించి బాధపడే వాడిని...

నాకు ముసలితనం వచ్చినప్పుడు  "ముడతల్ని"  గురించి బాధపడుతున్నాను.



నేను యవ్వనంలో ఉన్నప్పుడు "ఆమె" చెయ్యి పట్టుకోవాలని ఎదురుచూసే వాడిని....

నాకు ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి "నా చేయి"  పట్టుకుంటారా  అని ఎదురు చూస్తున్నాను.


నేను యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను "ఒంటరిగా" వదిలేస్తే బాగుండును  అనుకునేవాణ్ణి...

నాకు ముసలితనం వచ్చినప్పుడు అందరూ నన్ను "ఒంటరిగా" వదిలేసారే  అని బాధపడుతున్నాను.


నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే "చికాకు" పడేవాడిని..

నాకు ముసలితనం వచ్చినప్పుడు నాతో ఎవరూ కనీసం "మాట్లాడటం" లేదే అని బాధపడుతున్నాను.


నేను యవ్వనంలో ఉన్నప్పుడు "అందాన్ని" ఆస్వాదించే వాడిని...

నాకు ముసలితనం వచ్చినప్పుడు నా చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ "అందాన్ని" చూసుకుంటున్నాను.


నేను యవ్వనంలో ఉన్నప్పుడు నాకు " చావే " లేదు అనుకునే వాడిని....

నాకు ముసలితనం వచ్చినప్పుడు .... "రోజులు దగ్గర పడ్డాయి." అని బాధపడుతున్నాను.


నేను యవ్వనంలో ఉన్నప్పుడు "ప్రతి క్షణాన్ని" పండగ చేసుకునే వాడిని....

నాకు ముసలితనం వచ్చినప్పుడు "తీపి జ్ఞాపకాల్ని"  నెమరు వేసుకుంటున్నాను.


నేను యవ్వనంలో ఉన్నప్పుడు "నిద్రలేవడం" కష్టంగా ఉండేది......

నాకు ముసలితనం వచ్చినప్పుడు "నిద్రపట్టడం" కష్టంగా ఉంది.


నేను యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా నా "గుండెల మీద" పిడిగుద్దులతో  గుద్దుకునే వాడిని....

నాకు ముసలితనం వచ్చినప్పుడు ఈ "గుండె ఎప్పుడు ఆగి పోతుందో"  అని భయపడుతున్నాను.


జీవితంలో రకరకాల "ఆటు పోట్లు" వస్తుంటాయి. 

దేనికీ భయపడ కూడదు. 


ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం  కావాలి.

 అదే నిజమైన "జీవితానుభవం". 


అది "యవ్వనంలో" నైనా.. "ముసలితనంలో" నైనా..అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా "ప్రశాంతంగా"  ఉంటుంది.

24, ఫిబ్రవరి 2022, గురువారం

వేదోదితం స్వకం కర్మ

 

శ్లో॥ వేదోదితం స్వకం కర్మ నిత్యం కుర్యాదతంద్రితః |

తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాంగతిమ్ ||

 (వ్యాసః) వైదికము, సనాతనము, ధర్మశాస్త్ర సమ్మతము అగు స్వధర్మమును అనుష్ఠించుటయే సర్వేశ్వరుడు, సర్వశక్తిమంతుడు అగు భగవంతుని మహత్తరమైన సపర్య అనగా అతని పూజయే అగును. అది మానవునికి శ్రేయమును అనగా మేలును, శుభమును చేకూర్చును. అందుకే గీతలో భగవానుడు స్వయంగా అంటాడు - 'స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః | (18–46) (తన స్వధర్మాచరణముద్వారా పరమేశ్వరుని పూజించుటవలన మానవుడు పరమసిద్ధిని పొందును.) ఇందువల్లనే నిత్యములు, నైమిత్తికములు అనెడు కర్మలను ఆచరించుట ప్రతివ్యక్తికి పరమధర్మమనియు, ముఖ్యకర్తవ్యమనియు వేదాది సమస్త శాస్త్రములయందు చెప్పబడియున్నది. ప్రతి వ్యక్తికి మూడు విధములగు ఋణములు ఉండును- 1. దేవఋణము 2. ఋషిఋణము 3. పితృ ఋణము “యత్కృత్వా నృణ్యమాప్నోతి దైవాత్ పైత్ర్యాచ్చ మానుషాత్ '' అని చెప్పినట్లుగా నిత్యకర్మలను చక్కగా ఆచరించుటవలన మానవుడు ఈ త్రివిధ ఋణములనుండి విముక్తుడై పోవును.

తమ జీవితపర్యంతము అత్యంత శ్రద్ధాభక్తులతో ప్రతినిత్యము యథాధికారముగా స్నానము, సంధ్యా, గాయత్రీజపము, దేవతార్చనము, వైశ్వదేవ-బలి, స్వాధ్యాయము ఇత్యాది నిత్యకర్మలను ఎవరు ఆచరించెదరో, వారి బుద్ధి ఆత్మయందు నిశ్చలమగును. బుద్ధి ఆత్మనిష్ఠమైన మీదట నెమ్మది - నెమ్మదిగా మనిషి బుద్ధిలోగల భ్రాంతి, జడత్వము, వివేకహీనత, అహంకారము, సంకోచము మరియు భేదభావము నశించిపోవును. అప్పుడు ఆ వ్యక్తి పరమాత్మచింతనలో నిమగ్నుడగును. తదనంతరము అతడు అహర్నిశములు పరబ్రహ్మయగు పరమేశ్వరుని సాక్షాత్కారమును పొందుటకై ప్రయత్నము చేయుచుండును. తద్వారా అతనికి పరమానందము యొక్క అనుభూతి కలుగుచుండును. పరమానందముయొక్క అనుభూతి లభించిన మీదట ఆ వ్యక్తికి పరమాత్మ యొక్క వాస్తవికమైన తత్త్వజ్ఞానము యొక్క పరిజ్ఞానము అనుభవమునకు వచ్చును. అప్పుడతడు శాశ్వతమైన

జీవన్ముక్త స్థితిని చేరుకొనును. చివరగా, 'సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ'లో పరినిష్ఠితుడై ఆత్మోద్ధరణము గావించుకొనును. ఇదియే విశిష్టమైన మానవజీవితమునకు సర్వోత్కృష్టమగు సార్థకత. కావున మానవజన్మమును సఫలమొనర్చుట కొరకై మానవమాత్రుడైన ప్రతివ్యక్తి నిత్యకర్మలను నియమానుసారముగా ఆచరింపవలయును.

నిత్యకర్మలలో కొన్నింటిని ప్రతివ్యక్తి సంతోషపూర్వకంగా నియమితరూపంగా చేయవలసివచ్చును. ఉదా: శౌచాది క్రియలు, స్నానము, భోజనము, శయనము మున్నగునవి. అయితే ఈ కర్మలన్నియును శాస్త్రమర్యాదను అనుసరించి జరుగవలయును. అప్పుడే అవి ధర్మాచరణముగా రూపాంతరమునొందును. జీవితంలోని అతిసామాన్యమైన, సర్వసాధారణమైన క్రియా-కలాపములనుగూర్చి కూడా శాస్త్రములు చక్కగా వివేచనము చేసి, ఒక నియతముగా తమ సమ్మతిని ప్రకటించినవి. ఉదయము నిద్రనుండి మేల్కొనుట ఎప్పుడు? మేల్కొనిన తర్వాత మొట్టమొదటగా ఏమి చేయాలి? ఇందుకుగాను శౌచము, దంతధావనము, క్షౌరము, తైలాభ్యంగము, స్నానము, వస్త్రధారణము, భోజనము, శయనము మొదలగు వాటినన్నింటిని గూర్చిన విధి-నిషేధములను తెలియజేసినవి. కావున శాస్త్ర మర్యాదను

అనుసరించి జీవనమును కొనసాగించుటయే శ్రేయపథమునకు దిక్సూచియగును.


వివాహాలు ఎనిమిది రకములుగా పేర్కొన్నారు.

 మన హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహాలు ఎనిమిది రకములుగా పేర్కొన్నారు.  కానీ మనం సాధారణంగా వివాహం అంటే యువతీ యువకుడు అగ్నిసాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లాడటమన్నది సంప్రదాయం. అలాంటి వివాహం మన శాస్త్ర, పురాణాల్లో ఎనిమిది రకాలుగా ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి!!

వివాహం అనేది ఎనిమిది రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి.. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని పేర్లు ఉన్నాయి. వీటిలో  

మొదటిది బ్రహ్మ వివాహం. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు.

రెండోది దైవ వివాహం. యజ్ఞంలో రుత్విక్‌‌కు అలంకరించిన కన్యాదానంగా చెపుతారు.

 గోమిధునాన్ని వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెపుతారు

 మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.బహుశా ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న వివాహం ఈ పద్దతికి చెందినది అయివుండొచ్చు 

  జ్ఞానులు కన్యకు తన శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా పేర్కొంటారు.  

వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెపుతారు.  

బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే దాన్ని రాక్షస వివాహంగా పేర్కొంటున్నారు.

 నిద్రిస్తున్న మత్తులో ఉన్న స్త్రీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే దాన్ని పైశాచ వివాహంగా పేర్కొంటారు

ప్రశ్న పత్రం సంఖ్య: 42

  ప్రశ్న పత్రం సంఖ్య: 42 

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) కార్బురేటర్ అన్నది  ఇందులో ఉంటుంది

i ) రైలు ఇంజనులో

 ii ) మోటారుసైకిలు లో   

iii ) సైకిలుతో 

 iv ) రేడియోలో 

2) పిడుగు అనునది ఒక

i ) విదుత్ఘాతం 

ii ) అధిక వాయు పీడనం

 iii ) అధిక వర్షకారణం

 iv ) భూమినుంచి ఉద్భవించేది 

3) భగవత్గీతలో మొదటి శ్లోకం ఎవరు చెప్పారు

i ) శ్రీ కృష్ణుడు 

ii ) అర్జనుడు 

iii ) దృతరాష్ట్రుడు

 iv ) సంజయుడు

4) రామాయణంలో రాయబారిగా ఈయనవున్నాడు 

i ) సుగ్రీవుడు

 ii ) అంగదుడు 

iii ) హనుమంతుడు 

iv ) లక్ష్మణుడు 

5) సంస్కృత భాషలో తెలుగు భాషలో లేని ఇది వున్నది

i ) ఏకవచనం 

ii ) ద్వివచనం  

iii ) బహువచనం

 iv )అన్య వచనం 

 6) ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి ____

i ) నదీం

 ii ) ఘటం

 iii ) సాగరం

 |iv ) జల మార్గ . 

7) మనదేశంలో కారు నడిపే వారు అమెరికాలో

i)అదేవిధంగా నడపగలరు 

 ii ) అక్కడి ట్రాఫిక్ సిస్టం వేరు కాబట్టి తెలుకుకొని నడపాలి 

 iii ) ప్రపంచం మొత్తంలో ట్రాఫిక్ పద్దతి ఒకే విధంగా ఉంటుంది

 iv ) అక్కడి కార్లకు స్టీరింగ్ కుడివైపు ఉంటుంది.

8) మొట్టమొదటి సంస్కృత కవి ఎవరు .

i ) కాళిదాసు

 ii ) పోతన 

iii ) వాల్మీకి

 iv ) వ్యాసుడు

9)గాలిపటం(Kite) పైకి ఎగరటానికి కారణం 

i ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం కన్నా క్రింది భాగం మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,  

 ii ) గాలి పటం క్రింది భాగం మీద గాలి పీడనం కన్నా భాగం ఫై మీద పీడనం ఎక్కువగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్

టి.iii ) గాలి పటం ఫై భాగం మీద గాలి పీడనం క్రింది భాగం మీద పీడనం సమానంగా ఉండేటట్లు దారాన్ని కడతారు కాబట్టి. ,

iv ) గాలిపీడనంకు  గాలిపటానికి సంబంధం లేదు కాబట్టి 

10) ఆంధ్రప్రేదేశ్ లో సాగర తీరంలో వున్నపట్టణం

i ) విజయవాడ 

 ii ) బందర్  

iii ) గుంటూరు 

 iv ) అమరావతి 

11)ఇది ఒక ఉత్తర  భారతదేశక్షేత్రం

i ) తిరుమల

 ii ) సింహాచలం

 iii ) కాశి

 iv ) కన్యాకుమారి

 12) ప్రపంచంలో అతిపెద్ద పర్వతం ఏది

i ) తిరుమ పర్వతం

 ii ) పడమటి కనుమలు

 iii ) తురుపు కనుమలు   

iv )ఎవరెస్టు

13) ఈ వివాహం ఇప్పుడు అమలులో లేదు  

i ) రిజిస్టరు వివాహం ii ) ప్రేమ వివాహం iii )రాక్షస వివాహం iv ) బ్రహ్మ వివాహం  

14) క్రింద వున్న లోకాలలో ఈ లోకం లేదు  

i ) అతలం 

 ii ) సులత   

 iii ) తలాతల  

iv ) తపోలోకం 

15) అష్టైశ్వర్యాలలో ఇది వున్నది

i ) గరిమ  

ii ) గృహము 

 iii ) తాంబూలము 

iv ) సంతానము

16) యత్ర నార్యస్తు పూజ్యంతె  

i ) రమంతె తత్ర మనుష్య

ii ) రమంతె తత్ర దేవతాః    

 iii ) రమంతె యత్ర దేవతాః 

iv )రమంతె తత్ర దానవ 

17) భగవత్గీత కన్నా ముందు ఈ గీత వుంది 

i ) అష్టావక్ర గీత

ii ) రాఘవ గీత  

 iii ) విశ్వామిత్ర గీత 

iv ) ఏ గీత లేదు 

18) కృష్ణ పక్షంలో మరియు శుక్ల  పక్షంలో చంద్రుకు ఈ తిధినాడు ఒకే పరిమాణంలో ఉంటాడు

i ) నవమి 

ii ) సప్తమి చంద్రుని పరిమాణం 

iii ) ఏకాదశి 

 iv ) తదియ 

19) పిండి కొద్దీ

i ) దోశ 

 ii ) రొట్టె 

 iii ) గారే 

iv )   పూరి 

20)  సుమతి శతకము వ్రాసిన కవి ఎవరు

i ) వేమన 

ii ) శ్రీనాధుడు 

iii ) బద్దెన 

iv ) పెద్దన

 

 

శ్లోకం

 శ్లోకం:☝️

   *యదేవ తీవ్ర సంవేగాత్*

*దృఢం కర్మ కృతం పురా l*

   *తదేవ దైవ శబ్దేన*

*పర్యయాణేహ కథ్యతే ll*


భావం: గతంలో తీవ్రమగు కృషితో సాధించిన కర్మల ఫలితమే నేడు మనము అనుభవించుచున్నాము. దానినే విధియని, దైవమని, ప్రారబ్ధమని రకరకాల పేర్లతో పిలుస్తారు. అది మనల్ని నడిపిస్తుంది అంటారు. అలాగని పూర్తిగా మనం అస్వతంత్రులం కాదు.

తెలుగు భాషాభిమానుల కోసం

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹

తెలుగు భాషాభిమానులు ఈ క్రింది విషయాన్ని చదవండి. చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

————— 


*"ర"కీ "ఱ"కి మధ్య తేడా ఏమిటి?*


ఈ మధ్యనే వాట్సాప్ లో మెసేజ్ చూసాను. ద్వానా శాస్త్రి గారు రాసారట. బావుంది. అది ఇక్కడ పెడతాను. forwarded as it is.


తెలుగు భాషాభిమానుల కోసం.👇


*అరసున్న [ ఁ ], బండి ' ఱ 'లు ఎందుకు?*


అరసున్న, బండి ' ఱ 'లు నేటిభాషలో దాదాపుగా వాడుకలో లేవు. అలా చేసారు మన ఆధునిక భాషా వేత్తలు. తెలుగుకు పట్టిన దుర్గతి ఇది. అయితే, ఇవి తెలుగు భాషకి ప్రత్యేకమైనవి. తెలుగు భాషా లక్షణాన్ని నిరూపించేవి. అంతేకాదు- కావ్యభాషలోను, లక్షణ శాస్త్రంలోను వీటి ప్రాముఖ్యం చాలావుంది. కానీ వీటిగురించి తెలుగువాడు తెలుసు కోవాలిగదా! మన భాషా సంపదలో ఇవీ భాగస్వాములే అని గ్రహించాలి గదా! అరసున్న( ఁ ) , ఱ- ల వల్ల అర్థభేదం ఏర్పడుతుంది. పదసంపదకి ఇవి తోడ్పడతాయి. ఎలాగో చూడండి:


అరుఁగు = వీధి అరుగు


అరుగు = వెళ్ళు, పోవు


అఱుగు = జీర్ణించు


ఏఁడు = సంవత్సరం


ఏడు = 7 సంఖ్య


కరి = ఏనుగు


కఱి = నల్లని


కాఁపు = కులము


కాపు = కావలి


కాఁచు = వెచ్చచేయు


కాచు = రక్షించు


కారు = ఋతువు, కాలము


కాఱు = కారుట (స్రవించు)


చీఁకు = చప్పరించు


చీకు = నిస్సారము, గ్రుడ్డి


తఱుఁగు = తగ్గుట, క్షయం


తఱుగు = తరగటం(ఖండించటం)


తరి = తరుచు


తఱి = తఱచు


తీరు = పద్ధతి


తీఱు = నశించు, పూర్తి(తీరింది)


దాఁక = వరకు


దాక = కుండ, పాత్ర


నాఁడు = కాలము


నాడు = దేశము, ప్రాంతము


నెరి = వక్రత


నెఱి = అందమైన


నీరు = పానీయం


నీఱు = బూడిద


పేఁట = నగరములో భాగము


పేట = హారంలో వరుస


పోఁగు - దారము పో( గు


పోగు = కుప్ప


బోటి = స్త్రీ


బోఁటి = వంటి [నీబోఁటి]


వాఁడి = వాఁడిగా గల


వాడి = ఉపయోగించి


వేరు = చెట్టు వేరు


వేఋ = మరొకవిధము


మడుఁగు = వంగు, అడఁగు


మడుగు = కొలను, హ్రదము


మొదలైనవీ ఉన్నాయి.


అయినా తెలుగు భాషను నాశనం చేస్తున్న కాలం దాపురించింది కదా!


[డాక్టర్ ద్వారకా నాధ శాస్త్రి )

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...

 🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹 *నాకు నచ్చిన ఓ అజ్ఞాత రచయిత రచన*

                 🌷🌷🌷

నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

పుల్లమామిడి, నిమ్మ, ఉసిరి, ఉప్పు, కారం, మొ. సృష్టించావు. ఊరగాయ పెట్టుకునే తెలివి ఇచ్చావు, కానీ ఆశపడి తింటే అల్సర్, బి.పి బహుమతిగా ఇస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

పంచదార, బెల్లం, తియ్యటి పళ్ళు ఇచ్చావు, కానీ సామీ! ఆత్రపడి తింటే షుగర్ వ్యాధి బహుమతిగా ఇస్తావు.


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

మా కాలి గోటికి సరిపోని దోమలను సృష్టించావు. శుచి శుభ్రత లేకపోతే, మాచెమట వాసనతోనే గుర్తుపట్టి మానెత్తురు తాగుతూ మాకు నిద్రపట్టని స్థితి కల్పించావు.


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

సంపదలు, ఆస్తులు మా చేత కల్పించి మాలో మేము తన్నుకునేటట్లు, చంపుకునేటట్లు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏 

వేల ఎకరాల స్థలాలు ఆక్రమించిన అసామికి కూడా దేహాన్ని వదలగానే ఆరు అడుగుల స్థలాన్ని మాత్రమే మిగులుస్తావు.


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

రాజ్యాలతో పాటు రాజకీయాలు సృష్టించి ఆప్తమిత్రులకు, అన్నదమ్ములకు, భార్యాభర్తలకు ఎడబాటు చేస్తున్నావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

కాషాయం కట్టిస్తావు, ఆస్తులపై భ్రమ పుట్టిస్తావు. ఆఖరికి బ్రష్టు పట్టిస్తావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ..👏

నేను, నాది అనే అహం కలిగిస్తావు. అది  వదిలితే గాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏 

ముప్పయి మూడు కోట్ల దేవతలను సృష్టించావు. కానీ నన్నొక్కడినే పూజించమంటావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏

ఇంద్రియాలను ఇచ్చావు. వాటికి రుచులు పుట్టించావు. అన్నిటిని వదిలితేగాని నీ దగ్గరకు రానీయనంటావు. 


నువ్వు తక్కువ వాడివి కాదు సామీ...👏 

పాము పడకపై శయనించి, అమ్మ చేత కాళ్ళోత్తించూకుంటూ మమ్ములను చూసి నవ్వుకుంటావు. 


నువ్వు తక్కువ వాడివి కావు సామీ...👏 

నిన్నర్థం చేసుకోవడం మా వల్లకాదని నీకు తెలిసి ఈ నాటకాలు మాచే ఆడిస్తూ ఉంటావు.


కానీ సామీ! 

నేనూ తక్కువవాణ్ని కాదు నాకు బాగా తెలుసు, నీ కాళ్ళట్టుకుంటే నీవే నన్నెత్తుకుంటావని..😍


ఆ గేనం (జ్ఞానం) మాత్రం నన్నొదలకుండా చూడుసామీ👏


ఆ ఒక్క వరం మాత్రం నాకివ్వు సామీ !!!



💪హరహర మహాదేవ👏🤘🔱🛕🕉️🚩

23, ఫిబ్రవరి 2022, బుధవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 41

 ప్రశ్న పత్రం సంఖ్య: 41

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) హమ్మయ్య అని ఎప్పుడు అనుకుంటాము

i ) ఏదైనా సందిద్గత తొలగినప్పుడు 

ii ) ఆనందంగా వున్నప్పుడు

 iii ) ఈష్యతో వున్నప్పుడు

 iv ) దుఃఖంగా వున్నప్పుడు . 

2) విమానం టైర్లను ఈ గ్యాసుతో నింపుతారు

i ) నైట్రోజన్ 

  ii ) ఆక్సిజన్ 

 iii ) హీలియం 

 iv ) సాదారణ గాలి 

3) క్రింది పద్యం వ్రాసిన కవి ఎవరు.

సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

i ) పెద్దన

 ii ) రామకృష్ణ 

iii ) శ్రీనాధుడు 

iv ) తిక్కన 

4) ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని యేభాషను అంటారు 

i ) తమిళ 

ii ) కన్నడ

 iii ) తెలుగు

 iv ) హిందీ 

5) జాతక చక్రంలో మందకొడిగా చలించే గ్రాహం ఏది

i ) గురుగ్రహం 

ii ) రాహు గ్రాహం 

 iii ) శని గ్రాహం 

iv ) బుధ గ్రాహం 

 6) డు ము వు లు

i ) ద్వితీయ విభక్తి

తి ii ) ప్రధమా విభక్తి

తి iii ) తృతీయ విభక్తి

 iv )  విభక్తికానే కాదు

7) మన శరీరంలోని కండరాలను దీనితో పోల్చవచ్చు

స్క్రూలతో 

 ii ) నట్టులతో 

 iii ) స్ప్రింగులతో 

 iv ) స్క్రూ డ్రైవరుతో

8) పాలు పెరుగుగా మారటానికి కారణం

i ) తోడు పెట్టిన మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియంలు

ii ) తోడుపెట్టిన మాజ్జిగలోని లాక్టోస్ 

iii ) తోడుపెట్టిన మజ్జిగలో గ్లూకోజ్ 

iv ) తోడుపెట్టిన మజ్జిగతో సంబంధం లేదు

9) వేదాంతం అనగా 

i ) వేదాల చివరి వున్నఉపనిషత్తులు 

 ii ) వేదాల చివరి వున్న  కర్మ కాండ 

iii ) వేదాలలో వున్న కర్మ కాండ 

iv ) స్వామీజీలు చెప్పే ప్రవచనాలు

10) మానవ రక్తం ఎర్రగా ఉండటానికి కారణం

i ) తెల్ల రక్తకణాలు 

 ii ) హిమోగ్లోబిన్ 

 iii ) ప్లాస్మా 

 iv ) రక్తంలోని ద్రవపదార్థం 

11) సింగరేణి బొగ్గు గనులు ఈ వూళ్ళో వున్నాయి

i  )విజయవాడ

 ii ) హైదరాబాదు

 iii ) కొత్తగూడెం

 iv ) వరంగల్లు

 12) సీలింగ్ ఫాను ఒక

i ) విద్యుతు దీపము 

ii ) విద్యుత్ ఎల్ ఈ డి డివైస్ 

 iii ) విద్యుత్ మోటారు 

 iv ) విద్యుత్ కండెన్సరు

13) వివాహానికి సంబంధించి జాతక రీత్యా లగ్నంలో ఈ  శుద్ధి ఉండాలి

i ) సప్తమ శుద్ధి 

ii )అష్టమ శుద్ధి 

iii )ద్వాదశ శుద్ధి 

iv ) పంచమ శుద్ధి  

14) తొమ్మిది విధముల భక్తి మార్గములు తెలిపినది

i ) వసిష్ఠ మహాముని 

ii )నారద మహాముని 

 iii ) త్యాగరాజు 

iv ) రమణ మహర్షి 

15) ఈ గుణాన్ని ఉత్తమ గుణంగా అంటారు

i )తామస గుణం 

 ii )  సత్వ గుణం 

 iii ) రజోగుణం 

iv ) అమాయక గుణం

16) ప్రత్యక్ష ప్రమాణం  అంటే అర్ధం

i )ఇంద్రియాలద్వారా తెలుసుకోవటం 

ii ) మనస్సుద్వారా తెలుసుకోవటం 

 iii ) ఇతరులద్వారా తెలుసుకోవటం 

 iv ) దీనినే అనుమానప్రమాణం అని కూడా అంటారు

17) దీనిని చుస్తే నోరూరుతుంది  

i ) కుంకుడు కాయ 

ii ) తరిగిన దోసకాయ  

 iii ) తరిగిన ఉల్లిగడ్డ

 iv ) జిలేబి 

18) కదళీ ఫలం అని దీనిని అంటారు

i ) అరటి ఫలం ii ) రేగి ఫలం  iii ) జామ ఫలం iv ) ద్రాక్ష ఫలం 

19)రుచి అని ఈ పదార్ధాన్ని అప్పుడప్పుడు పేర్కొంటారు

i ) లవణం 

ii )బెల్లం 

 iii ) పంచదార 

iv ) కాకర కాయ 

20)  అపుత్రస్య _______

i ) గతిమ్ నాస్తి 

ii ) సౌఖ్యం నాస్తి 

iii ) భోజనం నాస్తి 

iv ) సంపద నాస్తి