8, ఆగస్టు 2023, మంగళవారం

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 12*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 12*



🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 *చోళరాజునకు విష్ణుమూర్తి ఘోరశాపమిచ్చుట* 


గోపాలుడు ఏమి కొంప మునుగుతుందో నను భయముతోనే వచ్చాడు. చోళరాజు భార్య వానిపై మండిపడుతూ ‘‘ఓరీ! మనసు పడి కొంటిమిగదా ఆ క్రొత్త ఆవును? మనకు దాని ఉపయోగమేమిటి!

ఒక్కరోజయినా నీవు ఆ ఆవుపాలు సరిగా పతికి తెచ్చితివా? పాలు యివ్వనందుకు అది పాడుయావు అందువేమో, అది పాడుయావు గాదు. నాకు దీనిలోగుట్టు తెలిసియే యున్నది. 


నీవు ఏమియూ తెలియని నంగనాచివలెనున్నావు కాని, నీవు ఆ యావు పాలను ప్రతిదినము త్రాగి వేయుచున్న సంగతి ఎందులకు దాచెదవు? లేకున్న ఆ చిక్కని పాలను చక్కగా అంగడిలో అమ్ముచు ధనము గడించుచుంటివా!’’ అని ఆరోపణలతో కోప వాక్యములు పలికినది.


ఆ నిందా వాక్యములు వినజాలక, అతడు ‘‘తల్లీ! మనస్సాక్షిగా చెప్పుచున్నాను వినుము. నేనేవిధముగా కూడ అన్యాయము చేయలేదు తల్లీ! దీని కంతకూ నేనే మాత్రమునూ బాధ్యుడను గాను. 


ప్రతి దినము సాయంకాలము నేను తక్కినయావులవలెనే ఆ యావు నుండి గూడ పాలు తీయుదమని వెడలుటయు, వింతగా దాని చన్నులు పాలులేని కారణముగ ఎండి పోవుటయు జరుగుచున్నది. కారణమేమియో నాకున్నూ తెలియరాకున్నది’’ అనినాడు.


రాణి గొల్లవాని మాటలు నమ్మలేదు. ‘‘ఓరీ నీ మాటలు నమ్ముట కష్టము. ఇదిగో చెప్పుచున్నాను వినుము – నీ మాటలను కట్టిపెట్టి నేటి నుండి ఆ యావుపాలు తీసికొని రావలసినదే! లేకున్న కఠినాతి కఠినముగ నిన్ను శిక్షించుట జరుగును.


 ఒడలు దగ్గరపెట్టుకొని మసలుకొనుము’’ అని మందలోని ఆ క్రొత్త యావు విషయమై మందలించినది. మందలించుటయేమి – హెచ్చరించినది.


 ‘‘సరే ఇక నుండి నేను మీరు చెప్పినట్లే నడచుకొనగలవాడనన్నాడు వినయముగా గోపాలుడు.


రోజూలాగే ఆనాడు కూడా గోపాలుడు ఆవులమందను మేత కొరకు శేషాచలము మీదకు తోలుకొని వెళ్ళినాడు. రాజుగారి భార్య తనకు చీవాట్లు పుష్కలముగా పెట్టి వుండుట వలన ఆ రోజు అతడి దృష్టి ఆ క్రొత్త ఆవు వైపు దాని పొదుగు వైపే వున్నది. 


ఆ యావు కదలికతో తన దృష్టిని గూడ కదలించుచుండెను, జాగ్రత్తగా కనిపెట్టి చూస్తూయున్నాడు. ఆ క్రొత్త యావు మెల్లమెల్లగా వెళ్ళి ఆ పుట్టను చేరినది. చేరి క్షీరధారను పుట్టలోనికి కార్చుట మొదలు పెట్టినది. 


ఇది చూసిన గోపాలునకు యాశ్చర్యము, కోపము కలసి వచ్చినవి. ఒడలు మండిపోయింది గోపాలునకు ఓహో రోజూ యిది ఈ విధముగాచేయుచున్నదా? అని అనుకొన్నాడు. ఆవు దగ్గరకు వెళ్ళినాడు. 


పొదుగును పుట్ట పై యుంచి పాలను పుట్టపాలు చేయుచున్నందులకు అతనికి అరికాలి మంట నెత్తికెక్కినది.


కోపము హెచ్చినచో విచక్షణాశక్తి తరిగిపోవునుగదా! 


అతని చేతిలోనున్నది మరొకటి కాదు. గండ్రగొడ్డలాయె. గోపాలుడు దానిని ఎత్తి ఆవు నెత్తి పై కొట్టబోయినాడు. 


తనకుపకారము చేయుచున్న ఆవుకు ఆపద రాబోవుట చూచి శ్రీమన్నారాయణుడు వెంటనే పుట్టలో నుండి పైకి వచ్చి ఆవునకు అడ్డుపడగా గొల్లవాని గొడ్డలి వ్రేటు నారాయణునికే తగిలెను.


ఆయన తల పై తగిలి అదేపనిగా రక్తధారలు వెలువడజొచ్చినవి. ఆశ్చర్యకరమైన ఆ రక్తధారలు చూసి చూడగానే ఆ గోపాలుని కళ్ళు తిరిగి నేలపై బడి మూర్చపోయినాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 


*శ్రీ ముద్రాంకిత గోవిందా, శ్రీవత్సాంకిత గోవిందా;* *ధరణీనాయక గోవిందా,* *దినకరతేజా గోవిందా; |* 


 *గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా,* 

*గోవిందా హరి గోవిందా,*

*వేంకట రమణా గోవిందా.* 12||


*జై శ్రీమన్నారాయణ*

*ఓం నమో వేంకటేశాయ*🙏

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

శివానందలహరీ

 శివానందలహరీ 


సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా

న మన్యే స్వప్నే  వా తదనుసరణం తత్కృత ఫలమ్

హరి బ్రహ్మాదీనా మపి నికటభాజా మసులభం 

చిరం యాచే శంభోశివ తవ పదాంభోజ భజనమ్  




అల్పమౌ ఫలముల నందించు చున్నట్టి

            వేల్పులు వెదుకంగ వేలు  గలరు

వారిచ్చు ఫలములన్ వారల విభవమున్

            కలనైన  క్షణమైన తలచ బోను  

నిరతంబు సేవలన్ నీచెంత నుండెడి

            హరి పద్మజాదుల యమరు లకును           

ప్రాప్తించ నట్టి నీ పదపద్మ సేవనే

             నిరతంబు కోరుదు  నియతి తోడ

కరుణతోడను నాకు నా కలిమి నిమ్ము

శంకరా ! భవ ! సర్వేశ ! శశివిభూష !

సర్వశుభకర! త్రిపురారి ! సాంబ ! దేవ !

భక్తమందార! పరమేశ! పాహి పాహి            04 @

చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి

 నిత్యాన్వేషణ:


చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారికి ఎందుకు అంత పేరు ప్రఖ్యాతులు లభించాయి?


దీనికి ముందుగా దివాకర్ల తిరుపతిశాస్త్రిగారు ఒక సందర్భంలో చెప్పిన మాటని చెప్పాలి.

ఎప్పుడూ తగాదాలాడుకుంటూ వుండే దివాకర్ల తిరుపతిశాస్త్రిని, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిని కలిపి అంటుకట్టి కీర్తిని, డబ్బుని నొల్లుకుంటూ గడపమని దేశం మీదకి వదిలారు గురువుగారు చర్ల బ్రహ్మయ్యశాస్త్రి.

అలా అవధానాలు చేసుకుంటూ, చేసుకుంటూ పోలవరం జమీందారు వద్ద ఆస్థాన పండితునిగా ప్రవేశించాడు, దివాకర్లాయన. బందరు హైస్కూల్ లో తెలుగు టీచరయ్యారు చెళ్లపిళ్ల. కలిసి దేశం తిరగటం తగ్గింది.

నరసరావుపేటలోనో లేదా నూజివీడులోనో శతావధానానికి పిలుపు వచ్చింది. తను రాలేనని, దివాకర్ల ఒక్కడినే వెళ్ళమని చెళ్లపిళ్లవారు ఉత్తరం రాశారు. తిరుగుటపాలో దివాకర్ల "నువ్వు వస్తేనే సభ రక్తి కడుతుంది. జనం ఆనందిస్తారు. నేను ఒక్కడినే వెళితే ' ఎవరో వైదీకపు పోతుపేరంటాలు వచ్చి వెళ్లింది' అంటారు. అందుకని నువ్వు వస్తేనే వెళ్తాను" అని రాశారు.

దివాకర్లవారి సమాధానాన్ని బట్టి మీకు అర్థమై వుండాలి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారికి ఎందుకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయో!

చెళ్లపిళ్లవారు ధారాళంగా మాట్లాడగలరు. ఏకబిగిన 5, 6 గంటలపాటు కూడా.

మధ్య మధ్యలో సాహిత్య చమత్కారాలు, పిట్టకథలు, శృంగార జోక్స్, ప్రత్యర్ధులపై ఆశు ఎత్తుపొడుపులు….. ఓ… జల్లు జల్లులుగా పడుతుండేవి. వేరు వినోదాలు లేని ఆ రోజులలో జనం నోరు తెరుచుకొని వింటూ వుండేవారు. మీరు కథలు గాథలు చదివితే ఆయన శైలి, ఆయన ముచ్చట్లు, ఆయన చమత్కారాలు అన్నీ వివరంగా తెలుస్తాయి.

యివన్నీ కాక సాహిత్యంలో యోధానుయోధులైనవారు కలకాలం సాహిత్యంలో నిలిచిపోయే పేరుపెంపులు గలవారు ఆయన శిష్యులు.

యీ కారణాలు చాలవా, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి గారికి అతిశయించిన పేరుప్రఖ్యాతులు కలగటానికి!

షడూర్ములు'

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


షడ్భిరూర్మిభిరయోగి యోగిహృద్

భావితం న కరణైర్విభావితమ్ |

బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యద్

బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని ॥


𝕝𝕝 *తాత్పర్యము* 𝕝𝕝


*ఆకలి, దప్పిక, దుఃఖము, క్షీణించడం, మరణించడం, భ్రాంతి అనే ఆరింటినీ 'షడూర్ములు'అందురు*. 


*ఈ షడూర్ములకు అతీతమూ......యోగీశ్వరుల హృదయాలు - ధ్యానించేదీ* ఇంద్రియాలకు, బుద్ధికి సైతం అగోచరమూ, ఎదురులేనిదీ అయిన " *ఆ పరబ్రహ్మం* " గూర్చి హృదయంలో ధ్యానించు !


🧘‍♂️🙏🪷 ✍️VKS©️MSV🙏

వదులుకోవడమే

 శ్లోకం:☝️

*తపః స్వధర్మవర్తిత్వం*

  *మనసో దమనం దమః |*

*క్షమా ద్వంద్వసహిష్ణుత్వం*

   *హీరకార్యనివర్తనం ||*


భావం: ధర్మం(కర్తవ్యం)లో నిమగ్నమై ఉండటమే _తపస్సు_. మనస్సును అదుపులో ఉంచుకోవడం _దమం_. సుఖ-దుఃఖ, లాభ-నష్టాలలో సమాన దృక్పథం కలిగి ఉండటమే _క్షమ_. చేయకూడని పనులు వదులుకోవడమే (చేయకపోవడమే) _లజ్జ_.

పంచాంగం 08.08.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 08.08.2023 Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ  పక్ష: అష్టమి తిధి భౌమ వాసర: భరణి నక్షత్రం గండ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం. 


అష్టమి రాత్రి 03:53 వరకు.

భరణి రాత్రి 01:34 వరకు.

సూర్యోదయం : 06:01

సూర్యాస్తమయం : 06:43

వర్జ్యం : పగలు 11:01 నుండి 12:38 వరకు.

దుర్ముహూర్తం: పగలు 08:33 నుండి 09:24 వరకు తిరిగి రాత్రి 11:14 నుండి 11:59 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు09:00 నుండి 10:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

ప్రవచనం

 ఈ బ్లాగరు హిందూ ధర్మం టి.వి. లో చేసిన ప్రవచనం


https://youtu.be/4BcGF2xVs54

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 



                             శ్లోకం:41/150 


సిద్ధయోగీ మహర్షిశ్చ 

సిద్ధార్థ స్సిద్ధసాధకః I 

భిక్షుశ్చ భిక్షురూపశ్చ 

విపణో మృదురవ్యయః ॥ 41 ॥  


* సిద్ధయోగీ = సిద్ధించిన యోగము కలవాడు, 

* మహర్షిః = ఋషులలో గొప్పవాడు, 

* సిద్ధార్థః = సిద్ధించిన ప్రయోజనము కలవాడు, 

* సిద్ధసాధకః = సిద్ధమగునట్లు సాధించువాడు, 

* భిక్షుః = భిక్షాటనము చేయువాడు, 

* భిక్షురూపః = భిక్షుకుల రూపమున ఉన్నవాడు, 

* విపణః = వస్తువుల క్రయవిక్రయములు చేయువాడు, 

* మృదుః = మెత్తనైనవాడు, 

* అవ్యయః = నాశము లేనివాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

Photo






 

Beeaty of life

 



*