20, అక్టోబర్ 2023, శుక్రవారం

పూజాకార్యక్రమాల సంకల్పము.

 **********

*శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు

 ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ. 20.10..2023

శుక్ర వారం (భృగు వాసరే) 

*************

 గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ  సంకల్పం.  దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో  వచ్చును. 

___________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ  మహావిష్ణోరాజ్నేయా  ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే  శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ  అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే దక్షిణాయనే

శరదృతౌ

ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే

షష్ఠ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే  చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

భృగు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ శోభకృత్  నామ సంవత్సరే దక్షిణాయనే

శరత్ ఋతౌ  ఆశ్వయుజ మాసే  శుక్ల పక్షే షష్ఠ్యాం. 

భృగు వాసరే అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.57

సూ.అ.5.34

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 


శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం శరత్ ఋతువు

ఆశ్వయుజ మాసం 

శుక్ల పక్షం షష్ఠి రా. 9.11 వరకు.  

శుక్ర వారం. 

నక్షత్రం మూల రా. 7.36 వరకు.


అమృతం మ. 1.22 ల 2.55 వరకు. 

దుర్ముహూర్తం ఉ.8.16 ల 9.02 వరకు.

దుర్ముహూర్తం ప. 12.08 ల 12.54 వరకు. 

వర్జ్యం రా.6.03 ల 7.36 వరకు. 

వర్జ్యం తె. 4.47 ల మరునాడు ఉ. 6.19 వరకు. 

యోగం అతిగండ  తె. 3.11 వరకు. 

కరణం కౌలవ ప.9.52 వరకు.

కరణం తైతుల  రా. 9.11 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే.. 

రాహు కాలం ఉ. 10.30 ల 12.00 వరకు. 

గుళిక కాలం ఉ.7.30 ల 9.00 వరకు. 

యమగండ కాలం మ. 3.00 ల 4.30 వరకు. 

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

***********

పుణ్యతిధి ఆశ్వయుజ శుధ్ధ షష్ఠి. 

.**********

*శ్రీ పద్మావతీ శ్రీనివాస వివాహ సమాచార సంస్థ*,

(స్థాపితము 11/08/2000 రి.జి.నెం.556/2013)

S2,/C92, 6 -3 -1599/92,బి 

Sachivalayanagar,

Vanasthalipuram,

Rangareddy Dist, 500 070,

80195 66579.

.**********

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న   అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని  కోరుకుంటూ మీ  శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

పంచాంగం 20.10.2023 Friday,

 ఈ రోజు పంచాంగం 20.10.2023  Friday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష: షష్థి  తిధి భృగు వాసర: మూల నక్షత్రం అతిగండ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు పంచాంగం.


షష్థి రాత్రి 11:22 వరకు.

మూల రాత్రి 08:37 వరకు .

సూర్యోదయం : 06:14

సూర్యాస్తమయం : 05:47

వర్జ్యం : రాత్రి 07:03 నుండి 08:37 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:33 నుండి 09:19 వరకు తిరిగి మధ్యాహ్నం 12:24 నుండి 01:10 వరకు.


రాహుకాలం : పగలు 10:30  నుండి 12:00 వరకు 


యమగండం : మద్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.  



శుభోదయ:, నమస్కార:

అవధూత

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*


*(రెండవరోజు)*


రాబోయే సంక్రాంతి పండుగ తరువాత తాను మౌనం వీడుతానని ఆ యువకుడు వ్రాసి చూపిన తరువాత..శ్రీధర రావు గారు తిరిగి మొగలిచెర్ల గ్రామానికి వచ్చేసారు..ఇంటికి రాగానే భార్య ప్రభావతి తో..తాను మాలకొండలో ఒక దిగంబర యోగిపుంగవుడిని చూశాననీ.. అతన్ని చూసిన మరుక్షణమే ఒక మహాత్ముడిని చూసిన అనుభూతి కలిగిందనీ.. ఈసారి తాను వెళ్ళేటప్పుడు..తనతో పాటు ఆమెను కూడా తీసుకెళతాననీ..ఎంతో ఉద్వేగంతో చెప్పారు..నిజానికి శ్రీధరరావు గారికి ఇంకా ఆ సాధకుడిని చూసినప్పుడు కలిగిన అనుభూతి వెంటాడుతూనే ఉంది..మాలకొండ నుంచి, మొఫలిచెర్ల దాకా ఎద్దులబండి లో దాదాపు రెండు గంటల ప్రయాణం చేసి వచ్చినా..ఆయన మనసంతా పార్వతీదేవి మఠం లో తాను ఆ సాధకుడి తో గడిపిన ఆ కొద్దిక్షణాల కాలమే గుర్తుకొస్తోంది..


శ్రీధరరావు గారు చెప్పిన మాటలు విన్న ప్రభావతి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు..


"ఈరోజుల్లో.. యోగులు!..మహర్షులు!!..అయ్యోరామ!..ఎవడో వేషం వేసుకొని వచ్చి ఉంటాడు..  ..ఇదిగో మీ లాటి వాళ్ళను తెలివిగా బుట్టలో వేసుకొని..ఈ రకంగా నాలుగు డబ్బులు వెనకేసుకొని..వెళ్ళిపోతారు..వీళ్లంతా కాంతా కనకాలకు ఆశపడే వాళ్లే..నేను రాను!..మీరూ ఊరికే వెళ్లి అతన్ని కలవకండి!..ఏదో ఆ నరసింహ స్వామి దయవల్ల ఇలా హాయిగా బ్రతుకుతున్నాము..మనఇద్దరికీ పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ లక్ష్మీనారసింహుడి సేవ చేసుకొనే అవకాశం వచ్చింది..కొండమీదకు ఆ రోడ్డు వేయిస్తే..ఎంతో మందికి స్వామిని దర్శించుకోవడం సులభం అవుతుంది..మీరు ముందాపని చూడండి..ఇటువంటి కుహనా యోగుల చుట్టూ తిరక్కుండా వుండండి.. మరోమాట..మనం సన్యాసులం కాదు..బాధ్యత గల సంసారులం.." అని సున్నితంగా కాదు గట్టిగానే చెప్పారు..


శ్రీధరరావు గారికి, ఆవిడ చేసిన ఈ బోధ రుచించలేదు..కాల,మాన పరిస్తితులనుబట్టి, ఆవిడ ఆవిధంగా ఊహించడంలో తప్పులేదు కానీ..అందరినీ ఒకే గాట కట్టటం తగదని ఆయన నచ్చచెప్పబోయారు..ప్రభావతి గారు చాలా సేపటి దాకా సమాధాన పడలేదు..

చివరకు.."సరే నండీ!..మీరంతగా చెపుతున్నారు కదా!..తరువాత చూద్దాం..ఎప్పుడో వీలున్నప్పుడు.." అని దాటవేశారు..

కానీ..శ్రీధరరావు గారు మాత్రం మాలకొండ కు వెళ్లినప్పుడల్లా..పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లి, ఆ యోగి వచ్చేదాకా ఎదురుచూసి.. ఆయనను కలిసి రావడం ఒక నియమంగా పెట్టుకొని ఆచరించసాగారు..అలాగే..తాను ఆ యోగిని కలిసివచ్చిన తరువాత తన అనుభూతి ని ప్రభావతి గారితో పంచుకోవడమూ చేసేవారు..


శ్రీధరరావు గారు పదే పదే చెపుతున్న మాటల వల్ల కావొచ్చు..సహజమైన కుతూహలం వల్ల కావొచ్చు..తాను ఈసారి శ్రీధరరావు గారితో పాటు మాలకొండ వస్తానని ప్రభావతి గారు చెప్పేసారు..ఆ తరువాత  రెండు మూడు రోజుల్లోనే సంక్రాంతి ఉంది..ఎలాగూ మౌన వ్రతం అయిపోతుంది కదా అని..ఆ దంపతులు పండుగ నాడు తమ గూడు బండిలో..మాలకొండకు ప్రయాణమయ్యారు..దారి పొడవునా..శ్రీధర రావు గారు ఆ యోగి గురించి చెపుతూనే వున్నారు..మాలకొండ క్రింద బండి ని ఆపేసి, బండితోలే అతనికి అక్కడే వుండమని చెప్పి..ఇద్దరూ పార్వతీదేవి మఠం వద్దకు మెట్లెక్కి వెళ్లారు..


సన్నగా వర్షం మొదలైంది..దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం ముందున్న చిన్న పందిరిలో నిలబడి వున్నారు..అమ్మవారి ఆలయం తలుపులు వేసేసి ఉన్నాయి..ఆ యోగి ఆలయం లో ఉన్నాడా?..లేక వేరేచోటికి వెళ్లాడా?..అని ఆలోచిస్తూ నిలబడ్డారు..


ఇంతలో..పై నున్న శివాలయం గుహ వద్ద నుంచి..మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ యోగి, ఆ రాళ్ళ మధ్య నుంచి దిగి వస్తున్నాడు..నడుముదాకా వ్రేలాడుతూ..నీళ్లు కారుతున్న జుత్తు.. తెల్లటి మేని ఛాయ.. ఆరడుగుల శరీరం..చల్లటి చూపు..చిరునవ్వు తో కలిసిన విగ్రహం..ఒక చేతిలో దండము, మరో చేతిలో కమండలమూ..మొలకు కట్టుకున్న చిన్న అంగవస్త్రం తో దిగి వస్తున్నాడు..నేరుగా వచ్చి ఆ దంపతుల ముందు కొద్దిదూరంలో నిలుచున్నాడు..చేయెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఊపి..పార్వతీదేవి ఆలయం తలుపు తీసుకొని లోపలికి వెళ్లి..లోపలే ఉన్న చిన్న అరుగుమీద కూర్చుని ప్రక్కనే ఉన్న మరో చిన్న వస్త్రాన్ని అందుకుని..తెల్లటి పాదాలను తుడుచుకోసాగాడు..


శ్రీధరరావు గారు ముందుగా వెళ్లి..ఆయన పాదాలకు నమస్కారం చేశారు..చిరునవ్వుతో ఆశీర్వదించారు..ప్రభావతమ్మ కూడా నమస్కరించబోయింది..చటుక్కున తన పాదాలను వెనక్కు తీసేసుకున్నాడా యోగి..ప్రభావతి గారికి ఒక్కసారిగా మనస్సు చివుక్కుమనిపించింది..తనకు నమస్కారం చేసే అర్హత లేదా అనే ఒకానొక అహంకారపు ఆలోచన మనసులో తన్నుకొచ్చింది..


"నాయనా!..నిన్ను మొదటిసారిగా ఇదే నేను చూడటం ..నా భర్త గారు నమస్కరిస్తే..ఆశీర్వదించావు..అదే నేను నమస్కారం చేస్తే..తిరస్కరిస్తున్నావు..మేమిద్దరమూ సమానమే గదా..ఈలోపల నీకీ తేడా ఎందుకు?.." అని నేరుగా అడిగేసింది..


ఒక్కక్షణం పాటు ప్రభావతి గారిని నవ్వుతూ చూసి..తాను కూర్చున్న అరుగు మీదనుండి లేచి..పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి..ఆ అమ్మవారి విగ్రహం పాదాలవద్ద..ఈశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో చూపి, అందులో ఉన్న పార్వతీదేవితో ప్రభావతి గారు సమానమనీ..తాను వినాయకుడితో సమానమనీ..తల్లి ఎప్పుడూ బిడ్డకు నమస్కరించరాదనీ...సైగలతో చెప్పి..మరలా పార్వతీదేవి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి..వచ్చి..అరుగుమీద కూర్చున్నాడు..


"అమ్మా!..ఈనాటితో నా మౌనం పూర్తి అయింది..ఇక మీతో మాట్లాడతాను!.." అన్నారా యోగి మొదటిసారిగా ఆ దంపతులతో..ఇద్దరూ ఆయన కూర్చున్న అరుగుకు అభిముఖంగా పద్మాసనం వేసుక్కూర్చున్నారు..సాక్షాత్ దక్షిణామూర్తి తమ ఎదురుగా ఉన్న అనుభూతి కలిగిందా దంపతులకు!..


ఆదిత్య హృదయం అప్పజెప్పడం..స్వామి వారి బోధ..రేపు..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - షష్ఠి -  మూల - భృగు వాసరే* (20.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/hojKRZYyhyk?si=huUJCQsiWIV7tZfZ



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

రహస్యం

 🤔  *రహస్యం* 🙄


చిన్నప్పుడు

ఏ పండక్కో..పబ్బానికో

Dress కుట్టిస్తే..

ఎంత ఆనందమో...👗👕


ఎప్పుడు పండగ

వస్తుందా, ఎప్పుడు

వేసేసుకుందామా

అన్న ఆతృతే...🥳


ఇంటికి చుట్టాలొచ్చి

వెళ్తో వెళ్తూ.. 

చేతిలో రూపాయో... 

అర్ధరూపాయో పెడితే

ఎంత వెర్రి ఆనందమో...😊


చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే

దుఃఖం తన్నుకు వచ్చేది...

ఇంకా ఉంటే బాగుండు

అన్న ఆశ...

ఎంత ఆప్యాయతలో...💞


సినిమా వచ్చిన ఏ

పదిహేను రోజులకో

ఎంతో ప్లాన్ చేసి

ఇంట్లో ఒప్పించి

అందరం కలిసి

నడిచి వెళ్లి..

బెంచీ టికెట్

కొనుక్కుని  సినిమా

చూస్తే ఎంత ఆనందమో...🥰


ఇంటికొచ్చాకా 

ఒక గంటవరకూ

ఆ సినిమా కబుర్లే...

మర్నాడు స్కూల్ లో

కూడా...

ఆ ఆనందం ఇంకో పది

రోజులుండేది...💖


అసలు రేడియో విచిత్రం..

అందులోకి మనుషులు

వెళ్లి మాట్లాడతారా అన్న

ఆశ్చర్యం...అమాయకత్వం..🙄


పక్కింట్లో వాళ్లకి రేడియో

ఉంటే..ఆదివారం

మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం

ముందు కూర్చుని 

రేడియో లో సంక్షిప్త

శబ్ద చిత్రం (ఒక గంట కి

కుదించిన) సినిమాని

వింటే ఎంత ఆనందం...

మనింట్లో కూడా రేడియో

ఉంటే...అన్న ఆశ...😇


కాలక్షేపానికి లోటే లేదు...

స్నేహితులు

కబుర్లు, కధలు

చందమామలు

బాలమిత్రలు...🥰


సెలవుల్లో మైలు దూరం

నడిచి లైబ్రరీ కి వెళ్లి

గంటలు గంటలు

కథల పుస్తకాలు

చదివి ఎగురుకుంటూ

ఇంటికి రావడం....🏃🏻‍♂️


సర్కస్ లు, 

తోలు బొమ్మలాటలు

లక్కపిడతలాటలు...

దాగుడు మూతలు...

చింత పిక్కలు

వైకుంఠ పాళీ

పచ్చీసు..

తొక్కుడు బిళ్ళలు..

ఎన్ని ఆటలో...☺️


మూడు గదుల రైలుపెట్టి

లాంటి ఇంట్లో అంతమంది

ఎంత సంతోషంగా ఉన్నాం...

వరుసగా కింద చాపేసుకుని

పడుకున్నా ఎంత హాయిగా

సర్వం మరిచి నిద్రపోయాం...😴


అన్నంలో కందిపొడి..

ఉల్లిపాయ పులుసు

వేసుకుని తింటే

ఏమి రుచి...

కూర అవసరమే లేదు..🤷‍♂️


20/-రూపాయలు తీసుకెళ్లి

నాలుగు కిలోల 

బియ్యం తెచ్చేది...

ఇంట్లో,  చిన్నా చితకా

షాపింగ్ అంతా నేనే...

అన్నీ కొన్నాకా షాప్

అతను చేతిలో గుప్పెడు

పుట్నాల పప్పో, పటికబెల్లం

ముక్కో పెడితే ఎంత

సంతోషం...

ఎంత బరువైనా

మోసేసేవాని..💓


ఎగురుతున్న విమానం

కింద నుండి 

కళ్ళకు చెయ్యి అడ్డం

పెట్టి చూస్తే ఆనందం...🥰


తీర్థం లో ముప్పావలా

పెట్టి కొన్న ముత్యాల దండ 

చూసుకుని మురిసి

ముక్కలైన రోజులు...


కొత్త పుస్తకం కొంటే

ఆనందం...వాసన

చూసి మురిపెం..

కొత్త పెన్సిల్ కొంటే

ఆనందం...

రిక్షా ఎక్కితే...

రెండు పైసల

ఇసుఫ్రూట్ తింటే

ఎంత ఆనందం..?🤩


రిక్షా ఎక్కినంత తేలికగా... 

ఇప్పుడు విమానాల్లో 

తిరుగుతున్నాం...✈️

మల్టీప్లెక్స్ లో ఐమాక్స్

లో సినిమా చూస్తున్నాం.

ఇంటర్వెల్ లో

ఐస్ క్రీం తింటున్నాం..🍧


బీరువా తెరిస్తే మీద పడి

పోయేటన్ని బట్టలు...

చేతినిండా డబ్బు...

మెడలో ఆరు తులాలనగ....

పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు...

ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు...

హోమ్ థియేటర్లు...

సౌండ్ సిస్టమ్స్, 

చేతిలో ఫోన్లు... 

అరచేతిలో స్వర్గాలు...

అనుకోవాలే గానీ క్షణంలో

మన ముందు ఉండే 

తిను బండారాలు.. 

సౌకర్యాలు...😍


అయినా చిన్నప్పుడు

పొందిన  ఆ ఆనందం

పొందలేకపోతున్నాం

ఎందుకు ...?

ఎందుకు...? ఎందుకు...?🤔


చిన్నప్పుడు కోరుకున్నవి

అన్నీ ఇప్పుడు  

పొందాము కదా...

మరి ఆనందం లేదేం...

ఎందుకంత మృగ్యం

అయిపోయింది...

ఎండమావి 

అయిపోయింది..


మార్పు ఎందులో...?🤔

మనలోనా...?

మనసుల్లోనా...?

కాలంలోనా...?

పరిసరాల్లోనా...?

ఎందులో... ఎందులో...?

ఎందులో ...?

చెప్పవా తెలిస్తే....!!


ఎవరు రాసారో కాని మనసుకు హత్తుకునేలా రాసారు.. గత జ్ఞాపకల్లోకి పుష్కకవిమానంలో తీసుకొని వెళ్ళారు..

Mini india in London


 

Petrol price in kuwait


 

DoubleODuble Decker bud in hyderabad

 


House construction in muttania country


 

How to increase age by breathing