21, అక్టోబర్ 2023, శనివారం

శనివారం, అక్టోబరు 21, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శనివారం, అక్టోబరు 21, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:సప్తమి రా7.21 వరకు  

వారం:శనివారం (స్థిరవాసరే)

నక్షత్రం:పూర్వాషాఢ సా6.30 వరకు

యోగం:సుకర్మ రా12.09 వరకు

కరణం:గరజి ఉ8.13 వరకు తదుపరి వణిజ రా7.21 వరకు 

వర్జ్యం:ఉ.శే.వ6.14వరకు & రా2.04 - 3.35

దుర్ముహూర్తము:ఉ5.57 - 7.29

అమృతకాలం:మ1.54 - 3.26

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి : తుల

చంద్రరాశి:  ధనుస్సు 

సూర్యోదయం:5.56

సూర్యాస్తమయం: 5.34


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


             *_శ్లోకమ్-_*


*_భూరంభాంస్య నలోనిలోoబర మహర్నాధోపిమాంశుః పుమాన్_*

*_ఇత్యాభాతి చరాచరాత్మక మిదం యస్యైవ మూర్త్యష్టకం_*

*_నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో_*

*_తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే_.....*


*_దక్షిణాముర్తి స్తోత్రమ్- 9 -_*


*ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది...దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును..... శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా ప్రణామములు*


🧘‍♂️🙏🪷 ✍️🙏

Jada kolatam


 

భగవద్గీత మూలం చేపింది

 (Free Free )ఆత్మ -విద్య -మనిషి రహస్యం :


-మనిషి  జంతువులు లాగా బ్రతుతున్నారు దాని వలన  లాస్ (నష్టంపోతున్నారు )కేవలం కేవలం  తినుట సంపాదన,పిల్లలు కనటం అక్కడ వరకు మనిషి  బ్రతుకు తున్నారు మనిషి  భూమి పుట్టిన ది అందుకు కాదు "నీవు ఎవరో  తెలుసు కొవడానికి వచ్చావు జంతువులు తినుట సంపాదన పిల్లలు కనటం  అవి కూడా చేస్తున్నాయి( నీకు వాటికి ఏమి తేడా ఏమి లేదు )  మనిషి ఎదుట  మనిషి దోచుకోవడం, బాధ పెట్టుట  చంపడం  ఇవి చేయడం వలన  నష్టం పోతున్నాము గుర్తుoచు  దాని వలన  లాభం లేదు  పౌరుషం హీనంగా బ్రతుకకు   ఇలాగే  బ్రతుకుతే  మనిషి  జన్మ మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇ వాలి  మన శరీరం లోపల( యుద్ధం )చేయడానికి  వచ్చావు బయట (యుద్ధం) చేయడానికి రాలేదు గమనించగలరు  భగవద్గీత మూలం  చేపింది  దీనిని అర్ధం చేసికో, నేను ఎవరుని కించ పరిచడాము లేదు.  ధన్యవాదములు👏( కాంటాక్ట్ :-9440546282.)

భక్తికి వశం..

 *భక్తికి వశం..*


"మీతో మాట్లాడాలి..ఎప్పుడు వీలవుతుంది?.." అని ఒకతను నన్ను అడిగాడు.."మీరు చూస్తూనే వున్నారు కదా..ఖాళీగా వున్నాను..ఇప్పుడే మాట్లాడుకుందాము.." అన్నాను..అతను సందేహిస్తూ చుట్టూ చూసి.."నా ఉద్దేశ్యం మీ ఒక్కరితోనే మాట్లాడాలని.." అన్నాడు.."సరే..రండి..ఆ మంటపం లో కూర్చుని మాట్లాడుకుందాము.." అన్నాను..ఆరోజు బుధవారం..మందిరం లో భక్తులు లేరు..నేను, మా సిబ్బంది..అర్చకస్వాములు..అందరం కలిసి..రాబోయే శివరాత్రి కి చేయాల్సిన ఏర్పాట్ల గురించి ముచ్చట చేస్తున్నాము..ఆ సమయం లో ఇతను వచ్చాడు..


ఇద్దరమూ మంటపం లో ఓ ప్రక్కగా కూర్చున్న తరువాత.."ఇప్పుడు చెప్పండి.." అన్నాను.."మాది నెల్లూరు జిల్లా చెన్నాయపాలెం అండీ..ఆక్వా సాగు చేసి బాగుపడ్డాము..అప్పుడప్పుడూ అందులో ఒడిదుడుకులు ఎదురైనా..తట్టుకొని నిలబడ్డాము..నాకు ఇద్దరు అబ్బాయిలు..పెద్దవాడికి రెండేళ్ల క్రితం వివాహం చేసాను..రెండోవాడు చెన్నై లో ఉద్యోగం చేస్తున్నాడు..గత ఆరునెలలుగా ఒక సమస్యతో బాధపడుతున్నాము..మా అబ్బాయికి కోడలికి మధ్య విబేధాలు వచ్చాయి..ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది..మా కుల పెద్దల వద్ద పంచాయితీ పెట్టించాము..కానీ ఆ అమ్మాయి కానీ..వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఈ పంచాయతీలకు మేము రాము...అని చెప్పారు..పైగా మామీద వరకట్నం కేసు కూడా పెట్టారు..వ్యవహారం కోర్టుకు చేరింది..మాకు మనోవేదన పెట్టుకున్నది..ఆ పిల్లను బంగారం లాగా చూసుకున్నాము..మా పరంగా ఏ లోటూ చేయలేదు..పైగా పెళ్లి అయిన మరుసటి నెలలోనే..మా అబ్బాయిని కోడలిని నెల్లూరు లో ఇల్లు తీసి..అందులో కాపురం పెట్టించాము..నేనూ నా భార్యా వాళ్ళ సంసారం లో జోక్యం చేసుకోలేదు..అటువంటిది ఆ పిల్ల నా భార్య మీద కూడా కేసు పెట్టి..మూడురోజులు జైల్లో పెట్టించింది..బెయిల్ తీసుకొని బైటకు తీసుకువచ్చాము..మాకెందుకీ ఖర్మ పట్టింది అని కుమిలి పోతున్నాము..ఏ దిక్కూ తోచక నాలుగు వారాల నుంచీ ఈ స్వామివారి వద్దకు వస్తున్నాము..ప్రతి బుధవారం ఉదయం వచ్చి..గురువారం సాయంత్రం వెళుతున్నాము..స్వామివారు మమ్మల్ని గట్టున పడేస్తే అదే చాలు..గౌరవంగా ఉన్న వాళ్ళము..ఈ రకంగా బాధ పడాల్సివస్తుందని అనుకోలేదు.." అన్నాడు.."ఇప్పటికి నాలుగు వారాలు ఇక్కడికి వచ్చాము..ఇంకొక్క వారం వస్తే ఐదు వారాలు అవుతాయి.." అన్నాడు.."మీ భార్య కూడా వచ్చిందా..?" అన్నాను.."ఈ స్వామివారి వద్దకు రావడానికి ఆమె కారణం..తానే పట్టుబట్టి ఇక్కడకు తీసుకొచ్చింది.." అని చెప్పి..తాను లేచి వెళ్లి..మంటపానికి అవతల వైపు ఉన్న ఆడమనిషిని వెంట పెట్టుకొని వచ్చాడు..ఆమెను పరిచయం చేసాడు..


"అయ్యా..మాకు ఏమీ వద్దయ్యా..ఆ అమ్మాయి వాళ్ళు మాకు కట్నంగా ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా వెనక్కు ఇస్తాము..మేము పెట్టిన బంగారం వదులుకుంటాము..మా మీద కేసు లేకుండా ఉంటే..విడాకులు ఇచ్చేస్తాము..ఈ స్వామివారిని మేము కోరేది అదొక్కటే.." అన్నది..


"సరే..మరో వారం రండి..స్వామివారిని పరిపూర్ణంగా నమ్మితే..పరిష్కారం చూపకుండా వుండరు..ఇక మీ సమస్య ఎప్పుడు తీరుతుందో చూద్దాము.." అన్నాను.."అయ్యా..మీరు కూడా మా తరఫున స్వామివారికి ప్రార్ధన చేయండి..అందుకోసమే మిమ్మల్ని ఇలా ప్రక్కకు రమ్మనమని పిలిచాను..ఆ ఒక్క సహాయం మా కోసం చేయండి.." అన్నారు.."మీ గోత్రనామాలు ఇవ్వగలరా..రేపటి నుంచి ఉదయం స్వామివారి హారతులు కాగానే..మీ గోత్రనామాలతో అర్చన జరిపిస్తాను..చూద్దాము..స్వామివారు మీ వేదన తీరుస్తారనే నమ్మకం ఉంది.." అన్నాను.."తప్పకుండా ఇస్తాము.." అని ఒక కాగితం మీద వాళ్ళ గోత్రము..పేర్లు..వ్రాసి ఇచ్చారు..అర్చకస్వామిని పిలిచి..ఆ గోత్రనామాలతో ప్రతిరోజూ ప్రభాతసేవ అనంతరం అర్చన చేయమని ఇచ్చాను..సరే అన్నారు..


ఆ మరుసటి వారం..ఆ దంపతులు స్వామివారి మందిరానికి వచ్చారు..వాళ్ళ ముఖాల్లో మునుపటి నిరుత్సాహం లేదు..ఇద్దరూ కాళ్ళూ చేతులు కడుక్కొని..స్వామివారి మందిరం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి..టికెట్ కొనుక్కొని..స్వామివారి సమాధి దర్శించుకొని..ఆ తరువాత నా దగ్గరకు వచ్చారు.."అయ్యా..చాలా వరకూ మా సమస్య తీరిపోయింది..ఆ అమ్మాయి వాళ్ళు పంచాయతీ కి వచ్చారు..మేము తీసుకున్న కట్నం డబ్బు మేము వెనక్కు ఇచ్చేతట్టు..మా బంగారం మాకు వాళ్ళు ఇచ్చేందుకు..ఒప్పందం జరిగింది..విడాకుల పత్రం కూడా రాసుకున్నాము..మామీద తప్పుడు కేసు పెట్టినట్టు బహిరంగంగా ఒప్పుకున్నారు..కోర్టులో కూడా కేసు వెనక్కు తీసుకున్నారు..కోర్టు నుంచి విడాకుల కాగితాలు రాగానే మా అబ్బాయిని తీసుకొని ఇక్కడకు వస్తాము..ఇక వాడికి మళ్లీ పెళ్లి చేయాలి..ఈ స్వామివారి దయ ఉంటే..అది కూడా త్వరలో జరుగుతుంది.." అని చెప్పారు..ఆరోజు కూడా స్వామివారి సన్నిధి లో వుండి..ప్రక్కరోజు వాళ్ళ ఊరు వెళ్లిపోయారు..


మరో ఆరేడు నెలల తరువాత..తమ పిల్లవాడికి వివాహం చేసి..కొడుకు కోడలు ను తీసుకొని స్వామివారి సన్నిధికి వచ్చారు.."అయ్యా..మా ప్రారబ్ధమో..పిల్లవాడి ఖర్మో ..తెలీదు కానీ..మాకు పట్టిన శని ఆరోజుతో వదిలింది..ఇప్పుడు లక్షణంగా ఉన్నాము..అంతా స్వామి దయ.." అని భక్తిగా చెప్పారు..తమ రెండో కుమారుడి వివాహం స్వామివారి సన్నిధిలో చేస్తామని మొక్కుకొని..అదే విధంగా మరుసటి సంవత్సరం ఆ రెండో కుమారుడి పెళ్లి..మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి సన్నిధి లో చేశారు..అప్పటి నుంచీ ప్రతి సంవత్సరం లో రెండు సార్లు తమ కొడుకులు కొడళ్లు మనుమలతో సహా స్వామివారి వద్దకు వచ్చి అన్నదానం చేసి వెళుతుంటారు..


వాళ్ళు కోరుకునే కోరిక ఒక్కటే.."మమ్మల్ని చల్లంగా చూడు స్వామీ.." అని..ఆ పని స్వామివారు తప్పక చేస్తారు..ఎందుకంటే వాళ్లలో ని భక్తికి స్వామివారు వశం అయ్యారు కదా..!!


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699)

ఎందుకు రాశానంటే..

 2207b. 2g1050.2307B 2-8.



          *వేదం ...జీవన నాదం!* 

                 ➖➖➖✍️


 *ఎందుకు రాశానంటే.......*

            .*...దాశరథి రంగాచార్య* 



*నన్నయకూ పోతనకూ తిక్కనకూ దొరకని అదృష్టం నాకు దక్కింది.                 వేదాల్ని తెలుగులోకి అనువదించే మహద్భాగ్యం నాకే దక్కింది. అంతటి బృహత్యార్యంలో నాకు సాయపడిందెవరూ లేరు. నేనే కాయితం కొనుక్కొని, పెన్సిల్‌ కొనుక్కొని రాశాను.*


*ఒకటా రెండా! ఐదువేల పేజీలు. ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాల్నీ కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే. అంతేకాదు, వేదాలకు వ్యాఖ్య చేసిన సాయణాచార్యులు మన ఆంధ్రుడే. ఇది తెలుగువారి అదృష్టం.*


*” ’ఎవరు పడితే వారు వేదం చదవకూడదు' ...ఒక అపోహ... ఇదెందుకొచ్చిందీ అంటే, ఒక వర్గానికి ఇది ఉపాధి. అందులో వాళ్ల ఆధిపత్యం పోతుందని భయము"*


*కానీ అదంతా తప్పు. వేదం అంటే జ్ఞానం కదా, అది ఒకరి అధీనంలో ఉండడమేమిటి? జ్ఞానానికి అడ్డుగోడలేమిటి? దాన్నెవరు పిడికిట్లో పట్టుకోగలరు? ఇది అందరికీ అందవలసింది... అనుకొని వేదాల్ని అనువదించడం వెుదలుపెట్టాను.* 


*సరే... వేదాలకు అనువాదం చేస్తున్నాననగానే బోలెడంత ప్రచారం జరిగింది. దాంతో చాలామంది 'నువ్వు వేదం అనువాదం చెయ్యెుద్దు, నాశనమైపోతావు' అని భయపెట్టేవారు.* 


*రాత్రిపూట ఫోన్లొస్తే తీయడానికి కూడా      మా కమల భయపడిపోయేది. నా ఇంటి ముందు ఎవడో ఆత్మహత్య చేసుకుంటానంటూ వీరంగం వేశాడు. ఏదైనా మంచిపని చెయ్యాలన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు కదా! అయినా నేను చేయాలనుకున్నది చేశాను. ఊహూ! ఆ భగవంతుడే నాతో చేయించాడు.*


*వెుుత్తం పదివేల మంత్రాలు. వాటన్నిటినీ చదివి మనసులో ఉంచుకొని దర్శించి తెలుగులోకి అనువదించడమంటే మాటలా! అప్పటి నా అవస్థ ఇదీ...*


*ముందర కూచుంటాను.* 

*మహారణ్యంలోకి పోయినట్టుంటుంది. పెద్దపులులూ సింహాలూ ఎలుగుబంట్లూ... మనమేం చెయ్యగలం అనిపిస్తుంది.*

*నిమిషం కళ్లుమూసి తెరిస్తే అదే అడవి ఉద్యానంలా కనిపిస్తుంది. అందులో నెమళ్లుంటాయి. కుందేళ్లుంటాయి. కోయిలలుంటాయి. అదే నాకు అర్థమైందని అర్థం.*

*నేను రాస్తుంటే నా కలం వెంబడి ఏదో వెలుగుపాయ వస్తున్నట్టు కనిపిస్తుంది. మన ప్రయత్నం చెల్లదు దానికి.*

*అంతా రాశాక నా అనువాదం చదివితే నాకే ఆశ్చర్యమనిపించింది...* 

*స్వరం కూడా ఉన్నదందులో! రాసింది వచనమే అయినా స్వరం ఎలా వచ్చిందో తెలియదు. నేను కావాలని చేసిందయితే కాదు. నా శ్రమ ఫలించింది.*


 *'ఎవరు కొంటారు సార్‌ వేదం... రెండు మూడు వేల కాపీలు పోతే ఎక్కువ' అన్నారు.*


*కానీ వేదానువాదం ప్రచురితమవుతున్నదని తెలియడం ఆలస్యం... ప్రచురణ మొదలవక ముందే 2వేల పుస్తకాలకు ఆర్డరొచ్చింది.*


*అంటే... రూ.30లక్షలు అడ్వాన్సు!. పుస్తకం మార్కెట్లో విడుదలైన రోజున బారులు తీరి నుంచొని మరీ కొన్నారా పుస్తకాన్ని.*


*'తెలుగువాళ్లూ పుస్తకం కొంటారు' అని ఓ పేరున్న పత్రికలో ఆ అరుదైన సంఘటనపై ఓ వ్యాసం కూడా వచ్చింది.*


*ఆ స్పందన చూసి పుస్తక విక్రేతలే ఆశ్చర్యపోయారు. ప్రజల్లో వేదం పట్ల అంత ఆసక్తి ఉంది. లేకపోతే ఎవరు కొంటారు? ఒక సంవత్సరంలో రూ.50 లక్షల టర్నోవర్‌ ఎందుకు అవుతుంది?* 


*ఇప్పుడు కనీసం 20వేల మంది ఇళ్లల్లో వేదం ఉన్నది. అదీ నేను అనువాదం చేసింది.*

*అది నాకెంతో సంతోషం.*✍️

         … దాశరధ రంగాచార్య.

         *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

  *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

ఆలోచనాలోచనాలు

 ఃంఃం ఆలోచనాలోచనాలు ఃంఃం.                               -----💐నవ్వుల పువ్వులు 💐-----                                  ***** వీలైనప్పుడెల్లా నవ్వండి. నవ్వు అనేది దాదాపు ఉచితంగానే దొరికే అద్భుతమైన ఔషధం. మన ముఖంపై నవ్వులు పుయ్యని రోజు, ఒక వ్యర్థమైన రోజని గుర్తుంచుకోండి.                      ***** మనం దిగాలుగా ఉంటే , జీవితం మనల్ని చూచి నవ్వుతుంది. మనం కేరింతలు కొడుతుంటే జీవితం మనల్ని చూసి మురిసిపోతుంది. కానీ మనం ఇతరులను ఆనందపరచినప్పుడు , జీవితం మనకు చేతులెత్తి నమస్కరిస్తుంది.                    ***** మనం ఏడిస్తే ఈ లోకం నవ్వుతుంది. మనం నవ్వితే లోకం మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. అయినా మనం ఈ లోకంలోనే బ్రతకాలి కాబట్టి, మనకు ఈ లోకంతో బ్రతికినన్నాళ్ళు పనే ఉంటుంది.                        ***** యోగి వేమన వంటి మహనీయులు లోకాన్ని పట్టించుకోకుండా తమ పనులను తాము చక్కదిద్దుకొని ప్రక్కకు తప్పుకొన్నారు. మనం ఆ స్థాయిలో ఉంటే లోకంతో మనకు పని ఉండదు.           ***** నా బాధ, మరొకరి నవ్వుకు కారణం కావచ్చు కానీ, నా నవ్వు మరొకరిబాధకు కారణం కాకూడదు అంటారు , ప్రఖ్యాత హాస్యనటుడు చార్లీ చాప్లిన్.                         ***** అద్దం నాకు మంచి మిత్రుడు. ఎందుకంటే నేనెప్పుడు ఏడుస్తున్నా అది మాత్రం నన్ను చూచి నవ్వదు.                                      ***** నవ్వడానికి ముఖంలోని 16 కండరాలను మాత్రమే శ్రమ పెట్టాలి. అదే ముఖం చిట్లించడానికి ముఖంలోని 72 కండరాలు శ్రమపడాలి. ఏది సౌకర్యవంతమో మీరే ఆలోచించుకొని, ఆచరణలోకి తీసుకరండి.       ***** రాత్రింబవళ్ళు విపరీతమైన వత్తిడితో సతమతమయ్యే నేను రోజు మొత్తం లో కొంత సేపైనా హాయిగా నవ్వకుండావుండివుంటే, ఎప్పుడో చనిపోయివుండేవాడిని.--- అబ్రహాం లింకన్.                    ***** అసహజమైన నవ్వు నకిలీ నాణెం వంటిది. చలామణి లో ఉన్న ఈ నకిలీ నాణేన్ని ఎవరోఒకరు గుర్తించి " సర్కులేషన్" నుండి తొలగిస్తారు.               ***** ఈ భూమిపై హాయిగా నవ్వగలిగిన ఏకైక జీవి , మనిషి మాత్రమే! జన్మించనివారు , జన్మించి,కొంతకాలం జీవించి మరణించినవారు మాత్రమే నవ్వలేరు. మనం హాయిగా, కడుపుబ్బా నవ్వలేకపోతున్నాం అంటే కారణం కనుగొనాలి!                ***** సంపదకు, లాభానికి, శుభానికి, సర్వశ్రేయస్సుకు ప్రధానం సంతోషమే సుమా! ఈ లోకంలో దుఃఖింపని వాడే గొప్పవాడు సుమా!                ***** నవ్వడం ఒక భోగం. నవ్వలేకపోవడం ఒక రోగం. పదిమందిని నవ్వించడం ఒక యోగం.              ***** చివరగా నోట్లో బంగారు దంతాలు ఉన్నవాళ్ళు మాత్రం దయచేసి బాహాటంగా నవ్వకండి. దొంగలు ఎవరైనా పండ్లూడగొట్టి మరీ దోచుకోగలరు. జాగ్రత్త!                                    -------------------------------------------------                               అర్థబేధము గల పదములు.                           1* పరువము = వయస్సు.      పారువము = పావురము.      2* పండితమాన్యుడు = గొప్పవాడు;  పండితంమన్యుడు = శుంఠ  3* ప్రణామము = నమస్కారము ; ప్రమాణము = ఆదర్శము.     4* ప్రపత్తి = భక్తిని చూపుట.; ప్రతిపత్తి = ప్రగౌరవము                             5* ప్రమదము = సంతోషము ; ప్రమాదము = ఏమరుపాటు                     6* ప్రదానము = గొప్ప ఈవి; ప్రధానము = ముఖ్యము.                          7* పిట్ట = పక్షి ; పెట్ట = ఆడుపక్షి.                               8* బోయ = కిరాతుడు.         బోయి = పల్లకి మోసేవాడు.                           9* మద్యము = సుర ( పానీయము) మధ్యము = నడుమ                             10* వారిది = సేతువు;          వారిధి = సముద్రము              తేది 21--10--2023, శనివారం, శుభోదయం.

*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు -  ఆశ్వీయుజ మాసం - శుక్ల పక్షం  - సప్తమి -  పూర్వాషాఢ - స్థిర వాసరే* (21.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/IMcgx4iFJKs?si=5mTJzPwaquyfmu7K


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

నలువ చెలువ యందము !


నలువ చెలువ  యందము !

------------------------------------------ 

        

   మ:  నవలావణ్య  రసాలయంబు , గుణరత్న స్థాన , మాస్య  క్షపా


                  ధవ  బింబోదయ , మున్నతస్తన గిరీంద్రవ్యక్తి , వాచాసుధా


                   భవ దేశంబు , వళీతరంగము , తనూభద్ర ప్రభా  ఫేన దీ


                    ప్తి విలాసం , బగు తత్కళత్రము సుధాబ్ధిం  బోలి సద్భక్తితోన్;


                           శ్రీ కాళ హస్తీశ్వర మాహాత్మ్యము  2 ఆ: 5- పద్యం:  ధూర్జటి.


                      

                               కథాసందర్భంగా  ద్వతీయా శ్వాసంలో  ఈపద్యం చోటుచేసికొన్నది. బ్రహ్మ గారికి తనభార్య సరస్వతి  పాల్కడలివలె  దర్శన మిచ్చిందట!  


            అర్ధములు: లావణ్యము- శరీరపు మెఱపు,; రసాలయం - నీటితోనిండినది సముద్రము; గుణరత్నములు- సద్గుణములనేరత్నములు; ఆస్యము -ముఖము;  క్షపాధవ బింబోదయము- చంద్రబింబముయొక్కఉదయము; గీరీంద్రవ్యక్తి- పర్వతములు కనబడుట; వాచాసుధ- అమృతమువంటిమాటలు; భవదేశము-పుట్టుచోటు;  వళీతరంగము- పొట్టపై ముడతలనే  కెరటములు; తనూభద్ర ప్రభాదీప్తి  ఫేన దీప్తి విలాసము- శరీరకాంతి యనే నురుగులు; కళత్రము- భార్య ;  సుథాబ్ధి-పాలకడలి;


                     సరస్వతిని కవి పాల సముద్రంతో  పోల్చి చెపుతున్నాడుకవి.  ఇదో అపురూపమైన పద్యం!  భార్యను పాలకడలితో పోల్చిచెప్పిన కవులెవ్వరూ కానరారు. సముద్రముతో పోల్చినప్పుడు దానిలక్షణాలు భార్యయందు ఉండాలికదా? ఉన్నాయని రూపకంలో నిరూపిస్తున్నాడు.


          పాల సముద్రంయొక్క లక్షణాలు  ఈవిధంగా ఉన్నాయి. అపారమైన నీరు, రత్నములకు నెలవగుట , చంద్రుని పుట్టుక , పెద్దపర్వతములు కానవచ్చుట, అమృత ము ఉదయించుట, కెరటములు , నురుగులు స్థూలముగానిదీదానిస్వరూపము. ఆలక్ణణములన్నియు కళత్ర స్థానమున నున్న సరస్వతి యందుకూడ నున్నవట! యెట్లు? 


                  నవలావణ్యమనే  నీరు సమృధ్ధిగా నీమె శరీరమున నున్నదట. గుణములనే రత్నములున్నవట.( ఆమెసద్గుణములు రత్నములవంటివే యని ) ముఖమే  చంద్రోదయముతో  సమానమట. ఆమె సమున్నతమైన  స్తన సంపదయే పర్వతములట, ఆమెమాటలే  అందుదుదయించిన యమృతమట! (ఆమెమాటలు అమృతతుల్యములని చెప్పుట) ఆమె యుదరస్థమైన  ముడుతలే  కెరటములట, ఆమె శరీర కాంతియే  నురుగట. ఈవిధముగా పాల సముద్రము వలె సరస్వతి యట కరుదెంచి భర్త బ్రహ్మగారికి కనువిందుచేసింది. 


                       భార్యను పాల సముద్రముతో  పోల్చుట  యెంత గొప్పయూహ! ఎంతఉదాత్తమైనది!


                            సద్గుణగణములుగల భార్య పాల సముద్రము వంటిదే! పాల సముద్రము దేవతలకు అమృతానిచ్చింది. భార్య కూడా ఆనందామృతాన్ని జీవితాతం భర్తకు అందిస్తూనే ఉంటుంది.పాలసముద్రం కల్పవృక్షాదుల నిచ్చింది. వాటి ఉపయోగం?కోరికలుదీరటం. భార్యకూడా కల్పవృక్షమే  నీకోరికల నన్నిటినీ తీరుస్తూనే ఉంటుంది. ఉదాత్తమైన భావనతో భార్యను భర్త

గౌరవిస్తూ ఉంటే భార్య గృహ లక్ష్మియై సకల భోగ భాగ్యాలకు కారక మౌతుంది. పాలసముద్రం మనప్రక్కనున్నా  గమనించలేని ధూర్తులకు  జీవనం వ్యధాభరితమే! భార్యతో అనురాగాన్ని పంచుకుంటే  ఆజీవితం సుధాభరితమే!* అనే చక్కని సందేశాన్ని యీపద్యంద్వారామనకు అందజేసిన ధూర్జటి  కవీనాంకవి యనుటలో  నత్యుక్తి లేదు.


                                                                  స్వస్తి!🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

⚜ శ్రీ లక్ష్మీ రవల్నాథ్ ఆలయం

 🕉 మన గుడి : నెం 214





⚜ గోవా  : పోండా


⚜ శ్రీ లక్ష్మీ రవల్నాథ్ ఆలయం


💠 భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రమైన గోవా, అందమైన బీచ్‌లు, పాశ్చాత్య సాంస్కృతిక వైభవం ,నోరూరించే వంటకాలకు ప్రసిద్ధి చెందింది. 

అయితే, ఈ తీర ప్రాంత స్వర్గంలో కంటికి కనిపించే దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రం సుసంపన్నమైన మరియు విభిన్న సంస్కృతికి నిలయంగా ఉంది, ఇది దాని అనేక దేవాలయాలు మరియు మతపరమైన ప్రదేశాలలో ప్రతిబింబిస్తుంది. 

అటువంటి దేవాలయాలలో ఒకటి పోండా జిల్లాలోని మార్సెల్ గ్రామంలో ఉన్న లక్ష్మీ రావల్నాథ్ ఆలయం. 


💠 శ్రీ దేవకీకృష్ణ రావల్నాథ్ ఆలయం అని కూడా పిలువబడే లక్ష్మీ రావల్నాథ్ ఆలయం పోండాలోని మార్సెలా వద్ద 17 కి.మీ దూరంలో ఉంది.  

ఈ ఆలయాన్ని పిస్సో రావల్‌నాథ్ అని కూడా పిలుస్తారు మరియు


💠 భారతదేశంలో శ్రీ దేవకీకృష్ణగా పూజించిన ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

కృష్ణుడు తన తల్లి దేవకితో పాటు పూజించబడే ఏకైక ప్రదేశం ఇది.  


💠 శ్రీ కృష్ణుడు మరియు బలరాముడు పెరిగి పెద్దవారు అయ్యాక చెరసాలలో లో ఉన్న తమ తల్లికి  కనిపించినప్పుడు, వారు దేవకిని అక్కడ కలుసుకున్నారు.  ఇప్పుడు ఎదిగిన కృష్ణుడిని చూసి, ఆమె చిన్న బాలకృష్ణను గుర్తించలేక అవాక్కయింది.  తన తల్లి కష్టాలను పసిగట్టిన శ్రీ కృష్ణుడు వెంటనే పిల్లవాడిగా ఉన్న రూపాన్ని ధరించి, ఆమె ఒడిలోకి దూకి, తన చిన్ననాటి కాలక్షేపాలన్నింటినీ తిరిగి పొందే ప్రత్యేక భాగ్యాన్ని ఆమెకు ప్రసాదించాడు. 

దేవకి వెంటనే పిల్లాడిని లేపి తన ఒడిలోకి తీసుకుంది.

అందుకే ఇక్కడ చిన్ని కృష్ణుడి రూపమే ఉంటుంది.


💠 ప్రస్తుత ఆలయం 1842 సంవత్సరంలో నిర్మించబడింది. . ఆలయం లోపలి గర్భగుడిలో దేవకి మరియు శ్రీకృష్ణుని అందమైన విగ్రహం ఉంది. దేవకి విగ్రహం ఆమె కాళ్ల మధ్య బాల కృష్ణుడు నిలబడి ఉన్న భంగిమలో ఉంది. 

ఈ ప్రత్యేక భంగిమ ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. 

విగ్రహాలను నల్లరాతితో అందంగా చెక్కారు.


💠 లక్ష్మీ రావల్నాథ్ ఆలయం గోవా ఆలయ నిర్మాణ శైలికి ఒక అందమైన ఉదాహరణ. 

ఈ దేవాలయం విలక్షణమైన గోవా శైలిలో నిర్మించబడింది, ఇటుకలతో కూడిన పైకప్పు, తెల్లగా కడిగిన గోడలు మరియు క్లిష్టమైన చెక్కిన చెక్క స్తంభాలతో నిర్మించబడింది. ఆలయానికి అందమైన ప్రవేశ ద్వారం కూడా ఉంది మరియు వివిధ హిందూ దేవతల శిల్పాలను కలిగి ఉంది.


💠 ఆలయం లోపల, నల్లరాతితో తయారు చేయబడిన మరియు బంగారు ఆభరణాలతో అలంకరించబడిన లక్ష్మీ దేవి యొక్క అందమైన విగ్రహం ఉంది. 

ఈ ఆలయంలో అందమైన ప్రార్థనా మందిరం కూడా ఉంది.


💠 గోవా సంస్కృతిలో ముఖ్య భాగమైన లక్ష్మీ రావల్‌నాథ్ ఆలయం శక్తివంతమైన పండుగలు మరియు వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో నవరాత్రి, దీపావళి,హోలీ, రామనవమి, గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి


💠 సంవత్సరం పొడవునా అనేక పండుగలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాల్లో, ఆలయాన్ని అందమైన లైట్లు మరియు పూలతో అలంకరిస్తారు మరియు లక్ష్మీదేవికి ప్రత్యేక ప్రార్థనలు మరియు నైవేద్యాలు చేస్తారు.


💠 లక్ష్మీ రావల్‌నాథ్ ఆలయంలో జరుపుకునే అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి వార్షిక జాతర., ఇది ఫిబ్రవరిలో జరుగుతుంది. 

జాతర  ఒక గొప్ప వేడుక, దీనికి రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది భక్తులు హాజరవుతారు. 

జాతర సమయంలో, లక్ష్మీ దేవి విగ్రహాన్ని పెద్ద ఊరేగింపుగా తీసుకువెళ్లారు, ఇది సంగీతం మరియు నృత్యంతో కూడి ఉంటుంది.


💠 ప్రధాన దేవతలు దేవకీకృష్ణ మరియు భూమికా దేవి, లక్ష్మీ రావల్నాథ్, మల్లినాథ్, కాత్యాయని, చోదనేశ్వర్ మరియు దాదా శంకర్ యొక్క అనుబంధ దేవతలు.


💠 ఇక్కడ పూజలు చేయడం వల్ల భక్తులకు అదృష్టం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. 

ఈ ఆలయం గోవా సంస్కృతి మరియు సంప్రదాయాలలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు రాష్ట్ర గొప్ప వారసత్వానికి చిహ్నంగా ఉంది


💠 పంజిం కదంబ బస్ స్టాండ్ నుండి 17 కి.మీ దూరంలో, వాస్కో డ గామా రైల్వే స్టేషన్ నుండి 34 కి.మీ మరియు మపుసా నుండి 31 కి.మీ దూరం.