23, జులై 2024, మంగళవారం

సమస్య పూరణ

 

ఇచ్చిన సమస్య:గురు బుధ వారముల్ శనిని గూడిన మంగళ, తాళి కట్టెదన్


నా పూరణ (చంపక మాల):


సుర రిపు వారమున్ సెలవు, చూడగ శ్రావణ శుక్రవారమౌ,

మరి యొక నాల్గు రోజులును మాకును గావలె పెండ్లి వేడ్కకున్,

దొరలకు విన్నవించెదను, తోషము గూర్చుచునొప్పుకొన్నచో,

గురు బుధ వారముల్ శనిని గూడిన మంగళ, తాళి కట్టెదన్


భావము: ఒక కుర్రాడు పెళ్ళి చేసుకోవాలి. దానికి సెలవలు కావాలి. శుక్రవారం ఎలాగూ శ్రావణ శుక్రవారం సెలవిచ్చారుట.

         మిగిలిన నాలుగు రోజులు (మంగళ, బుధ, గురు, శని) సెలవలు దొరికితే పెళ్ళి చేసుకోవచ్చు. కాబట్టి "దొరలకు" (పై అఫీసర్లకు) విన్నవించి, ఆ సెలవలు దొరికితే, మంగళవారం తాళి కట్టడం, తరువాత ఐదు రోజులు వేడుకలూను)

బూడిదనిచ్చే స్వామి

 *🟢బూడిదనిచ్చే స్వామి  మాటిచ్చాడు,నా తోడు వస్తానన్నాడు.*


*🔵గౌరీ పతి నా పక్షమన్నాడు,నన్ను కాస్థానన్నాడు.*


*🟠గంగాధారి తను నాకే సొంతం అన్నాడు.*


*🟤భోళా శంకరుడు నా పక్షమే వహిస్తానని మరీ,మరీ చెప్పాడు.*


*🟠ఏమైందో ఏమో ఎంతవేతికిన అడ్రస్సు చిక్కడం లేదు*

.

*🔵దారి తప్పాడో,ఇచ్చిన మాటే మరిచాడో జంగం దేవరుడు*


*🟡నువ్వు వచ్చేవరకు నేనిక్కడే.*

*నీ తోనే నా ప్రయాణం*


*⚫నన్ను నమ్ము స్వామి,నిన్నేమీ కోరనులే,నాకేమీ ఇవ్వద్దులే*.


*🟣ఒక్కసారి నీ స్పర్శ చాలు,నీ చల్లటి చూపు చాలు,అదే వంద వేలు.*


✍✍మూర్తి's కలం

కాలమిస్ట్,కవి.

9985617100.

ఆషాఢ మాసం - ప్రత్యేకత

 ॐ    ఆషాఢ మాసం - ప్రత్యేకత - VII    



ॐ  కొత్త దంపతులు 


    ఆషాఢ మాసంలో కొత్త కోడలూ, కొత్త అల్లుడూ వారివారి అత్తిళ్ళ గడపలు దాటకూడదు అంటారు. 

   దీని అసలు కారణాలు వెనక్కి వెళ్ళిపోయి, గడపలు దాటకుండా, మిగతా వ్యవహారాలు మాత్రం సాగిపోతున్నాయి. 

    ఈ ఆచారానికి అసలు కారణాలు 


1.మనది ప్రధానంగా వ్యావసాయక దేశం. ఆషాఢ మాసం ప్రారంభంనుంచీ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. 

     కాబట్టి వాటిమీద దృష్టి పెట్టాలి. 


2.నూతన దంపతులు ఆషాఢ మాసంలో కలిసి, స్త్రీ గర్భవతి అయితే, పురుడు వేసవి మధ్య కాలంలో వస్తుంది. స్త్రీకి మొదటి కానుపుకు ఆకాలం అనుకూలం కాదు. 

    అందుకనే దంపతులని ఆ నెల దూరంగా ఉంచడం. 

    కొద్దిరోజుల దూరం మరింత దగ్గరచేస్తుంది కూడా కదా! 


3.అత్తింటి దగ్గర కొత్త కోడలుగా ఉండి, పుట్టింటికి వచ్చిన అమ్మాయి, అత్తింటి - పుట్టింటి ఆచార వ్యవహారాలవంటివన్నీ తల్లిదండ్రులతో చెప్పుకుంటూ, సమన్వయ పరచుకునే వెసులుబాటు ఆషాఢమాసం వలనే. 

  (ప్రస్తుత residential విద్యా సంస్థల్లో, చేరిన పిల్లలకి మొదట్లో home sick అని సెలవులిస్తారు కదా!)


    పెద్దలు ఎంతో ఆలోచించి, మన శ్రేయస్సుకై అందిచ్చిన ఆచారాలను, యథాతథంగా కొనసాగించాలి కదా! 


                       సమాప్తం 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

బ్రహ్మ*....*సృష్టి కర్త

 *🟠బ్రహ్మ*....*సృష్టి కర్త*.....నీకు గుడి లేదు,గోపురం లేదు,నైవేద్యం లేదు,అష్టోత్తరం లేదు,ఒక పండగ లేదు,పబ్బం లేదు.


*🟤శివయ్య*....*స్మశాన సంచారి*.....నీ రూపం తో పూజలు అందుకోలేవు,ఒక లింగాకారం మాత్రమే పూజించ బడుతోంది. నీ రూపు,రేఖలు తెలియవు.


*🟢విష్ణువు*...*వైకుంఠవాసి*......నిన్ను దశావతారాల్లో పూజించడమే గానీ, లక్ష్మీ తో కలసి నారాయణుడు గా కోవెల లేదు.

నిన్ను వివిధ అవతారాల్లో కొలుస్తాం.


🔴పూజ,పునస్కారాలు లేనివాడు, ఆకారం లేని వాడు,సొంత రూపం తప్ప వివిధ రూపాల్లో పూజలు, సేవలు అందుకునే మీరు ముగ్గురు ముగ్గురేనయ్య..


⚫మమ్మల్ని సక్రమంగా సాకి,అందర్నీ కాపాడండయ్యా,మాకు మాత్రం రంగు,రుచి, వాసన,బుద్ధి అన్ని వున్నాయి.

*సాటి వార్కి మంచి చేయలనే ఒక ఆలోచన తప్ప*.


✍మూర్తి's కలం .....

కాలమిస్ట్,9985617100.

చదువు...జ్ఞానం*..

 *చదువు...జ్ఞానం*...


🔴చదువంటే తపస్సు,క్రమశిక్షణ,నియమ,

నిష్టలు,కఠోర శ్రమ,సాధన ద్వారా మాత్రమే పొందగలిగే యోగం..


⚫దురదృష్టవశాత్తు నేడు అర్థం మారిపోయిన చదువులు..

పరీక్షల్లో పాస్ అయితే చదువు వచ్చినట్లే..


🟠నాలుగు ప్రశ్నలు ముక్కున పట్టి,ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బట్టి పడితే పాస్ అవుతారేమో కానీ జ్ఞానం అంటదు.


🟢చదువు అంటే సంస్కార వంత భాషణ,నలుగురితో మంచి నడవడిక,పెద్దల యందు గౌరవం,సమాజం పట్ల బాధ్యత వెరసి చదువు.


🔵ఉపయోగం లేని మార్కులు,పనికిరాని ర్యాంకులు,జీవిత గమ్యం చేర్చలేని పాఠాలు,మోయలేని బరువు గల పుస్తకాలు.


🟤తల్లిదండ్రుల జేబులకు చిల్లు తప్ప ఏ మాత్రం జీవితం లో అక్కరకు రాని చదువు.


✍✍ *మూర్తి's కలం*....

కాలమిస్ట్,కవి,లెక్చరర్.

9985617100.

నైవేద్య విశిష్టత,

 ✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

     *నైవేద్య విశిష్టత, పద్ధతి*

  *నైవేద్యం పెట్టేటప్పుడు శ్లోకం*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

*మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం ... విత్తినా మొక్కలు రావు ... వచ్చినా ధాన్యం పండదు ... పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం ... తెచ్చుకున్నా తినలేం ... ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం.*


*ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.*


*ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తం మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందరు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే,  మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతి మాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు.*


*ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు? అది అక్రమార్జితమా? సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి.*


*దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.*


*ఒకసారి హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీ మధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.*


*"శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.  భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపార నిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామ దేవతలకైతే చద్దెన్నం మహా ప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క తప్పనిసరి.*


*నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి.*


*ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...*


**ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా | అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--*


*ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా | అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.మధ్యేమధ్యే పానీయం సమర్పయామి అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి. నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.*


*దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.*


*ఓం నమః శివాయ॥*

✴️✴️✴️✴️✴️✴️✴️✴️✴️

సాంబారులో చందమామలు.

 నేటి తెలుగు వెలుగులో ఉషాకిరణాలు                               🧡 *జిహ్వకో రుచి* 🧡                                   Suguna Rupanagudi 


భోజన ప్రియులకు మాత్రమే!

సాంబారులో చందమామలు.


తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. 


అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును, పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ ఉత్సాహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు!...’ వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి. 


వైద్యులు కాదంటున్నా, ‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’ అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు. 


భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతోనో, మాగాయ టెంకతోనో ‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’ గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు. ‘కడుపే కైలాసం’ వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం.


 కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు. సరైన భోజన సదుపాయం దొరక్క ‘చల్లా న౦బలి త్రావితిన్‌ రుచులు దోసంబంచు పోనాడితిన్‌ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్‌’ 


అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే! కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది. 


చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. ఏ గిరీశాన్నో నిలదీస్తే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు. 


‘చల్ది వణ్ణం’ తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు.


మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ ‘వింటే భారతమే వినాలి’ అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? ‘తింటే గారెలే తినాలి’ అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. ‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’ అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి ‘పాకం గారెలు’గా తినడం మరొకరికి ఇష్టం. ‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్‌’ అనేది వీరి అభిప్రాయం.


 ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్‌ఫుడ్స్‌) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది!


 తరవాణీల బలం- కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది? ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు. 


‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు. 


ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప ‘కడుపులో చల్ల కదలకుండా’ హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు. దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి ‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్‌’ అని వర్ణించారు. 


విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. 


తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ. వూరుగాని వూరు పోతే ముందస్తుగా ‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ.


వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది. ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. ‘ఇడ్డెనల్‌’ అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం. ‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్‌’ అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు ‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’ అనిపిస్తుంది. 


పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు. దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది పొట్టిక్కబుట్ట! ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! 


సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. 


‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మేరకు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు ‘పంచు’కుంటున్నారు. 


ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా...’ హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు ‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్‌’ అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని వారి ఆనందం!


(తెలుగు వెలుగు  మాసపత్రిక సౌజన్యముతో)

భక్తుల సంబంధ 46 పుస్తకాలు

 *భక్తుల సంబంధ 46  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------

చంద్రభాగా తరంగాలు-భక్త విజయం -1 www.freegurukul.org/g/Bhakthulu-1


నాయన్మారులు-63 శివ భక్తుల చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-2


భక్త కనకదాస్ www.freegurukul.org/g/Bhakthulu-3


కక్కయ్య జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-4


పెరియ పురాణం - 63 నాయనార్ల పరమ పావన గాధలు www.freegurukul.org/g/Bhakthulu-5


మహా భక్త విజయము www.freegurukul.org/g/Bhakthulu-6


భక్త మందారము-విష్ణు భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-7


బాల వీరులు www.freegurukul.org/g/Bhakthulu-8


కుచేలుడు www.freegurukul.org/g/Bhakthulu-9


ద్వాదశసూరి చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-10


మహా భక్త విజయము-46 భక్తుల కథలు www.freegurukul.org/g/Bhakthulu-11


నచికేతుడు www.freegurukul.org/g/Bhakthulu-12


చొక్కనాధ చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-13


వళ్ళలార్-జ్యోతి రామలింగస్వామి www.freegurukul.org/g/Bhakthulu-14


భక్తమందారం www.freegurukul.org/g/Bhakthulu-15


శివదీక్షాపరులు www.freegurukul.org/g/Bhakthulu-16


దాక్షిణాత్య భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-17


ఆళ్వారాచార్య సంగ్రహ జీవిత చరిత్రలు www.freegurukul.org/g/Bhakthulu-18


భక్త కబీర్ www.freegurukul.org/g/Bhakthulu-19


పురందరదాసు www.freegurukul.org/g/Bhakthulu-20


భక్త నరసింహ మెహతా జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-21


భక్త మల్లమ్మ www.freegurukul.org/g/Bhakthulu-22


భక్త తిన్నడు www.freegurukul.org/g/Bhakthulu-23


సిద్దయ్య జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-24


12 ఆళ్వార్ల  చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-25


భక్త రవిదాసు www.freegurukul.org/g/Bhakthulu-26


భక్త కనకదాసు www.freegurukul.org/g/Bhakthulu-27


చైతన్య చరితావళి-2 www.freegurukul.org/g/Bhakthulu-28


తేజోవలయాలు www.freegurukul.org/g/Bhakthulu-29


గుహుడు www.freegurukul.org/g/Bhakthulu-30


నమ్మాళ్వార్ www.freegurukul.org/g/Bhakthulu-31


నాగమహాశయుని జీవిత చరిత్ర www.freegurukul.org/g/Bhakthulu-32


ఆదర్శ భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-33


ఆచార్య సూక్తి ముక్తావళి www.freegurukul.org/g/Bhakthulu-34


పెరుమాళ్ తిరుమొళి www.freegurukul.org/g/Bhakthulu-35


భక్త ఉద్దవ www.freegurukul.org/g/Bhakthulu-36


తుకారామస్వామి చరిత్రము www.freegurukul.org/g/Bhakthulu-37


భక్త పంచ రత్నాలు www.freegurukul.org/g/Bhakthulu-38


భక్త బృందము-1 www.freegurukul.org/g/Bhakthulu-39


భక్త ద్రువుడు www.freegurukul.org/g/Bhakthulu-40


భక్త లీలామృతము అను భక్త విజయ గ్రంధము www.freegurukul.org/g/Bhakthulu-41


సంపూర్ణ భక్త విజయము -1 www.freegurukul.org/g/Bhakthulu-42


మహా భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-43


మహా భక్తులు www.freegurukul.org/g/Bhakthulu-44


భాగవత పంచ రత్నములు www.freegurukul.org/g/Bhakthulu-45


భక్త నందనార్ www.freegurukul.org/g/Bhakthulu-46


🙏💐🌻🌷🪷🌸🌹🌼🌺🌞🌝🎍

పంచాంగం



కాలం అన్నింటికంటే విలువైనది గొప్పది. అందుకే మనకి ఏదైనా బాధ ఎదుటి వ్యక్తి ప్రవర్తన వల్ల కానీ మాట వల్ల కానీ కలిగితే మనం చెప్పే సమాధానం కంటే కాలం చెప్పేది కరెక్ట్ గా ఉంటుంది. ఓపిక పట్టి చూడాలి ఓపిక చాలా గొప్ప భూషణం.


🌹 నేటిమంచిమాట 🌹


మన జీవితమే చిన్నది బ్రతికినంతకాలం ఏం బ్రతుకురా వీడిది అని కాకుండా అబ్బా ఏం బ్రతికాడురా వీడు అనిపించుకునేట్లు బ్రతికితే వారి హృదయం లో స్థానం సంపాదించుకున్నట్లే. పంతాలకు పట్టింపులకు పోయి ఏమీ సాధించలేము .


🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌷పంచాంగం🌷

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 23 - 07 - 2024,

వారం ...  భౌమ వాసరే ( మంగళవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు,

ఆషాఢ మాసం -  బహళ పక్షం,


తిథి      :  విదియ మ12.51 వరకు,

నక్షత్రం  :  ధనిష్ఠ రా11.46 వరకు,

యోగం :  ఆయుష్మాన్ సా6.27 వరకు,

కరణం  :  గరజి మ12.51 వరకు,

         తదుపరి వణిజ రా11.47 వరకు,


వర్జ్యం                :  ఉ.శే.వ6.17 వరకు,

దుర్ముహూర్తము :  ఉ8.13 - 9.05,

                              మరల రా10.59 - 11.43,

అమృతకాలం     :  మ1.53 - 3.25,

రాహుకాలం        :  మ3.00 - 4.30,

యమగండం       :  ఉ9.00 - 10.30,

సూర్యరాశి          :  కర్కాటకం,

చంద్రరాశి            :  మకరం,

సూర్యోదయం     :  5.39,

సూర్యాస్తమయం:  6.33,


              *_నేటి మాట_*


*ప్రారబ్దం అంటే ఏమిటి - దీనిని వదిలించు కునే మార్గం ఎలా???*

ఎక్కడ సంబంధాలు అక్కడ వరకే...

అక్కడ నువ్వు దుఃఖిస్తూ దైన్యంతో వదలలేక 

వదిలి పెడుతూ దేహాన్ని వదిలి వేస్తె అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావే అని 

దుఃఖిస్తూ కొందరు ఉంటే..

క్రొత్తగా నువ్వు వస్తున్నావు 

అని మరికొందరు సంబరాలు చేసుకుంటూ ఉంటారు .. రాక పోకల మధ్య నువ్వు 

మంచో  చెడో ఏవో కర్మలు చేస్తూనే ఉంటావు . 


కర్మలు చేస్తూ చేస్తూ దానికి ఓ బ్యాగ్ తయారు చేసి దానిలో బేలెన్స్ చేస్తావు ఆబ్యాగ్ *సంచిత కర్మలు* ,,


అవి పెరిగి పెద్దవి అయి మేరు పర్వతాన్ని మించి 

కరడు గట్టిన ఓ కొండ గుట్టగా తయారు అవుతాయి . ‘’అవే *ప్రారబ్దం* . ఆ ప్రారబ్దం అనే బరువును నెత్తిన పెట్టుకుని ఇపుడు ఈ జన్మ తీసుకుంటావు . 

ఈ ప్రారబ్దం క్లియర్ అయ్యే వరకు నీకు జన్మలు తప్పవు .🙇🏻‍♀️ (సుఖము దుఃఖము.. ఐశ్వర్యము ఆకలి రోదనలు ,,, 

ఇలా  రెండు ఇనుప బంగారు రెండు సంకెళ్ళే).


మరి ప్రారబ్దం కరిగించుకునే మార్గం :??


నీకు దేహ భావన ఉన్నంత వరకు ప్రతి కర్మ 

నిన్ను అంటుకునే ఉంటుంది . 

మరి ఇక ఈ దేహం వదిలివేస్తే..అది కరెక్ట్ కాదు. ‘

నీ ప్రారబ్దం నిన్ను వదలదు . 

మట్టి కుండలో మంచి నిరు దాహం తీరుస్తుంది . 

కాబట్టి కుండ పగలకుండా జాగ్రత్త చేసుకోవాలి .

లేనిచో దాహం తీరదు . 

ఈ దేహాన్ని ఆధ్యాత్మిక భోదకు యోగ సాధనకు 

జాగ్రత్త చేసుకోవాలి .


ఈ పరికరంతోనే ఏదైనా చేయగలవు . 

ఇది లేకుంటే ఏది చెయ్యలేవు . 

ఎపుడు ఎరుకతో ఉంటూ... “ *జ్ఞానాగ్ని దగ్ద కర్మాణి* “ ఎందుకంటే జ్ఞానం వలన క్రొత్త కర్మలు ఏర్పడవు . 

కానీ ప్రారబ్దం మాత్రం అనుభవించాలిసిందే ‘’ 🙇🏻‍♀️

ఇది ఎవరూ తప్పించ లేరు’ 

కాని’అన్యాదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ మమ’’  అంటూ వాని పాదాలు పట్టుకుంటే తలకు తగలవలసిన దెబ్బ తలపాగాకు తగిలి వెళ్ళిపోతుంది....


చేసే ప్రతి పని నిష్కామంగా చేస్తూ ఉంటావో 

ఇదేదీ నాది కాదు’’ అసలు నేను ఇది కాదు ‘’ 

అనే భావంతో సంసారంలో ఉంటావు కాని 

సంసారం నీలో ఉండ కూడదు .

నావ సంద్రంలో ఉండాలి కాని సంద్రం నావలో 

ఉండ కూడదు . 

నీటి కోడి నీటిలో ఉన్నా దాని రెక్కలకు తడి అంటనట్లు , .. ఇలా ఉండటం సాధ్యమా ? నీకు నువ్వు ప్రశ్నించు కో ! 


ఆ మార్గంలో ఆ స్దితిలో నువ్వు వెళుతున్నావు అంటే 

ఇక నీ కర్మలు క్లియర్ అవుతున్నట్లే . 

దీనికి నువ్వే న్యాయ నిర్నేతవు .. 

బయట వాళ్ళు ఎవరూ మార్కులు వేయరు.

నీ మనస్సాక్షి నీకు మార్కులు వేస్తుంది.


ఈ స్దితికి నువ్వు ఎదిగినపుడు ఇక 

ఆగామి లేదు సంచితం లేదు ప్రారబ్దం లేదు ..

నువ్వు కేవలం *సాక్షివి* మాత్రమే.! 


               *_🌷శుభమస్తు🌷_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

ఆభరణములు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


    శ్లో𝕝𝕝  *ప్రభుర్వివేకీ ధనవాంశ్చ దాతా*

          *విద్వాన్ విరాగీ ప్రమదా సుశీలా*।

          *తురఙ్గమః శస్త్రనిపాతధీరః"*

          *భూమణ్డలస్యాభరణాని పఞ్చ*॥ 


తా𝕝𝕝 *తెలివైన రాజు, దానగుణంకల ధనవంతుడు, పేరుప్రతిష్టలయందు కోరిక లేనట్టి విద్వాంసుడు, సత్ప్రవర్తనగల స్త్రీ, శత్రుసమూహమునందు ధైర్యంగా నిలిచే గుఱ్ఱం - ఈ అయిదుగురు భూమికి ఆభరణములు."* 


 ✍️🌷💐🌹🙏