3, ఆగస్టు 2024, శనివారం

మన మతం

 

మన మతం అనగానే అదేదో మతం  అని  అనుకుంటున్నారుఅందుకే మన మతం గూర్చి వివరిస్తున్నాను

మన మతానికి  క్రింది నియమాలు వున్నాయి

1)దైవ  అభేద త్వం: అంటే మనం అందరం శివ, కేశవ అబేధంగా వర్తించడం అని అర్థంఅనగా శివునిపై ఇష్టం ఉన్నవారు శివుని, అలాగే విష్ణువుపై ఇష్టం ఉన్నవారు విష్ణువును ఆరాధించవచ్చు, కానీ శివుని ఆరాధించే వారు విష్ణువును అలాగే విష్ణువును ఆరాధించేవారు శివుని యెడల అబేధంగా అంటే వేరుగా చూడకుండా ఉండటంనిజానికి భాగవతుడు నిరాకారుడు కాబట్టి నిరాకారమైన పరబ్రహ్మ తత్వాన్ని చేరుకోవటానికి ప్రాధమిక మార్గంగా సగుణోపాసన కాబట్టి రూపంలో కొలిచినా మన అంతిమ లక్ష్యం నిర్గుణ బ్రహ్మను చేరుకోవడమే

2)  ప్రాతఃకాలంలో నిద్రలేవటం: విధిగా ప్రతివారు సూర్యోదయానికి ముందే నిద్ర లేవ వలెను. కాలకృత్యాలను ముగించుకొని తిలక ధారణ చేసి ఇష్టదైవాన్ని అర్చించటం. నిత్యం ఇంట్లో దూప, దీప, నైవేద్యాదులు భగవంతునికి అర్పింపవలెను

3)  ఇంట్లో పిల్లలుకూడా వారి వాయి స్తాయిని పట్టి తప్పకుండ నిత్యం భగవదారాధనలో పాలు పంచుకునే విధంగా తర్ఫీదు ఇవ్వటం

4)  మానవ అభేదత్వం: సర్వ మానవులు పరమేశ్వరుని స్వరూపంగా భావించి అందరిని నిన్ను నీవు చూసుకునే విధంగా చూసుకోవటం

5)  స్త్రీ, పురుష అభేదత్వం : మీకు ఎదురుగా వున్నది స్త్రీ అయినా పురుషుడు అయినా ఇద్దరినీ సమ భావంతో చూడటం. ఇది సాధకులు అలవరచుకోవలసిన ఒక ముఖ్య లక్షణంఎప్పుడైతే నీవు న్త్రీ పురుష అభేదత్వన్ని ఆచరిస్తావో అప్పుడు అందరిలో భగవంతుని చూడగలవు

6)  నమస్కరించటం: కనపడిన ప్రతివారినీ రెండు చేతులు జోడించి నమస్కరించటం. ఇది కొంత ప్రయత్నంతో సాధించవచ్చు. చిన్నవారిని నమస్కరించటం ఏమిటి అని అనుకుంటారునిజానికి జగత్తులో చిన్నవారు, పెద్దవారు అని లేనే లేదు. భూమిమీద రావటంలో మనకు చిన్నా పెద్ద అనే తేడా కనిపిస్తుందికానీ నిజానికి ప్రతి మనిషిలోని పరమాత్మకు వయస్సుతో సంబంధం లేదుఅతడు చిరంజీవి అనంతుడు. సర్వజ్న్యుడు 

7)   వినయశీలత: ప్రతివారితోటి వినయంగా ప్రవర్తించవలెను. నాకు అన్నీ తెలుసు అనే భావనను పూర్తిగా విడనాడవలెను. ఎందుకంటె నీకు నీవు ఏది తెలుసు అని అనుకుంటున్నావో అంతకంటే ఎక్కువగా తెలిసినవారు అనేకులు నీ ప్రక్కన ఉండి వుంటారు జగత్తులో సర్వము తెలిసినవాడు కేవలం ఈశ్వరుడు ఒక్కడే నిజం మనకు సదా స్పృహలో ఉండాలి

8)  నిగర్వంగా ఉండటం: నేను ఐశ్వర్యపరుడను భూమి మీద దేనినయినా కొనగలను అనే ఆలోచన అస్సలు ఉండరాదునీవు ధనవంతుడవు అయితే నీ ధనంతో పలువురికి ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టు. జగత్తులోని ఐశ్వర్యం పూర్తిగా ఈశ్వరునిదే అయి వున్నదినేను నాది అని అనుకునేది కేవలం నేను కొద్దీ కాలం అనియూభావించటానికి మాత్రమే కానీ నేను దేనికి యజమానిని కాను అనే సత్యం తెలుసుకొని వర్తించాలి

9)  బంధాలు: మనము సామాన్యంగా వివాహం వలన, పుట్టుక వలన బంధాలను ఏర్పరచుకొని వాటి చుట్టూ గిరిగీసుకొని ప్రవర్తిస్తుంటాముకానీ నిజానికి తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పార్వతి పరమేశ్వరులు మాత్రమే జగత్ మాత జగత్ పిత అంటే అందరికి తల్లిదండ్రులు వారే కానీ వేరొకరు కాదు. ఎదుకంటే మనలో నిక్షిప్తంగా వున్న నేను అనబడే చెతన్యస్వరూపుడు వారి సంతానం మాత్రమే కాబట్టి జగత్తులో వున్న సర్వ జీవరాశి కూడా నాకు సోదర సోదరీమణులు అనే భావం కలిగి ఉండాలి

10.  నేను చూసే ఈ దృశ్యమాన జగత్తు పూర్తిగా ఆ ఈశ్వరునిచే నిర్మించి ఈశ్వరునిచే ఆవరించి వున్నది. 

11. నాది ఏది లేదు: నేను నాది అని అనుకునేది అది ఇల్లు వాకిలి కావచ్చు లేక పొలము పుట్రా కావచ్చు లేక నగలు నట్రా ఇంకా వస్తు వాహనాలు నేను కొనుక్కున్నాను నాకు సంక్రమించాయి అనేవి కేవలము మిధ్య నిజానికి నేను వాటిని కొంతకాలము అంటే నా శరీరం వున్నంతవరకు మాత్రమే అనుభవించే ఒక కిరాయిదారుడిని మాత్రమే అనే భావము కలిగి ఉండాలి. 

12. అకర్త భావన: నేను చేసే ఏ పనికూడా నేను కర్తను కాను కర్త కేవలము పరమేశ్వరుడు మాత్రమే ఆ ప్రభువు నా తో ఆయా పనులు చేయిస్తున్నాడు అనే భావన కలిగి ఉండాలి

ఆచరించవలసినవి

నియమాలు కొంత కఠినంగా ఉంటాయి కానీ అసాధ్యం మాత్రము కాదు

1. దేహవ్యామోహం: దేహవ్యామోహం తగ్గించుకోవాలి అందుకు ఏమి చేయాలి అంటే నేను దేహాన్ని కాదు దేహిని మాత్రం అనే భావం కలిగి శరీరాన్ని కేవలము మోక్ష సాధనకు పనికి వచ్చు ఉపకరణంగా మాత్రం భావించి శరీర వ్యాపారాలు చేయాలి. ఏవిధంగా అయితే ఒక పనిమంతుడు తన పనికి పనికి వచ్చు పరికరాలు చేసుకుంటాడో అలాగేశరీరాన్ని పరిశుభ్రంగా చూసుకోవాలి కానీ శరీరాన్ని అందంగా ఉండాలని అనుకోకూడదు, అంటే వివిధ లేపనాలు పూసుకోవటం, కేశాలను అలంకరించుకోవడం మొదలైనవి

2. వస్త్రధారణ: వస్త్రాలు కేవలం శరీరానికి ఆశ్చాదనగా మాత్రం స్వీకరించాలి. అందమైన అలంకరణలు, ఖరీదైన వస్త్రాలు, వస్తువులు పొంది ఉంటే మనస్సు వాటితో అనుబంధం ఏర్పరచుకొని మనస్సు భగవంతుని నుంచి దూరంగా వెడలుతుందినన్ను ఏది కట్టి పడవేయదు అని భావిస్తే ఏవి వున్నా అవి నిన్ను ఏమి చేయలేవు

3. నేను ఆచరించే నియమాలు నా మనస్సుకు నచ్చాయి కాబట్టి ఎవ్వరితో అంటే ఈ ప్రపంచంతో నిమిత్తం లేకుండా నన్ను నేను ఉద్దరించుకోవటానికి మాత్రమే అనే భావన కలిగి అకుంఠితంగా నిరంతరం నియమాలకు కట్టుబడి జీవనం చేయాలి.

మతాన్ని నిర్దేశించిన గురుదేవులు ఎవరు అంటే ఇంకా ఎవరు శ్రీ ఆది శంకర భగవతపాదులువారిని అనుసరిద్దామువారు  ఏర్పాటు చేసిన మార్గమే మనకు సర్వదా శిరోధార్యం.  

ఓం శాంతి శాంతి శాంతిహి 

ఇట్లు 

మీ

మీ భార్గవ శర్మ   

మతాన్నిమేము ఆచరించదలిచాము అని అనేవారు మీ సమ్మతిని కామెంటులో తెలుపండి. 

నాకు ఈ నియమాలు పూర్తిగా నచ్చాయి ఈ రోజునుంచి నేను మనస్ఫూర్తిగా ఆచరిస్తాను, నా తోటివారితో ఆచరింప చేస్తాను అని మీరు కామెంటులో పేర్కొనండి. ఒక్క విషయం మీ పేరు ఫోను నెంబరు వ్రాయటం మరువ వద్దు. 

 

ఆగష్టు,04, 2024*🌹 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

 🌹 *ఆగష్టు,04, 2024*🌹

     *ధృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢమాసం - కృష్ణపక్షం*


*తిథి : అమావాస్య* సా 04.42 ఉపరి *శ్రావణమాసం ప్రా𝕝𝕝*

వారం :*ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం : పుష్యమి* మ 01.26 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం : సిద్ధి* ఉ 10.38 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం : నాగ* సా 04.42 *కింస్తుఘ్న* రా 05.19 తె వరకు 


*సాధారణ శుభ సమయాలు:* 

            *-ఈరోజు లేవు-*

అమృత కాలం :*ఉ 06.39 - 08.21*

అభిజిత్ కాలం :*ప 11.48 - 12.39*


*వర్జ్యం : రా 03.16 - 04.59 తె*

*దుర్ముహుర్తం :సా 04.55 - 05.47*

*రాహు కాలం : సా 05.02 - 06.38*

గుళిక కాలం :*మ 03.26 - 05.02*

యమ గండం :*మ 12.13 - 01.50*

సూర్యరాశి : *కర్కాటకం* 

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.49* 

సూర్యాస్తమయం :*సా 06.38*

*ప్రయాణశూల :‌ పడమర దిక్కుకు* 

*ప్రయాణం పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.49 - 08.23*

సంగవ కాలం :*08.23 - 10.56*

మధ్యాహ్న కాలం :*10.56 - 01.30*

అపరాహ్న కాలం :*మ 01.30 - 04.04*

*ఆబ్ధికం తిధి : ఆషాఢ అమావాస్య*

సాయంకాలం :*సా 04.04 - 06.38*

ప్రదోష కాలం :*సా 06.38 - 08.52*

నిశీధి కాలం :*రా 11.51 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.04*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 🌞 *॥ శ్రీ సూర్య స్తోత్రం* ॥🌞


కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |

జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ ||


బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |

అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ ||


    🌞 *ఓం సూర్యాయ నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🌞🌞🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🌞🌞🌹🌷

 🌹🍃🌞🌹🌹🌞🍃🌹

అన్నదానం

 శక్త్యాऽన్నదానం సతతం 

తితిక్షా ధర్మ నిత్యతా।

యథాऽర్హం ప్రతిపూజా చ 

సర్వ భూతేషు వై సదా।।


తా: (ఈలోకంలో సకల ప్రాణులకు సదా శక్తి కొలది అన్నదానం చేయుటయును, సుఖదుఃఖాల వంటి ద్వంద్వాలను సహించుటయును, అనునిత్యం ధర్మాచరణయును, ఉభయుల యోగ్యతకు తగినట్లుగా తత్పరమైన పూజయును అనే నాలుగు ఆచరణీయములు).

శుభోదయం 🌹🌷🌹Goodmorning

లక్షీదేవి

 ఒకసారి లక్షీదేవి ఒక వ్యక్తి పై కోపగించుకొని “ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. కాకపోతే నీకో వరం ఇవ్వదలచుకొన్నాను. అడుగు!” అని అంటుంది.


అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు… “అమ్మా నీవు వెళ్లుతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఒకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన వేళ *మా ఇంటిలో ఇప్పుడు ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేటట్లు వరం ఇవ్వమ”ని అంటాడు.*


 ‘తథాస్తు!’ అని లక్ష్మీదేవి ఆ ఇంటినుండి వెళ్లిపోతుంది.

             

కొన్నిరోజుల తర్వాత ఇంటిలో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాళ్ళలో  వేయమని కోడళ్లకు చెప్పి గుడికి పోతుంది.


కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమై పోతుంది.


ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానం వచ్చి తనుకూడ ఆ కూరకు తగినంత ఉప్పు వేసి వేరేపనిలో పడిపోతుంది.


ఇంతలో అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు తమ పనిలోపడి ఉప్పు వేశారో లేదో అని తనూ కొంత వేస్తుంది.


మధ్యాహ్నం ఆవ్యక్తి  భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువయిందని గ్రహించి దరిద్ర దేవత ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడకుండా తిని లేస్తాడు.


కొంత సేపటికి ఆ వ్యక్తి పెద్దకొడుకు కూడ భోజన సమయంలో ఉప్పు ఎక్కువ అయిందని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.


’తిన్నారు!’  అని చెబుతుంది.l


దానితో   ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’   అని ఏమి మాట్లాడకుండ తనూ తిని లేస్తాడు.


ఇలా ఆ ఇంటి వాళ్లంతా భోజనం చేసి వంట గురించి మాట్లాడకుండ వుంటారు.


ఆరోజు సాయంత్రం *దరిద్ర దేవత ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి   ‘నేను ఇక్కడ ఉండలేను వెళ్లిపోతున్నాను. ఉప్పు కశాయం అయిన వంట తిని కూడ మీ మధ్య ఏ స్పర్ధలు రాలేదు. మీరు ప్రేమగా ఐక్యమత్యంగా ఉన్నారు. ఇటు వంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది.*


*దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకొంటుంది.*


*కనుక, ఏ ఇంటిలో  ‘ప్రేమ, అప్యాయతలు మరియు శాంతి’ కళకళలాడుతూ వుంటాయో ఆ ఇల్లు లక్ష్మీనివాసం’ అవుతుంది.*