9, అక్టోబర్ 2024, బుధవారం

హరికిం బట్టపుదేవి

 శు  భో  ద   యం  🙏


💥మ.

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం

దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా

మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా

సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.


(పోతనామాత్య "శ్రీమదాంధ్రమహాభాగవతము" 

👉భావము:

దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి;

రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి;

సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు;

వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి;

అరవిందాలు మందిరంగా గల జవరాలు;

అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న;

చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే

బంగారు తల్లి;

ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌸🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

దుర్గామాత

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹దసరా సమయంలో అమ్మ వారిని, ఆమె అంశా రూపాలను తలచుకోవడం, తెలుసుకోవడం ఓ దివ్యానుభూతిని ఇస్తుంది. నవ దుర్గల గురించి అనేక విధాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ దుర్గామాత అంశా రూపాలను గురించి చాలా తక్కువగా వినిపిస్తుంది. దేవీభాగవతం లోని ఆ అద్భుతమైన విషయాలు మనకు అందిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. భ్రామరీ దేవి ఎవరు? అరుణుడనే అసురుని తుమ్మెదలతో ఎలా అంతమొందించిందో ఈ ఎపిసోడ్ లో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రామాయణం పాత్ర

 భారత సంస్కృతి లో రామాయణం పాత్ర ఎంతో ఉంది.  రామాయణం అధ్యయనం చేసినవారి మనోనిశ్చలత అసాధారణమైనది. ఎందరో కవులు వివిధభాషలలో రామాయణాన్ని తమదైన భాణిలో రచించినప్పటికి వాటన్నిటిలో వాల్మీకి రామాయణానిదే పెద్దపీట. వాల్మీకి రామాయణం ఆమూలగ్రం పఠిస్తే కలిగే మానసిక ప్రశాంతతను ప్రత్యక్షంగ అనుభవిస్తే కానీ తెలియదు.  


మన దురదృష్టవశాత్తు రామాయణం పై మంచి అభిప్రాయంతో పాటు అపోహలు కూడ బలంగానే ప్రచారంలో ఉన్నాయి. అసలు రామాయణంలో ఉన్నదేమిటో తెలియకపోవటంతో చెప్పినవన్నీ లేక చదివినవన్నీ నమ్మే స్థితిలో ఈ తరంవారు తప్పుదారి పడుతున్నారు.


నిత్యం పరుగులతో నిండిపోయిన ఈ జీవితశైలిలో సుమారు 24 వేల శ్లోకాలను చదవటమంటే మాటలు కాదు.  పైగ అది సంస్కృతంలో ఉన్నవాయె.  రామాయణం పై సరైన అవగాహన లేకపోవటానికి ఇదికూడ ఓ కారణం కావొచ్చు. వీటన్నిటికి పరిష్కారంగ వాల్మీకి రామాయణం ఆధారంగ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పరచబడినది. 


రోజుకో సందేశమనే నిబద్ధతతో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ ల గొడవలు ఏమాత్రంలేకుండ కేవలం వాల్మీకి రామాయణం ఆధారంగ క్రమపద్దతిలో సందేశాలు పంపబడుతాయి.  సరళమైన తెలుగులో ఈ సందేశాలు ఉండటం ఓ ప్రత్యేకత. ఉదయమే సందేశాలు పంపబడుతాయి కాబట్థీ మీ వీలును బట్టి రోజులో ఏ సమయంలోనైన చదువుకోవచ్చు. అంతే కాక నిత్యరామాయణ పారాయణ చేసే మరెందరో పెద్దలు వారు అనుభవంతో చేసే వ్యాఖ్యలు కూడ చాలా ఉపయోగకరంగ ఉంటాయి.


ఆసక్తి ఉన్నవారు చేరటానికి లింకు  ఇవ్వబడింది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది.  పూర్తి స్థాయి సందేశాలు మొదలవటానికి మరో 2 లేక 3 రోజులు పట్టొచ్చు. మీ స్నేహితలను, కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించొచ్చు.


జై శ్రీరామ్.

బుధవారం*🪷 🌷 *09, అక్టోబర్, 2024*🌷 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🪷 *బుధవారం*🪷

🌷 *09, అక్టోబర్, 2024*🌷

      *దృగ్గణిత పంచాంగం*                  


          *ఈనాటి పర్వం*

          దేవీ శరన్నవరాత్రి     

        *(మూలా నక్షత్రం)*

    *శ్రీ మహా సరస్వతీదేవి*

           *అలంకారం* 🙏


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి : షష్ఠి* మ 12.14 వరకు ఉపరి *సప్తమి*

*వారం :బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం : మూల* పూర్తిగా రోజంతా రాత్రితో సహా


*యోగం  : సౌభాగ్య* ఉ 06.37 *శోభన* రా 05.53 తె వరకు 

*కరణం : తైతుల* మ 12.14 *గరజి* రా 12.28 ఉపరి *వణజి*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 06.00 - 08.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  :*రా 10.33 - 12.14*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు* 


*వర్జ్యం : మ 12.30-2.11 & రా 3.34-5.15 తె*

*దుర్ముహూర్తం : ప 11.31 - 12.18*

*రాహు కాలం : ప 11.54 - 01.23*

గుళికకాళం : *ఉ 10.25 - 11.54*

యమగండం : *ఉ 07.28 - 08.57*

సూర్యరాశి : *కన్య*

చంద్రరాశి : *ధనుస్సు*

సూర్యోదయం :*ఉ 05.59* 

సూర్యాస్తమయం :*సా 05.50*

*ప్రయాణశూల : *ఉత్తరం దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.59 - 08.21*

సంగవ కాలం   :      *08.21 - 10.43*

మధ్యాహ్న కాలం :*10.43 - 01.06*

అపరాహ్న కాలం:*మ 01.06 - 03.28*

*ఆబ్ధికం తిధి: ఆశ్వీయుజ శుద్ధ సప్తమి*

సాయంకాలం  :  *సా 03.28 - 05.50*

ప్రదోష కాలం   :  *సా 05.50 - 08.16*

రాత్రి కాలం : *రా 08.16 - 11.30*

నిశీధి కాలం      :*రా 11.30 - 12.19*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.10*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🪷 *శ్రీ సరస్వతీ స్తోత్రం* 🪷


*సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |*

*ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ ||*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷

🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🌹🪷🪷🌹🌷🌹

అద్భుతమైన మంత్రం*

 *🕉️🙏ఓం శ్రీ మా త్రే న మః!!!*


*🌹చాలా అద్భుతమైన మంత్రం*

*చాలా మహిమగల మంత్రం 🌹*


🌿ఒకసారి పాలసముద్రం శేషపాన్పుపై 

శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతుడై ఉండగా, అనుకోకుండా పార్వతీదేవి, సరస్వతీదేవి..లక్ష్మీదేవిని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. 


🌸అల్లంతదూరాన వారిని చూసిన లక్ష్మీదేవి, భర్త అనుమతితో ఆయన పాదాలను వొత్తడం ఆపి, శేషపానుపు దిగి వారిద్దరినీ సాదరంగా ఆహ్వానించింది.


🌿ముగ్గురు సమీపంలోని ఓ ఉద్యానవనానికి వెళ్లి, 

ఓ చంద్రకాంత శిల మీద ఆసీనులై ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోసాగారు.


🌸 వారలా మాట్లాడుకుంటుండగా, దూరంగా నారదుడు వస్తుండటం కనిపించింది. నారదుడు కూడా వీరిని చూశాడు. 


🌿ఇంకేం.. .కలహభోజనుడు తనకు కావలసినంత కాలక్షేపం దొరికింది అనుకున్నాడు. త్రిమూర్తుల భార్యలంతా ఒకేచోట కూర్చుని ఏదో విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. 


🌸కనుక ఏదో ఒక చిక్కు ప్రశ్న వేసి.. 

వారి మధ్య కలహాన్ని రేపి, తన నామానికి సార్థకతను చేకూర్చుకోవాలనుకున్నాడు. 


🌿అదేవిధంగా జగన్మాతలు కూడా నారదుడిని చూసి  'ఈ కలహ భోజనుడు ఊరకనే రాడు. ఇతనికి తగిన బుద్ధి చెప్పాలి'' అని నిర్ణయించుకుని బ్రహ్మమానసపుత్రుడిని సగౌరవంగా ఆహ్వానించారు. 


🌸ఈ సందర్భంగా నారదుడు ముగ్గురమ్మలను చూసి.. నమస్కరించాడు. ముగ్గురమ్మలు సైతం నారదుడిని ఆశీర్వదించి, విషయాలేంటని అడిగారు. 


🌿ఇక సమయం దొరికింది కదా అని నారదుడు కలహాన్ని మొదలెట్టాడు. 

త్రిమూర్తులైన వారికి..భార్యలైన మీరు ముగ్గురూ, సకల లోక వాసులచే స్తుతింపబడుతున్నారు. 


🌸అంతవరకు బాగానే ఉంది.. కానీ మీ ముగ్గురిలో ఎవరుగొప్ప? అనే సందేహమే చాలామందిని వేధిస్తోందని చెప్తాడు. 


🌿నారదుడు తన పనిని ప్రారంభించాడనుకున్న ముగ్గురమ్మలు.. నారదా నీ సందేహం ధర్మసమ్మతమే. నువ్వు భూలోకంలో మేము చెప్పిన చోటుకు వెళ్ళి.. 


🌸అక్కడున్న మా భక్తుల్ని పరీక్షించి మేము చెప్పిన మంత్రాన్ని వారికి ఉపదేశిస్తుండు. కొంతకాలం తర్వాత మా తర్వాత మాలో ఎవరు గొప్పో నీకే అర్థమవుతుందని చెప్పారు. 


🌿ముందు సరస్వతీ దేవి నారదునితో.. ! నారదా! భూలోకంలో మహాబలిపురానికి వెళ్ళి, అక్కడున్న 

ఓ గురుకులంలో సెల్వనాథుడనే విద్యార్థిని కలిసి, 


🌸సమయం సందర్భం చూసుకుని అతని చెవిలో   "ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని మూడుసార్లు ఉచ్ఛరించి అతనికి మంత్రోపదేశం చేయమంటుంది.


🌿 మంత్రోచ్ఛరణకు తర్వాత అక్కడ జరిగిన విషయాన్ని తమతో చెప్పగలవని సరస్వతీ దేవి అంటుంది. 


🌸ఇలా నారదుడు పండితుడి వేషంలో సెల్వనాథుడి బంధువుగా మహాబలిపురం వెళ్లి సెల్వనాథుడి గురువును కలిశాడు. 


🌿సెల్వనాథుడి బంధువని తెలుసుకున్న గురువు.. సెల్వ నాథుడికి అక్షరం ముక్క రాదు...వాడితో నా ప్రాణం విసిగిపోయింది. పశువులను మేపాల్సిందిగా పంపేశాను.. 

వెళ్ళి చూడమంటాడు. 


🌸నారదుడు విషయం తెలుసుకుని బాలుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బాలుడు చదువు రాదని.. తాను పడే కష్టాల్ని చెప్పి బోరుమన్నాడు. నారదుడు ఆ బాలుడిని ఓదార్చి మంత్రోపదేశం చేస్తానని.. 


🌿ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని చెప్తాడు. ఇలా సముద్రంలో స్నానం చేసి.. శుచియై వచ్చిన 

ఆ బాలుడికి ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని 

108 సార్లు జపం చేయమని చెప్తాడు. 


🌸ఇలా 108 సార్లు పఠించిన తర్వాత ఆ బాలుడు వేదాలను, శాస్త్రాలను సులభంగా అర్థం చేసుకోసాగాడు. అతనిలో వచ్చిన మార్పును చూశాక నారదుడు ముగ్గురమ్మలకు ఈ విషయం చెప్పాడు. 


🌿పార్వతీదేవి తన వంతు ప్రారంభించింది. నారదా.. కావేరి నది ఒడ్డున సమయపురం అనే ఊరుంది. అక్కడ పెరినాయకి అనే ఆవిడ ఇంట గురించి అడుగు. 


🌸అక్కడి పరిస్థితులను గమనించి సమయం సందర్భం కుదిరినప్పుడు నేను చెప్పే ''ఓం శ్రీ మాత్రే నమః'' మంత్రాన్ని ఆవిడకు ఉపదేశించమంటుంది. 


🌿ఇలా పెరినాయకి ఇంటికి వెళ్లిన నారదుడు.. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని నిరోధిస్తాడు. 


🌸సంతానం లేకపోవడంతో ఆమె భర్తకు వేరొక వివాహం చేసి పెట్టేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు గమనిస్తాడు. ఈమెకు కూడా పై మంత్రాన్ని నారదుడు ఉపదేశిస్తాడు. 


🌿ఈ మంత్ర ప్రభావంతో ఓ శుభ సమయానికి పెరియనాయకి సంతానవతి అయింది. ఈ విషయాన్ని వెంటనే నారదుడు ముగ్గురమ్మలకు చేరవేశాడు. 


🌸ఇక మూడో సారిగా లక్ష్మీదేవి నారదుడిని గోదావరి ఒడ్డునున్న తాటాకుల ఇంట్లోని రాజశేఖరుడనే 

పేద పండితుడిని కలవమంటుంది. 


🌿''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించమంటుంది.

అలాగే నారదుడు కూడా గోదావరికి వెళ్లి.. దానం చేసే ఉత్తముడైన రాజశేఖరుడిని కలుస్తాడు.


🌸 రాజశేఖరుడు తనవద్ద ఉన్న బియ్యాన్ని మారు వేషంలో వచ్చిన నారదునికి ఇవ్వపోగా, రాజశేఖరుని వద్దనున్న బియ్యం కుండ నిండుకుంది. 


🌿దీంతో ఆశ్చర్యపోయిన రాజశేఖరుడు ఇంతకుముందు ఇలాంటి కార్యాలు జరగలేదంటాడు. ఇలా రాజశేఖరుడికి కూడా నారదుడు ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రాన్ని ఉపదేశించి 108సార్లు జపించమని చెప్తాడు.


🌸ఆ తర్వాత ఆ పేద పండితుడు  శ్రీమంతుడిగా మారిపోతాడు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసిన నారదుడు అజ్ఞానానికి సిగ్గుపడుతూ ముగ్గురమ్మలను దర్శింటుకుంటాడు.


🌿అమ్మలారా! మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రశ్న అడిగాను. ఇప్పటికైనా..ఇప్పటికైనా ఈ మంత్రం ఎలాపుట్టింది అని అడుగుతాడు. 


🌸అప్పుడు నారదునితో లక్ష్మీదేవి ఇలా అంది. బ్రహ్మదేవ పుత్రా.. మా ముగ్గురు శక్తిలో ఎటువంటి తేడాలుండవు. జగదాంబ ఆజ్ఞానుసారం..


🌿నా వలన ఐశ్వర్యం, సంపదలు, పార్వతీదేవి వలన ఐదవతనం, సౌభాగ్యం, సరస్వతీదేవి వలన విద్యలు, కళలు ప్రాప్తిస్తుంటాయి. 


🌸శ్రీ లక్ష్మిలోని శ్రీ సరస్వతీ లోని శ్రీ శక్తి లోని బీజాక్షరాలు జతచేసి   ''ఓం శ్రీ మాత్రే నమః'' అనే మంత్రసృష్టి.

ఈ మంత్రాన్ని జపించిన వారికి మా కటాక్షం కలుగుతుంది.


🌸అందువల్ల ఈ మంత్రాన్ని అర్హులైన మా భక్తులకు, భక్తురాలకు ఉపదేశం చేయగలవు అని చెప్పింది...స్వస్తి...🚩🙏🌹

  

  *🙏ఆ మంత్రమే 'ఓం శ్రీ మాత్రే నమః' అనే మంత్రం🙏*

Deepam Vundagaane దీపం వుండగానె


 

*శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*సులభుల్మూర్ఖులు నుత్తమోత్తములు రాజుల్గల్గి యేవేళ న*

*న్నలఁతం బెట్టిన నీపదాబ్జములఁ బాయం జాల, నేమిచ్సినం*

*గలధౌతాచల మేలు టంబునిధిలోఁ గావుండు టబ్జంబు పైఁ*

*జెలు వొప్ప న్సుఖియింపఁ గాంచుట సుమీ, శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 56*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! రాజులు భిన్నమనస్కులు. కొందఱు మంచివారు, కొందఱు మూర్ఖులు, మరి కొందఱు ఉత్తమోత్తములు... వారు నాకు ఏ విధమైన ప్రలోభములకు లోను చేసినా నేను నీ పాదారవిందములను విడువబోను.... నీవు నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే ప్రభో....*


✍️🌷🌺🌹🙏

మహనీయుల మాట🙏

 🙏.సర్వేజనాః సుఖినోభవంతు.🙏


     : 🕉 శుభోదయం 🕉


   🙏మహనీయుల మాట🙏

................................


ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు   ఓటమిని   నీకు పరిచయం  చేస్తే  

మౌనంగా ఉండి చూడు  నీ విజయానికి దార్లు కనిపిస్తాయి  .....


ఆవేశంలో ఆలోచన తగ్గుతుంది.

నిశ్శబ్దంలో ఎన్నో మంచి ఆలోచనలు  వికసిస్తాయి  ........


🙏నేటి మంచి మాట🙏

.....................................

 చేసినతప్పు వొప్పుకోవాలంటే- సంస్కారం కావాలి. 

చేయనితప్పు మీద వేసుకోవాలంటే-గొప్ప మనసు కావాలి.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌺పంచాంగం🌺

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ    ... 09 - 10 - 2024,

వారం ...  సౌమ్యవాసరే ( బుధవారం )

శ్రీ క్రోధి నామ సంవత్సరం,

దక్షిణాయణం - శరదృతువు,

ఆశ్వయుజ మాసం -  శుక్ల పక్షం,


తిథి      :  షష్ఠి ఉ7.24 వరకు,

నక్షత్రం  :  మూల రా1.29 వరకు,

యోగం :  శోభన తె3.23 వరకు,

కరణం  :  తైతుల ఉ7.24 వరకు,

                తదుపరి గరజి రా7.21 వరకు,


వర్జ్యం                  :  ఉ9.02 - 10.41,

                                మరల రా11.50 - 1.29,

దుర్ముహూర్తము  :  ఉ11.24 - 12.11,

అమృతకాలం     :  సా6.54 - 8.33,

రాహుకాలం        :  మ12.00 - 1.30,

యమగండం       :  ఉ7.30 - 9.00,

సూర్యరాశి          :  కన్య,

చంద్రరాశి            :  ధనుస్సు,

సూర్యోదయం     :  5.55,

సూర్యాస్తమయం:  5.41,


               *_నేటి విశేషం_*


             *సరస్వతీ పూజ* 

        *దేవీ త్రిరాత్ర వ్రతము*


_ఇంద్రకీలాద్రిపై  సరస్వతీదేవి అలంకరణ మరియు శ్రీశైలములో శ్రీకాళరాత్రిదేవి అలంకరణ_


_*సరస్వతీ దేవి చరిత్ర*_


చదువుల తల్లి

దేవనాగరి:  సరస్వతీ

తెలుగు:    సరస్వతీ దేవి

వాహనం:   హంస , నెమలి


హిందూ మతం లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు , పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి , సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి.


నవరాత్రి , వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం ఋగ్వేదంలోనూ , దేవీ భాగవతంలోనూ , బ్రహ్మ

వైవర్త పురాణంలోనూ (2.6.13-95) , పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి.


సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని , సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.


వాక్ , బుద్ధి , వివేకం , విద్య , కళలు , విజ్ఞానం –

వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని

పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా , వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి

వర్ణనలలోతెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. *“శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల*

*కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు”* నది గా  బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.


సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”.

పరాశక్తి , జ్ఞాన ప్రదాతసరస్వతి – రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం – 9 వ శతాబ్దానికి చెందినది. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో

అధ్యాయం వివరిస్తోంది. మహామాయ , భాషా జ్యోతిర్మయి , కళారస హృదయగా సరస్వతీ

పూజలందుకొంటోంది.


*జ్ఞాన ప్రదాతగా సరస్వతి – కొన్ని గాధలు*


పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ

పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.

అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన  జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.


వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని

పొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర  తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని  పొంది  సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే  ఆయన వేద విభాగాన్ని , పురాణ రచనను చేశాడు. ఓసారి

ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని

అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి  ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర  క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల

పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.


పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి  భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.


అయితే

యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు.  యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు , జ్ఞాపక శక్తి  కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి  జ్ఞాన , జ్ఞాపక శక్తులను ప్రసాదించమని , విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి , ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.


సత్సభలలో మంచి విచారణ శక్తిని , సత్య స్వరూపిణి , వ్యాఖ్యాన రూపిణి , వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన  సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత  యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా , సుకవిగా వెలుగొందమని  ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా  దేవీ భాగవతంలో ఉంది.


శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు.

అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది.                                             



*శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామావళి*


ఓం శ్రీ సరస్వత్యై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం వరప్రదాయై నమః

ఓం శ్రీప్రదాయై నమః

ఓం పద్మనిలయాయై నమః

ఓం పద్మాక్ష్యై నమః

ఓం పద్మవక్త్రికాయై నమః

ఓం శివానుజాయై నమః

ఓం పుస్తకహస్తాయై నమః (10)


ఓం జ్ఞానముద్రాయై నమః

ఓం రమాయై నమః

ఓం కామరూపాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం మహాపాతక నాశిన్యై నమః

ఓం మహాశ్రయాయై నమః

ఓం మాలిన్యై నమః

ఓం మహాభోగాయై నమః

ఓం మహాభుజాయై నమః

ఓం మహాభాగాయై నమః (20)


ఓం మహోత్సాహాయై నమః

ఓం దివ్యాంగాయై నమః

ఓం సురవందితాయై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం మహాపాశాయై నమః

ఓం మహాకారాయై నమః

ఓం మహాంకుశాయై నమః

ఓం సీతాయై నమః

ఓం విమలాయై నమః

ఓం విశ్వాయై నమః (30)


ఓం విద్యున్మాలాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం చంద్రికాయై నమః

ఓం చంద్రలేఖావిభూషితాయై నమః

ఓం మహాఫలాయై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సురసాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం దివ్యాలంకార భూషితాయై నమః

ఓం వాగ్దేవ్యై నమః (40)


ఓం వసుధాయై నమః

ఓం తీవ్రాయై నమః

ఓం మహాభద్రాయై నమః

ఓం మహాబలాయై నమః

ఓం భోగదాయై నమః

ఓం భారత్యై నమః

ఓం భామాయై నమః

ఓం గోమత్యై నమః

ఓం జటిలాయై నమః

ఓం వింధ్యావాసాయై నమః (50)


ఓం చండికాయై నమః

ఓం సుభద్రాయై నమః

ఓం సురపూజితాయై నమః

ఓం వినిద్రాయై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః

ఓం సౌదామిన్యై నమః

ఓం సుధామూర్తయే నమః

ఓం సువీణాయై నమః (60)


ఓం సువాసిన్యై నమః

ఓం విద్యారూపాయై నమః

ఓం బ్రహ్మజాయాయై నమః

ఓం విశాలాయై నమః

ఓం పద్మలోచనాయై నమః

ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః

ఓం ధూమ్రలోచన మర్దిన్యై నమః

ఓం సర్వాత్మికాయై నమః

ఓం త్రయీమూర్త్యై నమః

ఓం శుభదాయై నమః (70)


ఓం శాస్త్రరూపిణ్యై నమః

ఓం సర్వదేవస్తుతాయై నమః

ఓం సౌమ్యాయై నమః

ఓం సురాసుర నమస్కృతాయై నమః

ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః

ఓం చాముండాయై నమః

ఓం ముండకాంబికాయై నమః

ఓం కాళరాత్ర్యై నమః

ఓం ప్రహరణాయై నమః

ఓం కళాధారాయై నమః (80)


ఓం నిరంజనాయై నమః

ఓం వరారోహాయై నమః

ఓం వాగ్దేవ్యై నమః

ఓం వారాహ్యై నమః

ఓం వారిజాసనాయై నమః

ఓం చిత్రాంబరాయై నమః

ఓం చిత్రగంధాయై నమః

ఓం చిత్రమాల్య విభూషితాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామప్రదాయై నమః (90)


ఓం వంద్యాయై నమః

ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః

ఓం శ్వేతాననాయై నమః

ఓం రక్త మధ్యాయై నమః

ఓం ద్విభుజాయై నమః

ఓం సురపూజితాయై నమః

ఓం నిరంజనాయై నమః

ఓం నీలజంఘాయై నమః

ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః

ఓం చతురానన సామ్రాజ్జ్యై నమః (100)


ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః

ఓం హంసాసనాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం మంత్రవిద్యాయై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం మహాసరస్వత్యై నమః

ఓం విద్యాయై నమః

ఓం జ్ఞానైకతత్పరాయై నమః (108)


*ఇతి శ్రీసరస్వత్యష్టోత్తరశతనామావళిః సమాప్తం*


*శ్రీశైలంలో కాళరాత్రీ దుర్గా అలంకరణ*


కాళీ , మహాకాళీ , భధ్రకాళీ , భైరవి , మృత్యు , రుద్రాణి , చాముండా , చండీ , దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు.


కాళరాత్రి " శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము , మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.


కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను *"శుభంకరి"* అనియు అంటారు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని , ఆందోళనను గాని పొందనవసరమే లేదు.


కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు , దైత్యులు , రాక్షసులు , భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని , జలము , జంతువులు మొదలగువాటి భయముగాని , శత్రువుల భయముగాని , రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.


              *_🌺శుభమస్తు🌺_*

 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

భా ర్య

 ఓ చిన్నపాటి రచయితను ఆతని భార్య అడిగిందిలా


ఏమండీ ! మీరెపుడూ అమ్మ గురించే రాస్తారు, భార్యను గురించి రాయరా ? 


అతని కలం పరుగులు తీసింది  ఇలా ......


             భా ర్య 

          -------

(రెండక్షరాల ప్రేమ మరియు జీవితం)


ఎవరో నీవు

చందమామంత అందం లేదు

కలువ భామంత  సుకుమారం లేదు


సరస్వతీ దేవంత చదువు లేదు

కనక మాలక్ష్మంత ధనం లేదు

పార్వతీ దేవంత శౌర్యం లేదు


కానీ ....... 


కన్నుల నిండా వెన్నెల

మనసు నిండా కరుణ


మాటల్లో తేనెలా కమ్మదనం

ఆకలైతే కడుపు నింపే అమ్మదనం


ప్రేమలో నాలో ఐక్యమయ్యే కనకాంబరం


ఆకాశమంత నీకు

నా బతుకంతా నీవైన నీకు

రెండు అక్షరాల 'భార్య' పదం  చాలునా ? 


గృహస్తాశ్రమ ధర్మాలు నీతోనే

వానప్రస్తాశ్రమ ధర్మం నీతోనే

ధర్మేన అర్థేన కామేన నాతిచరామి నీతోనే


మా అమ్మ నాతో చెప్పిన మాట

ఆ చేయి పట్టుకోరా


మీ అమ్మ నీతో చెప్పిన మాట

ఆ చేయి విడువకమ్మా


అలా నా దీపమైనావు

నా ఇంటి మణిదీపమైనావు

నా జీవితపు మణి ద్వీపమైనావు


పాలేవో నీరేవో తెలియనంతగ కలిసాం


వెన్నెలైనా చీకటైనా కలిసి ఒక్కటై సాగాం


నాలో నీవు ... నీలో నేను

అమరమైన ఈ అధ్వైతంలో

వేలకొద్దీ తీయని గురుతులే

ఎగిరే సీతాకోక చిలుకల్లా 

కమ్మని కవితలా .. 

మధుర గీతంలా ..

మధు మాసంలా ..


అర క్షణంలో 

ఆవిరై పోయే కోపతాపాలు

మరుక్షణంలో కలిసిపోయే అనుబంధాలు


అదేఅదే నీవు నేర్పిన  

భార్యాభర్తల బంధాలు


గొప్ప బహుమతులు వద్దంటివి

ప్రేమతో ఇచ్చే చిన్ని జ్ఞాపకాలు చాలంటివి


భూతల్లి పిలిచేవరకు

కష్టమైనా

సుఖమైనా 


నీతోనే

నీతోనే


కన్నుల్లో నిలిచావు కంటిపాపలా


గుండెల్లో ఉన్నావు గుండె సవ్వడిలా


"మన జీవన లీల ఆనంద హేల"


ఋణం ఉండి కలిసామో

ఋణం తీర్చుకోవడానికి కలిసామో

తె లి య దు కానీ 


నీవో అధ్బుతానివి 

నేనో  నిమిత్ర మాత్రుడను


ప్రతి ఇంటిలో

ప్రతి భర్తలో

ఆకాశమంత  'ప్రేమైన'  నీకు

రెండక్షరాల 'భార్య' అను పదం చాలునా


ఓ దేవతలారా !

ఓ కవి శ్రేష్టులారా !


ఈమెకో  పేరు సూచించండి

అమ్మలా ....  తీయగా

అమృతంలా .... గొప్పగా


................🙏...................

                   💞

            M N Chary

8, అక్టోబర్ 2024, మంగళవారం

Panchang