23, ఫిబ్రవరి 2026, సోమవారం

కుప్పింటాకు మొక్క యొక్క ఉపయోగాలు..!*

 222f8;

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀M.A.181.

*మన ఆరోగ్యం…!


*కుప్పింటాకు మొక్క యొక్క ఉపయోగాలు..!*

➖➖➖✍️

```

ఎన్నో రకాల మొక్కలను మన చుట్టూ పరిసరాలలో చూస్తూనే ఉంటాము. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి. మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు రకమైనవి ఉంటాయి. అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి. ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది మనకు. ఇది ఎటువంటి నేల‌లోనైనా సుల‌వుగా పెరుగుతుంది. రోడ్ల‌కు ఇరువైపులా, ఖాళీ ప్ర‌దేశాల్లో, పొలాల ద‌గ్గ‌ర‌, చేల దగ్గ‌ర ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క పెరుగుతుంది. ```


*ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..*```


1.కుప్పింటాకు మొక్క పంటి నొప్పిని తగ్గిస్తుంది. అందుకే దీనిని పిప్పెంటి ఆకు అని అంటారు. పంటి నొప్పిలన్నిటికీ ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.


2.ఈ మొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్ల పడతాయి. అంతేకాకుండా చిగుళ్ల నుంచి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది.


3.ఈ ఆకు రసం రెండు చుక్కలు ముక్కులో వేస్తే ఎటువంటి మొండి తలనొప్పి అయిన తగ్గుతుందట.


4.కుప్పింటాకు ఆకులను మిరియాలతో కలిపి నూరి తేలు కాటుకు, పాము కాటుకి కట్టు కడితే విషాలను విరిచేస్తుందట.


5.కళ్ళు ఉప్పు, పిప్పింటాకు కలిపి నూరి దురద ఉన్న చోట రాస్తే వెంటనే తగ్గుతుందట.


6.రెండు స్పూన్లు పిప్పింటాకు రసాన్ని నిద్ర పోయే ముందు తాగితే మలబద్దకం, నులి పురుగులు అన్ని కొట్టుకు పోతాయి. విరోచనం సాఫిగా అవడమే కాక శరీరం శుభ్రం అవడానికి సహాయపడుతుంది.

కళ్ళు ఎర్రబడటం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద ముందుగా పిప్పింటాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్‌లో కొన్ని పిప్పింటాకులు వేసి మరిగించి రాత్రంతా ఉంచాలి. తర్వాతి రోజు ఉదయాన్నే వడకట్టి తాగితే పన్ను నొప్పి తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ బాగా పని చేస్తుందట. 


7.కామెర్లకు కుడా ఈ కుప్పింటాకును ఉపయోగిస్తారు.

కురుపులు, మొటిమెలు, అవాంఛిత రోమాలు పోవడానికి కుప్పింట ఆకు, కళ్లు ఉప్పు, పసుపు, నూరి రాస్తే త్వరగా నయం అవుతాయి.✍️

*🅰️🅿️SRINU*```

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

శ్రీ కిరణం*

 *శ్రీ కిరణం*


*నేర్చుకుంటే సరిపోదు నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి, చేయగలను అంటే సరిపోదు చేసి చూపించాలి.* 


*క్రాంతి కిరణాలు* 


*కం. అనుదినము నేర్చుకున్నది*

*ఘనమగు విషయంబు లెల్ల కనుమరుగయ్యెన్* 

*మనసున దాచిన చాలదు*

*ననువైనను చూపవలయు నాచరణములో*


*పద్య కవితా శిల్పకళానిధి. ‌‌ మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

కన్నీళ్లు… అవి అవుట్‌సోర్స్ చేయలేము.

  పుణేలోని ఒక పెద్ద శ్మశానవాటికలో మధ్యాహ్నం 3:00 అయ్యింది.


అమెరికాలోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న రోహన్ (35), ఫ్లైట్‌ దిగిన వెంటనే నేరుగా శ్మశానానికి వచ్చాడు.


అతని తండ్రి సదాశివరావు (75) గత రాత్రి మరణించారు.


రోహన్ చేతిలో ఖరీదైన ల్యాప్‌టాప్ బ్యాగ్, కళ్లపై రే-బాన్ గ్లాసులు. 

చెమటలు కారుస్తూ, తరచూ గడియారం చూస్తూ నిలబడ్డాడు.


అక్కడ “మోక్ష ఈవెంట్ మేనేజ్‌మెంట్” అనే అంత్యక్రియల సేవల సంస్థకు చెందిన సుమిత్ ఉన్నాడు.

అన్నీ సిద్ధం చేశాడు. మంటకట్టెలు పేర్చబడ్డాయి, పూజారి వచ్చాడు, 

🙏సదాశివరావు గారి శరీరాన్ని స్నానం చేయించి సిద్ధం చేశారు.


రోహన్ వచ్చి తన తండ్రి ముఖాన్ని ఒకసారి చూశాడు. రెండు కన్నీళ్లు జారాయి.


అప్పుడు సుమిత్‌ను అడిగాడు:


“మిస్టర్ సుమిత్, అన్నీ రెడీనా?

నాకు సాయంత్రం 6 గంటలకు రిటర్న్ ఫ్లైట్ ఉంది.

రేపు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది.

దయచేసి త్వరగా ముగించండి.”


🙄 సుమిత్ షాక్ అయ్యాడు.

ఈ కొడుకును పెంచిన తండ్రికి మూడు గంటల సమయం కూడా దక్కదా? 🤷‍♂️


అతను మౌనంగా తల ఊపాడు.


క్రియలు జరిగాయి.

🔥 రోహన్ చితికి నిప్పు పెట్టాడు. 😢


పొగ ఆకాశంలోకి ఎగిసింది.


రోహన్ సుమిత్‌ను పక్కకు తీసుకెళ్లి చెక్‌బుక్ తీసాడు.


“సుమిత్, థ్యాంక్స్. మంచి ఏర్పాట్లు చేశావు.

ఎంత బిల్? 50,000నా? 1,00,000నా?

ఎంత చెప్పు, ఇప్పుడే చెక్ రాస్తాను.


నేను మళ్లీ రావడం కుదరదు.

బూడిద నిమజ్జనం కూడా మీరు చూసుకోండి.”


😥 సుమిత్ విచిత్రంగా నవ్వాడు.


“సర్, మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బిల్ ఇప్పటికే చెల్లించబడింది.”


రోహన్ ఆశ్చర్యపోయాడు.

“ఎవరూ చెల్లించారు? నా మామయ్యా?”


సుమిత్ చెప్పాడు:


“లేదు సర్.

ఐదు సంవత్సరాల క్రితం మీ తండ్రి సదాశివరావు గారు మా ఆఫీసుకు వచ్చారు.

అప్పుడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నారు.

నడవడమే కష్టంగా ఉంది.


అయన అడిగారు:

‘మీ ప్యాకేజ్ ఏమిటి?

నా కొడుకు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్నీ మీరు చూసుకుంటారా?’


మేము వివరాలు చెప్పాము.


అదే రోజు ఆయన ముందస్తుగా 50,000 రూపాయలు చెల్లించారు.


మరియు ఈ లేఖ ఇచ్చారు.

‘నా కొడుకు వచ్చినప్పుడు ఇది అతనికి ఇవ్వండి.

అతను రాకపోతే నా అంత్యక్రియలు మీరు చేయండి’ అన్నారు.”


సుమిత్ ఆ లేఖను రోహన్‌కు ఇచ్చాడు.


కంపిస్తున్న చేతులతో రోహన్ దాన్ని తెరిచాడు. 🫥


తండ్రి వణుకుతున్న చేతిరాతలో ఇలా ఉంది:



“ప్రియమైన రోహన్,


రోహి చిన్ను , నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు.

అమెరికాలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఉండదు.


నా మరణ వార్త విన్నప్పుడు నీకు టెన్షన్ వస్తుందని తెలుసు.


‘లీవ్ దొరుకుతుందా?

టికెట్ దొరుకుతుందా?

మీటింగ్ ఏం అవుతుంది?’

🤌ఇవే ప్రశ్నలు నిన్ను వేధిస్తాయి.


చిన్ను , నీ సమయం, నీ కెరీర్ చాలా ముఖ్యం.


నిన్ను ప్రపంచాన్ని జయించడానికి పెంచాను.


ఒక ముసలివాడి మృతదేహం కోసం కష్టాలు, నష్టాలు పడొద్దు.


అందుకే నా మరణానికి కావాల్సిన ఏర్పాట్లు ముందే చేసుకున్నాను.


ఏజెన్సీకి డబ్బు చెల్లించాను. వాళ్లు చూసుకుంటారు.


నువ్వు వస్తే మంచిది. రాకపోయినా నేను కోపపడను.


ఒకే ఒక్క అభ్యర్థన…


🤝 చిన్నప్పుడు నిన్ను స్కూల్‌కు తీసుకెళ్తూ నేను నీ చేతిని ఎప్పుడూ వదల్లేదు.


ఈ రోజు నువ్వు నా చితికి నిప్పు పెట్టేటప్పుడు

నీ చెయ్యి వణకకూడదు. 🫰


త్వరగా వెళ్ళు. నీ భార్య ఎదురు చూస్తోంది.


నీ

నాన్న.”



లేఖ చదివిన వెంటనే రోహన్ చేతిలోని చెక్‌బుక్ క్రింద మట్టిలో పడిపోయింది.


చితి మంటలు వెలుగుతున్న, మోగుతున్న ఆ శ్మశానంలో…

రోహన్ కెరీర్‌పై ఉన్న గర్వం, అహంకారం బూడిదైపోయాయి.


అతను మోకాళ్లపై పడిపోయాడు.


“నాన్నా… నన్ను క్షమించు నాన్నా!”


రోహన్ సుమిత్ కాళ్లను పట్టుకున్నాడు.


“సుమిత్, నాకు అమెరికాకు వెళ్లాలి అనిపించడం లేదు!

నాకు నా నాన్నతో ఉండాలి!😢

నేను కోట్ల సంపాదించాను కానీ ఇప్పుడు భిక్షగాడిగా అయ్యాను!


నా తండ్రి తన మరణ సమయానికీ నా మీటింగ్ గురించి ఆలోచించాడు…

నేను మాత్రం ఆయన అంత్యక్రియల ధరపై బేరసారాలు చేశాను ?”

🙄😢

ఆ రోజు రోహన్ ఫ్లైట్ ఎక్కలేదు.


రాత్రంతా చితి ముందు కూర్చున్నాడు.


ఎందుకంటే చివరకు అతనికి అర్థమైంది—


🤢 “ప్రీపెయిడ్” సిమ్ కార్డుకి ఉండొచ్చు…

🙏 కానీ తండ్రి ప్రేమ ఎప్పుడూ ప్రీపెయిడ్ కాదు.


💅తండ్రి ప్రేమ అనంతం —

దానికి ప్రపంచంలో ఎలాంటి కరెన్సీతో చెల్లించలేం.



ప్రపంచంలో ఎంత పెద్దవాళ్లైనా…

ఎంత డబ్బు సంపాదించినా…


మీ డైపర్లు మార్చిన తల్లిదండ్రులు తమ ప్రయాణం చివరలో మీ కోసం ఎదురుచూస్తున్నప్పుడు 👍👍

అసౌకర్యంగా అనిపించి దూరం కాకండి.


ఏజెన్సీ అంత్యక్రియలు చేయగలదు.


కానీ కన్నీళ్లు…

అవి అవుట్‌సోర్స్ చేయలేము.


అవి రక్తం నుంచే రావాలి.

సోమవారం,ఫిబ్రవరి.23,2026

  *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


సోమవారం,ఫిబ్రవరి.23,2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం

తిథి:షష్ఠి ఉ10.03 వరకు

వారం:సోమవారం(ఇందువాసరే)

నక్షత్రం:భరణి సా5.33 వరకు

యోగం:బ్రహ్మం ఉ11.30 వరకు

కరణం:తైతుల ఉ10.03 వరకు తదుపరి గరజి రా8.56 వరకు

వర్జ్యం:తె4.44 - 6.14

దుర్ముహూర్తము:మ12.36 - 1.22 మరల మ2.55 - 3.41

అమృతకాలం:మ1.02 - 2.33

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 -12.00

సూర్యరాశి: కుంభం

చంద్రరాశి:మేషం

సూర్యోదయం:6.29

సూర్యాస్తమయం:5.59

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సుభాషితమ్

  🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝 *యత్ర మిత్రత్వ మిఛ్ఛంతి*

            *తత్ర త్రీణి నకారయేత్*

            *వాగ్వాదం అర్థ సంబంధం*

            *పరోక్షే దారభాషణమ్||*


:తా𝕝𝕝: *లోకంలో ఇద్దరిని దురదృష్టవంతులు గా చెప్తారు* ... 

           *ఒకటి తల్లి పాలు తాగనివాడు*,

           *రెండు మంచి మిత్రుల్ని సంపాదించుకోలేని వాడు.*..

           *స్నేహం చిరకాలం నిలుపుకోవాలంటే మూడు విషయాలలో*

           *జాగ్రత్త వహించాలి....* 

              *ఒకటి... స్నేహితులతో వాదులాడరాదు*,

   *రెండు... ధన సంబంధపు లావాదేవీలు పనికిరావు,*

           *మూడు... స్నేహితుడు లేని సమయంలో అతని భార్యతో*

           *మాట్లాడరాదు....* 

     *ఈ మూడు విషయాలలో జాగ్రత్త పాటిస్తే మంచి మిత్రునిగా ఉండిపోతారు...*


     *సుహృత్ గా కీర్తింపబడతారు ఈ జగత్ లో .........*



✍️💐🌹🌸🙏

పంచాంగం

 *-*-*-*-*-*-

*

పూర్వ పద్ధతి పంచాంగం. 

తేది.23.02.2026

సోమ వారం (ఇందు వాసరే)  

*************    

గమనిక:-

ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ ణసంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణ మాసే శుక్ల పక్షే షష్ఠ్యాం 

(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందువాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

________________________

*ఇతర పూజలకు*

 శ్రీ విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ ఫాల్గుణ మాసే శుక్ల పక్షే షష్ఠ్యౌపరి సప్తమ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి. ________________________

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.29

సూ.అ.5.59

శాలివాహనశకం 1947 వ సంవత్సరం.    

విక్రమార్క శతాబ్దం లో 2082 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5126 వ సంవత్సరం. 

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు 

ఫాల్గుణ మాసం

శుక్ల పక్షం షష్ఠి ఉ.10.03 వరకు.

సోమ వారం

నక్షత్రం భరణి సా.5.33 వరకు.

వర్జ్యం మ .3.13 ల 4.45 వరకు.

వర్జ్యం తె.4.45 ల 6.14 వరకు.

అమృతం మ.1.02 ల 2.33 వరకు.

దుర్ముహూర్తం ప.12.36 ల 1.22 వరకు.

దుర్ముహూర్తం మ.2.55 ల 3.41 వరకు.

యోగం బ్రహ్మం ప.11.30 వరకు.

కరణం తైతుల ఉ .10.03 వరకు.

కరణం గరజి రా.8.56 వరకు.

సూర్యోదయము 6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ.7.30 ల 9.00 వరకు.

గుళిక కాలం మ.1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం ఉ.10.30 ల 12.00 వరకు. 

*******-**-*******    

పుణ్యతిథి ఫాల్గుణ శుద్ధ సప్తమి.

************

*ప్రభల విశ్వనాధం* 

*శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ*, వనస్థలిపురం, హైదరాబాద్. 500070.

801-956-6579,

739-686-7592,

984-875-1577.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


*ఆత్మీయ బంధుమిత్రులకు *శుభోదయ* *శుభాకాంక్షలు*💐🌹 * మీరు మీ కుటుంబసభ్యులు *ఆయురారోగ్యాలతో* *అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు *ఆనందం* గా జీవించాలని కోరుకుంటూ... *ఈ రోజు జన్మదినోత్సవం మరియు వివాహ దినోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాకాంక్షలు* 💐💐🌹🌹🌹

 *మీ శ్రేయోభిలాషి*.

🙏🙏🙏

23-02-2026 సోమవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

23-02-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. బంధువులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున కొందరి ప్రవర్తన మానసిక చికాకు కలిగిస్తాయి.

---------------------------------------


వృషభం


నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో విశేషంగా రాణిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అన్ని వైపుల నుండి ఆదాయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉన్నది.

---------------------------------------


మిధునం


చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వాహన వ్యాపారస్తులకు అనుకూలత పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ధనపరంగా కొంత గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి విమర్శలు తప్పవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోనడం మంచిది. 

---------------------------------------


సింహం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్తులతో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. విద్యార్థుల పరీక్షా ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉండదు. 

---------------------------------------


కన్య


కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు అధిగమిస్తారు. నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలలో ఆకస్మిక విజయం సాదిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. భూ సంభందిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

---------------------------------------


వృశ్చికం


ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ధన పరమైన విషయాలలో తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

---------------------------------------


ధనస్సు


ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. కుటుంబమున కొందరి మాటల వలన మానసిక చికాకులు కలుగుతాయి. నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


మకరం


బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహన భూ లాభాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు.

---------------------------------------


కుంభం


కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభనలు తప్పవు. దూర ప్రయాణాలలో శ్రమాధిక్యత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

---------------------------------------


మీనం


స్ధిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సంతాన శుభకార్యాలకు ధనం ఖర్చు చేస్తారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. అనుకున్న పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చుట్టుపక్కల వారితో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యలు సర్దుమణుగుతాయి.

---------------------------------------

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*660 వ రోజు*

కర్మ సిద్ధాంతము

ఇక నీకు కర్మ గురించి చెప్తాను విను. జననీ, జనకులు, గురువులకు మేలుచేస్తే సుఖము వారికి కీడుచేస్తే దుఃఖము కలుగుతాయి. వీరు కాక తక్కిన విషయములలో పాపముచేస్తే దానికి ప్రాయశ్చితము ఉంది కాని తల్లి, తండ్రి, గురువుల పట్ల చేసిన అపచారమునకు, పాపముకు పరిష్కారము లేదు. ఆహారధాన్యమును అపహరించిన వాడు మరుజన్మలో ఎలుకగాను, పందికొక్కుగాను, కుక్కగానూ జన్మిస్తాడు. పరులభార్యను కోరువాడు తోడేలుగాను, రాబందుగాను, కోతిగాను, గ్రద్దగానూ పుడతాడు. చివరకు పురుగుగాను పుడతాడు. అప్పటికి కాని ఆపాపముపోదు. ఎవరైతే తన కూతురును ఒకరికి ఇచ్చి పెళ్ళి చేసి మరలా మనసు మార్చుకుని ఆమెను వేరొకరికి అప్పగిస్తాడో అతడు పురుగుజన్మ ఎత్తుతాడు. దేవకార్యము చేసిన తరువాత పితరులకు నివేదనము చేయకుండా భోజనము చేయువాడు కాకిజన్మ ఎత్తుతాడు. అన్నగారిని తిట్టిన వాడు పక్షిజన్మ ఎత్తుతాడు. శూద్రుడు బ్రాహ్మణ స్త్రీని కోరిన అతడు పురుగుగా పుడతాడు. చేసిన మేలు మరచినవాడు నరకబాధలు అనుభవిస్తాడు. ధనము మీద వాంఛతో నిరాయుధుడిని చంపినవాడికి పక్షిజన్మ వస్తుంది. ఆ జన్మలో చావుదెబ్బలు తింటూ మారణాయుధాల వలన మరణిస్తాడు. స్త్రీని చంపినవాడు మరుజన్మలో అనేక రకములైన నరకబాధలు అనుభవిస్తాడు. అన్నము, పాలు దొంగిలించిన వాడు వాటిలో పురుగులుగా జన్మిస్తాడు. పండ్లను, ఇనుమును, వెండి, బంగారమును దొంగలించిన వాడు వరుసగా కోతి, కాకి, పక్షి, క్రిమిగా పుడతాడు. ఇతరుల దుస్తులు అపహరించిన వాడు కుందేలుగా పుడతాడు. ఇతరులు తన వద్ద ధనమును అపహరించి వంచించిన నమ్మక ద్రోహి చేప మొదలైన నీచ జన్మలు ఎత్తుతాడు. పైన చెప్పిన పాపాలు స్త్రీలు చేస్తే పురుషులు ఎత్తిన జన్మలలో వారికి భార్యలైపుట్టి వారితోచేరి నరకబాధలు అనుభ్యవిస్తారు .

పాపపరిహారము


బృహస్పతి " ధర్మనందనా ! చేసిన పాపములు దానధర్మము వలన నశిస్తుంది. అన్ని దానములలో అన్నదానము శ్రేష్టము. న్యాయముగా సంపాదించిన ధనముతో అన్నదానము చేసిన అది అన్ని పాపములను హరిస్తుంది. చివరకు తాను భిక్షగా తీసుకు వచ్చినది అయినా బ్రాహ్మణుడికి పెట్టి అతడి ఆకలి తీర్చిన అతడికి పుణ్యలోకములు కలుగుతాయి. బ్రాహ్మణుడు వేదాధ్యయనము చేసినందు వలన, తాను నేర్చుకున్నది పదిమందికి బోధించడం వలన, క్షత్రియుడు అటువంటి బ్రాహ్మణులను పోషించడం వలన ఉత్తమ లోకాలను పొందుతాడు. వైశ్యుడు ధర్మంగా చేసిన ఆర్జనతో అనన్నదానము చేసి పుణ్యం సంపాదించ వచ్చు. శూద్రుడు తాను శ్రమపడి తెచ్చిన ధనముతో అనన్నదానము చేసి పుణ్యలోకములకు పోతాడు. ఏ కులము వాడైనా తాను తినబోయే ముందు ఇతరులకు పెట్టి తినిన సద్గతి కలుగుతుంది. కనుక ధర్మనందనా అన్ని దానములలో అన్నదానము గొప్పది. దాని వలన సర్వ పాపములు నశిస్తాయి " అని అన్నాడు బృహస్పతి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ కళ్యాణ సుందరేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 1397


⚜  తమిళనాడు : తిరుమనంచేరీ


⚜  శ్రీ కళ్యాణ సుందరేశ్వర ఆలయం



💠 ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తాం. 

ఆ శివపార్వతులే భక్తులకు ఎదురయ్యే పెళ్లి ఆటంకాలను తొలగించి త్వరగా వివాహాన్ని కుదిర్చేందుకు కొలువుదీరిన ప్రాంతమే ‘తిరుమనంజేరి’ ఆలయం. 


💠 వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారూ, పెళ్లి కుదరడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నవారూ, వైవాహిక జీవితంలో సమస్యలున్నవారూ, సంతానం లేనివారూ ఎక్కువగా దర్శించుకునే ఈ ఆలయాన్ని ఓ రాణి నిర్మించడం విశేషం.


💠 తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కుట్టాలమ్ నుంచి 6 కిమీ దూరంలో కావేరీ నదీ తీరాన పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఉంది. 


💠 ఈ ఆలయం ప్రత్యేక ఏంటంటే, పార్వతీ దేవి చేయిపట్టుకుని పరమేశ్వరుడు పాణిగ్రహణం చేస్తున్నట్లు విగ్రహం ఉంటుంది. 

ఈ ఆలయాన్ని ఆదిదంపతులకు వివాహం జరిగిన పవిత్ర స్థలంగా భక్తులు భావిస్తారు. 


💠 ఇక్కడున్న పరమేశ్వరుడు కళ్యాణసుందరమూర్తిగా పార్వతీదేవి కోకిలాంబాళ్‌గా ప్రసిద్ధికెక్కారు. 


💠 ఈ మూర్తులను మొక్కి కోరికలు కోరిన వారికి వెంటనే పెళ్ళిళ్ళు అయిపోతాయని నమ్మకం. 

పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతుంటే, యువతీయువకులు ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు. 

ఆదిదంపతులను పుష్పమాలలతో అలంకరించి పూజిస్తే వెంటనే పెళ్ళిళ్లు జరుగుతాయని నమ్ముతారు. 


⚜ స్థలపురాణం 


💠 పార్వతి శివుడిని తప్ప మరెవరినీ వివాహం చేసుకోవాలనుకోలేదు. 

ఆమె దీర్ఘ తపస్సు ఫలించింది. శివుడిని వివాహం చేసుకున్న తర్వాత పార్వతి తపస్సు చేసిన ప్రదేశాన్ని "తిరుమమంచెరి" అని పిలిచేవారు. 

"తిరుమణన్" అంటే "వివాహం" మరియు "చేరి" అంటే తమిళంలో గ్రామం అని అర్థం. 


💠 తిరుమనంచేరి చాలా కాలంగా అవివాహితులకు వివాహ స్థలంగా ప్రసిద్ధి చెందింది. 

"కళ్యాణ సుందరేశ్వరర్" రూపంలో ఉన్న శివుడు "కోకిలాంబల్" అని పిలువబడే పార్వతిని వివాహం చేసుకున్నాడు. 

సంస్కృతంలో, "కళ్యాణం" వివాహాన్ని సూచిస్తుంది మరియు కోకిల కలల పక్షి స్వరాన్ని సూచిస్తుంది. 


💠 తిరుమనంచేరిలో శివుడు మరియు పార్వతి యొక్క మూలం గురించి వివిధ ఇతిహాసాలు ఉన్నాయి.


💠 ఒకసారి పాచికలు ఆడుతున్నప్పుడు శివుడు మరియు పార్వతి మధ్య వాదన జరిగింది. శివుడు కోపంగా పార్వతిని ఆవుగా మారమని శపించాడు. 

శివుడు పశ్చాత్తాపపడి పార్వతిని సాధారణ రూపంలోకి మార్చడానికి సహాయం చేయమని విష్ణువును కోరాడు. 

విష్ణువు తన సోదరి పార్వతిని రక్షించడానికి గోపాలుడి రూపాన్ని తీసుకున్నాడు.  

తరువాత ఆయన కావేరి నది ఒడ్డున ఉన్న "తిరువడుతురై" అనే ప్రదేశంలో పార్వతి శాపగ్రస్తుడికి ఉపశమనం కలిగించాడు.


💠 పార్వతి మానవ అవతారం దాల్చి కావేరి నదిలో స్నానం చేసింది. ఆమె భరత ముని కుమార్తెగా జీవించేది. 

భరతుడు శివుడిని తన కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరాడు మరియు శివుడు ఇప్పుడు "తిరుమనంచెరి" అని పిలువబడే ప్రదేశంలో పార్వతిని తిరిగి వివాహం చేసుకున్నాడు.


💠 శివుడు దీర్ఘ తపస్సులో ఉన్నప్పుడు పార్వతి వైపు దృష్టిని మళ్లించడానికి శివుడిపై పూల బాణాలు వేసిన మన్మధుడి కృప లభిస్తుందని చెబుతారు. 

శివుని ధ్యానానికి భంగం కలిగించిన శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని బూడిదగా మార్చాడు. 

మన్మధుడి భార్య రతీ దేవి శివుడి పాదాలపై పడి క్షమాపణ కోరింది. శివుడు జాలిపడి మన్మధుడిని తన పూర్వ రూపానికి తిరిగి ఇచ్చాడు. రతిని "మాంగల్య భాగ్యం"తో ఆశీర్వదించి మన్మధుడి జంటను ఏకం చేశాడు.  


💠 మన్మథుడు ఈ ప్రదేశంలో శివుడిని పూజించాడని నమ్ముతారు, అందుకే చాలా కాలంగా విడిపోయిన జంటలు ఈ ఆలయాన్ని సందర్శిస్తే వారు తిరిగి ఒకటి అవుతారని నమ్ముతారు.


💠 శివుడిని సంస్కృతంలో "ఉధవగణనాథర్" అని కూడా పిలుస్తారు. 

పార్వతి దేవిని పర్వత సుందరి అని పిలుస్తారు. 


💠 ఈ ప్రదేశంలోని ఉధవగణనాథర్ ఆలయంలోని విగ్రహాలను కాలక్రమేణా శివ భక్తులు కళ్యాణ సుందరేశ్వర్ మరియు కోకిలాంబల్ అని పిలుస్తున్నారు.


💠 తిరుమనంచేరి ఆలయం నక్షత్రాలు మరియు జాతక దోషాలు మరియు ఇతర కారణాల వల్ల వివాహం కాని వారికి ఉపశమనం కలిగించే ప్రదేశం. 

మూల, ఆశ్లేష మరియు జ్యేష్ట నక్షత్రాలలో జన్మించిన వారి వివాహానికి గ్రహ శాంతి అవసరమని చెబుతారు. 

పెళ్లికాని వారు ఆలయాన్ని సందర్శించి పూజలు చేస్తే, వారికి త్వరలో సంతోషకరమైన జీవితం లభిస్తుంది.


💠 ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కూడా నవగ్రహాలలో ఒకరైన రాహువు లింగరూపంలో ఉంటుంది. రాహువు పీడితులుగా ఉన్నవారు ఇక్కడకు వచ్చి పూజలు చేస్తుంటారు.

వివాహానికి సంబంధించి విడాకులు తీసుకోవాలని అనుకునేవారు,ఈ దేవాలయాన్ని దర్శిస్తే వారి సంబంధం గట్టిపడి సుఖసంసారాన్ని సాగిస్తారని ప్రతీతి.


💠 ఈ దేవాలయ సన్నిధిలో గల పవిత్ర పుష్కరిణకి సప్తసాగర తీర్థం అని పేరు. 

సప్తసముద్రాలు వచ్చి ఈ పుష్కరిణిలో చేరతాయని భక్తుల విశ్వాసం. 

పరమశివుని పాణిగ్రహానికి సప్తసముద్రాలు పుష్పమాలికగా ఏర్పడివచ్చినట్లు పురాణం.



💠 కుంభకోణం నుండి తిరుమనంచేరి 30km.


Rachana


©️ Santosh Kumar

*శ్రీ మహావిష్ణు పురాణం*

 232f4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



       *శ్రీ మహావిష్ణు పురాణం*

               ➖➖➖✍️

                ఐదవ భాగం



*శ్రీ మహావిష్ణువు జననం:*```

కృష్ణుడు కృష్ణాదేవి కలయిక వలన కృష్ణాదేవి గర్భం ధరించింది. శత మన్వంతరాల కాలం వరకు గర్భాన్ని మోసి ఒక మగశిశువుకి జన్మ నిచ్చింది. శత మన్వంతరాల కాలం గర్భం మోయడం వలన అలసి సొలసిన కృష్ణాదేవి ఆ మగశిశువుని చుట్టూ నిండి ఉన్న జలధిలోకి వదిలివేసింది. ఆ మగ శిశువు ఒక వటపత్రం మీద తేలుతూ నీటిలో ముందుకు సాగాడు.


కృష్ణుడికి కృష్ణాదేవి జలధిలో శిశువుని వదిలేయడం నచ్చలేదు. “కన్నబిడ్డను జలధిలో వదిలి వేసినందుకు గాను నీకు, నీ అంశతో జన్మించబోయే అప్సరసలకు సంతానం కలుగదు!” అని శాపమిచ్చాడు. 


కృష్ణాదేవి పశ్చాత్తాపం చెంది శరణు వేడింది. 


కృష్ణుడు శాంతి చెంది మన్నించాడు. సృష్టి కృష్ణాదేవి వలన ముందుకు సాగదు అనుకుని ఆమె వంక చూశాడు.


ఫలితంగా కృష్ణాదేవి జిహ్వాగ్ర భాగం నుండి ధవళ (తెలుపు) స్వరూపిణి, శ్వేతవస్త్రధారిణి, వీణాపుస్తక ధారిణి అయిన "మహాసరస్వతి" ఆవిర్భవించింది. కృష్ణాదేవి కృష్ణుడిలో కలసిపోయింది. సర్వశాస్త్రాధి దేవత యైన మహాసరస్వతి వామభాగం నుంచి ‘లక్ష్మీదేవి’, దక్షిణ భాగం నుంచి ‘రాధాదేవి’ అవతరించారు.


మహాజలథి లో తేలుతూ వెళుతున్న బాలశిశువు ఆకలి కలిగి కళ్ళు తెరచి రోదించసాగాడు. రోదన విన్న కృష్ణుడు శిశువు ముందు ప్రత్యక్షమైనాడు. తేజోరూపం చూసి శిశువు ఆకలి, దుఖం మరచి విప్పారి చూడసాగాడు.  


కృష్ణుడు ఆ శిశువు వంక చూసి “నాయనా! నా తేజస్సులో పదహారవ అంశయైన నీవు నాతో సమానుడవై ఉంటావు. నీకు ఆకలిదప్పులు, దుఖభయాలు, జరామరణాలు ఉండవు.

అసంఖ్యాక బ్రహ్మాండాలు నీ రోమకూపాల నుంచి ఉద్భవిస్తాయి. నీవు సమస్త విశ్వంలో ఉంటావు. సమస్త విశ్వము నీలో ఉంటుంది. సమస్త విశ్వానికి ఆధారభూతుడవైన నీవు ‘మహావిష్ణువు’ నామంతో ప్రసిద్ధి పొందుతావు. నీటిని నారములు అంటారు. నారములలో నివసిస్తావు కనుక నిన్ను ‘నారాయణుడు’ అంటారు. సమస్త విశ్వము నీలోనే ఉంటుంది కనుక ‘విశ్వవిరాట్ పురుషుడు’ గా విరాజిల్లుతావు.


అండ పిండ బ్రహ్మాండాలకు ఆధారమూర్తివైన నీకు సకల శక్తులు ప్రసాదించే షడక్షర మహామంత్రం ‘కృష్ణమంత్రం’ ఉపదేశిస్తాను.” 


వింటున్న బాల విష్ణువు చేతులు జోడించి మంత్రోపదేశానికి సిద్ధం అయ్యాడు. 


సంసిద్ధుడైన విష్ణువుకి చతుర్భుజాలు, పట్టుపీతాంబరాలు, కిరీటాది స్వర్ణాభరణాలు అలంకరించాయి. కృష్ణుడు ముందుకు వంగి శిశువు కుడిచెవిలో షడక్షర మహామంత్రం ‘ఓం కృష్ణాయ స్వాహా’ ఉపదేశించాడు.


మంత్రోపదేశం పొందగానే బాల శిశువు దేహం దివ్య తేజస్సుతో ప్రకాశించింది. వాత్సల్యముతో శిశువు వంక చూసి కృష్ణుడు "నాయనా! ఈ షడక్షర మహామంత్రం జపిస్తూ తపస్సు చేయుము. ఈ మహావిశ్వానికి రక్షకుడివి, పోషకుడివి, విరాట్ స్వరూపుడివి అవుతావు. తిరిగి సకల విశ్వం నాలో మహాలయం పొందేవరకు, అనేక కల్పాంతాలు, యుగాంతాలు కాలచక్ర భ్రమణంలో కలసిపోతున్నా, సకల బ్రహ్మాండాలకు నీవే సృష్టి స్థితి లయ కర్తగా ఉంటావు.


ఈ జగత్తుకి ఆద్యుడు, ఆధారుడవైన నీవు జగత్తు రక్షణ కోసం అనేక అవతారాలు ధరిస్తావు. నీ నామము ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రంగా జపించబడి సమస్త ప్రాణులకు శుభములు చేకూరుస్తుంది. అనేక మహత్తులు నీకు సహజ లక్షణాలుగా ఉంటాయి”. అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


వటపత్ర సాయి రూపంలో ఉన్న మహావిష్ణువు అష్టాక్షరీ మహామంత్రం జపిస్తూ అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి తపస్సిద్ధి పొందాడు. చాలా కాలం తపస్సు చేయడం వలన అలసిన విష్ణువు విశ్రమించాడు. అలసిన విష్ణువు స్వేదజలంతో పాటు ఒక్కొక్క రోమకూపం నుండి ఒక్కొక్క అండము వెలువడ్ఢాయి. అలా కోట్లాది అండాలు వెలువడి కలసిపోయి ఒక బ్రహ్మాండం రూపొందింది. మహావిష్ణువు నిద్రలో ఉండటం వలన, ఆ బ్రహ్మాండం చైతన్య రహితంగా ఉండిపోయింది.


వేల సంవత్సరాలు అలా విశ్రాంతి తీసుకుని విష్ణువు స్వస్థుడై నిద్ర లేచాడు. సృష్టి పొందిన బ్రహ్మాండంలో నారాయణుని దేహము వ్యాపించి దివ్వతేజస్సుతో బ్రహ్మాండం ప్రకాశించింది. తన ఎదురున్న బ్రహ్మాండాన్ని విష్ణువు తన బోటనవ్రేలితో రెండు భాగాలుగా విభజించాడు. చీలిన రెండు భాగాలకి మధ్య జలరాశి నీరు ఉధృతంగా రావడంతో బ్రహ్మాండం క్రింది భాగము నీటిలో మునిగింది. పై భాగంలో మహావిష్ణువు సంకల్పంతో ఏడు ఊర్థ్వలోకాలు ఏర్పడ్డాయి. నీటిలో మునిగిన క్రింది భాగంలో ‘ఆరు అధోలోకాలు’ ఏర్పడ్డాయి.  


బ్రహ్మాండంలో గల కోట్లాది అండాలు కూడా రెండు రెండు భాగాలుగా విడిపోయి ఊర్థ్వ అధోలోకాలు ఏర్పడ్డాయి.


సప్త ఊర్థ్వలోకాల పైన ఏర్పడిన గోలోకాన్ని కృష్ణుడు రాధాదేవితో కలసి తన నివాసంగా చేసుకున్నాడు. కృష్ణుడి సంకల్పంతో రోమముల నుండి అతని వలె రూప దేహములు కల వెయ్యి మంది పార్షాదులు (గోపాలురు) జన్మించి సేవకులు అయ్యారు. రాధాదేవి శరీరం నుండి కూడా వేయి మంది పార్షద గోపికలు జన్మించి చెలికత్తెలు అయ్యారు.


లోకాలను సృష్టించిన మహావిష్ణువు ఆ లోకాలలో చరాచర జీవులను సృష్టించ సంకల్పించాడు. తనకు అటువంటి శక్తిని ఇమ్మని పరమాత్ముడైన కృష్ణుడిని తలచాడు. కృష్ణుడు మహాసరస్వతి నుండి ఉద్భవించిన మహాలక్ష్మిని విష్ణువుకి తోడుగా పంపాడు. మహాలక్ష్మి వచ్చి నారాయణుడి వక్షస్థలమందు నివాసము ఏర్పాటు చేసుకుంది. శ్రీ లక్ష్మీ వచ్చి చేరడంతో నారాయణుడు సిరి సంపదలు పొంది ‘శ్రీ లక్ష్మీనారాయణుడు’ అయ్యాడు. శ్రీమహావిష్ణువు వక్షస్థల నివాసియై  

‘శ్రీ మన్మహాలక్ష్మి’ అయ్యింది.✍️

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.🙏

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో…

- సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు

 ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖