23, నవంబర్ 2021, మంగళవారం

భస్మాల ఉపయోగాలు - 1

 ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 1


   నేను అంతకు మునుపు భస్మాల పైన చాలా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎంత గొప్ప సమాచారం మరియు ఉపయోగాల గురించి చెప్పినా కూడా మరెంతో సమాచారం ఇంకా మిగిలే ఉంటుంది. 


      ఆయుర్వేదం నందు మూలికావైద్యం మాత్రమే కాకుండా భస్మాలను ఉపయోగించి వైద్యం చేయడం కూడా ఉంది. దీన్ని "రసౌషధ విద్య " గా పిలుస్తారు. కాని ఇది రహస్యముగా ఉంచబడినది. ఈ విద్యని ఉపయోగించుటకు అవగాహన మరియు నేర్పరితనం తప్పక ఉండాలి. ముఖ్యముగా అనువంశికముగా వైద్యం చేయువారికి ఈ విద్య పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీకు మేము ఈ రసౌషద వైద్యములో ఉపయోగించు భస్మాల ఉపయోగాల గురించి వివరిస్తాను . 


 * స్వర్ణ భస్మం - 


    ఈ భస్మం రారాజు వంటిది. దీనిని వెన్నతోగాని , తేనెతో గాని , నెయ్యితో గాని సేవించిన పిత్తము , వాతము , ప్రమేహము , గ్రహణి , కుష్టు , నపుంసకత్వం , పాండు రోగము , క్షయ , మూలరోగము సమూలంగా పోవును . 


 * వెండి భస్మము - 


      దీనికి రౌప్య భస్మం అని కూడా పేరు కలదు . దీనిని సరైన అనుపానముతో సేవించిన పైత్యము , గుల్మము , కఫము , విషము , మేహము , శ్వాస , ప్లీహ ( spleen ) రోగములు , వలిఫలితము ( చిన్న వయసులో జుట్టు తెల్లబడుట ) , పాండురోగము , వాపు , దగ్గు , క్షీణత్వం అనగా శరీరం క్షీణించుట , క్షయ రోగము నశించును . 


 * తామ్ర భస్మం - 


      తామ్రము అనగా రాగి . రాగిని సరైన పద్ధతుల్లో పుటము పెట్టి శుద్ది చేసినది . ఈ భస్మమును వాడుట వలన కుష్టు , ప్లీహము , జ్వరము , కఫము , వాతము , శ్వాస , కాసము , వాపు , శూల , ఉదర రోగములు , క్రిమి రోగములు , పాండు , మొలల రోగము , క్షయ , భ్రమ , మోహము , ఎక్కిళ్ళు వంటివి తగ్గును. 


 * లోహ భస్మము - 


      లోహము అనగా ఇనుము . ఈ ఇనుప భస్మము పుటాలు పెట్టి శుద్ది చేసి వాడవలెను . దీనిని వాడటం వలన ప్లీహ రోగము ( spleen ), మొలల నొప్పి , పిత్తము , వాతము , కుష్టు , శోభి , కాస , జ్వరము , మేహావాతము , కీళ్ల నొప్పి తగ్గించును. దీర్గాయువు ఇచ్చును . 


 * కాంత భస్మము - 


      కాంతము అనగా అయస్కాంతము . దీన్ని శుద్ది చేసి తయారు చేసిన భస్మము వాడటం వలన మేహ పిటికలు , త్రిదోషములు , శూల , మొలలు , గుల్మము , ప్లీహ రోగము , క్షయ , పాండువు , ఆడవారిలో వచ్చు తెల్లబట్ట , ఎర్రబట్ట మరియు ఉదర బలహీనతను తగ్గించును . దీర్గాయువు ఇచ్చును . 


 * మండూర భస్మము - 


    చిట్టెపు రాళ్లు తెచ్చి బాగుగా కాల్చి ఆవు పంచితములో 7 పర్యాయాలు ముంచి నీళ్లతో కడిగి , ఎండించి జిల్లేడు పాలతో నూరి పుటం పెట్టిన భస్మం అగును. దీన్ని త్రిఫల కషాయంతో కలిపి మరికొన్ని పుటాలు వేసిన శుద్ధ మండురం అగును. ఇది అత్యంత శక్తివంతం అయినది. 


    పైన చెప్పిన పద్దతుల్లో మా కుటుంబము వారు తయారు చేసేవారు. ఇది లివర్ మీద అద్భుతముగా పనిచేయును . పాండురోగము మీద , కామెర్ల మీద శరీరం వాపు మీద బ్రహ్మస్తం వలే పనిచేయును . 


       మరికొన్ని భస్మాల గురించి తరువాతి పోస్టు నందు వివరిస్తాను .

వ్యమైన సున్నిపిండి

 శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి - 


 కావలసిన పదార్దాలు - 


  * పచ్చ పెసలు - 1 కిలొ .


  * బావంచాలు - 100 గ్రాములు .


   * వట్టి వేళ్లు - 100 గ్రాములు . 


   * కచ్చురాలు - 100 గ్రాములు . 


   * మంజిష్ట - 100 గ్రాములు .


   * మంచి పసుపు - 100 గ్రాములు .


   * కస్తూరి పసుపు - 100 గ్రాములు .


   * ఉలవలు - 100 గ్రాములు .


   * బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .


   * కరక్కాయ బెరడు - 100 గ్రాములు .


   * ఉసిరికాయ బెరడు - 100 గ్రాములు .


   * తానికాయ బెరడు - 100 గ్రాములు .


   * ఎండు ఖర్జూరాలు - 100 గ్రాములు .


   * కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు 


    * సుగంధపాల వ్రేళ్లు - 100 గ్రాములు .


    * తుంగ గడ్డలు - 100 గ్రాములు .


    * దానిమ్మ పండ్ల బెరడు - 100 గ్రాములు .


    * ఎండు గులాబీ రేకులు - 100 గ్రాములు . 


    * మరువము - 100 గ్రాములు . 


     * ధవనము - 100 గ్రాములు .


     * జాపత్రి - 100 గ్రాములు . 


     * యాలుకలు - 100 గ్రాములు . 


     * కురువేరు - 100 గ్రాములు . 


     * తులసి ఆకులు - 100 గ్రాములు . 


  తయారీ విధానం - 


    పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో 

పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి. 


 

  వాడేవిధానం - 


     స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .


  ఉపయోగాలు - 


 

 * ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును . 


 * శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి . 


 * చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును . 


 * మృత చర్మ కణాలు నిర్మూలించబడతాయి .


 * చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .


 * శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును. 


 * శరీరానికి మంచి తేజస్సు కలుగును. 


 * సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .


  గమనిక -  


         పైన చెప్పిన విధానం మీరు చేసుకోలేనిచో చేసి ఇవ్వబడును . 


              కాళహస్తి వెంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                      9885030034

సత్యం.

 నగ్న సత్యం. 


*ఆకులు తింటేనే* 

*బ్రహ్మజ్ఞానం వస్తే*

*అందరి కన్నా* 

*ముందు మేకలే* 

  *జ్ఞానులు*

   *కావాలి,*⤵️


*స్నానాలతోనే* 

*పాపాలు పోతే* 

    *ముందు*

*చేపలే పాప* 

*విముక్తులు కావాలి,*


*తలక్రిందులుగా ,*

 *తపస్సు చేస్తేనే*

     *పరమాత్మ* 

   *ప్రత్యక్షమైతే*

    *ముందు*

   *గబ్బిలాలకే* 

 *ఆ వరం దక్కాలి,*


*ఈ విశ్వమంతా,*

 *ఆత్మలో ఉంది*

*నీలో ఉన్న,*

 *ఆత్మను వదిలి,*

 *పరమాత్మ అంటూ*

*పరుగులు పెడితే*

*ప్రయోజనమే లేదు*👇,


👉 *నీలో లేనిది,*

 ❗ *బయటేమీ లేదు* 

 ❗ *బయటఉన్నదంతా* 

 ❗ *నీలోనూ ఉంది*👈


*❕తెలిసి మసులుకో* 👈

  ❕ *కలిసి జీవించు.....*.       


మానస సరోవరం 🙏

తక్కువగా చూడకూడదు

 సోషల్ రూల్స్...

నిజంగా...ఎవరైనా...పాటిస్తున్నారా...


 1. ఏవరికైన  రెండు సార్లకు మించి

     అదేపనిగా కాల్ చేయవద్దు. వారు

     సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే

     చాలా ముఖ్యమైన పని ఉందని

     అర్థం. (కోంతమంది ఫోను ఏత్తేవరకూ   

     మళ్ళీమళ్ళీ, మళ్ళీమళ్ళీ ఫోనులు చేస్తూనే 

     ఉంటారు)


 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు

     అరువు తీసుకున్న డబ్బును వారికి

     తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న

     మొత్తమైనాసరే! అది మీ

     వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! 


 3. ఎవరైనా మీకోసం పార్టీ 

     ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన

     వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్

     చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే

     ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని

     అడగండి.


 4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?

      మీకు పిల్లలు లేరా? 

      ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"

      వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను

      ఎదుటివారిని అడగవద్దు. 

      అవి వారి సమస్యలు. 

      మీవి కావు!


 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ

      మీరే  తలుపు తెరిచి లోపలికి

      ఆహ్వానించండి. 

      అమ్మాయి,అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరైనా

      సరే. ఒకరిపట్ల మంచిగా

      ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా

      మారరు.


 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా/సరదాగా 

     మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు

     సరదాగా తీసుకోకపోతే వెంటనే

     దాన్ని ఆపివేయండి! మరలా

     చేయవద్దు.


 7. బహిరంగంగా ప్రశంసించండి,

      ప్రైవేటుగా విమర్శించండి.


 8. ఒకరి బరువు గురించి మీరు

     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.

     "మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"

      అని చెప్పండి.  అప్పుడు బరువు

      తగ్గడం గురించి మాట్లాడా

      లనుకుంటే, వారే మాట్లాడుతారు. 


 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో

     చూపించినప్పుడు, అదొక్కటే

     చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు

      స్వైప్ చేయవద్దు. తర్వాత

      ఏముంటాయో మీకు తెలియదు

      కదా!


 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా

       వ్యవహరిస్తారో అదే గౌరవంతో

       క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.

       మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే

       ప్రజలు ఖచ్చితంగా దాన్ని

       గమనిస్తారు.


 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ

        సలహా ఇవ్వకండి.


 12.  సంబంధంలేని వారికి మీ 

        ప్రణాళికల గురించి చెప్పవద్దు. 


 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి

       మీకు ఆహారాన్ని ఆఫర్

       చేసినప్పుడు మర్యాదగా 'నో'

       చెప్పండి. 

       కానీ, రుచి లేదా వాసన

       చూసిన తర్వాత 'నో' చెప్పవద్దు.

       అట్లా చేస్తే మీరు వారిని

       అవమానించినట్లే! 


 14. మరో ముఖ్య విషయం! ఇతరుల

        విషయంలో అనవసరంగా జోక్యం

        చేసుకోకుండా, మీ పనేదో మీరు

        చూసుకోండి!!


చివరిది , అతి ముఖ్యమైనది 


15.  ఇలా ఎవరైనా సలహాలు ఇస్తుంటే , 

        వీడేంటి ఉచిత సలహాలు ఇస్తున్నాడు 

        వీడికి  పనిపాటా లేదా అనుకోవడం కాకుండా,           

        వారికి కాస్త సమయం కేటాయించి వారు చెప్పేది 

        విని , నచ్చితే పాటించడం నచ్చకపోతే        

        వదిలెయ్యడం


అంతేకానీ వారిని తక్కువగా చూడకూడదు 

వారు ఎవరైనా సరే పేద్దవారైనా, చిన్నవారైనా...  .


సేకరించిన పోస్టు.

19, నవంబర్ 2021, శుక్రవారం

పుణ్యం

 🙏🌺పుణ్యం వెల🌺🙏


🌺 కాశీ పట్టణం లో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.


అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.🌺


 🌺ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.


 పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి 

వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును 

అని సలహా ఇస్తుంది.🌺


🌺 బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధ

పడక తప్పలేదు.


 దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.


   అతను నడుచుకుంటు అడవిలోనుండి పోయేవేళ

ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.🌺

 

🌺బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి, తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.


 కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.


 బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.


  బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.🌺

 

🌺 అప్పుడు సేఠ్ నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను అని అంటాడు.


 మధ్యాహ్నం సేఠ్ ఇంటికి భోజనానికి వెళ్లి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా

అడుగుతాడు.


 సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది.


కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యం ను

బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.


 సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్ ఇలా అంటాడు.

 

ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనకొంటున్నాను.


 బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు. నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా

అని.🌺


🌺 ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకూ ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు అదే యజ్ఞం అని సేఠ్ అంటాడు.  


నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని

అనుకొంటున్నాను అని అంటాడు.


 బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.  


దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని సేఠ్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం 

జరిగిపోతాయి.


 నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.🌺

  

🌺రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. 


త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.  


రెండవ సంచీ ఉంచిన కూడ కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి సేఠ్ తన దగ్గర 

వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు 

ఆశ్చర్య పోతారు.

 

అప్పుడు బ్రాహ్మణుడు సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను." ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు. 🌺


🌺 ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి,

 దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.


 ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడుగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి

అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.


 ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండటం తో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.


 బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది.🌺


 🌺మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి 


 వజ్రాలు, నగలా ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు బ్రాహ్మణుడు.

 

భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే

అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.


 అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.

 

విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.🌺

 

🌺ఇదీ కథ. 

నిజానికి ఇది కథ కాదు. జీవితం. 

ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు. 

అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి. పరలోక ప్రయాణానికి పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి .


 దేవుడు మనల్ని పరీక్షిస్తాడు

  మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు🌺


🌺 అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వమ్ముకాకూడదు


    ప్రపంచానికి భయపడకు


    ఇక్కడ ఎవరో కోరితే ఎవరికీ చెడ్డరాదు


    మన కర్మ ఫలమే మనకు లభిస్తుంది,


ఆ  🌺

రహస్య ఎజెండా

 *స్వాతంత్ర్యం తరువాత* *అధికారాన్ని చేజిక్కించు కున్న మితవాదులు రహస్య ఎజెండా , బ్రాహ్మణ వ్యవస్థను నిర్మూలించడం ద్వారా హిందూ మతాన్ని నిర్వీర్యం చెయ్యడం . హిందూ దేవాలయాలను* *ఎండోమెంట్ పరిధిలోనికి తీసుకుని వాటి వైభవాన్ని మసకబారేటట్లు చెయ్యడం . ఈ రోజుల్లో బిటెక్ చదివిన విద్యార్థికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే ప్రారంభంలోనే రూ .25 వేల జీతం ఇస్తున్నారు . మరి దేవాలయాల్లో ధూప , దీప ,* *నైవేద్య కైంకర్యాలకు తమ జీవితాలను అంకితం చేసి , తద్వారా మన* *హిందూమతాన్ని , మన సంస్కృతి , సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న బ్రాహ్మణులకు జీతాలు ఎంత ఇస్తున్నారు*

 *స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి బ్రాహ్మణులపై ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష* *చూపిస్తుంది ? ఈ విషయాన్ని ఈ దేశంలో ఉన్న హిందూ పీఠాలు , మఠాలు , హిందువులు ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదు ? ఇది మన దేశ సమస్య కాదా ? 2012 లో ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టులో బ్రాహ్మణుల జీత భత్యాల గురించి ఒక రిట్* *పిటీషన్ వేశాడు . దక్షిణ భారతదేశంలో 50 ముఖ్యమైన దేవాలయాల్లో అర్చకుల జీతభత్యాలను ఉదహరిస్తూ .. ఒక* *దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న నరశింహ గోపాలన్ జీతం 250 రూపాయలు . ప్రభుత్వం దయార్ధ హృదయంతో అతని జీతాన్ని ఒక్కసారిగా మూడింతలు పెంచితే రిట్ పిటీషన్ వేసే సమయానికి అది 750* *రూపాయలు అయింది . అదే ఆలయంలో నరశింహ గోపాలన్ గారి తండ్రి అర్చకులుగా చేసేవారు . 1980 నాటికి ఆయన జీతం రూ . 55. ఆ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మరో దేవాలయంలోని పూజారి జీతం రూ .19 . ( 2012 లో హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా* *మద్రాస్ హైకోర్టులో రిట్ పిటీషన్ వెయ్యడం జరిగింది . ) బ్రాహ్మణ వ్యవస్థపై ఈ విషాన్ని కక్కుతున్నదెవరు ? ఈ దేశంలో నివసిస్తున్న వారు దీన్ని ఎందుకు గ్రహించలేక పోతున్నారు ?*

 *1962 లో చైనాతో యుద్ధం ముగిసిన తరువాత ఢిల్లీలో ఒక సభ జరిగింది . ఆ సభకు నెహ్రూ మరియు స్వామి విధ్యానంద విదేహ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు . నెహ్రూ మాట్లాడుతూ .. ఆర్యులు భారతదేశానికి వచ్చిన శరణార్ధులు అంటూ ఆర్యులను కించపరిచే విధంగా మాట్లాడాడు . ఆ మాటలు విన్న స్వామి విధ్యానంద విదేహ్ లేచి వెళ్లి , నెహ్రూ* *ముందు నిల్చుని , నిప్పులు కక్కుతున్న కళ్లతో నెహ్రూని చూస్తూ చాచి అతని చెంప మీద కొడతాడు . ఆ దెబ్బకు నెహ్రూ తూలి వెనక్కి పడబోతాడు . వెనుక ఉ న్నవాళ్లు నెహ్రూ పడిపోకుండా పట్టుకుంటారు . ఈ దృశ్యాన్ని తిలకించిన ఎంతో మంది సభికులు తమ హర్షాతిరేకాన్ని చప్పట్ల ద్వారా* *తెలియజేస్తారు . ఆ సంఘటనతో నెహ్రూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతాడు . ఎందుకంటే అతన్ని సపోర్ట్ చెయ్యడానికి , నెహ్రూ అంటే నచ్చని వాళ్ల నోళ్లు నొక్కడానికి అక్కడ గాంధీ లేడు . అప్పటికే ఆయన గాడ్సే చేత చంపబడ్డాడు . వెంటనే స్వామి విధ్యానంద విదేహ్ మైక్ అందుకొని “ ఆర్యులు ఈ దేశానికి శరణార్థులు కారు , ఈ దేశానికి పూర్వీకులు . వాళ్ళే భారతదేశానికి నిజమైన వారసులు . ఈ దేవంలో* *ప్రవహిస్తున్నది ఆర్యుల రక్తమే " . అని నెహ్రూని ఉద్దేశిస్తూ .. నువ్వు , నీ తండ్రి అరేబియా నుంచి వచ్చిన శరణార్థులు . నీ ఒంట్లో ప్రవహిస్తున్నది* *అరబ్బుల రక్తం . ఈ దేశానికి నువ్వు ప్రధానివి కాకుండా సర్దార్ వల్లభాయి పటేల్ అయ్యుంటే ఈ దేశ భవిష్యత్తు మరొక రకంగా ఉండేది అనేటప్పటికి .. ఆ ప్రాంగణం అంతా సభికుల* *హర్షద్వానాలతో దద్దరిల్లిపోతుంది . నెహ్రూ అవమానభారంతో వేదిక దిగి వెళ్ళిపోతాడు . మీడియా అంత ప్రాచుర్యం లేని ఆ రోజుల్లో .. ఉన్న మీడియా గొంతునొక్కి నిజాన్ని నిశీధిలో సమాధిచేశాడు నెహ్రూ . ఆ రోజుల్లో బ్రాహ్మణ వ్యవస్థ నిర్మూలనకి , హిందూమతాన్ని అణగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి* . *ఈ రోజుకు ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉ న్నాయి . అరకొర జీతాలతో తమ కడుపుల్లో ఆకలి మంటలు అగ్నిపర్వతాలు సృష్టించినా .. దైవాన్ని , దేవాలయాలను ఒదలకుండా హిందూ మత సంరక్షణే ధ్యేయంగా నిలబడిన ధీశాలురు మన బ్రాహ్మణులు . వారి ద్వారా మతాన్ని , సంస్కృతి సాంప్రయాలను కాపాడుతున్నారు*

*అసలు హిందూ దేవాలయం లేని దేశం ఈ - భూమ్మీద ఎక్కడైనా ఉందా ? ప్రపంచంలో ఎక్కడ ఎ . ఎటువంటి తవ్వకాలు జరిగినా హిందూ దేవాలయాలకు న సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి . ఎక్కడ దేవాలయం ఉంటుందో అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది . ఈ పవిత్ర భూమిని , హిందూ మతాన్ని పరిరక్షించడానికి భగవత్ ప్రేరణ కలిగిన మహాయోగులు - అదృశ్యంగా కృషిచేస్తూనే ఉంటారు . దానికి నిదర్శనం , శ్రీరామకృష్ణ పరమహంస ప్రేరణతో వివేకానందుడు హిందూ మత విశిష్టతను యూరోపియన్ దేశాల్లో ప్రచారం చేసిన తరువాత , " రాబోయే 15 వందల సంవత్సరాలకు సరిపడా హిందూ విత్తనాలను యూరోపియన్ దేశాల్లో వెదజల్లాను " అంటూ తన జీవితచరిత్ర 




18, నవంబర్ 2021, గురువారం

బ్రహ్మవిద్యను

 మొదటి రెండు అధ్యాయాలలోను బ్రహ్మవిద్య గురించి వచ్చింది; మూడవ అధ్యాయంలో నిర్గుణ బ్రహ్మను సగుణ బ్రహ్మగా చూపించి గురువు ద్వారా బ్రహ్మవిద్యను పొందాలని సూచించింది.


బ్రహ్మవిద్యను గురుశాస్త్ర ఉపదేశం ద్వారానే పొందగలము. అది పొందటానికి మనకు అధికారత్వం కూడా ఉండాలి. ఉదాహరణకు మన అందమైన మొహం మనం చూసుకోవాలనుకుంటే, దానికి ఏం కావాలి? కన్ను, అద్దం.

అద్దం ఎంత బాగున్నా, మన కన్ను కనపడకపోతే మనం అద్దంలో చూసుకోలేము. అలాగే కన్ను ఎంత అందంగా ఉన్నా, అద్దం లేకపోతే మన మొహం చూసుకోలేము. అలాగే ఆత్మజ్ఞానం పొందాలంటే రెండు కావాలి. సంసిద్ధమైన అంతఃకరణం, గురుశాస్త్ర ఉపదేశం. అంతఃకరణం కన్ను లాంటిది; గురుశాస్త్ర ఉపదేశం అద్దం లాంటిది. మనం సంసిద్ధమైన మనస్సుతో లేకపోతే గురువు శాస్త్రం ఎంత చెప్పినా అర్థం కాదు. అలాగే మనం ఎంత సంసిద్ధంగా ఉన్నా, గురుశాస్త్ర ఉపదేశం లేకపోతే ఆత్మజ్ఞానం పొందలేము. ఉపనిషత్తు గురువునూ, శాస్త్రాన్ని కలిపి చెపుతుంది. ఎందుకంటే శాస్త్రంలో ఉన్న విద్యే గురుపరంపరగా వస్తుంది. దాన్నే గురువు శిష్యునికి నేర్పిస్తాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఉదయించవచ్చు. శాస్త్రం అర్థంచేసుకోవటం కష్టమా, తేలికా? ఒకచోట తేలిక అంటుంది. ఒకచోట కష్టం అంటుందిm

. సుసుఖం కర్తుమవ్యయమ్ గీత 9-2


ఈ విద్య నేర్చుకోవటం చాలా తేలిక.


క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తత్కవయో వదని


కథ 1-3-14


విద్య నేర్చుకోవటం క్షురకుని పదునైన కత్తి అంచుమీద నడవటంలాంటిది. ఏది నిజం? రెండూ నిజమే. మనసు సంసిద్ధంగా ఉంటే, బ్రహ్మ విద్యను అర్థం చేసుకోవటం చాలా తేలిక. మనస్సు సంసిద్ధంగా లేకపోతే అర్థం చేసుకోవటం


కేనోపనిషత్తు


చాలా కష్టం. మొదటి రెండు అధ్యాయాలు అర్థమయితే మీ మనస్సు సంసిద్ధంగా ఉన్నట్టు; అర్థం కాకపోతే సంసిద్ధంగా లేనట్టు అర్థం. మనసు సంసిద్ధంగా లేకపోతే నేను వెనక్కి భక్తియోగానికి వెళ్ళిపోతాను అనకూడదు. ఒకసారి జ్ఞానమార్గానికి వచ్చాక, దానిలో కొనసాగటానికి ప్రయత్నించాలి. మనస్సు సిద్ధంగా లేకపోతే సిద్ధం చేసుకోవటమే మార్గం.


అదికూడా ఉపనిషత్తే సూచిస్తుంది. ఇంతవరకూ ఉపనిషత్తు జ్ఞానమార్గం చెప్పి ఇందులో రెండు రకాలు సాధనలు కూడా చెపుతున్నది.


1. కర్మయోగం


2. ఉపాసనాయోగం


గుర్తుంచుకోండి, ఇవి మోక్షాన్ని ప్రత్యక్షంగా ఇవ్వవు. మోక్షం పొందటానికి సహకారీ సాధనలవుతాయి. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఏర్పరుస్తాయి. వాటి తర్వాత మళ్ళీ మొదటి రెండు అధ్యాయాలు చదివితే బాగా అర్థమవుతుంది.


కొంతమంది విద్యార్థులు కొన్నేళ్ళు స్వామీజీ బోధలు విన్నాక, స్వామీజీ ఇప్పుడు మీరు ఇంకా బాగా చెపుతున్నారు అంటారు. అంటే వారికి బాగా అర్థమవుతున్నదని అర్థం. అందువల్ల స్వామీజీ దాన్ని పట్టించుకోకుండా, వారికి విషయం బాగా తెలుస్తున్నదని సంతోషిస్తారు. అందువల్లనే పదే పదే శ్రవణం చేయాలని చెబుతారు. కేనోపనిషత్తు మళ్ళీ మళ్ళీ వినాలంటే ఎవరికైనా బోరు కొడుతుంది కాని, వేరే ఉపనిషత్తు చెబుతారంటే మళ్ళీ శ్రద్ధగా వెళతారు. కొత్త గురువు, కొత్త కేనోపనిషత్తు


చాలా కష్టం. మొదటి రెండు అధ్యాయాలు అర్థమయితే మీ మనస్సు సంసిద్ధంగా ఉన్నట్టు; అర్థం కాకపోతే సంసిద్ధంగా లేనట్టు అర్థం. మనసు సంసిద్ధంగా లేకపోతే నేను వెనక్కి భక్తియోగానికి వెళ్ళిపోతాను అనకూడదు. ఒకసారి జ్ఞానమార్గానికి వచ్చాక, దానిలో కొనసాగటానికి ప్రయత్నించాలి. మనస్సు సిద్ధంగా లేకపోతే సిద్ధం చేసుకోవటమే మార్గం.


అదికూడా ఉపనిషత్తే సూచిస్తుంది. ఇంతవరకూ ఉపనిషత్తు జ్ఞానమార్గం చెప్పి ఇందులో రెండు రకాలు సాధనలు కూడా చెపుతున్నది.


1. కర్మయోగం


2. ఉపాసనాయోగం


గుర్తుంచుకోండి, ఇవి మోక్షాన్ని ప్రత్యక్షంగా ఇవ్వవు. మోక్షం పొందటానికి సహకారీ సాధనలవుతాయి. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత ఏర్పరుస్తాయి. వాటి తర్వాత మళ్ళీ మొదటి రెండు అధ్యాయాలు చదివితే బాగా అర్థమవుతుంది.


కొంతమంది విద్యార్థులు కొన్నేళ్ళు స్వామీజీ బోధలు విన్నాక, స్వామీజీ ఇప్పుడు మీరు ఇంకా బాగా చెపుతున్నారు అంటారు. అంటే వారికి బాగా అర్థమవుతున్నదని అర్థం. అందువల్ల స్వామీజీ దాన్ని పట్టించుకోకుండా, వారికి విషయం బాగా తెలుస్తున్నదని సంతోషిస్తారు. అందువల్లనే పదే పదే శ్రవణం చేయాలని చెబుతారు. కేనోపనిషత్తు మళ్ళీ మళ్ళీ వినాలంటే ఎవరికైనా బోరు కొడుతుంది కాని, వేరే ఉపనిషత్తు చెబుతారంటే మళ్ళీ శ్రద్ధగా వెళతారు. కొత్త గురువు, కొత్త శిష్యుడు, కొత్త ప్రశ్న, కొత్త మార్గంలో జవాబు, కొత్త పద్ధతిలో వివరణ కాని విషయం మాత్రం అదే. బ్రహ్మవిద్య! జీవ, ఈశ్వర ఐక్యం! జ్ఞానం కలుగుతుంది.


అధ్యాయం-4లో 4 అంగాలను చెపుతున్నది ఉపనిషత్తు. 1. బ్రహ్మవిద్యాస్తుతి 2. కర్మయోగ సాధన 3. ఉపాసన సాధన 4. దైవీ సంపత్తి ఈ నేపథ్యంతో అధ్యాయంలోకి అడుగుపెడదాము.


121, కొత్త ప్రశ్న, కొత్త మార్గంలో జవాబు, కొత్త పద్ధతిలో వివరణ కాని విషయం మాత్రం అదే. బ్రహ్మవిద్య! జీవ, ఈశ్వర ఐక్యం! జ్ఞానం కలుగుతుంది.


అధ్యాయం-4లో 4 అంగాలను చెపుతున్నది ఉపనిషత్తు. 1. బ్రహ్మవిద్యాస్తుతి 2. కర్మయోగ సాధన 3. ఉపాసన సాధన 4. దైవీ సంపత్తి ఈ నేపథ్యంతో అధ్యాయంలోకి అడుగుపెడదాము.


121

మనస్సు" ఎలా పనిచేస్తుందో

 మన "మనస్సు" ఎలా పనిచేస్తుందో, శాస్త్రజ్ఞుల యొక్క వివరణ:-


 ఉదాహరణ:- ఒక స్నేహితుడు వచ్చాడు.,  అతన్ని ఆనందంగా లోపలికి ఆహ్వానించాము.


 ఈ యొక్క సంఘటనలో 4 విభిన్న పరిస్థితులు మనస్సులో చోటు చేసుకున్నాయి.,  అవేంటో చూద్దాం


1) Conscious:- అనగా ఎరుక.,  'ఒకడు' వచ్చాడు అని తెలుసుకోవడమే ఈ సంఘటనలో మొదటి పరిస్థితి.


2) Perception:- అనగా గుర్తించటం. ఆ వచ్చిన ఒకరు తన 'స్నేహితుడు' అని గుర్తించడమే రెండవ స్థితి.


3) Sensation:- అనగా అలజడులు. బాధ, ఆనందం, భయం, కోపం, దయ (ఇవి కొన్ని మాత్రమే). ఈ సంఘటనలో చూసిన వెంటనే 'ఆనందం' కలిగినది అనే స్థితి.


4) Reaction:- అనగా ప్రతి స్పందన. పై ఉదాహరణలో 'లోపలికి ఆహ్వానించడమే' ఈ సంఘటనలోని ప్రతి స్పందన.


మన మనస్సు -- ఈ సంఘటన అంతా (4 పరిస్థితులు) ఒక సెకనులోని 10 లక్షల వంతు సమయంలోనే జరుగుతుంది. మనకు ఎంతయితే Sensation ఉంటుందో అంతా Reaction ఉంటుంది.  అందువలన యోగులు Sensation స్థితిలో స్థిరంగా ఉంటారు.

17, నవంబర్ 2021, బుధవారం

శివుడు లయకారుడు

 శివుడు లయకారుడు.. 

    ఎందుకంటే జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు’ ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వారే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు ముగ్గురు సర్వ స్వతంత్రులు అయినప్పటికీ.., ఒకరి విధి నిర్వహణలో మరొకరు తల దూర్చరు. ‘బ్రహ్మ’...సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం. ‘విష్ణువు’...సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. ఈ ధర్మరక్షణ కాస్త కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఒక కుటుంబాన్ని పోషించి, రక్షించడానికి.., యజమాని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది., మోసాలు చేయాల్సి వస్తుంది. 


కేవలం ఒక్క కుటుంబ రక్షణే ఇంత కష్టతరం అయినప్పుడు.., మరి ఈ మాయాజగత్తును పోషించి, రక్షించడమంటే మాటలా! ఈ ధర్మరక్షణ కోసమే ‘శ్రీ మహావిష్ణువు’ ఎన్నో అవతారాలు ఎత్తాడు..,ఎన్నో మాయలు పన్నాడు.., మరెన్నో మోసాలు చేసాడు. ఎలా రక్షించాడు అన్నది అప్రస్తుతం. ఇక్కడ రక్షణే ప్రధానాంశం. ‘మహేశ్వరుడు’...లయకారకత్వం ఈయన ధర్మం. ‘లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. ఇంగ్లీషు భాషలో ‘destroyer’ అనే పదాన్ని వాడతారు. అది తప్పు. ‘absorber’ అనే పదాన్ని వాడాలి. ‘శివుడు’ నాశనకారుడా? ఎంత తప్పు భావన అది. ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం. ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా? ధానికి ఎంతో తపశ్శక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది. ‘లయం’కు నాశనం లేదు. అది శాశ్వతం. భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి.


ఏది అభౌతికమైనది అంటే..‘ఆత్మే’ అభౌతికమైనది. దీనికి చావు పుట్టుకలు ఉండవు. ఈ ఆత్మ దేహధారణ చేస్తే ‘జీవాత్మ’ అవుతుంది. ‘జీవాత్మ’ దేహత్యాగం చేస్తే ‘ఆత్మ’గా మిగిలిపోతుంది.పాంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం..భూమిలోను., అగ్నితత్వం.. అగ్నిలోను., జలతత్వం., జలములోను., వాయుతత్వం..వాయువులోను., శబ్దతత్వం.. ఆకాశంలోను., లయమౌతాయి. ఇక మిగిలివున్న ‘ఆత్మ’ను శివుడు లయం చేసుకుంటాడు. ఎలా? ఉదాహరణకు..., ఒక దీపాన్ని ఊదేస్తే ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరి.. ఎక్కడకు పోతుంది? తన ఉత్పత్తి స్ధానమైన దీపంలోకే వెళ్లి లయమైపోతుంది. తిరిగి దీపాన్ని వెలిగించాలంటే.. దీపం నుంచే దీపాన్ని వెలిగించాలి. అలాగే ఒక మనిషి మరణిస్తే.. ‘చనిపోయాడు’ అంటాం. ‘చని’ అంటే ‘వెళ్లుట’ అని అర్థం. ఎక్కడకు వెళ్లాడు..అంటే..తను వచ్చినచోటుకే వెళ్లాడు. తిరిగి రావాలంటే.. అక్కడనుంచే రావాలి.అంటే.. లయంనుంచే సృష్టి ప్రారంభమౌతున్నదన్నమాట. దీనిని బట్టి మనకు ఏమర్థమౌతోంది? 


దేహం నుంచి విడివడిన ‘ఆత్మ’ తన ఉత్పత్తిస్ధానమైన శివునిలో లయమైపోతుంది. కనుకనే ఆయనను లయకారుడన్నారు. వ్యామోహం లేనివాడే విరాగి. మమకారం ఉన్నచోట స్వార్ధం ఉంటుంది. స్వార్దం ఉన్నచోట లయానికి తావులేదు. కష్ట సుఖాలయందు సమదృష్టి కలవాడే విరాగి. అట్టి విరాగే సర్వాన్ని సమానంగా తనలో లీనం చేసుకోగలుగుతాడు. శివునకు తన దేహంమీదే మమకారంలేదు. చితాభస్మాన్ని పూసుకుంటాడు.. దిగంబరంగా తిరుగుతాడు..భిక్షాటన చేస్తాడు. పుర్రెలో భుజిస్తాడు. రుద్రాక్షలు, పాములు ధరిస్తాడు. శ్మశానంలో నివసిస్తాడు. ఇంతటి విరాగి కనుకనే ఆయన లయకారుడయ్యాడు. సృష్టి, స్ధితులకు ఆద్యుడయ్యాడు. సర్వజగత్తుకు ఆరాధ్య దైవమయ్యాడు.


#హారహారమహాదేవ్ #ఓంనమఃశివాయ 


       ॐ సర్వం శివమయం జగత్ ॐ


           ॐ ఓం నమఃశివాయ ॐ


🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩

భారతీయత ఔన్నత్యం*

   *భారతీయత ఔన్నత్యం*


🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


కారుమేఘాలు కమ్ముతుఃన్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 🙏

             ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

        *అదీ .. సంస్కారం !* 🙏

              .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! 

       *అదీ .. నమ్మకం !* 🙏

             ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

        *అదీ .. ఆచారం !* 🙏

            ..............................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!* 🙏

           ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

       *అదీ .. పద్ధతి !* 🙏

         ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…!

     *అదీ .. సంస్కృతి!*🙏

       ..............


భార్య పక్షవాతానికి లోనయ్యింది. 

మంచం దిగలేని పరిస్థితి 

తనంతట తానుగా.. 

తనువీడ్చలేని స్థితి.

భర్త భరోసాగా నిలచి..భారమంతా మోస్తాడు-అన్నీతానై .. అలిని సాకుతాడు…!

       *అదీ .. దాంపత్యం!* 🙏

             .....................


బ్రతికే అవకాశం తక్కువ

వెంటిలేటర్ పై వేచిచూస్తే

బ్రతికితే బ్రతకొచ్చు!

లక్షల ఖర్చు భరిస్తూ

వెంటిలేటర్ పై పెడతారు… !

          *అదీ .. అనుబంధం!* 🙏


 

*ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సంప్రదాయలు, విలువలు, ఔన్నత్యం కొన్ని మాత్రమే* 


*ఇది భారతీయల ఆత్మ తత్త్వం* 


*సమస్త లోక సుఖినోభవంతు*


‌🙏🙏🙏🙏🙏