29, డిసెంబర్ 2023, శుక్రవారం

శ్రీ మదగ్ని మహాపురాణము

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*

.                *భాగం - 36*

*ప్రథమ సంపుటము, అధ్యాయము - 14*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱


*పాండవ చరిత వర్ణనము - 1*


అథ పాణ్డవ చరిత వర్ణనమ్‌.


అగ్నిరువాచ :


యుధిష్ఠరే తు రాజ్యస్థే ఆశ్రమాదాశ్రమాన్తరమ్‌ | ధృతరాష్ట్రో వనమగాద్గాన్ధారీ చ పృథా ద్విజత 1


అగ్ని పలికెను: ఓ ద్విజుడా! యుద్ధిష్ఠురుడు రాజ్యము చేయుచుంéడగా ధృతరాష్ట్రడును, గాందారియు, కుంతియు, అరణ్యమునకు వెళ్ళి ఒక ఆశ్రమమునుండి మరి యొక ఆశ్రమమునకు సంచరించుచుండిరి.


విదురస్త్వగ్ని నా దగ్ధో వనజేన దివం గతః | ఏవం విష్ణుర్భువో భారమహరద్ధానవాదికమ్‌. 2


ధర్మాయాధర్మానాశాయ నిమిత్తీకృత్య పాణ్డవాన్‌ | స విప్రశాపవ్యాజేన ముసలేనాహనత్కులమ్‌. 3


యాదవానాం భారకరమ్‌-


విదురుడు దావాగ్నిచే దగ్ధుడై మృతి చెందెను. ఈ విధముగ మహావిష్ణువు పాండవులను నిమిత్తముగ చేసి కొని, ధర్మరక్షణముకొరకును, అధర్మవినాశమునకు, పూనుకొని దానవాదిక మగు భూభారమును హరించెను. విప్రశాప మను వంకచే, ముసలముచే, భూభారకర మగు యాదవకులమును నశింపచేసెను.


వజ్రం రాజ్యే7భిషేచయత్‌ | దేవాదేశాత్ర్పభాసే స దేహం త్యక్త్వా స్వయం హరిః 4


ఇన్ద్రలోకే బ్రహ్మలోకే పూజ్యతే స్వర్గవాసిభిః | బలభద్రో7నన్తమూర్తిః పాతాల స్వర్గమీయివాన్‌. 5


శ్రీకృష్ణుడు వజ్రుని రాజ్యాభిషిక్తుని చేసి దేవతల ఆదేశమునే ప్రభాసక్షేత్రమునందు తన దేహమును పరిత్యజించి, ఇంద్రలోక బ్రహ్మలోకములందు స్వర్గవాసులచే పూజింపబడెను. బలరాముడు ఆదిశేషరూపధారి యై పాతాళ స్వర్గము చేరెను.


అవినాశీ హరిర్దేవో ధ్యానిభిర్ధ్యేయ ఏవ సః | వినా తం ద్వారకాస్థానం ప్లావయామాస సాగరః. 6


వినాశరహితు డగు ఆ శ్రీ హరి యోగులచే ధ్యానింపబడు వాడు. అట్టి శ్రీ కృష్ణుడు లేని ద్వారకను సముద్రము ముంచివేసెను.


సంస్కృత్య యాదవాన్‌ పార్థో దత్తోదకధనాదికః | స్త్రియో7ష్టావక్రశాపేన భార్యా విష్ణోశ్చ యాః స్థితాః. 7


పునస్తచ్ఛాపతో నీతా గోపాలైర్లగుడాయుధై ః | అర్జునం హి తిరస్కృత్య పార్థః శోకం చకార హ. 8


వ్యాసేనాశ్వాసితో మేనే బలిం మే కృష్ణసన్నిధౌ య | హస్తినాపురమాగత్య పార్థః సర్వం న్యవేదయత్‌. 9


యుధిష్టిరాయ స భ్రాత్రే పాలకాయ నృణాం తదా |


అర్జునుడు యాదవులకు ప్రేత సంస్కారాదులు చేసి ఉదకధనాదిదానములు చేసెను. 


అష్టావక్రుని శాపముచే విష్ణుభార్యలుగా అయిన స్త్రీలను, మరల అతని శాపము చేతనే, కఱ్ఱలు ఆయుధములుగా గల రోపాలకులు అర్జునుని ఓడించి తీసికొని పోయిరి. అర్జునుడు చాల శోకించెను. 


వ్యాసు డాతనిని ఊరడించెను. కృష్ణుడున్నప్పుడే నా బలము అని అతడు గ్రహించెను. అతడు హస్తినాపురమునకు వచ్చి, రాజ్యపాలకు డైన యుధిష్ఠిరునకు ఇది యంతయు చెప్పెను.

సశేషం....


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱

శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*

.                  *భాగం - 4*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*

.  *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*

                      --/--


వ్యాఘ్రేశ్వరశర్మ భక్తికి సంతసించి ఆ తపస్వి 

ఓంకారము నేర్పి",శ్రీపాదరాజం శరణం ప్రపద్యే"అని వల్లెవేయమనిరి.అలా వల్లేవేయుచూ వ్యాఘ్ర రూపంలోనే‌ కురుపురం సమీపమునకు చేరుకొనెను.

కురుపురం చేరుకోవలనంటే జలమార్గములో పోవలెను. అప్పుడు శ్రీపాదుల వారు తన భక్తజన సందోహం లోవున్నారు. 

వ్రాఘ్రేశ్వరశర్మ పిలుపు విని ఆనీటిమీద నడుచుకుంటూ ఆవలి ఒడ్డున వున్న తన పరమ‌ భక్తుడైన వ్యాఘ్రేశ్వరశర్మ‌ వద్దకు వెళ్ళి ఆయన పూజలు అందుకొని ఆ పులిని అధిరోహించి ఆ నీటిపై వచ్చినదారంటే తేలియాడుతూ  కురుపురం చేరారు.అటు ఒడ్డుకు  చేరి ఆపులి ని స్వామివారు కృపా దృష్టి తో చూడగా ఆ పులి అసువులు బాసి మహా పురుషునిగా బాసిల్లగా అచ్చటి స్వామి వారి భక్తులు ఆశ్చర్యానాందాలకు అంతులేకుండెను.

వ్యాఘ్రేశ్వరశర్మ  పలువిధాల స్వామివారిని ప్రార్ధించగా స్వామివారు కరుణించి వ్యాఘ్రేశ్వరశర్మ ఎప్పుడుకావాలంటే అప్పుడు పులి రూపంలో సంచరించగలడని,తాను ఎల్లప్పుడూ ఆ భక్తుని గుర్తుగా పులిచర్మం ధరించి బాసిల్లుతానని వరమిచ్చి యోగమార్గములో ప్రకాశించమని అన్నారు. అప్పటినుండి వ్యాఘ్రేశ్వరశర్మ  తపస్వు చేసుకుంటున్న మహాయోగులకు సామాన్య జనులవలన ఆటంకం‌ కలగకుండా శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకుంటూ ఆమహాత్ముల గృహాలకు కాపలా వుంటున్నాడని ఆ వృద్ద తపస్వి శంకరభట్టుకు తెలియజేసెను. ఈవిధంగా తన ప్రయాణంలో జరిగిన విషయాలు,తాను తెలుసుకున్న అనుభవాలు మననంచేసుకుంటూ శ్రీపాదుల వారి నామస్మరణం చేసుకుంటూ ప్రయాణం సాగిస్తూ మార్గమధ్యంలో పుణ్య తీర్ధములు దర్శించుకుంటూ యాచించకుండా దొరికిన భోజనము స్వీకరిస్తూ  పాండ్యదేశంలో కదంబవనం అనే 2వ మజిలీకి చేరుకున్నాడు.

రేపు శంకరభట్టు రెండవ మజిలీలో కలిగిన అనుభవాలు చెప్పుకుందాం.


*🙏దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా.🙏*


*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

.           *🌹శ్రీమద్భగవద్గీత🌹*

.           *ప్రధమ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

.         *అర్జున విషాద యోగము*

.                *శ్లోకము 4.5.6*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷



*అత్ర శూరా మహేష్వాసా* 

*భీమార్జునసమా యుధి ।*

*యుయుధానో విరాటశ్చ* 

*ద్రుపదశ్చ మహారథః ।। 4 ।।*


*ధృష్టకేతుశ్చేకితానః* 

*కాశీరాజశ్చ వీర్యవాన్ ।*

*పురుజిత్ కుంతిభోజశ్చ*

 *శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।।*


*యుధామన్యుశ్చ విక్రాంత* 

*ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।*

*సౌభద్రో ద్రౌపదేయాశ్చ*

 *సర్వ ఏవ మహారథాః ।। 6 ।।*   

                                                                                                                                             అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు;                                                                                    భీమ-అర్జున-సమాః  — భీముడు అర్జునుడులతో సమానమైన;                                                                                                                                          యుధి — యుద్ధములో; యుయుధానః  — యుయుధానుడు;                                                                                                                             విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు;                                                                                                                              చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలము కల యోధులు                                                         ధృష్టకేతు — ధృష్టకేతుడు; చెకితానః — చేకితానుడు; కాశీరాజః  — కాశీరాజు;                                                                                                            చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు;                                                                                                                  కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు;                                                                                                                         చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు;                                                                                                                        యుధామన్యుః  — యుధామన్యుడు; చ — మరియు;                                                                                                                                    విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః  — ఉత్తమౌజుడు; చ — మరియు;                                                                                                             వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః   — సుభద్ర కుమారుడు;                                                                                                                                    ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును;                                                                                                                   ఏవ — నిజంగా; మహా-రథాః  — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలము కల యోధులు.   

                                                                                               భావము:  వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి - యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చెకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు - వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఉన్నటువంటి - ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, ద్రౌపది పుత్రులు - వీరందరూ యుద్ధ వీరులే.

(రాబోయే పెను విపత్తు భయానికి, పాండవులు సమీకరించిన సైన్యం, ఉన్న దాని కన్నా చాలా ఎక్కువగా అనిపిస్తోంది, దుర్యోధనుడికి. తన ఆందోళనని వ్యక్తం చేస్తూ, పాండవుల పక్షంలోనున్న మహారథుల (పదివేల సాధారణ యోధుల బలంతో సమానమైన యోధులు) ను చూపాడు.  పాండవ పక్షం లో వున్న గొప్ప నాయకులను దుర్యోధనుడు పేర్కొన్నాడు. వీరందరూ భీమార్జునులతో సమానమైన యోధులు మరియు యుద్ధంలో గట్టి పోటీ ఇచ్చేవారే.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ప్రథమ స్కంధము*


*అన్నా! ఫల్గున! భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా*

*పన్నానీక శరణ్యు డీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీ*

*మన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుధర్మామధ్య పీఠంబునం*

*దున్నాడా? బలభద్రు గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్.*


నాన్నా! అర్జునా! మన సారథి మన సచివుడు ఇంకా ఎన్నెన్నో అయిన కృష్ణయ్య, భక్తులయందు పరమవాత్సల్యం కలవాడు. బ్రహ్మజ్ఞానమే ఆకారం అయినవాడు, గోవులకు ఆనందం కలిగించేవాడు, ఆపదలలో వేదనలు పొందే భక్తుల సముదాయాలకు సంరక్షణ కూర్చేవాడు, ప్రభువు, జగత్తులకు శుభాలను అమర్చిపెట్టేవాడు, చక్కని కాంతులతో అప్పుడప్పుడే వికసించిన తామరరేకులవంటి కన్నులున్న మహాత్ముడు, దేవలోకంలో సుధర్మ అనే దేవసభలో కొలువుతీరి ఉన్న దేవేంద్రునిలాగా ద్వారకలో తన కొలువులో సింహాసనం మీద అన్న బలరామునితో కూడి సుఖంగా, ఉత్సాహంగా ఉన్నాడా?


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

పెరియ పురాణం

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 42*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*కలిక్కంబ నాయనారు*


తిరు పెణ్ణాగడం అనే నగరంలో ఒక వైశ్య కుటుంబంలో జన్మించిన

శివభక్తుడు కలిక్కంబ నాయనారు. శివభక్తులను శివుని సాక్షాద్రూపంగా

భావించి గౌరవ మర్యాదలతో వారికి సేవలు చేస్తూ వచ్చాడు. రోజూ

షడ్రసోపేతమైన వంటకాలను సిద్ధం చేయించి వచ్చిన శివభక్తులకు

లేదనకుండా సంతృప్తిగా వడ్డించేవాడు.


ఒక రోజు యథా ప్రకారం శివభక్తులు కలిక్కంబ నాయనారు ఇంటికి

వెళ్లారు. అతని భార్య నీళ్లు పోస్తుండగా నాయనారు శివభక్తుల పాదాలను

ప్రక్షాళనం చేస్తూ వచ్చాడు. నాయనారు ఈ విధంగా చేస్తూ ఒక శివభక్తుని

పాదాలు పట్టుకొని కడగడం ప్రారంభించాడు. కాని అతని భార్య నీళ్లు

పోయలేదు. 


భార్య నీళ్లు పోయకుండ ఉన్నందులకు కారణమేమిటని అతడు ఆలోచించాడు. వెంటనే నాయనారు భార్య ఆ శివభక్తుని చూపించి "ఇతడు

మన ఇంట్లో పరిచారకుడుగా ఉండేవాడు" అని చెప్పింది. నాయనారు

తీవ్రమైన కోపంతో కరవాలాన్ని దూసి భార్యచేతిని ఖండించాడు. తరువాత

వారే నీటి పాత్రను తీసుకొని నీళ్ళుపోసి ఆ శివభక్తుని పాదాలకు అభిషేకం

గావించాడు. పరమేశ్వరుడు అతని శివభక్తికి ప్రసన్నుడై అతనికి శివలోక

పదవిని అనుగ్రహించాడు.


*నలభైరెండవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 130*


*అమృతం కన్నా రుచికరం*


ఖేత్రీలో  ప్రజలు తండోపతండాలుగా స్వామీజీ వద్దకు వచ్చారు. స్వామీజీ వారితో ఎడతెగకుండా మాట్లాడుతూనే ఉన్నారు. స్వామీజీ మాటల్లోనే ఆ సంఘటన గురించి విందాం: 


"నమ్మశక్యం కాదు, కాని ఎడతెగకుండా  మూడు రాత్రుళ్లు పగళ్లు నాకు క్షణం కూడా విశ్రాంతి లేదు, నిద్రాహారాలు లేవు. ఎవరూ ఈ విషయం పట్టించుకొన్నదీ లేదు. వారు వస్తూనే ఉన్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. మూడవ రోజు రాత్రి అయింది. అప్పటికి అందరూ వెళ్లి పోయినట్లున్నారు. అప్పుడు నిమ్నకులానికి చెందిన ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు. 


'స్వామీజీ! మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా మీరు మాట్లాడుతూనే ఉండడం నేను గమనిస్తూనేవున్నాను. నా మనస్సు ఆవేదనతోతల్లడిల్లిపోతున్నది. ఆకలీ, అలుపూ మీకు కూడా ఉంటాయి కదా! ఒక గ్లాసు నీరు కూడా మీరు త్రాగలేదు!' అన్నాడు ఆప్యాయతానురాగాలు ఉట్టిపడే స్వరంలో, అతడి ప్రేమాభిమానాలు నన్ను కదలించివేశాయి. 


'తినడానికి నువ్వు ఏమైనా ఇస్తావా?' అని అడిగాను. 'ఇవ్వాలనే నా మనస్సు తహతహ చెందుతున్నది. కాని ఏం చేయగలను? నేను నిమ్న కులస్థుణ్ణి, చెప్పులు కుట్టేవాణ్ణి. నేను చపాతీలు తయారుచేసి మీకు ఇవ్వలేను. పిండి తదితర పదార్థాలు తీసుకొచ్చి ఇస్తాను. మీరే చేసుకొని తినండి' అన్నాడతడు. 


అందుకు నేను. 'ఫరవాలేదు. నువ్వే తయారుచేసి పట్రా! నేను తింటాను' అన్నాను. అతడు హడలిపోయాడు. చెప్పులు కుట్టే వాడయిన అతడు ఒక సన్న్యాసికి ఆహారం ఇచ్చాడని తెలిస్తే శిక్షింపబడతాడు; అంతేకాదు దేశబహిష్కరణ చేస్తారు కూడా. కాని నేను అతణ్ణి సాంత్వన పరిచాను; 'నీకు శిక్ష పడకుండా నేను చూసుకొంటాను' అని వాగ్దానం చేశాను. 


అతడు నా మాటలను అంతగా నమ్మినట్లులేదు. కాని నా పట్లగల అభిమానంకొద్దీ చపాతీలు తీసుకొచ్చాడు. నేను వాటిని తిన్నాను. దేవేంద్రుడు ఒక బంగారు కలశంలో అమృతాన్ని తెచ్చి ఇచ్చినా, అది కూడా ఇంత రుచిగా ఉండదని నాకు అనిపించింది.  నా హృదయం ప్రేమతోను, కృతజ్ఞతతోను పొంగిపొరలింది.కళ్లు చెమ్మగిల్లాయి.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

శివానందలహరీ – శ్లోకం – 43*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.      *శివానందలహరీ – శ్లోకం – 43*

.        శ్రీ ఆదిశంకరాచార్య విరచితం

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱


*మా గచ్ఛ త్వమితస్తతో గిరిశ భో మయ్యేవ వాసం కురు*

*స్వామిన్నాదికిరాత మామకమనఃకాన్తారసీమాన్తరే ।*

*వర్తన్తే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ-*

*స్తాన్ హత్వా మృగయావినోదరుచితాలాభం చ సమ్ప్రాప్స్యసి ॥*



ఓ కైలాసవాసా! నీవు అటు ఇటు పోకుము నాయందే నివసించుము. ఆదికిరాతమూర్తీ! దేవా! నా మనస్సనే మహారణ్య ప్రాంతంలో మాత్సర్యము, మోహము మొదలైన అనేక మదించిన మృగములున్నవి. వాటిని చంపి వేటయందలి నీ ఆనందమును తీర్చుకొందువు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

మిఠాయి సత్యం:

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

మిఠాయి సత్యం:


మా ఊర్లో సత్యంగారనే వారు

ఉండేవారు.ఉదయం పదిగంటల నుంచి

జంతికలు,చెగోడీలు,బజ్జీలు,బెల్లం మిఠాయి

ఉండలు చేసి అమ్మేవాడు.


ఎవరింట్లో‌ఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి  చేయించుకొనే

వారు.దానాదీనా ఆయనకి మిఠాయి సత్యం గారు అనే‌పేరు స్థిరపడిపోయింది.


ఎందుకు ఆయన గురించి చెపుతున్నా నంటే

ఆయన చదువుకోకపోయినా‌ మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు.తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు,హరికథలు వినేవాడు.


ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ,అనేక రూపాల్లో ఉన్నా

భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు.


ఈ సత్యం గారు హరికథ కులకు, స్వామీజీ లకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు.


అయ్! అర్థమయింది. ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే:


సెనగపిండి (మూలమనుకోండి)

1.సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి.

2.లావుగొట్టంలో సుడితే జంతికలు

3.అదే‌సెనగపిండిని సట్రంలో కొట్టి,యేరు సెనగ,పుట్నాలు,అటుకులు ,కర్వేపాకు యేపి

కలిపితే కారంబూంది అవుద్ది.

4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి

పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు

ఔతుంది.

5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే 

మైసూరు పాక్ అవుతుంది.

6.అదే సెనగపిండి ‌పల్చగా కలిపి, మిరపకాయ ముంచి‌వేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ ‌బజ్జీలు.

7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,అల్లం,కలిపి‌వేయిస్తే

పకోడీయండి.


ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు,మనకి శివుడుగా

యిష్ణువుగా,ఆంజనేయుడుగా,గణపతిగా

ఎన్నో రూపాలు గా కనపడతాడండి ఆయ్.


మనం ఎలా కొలిచినా,పిలిచినా పలికే‌శక్తి‌‌ ఒహటేనండి.ఆయ్! నాకరదమయినకాడికి

సెప్పేనండి అన్నాడు ‌సత్యంగారు.


ఆనాటి స్వామీజీ లు కనుక ఆయన తనకు అంతకు ముందే సభానిర్వాహకులు కప్పిన ‌శాలువ‌సత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ ‌మాటన్నారు.


ఇన్ని ‌శాస్త్రాలు‌‌చదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువు గా చెప్పలేను.


నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.


సభంతా చప్పట్లు మోత.

                 ***

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం  -‌ ద్వితీయ -  పుష్యమి  -‌ భృగు వాసరే* *(29-12-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/zF8tFh5Mw6A?si=7QZTssHwid1gfmL_


🙏🙏

శుక్రవారం (భృగు వాసరః ) రాశి ఫలితాలు

 శుభోదయం

16.2291923113

*****

29-12-2023 

శుక్రవారం (భృగు వాసరః )

రాశి ఫలితాలు

********

మేషం

దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంభంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది

--------------------------------------

వృషభం

సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

--------------------------------------

మిధునం

ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి.

--------------------------------------

కర్కాటకం

ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.

---------------------------------------

సింహం

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

---------------------------------------

కన్య

ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తులాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది.

---------------------------------------

తుల

విద్యార్థులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.

---------------------------------------

వృశ్చికం

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. .ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.

---------------------------------------

ధనస్సు

సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు.

---------------------------------------

మకరం

 చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.

---------------------------------------

కుంభం

కీలక సమయంలో సన్నిహితుల  సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

---------------------------------------

మీనం

ఉద్యోగాలలో అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి.  అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి.

---------------------------------------