16, డిసెంబర్ 2020, బుధవారం

ముఖ్యమైన పండుగలు

 🕉 *మార్గశిర మాసం లో ముఖ్యమైన పండుగలు నిర్ణయం......*🙏

1.తేది.15-12-2020 మంగళవారం రోజున (ధనుర్ సంక్రమణం)

2.తేది.16-12-2020 బుధవారం రోజున (ధనుర్మసారంభం)

3.తేది.20-12-2020 ఆదివారం రోజున (శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి)

4.తేది.25-12-2020 శుక్రవారం రోజున (ముక్కోటి వైకుంఠ ఏకాదశి, శ్రీ రంగాది సమస్త విష్ణు క్షేత్రేషు వైకుంఠ ద్వార దర్శనం భాగవత జయంతీ,గీతాజయంతీ)

5.తేది.26-12-2020 శనివారం రోజున (శ్రీ మత్స వాసుదేవ ద్వాదశి)

6.తేది.29-12-2020 మంగళవారం రోజున (శ్రీ దత్తాత్రేయ జయంతి)

7.తేది.30-12-2020 బుధవారం రోజున( శ్రీ రమణ మహర్షి జయంతి, పౌర్ణమి🌕)

8.తేది.1-1-2021 శుక్రవారం రోజున (నూతన ఆంగ్ల సంవత్సరాది)

9.తేది.2-1-2021 శనివారం రోజున (సంకష్టహర చతుర్ధి వ్రతం)

10.తేది.9-1-2021 శనివారం రోజున (సుఫలైకాదశి, సర్వేషాం ఏకాదశి)

11.తేది.11-1-2021 సోమవారం రోజున (మాసశివరాత్రి)

12.తేది.12-1-2021 మంగళవారం రోజున (పితృ తర్పణం,  శ్రాద్ధ తిథి అమావాస్య  రాత్రి  ఉంటుంది⚫)

13.తేది.13-1-2021 బుధవారం రోజున (అమావాస్య ఉదయం 10-54 వరకు ఉంటుంది... కావున మంగళవారం రోజున అమావాస్య)

........................................

🌹🚩 మకర సంక్రాంతి నిర్ణయం🌹🚩

1.తేది.13-1-2021 బుధవారం రోజున ( భోగి పండుగ,గోదా కళ్యాణం)

2.తేది.14-1-2021 గురువారం రోజున (మకర సంక్రాంతి)

3.తేది.15-1-2021 శుక్రవారం రోజున (కనుమ పండుగ)

🌹మకరసంక్రాంతి నిర్ణయం🌹

ఈ సంవత్సరం పుష్య శుద్ధ పాడ్యమి తేది.14-1-2021 గురువారం రోజున పగలు 1-54 ని.లకు శ్రవణ నక్షత్రం వజ్రనామయోగం బాలవ కారణము నందు రవి మకరరాశి ప్రవేశం.మకర సంక్రాంతి పురుష స్వరూపం మూడు శిరస్సు లు, రెండు ముఖములు, నాలుగు నాలుకలు, వికృతమైన శరీరచ్చాయ, నూరు యోజనముల ఎత్తు , పన్నెండు యోజనముల వెడల్పు గలిగిన భీకరాకారం.......

1.అస్యపురుషస్య మిశ్రనామ్- విప్రనాశనము

2.వేపాకు స్నానం-రోగభయం

3.రక్తవస్ర్తమ్- రోగదాయకము

4.చందనగంధలేపనము-విప్రనాశనము

5.జాజిపుష్పమ్- సుశోభనము

6.ముత్యము ఆభరణమ్- శుభదాయకము

7.వెండిపాత్రమ్-సుభిక్షము

8.పాయస ఆహారము-పశునాశనము

9.అరటిపండు భక్షణమ్-ఫలనాశనము

10.భిండి ఆయుధమ్-చతుష్పాత్తులకు నాశనము చేయుట

11.రక్త ఛత్రమ్-మహాయుద్ధము

12.పులివాహనమ్- మృగనాశనము

13.క్రోధముఖమ్-జననాశనము

14.కూర్చోనియుండు-మధ్యార్ఘము

15.దక్షిణదిక్క గమనము-దక్షిణదేశ నాశనము

16.శుక్లపక్షము-దుర్బిక్షము

17.పాడ్యమి తిథి-శుభప్రదము

18.గురువారము-సుభిక్షము, ఆరోగ్యం

19.కాలఫలమ్-విప్రనాశనము

20.మేషలగ్నమ్-జగత్తుకు ఆనందము కలుగును...

🕉అథః మౌఢ్య నిర్ణయం🕉

1.తేది.17-1-2021 పుష్య శుద్ధ చవితి ఆదివారం మొదలు మాఘ మాసం శుద్ధ షష్టి బుధవారం తేది.17-2-2021 వరకు గురు మౌఢ్యమి ఉంటుంది.(కావున భూమి పూజ లు, గృహప్రవేశం లు, నిశ్చితార్థం లు, పెండ్లి లు నుండిజరుపు కోవడం పనికిరావు)

       మరల

2.ఆస్మిన్ వర్షే మాఘ మాసం శుద్ధ తదియ ఆదివారం తేది.14-2-2021నుండి స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర బహుళ పాడ్యమి బుధవారం తేది.28-4-2021 రోజున శుక్రమౌఢ్యమి నివృత్తి, అయిపోతుంది)

........................................🕉 స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర బహుళ తదియ గురువారం తేది.29-4-2021 రోజు నుండి శుభకార్యములు ప్రారంభం జరుపుకోవాలి...

🕉 శుభం-భవతు🕉

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

దీర్ఘాయుష్మాన్ భవ

 దీర్ఘాయుష్మాన్ భవ అంటే?


చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు. 


“భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”


మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని అశీర్వదిస్తాము అదే సంప్రదాయము” అని అన్నారు. 


”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు. 


”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం. 


మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు. 


పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.


సంస్కృత వాక్యం “దీర్ఘాయుష్మాన్ భవ” అనునది చాలా సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయిననూ అర్థమగును. కానీ  మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.


వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు ”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు. 


”పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము, 11 కరణములలో ఒకటి భవకరణము, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటే ‘ఆయుష్మాన్-యోగము’, ‘భవ-కరణము’, ‘సౌమ్యవాసరము-బుధవారము’ కలిసి వస్తాయో అది శ్లాగ్యము - అంటే చాలా శుభప్రదము మరియు యోగ కారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక” అని అర్థం. 


ఈ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి, అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించారు.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

తలరాత

 Forwarded.....


ఒకసారి ఒక వ్యక్తికి దారిలో యమధర్మరాజు కలిశారు. 

అయితే ఆ వ్యక్తికి  అతను యమధర్మరాజని తెలియదు. 

యమధర్మరాజు ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. 

ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే,

కానీ దాహం అని అడిగినందుకు అతను యమధర్మరాజుకు *నీళ్లు* ఇచ్చి దాహం తీర్చాడు. 


నీళ్లు తాగిన తర్వాత యమధర్మరాజు ఆ వ్యక్తితో, నేను నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన యమునిని... కానీ! నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని, యమధర్మరాజు ఆ వ్యక్తికి  ఒక *డైరీ* ఇచ్చారు. 

నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అదే *జరిగి తీరుతుంది* 

కానీ గుర్తుంచుకో... 

నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే....

ఆ వ్యక్తి  ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. 


మొదటి పేజీలోనిది చదివాడు... 

అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు" అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు, అని రాశాడు. 


తర్వాత పేజీ చదివాడు...

"తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాసైయ్యి మంచి ఉద్యోగం రాబోతోంది " అది చదివి అతడు ఫెయిల్ అయ్యిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు, అని రాశాడు.


 తర్వాత పేజీలో "తన స్నేహితురాలకి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురికీ ఒకటి చేస్తుంది" అని చదివి వెంటనే అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాసాడు,


ఈ విధంగా ప్రతి పేజీనీ చదువుతూ....

ఏదో వొకటి రాస్తూ...

 

చివరికి...! 

ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా... 

ఈలోపే  యమధర్మరాజు ఆ వ్యక్తి చేతినుండి  డైరీని తీసుకుని, 

నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. *నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే, నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చినా... స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని, చావుదాకా తెచ్చుకున్నావు* 

నీ యొక్క మృత్యువు  నిశ్చితం అయింది అని డైరీ తీసుకున్నాడు  యముడు. 

ఆ వ్యక్తి  చాలా పశ్చాతాప పడ్డాడు. వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ తనువును చాలించాడు.


 ఈ కథ యొక్క *అర్థం* ఏమిటంటే భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో *అద్భుతమైన అవకాశాలను*

తానే స్వయంగా గానీ...

బంధుమిత్రులు,

శ్రేయోభిలాషులు, 

ఇరుగుపొరుగువారు,

బాటసారుల రూపంలో గాని మనకు పంపిస్తాడు. 

కానీ మనము వ్యర్థము ఆలోచిస్తూ *ఇతరులకు చెడు చేస్తూ* మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాము. 

ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా *భగవంతుని కృప నిండి ఉంటుంది.* 


ఈ సంగమయుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి  

"మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి" అని ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు. 

కానీ మనము పర చింతన చేస్తూ సమయము  వృధా చేసుకుంటున్నాము. మన అదృష్టాన్ని మనమే వంచన చేసుకుంటున్నాం... 


అందరూ బాగుండాలి... 

అందరిలో నేనుండాలి...

సర్వేజనా సుఖినోభవంతు!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే

 ఆంధ్రప్రదేశ్: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు - జనవరి 1 నుంచి అమలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన మోటార్ వాహనాల చట్టం-2021 జనవరి 1 నుంచి అమలు కానుంది. ఈ చట్టం ప్రకారం- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు భారీగా పెరగనున్నాయి. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్​ను క్రమబద్ధీకరించేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

 

కొత్త చట్టం ప్రకారం విధించే జరిమానాల వివరాలు:

 

* హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే రూ.1,035 జరిమానా. హెల్మెట్ లేకుండా నడుపుతూ రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా. 

* మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ.5,035 జరిమానా. ఇదే కేసులో రెండోసారి పట్టుబడితే రెట్టింపు జరిమానా.

* డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.5 వేలు, రెండోసారి పట్టుబడితే రూ.10 వేల జరిమానా.

* అధిక వేగంతో వాహనం నడిపితే రూ.1,035 జరిమానా.

* రెడ్​ సిగ్నల్ నిబంధన అతిక్రమిస్తే రూ.1,035 జరిమానా.

* మైనర్లకు వాహనం ఇస్తే రూ.5,035 జరిమానా.

* వాహనానికి సరైన ధ్రువపత్రాలు లేకుంటే రూ.2 వేలు జరిమానా. ఇవి లేకుండా రెండోసారి పట్టుబడితే రూ.5 వేల జరిమానా.

* పర్మిట్ లేని వాహనానికి రూ.10 వేలు, ఓవర్ లోడ్​కు రూ.20 వేల జరిమానా.

* అంబులెన్స్, ఫైరింజన్లకు దారి ఇవ్వకపోతే రూ.10 వేల జరిమానా.

* పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు సిఫారసు.

కొబ్బరికాయ కొట్టడం

 🍀🍀🍀🍀🍀🍀🍀🍀     దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం వల్ల అర్ధం ఏమిటి? అంటే తమోగుణ ప్రధానమైన అహంకారం అనే పెంకును పగలకొట్టాలి. రజోగుణ ప్రధానమైన సంపదను అంటే గుజ్జును అంటే కొబ్బరికాయ లో ఉండే గుజ్జు అన్నమాట. సత్త్వగుణ ప్రధానమైన కొబ్బరికాయ లోని నీళ్లు దేవుని కి సమర్పించాలి. అందుకే మన పూర్వీకులు కొబ్బరికాయ ను ఎన్నిక చేశారు. వారు ఏంచేసినా అర్థం, అంతర్ధం ఉంటుంది.           🍀🍀🍀🍀🍀🍀🍀🍀      దేవుడి కి అరటిపండు సమర్పించడంలో అర్థం ఏమిటి? అంటే అరటి చెట్టు తన జీవితకాలం లో ఒకే ఒక్క సారి అరటి గెలను ఇస్తుంది. అలా వచ్చిన అరటిపండ్లు ను ఆ భగవంతుని కి సమర్పించు కొంటున్నాము. 84లక్చల జీవరాశులలో మానవ జన్మ ఒక్క సారే వస్తుంది. అరటిపండ్లు ను ఆదర్శంగా తీసుకుని నిన్ను నీవు భగవంతుని కి సమర్పించుకో అని అర్థం. మన ఆచారాలను గౌరవించండి. వాటిని పాటించండి. మనం పాటించితే మన పిల్లలు, మనవలు చూసి ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్తారు. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

సేకరణ 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

మొగలిచెర్ల

 *స్వామివారి నిజరూప ప్రతిమ..(రెండవ భాగం)*


సరిగ్గా స్వామివారి ఆరాధన పదిరోజుల ముందు..శ్రీ స్వామివారి ప్రతిమ మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరింది..ఆ ప్రతిమను ఒక గాజు పేటిక లో పెట్టి, మంటపం లో ఉంచితే..భక్తులందరూ చూడటానికి అనువుగా ఉంటుందని భావించాము..భక్తులందరికీ చక్కగా...ఏ వైపు నుంచి చూసినా.. కనబడే విధంగా పేటిక కావాలి..తయారు చేసే పనివాళ్లను పిలిపించాము..కొలతలు తీసుకొని వెళ్లారు..నాలుగైదు రోజుల్లో తయారు చేసి ఇస్తామన్నారు..సరే అన్నాము..


రెండు రోజులు గడిచిపోయాయి..ఒంగోలు నుంచి రామచంద్ర శర్మ గారని దత్తభక్తులు వచ్చారు..శ్రీ స్వామివారి సమాధి దర్శనం అయిన తరువాత..స్వామివారి విగ్రహానికి పేటిక తయారు చేసే ఖర్చును భరించే అవకాశం తనకు ఇవ్వమని అడిగారు..ఏ సమయానికి ఎవరితో పని అవుతుందో వారిని శ్రీ స్వామివారే పిలిపించుకుంటున్నారని అర్ధం అయింది..పైగా ఇది స్వామివారి ఆదేశం అనిపించింది..రామచంద్ర శర్మ గారికి ధన్యవాదములు చెప్పాను..తనకు ఆ అవకాశం కలగడం తనకు అదృష్టంగా భావించారాయన..ఆ మాటే నాతో చెప్పారు.


"అయ్యా..స్వామివారి నిజరూప విగ్రహం వచ్చింది..గాజు పెట్టెలో పెడదామని అనుకుంటున్నాము కదా...అందులో స్వామివారి పాదుకలు కూడా తయారు చేయించి పెడితే బాగుంటుంది కదా..మీరు ఆలోచన చేయండి.." అని మా అర్చకులు చెప్పారు..నాకూ ఆ ప్రతిపాదన నచ్చింది..


"సరే..రేపు పాదుకల గురించి ఆలోచిద్దాము.." అని చెప్పి సింగరాయకొండ కు వచ్చేసాను..


ఆరోజు రాత్రి తొమ్మిదిగంటలకు అష్రాఫ్ జాన్ అనే ముస్లీమ్ యువతి (ఈ అష్రాఫ్ జాన్ గారి గురించి ఇంతకు ముందు ఒక పోస్ట్ లో పాఠకులకు పరిచయం చేసి వున్నాను..)  ఫోన్ చేసి.."స్వామివారి మందిరం లో ఏదైనా వస్తువు ఇవ్వాలని అనుకుంటున్నాను..సాధ్యమైనంత వరకూ అది స్వామివారి విగ్రహం వద్దే ఉండాలని అనుకుంటున్నాను..మీరేదైనా సలహా ఇస్తారా..? " అని అడిగింది.. నామనసులో పాదుకలు అడగాలి అనే ఆలోచనే రాలేదు..తీర్ధం వేసే చిన్న పాత్రలు, హారతి పళ్లెం, శఠారి..ఇత్యాదులు గుర్తుకొస్తున్నాయి కానీ మరేమీ నా తలకాయలో తట్టడం లేదు.."అమ్మా..రేపుదయం చెపుతాను.." అన్నాను..సరే అన్నది..


ప్రక్కరోజు ఉదయం ఏడు గంటలకల్లా తిరిగి ఆ అష్రాఫ్ జాన్ నాకు ఫోన్ చేసి.." ప్రసాద్ గారూ..ఈ తెల్లవారుజామున స్వామివారు నా కలలో దర్శనం ఇచ్చారు..నిజమండీ..నన్ను తనకు పాదుకలు చేయించి ఇవ్వమన్నారు.." అని ఉద్వేగంతో చెప్పింది..


నేను ఆశ్చర్యం తో ఏమీ మాట్లాడలేకపోయాను..నేను సరిగా వినలేదు అనుకోని..మళ్లీ చెప్పింది.."నీ అదృష్టం తల్లీ.." అన్నాను..అంతకు మించి ఏమనాలో కూడా తెలియలేదు..తన విగ్రహం తో పాటు తనకు పాదుకలు కూడా కావాలని స్వామివారే కోరినట్లు నాకు తోచింది..


"అమ్మా..శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమ ను తయారు చేయించాము..ఆ విగ్రహం వద్ద మీరు చేయించబోయే పాదుకులను ఉంచుతాము..స్వామివారే మీతో చెప్పి చేయించుకున్న తరువాత..అంతకంటే సరైన ప్రదేశం ఎక్కడుంటుంది?..మీరు చేయించండి.." అన్నాను..


"వెండిపూత కూడా వేయించి తీసుకొస్తాను..నాకూ ఆనందంగా ఉంది..మీకు కృతజ్ఞతలు చెప్పాలి.." అన్నది..అన్నమాట ప్రకారం పాదుకలు తయారు చేయించి, వాటికి వెండితో పూత కూడా వేయించి భక్తిగా సమర్పించింది..


శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవానికి వారం రోజులముందే స్వామివారి ప్రతిమ అన్నివిధాలా తయారైపోయింది..ఈ ఆలోచనకు ముఖ్యకారకుడైన జయచంద్రకు నేను ఫోన్ చేసి, ఆరాధన నాటికి శ్రీ స్వామివారి మందిరానికి రమ్మనమని చెప్పాను..ఆ ప్రతిమను తయారు చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా వస్తున్నారని..ఆర్ధికంగా తోడ్పాటు అందించిన చీమలదిన్నె అంకయ్య నూ ఆరోజుకు రమ్మనమని చెప్పానని జయచంద్ర చెప్పారు..


మే నెల 11 వతేదీ వైశాఖ శుద్ధ సప్తమి..ఆరోజు శ్రీ స్వామివారి ఆరాధన..ఆ రోజు  శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమను అర్చకస్వాములు శాస్త్రోక్తంగా మంత్రపఠనం చేస్తుండగా ఆవిష్కరించాము..సాక్షాత్తూ శ్రీ స్వామివారే కూర్చుని ఉన్నట్లు గా ఉందని..ఆ విగ్రహాన్ని చూసిన పలువురు భక్తులు వ్యాఖ్యానించారు..


శ్రీ స్వామివారు తన ప్రతిమను తన భక్తుల ద్వారా తానే చేయించుకున్నారని మేము భావించడం లో ఎటువంటి సందేహమూ లేదు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

విద్వాన్ సర్వత్ర

 విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్. విద్యావంతుడు సమస్త విశ్వ ములో పూదనీయుడు. విద్య అనగా యత్ వి ద విలక్షణమైన ద అగ్ని తత్వమును తెలియుడు. విశిష్టమైన అగ్ని దేశమునందు కలదా లేక విశ్వమంతా కలదా. అని పరిశీలన చేసిన విశిష్టమైన అగ్ని ఈశ తత్వ మని అది తెలియుట విద్య యని, విద్య అనే అగ్ని అమృత తుల్యమని యిది తెలియుట కయతప్ప వేరు అమృత తత్వము లేదని మంత్ర పుష్పం రూపంలోగల ఋగ్వేద మంత్రం తెలుపుచున్నది. యిదే తత్వము అయినా సర్వ వ్యాప్తమైనదని. అయనాయ అన్నది అయనాంశయని జ్యోతి ఉష, శాస్త్రము కూడా చెప్పుచున్నది. కారణమును అయనంశలవలననే అదియును భూవైశాల్యమువలననే తెలియును. అన్నింటికి భూమి కారణం భూమి గురించి మంత్ర పుష్పం తెలుపుచున్నది. అది పంచభూతాక్మకమైన శరీరముతో గూడిన జీవ ధర్మమని ప్రకృతిలో ఎవరూ శోధన చేయకుండానే ప్రకృతి ద్వారా మనకు సూత్ర పరంగా వివరించి యున్నారు. అనుభవైక వైద్యమే సూత్రమని వేరు సూత్రములు ఎక్కడా లేవని అనగా వక పద్ధతి ప్రకారం అగ్నిరూప దేహమును అమృత తుల్యంగా మార్పును కూడా మంత్ర పుష్పం మంత్ర పాఠము తెలుపుచున్నది. అన్నీ ఆ పరమేశ్వర తత్వము నీరు, గాలి, నిప్పు ఆకాశము మెుదలగు తత్వములను తెలియుటయే ప్రధమ కర్తవ్యం. అవి మనదేహరూపములో నున్నవని దానికి సూర్యాస్తమయములు చక్కని వివరణ ప్రత్యక్షంగా.

ఘన విజయం

 16 డిసెంబర్ 1971 


భారత సైనికుల ఘన విజయం


ప్రపంచ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు. 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత దేశానికి లొంగిపోయారు.  భారత ఆర్మీకి చారిత్రక రోజు.


ఉక్కు మహిళగా భారత ప్రధాని ఇందిరాగాంధీకి కీర్తి తెచ్చిపెట్టిన సంఘటన ఇది. ఈ విజయంతో ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ట ఇనుమడించింది.  బంగ్లాదేశ్ విముక్తి పొందింది. 


భారత సైనిక జనరల్ జగ్జిత్ అరోరా ఎదుట లొంగిపోతున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ ఏఏకే నియాజీ సంతకం చేస్తున్న దృశ్యం.

ద్రాక్షారామం

 🌻🌻🌻🌻🌻🌻🌻🌻   

ద్రాక్షారామం :-స్వామి :-భీమేశ్వరుడు,

అమ్మ వారు :-మాణిక్యాంబదేవి

రూపం:-తత్పురుషరూపము(ఆత్మ స్వరూపము)

ప్రతిష్ట :-స్వయం భువు

తారకాసురుని మెడలోని అమ్రుత లింగము యొక్క ద్వితీయ ఖండము పడిన ప్రదేశమే ద్రాక్షారామం. ఇది దక్షిణ కాశిగా ప్రసిద్ధి పొందినది. ఈ క్చేత్రములో పరమేశ్వరుడు తత్పురుషముఖ రూపుడై స్వయంగా ప్రతిష్టుతుడు అయినాడు ఈ క్చేత్రములో పడిన అమ్రుతలింగ ఖండము ను ప్రతిష్ట చేయడానికి సూర్యుడు నియమింపబడినాడు. ఈ ప్రతిష్ట చేయడానికి పవిత్ర గోదావరి జలాలు తో అభిషేకించడానికి సప్తఋషులను దేవతలు పంపించారు. ఆ ఋషులు గోదావరి మాతను ప్రార్ధించి ఆ నదీమతల్లితో వస్తూంటే దారి లో ఉన్న తుల్యమర్షి ఆశ్రమము మునిగిపోయింది. ఆ ముని కోపం తో శపించారు. అప్పుడు గోదావరి మధ్యవర్తిగా ఉండి దైవకార్యము యొక్క ప్రయోజనం తెలిపి మునులను ఋషులనూ శాంతపరచి అంతర్వాహిని గా ద్రాక్షారామం చేరుకుంది. అదే సప్తగోదావరి. ఆ కార్యక్రమం ఆలస్యం అయినందున శివుడు తనంత తానుగా ప్రతిష్ఠితుడైనాడు. సూర్యుడు ప్రధమ అర్చన చేశాడు. సూర్యుడు భూమిపై ఏవిధంగా ప్రకాశించునో, అదేవిధంగా ద్రాక్షారామం స్వయం ప్రకాశమై రెండవ కైలాసం గా వెలుగొందగలదని వరమిచ్చినాడు. అప్పుడు అక్కడ గర్భగృహము అంతా కూడా భరించలేని వేడి పుట్టింది. అది భరించలేక దేవతలు, ఋషులు పరమేశ్వరుని వేడుకున్నారు. అప్పుడు అశరీరవాణి ఈవిధంగా పలికింది. "పరమేశ్వరుడు స్వయంగా ప్రతిష్టుతుడై సూర్యుని  ప్రపధముగా అర్చించుటవలన ఈ వేడి పుట్టింది. ఈ క్చేత్రమునకు అష్ట దిక్కులలోనూ సోమేశ్వర లింగములు ప్రతిష్ట చేస్తే ఈ వేడి తగ్గుతుంది అని చెప్పింది

           రవాణి తెల్పిన ప్రకారం సప్త ఋషుల అష్టదిక్కుల లోనూ

సోమేశ్వర లింగములు ను ప్రతిష్ఠించి తమతో తీసుకువచ్చిన సప్తగోదావరి తీర్థజలములతో అభిషేకించారు. తూర్పున సూర్యుడు, ఆగ్నేయమున కశ్యప మహర్షి, దక్షిణ దిశలో అత్రిమహర్షి నైరుతి లో భరద్వాజ మహర్షి, పడమర విశ్వామిత్రుడు, వాయువ్యములో గౌతమ మహర్షి ఉత్తరము న వశిష్ఠ మహర్షి ఈశాన్య భాగము న జమదగ్ని మహర్షి ప్రతిష్టించారు.

      ఇక్కడ అమ్మ వారు మాణాక్యాంబాదేవి, అష్ఠాదశశక్తి పీఠాలలో పన్నెండవ పీఠముగా ప్రఖ్యాతి గాంచినది. ఆదిశంకారాచార్యులవారిచే ప్రతిష్ఠంపబడిన శ్రీ చక్ర రాజిస్తితమైన మాణిక్యాంబ అమ్మ వారి దివ్య పాదారవిందములను శ్రీ చక్ర మేరువును ఏకకాలంలో దర్శించుకోవచ్చును. భక్తుల పాలిట కల్పతరువు అయిన ఈ అమ్మవారి కి వేలాదిమంది భక్తులు నిత్యమూ కుంకుమార్చనలు జరిపించుకుని అమ్మవారి క్రుప కటాక్షము లకు పాత్రులగుచున్నారు. ఈ దివ్య క్చేత్రములో సూర్యుని ప్రధమార్చన అగుటచేత ప్రతీరోజూ ఉదయమూ సాయంత్రం యందు సూర్య భగవానుని కిరణాలు స్వామి పాదములు చెంత పడతాయి. సశేషం

తిరుపావై

 *తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో*


*శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.* శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.


*1.* ఆండాళ్ అని ఎవరికి పేరు?

=గోదాదేవి.


*2.* తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


*3.* ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.


*4.* గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

=శ్రీ విష్ణు చిత్తులు.


*5.* ఆళ్వారులు ఎంతమంది?

=12మంది.


*6.* గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

=భూదేవి.


*7.* గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

=తమిళ భాష.


*8.* తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

=నాలాయిర్ దివ్యప్రబంధము.


*9.* శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

=108.


*10.* గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

=శ్రీవిల్లిపుత్తూరు.


*11.* దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


*12.* శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

=196 అడుగులు.


*13.* ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

=మూడవ పాశురం.


*14.* శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

=తిరుసాదము.


*15.* శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

=కోదై (గోదా)


*16.* పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

=గరుడాంశము.


*17.* తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

=శ్రీవ్రతము.


*18.* మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

=పరమాత్మ చేతిలోని శంఖమువలే.


*19.* శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

=మన్మధుని


*20.* తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

=సింహం పిల్లవలె.


*21.* తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

=ధృడమైన కోరిక, పట్టుదల.


*22.* కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

=మొదటి పాశురం.


*23.* శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


*24.* ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

=రెండవ పాశురం.


*25.* తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

=వామన అవతారం.


*26.* ఆళ్వార్లకు మరో పేరేమిటి?

=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


*27.* నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

=మూడు.


*28.* మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


*29.* శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?

=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


*30.* ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

=యమునా నది.


*31.* మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

=దానగుణం.


*32.* లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

=వర్షానికి.


*33.* పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


*34.* విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

=ఐదవ పాశురం.


*35.* విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=నమ్మళ్వారు.


*36.* తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=బుద్ధివ్రతం.


*37.* గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

=పిళ్ళాయ్ (పిల్లా).


*38.* తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

=ఆళ్వార్లతో.


*39.* గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

=పూదత్తాళ్వారు.


*40.* తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


*41.* కీచుకీచుమని అరిచే *ఏ* పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

=భరద్వాజ (చాతక) పక్షులు.


*42.* తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

=కులశేఖరాళ్వార్.


*43.* మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?=పక్షులు.


*44.* ఎనిమిదవ  పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

=నమ్మళ్వారు.


*45.* పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

=శిరువీడు.


*46.* భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

=కులశేఖరాళ్వార్.


*47.* అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

=కుంభకోణం.


*48.* పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=ప్రీతి వ్రతం.


*49.* కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

=పూదత్తాళ్వార్.


*50.* పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

=శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.


*51.* పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

=బకాసుర వధ.

 

*52.* సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

=త్యాగం.


*53.* శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

=తిరుప్పాణి.


*54.* తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

=భగవద్రామానుజులు.


*55.* తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

=నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు”.


*56.* శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

=అహంకారమును హతమార్చుట.


*57.* పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

=దాస్య వ్రతము.


*58.* గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

=నందగోపుని (భగవానుని అందించారు కనుక)


*59.* కోయిల్ అనగా ఏమి?

=కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.


*60.* నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

=దాన గుణము.


*61.* గోపికలు ఎంబెరుమాన్ (మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

=నందుడు.


*62.* భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

=తిరుమంగై యాళ్వారు. 


*63.* గోపికలు తమ వంశమునకు ‘మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

=యశోద.


*64.* శెంపొర్కజలడి-ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

=బలరాముడు. 


*65.* నీళాదేవి ఎవరు?

=కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.


*66.* యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.


*67.* భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

=పేయాళ్వారు.


*68.* ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

=ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.


*69.* భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

=18 వ పాశురం.


*70.* లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

=18వ పాశురం.


*71.* శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

=కువలయాపీడము.


*72.* అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.


*73.* గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

=అద్దము, విసనకఱ్ఱ.


*74.* తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

=కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.


*75.* ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

=మృగరాజగు సింహము.


*76.* ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

=అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.


*77.* పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

=సర్వగంథః -సర్వవిధ పరిమళములు.


*78.* పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

=సింహ గర్జన.


*79.* కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

=మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.


*80.* కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

=వెలగ చెట్టు.


*81.* ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=భోగవ్రతము.


*82.* ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

=శ్రీవిల్లిపుత్తూరు.


*83.* పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

=పాంచజన్యము.


*84.* ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన కూడార్ ఎవరు?

=సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.


*85.* ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

=కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)


*86.* భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

=గోవింద.


*87.* భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమొళిశై యాళ్వారు.


*88.* కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

=సూర్యునికి, కాంతికి గల సంబంధము.


*89.* గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

=ఆవుల వెనుక.


*90.* ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

=27 వ పాశురం.


*91.* పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

=శ్రీకృష్ణునివి.


*92.* భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

=దాసుని లక్షణములు.


*93.* 'అజాయమానః' (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

='బహుధా విజాయతే' (అనేక విధములుగా పుట్టుచున్నాడు)


*94.* సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

=విష్ణుపోతము


(విష్ణువనే ఓడ)


*95.* పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

=ఆయన దాసులే గొప్ప.


*96.* ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

=ఎన్ని జన్మలకైనా అని అర్థము.


*97.* ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

=అయోధ్య.


*98.* వజ్గం అంటే ఏమిటి?

=ఓడ.


*99.* ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

=అమృత కలశం.


*100.* ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


*101.* గోపికల దివ్యాభరణములేవి?

=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


*102.* శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.


*103.* శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


*104.* గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

*105.* తిరుప్పావై ఎటువంటి మాల?

=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


*106.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


*107.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


*108.* భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=తొండరపడిప్పొడి

యాళ్వార్.


*జై శ్రీమన్నారాయణ!*

*ఆణ్డాళ్ తిరువడిగళే  శరణమ్*