29, డిసెంబర్ 2020, మంగళవారం

Brahmins

 *Warning alert to all Brahmins in the country and World.*

.... If you don't react now... No Brahmin will be there in future.  Please read all details.


T.S.Malleswara Prasad. 

BVP Chairman.

National Vice Chairman. 

National Consumer Rights Commission.

Cell : 9030362942.


*బ్రాహ్మణులందరికీ ముఖ్యమైన విషయాలు, కారణాలు ఇవేగా...* మీ కుటుంబం‌, మీ వంశం, మొత్తంగా  బ్రాహ్మణ జాతి విఛ్ఛిన్నానికి, సర్వ నాశనానికి మీరు గుర్తించని మీ పాత్రకూడా ఉందా ?? తెలుసుకోవాలంటే...  మీరు,  మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్తిగా చదవండి. ప్రపంచంలోని మనవాళ్ళందరికీ ఫార్వార్డ్ చేయండి.  


నానాటికీ బ్రాహ్మణులు తగ్గిపోతున్నారు. ఇది జగమెరిగిన సత్యం. కొన్ని దశాబ్దాలలోనే  బ్రాహ్మణ జాతి కనుమరుగైపోయినా ఆశ్చర్య పడనవసరం లేదు .కారణం ... వర్ణాంతర వివాహాలు మాత్రమే. 


ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే .... దేశంలో 40 సంవత్సరాల వయసు వచ్చినా పెళ్లి కాకుండా  బ్రహ్మచారుల్లా మిగిలిపోయిన బ్రాహ్మణ యువతీ యువకులు లక్షల సంఖ్యలో ఉన్నారు.


అందరూ చెప్పే కారణం ...అమ్మాయిలు దొరకడం లేదు. లేదా అబ్బాయిలు దొరకడంలేదు. 


ఇలా ఎందుకు జరుగుతోంది ?  అమ్మాయిలు ఎందుకు దొరకడం లేదు ? అబ్బాయిలు ఎందుకు దొరకడం లేదు  ?  ఇది కేవలం పెద్దవారి మూర్ఖపు ఆలోచనలతో పిల్లల వివాహాలు చేయకపోవడంవలన   జరిగే వర్ణాంతర వివాహాల వల్ల.


మన బ్రాహ్మణ సమాజం ఈ వర్ణాంతర వివాహాల వల్ల విధ్వంసమైపోతోంది. ఇతర కులస్తులు, మతస్తులు బ్రాహ్మణ యవతీ యువకులను ప్రేమ పేరుతో తరలించుకొని పోతుంటే బ్రాహ్మణ సమాజం నుండి ప్రతిఘటన లేకపోవడం, కనీసం గట్టిగా నిరసన వ్యక్తం చెయ్యకపోవడం , రక్షణాత్మక చర్యలకై ఉపక్రమించక పోవడంతో ... నానాటికీ బ్రాహ్మణ యువతులను మభ్యపెట్టి వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్న సంఘటనలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. 


పెద్దవారి మూర్ఖపు నాస్తిక వాదనలతో పిల్లలలో నాస్తికత్వ మనస్తత్వం పెరిగిపోవడంవలన,, పిల్లలు.... దానికి  పరాకాష్టగా మనషులంతా ఒక్కటే అంటూ ... నచ్చిన వారిని వివాహం చేసుకుంటే తప్పేమిటి  అంటూ...  తనను ప్రేమిస్తున్నాననే ఇతర కులం లేదా మతం వారితోనే వివాహం చేసుకుటానని పిల్లలు తెగించి చెప్పగానే కుప్పకూలిపోవడం ఎంతవరకూ సమంజసం ? . 


తల్లిదండ్రులు తమ పిల్లలకి పెద్ద చదువులు చదివించి ప్రయోజకులని చేస్తే ...., ఆ పిల్లలే ...... తన జాతి బ్రాహ్మణులని పరిహసించి, దూషించి, ద్వేషించేవారిని పెళ్ళిచేసుకుంటుంటే ఈ బ్రాహ్మణ జాతి భవిష్యత్తులో  ఏమైపోతుంది ? 


ఎంతోమంది బ్రాహ్మణ యువతులు... మగవాడిలో రూపం, డబ్బూ, హోదా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు తప్ప కులం, గోత్రం, ఆచారం, ధర్మం, సంస్కృతి వంటివి  ఏవీ పరిగణలోకి తీసుకోవడంలేదు.  కనబడడం లేదు.  క్షేత్రం ఇలా వెళ్లి పోతుంటే కులం ఏమైపోతుంది ? 


తను జన్మించిన ఇంటిని , కులాన్ని, వంశాన్ని లేదా మతాన్ని, తల్లిదండ్రులుని, తోబుట్టువులని, బంధువులని  ధిక్కరించి వెళ్లిపోతున్న ఆడపిల్లలను, మగ పిల్లలను వారి తల్లిదండ్రులు ఎలా పెంచారు ? అది పెద్దవారి ఆలోచనలతోపాటూ  పెంపకంలో లోపం లేదా ? కదా  ? 


మన ధర్మాలు, మను ధర్మాలు, ఆచారాలు, ధార్మక కట్టుబాట్లు ఏమీ నేర్పకుండా అంటూసొంటూ లేకుండా పెంచారా ? లేక అసలు ఆచార వ్యవహారాలే లేవా ? లేదా మీరు సంకరజాతి వారా, లేదా నీతీ జాతి లేని వారా... అంటూ ఇలా బ్రాహ్మణ సమాజాన్ని అవహేళనపాలు చేస్తూనే వర్ణాంతర వివాహాలపేరుతో   మనసమాజం మీద సాంఘిక దాడులని నిరంతరం చేసేవారితో 'తందానాతానా' అంటూ దగ్గరుండి మరీ వర్ణ సంకరం పెళ్ళిళ్ళు చేస్తున్న తల్లిదండ్రులకూ, బంధువులకూ,  పురోహితులకూ మనం ఎందుకు సహకరించాలి ?  అటువంటి వారి బంధువులు, స్నేహితులు ఆ పెళ్ళిళ్ళకి హాజరై భోజనాలు చేసి ఆశీర్వదించి ఎందుకు వస్తున్నారు ? వారికి సిగ్గూ శరమూ,  చీమూ నెత్తురూ లేవా ? బ్రాహ్మణ జాతిలో పుట్టి, ఈవిధంగా వర్ణాంతర వివాహం చేసుకునే వారితోపాటూ ఇతర కులస్తులందరికీ మూర్ఖత్వంతో మన సహకారాన్ని అందించడంకాదా ? 


నీ ఇంటి అమ్మాయో, అబ్బాయో నీ ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు పళ్లికిలిస్తూ నిలబడితే , రేపు నీ మిగిలిన పల్లలకి మనవలకి పిల్ల ఎక్కడినుంచి వస్తుంది ? నీ కుటుంబం‌, నీ వంశం, నీ  కులం, నీజాతి విధ్వంసానికి గురౌతున్న విషయం గుర్తించవెందుకు ? 


క్షణికమైన విలాసాలు , డబ్బు , రూపం, ఉద్యోగం , అందం, ఇవన్నీ నీ కులంకన్నా, జాతికన్నా ఎక్కువనుకుంటుంటే....   అంటే నీ  పెంపకంలో ఎక్కడో లోపం జరుగుతోందనే దాని అర్ధం. . 


బ్రాహ్మణ కుటుంబాలు అందరమూ ఏకతాటిపై నిలిచి, మన ధర్మాలను గౌరవించేలా  కృషి చేయకపోతే......   బ్రాహ్మణ్యం భవిష్యత్తు పూర్తిగా అంధకారమే అవుతుంది. అందరూ కాలగర్భంలో కలసిపోయి, భవిష్యత్తు కాలంలోని ప్రజలు.. చరిత్ర పుస్తకాలలో ...ఒకప్పుడు బ్రాహ్మణ జాతి అనే ఒక గొప్పజాతి భారతదేశంలో ఉండేదని,, పాశ్చాత్యులు  తురుష్కలు కలసి కట్టుగా ఆ జాతిని ప్రజలలో మూర్ఖులుగా ముద్రవేసి, చేసి, నిర్వీర్యం చేసేసారని, ఆ తరువాత వారినందరినీ అతితెలివి కలిగిన వారిగా ముద్రవేసి, ఐకమత్యం లేనివారిగా మార్చి ,  ప్రజలలో ఘర్షణలని పెంచి, ఐకమత్యం లేకుండా చేసి,  ప్రజలనుంచి వేరుపడేలాగా చేసారనీ చెప్పుకుంటారు. ఇలాగ ఉత్తరాన కాశ్మీర్ తోసహా బ్రాహ్మణ కుటుంబాలని సర్వనాశనం చేయటంలో సఫలీకృతులైనారనీ, మిగితా అన్ని ప్రదేశాలలో కిరస్తానీ వాళ్ళు సఫలీకృతంచేసా‌రనీ ఒకరికొకరు పోటీలుపడుతూ మొత్తం బ్రాహ్మణజాతిని  కాలగర్భంలో కలసిపోయేలా చేసారని లిఖిస్తారు.


అందుకనే మనమంతా ఇకనైనా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.


ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు అత్యాశకు పోకుండా సాటి బ్రాహ్మణ యువకుడికి కన్యాదానం చేయాలి.  ఇరవై ఆరేళ్ళ కుర్రాడికి సొంత కారు , సొంత ఇల్లు ఎలా వస్తాయనే ఇంకిత జ్ఞానం కుడా లేకుండా  ఎలా ఉన్నారని ప్రశ్నంచటంలో తప్పేంటి ?  


మీరు బంగారం కొని సువర్ణ దానం చేయవచ్చు . పొలం కొని భూదానం చెయ్యవచ్చు . ఆవును కొని గోదానం చెయ్యవచ్చు . కానీ కన్యాదానం చెయ్యాలంటే కన్యని కొని చెయ్యలేరు కదా ? దయచేసి మీ అమ్మాయిలను ఒక బ్రాహ్మణ యువకుడికే ఇచ్చి వివాహం చేయండి. అదేవిధంగా బ్రాహ్మణ యవకులకి  కూడా మార్గనిర్దేశం చేయండి. 


తక్షణమే సామూహికంగా రక్షణాత్మక చర్యలకోసం ఉపక్రమించక పోతే బ్రాహ్మణ సమాజం ఉనికే లేకుండా పోయే ప్రమాదం  అతి దగ్గరలో ఉందని విశదీకరించండి..


ఈ మెసేజ్ మీకు నచ్చితే, మీకు తెలిసిన బ్రాహ్మణులందరికీ ఫార్వార్డ్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు చెప్పండి. మీ సలహాలు ఎప్పుడూ నాకు అమూల్యమే.. 


*T.S.Malleswara Prasad.*

*Cell: 9030362942.*

*Chairman.*

*Bharathiya Vajra Party.*

*And*

*National Vice Chairman.*

*National Consumer Rights Commission.*


You can contact me at any time please.

జపం, జపమాలలు

 జపం, జపమాలలు - ఫలితాలు


జపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.


మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు.

 

జపమాలలు 3 రకాలు

1. కరమాల

అనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.


2. అక్షమాల

‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.


3. మణిమాలలు

రుద్రాక్షలు, ముత్యాలు, స్పటికాలు, శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.


ఫలితములు

రేఖాజపం దశగుణాన్ని, శంఖమాలజపం శతగుణాన్ని, పగడాలమాల జపం సహస్రగుణాన్ని, స్ఫటికమాల జపం దశసహస్రగుణాన్ని, ముత్యపు మాల జపం లక్ష గుణాన్ని, తామరపూసల మాలాజపం దశ లక్షగుణాన్ని, బంగారుమాల జపం కోటి గుణాన్ని, తులసిమాల జపం అనంతకోటి గుణాన్ని, రుద్రాక్షమాల జపం అనంతఫలితాన్ని ఇస్తుంటాయి. పగడాల మాలలతో జపం చేయడం వలన ఐశ్వర్య వృద్ధి, ముత్యపు మాలతో జపం చేస్తే సర్వమంగళం, తులసి మాలతో చేస్తే సమస్తమైన ఫలాలు, రుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది.


జపం 3 విధాలుగా ఉంటుంది


1. వాచింకం

మంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.


2. ఉపాంశువు

తనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.


3. మానసికం

మనస్సులోనే మంత్రాన్ని జపించడం.

వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, జపం చేసేటప్పుడు అక్షరం, అక్షరం విడివిడిగా వల్లించుకుంటూ జపం చేయకూడదు. అలాగని మరింత వేగంగా కూడా చేయకూడదు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించాలి. జపంలో ఉఛ్చారణ చేస్తున్నప్పుడు బీజాక్షరాలు లోపించకూడదు. జపానికి ముందుగానీ, తరువాత గానీ ఇష్ట దేవతా పూజ తప్పకుండా చేయాలి. పూజ చేయని జపం ఫలితాన్ని ఇవ్వదని శాస్త్రం చెబుతోంది. జపం చేసేందుకై కొంతమంది భక్తులు జపమాలలను ఉపయోగిస్తుంటారు.


ఎలా చేయాలి..?

తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. జపం చేసే ముందు జపమాలను నీటిలో శుభ్ర పరచి, అనంతరం పంచగవ్యాలతో శుభ్రపరచి, అనంతరం మంచి గంధంతో శుభ్రపరచాలి. ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించాలి. ఆ తరువాత జపమాలకు ఈ క్రింది ధ్యానాన్ని చేసి ధూపం వేయాలి.


త్వం మాలే సదేవతా నాం సర్వసిద్ధి ప్రదాయతా

తేన సత్యేన మేసిద్ధిం మాతర్దేహి నమోస్తుతే


అనంతరం పద్మాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. జపమాలను ఇతరులు చూడకూడదు. కాబట్టి ఒక గుడ్డ సంచిలో పెట్టి జపం చేయాలి. వెదురు కర్రల మీద జపం చేస్తే దారిద్ర్యం, రాతిమీద రోగం, నేలమీద దు:ఖం, గడ్దిపరకలమీద యశస్సు తగ్గడం, చిగుళ్ళు పరచిన ఆసనం మీద మనస్సు చంచలంగా ఉండడం, కృష్ణాజినం మీద జ్ఞానం కలుగుతుంది. కృష్ణాజినం వేదస్వరూపమేనని వేదంలో ఉంది. దేవతలు యజ్ఞం చేస్తూ ఉండగా ౠక్కు, సామవేదాలు లేడిరూపం ధరించి ప్రక్కకు తప్పుకొన్నాయని, మళ్లీ దేవతలు ప్రార్థించగా తిరిగి వచ్చాయని, ౠగ్వేదం యొక్క వర్ణం తెలుపని, సామవేదం రంగు నలుపని, అవే పగలు రాత్రులని, ఆ రెంటి రంగులను విడిచి పెట్టి ఆ వేదాలు తిరిగి వచ్చాయని కనుక కృష్ణాజినం ౠక్, సామవేదములకు ప్రతినిధియని వేదంలోని కథ.


దీనిమీద కూర్చొని చేస్తే కుష్ఠు, క్షయ మొదలైన రోగాలు పోతాయని వేద వేత్తలు అంటుంటారు. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని వేదం, ముందు దర్భాసనం వేసుకొని, దానిమీద కృష్ణాజినం వేసుకొని, దానిమీద బట్టపరచి చేయాలని భగవద్గీత చెబుతోంది. ఇది యోగుల విషయమని గీతా వ్యాఖ్యానమైన శంకరానందీయంలో ఉంది.


గృహస్థులందు దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. 


జపం చేసుకోవడానికిగాను తులసిమాల, స్పటికమాల, శంఖమాల, ముత్యాలమాల, రుద్రాక్షమాల, ఉపయోగిస్తూ వుంటారు. వీటిలో ఒక్కో జపమాల ఒక్కో విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ నేపథ్యంలో 'పగడాల మాల' కూడా తనదైన ప్రత్యేకత ఏమిటంటే.. పగడాలు ధరించడం, పగడాల మాలతో జపం చేయడమనేది పూర్వకాలం నుంచీ ఉంది. పగడాల మాలతో జపం చేయడం వల్ల సంపదలు వృద్ధి చెందుతాయి.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*

 *నేటి మన పెళ్ళిళ్లలో చేస్తున్న పొరపాట్లు*


15000 మంది దంపతుల పై గడచిన 20సంవత్సరాల నుంచి పరిశోధన చేస్తున్న ఒక పండితుల టీమ్ నుంచి నా తో ఒక పండితుడు షేర్  చేసి వారు చేసిన కృషియే ఈ  అక్షర రూపం 


1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..


పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అని 

ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా


ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,

చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..

భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!


2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో

ఒకరు చూపులు నిలపకపోవటం.. -

ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!

(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)

(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)


3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..

ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!


4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..

ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు ...!


5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి

రావటం వధూవరులని ఆశీర్వదించటం..

ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి

జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!


6. బఫే భోజనాలు..

ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!


7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..

ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!


ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని

భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....

అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.

వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని ఈ వ్యాసం. అందరికి అందించండి.

అందరూ  వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం

నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻.


Source: శ్రీహర్షశర్మగారి పోస్టింగ్, ముఖపుస్తకం నుండి.

శ్రీరమణీయం* *-(747)*_

 _*శ్రీరమణీయం* *-(747)*_

🕉🌞🌎🌳😷🇮🇳🚩


_*"జాతకంలో ఉంటే జరిగితీరుతుంది అంటారు కదా మరి వాటిని మార్చే అవకాశం, శక్తి ఏమైనా ఉందా !?"*_


_*మనిషిని కలిప్రభావం నుండి దూరం చేయగల సత్తా, జాతకాలను సైతం మార్చగలిగిన శక్తి ధర్మానికి ఉంది. మనకి కడుపునొప్పి వచ్చిందని తెలుసు, డాక్టర్ కి అది తగ్గడానికి మందు తెలుసు. డాక్టర్ సూచనలను పాటించగలిగితే కడుపునొప్పి తగ్గుతుంది. అలాగే మనకు దుఃఖం, కష్టం, అశాంతి తెలుస్తున్నాయి. మన పెద్దలకు అది పోగొట్టే మందు తెలుసు. వారిని అనుసరించ గలిగితే మనం వాటి నుండి బయటపడతాం. దుఃఖం పోవాలంటే శాంతి రావాలి. శాంతి ఎక్కడినుండో రాదు. మనలోనే ఉంది. అది తెలియాలంటే అహంకారం పోవాలి. ఉనికే లేని అహంకారంతో యుద్ధం చేయలేము. ధర్మదీపాన్ని వెలిగిస్తే అహంకారం అనే అంధకారం పోతుంది. ధర్మాన్ని ఆచరించాలంటే బలంకావాలి. అందుకు దైవాన్ని, గురువును సాధనను అండగా చేసుకోవాలి. ఎవరు ఏ విధానంలో ఉన్నా ధర్మమార్గం అందరికీ సరిపోతుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"*_

_*"దీపంతో అంధకారం - ధర్మంతో అహంకారం అదృశ్యం !''*- *(అధ్యాయం -91) {శ్రీరమణభాషణలు సత్సంగ ప్రవచన మాలిక}*_

_*రచన/బోధన : -తత్వదర్శి/శివశ్రీ గెంటేల వెంకటరమణ,*_ 

_*శ్రీగురుధామ్, బలుసుపాడు, కృష్ణాజిల్లా.*_

చిరవిభవా ! శతకము

 .

          🙏  హరిః  ఓమ్‌  🙏


🌸🌻పద్యాల🌻తోరణం🌻🌸

          🌹శు భో ద యం 🌹


    ప్రాతఃస్మరణీయులు శ్రీమాన్‌    

    కూచిమంచి తిమ్మకవివరేణ్య

                     విరచిత

       " చిరవిభవా ! శతకము "

                    🌼🌹🌼


-6- చంపకమాల :


మరలని భక్తితోడ మును మల్హణబిల్హణముఖ్యసత్కవీ


శ్వరులు కవిత్వవైఖరిని సారెకు 

నిన్ బ్రణుతించి ధన్యులై


బరగిరటంచు నేను నినుఁ బద్య

ముఖంబుగ సంస్మరించెదన్


చిరవిభవా ! భవా ! విజితచిత్తభవా ! యభవా ! మహాభవా🙏



టీకా :


(నీ నుండి ప్రక్కకు..)మరలని భక్తితోడ , మును = పూర్వము , మల్హ(..ణుడు)ణ , బిల్హ(..ణుడు)ణ ,  ముఖ్య = మొ॥ , సత్కవీశ్వరులు , కవిత్వ(..ము) , 

వైఖరిని = మూలకముగా , సారెకు = మాటిమాటికి = ఎల్లవేళలా , 

నిన్ = నిన్ను ,  (బ్ర)ప్రణుతించి = కీర్తించి , ధన్యులై , (బ)పరగిరి = ప్రసిద్ధులైరి , 

+ అటంచు , నేను నినుఁ , 

(బ)పద్యముఖంబుగ , సంస్మరించెదన్ .. ( అనుగ్రహింపుము  ..)

శివా ! ..

[ ఈ మకుటార్థము 

ప్రతి పద్యమునకును అన్వయము ..

చిరవిభవా ! = శాశ్వతమైన విభవము గలవాడా ! ,  భవా ! = శివా ! 

< విజిత = జయించబడిన , 

చిత్తభవా ! = మన్మథుని గలవాడా > = 

మన్మథుని జయించినవాడా ! (య)అభవా ! = (జనన మరణ 

చక్రబంధ క్రమమున ..) జన్మ లేనివాడా !

మహాభవా ! = ౘచ్చి , పుట్టునటువంటిది కాని గొప్ప పుట్టుక కలవాడా = శాశ్వతుడా..]🙏



భావము : !


చిరవిభవా ! భవా ! 

విజితచిత్తభవా ! యభవా ! మహాభవా !

నీ నుండి ప్రక్కకు మరలని భక్తితోడ పూర్వము మల్హణుడు - బిల్హణుడు మొ॥ సత్కవీశ్వరులు కవిత్వము మూలకముగా ఎల్లవేళలా నిన్ను కీర్తించి ధన్యులై - ప్రసిద్ధులైరి అని గ్రహించి నేను కూడా నిన్ను పద్యముల మూలముగనే సంస్మరించెదను .. అనుగ్రహింపుము శివా ! ..🙏

భారత ప్రధాని

 ప్రియమైన భారతీయులకు నమస్కారం,

నేను భారత ప్రధాని నరేంద్ర మోడీ ని..!


నన్ను ఈ‌ పదవిలో కూర్చుండబెట్టి సుమారు  దాదాపు ఆరుసంవత్సరాలైంది.. ఈ సంధర్బంగా నేను మీతో కొన్ని విషయాలను పంచుకోవాలి.. నేను పదవిలోకి వచ్చినపుడు అది‌ ముళ్ళ సింహాసనం. గత ప్రభుత్వం పది సంవత్సరాలనలో అవినీతి కుంభకోణాలను మిగిల్చింది‌. ఫలితంగా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ నష్టాలలోకి జారిపోయింది. విదేశాలలో అప్పులు మిగిలాయి..

ఇరాన్ కి                         48000‌ కోట్లు

యుఎ ఇ కి                     40000 కోట్లు

దేశ ఇందన కంపెనీ లకు 133000 కోట్లు 

విమాన యాన సంస్థ        58000 కోట్లు

రైల్వే సంస్థ                      22000 కోట్లు

బియస్ ఎన్ ఎల్               1500 కోట్లు

దేశ రక్షణ వ్యవస్థ లో సైనికులకు కనీస ఆయుధాలు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు లేవు

యుద్ధం వస్తే నాలుగు రోజులకు కూడా సరిపోయే ఆయుధాలు లేవు..‌అంతే కాదు నిఘా వ్యవస్థ విఫలం చెందింది ఎక్కడ బాంబు లు పేలుతాయో తెలియని పరిస్థితి..


ఇలాంటి పరిస్థితులలో నేను పీఠం ఎక్కాను .. అప్పుడు ఈ వ్యవస్థ లను చక్కదిద్దడం నా కర్తవ్యంగా భావించాను...

భారత ప్రజల అదృష్టం కొద్ది అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినాయి.....

ఆ తగ్గినది పూర్తిగా మీకు లాభంగా చేరలేదు.. సగం పన్నుగా ప్రభుత్వం తీసుకున్నది.


ఎంతగానో అభిమానించే మీరు‌ ఈ విషయంలో నాపై కోపం పెంచుకున్నారు.. నాకు తెలుసు

కాని తప్పలేదు..‌ భావి తరాలకొరకు తప్పలేదు...

ఆ నాటి ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇప్పుడు ‌మనకు‌ శాపాలుగా మారాయి

ఆనాడు ఇంధనం 120 డాలర్లు ఐనా 85 రూ లీటర్ పెట్రోల్ అమ్మారు..‌ఇది‌ ఎలా సాధ్యం ??


వాళ్ళు ఆ‌ చమురును‌ అప్పుగా తెచ్చారు ఇంకేంది ప్రభుత్వ వ్యతిరేకత రావద్దని

ధరలు ఏ మాత్రం పెంచకుండా అమ్మారు.. 

అలా ఇంధనం పై ఇతర దేశాలలో 250000 కోట్లు అప్పు చేశారు.. దీనిపై వడ్డీ సంవత్సరానికి 25000 వేల కోట్లు...


ఇలా దేశం అప్పుల పాలు అయ్యింది ‌అప్పు తీర్చితేనే ఇంధనం ఇస్తామన్నారు..

అందుకే కొంత పన్ను రూపంలో వసూలు చేశాను 250000 కోట్ల ను వడ్డీతో సహా చెల్లించాను..

రైల్వే సంస్థ నష్టాలను పూడ్చాను... గత ప్రభుత్వం ప్రారంభించి వదిలేసిన ప్రాజెక్టులను పూర్తి చేశాను

బుల్లెట్ రైలు స్పీడ్ ట్రైన్ లు మొత్తం విద్యుదీకరణ చేయిస్తున్నాను.

దేశంలో 18500 గ్రామాలకు‌ విద్యుత్ ఇచ్చాను,

5 కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చాను,

సుమారు 40 వేల కిలోమీటర్ల రోడ్డు వేయడం జరిగింది.

150000 కోట్ల తో యువతకు ముద్ర లోనులు ఇచ్చాము

150000 తో 50 కోట్ల ‌ప్రజలకు ఆయుష్మాన్ భారత ‌కార్యక్రం ప్రారంభించాము.

మన సైనికులకు‌ అధునాతన ఆయుధాలు సమకూర్చాము


ఇదంతా డబ్బు ఎక్కడిది.. మీ త్యాగమే కదా...ఇందులో మీరు భాగస్వాములే...


సరె పన్ను తొలగించుదాం అనుకుందాం... ఆ అప్పు తీరదా తీరుతుంది..

కాని పరోక్షంగా ఇతర వస్తువుల పై ధరలు పెంచాలి.. అప్పుడు 130 కోట్ల ప్రజలపై భారం పడుతుంది.. ఇలా ఐతే కేవలం వాహన దారులపైనే భారం పడుతుంది..


చివరగా ఒక్క మాట...

మీరు ఒక కుటుంబ పెద్దగా మీ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోతే...అదృష్టం గా వచ్చిన డబ్బును ‌ఏం చేస్తారు..??

ఉదారంగా ఖర్చు పెడుతారా..??

అప్పులు తీర్చుతారా..??

ఉదారంగా ఖర్చు చేస్తే ఆ కుటుంబం..‌వారి భవిష్యత్తు ఏమౌతుంది‌.. 

అప్పు ఇచ్చిన వాడు ఊరుకుంటాడా...?? 


ప్రతిపక్షాలు చేసే గారడీలను నమ్మకండి


దేశ ‌భక్తులుగా‌ ఈ దేశ అభివృద్ధికి సహకరించండి


ఈ ప్రతిపక్షాలు ‌ఒక రాష్ట్రం లో ఎన్నికలు జరిగితే చాలు‌ ఏదో ఒక అంశం ప్రజలపై రుద్ది‌ నమ్మించాలనుకుంటాయి.


*ఒక్కసారి ఆలోచించండి !!*


దీనిని‌ ప్రతి భారతీయునికి షేర్ చేయండి


              మీ నరేంద్ర మోడీ

    

                 భారత్ మాతాకి జై 🌷🙏🏿

విదేశాలు

 👉విదేశాలు చాలా పరిశుభ్రంగా ఉంటుంది చాలా క్రమశిక్షణ పాటిస్తారు నీరు స్వచంగా ఉంటుంది ఆహారం కల్తీ ఉండదు, వస్తువులు నాణ్యమైనవి ఉంటుంది భారతదేశం లో పుట్టి పెరిగిన ఎందరో మేధావులు ధనికులు ఇక్కడ అక్షరాలు నేర్చుకుని విదేశాల్లో స్థిరపడి భారతదేశం కి రావడం ఇష్టంలేక అక్కడే సిటిజన్స్ అయిపోయిన వారు ఎన్నో లక్షల కుటుంబాలు ఉన్నాయి..


ఇక్కడ మన భారతదేశం లో కుప్పతొట్టిలు ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అయినా అన్ని రోడ్ పైన విసిరేస్తూ వెళ్లారు అవసరాన్ని బట్టి అన్ని రోడ్ పక్కనే కానిచేస్తుంటారు మురికి కాలువాల పక్కన పకోడీ బండి ఉన్నా జనం కరువు వచ్చినట్టు కొనుక్కుని తింటుంటారు ఆహారం కల్తీ నీరు కల్తీ లంచాలతో మోసాలతో జనం కల్తీ కుల రాజకీయాలు నల్ల ధనం కబ్జాలు ఇలా అనేక సుగుణాలు తో ఉన్న మన జనం.


కానీ అన్ని రకాల వైరస్లు రోగాలు ముందుగా విదేశాల్లో నే ఎందుకు పుడుతుంది ఎందుకు అంత మంది మరణిస్తున్నారు ఆశుభ్రంగా ఉండే భారత దేశం లో నాణ్యత లేని కలుషిత ఆహారం తినే భారతదేశం లో ఎందుకు మొదలు కావడం లేదు బైలాజికల్ వెపన్స్ తో దాడి చేసి జబ్బులను వ్యాప్తి చేసి న విదేశాల్లో తమని తాము కాపాడుకోలేక కొత్త వైరస్లు కూడా మొదలు ఐయ్యింది..దానికి కారణం


భారతదేశం లో విశ్వప్రాణాశక్తిని అధికంగా ఆకర్షించే ప్రాంతాలు గుర్తించి అక్కడ దేవాలయం నిర్మించి యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు అభిషేకాలు హోమాలు తో వేద మంత్రాలతో ఆ ప్రాంతంలో అధికసంఖ్యలో రేకి శక్తి అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ప్రాణికి అక్కడికి వచ్చిన భక్తులకు ఆ ప్రాంతంలో విశ్వప్రాణాశక్తిని (cosmic energy) రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.. నిత్యం భారతదేశం లో వివిధ ప్రాంతాల్లో హోమాలు ,వేద పారాయణం, నిత్యాగ్ని హోత్రం చేసే వారు వివిధ ఉపాసకుల మంత్రోచ్చారణ ప్రకృతిలోని పోసిటివి ఎనర్జీ ని అధికంగా పొందే విధంగా చేస్తుంది ఆ ఉచ్చారణ వల్ల శబ్ద తరంగాలు వల్ల నేగటివ్ పవర్ తగ్గుతుంది ఎప్పుడూ శుభాన్ని ఉచ్చరించే శబ్ద తరంగాలు శుభాన్ని కలిగిస్తుంది హోమంలో వేసే ఆవు పిడకలు వాతావరణం లోని కాలుష్యం తగ్గిస్తుంది గో పూజ, వేప చెట్టు, అధికంగా కాస్మిక్ పవర్ ప్రసరించే పుణ్య నదులలో స్నానం ఇవన్నీ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. 


నిత్యం జరిగే పూజ జపం తపస్సు ఇక్కడ క్షేత్రాలకు ఉన్న శక్తి మనకు అందిస్తుంది, ఇది మన దేశంలో గొప్పతనం మన సనాతన ధర్మం మనం భారతీయులం మనం అదృష్టవంతులము.

ఆది శంకరాచార్యులు


 ఆది శంకరాచార్యులు


భారతీయ ఆధ్యాత్మిక గురువు

సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరులు, శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు, మహాకవి. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీ.శ. 788 – 820 మధ్య కాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది.


దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే

స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః

దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (- శివరహస్యము నుండి).

కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః

శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా

శ్రౌత, స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి, వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి).


ఆది శంకరాచార్యులు

హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు:


బౌద్ధమతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో (భౌతికంగా) ఏ విధమైన బల ప్రయోగం లేదు. దేశదేశాలలో పండితులతో వాదనలు సాగించి, వారిని ఒప్పించి, నెగ్గి, శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించాడు.


ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, విష్ణు సహస్ర నామాలకు భాష్యాలు వ్రాశారు. తరువాత శంకరుల అనుసరించినవారికీ, శంకరులతో విభేదించిన వారికీ కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి.


శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠం - అనే నాలుగు మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి, హిందూ ధర్మానికి నాలుగు దిక్కులా దీపస్తంభాలలా పనిచేశాయి.


గణేశ పంచరత్న స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధారా స్తోత్రం,శివానందలహరి, సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు.


జీవిత గాధ


శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి "చరిత్ర"లలో కొన్ని -  శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన, అధిభౌతికమైన సంఘటనలు మనకు గోచరిస్తాయి.


మాధవీయ శంకర విజయం - 14వ శతాబ్దికి చెందిన మాధవుని రచన


చిద్విలాస శంకర విజయం - 15 - 17 శతాబ్దాల మధ్యకాలంలో చిద్విలాసుని రచన


కేరళీయ శంకర విజయం - 17వ శతాబ్దికి చెందిన రచన


వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక, సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించీ, సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగారు. తెలుగులో వీరి జీవిత చరిత్రను 1001 పద్యాలతో ధర్మదండము పేరిట పద్య కావ్యంగా డా. కోడూరి విష్ణునందన్ రచించారు.


జననము


శంకరుల జన్మస్థలం కాలడి

సదాశివుడే ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం. కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ, శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి, ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందారు. పార్వతీ దేవి, సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో, ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకరవిజయం చెబుతోంది. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురుడు, కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండగా జన్మించారు. ఆదిశంకరుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీ.శ. 788 లో జన్మించారు, కంచి మఠం ప్రకారం స్వామి రెండు వేల సంవత్సరాలకు పూర్వం, క్రీ.పూ. 509 సంవత్సరంలో  జన్మించారు.


బాల్యము


శంకరుల బాల్యంలోనే తండ్రి మరణించారు. ఆర్యమాంబ కొడుకు పోషణ బాధ్యతలు స్వీకరించి, శాస్త్రోక్తంగా ఉపనయనం జరిపించింది. శంకరులు ఏకసంథాగ్రాహి. బాల్యంలోనే వేదవిద్యలు, సంస్కృతం అభ్యసించారు. బాలబ్రహ్మచారిగా శంకరులు ఒకరోజు భిక్షాటనం చేస్తూ ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భిక్ష అడుగగా, భిక్ష వేసేందుకు ఏమీ లేక, తన ఉపవాసాన్ని విరమించడం కోసం ఉంచుకొన్న ఉసిరి కాయను దానం చేసింది. దానికి చలించిన శంకరులు, ఆశువుగా కనకధారా స్తోత్రాన్ని చెప్పారు. కనకధారా స్తోత్రంతో పులకించిన లక్ష్మీ దేవి బంగారు ఉసిరికాయలు వర్షింపజేసింది.

ఒకరోజు శంకరుల తల్లి ఆర్యమాంబ పూర్ణా నది నుండి నీళ్ళు తెచ్చుకుంటుండగా స్పృహతప్పి పడిపోయింది. అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి, నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహ మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు.


సన్యాస స్వీకారము


సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి పట్టుకుంది. సన్యాసం తీసుకోవడానికి అంగీకరించమని, ఆ విధంగా మరణించే సమయంలోనైనా తాను సన్యాసిగా ఉంటాననీ తల్లిని కోరినారు. దానికి ఆమె అంగీకరించింది. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను వదిలేసింది.

గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, "ప్రాత:కాలం, రాత్రి, సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే, నీవద్దకు వస్తాను" అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి, అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.


గోవింద భగవత్పాదుల దర్శనం


తల్లి అంగీకారం తీసుకుని శంకరులు కాలడి విడిచి, గురువు కొరకు అన్వేషణలో నర్మదా నది వద్దకు వెళ్ళారు. నర్మద ఒడ్డున గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదులు ఉండే గుహ దర్శనం లభించింది. వ్యాసమహర్షి కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు. ఆయన నివసించే గుహను చూసిన వెంటనే శంకరులకు అడవులనుండి నడచి వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా తీరిపోయింది. గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం అని స్తోత్రం చెయ్యగా గోవింద భగవత్పాదులు 'ఎవరు నువ్వు?' అని అడిగారు. శంకరులు దశశ్లోకి స్తోత్రం చేస్తూ ఇలా అన్నారు.


న భూమిర్నతోయం న తేజో నవాయుర్మఖంనేంద్రియం వా న తేషాం సమూహః

అనైకాంతి కత్వా త్సుషుష్త్యైక సిద్ధిస్తదేకోవ శిష్ట శ్శివ: కేవలోహం

నేను నింగిని కాదు, భూమిని కాదు,నీటినికాదు, అగ్నిని కాదు, గాలిని కాదు, ఎటువంటి గుణాలు లేని వాడిని. ఇంద్రియాలు కాని వేరే చిత్తం గాని లేనివాడిని. నేను శివుడను. విభజనలేని జ్ఞాన సారాన్ని.


ఆటువంటి అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను, గోవిందభగవత్పాపాదులు జ్ఞాన సమాధి నుండి చూసి ఈ విధంగా అన్నారు. - "స ప్రాహ శంకర స శంకర ఏవ సాక్షాత్" (సాక్షాత్తు భూమికి దిగి వచ్చిన పరమశివుడే ఈ శంకరులు)

శంకరులు మొట్టమొదటిగా గోవిందపాదులకు పాదపూజ చేశారు. గురువులకు పాదపూజ చేసే ఈ సాంప్రదాయం పరంపరగా నేటికీ వస్తోంది. గురుసేవ తోనే జ్ఞానార్జన జరుగుతుందని శంకరులు సర్వప్రపంచానికి వెల్లడి చేశారు. గోవిందపాదులు శంకరులను బ్రహ్మజ్ఞానాన్ని, ఉపనిషత్తుల సారాన్ని నాలుగు మహావాక్యాలుగా బోధించారు. ఒకరోజు నర్మదా నదికి వరద వచ్చి, పొంగి పొర్లుతూ, గోవిందపాదుల తపస్సుకు భంగం కల్గించబోతుండగా శంకరులు తన శక్తితో నదిని నిరోధించారు. గోవిందపాదుల వద్ద విద్యాభ్యాసం పూర్తయిన తరువాత గురువు ఆజ్ఞతో బ్రహ్మసూత్రా లకు భాష్యాలు వ్రాయడం కోసం పండితులకు నిలయమైన వారణాసి చేరుకున్నారు.


వారాణసిలో శంకరులు


గుర్వాజ్ఞతో శంకరులు వారాణసి చేరుకొని పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానమాచరించి, విశ్వేశ్వరుని సన్నిధిలో కొంతకాలం గడిపారు. అయస్కాంతం ఇనుపరజనును ఆకర్షించినట్లు, వేదసూక్ష్మాలు శంకరులకు వారణాసిలో బాగా అవగతమయ్యాయి. వారణాసిలోనే సదానందుడు అనే బ్రహ్మచారి శంకరులకు ప్రథమ శిష్యుడయ్యాడు.


మనీషా పంచకం


ఒకరోజు మాధ్యాహ్నికం (మధ్యాహ్నకాలకృత్యాలు) తీర్చుకోవడానికి గంగా నది వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో నాలుగు శునకాలతో ఒక చండాలుడు అడ్డుపడినాడు. అప్పుడు శంకరులు, ఆయన శిష్యులు అడ్డు తప్పుకోమనగా ఆ చండాలుడు ఈ విధంగా అడిగాడు.


అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్యమేవచైతన్యాత్

ద్విజవర దూరీకృతం వాజ్చసి కిం బ్రూహి గచ్ఛ గచ్ఛతి

సర్వానికి మూలమైన అన్నం నుండి నిర్మితమైన ఈ శరీరం ఛండాలుడిలోనైనా, బ్రాహ్మణుడి లోనైనా ఒకేవిధంగా పనిచేస్తుంది. మీరు అడ్డు తప్పుకోమన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్నా, లేక లోపలనున్న ఆత్మనా? ఆవిధంగా అయితే అది ద్వంద్వం అవుతుంది కాని అద్వైతం కాదు


ఆ మాటలువిన్న వెంటనే శంకరులు అంతరార్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు. శంకరులకు పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.


ప్రస్థానత్రయం


అలా శివుని అనుగ్రహంతో గంగలో పుణ్యస్నానం ఆచరించి, కాశీ నుండి బదరికి బయలు దేరారు. బదరిలో ఉన్న పండితుల సాంగత్యంతో, పండితగోష్ఠులతో పాల్గొంటూ పన్నెండేళ్ళ వయస్సులో బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాశారు. వారణాసిలో ఉన్నపుడే ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలుకు భాష్యాలు రాశారు. దీనినే ప్రస్థానత్రయం అంటారు. అనంతరం బదరి నుండి కాశీకి తిరిగి వెళ్ళి, ఆ భాష్యాల సారమైన అద్వైతాన్ని శిష్యులకు బోధించడం ప్రారంభించారు. శంకరాచార్యులు సనత్ సుజాతీయం, నృసింహతపాణి, విష్ణుసహస్రనామ స్తోత్రము, "లలితా త్రిశతి"లకు కూడా భాష్యాలు వ్రాశారు.


వ్యాసమహర్షి


ఒకరోజు శంకరులు గంగా నది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళ్తుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగాడు. 8 రోజుల చర్చ తరువాత, ఆ వచ్చింది సాక్షాత్తూ వ్యాసుడేనని పద్మపాదుడు గ్రహించి, అ విషయం శంకరులకు చెప్తాడు. శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి, తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా, వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమేనని ప్రశంసించాడు.

వేదవ్యాసుడు నిష్క్రమించ బోవడం చూసి, శంకరులు 'నేను చెయ్యవలసిన పని అయిపోయింది, నాకు ఈ శరీరం నుండి ముక్తి ప్రసాదించ'మని వ్యాసుని కోరగా, వ్యాసుడు "లేదు, అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులనేకులను ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే, నీ కారణంగా రూపుదిద్దుకుని, ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్నివ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకిచ్చిన 8 సంవత్సరాల ఆయుర్ధాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరో 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక" అని దీవించాడు.


శంకరాచార్యుల శిష్యులు


శంకరులకు అనేకులు శిష్యులుగా ఉన్నారు. ఆయన ప్రఙ్ఞాపాఠవాలకు కొందరు, చర్చలద్వారా ఓడింపబడిన వారు మరికొందరు ఇలా అనేకులు ఆయన శిష్యులుగా ఉండేవారు. వారిలో అతి ముఖ్యులు కొందరు ఉన్నారు.


పద్మపాదుడు


Main article: పద్మపాదాచార్యులు


శంకరుల కాశీ ప్రయాణంలో ఒక బ్రహ్మచారి ఆయన వద్దకు వచ్చి నేను బ్రహ్మణుడను, నా పేరు సనందుడు. నాది చోళదేశం మహాత్ములను దర్శించి ఙ్ఞానాన్ని ఆర్జించాలని వచ్చాను. మీ వద్ద శిష్యునిగా ఉండే వరమిమ్మని ప్రార్థించాడు. అలా శంకరులకు అత్యంత ఆత్మీయునిగా మారాడు. సదానందుడు శంకరులకు అత్యంత సన్నిహితంగా ఉండడంవల్ల తోటి శిష్యులకు కొద్దిగా అసూయగా ఉండేది. అది శంకరులు గ్రహించి వారిలోని ఆ అసూయను పోగొట్టదలచారు. ఒకరోజు గంగానదికి ఆవల ఉన్న సదానందుడ్ని పిలిచారు. వెంటనే సదానందుడు నది మీద నడుచుకొంటూ ఈవలకు వచ్చాడు. నది మీద సదానందుడు అడుగు వేసినచోటల్లా మునిగిపోకుండా పద్మాలు వచ్చాయి. అది చూసిన తోటి శిష్యులు, సదానందుడిపై అసూయ పడినందుకు సిగ్గుపడ్డారు. అప్పటి నుండి సదానందుడు పద్మపాదుడు అయ్యాడు. పద్మపాదునికి సంబంధంచిన మరొక కథ ఉంది. శ్రీ శంకరులు శ్రీశైల పరిసరములలో చాలా కాలం తపస్సు చేసారు. శంకరులు తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో హిందూ ధర్మ ప్రచారము చేయుచున్నకాలమందు శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు కాపాలికులు ఆయనను అంతమొందిచు యత్నముతో ఆ పరిసరాలయందు బీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి కొంత ధనమునిచ్చి పంపించారు. అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుచున్న శంకరుల వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికాడు. ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుల ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లిఖార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉన్నాడు. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హఠాత్తుగా ఈ దృశ్యము కనిపించెను. వెంటనే అతడు మహోగ్రుడై శ్రీలక్షీనృసింహుని వేడుకున్నాడు. ఇక్కడ శంకరులను వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది. తదనంతరము మిగిలిన శిష్యులకు ఈ విషయము తెలిసి పద్మపాదుని శక్తికి అతనికి శ్రీ శంకరులయందున్న భక్తికి అతనిని అభినందించారు.


కుమారిల భట్టు ను కలవడం


తన 15 వ ఏట, శంకరులు ప్రయాగలో ఉన్న కుమారిల భట్టును కలవాలని నిర్ణయించుకొని బయలుదేరారు. భట్టు వేదాలను తంతు లేదా ఆచార సంబంధమైన కార్యాలకు వినియోగించే వైదిక వృత్తికి చెందిన వ్యక్తి. ఒకప్పుడు తాను నేర్చుకున్న బౌద్ధమతసిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించి గురుద్రోహం చేసిన కారణంగా పశ్చాత్తాపంతో అగ్నిలో ప్రవేశించి ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నాల్లో భట్టు ఉన్నాడు. శంకరులు ప్రయాగ చేరే సమయానికి భట్టు ఊకతో చేసిన అగ్ని గుండంలో నిలబడి ఉన్నాడు. భట్టు శంకరుల గుర్తించి, బౌద్ధానికి వ్యతిరేకంగా తాను చేసిన పనిని శంకరులకు వివరిస్తాడు. శంకరులు రాసిన భాష్యాల గురించి తనకు తెలుసుననీ, వాటికి వార్తికలు (వివరణాత్మక వ్యాసాలు) వ్రాయాలన్న కోరిక తనకు ఉన్నదని కూడా వెల్లడిస్తాడు. ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న తన నిశ్చయం కారణంగా వార్తికలు వ్రాయలేనని, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుడు వ్రాస్తాడని చెప్పాడు. శంకరుల దర్శనంతో తన సర్వపాపాలు హరించాయని అన్నాడు. అప్పుడు శంకరులు "శివుని పుత్రుడైన కుమారస్వామి గా నిన్ను నేనెరుగుదును. నీ చెంతకు పాపాలు చేరవు. అగ్ని నుండి నిన్ను రక్షిస్తాను, నా భాష్యాలకు వార్తికలు రచించు" అని కోరారు. భట్టు అందుకు నిరాకరించి, మాహిష్మతిలో ఉన్న తన శిష్యుడైన మండన మిశ్రుని తర్కంలో ఓడించి, శిష్యునిగా చేసుకుని, ఆతనిచేత వార్తికలు వ్రాయించమని శంకరులతో చెప్పాడు.


భట్టిపాదుడు


భట్టిపాదుడు వేదవేదాంగాలు చదివిన ఙ్ఞాని. అతడు పుట్టేనాటికి బౌద్ధమతం వ్యాప్తి జరిగి ఉంది. వైదిక ధర్మాలను హిందూ మత సిద్ధాంతాలను వ్యాప్తిచేయాలని అనుకొన్న భట్టిపాదుడు ముందు బౌద్ధం గురించి తెలుసుకుంటే తప్ప దానిలో తర్కం చేయలేనని బౌద్ధ భిక్షువుగా వేషం ధరించి ఒక బౌద్ధ మతగురువు వద్ద బౌద్ధ శాస్త్రాల గురించి తెలుసుకోసాగాడు. ఒకనాడు ఒక బౌద్ధ బిక్షువు హిందూ మతమును విమర్శించుచుండగా సహింపక వాదించుటతో వారతడిని మేడపైనుండి పడదోయగా ఒక కన్ను పోయింది. దీనిపై ఆ రాజ్య రాజు విచారణ చేయగా బౌద్ధ సన్యాసులతో ప్రసంగానికి పూనుకొని వారిని ఓడించి సభలో వేద ప్రభావం బోధించగా రాజు వేదప్రభావం గురించి చెప్పిన మిమ్ము పైనుంచి తోసివేసిన ఎలా పడినారు అని అడుగగా అది హఠాత్తుగా నేను ఏమరుపాటున ఉండగా జరిగింది. మీరు ఇపుడు పరీక్షించవచ్చు అని చెప్పగా రాజు మేడమీదనుండి త్రోయమని చెపుతాడు. భట్టిపాదుడు వేదపురుషుని ధ్యానిస్తూ వేదమే ప్రమాణమైతే నాకెటువంటి హానీ జరుగదు అనుకొంటూ దూకగా ఏ విధమైన దెబ్బలు తగలక వచ్చిన భట్టిపాదుని మరొక పరీక్షకు అహ్వానించి ఒక ఖాళీ కుండ తెప్పించి అందులో ఏమున్నది అని అడుగగా శ్రీమహా విష్ణువు ఉన్నాడని చెపుతాడు. అందులో రాజుకు భోగశయనుడైన శ్రీమహావిష్ణువు దర్శనం ఇవ్వడంతో వేదాలను శాస్త్రాలను మాత్రమే ప్రమాణముగా నమ్మి వైదిక కర్మలను ఆచరించని బౌద్ధ బిక్షులను అందరినీ చంపమని ఆదేశిస్తాడు. దానితో అతని గురువుతో సహా అందరినీ చంపగా గురువును చంపినను, బౌద్ధంలో ఉండగా ఈశ్వరుడే లేడని అన్నాను. ఇలా అనేక తప్పులు చేసిన నాకు చావే శరణ్యం అని తలచి చితి పేర్పించి కాల్చుకోడానికి తయారుకాగా శంకరులు అక్కడకు వచ్చి వారిస్తారు. తన సూత్ర భాష్యానికి వార్తికము రచించమని అడుగుతాడు. తనకు సాటికల మండన మిశ్రుడి ద్వారా ఆ కార్యము నెరవేర్చమని, శంకరుల చేతిమీదగా మోక్షము ప్రసాదించమని వేడుకొనగా శంకరులు అంగీకరించి అతనికి బ్రహ్మ రహస్యాన్ని ఉపదేశించి ముక్తి ప్రసాదిస్తారు.


మండన మిశ్రునితో తర్క గోష్ఠి


మాహిష్మతిలో మండన మిశ్రుని ఇంటి వెళ్ళిన సమయానికి మండన మిశ్రుడు తన తపోశక్తితో వ్యాసభగవానుడిని, జైమినిమహా మునిని ఆహ్వానించి, వారికి అర్ఘ్యపాద్యాలు ఇస్తున్నాడు. శంకరులు ఇంటికి రావడం గమనించి, తన ఇంటిలో సన్యాసులకు ప్రవేశం లేదని, అందువలన స్వాగతం పలకనని చెప్పాడు. అయితే, మహర్షుల ఆదేశంతో శంకరులను లోపలికి ఆహ్వానించాడు. తరువాతి రోజున చర్చ జరపాలని నిర్ణయించుకున్నారు. న్యాయనిర్ణేతలుగా వ్యాసుడు, జైమిని లను ఉండమని అభ్యర్థించగా, మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి సాక్షాత్తూ సరస్వతీ స్వరూపమనీ, ఆమెను న్యాయనిర్ణేతగా ఉంచి గోష్ఠి జరపమనీ వారు చెప్పారు. ఉభయభారతి మధ్యవర్తిగా ఉండటానికి అంగీకరించి, వాళ్ల ఇద్దరి మెడలలోనూ రెండు పూలమాలలు ఉంచి, వాదనసమయంలో ఎవరి మెడలో పూలమాల వడలిపోతే వాళ్లు ఓడిపోయినట్లు అని చెప్పింది. వాళ్లిద్దరూ వాదన ప్రారంభించిన తర్వాత కొంతసేపటికి మండనమిశ్రుని మెడలోని మాల వడలిపోయింది. కాని, భర్త శరీరంలో భార్య సగం కనుక తనను కూడా ఓడిస్తే కాని తన భర్త ఓడినట్లు కాదని ఉభయభారతి చెప్పింది. శంకరులు దానికి అంగీకరించారు. ఉభయభారతి ఎన్నో చిక్కు ప్రశ్నలను శరపంపరగా సంధించగా, శంకరులు అన్ని ప్రశ్నలకూ సమాధానాలు చెప్పగలిగినా ఆమె చివరిగా డిగిన మన్మధ కళలెన్ని వాటి స్వరూపార్ధాలేమిటి, శుక్ల పక్షాలందు స్త్రీ పురుషులలో జరిగే మార్పులేమిటి అని అడిగింది. బ్రహ్మచారియైన శంకరులు వాటిని గురించి తెలుసుకొనే ఉద్దేశంతో జవాబులు చెప్పేందుకు కొంత కాలం గడువు ఇమ్మని అడిగారు.


కామరూపవిద్య


శంకరులు వందమంది భార్యలు కల అమరకుడు అనే రాజు చనిపోవుట గమనించి శిష్యులతో తన శరీరమును కాపాడమని చెప్పి రాజు శరీరంలో ప్రవేశించి అమరకునిగా నూర్గురు భార్యలతోనూ అనంగతంత్ర పాండిత్యంలో కల శ్రద్ధ, ప్రీతి, రతి, ధృతి, కీర్తి, మనోభవ, విమల, మోదిని, ఘోర, మధనోత్పాదిక, మద, దీసిని, వశకరి, రంజని, మోహిని అనే పదిహేను కళలూ నేర్చి తన శరీరంలో ప్రవేశించి ఆమెను పరాభూతురాలిని చేశారు. చివరికి మండనమిశ్రుడు తన ఓటమిని అంగీకరించాడు. అప్పుడు అతనికి శంకరులు సన్యాసాన్ని ఇచ్చి, తన శిష్యునిగా స్వీకరించి, సురేశ్వరాచార్యుడుగా ప్రసిద్ధుడవుకమ్మని ఆశీర్వదించారు.


దిగ్విజయ యాత్రలు


తరువాత శిష్యులతో కలిసి శంకరులు మహారాష్ట్ర దేశంలోని పుణ్యక్షేత్రాలను, శ్రీశైలం వంటి ఇతర క్షేత్రాలను సందర్శించారు. శ్రీశైలంలో "శివానందలహరి" స్తోత్రాన్ని రచించారు. మాధవీయ శంకర విజయం ప్రకారం ఒక కాపాలికుడు శంకరులను సంహరింపబోయినపుడు శంకరుల శిష్యుడు పద్మపాదుడు దేవుని ప్రార్థించాడు. అపుడు శ్రీనృసింహుడు శంకరులను రక్షించాడు. ఆ సందర్భంలోనే శంకరులు శ్రీలక్ష్మీనృసింహ స్తోత్రంతో దేవుని స్తుతించారు. ఈ స్తోత్రాన్నే కరావలంబస్తోత్రం అని కూడా అంటారు. 

తరువాత శంకరులు గోకర్ణంలో హరిశంకర మందిరాన్ని, కొల్లూరులోని మూకాంబిక మందిరాన్ని దర్శించారు. కొల్లూరులో మూగవాడనిపించిన ఒక యువకుడు హస్తామలకాచార్యుడనే పేరుతో శంకరుల శిష్యుడైనాడు. తరువాత శంకరులు శృంగేరిలో శారదా పీఠాన్ని స్థాపించారు. తోటకాచార్యుడు శంకరుల శిష్యుడయ్యాడు. పిదప శంకరులు దక్షిణ, ఉత్తర దేశాలలో తన "దిగ్విజయం" సాగించారు. హిందూ, బౌద్ధ పండితులను వాదాలలో ఓడించి అద్వైతాన్ని ఒప్పించారు. కేరళ, కర్ణాటక, సౌరాష్ట్ర దేశాలలో శంకర దిగ్విజయం సాగింది. గోకర్ణం, సోమనాధ, ద్వారక, ఉజ్జయినిలను దర్శించారు. బాహ్లిక దేశంలో జైనులను వాదంలో ఓడించారు. కాష్మీర, కాంభోజ దేశాలలో తాంత్రికులను కలుసుకొన్నారు.


సర్వజ్ఞపీఠం అధిరోహణ


కేదారనాధ్‌లో శంకరుల సమాధి మందిరం వద్ద ప్రతిమ

శంకరులు కాష్మీర దేశంలో శారదాపీఠాన్ని సందర్శించారు. (ఇది ఇప్పుడు పాకిస్తాన్ అధీన ప్రాంతంలో ఉంది. ఆ పీఠానికి నలుదిక్కుల ద్వారాలలో నలుగురు ఉద్ధండ పండితులు ఉన్నారు. కాని దక్షిణ ద్వారం అంతవరకు తెరువబడలేదు (అనగా దక్షిణ దేశంనుండి గొప్ప పండితులెవరూ రాలేదు). పండితులను మీమాంస వేదాంతాది తర్కాలలో ఓడించి శంకరులు దక్షిణ ద్వారాన్ని తెరిపించి అక్కడి సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.

తన జీవితం చివరి దశలో శంకరులు కేదార్‌నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను దర్శించి దేహ విముక్తుడయ్యారు. కేదారనాధ మందిరం వెనుక శంకరుల స్మృతి చిహ్నంగా ఒక సమాధి ఉంది. అయితే శంకరులు కేరళలోని త్రిస్సూర్‌లో దేహంవిడిచారని "కేరళీయ శంకర విజయం" చెబుతున్నది. 


శంకరుల జీవిత కాలము


శంకరుల జీవిత కాలం గురించి ప్రబలమైన అభిప్రాయాలున్నాయి.


క్రీ.పూ. 509 – 477 :ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయింపబడుతున్నది.


అయితే శంకరులు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్‌త్సాంగ్ తన రచనలలో ప్రస్తావించాడు. అంతే కాకుండా ఇంచుమించు శంకరుల సమకాలీనుడైన కుమారిలభట్టు 8వ శతాబ్దం వాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగాను, మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగాను, ద్వారక, పూరి రికార్డు కంటే శృంగేరి రికార్డులు మరింత బలంగా ఉండే అవకాశం ఉండవచ్చును.


చతుర్మఠాల వ్యవస్థ


శృంగేరిలో విద్యాశంకర మందిరం

(జగద్గురు బోధలు,సాధన గ్రంథ మండలివారి శంకరుల జీవిత చరిత్ర ల నుండి)

మఠము-పీఠము. సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి, కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరంచేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం, అప్పటి (వందల సంవత్సరాల)నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నదంటే శంకరులు ఏప్రాతిపదికపై ఎంత పటిష్ఠంగా నిర్మించారో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరులు మఠామ్నాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. మఠామ్నాయము, మహాశాసనములు నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకొనే, నిర్వహణ స్వరూపమైన, మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనే రెండు ప్రధాన పత్రాల వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించినది కాగా రెండవది సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది. నేటి ఆధునిక పద్ధతులను శంకరులు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టుట జరిగింది.

శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరము యోగపట్టము అనే దానిని ప్రవేశపెట్టారు.హిందూధర్మం ప్రకారం సన్యాసం తీసుకొన్న వ్యక్తి పాతపేరును తీసివేసి సన్యాసి అని సూచించే కొత్తపేరును తీసుకొంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగపట్టము అంటారు. అటువంటి పది పేర్లను శంకరులు నిర్దేశించారు. అవి .తీర్ధ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్ల చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు- ఆనందతీర్ధ, విద్యారణ్య, సత్యవృతసామాశ్రమి, విద్యాప్రకాశానందగిరి, చంద్రశేఖరసరస్వతి, నృసింహ భారతి, తోతాపురి అనే పేర్లు సుప్రసిద్దాలు. శంకరులు నాలుగు మఠాల స్థాపనకు ప్రమాణంగా దిక్కులను, వేదాలను, సంప్రదాయాలను అనుసరించారు.

మఠాల వివరాలు

[29/12, 08:30] M MURALIDHAR: ఆమ్నాయాలు: ఆమ్నాయాలు ఏడు. పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వ, స్వాత్మ, నిష్కల ఆమ్నాయములు. వీటిలో మొదటి నాలుగు దృష్టికి గోచరించేవి కాబట్టి దృష్టి గోచరములు అని, చివరి మూడు దృష్టికి గోచరించనివి బుద్ధికి మాత్రమే అందేవి కాబట్టి జ్ఞానగోచరములు అని వ్యవహరించారు.

వేదము- మహావాక్యము :వేదాలు నాలుగింటి లోను ఒక్కొక్కదానినుండి ఒక్కొక్క వాక్యము తీసుకొనబడింది.


ఋగ్వేదం నుండి ప్రజ్ఞానం బ్రహ్మ


యజుర్వేదం నుండి అహం బ్రహ్మస్మి


సామవేదం నుండి తత్త్వమసి


అధర్వణ వేదం నుండి అయమాత్మా బ్రహ్మ


అనేవాక్యాలు తీసుకొనబడినవి. ఈ వాక్యాలు ఒక్కొక్కటి సమస్త వేదసారాన్ని వేర్వేరు దృక్కోణాలలో వ్యక్తీకరించగలిగేది.

సంప్రదాయాలు: సంప్రదాయాలు నాలుగు విధాలైనవి. అవి కీటవార సాంప్రదాయం, భోగవార సాంప్రదాయం,ఆనందవార సాంప్రదాయం, భూరివార సాంప్రదాయం అనేవి. వీటిని ప్రామాణికంగా తీసుకొని శంకరులు నాలుగు మఠాలను నిర్దేశించారు.

పూర్తి వ్యాసం కొరకు చూడండి. - చతుర్ధామాలు (మఠాలు), పూరీ మఠం, ద్వారక మఠం, శృంగేరి, బదరీనాథ్ మఠం

మఠ నిర్వహణలో శంకరుల వ్యవస్థానైపుణ్యము

మఠామ్నాయము అని పిలువబడే మఠ నిర్వహణ వ్యవస్థలో కొన్ని విశేష లక్షణాలను శంకరులు ఏర్పరిచారు. వాటిలో


శంకరులు పీఠాలకు నారాయణుని, సిద్ధేశ్వరుని{శివుడు} అది దేవతలుగా నిర్ణయించాడు. దీని ద్వారా హిందూ ధర్మంలోని ఏ ఒక్క పంథా నో అనుసరించలేదు అని స్పష్టం చేసాడు.


వివిధ యోగ పట్టములు ధరించిన సన్యాసులకు వేర్వేరు బాధ్యతలను కేటాయించుటద్వారా హిందూ ధర్మావలంబులైన ప్రజల వివిధ ధార్మిక అవసరాలకు, వారుండే వేర్వేరు భౌగోళిక ప్రాంతాలకు ధర్మాచార్యులు అందుబాటులో ఉండే ఏర్పాటు చేసాడు.


పర్యటన, భిక్ష అనబడే వ్యవస్థలు సన్యాసులు అన్ని ప్రాంతాలను చుట్టివచ్చేందుకు, వైయుక్తికంగా ఆర్థిక లంపటాలలో చిక్కుకొనకుండా సామాన్య ప్రజలపై ఆధార పడుతూ,"తమ ధర్మాన్ని తామే పోషించాలి"-అనే స్పృహను ప్రజలలో కలుగచేసేందుకే రూపొందించాడు.


ధర్మాన్ని కాపాడుకోవడంలో తమకూ బాధ్యత ఉందని ప్రజలకు తెలియ చెప్పేందుకు, ప్రజల మధ్య ఉంటూ వారిలో ధర్మాన్ని వ్యాప్తిచేయడానికి తమ శక్తిని ఉపయోగించాలి అనే భావనను పీఠాధిపతులలో కలుగ చేయడానికి యోగ పట్ట వ్యవస్థను రూపొందించాడు.


శంకరుల రచనలు


త్వరిత వాస్తవాలు: వేదములు (శ్రుతులు), వేదభాగాలు ...


ఉపనిషత్తులలోని విషయాలు ఆధారంగా అద్వైత వేదాంతాన్ని నిరూపించడం శంకరుల రచనలలో ముఖ్య విషయం. ఇందుకు వేదాలనుండి, ఇతర పురాణేతిహాసాలనుండి శంకరులు ఉదహరించారు. స్వానుభవానికి శంకరులు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన రచనలలో తర్కం చాలా బలమైన స్థానం కలిగి ఉంది. సాంఖ్య, బౌద్ధ, జైన, వైశేషిక వాదాలను, ఇతర వేదాంత విరుద్ధ హిందూ భావాలను ఖండించాడు. శంకరుల రచనలు మూడు విధాలుగా విభజింపవచ్చును - భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు.


భాష్యాలు


వేదాంత, పురాణేతి హాసాలను వివరంచే గ్రంథాలు. అద్వైత సిద్ధాంతాన్ని నిరూపించేవి. శంకరులు తన భాష్యాలలో శ్వేతాశ్వర, కౌషీతకి, మహానారాయణ, జాబాల వంటి ఉపనిషత్తులనుండి విస్తృతంగా ఉదహరించారు. శంకరులు క్రింది గ్రంథాల గురించి భాష్యాలు వ్రాశారు.


బ్రహ్మసూత్రాలు


ఐతరేయోపనిషత్తు (ఋగ్వేదము)


బృహదారణ్యకోపనిషత్తు (శుక్ల యజుర్వేదము)


ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) (శుక్ల యజుర్వేదము)


తైత్తరీయోపనిషత్తు (యజుర్వేదము)


ఛాందోగ్యోపనిషత్తు (అధర్వణ వేదము)


మాండూక్యోపనిషత్తు (అధర్వణ వేదము), గౌడపాదకారిక


ముండకోపనిషత్తు (అధర్వణ వేదము)


ప్రశ్నోపనిషత్తు (అధర్వణ వేదము)


భగవద్గీత


విష్ణు సహస్రనామ స్తోత్రము


గాయత్రీ మంత్రము


ఇప్పుడు లభించే కొన్ని (కౌషీతకి, నృసింహ తాపని, శ్వేతాశ్వర) ఉపనిషద్భాష్యాలు శంకరులు వ్రాశారా అన్న విషయం గురించి సందేహాలున్నాయి.. బ్రహ్మ సూత్రాలకు శంకరులు వ్రాసిందే మనకు లభించే మొదటి భాష్యం. కాని శంకరులు ద్రవిడ, భర్తృప్రపంచ వంటి భాష్యాలను పేర్కొన్నారు.


ప్రకరణ గ్రంథాలు


ప్రకరణ గ్రంథాలు అనగా తత్వ, వేదాంత వివరణలు. గురువు శిష్యులకు వివరించి చెప్పే విధంగా ఉండేవి.


వివేక చూడామణి


ఉపదేశ సహస్రి


శతశ్లోకి


దశశ్లోకి


ఏక శ్లోకి


పంచ శ్లోకి


ఆత్మబోధ


అపరోక్షానుభూతి


సాధనా పంచకము


నిర్వాణ శతకము


మనీషా పంచకము


యతి పంచకము


వాక్య సుధ


తత్వబోధ


సిద్ధాంత తత్వవిందు


వాక్యవృత్తి


నిర్గుణ మానస పూజ


శంకరులు వ్రాసారని చెప్పబడే వాటిలో "ఉపదేశ సహస్రి" మాత్రం శంకరులు వ్రాసారని అధికుల అభిప్రాయం. మిగిలిన వాటిపై సంశయాలున్నాయి (వేరేవారు వ్రాసినా శంకరుల పేరు మీద ప్రసిద్ధమయ్యాయని)


స్తోత్రాలు


భక్తి, లయ, కవితా సౌరభాలతో భగవంతుని అర్చించే సాధనాలు. శంకరులు తన "గురు స్తోత్రం" ఆరంభంలో చెప్పిన "గురుర్బ్రహ్మా, గురుర్విష్ణుః, గురుర్దేవో మహేశ్వరః, గురుఃసాక్షాత్ పరంబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః" అనే స్తోత్రం ప్రార్థనా గీతంగా చాలా ప్రసిద్ధమైనది. శంకరులు వ్రాశారని చెప్పబడే కొన్ని స్తోత్రాలు:


శివ పంచాక్షరీ స్తోత్రం


ప్రస్థానత్రయం


పాండురంగాష్టకం


సాధన పంచకం


వివేకచూడామణి


శివానందలహరి


మనీషాపంచకం


సౌందర్యలహరి


మీనాక్షీ పంచరత్న స్తోత్రం


ఆనందలహరి


గణేశ పంచరత్న స్తోత్రం


లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం


భజగోవిందం


కనకథారా స్తోత్రం


సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం


గంగా స్తోత్రము


శ్రీదక్షిణామూర్తి స్తోత్రము


వీటిలో కొన్ని శ్లోకాలు ఇతరులు వ్రాయగా అవి శంకరుల పేరుతో జగత్ప్రసిద్ధమయ్యాయని కొందరి భావన.


శంకరుల తత్వం, సిద్ధాంతం


Main article: అద్వైతం


శంకరులు బోధించిన తత్వం "అద్వైతం" - అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము (పరమాత్మ) ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. ఇందుకు మౌలికమైన సూత్రాలను శంకరులు ప్రస్థాన త్రయం (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు) నుండి గ్రహించారు.

అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని "వివేక చూడామణి" అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది -

బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నఽ పరః

బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య. జీవునకు, బ్రహ్మమునకు భేదం లేదు.

శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూలస్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా "తత్వమసి" అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి, అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మ జ్ఞానాన్ని తెలిసికొన్నవారే జీవన్మిక్తులు, మహాత్ములు.

శంకరుల మాయావాదాన్ని తీవ్రంగా విమర్శించేవారున్నారు. అయితే బ్రహ్మమొక్కటే సత్యమనే విషయానికి ఫలితంగా సంసారం మిథ్య అనే నిర్ణయానికి రావలసి వస్తుందని అద్వైత వాదులు అంటారు.


శంకరుల ప్రభావం


బౌద్ధ, జైన మతాల ప్రాబల్యం కారణంగా శంకరుల కాలంనాటికి హిందూమతం క్షీణ దశలో ఉంది. అనేక శాఖలు వారిలో వారు తగవులాడుకొంటుండేవారు. మీమాంస, సాంఖ్య వాదులు దాదాపు దేవుడిని నమ్మరు. చార్వాకులు వేదాలను నిరసించారు.

ఆది శంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను వాదంలో ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుని నమ్మేవారినందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశారు. వేదాలకు తరిగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశారు.

కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుల ప్రభావం హిందూమతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొలిపిన సంప్రదాయాలను ఆచరిస్తారు. దశనామి సంప్రదాయం, షణ్మత విధావం, పంచాయతన విధానం శంకరులు నెలకొలిపినవే.

సంప్రదయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణం, మీమాంస వంటి అధ్యయనాలు వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన రంగాలు.

శంకరుల గురించి ఒక ప్రసిద్ధ శ్లోకం

శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయంనమామి భగవత్పాద శంకరం లోక శంకరం

శంకరుల తరువాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూమతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పటికీ ఈ ముగ్గురు ప్రారంభించిన తత్వ, వేదాంత, పూజాది నియమాలు, సంప్రదాయాలలో వేటినో కొన్నింటిని హిందువులలో అధికులు పాటిస్తున్నారు. వీరు మువ్వురి కృషివలన వేదాంతానికి సుస్థిరమైన స్థానం ఈ నాటికీ లభిస్తున్నది. (చూడండి - త్రిమతాలు)


అనంతర పరిణామాలు


శంకరుల అనంతరం అతడి శిష్యులు అద్వైత సిద్ధాంతాన్ని తత్సంబంధిత మతాచారాలను ముందుకు తీసుకొని వెళ్ళారు. అద్వైత సిద్ధాంతంలో పాండిత్యాన్ని సంపాదించిన పిదప ఎందరో పండితవర్యులు వ్రాసిన వ్యాఖ్యలను పరిశీలించిన మీదట నేడు అమలులో ఉన్న అద్వైత వ్యవస్థలను నాలుగు రకాలుగా విభజించవచ్చు.


నిర్గుణబ్రహ్మ వాదము


బ్రహ్మవివర్త వాదము


అనిర్వచనీయ ఖ్యాతివాదము


జీవన్ముక్తి వాదము


అద్వైత సిధ్ధాంతపు పునాదులపై ప్రతిపాదించ బడిన ఈ నాలుగు సిధ్ధాంతాలూ, ఒకదానికొకటి చక్కని పొంతన కలిగి ఉన్నాయనటంలో సందేహం లేదు.మొదటి రెండు సిద్దాంతాలకూ అధిభౌతిక భావార్థముంటే, మూడవ దానికి అధిభౌతిక, జ్ఞానమీమాంసకు సంబంధించిన భావార్థాలున్నయి. నాలుగవ సిద్ధాంతానికి గొప్ప మౌక్తిక భావార్థమున్నది.

[29/12, 08:32] M MURALIDHAR: పూరీ మఠము జగద్గురువులు ఆది శంకరులచే స్థాపించబడిన నాలుగు మఠములలో ఒకటి. దీనినే పూర్వామ్నాయ మఠము అని, గోవర్ధన మఠమని కూడా అంటారు. ఇది దేశానికి తూర్పు తీరాన గల పూరీ పట్టణంలో ఉంది.


మఠ విశేషాలు


ఈ మఠం భోగవార సంప్రదాయానికి చెందినది. ఇక్కడి సన్యాసులు 'వన', 'అరణ్య'అను యోగపట్టములు ధరిస్తారు.


మఠక్షేత్రం పురుషోత్తమం (పూరీ).


పీఠ దేవత పురుషోత్తముడు (జగన్నాథుడు).


పీఠశక్తి వృషలాదేవి (సుభద్ర).


మఠము యొక్క మొదటి ఆచార్యుడు హస్తామలకాచార్యుడు.


మహోదధి ఈ మఠ తీర్థము.


ఈ మఠానికి చెందిన సన్యాసులను 'ప్రకాశకులు' అని వ్యవహరిస్తారు. భోగమంటే విషయములు. ఎవరు జీవులను విషయ లంపటముల నుండి దూరంగా ఉంచేందుకు వారిస్తారో వారిది భోగవాళ సాంప్రదాయం. ప్రజల భోగలాలసత్వాన్ని నివారించి ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించడానికి ఈ మఠం ప్రత్యేక బాధ్యత వహిస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఈ మఠం యొక్క మహావాక్యము. ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. ఇక్కడి బ్రహ్మచారులు కాశ్యపగోత్రీకులుగా పరిగణింపబడతారు. అంగ, వంగ, కళింగములు ఈ మఠ పరిధిలోని ప్రాంతాలు. ఈ ప్రాంత హిందూధర్మ పరిరక్షణ ఈ పీఠం బాధ్యత.

[29/12, 08:33] M MURALIDHAR: ద్వారకా మఠము జగద్గురు ఆది శంకరులచే స్థాపించబడిన నాలుగు మఠములలో ఒకటి. ఈ మఠం క్షేత్రం గుజరాత్లో ద్వారకా క్షేత్రము వద్ద ఉంది.


మఠ విశేషాలు


ఈ మఠము దేశానికి పశ్చిమంగా, మొదటగా స్థాపించబడింది.


దీనిని కాళికామఠమనీ, సిద్ధేశ్వరమఠమనీ, పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు.


ఇది కీటవాళ సాంప్రదాయ మఠము. భూతదయతో నిత్యము కీటకములు మొదలైన వాటిని హింసించకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడాన్ని కీటవాళ సాంప్రదాయమంటారు.


ఈ మఠ సన్యాసులకు చివర 'తీర్ధ' అనిగాని 'ఆశ్రమ' అని గాని ఉంటుంది.


పీఠ దేవత సిద్ధేశ్వరుడు; పీఠ శక్తి భద్రకాళి.


మఠము యొక్క మొదటి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యులలో ఒకడైన పద్మపాదాచార్యుడు.


గోమతీ నది ఈపీఠ తీర్థము.


ఇక్కడ ఉండే బ్రహ్మచారులను స్వరూపులని వ్యవహరిస్తారు. సన్యాసంతీసుకోబోయేముందు బ్రహ్మచారిగాచేరి శిక్షణపొంది సన్యాసం స్వీకరిస్తారు. స్వరూపులనే ఈ మఠ సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది. తత్త్వమసి అనేది ఈమఠంయొక్క మహావాక్యం. ఈ వాక్యం జీవ, బ్రహ్మల ఐక్యతను ప్రతిపాదిస్తుంది. బ్రహ్మచారులు అవిగత గోత్రానికి చెందినవారుగా పరిగణింప బడతారు. సింధు, సౌరాష్ట్ర, మహారాష్ట్రములు వాటి మధ్యనున్న పశ్చిమభారత ప్రాంతం ఈ మఠం పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో హిందూమతధర్మాన్ని సుస్థిరం చేయవలసిన బాధ్యత ఈ ద్వారకామఠానిది.

[29/12, 08:34] M MURALIDHAR: శృంగేరి (కన్నడ: ಶೃಂಗೇರಿ), కర్ణాటక రాష్ట్రం చిక్ మగళూర్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. విభాణ్డక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము, శృంగేరి దగ్గరగా ఉన్న శృంగపర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి  పాలిస్తున్న అంగ రాజ్యంలో అడుగు పెట్టి ఆ రాజ్యాన్ని క్షామం నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. ఈ వృత్తాంతము రామాయణము బాల కాండములో వస్తుంది. ఈ గ్రామములోనే శంకరాచార్యులు అద్వైతమును వ్యాప్తిచేయుటకై స్థాపించిన శంకర మఠమును దఖ్షిణామ్నాయ మఠం అని అంటారు.

[29/12, 08:35] M MURALIDHAR: శంకరాచార్యులు ధర్మ ప్రచారం కోసం దేశాటన జరుపుతున్న సమయములో, ఆయన తన పరివార శిష్యులతో ఇక్కడకు పర్యటించుచున్నప్పుడు ఒక సర్పము ప్రసవించుచున్న ఒక మండూకానికి నీడ కల్పించే సంఘటన ఆయనకు కనిపిస్తుంది. ప్రాకృతికవైరులైన సర్పమండూకముల మధ్య పరస్పర మైత్రీ భావము, సర్పానికి మణ్డూకంపై అత్యంత దయార్థ్ర భావము చూచి భగవత్పాద శంకరాచార్యుల మనస్సులో ప్రాకృతికవైరులలో మైత్రీభావము మూర్తీభవించి ఉన్నది కాబట్టీ ఈ క్షేత్రము అత్యంత పవిత్రమైనది అని స్ఫురించి అంతే కాకుండా ఇక్కడ వరకు వచ్చేటప్పడికి మండన మిశ్రుడి భార్య అయిన ఉదయ భారతి సరస్వతి మూర్తిగా మారిపోతుంది. ఈ రెండు సంఘటనలు చేశాక ఇక్కడే మెదటి మఠం నిర్మించాలని తలచి మెదటి మఠాన్ని ఇక్కడే స్థాపిస్తారు. ఆది శంకరుడు ఇక్కడ 12 సంవత్సరాలు గడిపాడు అని చెబుతారు. ఆ తరువాత దేశాటన జరుపుతూ పూరి లో, కంచి లో, బదరిలో, ద్వారకలో మఠాలను స్థాపించారు.

1782 నుంచి 1799 వరకూ శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులు హైదర్ అలీ, అతని కుమారుడు టిప్పు సుల్తాన్లకు శృంగేరీ శంకరాచార్యులపై చాలా గౌరవం ఉండేది. మరాఠీ సైన్యం వచ్చి రాజ్యంపై పడినప్పుడు శృంగేరీ మీద కూడా దాడిచేసి ఊరినీ, పీఠాన్ని కూడా దోచుకున్నారు. స్వామివారికి, వారి శిష్యులకు అన్నవస్త్రాలకే లోటువచ్చింది. టిప్పుసుల్తాన్ ఈ సంగతి తెలుసుకుని వారికి ఆహారపదార్థాలు, బట్టలు, ధనం, మరెవరైనా దోచుకోబోతే అడ్డుకుందుకు సైన్యాన్ని ఇచ్చి పంపారు.

[29/12, 08:36] M MURALIDHAR: శృంగేరిలో ముఖ్యమైన దర్శనీయ విశేషాలు


శృంగేరి శారదాంబ దేవాలయం


విద్యాశంకర దేవాలయం


ఆది శంకరుల దేవాలయం


నరసింహవనం


తుంగ నది


శారదాంబ దేవాలయం


శారదాదేవి జ్ఞానానికి విజ్ఞాన సర్వసానికి తల్లి. ఈ దేవాలయంలో ఉన్న అమ్మవారు శంకరాచార్యుల సమయమునుండి ఉన్నదని చెబుతారు. మండన మిశ్రుని భార్య అయిన ఉభయ భారతి ఇక్కడ విగ్రహంగా మారిపోయిందని కూడా చెబుతారు. మెదలు ఇక్కడ చందనంతో చేసిన విగ్రహం ఉండేది. ఆ చందన విగ్రహాన్ని 14 వ శతాబ్దములో విద్యారణ్య స్వామి పీఠాధిపతిగా ఉన్న సమయంలో రాతి, బంగార విగ్రహ ప్రతిష్ఠ చేసారని చరిత్ర బట్టి తెలుస్తోంది. ఆలయ పరిసరాలు 20 వ శతాబ్దం వరకు చెక్కతో నిర్మించబడింది. అగ్నిప్రమాదము జరగడంతో పాత దేవాలయపు స్థానములో కొత్తదేవాలయము నిర్మించారు. జీర్ణోద్ధారణ జరిగిన ఆ ఆలయ ప్రాంగణం అంతా ద్రవిడ దేవాలయ నిర్మాణ శైలిలో  జరిగింది.


విద్యాశంకర దేవాలయం


శారదా శృంగేరి మఠానికి పదవ పీఠాధిపతైన విద్యాశంకర తీర్థుల స్మారకంగా ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఆ తరువాత పీఠాధిపతి భారతి కృష్ణ తీర్థుల ఆధ్వర్యంలో 1357-58 మిగిలిన నిర్మాణం జరిగింది. విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్క రాయలకు గురువు. ఈ ఆలయం నిర్మాణం హొయసల శైలలో జరిగింది. ఈ దేవాలయంలో విద్యాశంకర స్వామి లింగాకారంగా ఉంటారు. స్వామికి ఇరుప్రక్కల వినాయకుడు, అమ్మవారు ఉంటారు. ఈ దేవాలయం లోపలి మండపంలోని స్థంబాలపై 12 రాశులు చెక్కి ఉంటాయి. ఆలయ నిర్మాణం, గవాక్షాల ఏర్పాటు (కిటికీ ఏర్పాటు) సూర్య కిరణాలు నెలల ప్రకారం ఆయా రాశుల మీద పడేటట్లు చేయబడింది. ఇంకో విశేషం ఏమంటే మండపంలోని స్తంభాలపై ఉన్న గుండ్రపు రాళ్ళు గోళాకారంగా సింహపు నోటి నుండి బయటకు జారునట్లుగా చెక్కారు. ఇవి సింహం నోటిలో ఉన్నట్లు ఉంటాయి కాని గోళం అంచులు సింహం నోటికి తగిలి తగలనట్లు ఉండి జారిపడతాయి అనిపించేటట్లుగా అత్యద్భుతంగా చెక్కారు.


శృంగేరి శారదా పీఠం


ఆదిశంకరులు అద్వైతం ప్రచారం చేయడానికి నెలకొల్పిన నాలుగు మఠాలలో శృంగేరి శారద మఠం మెదటిది. దీనినే దక్షిణామ్నాయ మఠంగా చెబుతారు. దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యములో ఉన్న కృష్ణ యజుర్వేదము ఈ మఠానికి ప్రధాన వేదం. ఈ మఠానికి పీఠాధిపతిని స్వయంగా శంకరాచార్యులతో సమానంగా భావిస్తారు. ఆయన సన్యాస్యాశ్రమ నామానికి ముందు శంకరాచార్య అని చేర్చబడుతుంది. ఇప్పటి శృంగేరి శారద మఠం పీఠాధిపతి భారతి తీర్థులు.


తుంగ నది

[29/12, 08:36] M MURALIDHAR: శృంగేరి తుంగ భద్ర నది ఒడ్డున ఉంది. తుంగ నది ఇటు ప్రక్కన విద్యాశంకర దేవాలయం, దాని ప్రక్కన ఆ ఆలయానికి అనుసంధానం ఉన్న చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడి పూజా మూర్తులకు అవసరమైన జలాలన్ని ఇక్కడ నుండే తెస్తారు. తుంగభద్ర నది అవతల ఒడ్డున నరసింహవనం ఉంది. అభినవ విద్యాతీర్థ స్వామి ఆధ్వర్యంలో తుంగభద్ర నదిపై విద్యాశంకర సేతువును నిర్మించారు. తుంగానదిలో అసంఖ్యాకంగా చేపలు నది ఒడ్డుకు వస్తుంటాయి, భక్తులు చేపలకు అటుకులు మున్నగునవి ఆహారంగా వేస్తారు. తుంగానది ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది, అందువలన ఇక్కడ ఈత కొట్టవద్దని హెచ్చరికలు ఉంటాయి.


నరసింహ వనం


నరసింహవనంలో శృంగేరి శారదా మఠానికి చెందిన పీఠం ఉంటుంది. పీఠాధిపతి ప్రతి రోజు ఆ పీఠాన్ని అర్చిస్తారు. నరసింహ వనంలోనే విదేహముక్తి పొందిన పూర్వ పీఠాధిపతుల స్మారక స్థూపాలు కూడా ఉన్నాయి. అభినవ విద్యాతీర్థ స్వామి, చంద్రశేఖర భారతి స్వామి స్థూపాలతో పాటు వారి విగ్రహాలు ఉంటాయి.

[29/12, 08:37] M MURALIDHAR: జ్యోతిర్మఠము అని పిలిచే బదరీనాధ్ ఆశ్రమం ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాలలో ఒకటి. దీనిని ఉత్తరామ్నాయ మనీ, బదరికాశ్రమం అని కూడా అంటారు. దీన్ని జోషిమఠ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో జోషిమఠ్ పట్టణంలో ఉంది. సముద్రమట్టం నుండి 1875 మీ. ఎత్తులో ఉన్న ఈ పట్టణం  అనేక హిమాలయ పర్వత శిఖరారోహణ యాత్రలు, ట్రెక్కింగు యాత్రలకు, బద్రీనాథ్ యాత్రకూ ప్రవేశ ద్వారం. 

జ్యోతిర్మఠం


మఠ విశేషాలు


జ్యోతిర్మఠం ఉత్తరామ్నాయ మఠం. ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు ప్రధానమైన పీఠాల్లో ఇదొకటి. మిగతా మూడూ శృంగేరి, పూరి, ద్వారకల్లో ఉన్నాయి. ఈ మఠాల ఆచార్యులను " శంకరాచార్య " అని అంటారు. ఆది శంకర ప్రారంభించిన సంప్రదాయం ప్రకారం ఈ మఠం అధర్వవేదానికి నేతృత్వం వహిస్తుంది. జ్యోతిర్మఠ బదరీనాథ్ పట్టణం దగ్గర ఉంది. ఈ ప్రదేశం గురు గోవింద్ ఘాట్ లేదా వాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కుకు వెళ్ళే ప్రయాణికులకు స్థావరం. ఇక్కడి నరసింహ ఆలయం లోని ప్రధాన దేవత నరసింహ స్వామి. దీన్ని ఆది శంకరులు స్థాపించాడని నమ్ముతారు. ఇది 108 " వైష్ణవ దివ్య దేశాలలో " ఒకటి. 


ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం.


పీఠ దేవత నారాయణుడు


పీఠ శక్తి పూర్ణగిరి.


పీఠ తీర్థం అలకనంద (గంగానది).


వీరిది నందవాళ సాంప్రదాయం. ఈ మఠ సన్యాసులు "గిరి", "పర్వత", "సాగర" యోగపట్టములను ధరిస్తారు. ఇక్కడ అథర్వణ వేదము ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతుంది. అయమాత్మా బ్రహ్మ అనేది ఈ మఠపు మహావాక్యము. ఈ మఠానికి తోటకాచార్యుడు మొదటి అధిపతి. భారతదేశపు ఉత్తర భాగం ఈ మఠం పరిధిలోకి వస్తుంది.


స్థల చరిత్ర


క్రీ.శ 7, 11 వ శతాబ్దాల మధ్య, కట్యూరి రాజులు తమ రాజధాని కుమావున్ లోని "కట్యూర్" నుండి (ఆధునిక బైజ్నాథ్ ) లోయలోని వివిధ ప్రాంతాలను పరిపాలించారు. కత్యూరి రాజవంశాన్ని వాసుదేవ్ కత్యూరి స్థాపించాడు. జోషిమఠ్ వద్ద ఉన్న పురాతన బాస్‌దేవ్ ఆలయం వాసుదేవ్ కు ఆపాదించబడింది. వాసుదేవ్ బౌద్ధ మూలానికి చెందినవాడు, కాని తరువాత బ్రాహ్మణ పద్ధతులను అనుసరించాడు. సాధారణంగా కట్యూరి రాజులు అనుసరించిన బ్రాహ్మణ పద్ధతులకు కారణం ఆది శంకరు (క్రీ.శ. 788-820) చేసిన తీవ్రమైన ప్రచారం కారణమని చెప్పవచ్చు. 

11 వ శతాబ్దంలో కట్యూరి రాజులను ఓడించి చాంద్ రాజులు అధికారానికొచ్చారు.

వేంకటేశ్వర సుప్రభాతం

 వేంకటేశ్వర సుప్రభాతం. సుషుమా హవ మూర్తయే. సుషుమ్న, జాగృతః స్వప్న సుషుప్తి అని మూడు అవస్థలు ప్రతీ జీవికి కలవు. సుషుమ్న తెలియునా? నిద్ర మరియు మెలకువ కు మధ్యలో కల అవస్థ. మెలకువ 24 గంటలు నిద్ర కూడా 24 గంటలూ కూడా కష్టమే, ఏజీవికైనా.మరి సుషుప్తి అవసరం లేదా. యిదే మనో నేత్రములు మౌనం యెూగం తద్వారా ఙ్ఞానం. నిద్రలో ఙ్ఞానం తెలియదు. జాగృతావస్థ మేలుకొని వుంటేనే ధాతుపరమైనది పదార్ధరూపమైన లక్షణము గల మాయామయమైన జగత్తు గురించి తెలియుట. అస్థిరమైనది పదార్ధము స్థిరమైన ఆత్మ తత్వమును సుషుమ్న లోనే తెలియవలెనని. వీని గురించి సవివరముగా తెలియుట ఙ్ఞానమని అదియే ఆత్మ ఙ్ఞాన మని అది దేహధారణం వలననే తెలియును. వేరు మార్గం లేదు. అందుకే అటువంటి సుషుమ్నా అవస్థ కలిగిన వేంకట ప్రభువుకు మంగళము కలుగుగాక. ప్రభువులకు, మంగళమైన వారికి మూలమైన జగత్తు, జగత్తు రూపంలో వున్న జీవులకు అవే మంగళ ప్రదమైన ప్రకృతికి కారణమైన హవనరూపమైన హవిస్సులు మూలం. వాటికి అధిపతి వేంకటరమణ తత్వం. జీవులకు శుభాశుభ మిశ్రమమైన దేహధారణ తత్వము సుషుమా హవము.

మొగలిచెర్ల

 *స్వప్నంలో అభయం..*


"అయ్యగారూ..నేనూ మా అమ్మాయీ స్వామివారి సమాధి వద్దకు ఒక్కసారి వెళ్లివస్తాము..అమ్మాయి పదవతరగతి పరీక్షలు వ్రాస్తోంది..తన హాల్ టికెట్ స్వామివారి సమాధి వద్ద పెట్టి మొక్కుకుంటుందట.." అని ఆ తండ్రి అడిగాడు..సరే అన్నాను..ఆ తండ్రీ కూతుళ్లు ఇద్దరూ లోపలికి వెళ్లారు..స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసారు..అమ్మాయి తన హాల్ టికెట్ స్వామివారి పాదుకల వద్ద పెట్టి నమస్కారం చేసుకొని, ఇవతలికి వచ్చి, నాకు కృతజ్ఞతలు తెలిపి వెళ్లిపోయారు..పరీక్షలు అయిపోయి ఫలితాలు వచ్చిన రెండు రోజుల తరువాత ఆ తండ్రీ కూతుళ్లు మళ్లీ వచ్చారు..అమ్మాయి మంచి మార్కులతో పాస్ అయిందని..స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామని చెప్పారు..ఆరోజు కూడా శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లారు..


మరో మూడు నాలుగు నెలల తరువాత, ఆ అమ్మాయిని తీసుకొని తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చారు..అయితే ఈ సారి వాళ్ళు సమస్యతో వచ్చారు..అమ్మాయిని ఇంటర్మీడియట్ లో, ఆ అమ్మాయి కోరుకున్న కాలేజీ లో చేర్పించారు..కాలేజీకి వెళ్లిన నెల తరువాత అమ్మాయి ప్రవర్తన లో మార్పు వచ్చింది..ఉత్సాహం గా వుండే ఆ అమ్మాయి నిరాశగా ఉన్నది..ఒంటరిగా కూర్చుని ఏడవటం..చదవకుండా ఉండటం..ఆహారం తీసుకోక పోవడం..ఇలా కొద్దిగా విపరీతపు పోకడలు పోతున్నది..తల్లిదండ్రీకి ఏమీ పాలుపోలేదు..కాలేజీ లో ఏదన్నా సమస్య ఉన్నదా అని విచారించారు..ఏ సమస్యా లేదు..ఏం చేయాలి? లక్షణంగా చదువుకునే అమ్మాయి ఇలా తయారైందే అని బెంగ పడ్డారు..


"మనం మొదటినుంచీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామినే నమ్ముకొని ఉన్నాము..ఇప్పుడు కూడా ఆ స్వామివారినే శరణు వేడదాము..మరో మార్గం నాకు కనబడలేదు..అక్కడికే పోదాము.." అని ఆ తండ్రి చెప్పాడు..భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకొని అమ్మాయిని తీసుకొని మొగలిచెర్ల దత్తాత్రేయుడి సన్నిధికి చేరారు..ఆ అమ్మాయికి తలారా స్నానం చేయించి, అమ్మాయిని తీసుకొని స్వామివారి మంటపం లోకి వచ్చి, "స్వామీ నిన్నే నమ్ముకున్నాము..ఒక్కగానొక్క బిడ్డ మాకు..ఆ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూడు స్వామీ.." అని మనస్ఫూర్తిగా ప్రార్ధన చేసుకున్నారు..


అమ్మాయిని తీసుకొని మంటపం చుట్టూ ప్రదక్షిణ చేసి, అమ్మాయిని కొద్దిసేపు మంటపం లో పడుకోబెట్టారు..అలా పడుకున్న కొద్దిసేపటి లోపే ఆ అమ్మాయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది..సుమారు రెండు మూడు గంటలు ఆ మంటపం లోనే నిద్ర పోయింది..నిద్ర లేచిన తరువాత, తల్లిదండ్రీ దగ్గరకు వచ్చి.."అమ్మా స్వామివారి సమాధి వద్దకు పోయి నమస్కారం చేసుకుందాము..పోదాం రండి.." అని పిలిచింది..వాళ్లిద్దరూ అమ్మాయి అలా పిలిచేసరికి.."అమ్మా..నీకెలా వుంది?" అని అడిగారు.."అమ్మా..వొళ్ళంతా తెలికై పోయినట్లు ఉంది..నా మీద నుంచి ఏదో పెద్ద బరువు తీసేసినట్లు ఉంది..ఎవరో వచ్చి నా తలమీద చేయి పెట్టి..ఇంకేమీ భయం లేదు అని చెప్పినట్లు అనిపించింది..మనం స్వామి దగ్గరకు పోదాము.." అని చెప్పింది..అమ్మాయిని తీసుకొని స్వామివారి సమాధి చుట్టూ ప్రదక్షిణ చేశారు..ఆ రాత్రికి అక్కడే నిద్ర చేశారు..ప్రక్కరోజు మధ్యాహ్నానికి "అమ్మా మనం ఊరెళ్లి పోదాము..నేను కాలేజీకి పోతాను..చదువుకుంటాను.." అన్నది..ఆ పిల్ల ముఖం లో మునుపటి ఉత్సాహం కనబడుతోంది..మరొక్క రోజు కూడా స్వామివారి సన్నిధి లోనే వుండి ఆ తరువాత వాళ్ల ఊరెళ్లి పోయారు..


ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు, అలాగే రెండవ సంవత్సరం..ఆ అమ్మాయి తండ్రితో కలిసి వచ్చి తన హాల్ టికెట్ స్వామివారి పాదుకల వద్ద పెట్టి నమస్కారం చేసుకొన్నది..మరెన్నడూ ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు..

ఇంజినీరింగ్ కూడా పూర్తి చేసుకొని, ఉద్యోగం లో చేరి..తల్లిదండ్రులు కుదిర్చిన పిల్లవాడితో వివాహం స్వామివారి సన్నిధి లోనే చేసుకున్నది..


ఇప్పటి కూడా స్వామివారి సన్నిధికి వచ్చినప్పుడల్లా.."నా జీవితం మొత్తం ఈ స్వామివారి చల్లటి చూపు వల్లే చక్కగా వున్నదని" పదే పదే చెప్పుకుంటుంది..నమ్మిన వారికి స్వామివారి కరుణ ఎల్లవేళలా ఉంటుందని మరోసారి నిరూపితం అయింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).