19, జనవరి 2021, మంగళవారం

తండ్రి ఆన్సర్

 _*తండ్రితో బ్యాంకులో లైన్ లో నించోడానికి*_ _*కోపమొచ్చి..కొడుకు ఏమన్నాడో తెలుసా.?*_

_*తండ్రి ఆన్సర్ హైలైట్.!*_


_కొంచెం డబ్బు పంపటం కోసం ఒక కుర్రాడు, వాళ్ళ నాన్నతో ఒక గంట పాటు బ్యాంకులో వేచి ఉన్నాడు._

_తను విసిగిపోయి ఆగలేక తన తండ్రిని ఇలా అడిగాడు_


_“నాన్నగారూ, మీరు internet bankingను ఎందుకని activate చేసుకోరు?”_


_“ఎందుకు చేయించుకోవాలి” అంటూ తండ్రి కుమారుడిని తిరిగి ప్రశ్నించాడు._


_“ఇలా ఇక్కడ గంట సేపు మనీ transfer కోసం ఎదురు చూడనక్కర్లేదు, ఇంకా సామాన్లు కూడా onlineలోనే ఇంటికే తెప్పించుకోవచ్చు”._


_internet banking ప్రపంచంలోకి తండ్రిని తీసుకురావాలని కొడుకు ప్రయత్నిస్తున్నాడు._


_*తండ్రి :* “అలా చేస్తే నేను ఇంట్లో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు కదా?”_


_”ఆవును అవును”, అని కొడుకు జవాబిచ్చాడు._

_“ఇంకా,… ఇంటికి కిరాణా సామాన్లు, కావాల్సిన వస్తువులు…_

_ఇలా ఎన్నో తెప్పించుకోవచ్చు, amazon flipkart లాంటి ఎన్నో కంపెనీలు ఎంతో సులువుగా, కచ్చితంగా సామాన్లు ఇంటికి అందజేస్తున్నాయి”, అంటూ వివరించే ప్రయత్నం చేశాడు._


_*అంతా విన్న తండ్రి ఇచ్చిన సమాధానానికి ఆ కొడుక్కు ఇంక మాటలే లేవ్ !!!*_


_“నేను ఈరోజు బయటకి రావటం వల్ల, నా పాత స్నేహితులని నలుగురిని కలిసాను._

_ఇక్కడ పని చేసే సిబ్బందితో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడాను._


_నీకు తెలుసు నేను ఒంటరివాడిని._

_నాకు ఈ సమయంలో కావాల్సిన స్నేహం ఇటువంటిదే._

_నాకు కావాల్సినంత సమయం ఉంది. నేను ధీమాగా తయారయ్యి ఇలాంటి పరిచయాల్ని పెంచుకుంటాను._


_రెండేళ్ల క్రితం నాకు అనారోగ్యం వచ్చినప్పుడు, నేను ఎప్పుడూ పళ్ళు కొనే కొట్టు వాడు నన్ను చూడటానికి వచ్చాడు._

_నాకోసం బాధపడ్డాడు…, కన్నీళ్లు కార్చాడు.., నేను కోలుకోవాలని, బాగుపడాలని కోరుకున్నాడు._


_కొన్ని రోజుల క్రితం…అమ్మ పొద్దున్నే, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది._

_మనం ఎప్పుడూ సామాన్లు కొనే కిరాణా కొట్టువాడు, తన బండిని తీసుకుని అమ్మని ఇంటికి చేర్చాడు._


_నువ్వన్నట్టు online లో shoppingలు అవీ చేస్తే, నాకు ఈ మానవ సంబంధాలు ఉండేవా.?_

_పళ్ళ కొట్టువాడు నా బాధను పంచుకునేవాడా.??_

_కిరాణా కొట్టువాడు అమ్మను ఇంటికి చేర్చేవాడా..???_


_ఒక computer లేదా mobile phoneతో సావాసం చేసి ఇంటికే అన్ని తెప్పించుకుంటే... నాకు దొరికే స్నేహితుడు ఎవడు? ఒక electronic పరికరమా!!!_


_నేను ఏదైనా కొనేటప్పుడు వాళ్ళను చూస్తూ వాళ్ళతో మాట్లాడటం నాకిష్టం._

_నువ్వనే ఆ amazon flipkartలో నాకు ఇవన్నీదొరుకుతాయా?_

_కేవలం నీకు సామాను పంపే seller పేరు తప్ప. మనిషి మనిషి కలిసిన నాడే సత్సంబంధాలు ఏర్పడతాయి, బంధాలూ బలపడతాయి._


_*టెక్నాలజీ ఉండాలి కానీ.,*_

_*అది మాత్రమే జీవితం కాకూడదు !*_

_*దానికి మనం బానిసలం కాకూడదు!*_


_*మనుషులతో జీవించండి…..*_

_*పరికరాలను వాడుకోండి…..*_


_*” ప్రేమించవలసిన మనుషులను వాడుకొని,*_

_*వాడుకోవాల్సిన పరికరాలతో జీవించకండి “*_


_*( తెగిపోతున్న మానవ సంబంధాల”*_

_*గురించి ఒక్కసారైనా అలోచించండి.)*_🙏🙏🙏🙏🙏🙏🙏🙏

కైలాస_పర్వతం

 #కైలాస_పర్వతం పైన #ఎత్తైన_శిల్పాలా!!

ఇది నిజంగా #అద్భుతమే కదా!!

హిందువుల విశ్వాసం ప్రకారం, 

కైలాస మనస సరోవర్ పర్వతం శివుని నివాసంగా పరిగణించబడుతుంది.కానీ ఈ రోజు వరకు ఎవరూ కైలాష్ మానససరోవర్ పర్వతాన్ని అధిరోహించలేదు. 


మొట్టమొదటిసారిగా, ఒక విదేశీయుడు "#గూగుల్ ఎర్త్" చేత కైలాస మనససరోవర్ పర్వతం యొక్క వీడియోను సృష్టించాడు, ఇది చాలా #నమ్మశక్యం_కాని అభిప్రాయాలను కలిగి ఉంది మరియు దాని వివరాలను విన్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. *


#250అడుగుల ఎత్తు .... 

అవును, 250 అడుగుల ఎత్తు ఉన్న కైలాస మానసరోవర్ పర్వతంపై #రాతి_శిల్పాలు ఉన్నాయని ప్రపంచంలో ఎవరికీ తెలియదని ప్రతినిధి వీడియోలో చెప్పారు.ఇంత ఎత్తైన విగ్రహాలను ఎవరు తయారు చేసి ఉంటారనేది చాలా ఆశ్చర్యకరమైనది మరియు ఆశ్చర్యకరమైనది ???  కైలాస మనస సరోవర్ పర్వతం మిలియన్ల సంవత్సరాల వయస్సు కలిగినది.


 శివుడి నివాసం అయిన కైలాస మానస సరోవర్ పర్వతం యొక్క అద్భుతమైన వాస్తవాల గురించి ఎవరూ తెలుసుకోకపోవడం ఆశ్చర్యకరం.#భోలే_నాథ్ యొక్క లీల సాటిలేనిదని మనిషి మాత్రమే చెప్పగలడు.


 * వీడియో చూడటం ద్వారా ప్రజలకు హిందూ ధర్మం పై అచంచలమైన విశ్వాసం కలుగుతుంది.శివుని నివాసమైన కైలాస మానససరోవర్ పర్వతాన్ని సందర్శించి, మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా, ఆశీర్వదించారని భావించి నమస్కరించండి !!!

నాన్నకు కన్నీళ్లు వున్నాయి 👨‍👧‍👦*

 *🌹నాన్నకు కన్నీళ్లు వున్నాయి 👨‍👧‍👦*


        *నాన్నలందరికి అంకితం* 


*నాన్న మనకోసం ఏం చేశాడో*

*ఏం కోల్పోయాడో  మనకు తెలియదు..!*


*జీవితాంతం పిల్లల కోసం తపిస్తూ, వారి అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి తండ్రి. తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు తండ్రి. నాన్న మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.*

 

*ఎందుకంటే.. నాన్న ఎవరికీ చెప్పడు. పిల్లలకి, భార్యకి అసలు చెప్పడు. అమ్మలా ప్రేమను బయటికి చూపించడం నాన్నకు రాదు. నాన్న ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*

 

*‘ఎప్పుడూ పనేనా? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. పెళ్లై, పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*

 

*మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. వృద్ధాప్యం ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న డాక్టర్‌ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*

 

*తన పిల్లలు గొప్ప వాళ్లు అవుతారని నాన్నకు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు. మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని ఆశ.*

 

*ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. ఎక్కడ, ఎన్ని సంతకాలు పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు అమ్మ ఏడ్వడం చూశాం కానీ, నాన్న ఏడ్వడం ఎప్పుడైనా చూశారా?.. నాన్న కూడా ఏడుస్తాడు. కానీ మీ ముందు ఏడ్వడం ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు.*

 

*పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. నాన్న అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, నేను ఎవరి కోసం బతికాను?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. ‘నా కోసం నేను ఏదీ దాచుకోలేదే..’ అనుకుంటాడు.*

 

*నిజానికి ‘నేను’ అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో నాన్నను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*

 

 *కొడుకు ఎంత మంచివాడు * ప్రయోజకుడైతే తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా తండ్రిని ఏడిపిస్తాడు.( పాజిటివ్ గా ఆలోచించండి) ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ నాన్న స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ నాన్న పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.** 

 

*మీ కోసం రిస్క్‌ తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న ఎనర్జీ పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది నాన్నలు జీవితంలో తమ పిల్లల కోసం ఆర్డినరీగా మిగిలిపోయారు..’*


 *🙏ప్రతీ నాన్నకు సెల్యూట్ 🙏*

🌾👨‍👧‍👦🌾 👨‍👧‍👦🌾👨‍👧‍👦 🌾👨‍

శ్రీకృష్ణుడికి

 *📖 మన ఇతిహాసాలు 📓*



*శ్రీకృష్ణుడికి ఎంత మంది పిల్లలో తెలుసా?*



శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. కానీ, గోవిందుడి కొడుకులు ఎవరు? ఎంతమంది ఉన్నారన్న అనుమానం కలుగుతుంది. మథురనిచేరి కంసుని చంపిన దేవదేవుడు తరువాత దేవకీ, వసుదేవుల చెంత వుంటూ వారిని అనుగ్రహించాడు. ఈ సందర్భంలో ఆయన అనేక వివాహాలు చేసుకున్నాడు. ప్రధానంగా ఎనిమిది మంది భార్యలు ఆయనకు అష్ట మహిషులుగాప్రసిద్ధి పొందారు! శ్రీకృష్ణ పత్నులైన ఆ ఎనిమిది మంది... లక్ష్మీదేవీ అవతారమైన రుక్మిణీ మాత, సత్రాజిత్తు తనయ అయిన సత్యభామ, శ్రీరాముని బంటైన జాంబవంతుని పుత్రిక జాంబవతి, అలాగే, వివిధ రాజ్యాల రాకుమార్తెలైన నాగ్నజితీ, భద్ర, మిత్రవింద, కాళింది, లక్షణ. ఈ ఎనిమిది మందితోనూ శ్రీకృష్ణ పరమాత్మకి పదేసి మంది కొడుకులున్నారని చెబుతోంది భాగవత పురాణం! అంటే, మొత్తం ఎనభై మంది తనయులున్నమాట!


గోపాలబాలుడి కులంలో పుట్టిన ఆయన వంశోద్ధారాకుల్లో అందరూ ప్రాముఖ్యత వహించలేదు. అయితే, రుక్మిణీ దేవీ కుమారుడైన ప్రద్యుమ్నుడు మహా సుందరుడు, వీరుడు. ఆయన సాక్షాత్తూ రతీదేవీ భర్త అయిన మన్మథుడు. శివుడికి తపోభంగం చేసిన కారణాన ఆయన రూపం నశించి పోగా.. రుక్మిణీ దేవీ గర్భంలో జన్మించి తిరిగి రూపం పొందాడు ప్రద్యుమ్నుడుగా! రుక్మిణీదేవీకి ప్రద్యుమ్నుడు కాక మరో తొమ్మిది మంది పుత్రులున్నారు. అలాగే, సత్యభామకి భాను, సుభాను, స్వర్భాను అంటూ పది ముంది భాను పేరుగల పుత్రులున్నారు. ఇక మరో ప్రధానమైన కృష్ణుడి పత్ని అయిన జాంబవతి కుమారుడు సాంబుడు. ఈయన కురుక్షేత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాటం చేసి చివరకు ప్రాణాలతో నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మరణించని అతి కొద్దిమందిలో జాంబవతి, శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు కూడా ఒకరు! ఈయన కాక మరో తొమ్మిది మంది సంతానం జాంబవతికి వున్నారు.


రుక్మిణీ, సత్యభామ, జాంబవతి లాగే ఇతర శ్రీకృష్ణ పట్టపు రాణులకు కూడా అనేక మందిపుత్రులున్నారు. వీళ్లే కాక అనంతమైన శక్తి కలిగిన ఆ స్వామికి నరకాసురవధ అనంతరం 16,108మంది స్త్రీలని పెళ్లాడవలసివచ్చింది. వారంతా నరకాసురుని బంధీలుగా మగ్గిపోయిన వారు! వారి ద్వారాకూడా శ్రీకృష్ణునికి ఎందరో సంతానం కలిగారు. అయితే, వాళ్లలో అందరూ కలియుగ ప్రారంభసమయంలో మురళీ మోహనుని అవతార సమాప్తి తరువాత అంతమైపోయారు. శ్రీకృష్ణ, బలరాముల వంశంలో అంతః కలహాలు పెల్లుబికి ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు! అలా కృష్ణుని సంతానం ఏదీ మిగలలేదు. రుక్మిణీ, శ్రీకృష్ణ పరమాత్మల తనయుడైన ప్రద్యుమ్నుడికి మాత్రం అనిరుద్ధుడనే కొడుకు కలిగాడు. ఆయన మాత్రం కృష్ణ వంశాన్ని కొనసాగించాడు!


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

కథ

 *✍🏼 నేటి కథ ✍🏼*



*తలపాగా ఖరీదు*



ఒకరోజు నస్రుద్దీన్‌ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు.

"రాజా ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను" అన్నాడు.

"అలాగా! దీని ఖరీదు ఎంత?" అన్నాడు రాజు.


"వెయ్యి వరహాలు రాజా" అన్నాడు నస్రు. ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు "రాజా! ఈ నస్రుద్దీన్‌ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. ఈ తలపాగా అంత ఖరీదు చెయ్యదు." అని చెవిలో చెప్పాడు.


మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి. అయినా తలపాగా నచ్చడంతో, "నస్రుద్దీన్‌! ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే. ఎందుకంత ధర?" అని అడిగాడు.


"రాజా! దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది. అంత గొప్పవాళ్లు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది. అందుకే బేరం కూడా చేయకుండా వెయ్యి వరహాలు పెట్టి కొన్నాను రాజా!" అన్నాడు నస్రు.


నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు. వెంటనే వెయ్యి వరహాలిప్పించి, ఆ తలపాగా తీసుకున్నాడు.

వరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు. అతని దగ్గరకి వెళ్లి, మంత్రిగారూ! మీకు తలపాగా గొప్పదనం తెలుసు, కాని నాకు రాజుగారి బలహీనత తెలుసు" అని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు.

తెలుసు కుందాం

 *✅తెలుసు కుందాం✅*



*🟥చలికాలంలో మన చేతివేళ్లు ఇతర దేహ భాగాల కన్నా చల్లగా ఉంటాయి. ఎందుకు?*


🟢 ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకునే ముందు ఒక భిన్న ప్రయోగం చేద్దాం. బాగా వేడిగా ఉన్న నీటిని రెండు సమాన పరిమాణం గల గిన్నెలలో తీసుకోండి. వాటిలో ఒకదాని మూతి చిన్నదిగానూ, మరొక దాని మూతి వెడల్పుగానూ ఉండాలి. కొంతసేపటికి జాగ్రత్తగా గమనిస్తే, వెడల్పు మూతి ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్లబడుతుంది. ఈ పరిశీలన బట్టి తెలిసేదేమంటే, నీటి ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే... అంటే మూతి వైశాల్యం ఎక్కువగా ఉన్న గిన్నెలోని నీరు త్వరగా చల్ల బడుతుంది. అంటే వేడిని త్వరగా కోల్పోతుంది అని అర్థం.


ఇప్పుడు ప్రశ్న విషయానికి వస్తే, మన శరీరంలో ఉష్ణం ఉంటుంది. ఆ ఉష్ణ పరిమాణం దేహంలోని ప్రతి ఘన సెంటిమీటరులో సమానంగా ఉంటుంది. కానీ ప్రతి ఘన సెంటిమీటరుకు చేతివేళ్లు, ముక్కు ఉపరితల వైశాల్యం మిగతా భాగాల కన్నా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చేతి వేళ్లు, ముక్కు వాటి ఉపరితలం నుంచి వేడిని త్వరగా కోల్పోయి చల్లబడతాయి. మిగతా దేహ భాగాలు నిదానంగా వేడిని కోల్పోవడంతో, అవి చేతివేళ్ల కన్నా కొంచెం వెచ్చగా ఉంటాయి.

వడ్డించే వాడు

 *🤠 నేటి సామెత 🌸*



*వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు*



భోజనాలకు బంతిలో కూర్చున్నప్పుడు మొదటగా వున్నావారికి అన్ని పదార్థాలు వడ్డిస్తారు. చివరకు వచ్చేసరికి కొన్ని పదార్థాలు అయిపోవచ్చు. ఆ కారణంగా చివర బంతిలో కూర్చున్న వారుకి అన్ని భోజన పదార్థాలు అందక పోవచ్చు. కాని వడ్డించే వాడు మన వాడైతే మనం చివరన లేదా వెనకగా కూర్చున్నా మన కోసమని మనవాడైన వడ్డించే వాడు మన వద్దకు వచ్చి కావలసిన పదార్థములను వడ్డిస్తాడస్ని అర్థము.

మూల శ్లోకాలు 1

 🍀🌺🍀🌺🍀 🌺🍀🌺🍀🌺🍀18.


సంస్కృత  వాక్యాలకు మూల శ్లోకాలు:


18.   వృద్ధ నారీ పతివ్రతా!

       ➖➖➖➖➖➖✍️️




*అసమర్ధస్య సాధూనాం*

*నిర్ధనస్య జితేంద్రియః*

*వార్ధక్యో దేవతా భక్తిః*

*వృద్ధ నారీ పతివ్రతా!*


అసమర్ధుని మంచితనం, 


ధనం లేని పేదవాని ఇంద్రియ నిగ్రహం,


ముసలి తనంలో దైవ భక్తి, 


వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే!✍️


                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*ఆ దైవం ఎవరు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


              *ఆ దైవం ఎవరు?*

                  ➖➖➖✍️


*దైవము కంటికి కనిపించడు..కదిలే కాలము కంటికి కనిపించదు. అయితే.. కనిపించని కాలాన్ని మనకు తెలియచెప్పేది.. ఆ కనిపించని దైవమే. అదే.. కాలా నికి, దైవానికి ఉన్న అవినాభావ సంబంధం.* 


*మరి.. ఆ దైవం ఎవరు ? ఇంకెవరు? సూర్య భగవానుడే. ఆయన కదలికే... కాలం కదలిక. అందుకే.. సూర్యుని ‘ప్రత్యక్షదైవమ్’ అన్నారు. ఇది నిరంతర ప్రయాణం. మరి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా.* 


*ఉంది. ఏమిటా గమ్యం? ‘జననం నుంచి..జననం’ అనే గమ్యానికి చేరడమే ఈ నిరంతర ప్రయాణానికి ఉన్న లక్ష్యం. ఇదేమిటి? జననానికి మరణమేకదా... చివరి గమ్యం? అనే ప్రశ్న మీకు కలుగవచ్చు. మరణమే.. చివరి గమ్యమైతే...అక్కడితో కాలం యొక్క ప్రయాణం ఆగిపోయినట్టే. మరి కాలం ఆగదు కదా. జననానికి..మరణం ఓ మజిలీ మాత్రమే. ఇక్కడే.. మీరు నిశితంగా పరిశీలించాలి. జన్మించిన జీవి..మరణించి, మరో జీవిగా జన్మించి... ఈ నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అయితే.. ఈ ప్రయాణం, మరణం అనే మజిలీ గుండా సాగుతుంది. అంతే! ఈ కాలరథానికి సారధి ‘సూర్యుడు’. ఎందుకంటే... జీవికి..ఉత్పత్తి, ఎదుగుదల, నాశనము అనే మూడు దశలు ఉన్నట్టే..సూర్యునకు ఉదయము, పూర్ణవికాసము, అస్తమయము అనే మూడు దశలు ఉన్నాయి. బాలభానుడుగా ఉదయించిన సూర్యుడు.. మధ్యాహ్నానికి పూర్ణవికాసుడై.. సాయంకాలానికి అస్తమిస్తాడు.* 


*నిజానికి సూర్యునకు అస్తమయం ఉందా.. లేదే. ఇక్కడ ఆయన అస్తమయం.. మరొకచోట ఉదయానికి నాంది. అంతే. అలాగే.. జీవికి మరణం.. మరోచోట జననానికి నాంది.* 


*అందుకే అస్తమయం లేని సూర్యుడు.. జననం నుంచి జననం అనే గమ్యానికి చేర్చే సారధి అయ్యాడు. జీవికి ఈ వైరాగ్యాన్ని తెలియచెప్పడమే..ఆయన ఉదయ, మాధ్యాహ్నిక, సాయం సంధ్యల లక్ష్యం.*


*ఈ లక్ష్యాన్ని గుర్తించడం కోసమే., ఈ త్రిసంధ్యలలో సూర్యుని ఉపాసించాలి అనే నియమాన్ని మనకు ఏర్పాటు చేసారు... మన ఋషులు.*


*సూర్యోపాసన వల్ల...తేజస్సు, బలము, ఆయువు, ఆరోగ్యము వృద్ధిపొందుతాయి. అంతేకాదు.. జన్మించిన జీవి.. మరోజన్మ అనే గమ్యం చేరాలంటే ‘మరణం’ అనే మార్గం గుండానే వెళ్లాలని చెప్పాను కదా. ఈ మరణమార్గం సూర్యలోకం గుండానే సాగుతుంది.*


* మరల జన్మే లేకపోతే..కాలం ప్రయాణం ఆగదుకానీ.. జీవికి, ప్రయాణం ఆగిపోతుంది. అదే ‘మోక్షం’. ఆ మోక్షమార్గమే..పరమాత్ముని సన్నిదికి చేర్చే ‘పరమపద సోపాన మార్గం’. జీవికి ఈ నిత్య సత్యాన్ని తెలియచెప్పడమే.. సూర్యగమనం యొక్క సారాంశం.*


*అందుకే..ఆ ప్రత్యక్షదైవాన్ని త్రిసంధ్యలలోనూ ఉపాసించాలి. అదే...మనం చేసే ఈ జనన, మరణ ప్రయాణానికి మనం చెల్లించే ప్రయాణ మూల్యం.*✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మౌఢ్యమి

 https://t.me/joinchat/SIa6-4GeLjIInXl1

మౌఢ్యమి అంటే ఏమిటి.?

గురుగ్రహమే కానీ , శుక్ర గ్రహమేకానీ సూర్యునితో కలసి ఉండే కాలమును మౌఢ్యమి అంటారు.


మౌఢ్యకాలంలో గ్రహ కిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటాడు,

అందువల్ల మౌఢ్యకాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి,

గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయి.


శుభ గ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిథ్థము.

మౌఢ్యమిని "మూఢమి"గా వాడుకభాషలో పిలుస్తారు. 

ఈ మూఢమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు,

మూఢమి అంటే చీకటి అని అర్ధం, మూఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు , శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది.

శుక్రమౌఢ్యమి కాలములో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం ఆటు , పోటులలో మార్పులు వస్తాయి.


శుక్ర గ్రహ పాలిత ద్వీపాలకు , ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి.

 శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడు, జాతకములో శుక్రుడు బల హీనముగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు...

ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయడం మంచిది.


మౌఢ్యమిలో చేయకూడనివి:-

పెళ్ళిచూపులు , వివాహం , ఉపనయనం , గృహారంభం , గృహప్రవేశం , యజ్ఞాలు చేయుట , మంత్రానుష్టానం , విగ్రహా ప్రతిష్టలు , వ్రతాలు, నూతన వధువు ప్రవేశం , నూతన వాహనము కొనుట , బావులు , బోరింగులు , చెరువులు తవ్వటం , పుట్టువెంట్రుకలకు , వేదా"విధ్యా"ఆరంభం , చెవులు కుట్టించుట , నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయరాదు.


మౌఢ్యమిలో చేయదగినవి:-

జాతకర్మ , జాతకం రాయించుకోవడం , నవగ్రహ శాంతులు , జప , హోమాది శాంతులు , గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు , సీమంతం , నామకరణం , అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమౌఢ్యమి వచ్చినా , శుక్రమౌఢ్యమి వచ్చినా చేయవచ్చును. గర్భిణి స్త్రీలు , బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో మూఢాలలో ప్రయాణం చేయాల్సివస్తే శుభ తిధులలో అశ్వని , రేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.

స్వస్తి🙏🙏🙏🙏