26, డిసెంబర్ 2021, ఆదివారం

స్వర్ణ భస్మం గురించి సంపూర్ణ వివరణ -

 స్వర్ణ భస్మం గురించి సంపూర్ణ వివరణ - 


    స్వర్ణ భస్మం గురించి అంతకు ముందు మీకు వివరించాను . ఇప్పుడు మీకు మరికొంత విలువైన సమాచారాన్ని అందిస్తాను . 


   స్వర్ణ భస్మము ప్రయోగించుట వలన అనేకరకాల మొండివ్యాధులను సైతం నయం చేయవచ్చు . వాతము వలన వచ్చు జ్వరము , పిత్త సంబంధ జ్వరము , అతిసార రోగము , గ్రహణి , పాండురోగము , క్షయ , గర్భ సంబంధ రోగములు , ఫిరంగి రోగము ( siphalis ) , ఆయాసం , ఆమ్లపిత్తము , అపస్మారము , శిరస్సుకు సంబంధించిన రోగములు , ఉన్మాద రోగము , త్రిదోషాల వలన సంప్రాప్తించు రోగములు , స్తనరోగము , విషము వలన కలిగెడి రోగములు , ఎక్కిళ్లు , బాలలకు వచ్చు రోగములు వంటి సమస్తరోగములు ఈ స్వర్ణభస్మ సేవన వలన నయం అగును . 


      ప్రస్తుత కాలములో మనం తీసుకునే ఆహరం దగ్గర నుంచి తాగే నీరు వరకు ప్రతీది కాలుష్యమే . మన భారతదేశము నందు ఈ మధ్యకాలములో పురుగు మందుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది . సంవత్సరానికి మనం 300ml నుంచి 400ml వరకు పురుగు మందు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనశరీరాన్ని చిన్నచిన్నగా విషపూరితం చేస్తుంది . క్రమముగా అనేక భయంకర రోగాలపాలు అవ్వడం జరుగుతుంది. ఇలా కలుషితం అయిన శరీరాన్ని బాగుచేసుకొనుటకు మరియు శరీరములో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటకి పంపి సంపూర్ణ ఆరోగ్యం పొందుటకు ఈ స్వర్ణభస్మం ఎంతగానో ఉపకరించును . 


        నేను చేసిన పరిశోధన మరియు నేను గ్రహించిన అనుభవం మేరకు ఈ స్వర్ణభస్మం ను మరికొన్ని భస్మాలతో కలిపి ప్రయోగించినప్పుడు ఫలితాలు వేగవంతంగా వచ్చాయి. మా పూర్వీకుల ఫార్ములా ఉపయోగించి తయారుచేసిన స్వర్ణఔషధం అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినది.


       ఈ స్వర్ణఔషదం నరాలు , ఎముకలు , కండరాల మీద అద్భుతముగా పనిచేయును .మధుమేహ వ్యాధిగ్రస్తులకు లోపలి అంతగర్గత అవయవాలు దెబ్బతినడం జరుగును . ఈ ఔషధం వాడుట వలన అంతర్గత అవయవాలు దెబ్బతినకుండా బలం చేకూరును . అదేవిధముగా ఈ మధ్యకాలంలో నరాల సంబంధ దోషములతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యముగా మధుమేహము ఉన్నవారు.అటువంటి దోషములన్నింటిని పోగొట్టి నరాలను శక్తివంతముగా మార్చును.


         ఈ స్వర్ణఔషదం గొప్ప వాజీకరణం . శృంగారపరమైన బలహీనత , శృంగారము పైన ఆసక్తి లేకపోవటం వంటి సంబంధ సమస్యలే కాకుండగా స్త్రీలలో వచ్చు గర్భసంబంధ దోషములకు కూడ అద్బుతముగా పనిచేయును . 


        చిన్నపిల్లలలో అమితమైన జ్ఞాపకశక్తిని మరియు మెదడుకు మరింత బలాన్ని చేకూర్చును . ఇది క్రమం తప్పకుండా వాడుతున్నవారు ఏకసంథాగ్రాహకులు గా మారును . ఇది మంచి ఇమ్మ్యూనిటి బూస్టరుగా పనిచేయును . రోగనిరోధక శక్తిని అమితముగా పెంచును. 


        కరోనా సమయములో కరోనా వచ్చి బలహీనపడిన వారికి ఇది ఇవ్వడం వలన త్వరితగతిన కోలుకోవడం జరిగింది . మగవారికి మాత్రరూపములో , ఆడవారికి మరియు పిల్లలకు లేహ్యరూపములో ఇవ్వడం జరుగును. 


 గమనిక - 


      దీని ఖరీదు కొంత ఎక్కువుగా ఉండును . కావలసిన వారు ఫొన్ చేసి సంప్రదించగలరు. మెస్సేజి , కామెంట్స్ రూపములో స్పందించడం జరగదు.దీనికి కారణం మీరు ఫొన్ చేసినప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలెను . దీనివల్ల మీ శరీరాత్త్వాన్ని అంచనా వేసుకొని తయారుచేసి ఇస్తాను. 


     ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎవ్వరైనా వాడుకోవచ్చు. దీనిని వాడటం వలన రాబోయే దుష్ప్రభావాలను ఎదుర్కొనే శక్తి వచ్చును .  


       ఈ స్వర్ణఔషదం కావలసిన వారు 9885030034 నంబర్ కి ఫోన్ చేయగలరు . 


     

              కాళహస్తి వేంకటేశ్వరరావు 


              అనువంశిక ఆయుర్వేదం 


                   9885030034

కృతఘ్నత

 ॐ                       కృతఘ్నత 



    "కృతఘ్నత" (ఇతరులు మనకు చేసిన మేలు మరచి పోవడం) మహాపాపం.

    అన్ని పాపములకు "ప్రాయశ్చిత్తం" శాస్త్రములలో చెప్పబడి  ఉంది.

    కానీ "కృతఘ్నతా దోషానికి" మాత్రం  ప్రాయశ్చిత్తం లేదు.

    భగవంతుడు కూడా ఈ దోషాన్ని పోగొట్టలేడు.

    ఒక్క సద్గురువు మాత్రమే ఈ దోషమునుండి భక్తులను కాపాడగలరు.


    కృతఘ్నతా దోషము పాలుగాకుండా, ఒక మహా పండితుని  శ్రీ కంచి పరమాచార్యులవారు అనుగ్రహించిన  సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము.


    అనంతపురంలో  "మొదలి శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు"  అనే వేద విద్వాంసులు ఉండేవారు.

    వారు అనేకమంది శిష్యులకు వేదము చెప్పేవారు. సంస్కృతములో కూడా గొప్ప పండితులు.

    అనంతపురం, ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకులుగా ఉద్యోగం చేసే వారు.


    మా బావమరిది శ్రీ అమ్మనమంచి శివప్రసాదు, అనంతపురం వైశ్యాబాంక్ లో పనిచేస్తుండగా వీరి సాంగత్యం లభించి, వీరి శిష్యులైనారు. వీరిదగ్గర "అరుణము", మొదలైనవి అధ్యయనం చేశారు.

    వారికి శ్రీ శర్మగారు స్వయముగా చెప్పినదే ఈ వృత్తాంతమంతా.


    శ్రీ శాస్త్రిగారు  నిత్యము " సప్తశతి"పారాయణ చేసేవారు.

    అనేకమంది చేత చండీయాగములు చేయించారు.

     ఆగమ శాస్త్ర పండితులు కూడా కాబట్టి  అనేక దేవాలయ ప్రతిష్టలు కూడా నిర్వహించారు.

    నెల్లూరు దగ్గరవున్న" పెంచలకోన" లో శ్రీ విజయేశ్వరి అమ్మవారు అనేకసార్లు వీరిచేత  తమ ఆశ్రమంలో చండీయాగములు చేయించారు. 


    ఒకసారి శ్రీ కంచి పరమాచార్యులవారు అనంతపురంలో పదిరోజులు బస చేశారు.

    శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు రోజూ వారిని దర్శించుకునేవారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామివారు వీరితో మాట్లాడేవారు కాదు. 

    అందరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా, ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వీరితో మాత్రం  శ్రీ స్వామివారు మాట్లాడక పోవడము అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించేది.

    శ్రీ స్వామి వారు తనతో మాట్లాడక పోవడముతో శ్రీ శర్మగారు ఎంతో మనస్తాపం చెందారు.

    కారణము తెలియక వారికి రోజు రోజుకు దుఃఖము అధిక మవుతుండేది.

    ఇలా పదిరోజులు గడిచినై.


    శ్రీ స్వామివారు అక్కడనుండి "ధర్మవరము" నకు ప్రయాణమయినారు.

    శ్రీ శర్మగారు చింతాగ్రస్తులయినారు. ఏమైనా సరే, శ్రీ స్వామివారు మాట్లాడేదాకా వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.

   "నేను ఎప్పుడు వస్తానో తెలియదు.అప్పటివరకు సెలవు మంజూరు చేయ వలసినది" అని కళాశాలకు సెలవు చీటీ పంపించి, శ్రీ స్వామివారి వెంట ధర్మవరము వెళ్లారు.

    శ్రీ స్వామివారు నదీ స్నానం ఆచరిస్తుండగా అక్కడ నిలబడి " అఘమర్షణ " సూక్తము మొదలైన స్నాన మంత్రములు చదివారు.

    మంత్రములు చదవటం పూర్తి అయినా, శ్రీ స్వామివారు, ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు.

    శ్రీ శర్మగారు కొంత తటపటాయిస్తూ "రుద్రము" చదవటం మొదలుపెట్టారు. 

    శ్రీ స్వామివారు చదవమని చేయి ఊపి సైగ చేశారు.


    పది రోజుల తరువాత అదే 

మొదటిసారి శ్రీ స్వామివారు, శ్రీ శర్మగారివంక చూడటము. 

    శ్రీ శర్మగారు మహదానంద భరితులయినారు.


    సాయంకాలము ఊరి వారందరితో కూడిన సభ జరుగుతున్నది. శ్రీ స్వామివారు వున్నట్లుండి శ్రీ శర్మగారిని పేరు పెట్టి పిలిచి, వేదికపైకి రమ్మన్నారు.

    శ్రీ శర్మగారు వేదికపైకి వెళ్లి శ్రీ స్వామివారికి " న కర్మణా న ప్రజయా" అని వేదమంత్రం చదువుతూ సాష్టాంగ నమస్కారం చేశారు. 

    శ్రీ పరమాచార్యులవారు వీరితో సంస్కృతములో సంభాషణ ప్రారంభించారు.


   "మీరు మీ గురువులను విస్మరించారు.

    మీ కుటుంబము వారందరికి శ్రీ శృంగేరీ జగద్గురువులతో ఎన్నో తరములనుండి అనుబంధము ఉన్నది.

    మీకు చిన్న తనములో నత్తి వల్ల మాటలు సరిగా రాకపోవడంతో మీ ఇంట్లో వారందరు దిగులు పడ్డారు.

    మీ తాతగారు, మిమ్ములను, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి సన్నిధికి  తీసుకు వెళ్లి విషయం విన్నవించారు.

    జగద్గురువులు మీ నోరు తెరవమన్నారు. ఎంతో అనుగ్రహంతో మీ నాలుకమీద వారి అమృతదృష్టి ప్రసరింపజేసి, చిరునవ్వు నవ్వుతూ "ఈ అబ్బాయి గొప్ప పండితుడు అవుతాడు. చాలా ప్రఖ్యాతి సంపాదిస్తాడు" అని ఆశీర్వదించారు.

    ఆ క్షణం నుండీ మీకు నత్తి పోయింది స్పష్టమైన ఉచ్ఛారణ వచ్చింది. వేదము, సంస్కృతము అధ్యయనం చేసి మంచి పండితులైనారు.

    అటువంటి సద్గురువులను మీరు విస్మరించారు" అన్నారు.


    శ్రీ శర్మగారు నిశ్చేష్టులైనారు.

    ఒక్కసారిగా వారికి గతమంతా గుర్తుకు వచ్చింది.

    తనను తన తాతగారు, శృంగేరీ తీసుకువెళ్లడము, జగద్గురువులు ఆశీర్వదించడము,తన విద్యాభ్యాసము, క్రమంగా శ్రీ జగద్గురువులను మరచి పోవడము అన్నీ జ్ఞప్తికి వచ్చినవి.

    ఎంతో సిగ్గు పడ్డారు.

    వారికి ఆశ్చర్యం కూడా వేసింది.

    ఎప్పుడో తన చిన్నతనంలో జరిగిన ఈ విషయాలు శ్రీ స్వామివారికి ఎలా తెలుసు?


    శ్రీ స్వామివారు సాక్షాత్తూ భగవంతుని అవతారం అనటానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి?

    తనకు "నత్తి" పోగొట్టి, వాక్పటుత్వము ప్రసాదించిన శ్రీ శృంగేరీ జగద్గురువులు కనులకు గోచరించారు. వారి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది.

    శ్రీ పరమాచార్యులవారికి సాష్టాంగ నమస్కారము చేశారు.


    తాను శ్రీ శృంగేరీ జగద్గురువులను విస్మరించి గొప్ప పాపం చేశానని, మీరు నన్ను కాపాడాలని, 

శ్రీ పరమాచార్యులవారిని  వేడుకున్నారు.

    శృంగేరీ వెళ్తానన్నారు.

    ఆ తరువాత వారిద్దరూ అనేక విషయములు మాట్లాడుకున్నారు.

    శ్రీ శర్మగారి సందేహాలు ఎన్నో శ్రీ స్వామివారు తీర్చారు.

    వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి అనుజ్ఞ ఇచ్చి పంపారు.

    శ్రీ శర్మగారు అప్పటినుండి శ్రీశృంగేరీ వారితో తమ అనుబంధం కొనసాగించారు. అనేకమందికి,వేదము, సంస్కృతము చెప్పారు. అనేక గ్రంధాలు రచించారు. 

    అనేక సత్కార్యాలు చేసి జన్మ చరితార్ధము చేసుకొన్నారు.

    దేహత్యాగ పర్యంతము ఏటువంటి రుగ్మతా లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వున్నారు.

    కృతఘ్నతా మహా దోషం నుండి తనను కాపాడిన శ్రీ పరమాచార్యులవారిని ఆ జన్మాంతమూ, స్మరించుకుంటూనే ఉండేవారు.


    కేవలము తమ భక్తులనే కాదు, సన్మార్గంలో ఉండే వారందరినీ  శ్రీపరమాచార్యులవారు ఇలా

 కాపాడుతూ ఉంటారు. 


శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః.


                    శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

25-12-'21. 


                   **********

    పరమాచార్య నడిచే దైవం.

    ఇప్పూడూ సమాధినించీ నడిపించే ఆ దైవానికి ప్రణామాలు.


"కృతఘ్నత" గురించి శ్రీరాముడు లక్ష్మణుని వాలివద్దకు పంపుతూ లక్ష్మణునితో అన్న మాట 


కృతార్థా హ్యకృతార్థానాం 

మిత్రాణాం న భవన్తి యే I

తాన్మృతానపి క్రవ్యాదాః 

కృతఘ్నాన్నోపభుఞ్జతే ॥ 4/30/73


    మిత్రులసహాయముతో తమ పనులను పూర్తి చేసికొని, 

    పిదప వారికి సహాయపడనివారు కృతఘ్నులు. 

    అట్టివారు చనిపోయిన పిమ్మట వారి కళేబరములను పచ్చిమాంసములను తినెడి క్రూరమృగములుగూడ ముట్టవు. 


    Even the carnivorous animals 

    dislike to eat the body of such ungrateful men 

    who do not help their friends even though they have received help and have achieved their objective. 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

పాఠక మిత్రులకు విన్నపం

ఈ బ్లాగు మనందరిది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దే కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావచ్చు. కానీ మీరు మీకు నచ్చిన, లేక నచ్చని అంశం ఎందుకు నచ్చిందో, నచ్చలేదో తెలిపే ముందు మీరు మన బ్లాగులో ఫాలోవరుగా అవ్వండి. తదుపరి మీరు చేయాలనుకునే కామెంటును సహేతుకంగా అందరికి అర్ధమయ్యే రీతిలో వ్రాయండి. క్రింద మీ పూర్తీ పేరు, అడ్రస్సు, ఫోను నెంబరు వ్రాయటం మాత్రం మరువకండి. అసంపూర్తి వివరాలు లేక మీ వివరాలు తెలుపకుండా కామెంట్లు చేస్తే అవ్వి ప్రచురించబడవు.  గమంచగలరు. 

సాధన -2

 సాధన -2

కారు, డ్రైవరు 

సాధకునికి ఆత్మానాత్మ విచక్షణ సులభంగా అర్ధం కావటానికి  కఠోపనిషత్లో క్రింది మంత్రం ద్వారా తెలియచేస్తున్నది.  

రథరూప కల్పన ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు | బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ |3|

= ఆత్మానం = ఆత్మను; రథనం = రథస్వామి అని; విద్ధి = తెలుసుకో శరీరం = శరీరాన్ని; రథం ఏవ తు = రథమే అని (తెలుసుకో); బుద్ధిం తు= బుద్ధిని; సారథిం = సారథి అని; విద్ధి = తెలుసుకో; మనః = మనస్సు: ప్రగ్రహం ఏవ చ = పగ్గమే అని కూడా (తెలుసుకో); = = (తా|| ఈ ఆత్మను రథస్వామి అని తెలుసుకో. శరీరాన్నే రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అని తెలుసుకో. మనసేమో పగ్గమే అని తెలుసుకో.)

దీనిని ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాధకుల సౌలబ్యానికి ఇలా అర్ధన్ని చెప్పుకుందాం. 

ఇక్కడ కారు-కారు డ్రైవరు పోలికతో మనకు ఉపనిషత్తు సాధకునికి తన ఆత్మకు, శరీరానికి వున్న అనుబంధాన్ని తెలియ చేయుచున్నది. ఆత్మను కారు యజమాని గాను, శరీరాన్ని, కారు గాను, బుద్ధిని కారు డ్రైవరుగాను ఇక మనస్సు కారుకు ఉన్నటువంటి స్టీరింగ్, కాగా  బ్రేకు, క్లచ్, యాక్సిలరేటర్లు ఇంద్రియాలుగా పోల్చుతున్నది. కారు యజమాని సురక్షితంగా ప్రయాణం చేయాలంటే కారు డ్రైవరు అలాగే స్టీరింగ్ తదితర అన్ని హంగులు సక్రమంగా పనిచేయాలి. అప్పుడే గమ్యానికి క్షేమంగా చేరగలడు. ప్రయాణం సాఫీగా జరగాలంటే ముందుగా కారు పూర్తి కండిషనులో ఉండాలి అంటే సాధకుని శరీరము పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏరకంగా కారు డ్రైవరు రోజు కారు పరిస్థితిని గమనించి లోటుపాట్లు అంటే పెట్రోలు, ఆయిల్ మొదలైనవి సరిగా ఉన్నాయో లేదా అని చూసుకుంటాడో అట్లాగనే సాధకుడు తన బుద్దిని వుపయోగించి శరీరానికి కావలసిన ఆహార, పానీయ దుస్తులు మొదలైనవి బాధ్యతగా సమకూర్చి శరీరం రోగగ్రస్తం కాకుండా, అలసత్వం చెందకుండా ఎప్పుడు చెతన్యవంతంగా వుండే విధంగా చూసుకోవాలి.  కానీ శరీరం మీద మొహాన్ని మాత్రం పెంచుకోకూడదు.  శరీరం కేవలం ఆత్మను పరమాత్మ వద్దకు (మోక్షాన్ని) తీసుకొని వెళ్లే ఉపకరణంగా మాత్రమే చూడాలి అంతేకాని సమాజంలో శరీరానికి ఆపాదించే మానవమానాలు తనవిగా  భావించరాదు. వాటిని పరిగణలోకి తీసుకోరాదు. అప్పుడే సాధకుడు సాధనలో ముందుకు వెళ్లగలడు. 

సాధకుని ద్రుష్టి సదా మోక్షం మీద మాత్రమే ఉండాలి,  భౌతికమైన విషయాలను తాత్కాలికమైనవిగాను తాను వాటికి ఎంతవరకు సంబందం కలిగి ఉండాలో అంతవరకుమాత్రమే సంబంధం ఉంచుకోవాలి. కేవలం తామరాకు మీద నీటి బిందువు లాగ మాత్రమే ఈ సమాజంలో తాను ఉండాలి.  ఇవ్వన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న  ఉదయిస్తుంది. నిజానికి అన్ని సాధ్యమే కేవలం మనస్సుని స్వాధీన పరచుకోవాలి.

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 



25, డిసెంబర్ 2021, శనివారం

సాధన -1

సాధన -1  

విమానంలో కిటికీ ప్రక్కన కూర్చున్న ప్రయాణకునికి విమానము కదలటం మొదలుకాగానే భూమి మీద వస్తువులు వెనుకకు వెళుతున్నట్లు కనపడి విమానం గాలిలో ఎగరటం మొదలు కాగానే అవి మొదట చిన్నగా తరువాత సుష్మముగ కనపడి తరువాత కనపడకుండా పోతాయి. కేవలం ఆకాశంలో మేఘాలు మాత్రమే కనపడుతుంటాయి. అంటే దీని అర్ధం విమానం క్రింద భూమి, భూమిమీది వస్తువులు లేకుండా పోయాయని కాదు.  కేవలం ప్రయాణికుడు అవి చూడలేని అంత ఎత్తుకు వెళ్లాడని మాత్రమే.  ఆ ఎత్తులో మేఘాలు ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం స్పష్టంగా చూడగలడు. 

సంసారబంధనాలలో కొట్టు మిట్టాడుకునే మానవుడు ఎప్పుడైతే జిజ్ఞాసకుడిగా అయ్యి సాధన మొదలు పెడతాడో అప్పుడు తన సాధన క్రమంలో మొదట్లో బౌతికంగా వున్న భావ బంధాలు అంటే భార్య పిల్లలు, నా వారనే బంధాలు కొంత చిన్నవిగా కనపడతాయి అదే సాధనలో పరిపక్వత చెందుతున్న కొద్దీ ఆ బంధాలు సుష్మముగా తరువాత లేనట్లుగా గోచరిస్తూ కేవలం అద్వితీయమైన, అనంతమైన, శాశ్వితమైన, నిత్యమైన భగవంతునితో మాత్రమే అనుసందానం కలిగి ఉంటాడు. 

సంసార జీవనం గడిపే మనకు సాధన సాగదు, మనకు ఒక మంచి గురువు తనంతట తానె వెతుక్కుంటూ వస్తాడు, ఫలానా ప్రవచనాకారుడు చెప్పాడు విగ్రహారాధన ఒక్కటే మార్గం కేవలం సన్యాసం తీసుకున్న వారు మాత్రమే వారికి ఎలాంటి భాద్యతలు వుండవు కాబట్టి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం గడప  గలరు. ఈ జన్మకు నేను చేసే పూజలే  చాలు. కలియుగంలో నామ స్మరణే చాలు మోక్షానికి అని ఇలా పలుతెరుగుల వాదనలు, సమర్ధింపులు చేసుకునే వారిని పెక్కు మందిని మనకి తారస పడతారు.  కానీ నిజమైన సాధకుడు ఆ మాటలను ఏమాత్రం గణించక తన ఆధ్యాత్మిక జీవనం కోన సాగిస్తాడు. 

ఇలా వ్యర్ధ ప్రసంగాలను చేసి కాలాన్ని వృధా చేసుకునే వారిని ఆది శంకరాచార్యుల వారు " కాకికి దంతాలు వున్నాయి, దంతాలు లేవని వాదన చేసే (మూర్ఖులు ) గా అభివర్ణించారు.  

సాధకులారా ఇంకా కాలయాపన చేయకండి ఇప్పుడే మీ ఆధ్యాత్మిక జీవనానికి నంది పలకండి.  ఈ జన్మలోనే నేను మోక్షాన్ని పొందుతాను అని దృఢ సంకల్పులు కాండి. 

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 

23, డిసెంబర్ 2021, గురువారం

పాపం-పుణ్యం

 పాపం-పుణ్యం 

(ఈ వ్యాసం వ్రాయటానికి ముందు నేను ఒకింత సందేహించాను ఎందుకంటె ఇంత చిన్న విషయాలు మాకు తెలియవా అని మనలో చాలామంది అనుకోవచ్చు.  కానీ ఇది కేవలం తెలియని వారిని దృష్టిలో ఉంచుకొని వ్రాసిందని గమనించగలరు)

మనం తరచుగా పాపం-పుణ్యం అనే ద్వంద పదాలను వింటుంటాము, అంటూవుంటాము. కానీ ఇదమిద్దంగా పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి అంటే చాలామంది చెప్పలేని స్థితిలో వుంటారు.  కానీ ఒక్కటి మాత్రం ప్రతి వక్కరు చెప్పగలరు అదెమంతి పాపం అనేది చెడుకు సంబంధించింది, పుణ్యం అనేది మంచికి సంబంధించింది కాబట్టి మనం పుణ్యం చేయాలి అని మాత్రం అంటారు. ఎవరైనా ఏదయినా కానీ పని చేస్తే పోన్లే వాడి పాపాన వాడే పోతాడు అని మనం అనటం కూడా కద్దు. అంటే మనం ఏమిచేయనవసరం లేదు వాడి పాప ఫలితాన్ని వాడే పొందుతాడు అని కాబోలు ఆలా వాడుకలోకి వచ్చింది.  ఏది యెమీయేన ఒక్కటి మాత్రం నిజం పాపం కానీ లేక పుణ్యం కానీ మనం చేసే పనులకు ప్రతిగా వచ్చే ఫలితం అంటే మన కర్మలకు లభించే ఫలితం. అంటే పాప పుణ్యాలకు కారణం కర్మలు అంటే కొన్ని కర్మలు చేస్తే పాపం వస్తుంది అదే విధంగా కొన్ని కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. 

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం 

1) తల్లి తండ్రులను గౌరవించాలి 

2) తల్లి తండ్రులను హింసించాలి. 

ఇందులో మొదటి కర్మ చేస్తే పుణ్యం వస్తుందని రెండవ కర్మ చేస్తే పాపం వస్తుందని అందరము ముక్త కంట్టంగా చెపుతాము. కానీ ఎందుకు అంటే మాత్రం చెప్పలేము. 

మనం చేసే కర్మలు రెండు రకములు 1) విహిత కర్మలు 2) నిషిద్ధ కర్మలు అంటే మొదటిది చేయవలసిన పనులు లేక చెప్పిన పనులు రెండవది చేయకూడదని చెప్పిన పనులు అని స్థూలంగా అర్ధం. ఇంకా వివరంగా పరిశీలిస్తే విహిత కర్మలు అంటే వేదవిదిత కర్మలు అనగా వేదంలో చేయమని చెప్పిన కర్మలు అదే విధంగా నిషిద్ధ కర్మలు అంటే వేదనిషిద్ద కర్మలు అనగా వెడలు చేయవద్దని చెప్పిన కర్మలు. 

వేదాలు అంటేనే కర్మ కాండ అనగా మానవులు ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు అని వివరించేవి వేదాలు 

మనం అక్కడక్కడ ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ అని రాజకీయ నాయకులూ పలుకుతూ ఉండటం చూస్తాం అంటే కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అని కదా అర్ధం, అదే మాదిరి నిషిద్ధ కర్మలు కూడా ఇప్పుడు కొంతవరకు మీకు అర్ధం అయ్యిందని నేను అనుకుంటాను. 

ఇదంతా చాలా గజిబిజిగా వున్నది ఒక్క మాటలో పాప పుణ్యాలు అంటే ఏమిటో చెప్పలేవా అని మీరు అడగ వచ్చు. ఆలా చెప్పాలంటే 

ధర్మాన్ని ఆచరించటం పుణ్యం 

ధర్మాన్ని ఆచరించక పోవటం మరియు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించటం పాపం. 

ఇప్పుడు ధర్మం అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. ధర్మం అంటే ప్రతివారు తానూ ఆచరించవలసిన విధానం. ఇది ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్క రీతిగా వుంటూ అందరికి ఒకేరీతిగా ఉంటుంది. 

అదెలా అంటే నీ తల్లిదండ్రులను చూసుకొనేది నీ ధర్మం నీవు నీ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదనుకో అప్పుడు నేను నీ తల్లిదండ్రులను చూసుకోవటం నా ధర్మం కాదు మరి అది ఏమిటి అంటే దానికి శ్రీ కృష్ణ భగవానులు దానిని పరధర్మం అని స్పష్టం చేసారు. భగవానులు ఎల్లప్పుడూ ప్రతి వారు తన ధర్మాన్నే ఆచరించాలని పరధర్మాన్ని ఆచరించకూడదని పేర్కొన్నారు. 

 శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita – 142 🌹
. తృతీయ అధ్యాయము – కర్మ యోగము  – 35 
35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: ||
🌷. తాత్పర్యం :
పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!

ప్రతివారు వారి వారి ధర్మం ఏమిటో తెలుసుకొని దానిని మాత్రమే ఆచరించాలి. వారు ఆచరించాల్సిన ధర్మాన్ని విద్యుక్త ధర్మం అని అంటారు. 
ఒక పురుషునికి తన తల్లిదండ్రులను, తన భార్య పిల్లల యోగాక్ష్యేమాలు చూడాల్సిన ధర్మం ఉంటుంది. అదే విధంగా ఒక స్త్రీకి తన భర్త, అత్తా మామలు, పిల్లల యోగక్షేమాలు చూడాల్సిన ధర్మం ఉంటుంది. కాబట్టి, ధర్మం అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది తెలుసుకొని నడచుకోవటం తద్వారా పొందే ఫలమే పుణ్యం దానికి భిన్నంగా ప్రవర్తించటమే పాపం. 
ఓం శాంతి శాంతి శాంతిః 
బుధజన విధేయుడు 
భార్గవ శర్మ 






ఒక్క క్షణం.....

 🍁ఒక్క క్షణం.....🍁


ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.


ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు. 


కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.. ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా.. ఎంత మంది తినటంలేదు.. నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి.. ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా...' అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.

 

అంతలో వూరు వచ్చింది... బస్సు ఆగింది... కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి... "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు. 


దానికి ఆ కండక్టర్ "అయ్యా..! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు. 


పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి.. 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.


జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు🍁

19, డిసెంబర్ 2021, ఆదివారం

దోసావకాయోత్పత్తి

 👉సరదాగా కాసేపు అంతే


*దోసావకాయోత్పత్తి వృత్తాంతము::*

పూర్వం 1822 వ సంవత్సరంలో, దెందులూరు గ్రామమునందు దర్భా ధనుంజయ చైనులు గారు అనెడి ఒక వేదపండితుడు వేదములతో పాటు, సాంప్రదాయ సద్వంటలను కూడా క్షుణ్ణముగా అభ్యసించినాడు!


ఆయన ఒక సాయంత్రము రాత్రి భోజనమునకు దోసకాయ పప్పు చేయవలెనని, ఒక పుల్లని, గట్టి దోసకాయను ముక్కలు గా చేసి ఒక తప్పాలా యందు వేసికొనినాడు! అటు పిమ్మట ఆయన కించిత్తు వేదపఠనమునందు నిమగ్నుడయినాడు! ఇంతలో ఆయన గారి సతీ మణి, దర్భా దాక్షాయనీ దేవమ్మ, ఆ ఉదయము కొత్త ఆవకాయ పెట్టుటకు వాడిన ఆవపిండి కాస్త ఒక పళ్ళెమునందు మిగిలియుండుట చేత, ఆ ఆవపిండి పళ్ళెమును ఆ దోసకాయ ముక్కల తప్పాలాయందు, దృష్టి లోపమువలన చూచుకొనక పడవైచినది! అటు పిమ్మట ఆమె ఇంకనూ రెండు దినములలో గల లక్ష వత్తుల నోముకు వత్తులు చేసికొనుటకు ఉపక్రమించినది!


అంతలో, వేదపఠనము ముగించుకొని, ఇక ఇంగువ తిరగమాత దోసకాయ పప్పు చేయుదమని వచ్చిన చయనులు గారు, ఆ దోసముక్కల మీద పడియున్న ఆవపిండిని చూచి, 'అకటా, ఇక ఈ రాత్రికి దోసకాయ పప్పు దుర్లభము కదా! ఏమి శాయవలె?' అని ఆలోచించి, 'సరియే, ఈ ఆవపిండి తో కలసిపోయిన దోస ముక్కలను ఎటులయిననూ సద్వినియోగము చేయుదు గాక ' అనుకొనుచూ, పాక దేవీ మాత పైనుండి దీవించుచుండగా, ఆ దోసముక్కలూ, ఆవపిండీ గల తప్పాలమునందు, కాస్త మచిలీపట్నపు రాళ్ళ ఉప్పూ, నారాకోడూరు ఎర్ర కారమూ కలిపి, ఆ పైనుండి ధారగా గానుగ నువ్వుల నూనె పోసినాడు! ఆ మిశ్రమమును ఒక బృహద్గరిటె తో బాగుగా కలియ బెట్టినాడు! 'ఇది ఏదియో చూచుటకు మాత్రము బహు ముచ్చటగానున్నదే' అనుకొనినాడు!


ఒక గంట పిమ్మట, ఆ దంపతులు ఇరువురూ, రాత్రి భోజనమున వేడి వేడి దంపుడు బియ్యపన్నము నందు ముద్దపప్పు కలిపి, అవనిగడ్డ ఆవునెయ్యి ధారాళముగా వేసికొని, ఆ ముద్దపప్పన్నము తో పాటు, ఈ తప్పాలమునందలి వింత పదార్ధమును నంచుకొనుచుండగా, వారికి ఆ ఘాటుకు నుదుటినుండి స్వేదము చిందుచూ, అనిర్వచనీయమగు అనుభూతీ, ఆనందమూ లభ్యమైనవి!


ఆ రాత్రి భోజనానంతరము , దర్భా ధనుంజయ చైనులు గారు, ఆ ఎర్రని, ఘాటగు వింత పదార్ధమునకు 'దోస ఆవకాయము ' అని నామకరణమొనర్చినాడు!


ఇతి దోసావకాయోత్పత్తి వృత్తాంతః


ఈ దోసావకాయ గురించి పాకపంచశతి మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక "లో ఫలశృతి చెప్పబడింది. అందులో జఠమహర్షి, ఉదరానందునకు చెప్పిన కొన్ని విషయాలు:


ఈ దోసావకాయ అపమృత్యువులను, అకాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించును. దీనిని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం భుజించాలి. అన్ని రోగాలను హరించడానికి గట్టిగా ఉన్న ఒక్క ముక్క చాలును. ఆసక్తి గలవారు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ దోసావకాయను తప్పక భుజించాలి. ఊరగాయలు, పచ్చళ్ళలో దోసావకాయ అసమానమైనది. జిహ్వసక్తి లేనివారికి దీనిని వడ్డించరాదు.


నిత్యకృత్యమునందు, పర్వదినములందు ఎవరీ దోసావకాయను యథాశక్తి విధిగా భుజిస్తారో, వారికి ధన్వాంతరీ అనుగ్రహముచే దీర్ఘాయువు, రథగజతురంగములతో సదా సుప్రసన్నమైన స్థిరసంపదలు సిద్ధించును...





పద్యం*

 *చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*


భూమీ భామాంబు భవా

వామాపా వైభవ భువి భావావాపా

వేమమ్మోముము భూభవ

భీమ భవాభావ భావ విభువామావిభా


*చదివే సమయంలో పెదవులు తగలనిది*


శ్రీశా సతత యశః కవి

తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం

కాశా నిరతారాధిత

కీశేశా హృష్ణ గగనకేశా యీశా


*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*

*అంటే పెదవి తగలనిది, తగిలేది*


దేవా శ్రీమాధవ శివ

దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా

జ్యావగ వంద్యా వాసవ

సేవితపద పగవిరామ శివ జపనామా


*కేవలం నాలుక కదిలేది*


సారసనేత్రా శ్రీధర

రారా నన్నేల నిందు రాక్షసనాశా

నారద సన్నుత చరణా

సారతరానందచిత్త సజ్జనరక్షా     


                                                                                                                                   

*నాలుక కదలని (తగలని) పద్యాలు*


కాయముగేహము వమ్మగు

మాయకు మోహింపబోకు మక్కువగ మహో

పాయం బూహింపుము వే

బాయగ పాపంబు మంకుభావమవేగా

భోగిపభుగ్వాహ మహా

భాగా విభవైకభోగ బావుకభావా

మేఘోపమాంగభూపా

బాగుగమముగావువేగ బాపాభావా


*నాలుక కదిలీ కదలని పద్యం*


ఓ తాపస పరిపాలా

పాతక సంహారా వీర భాసాహేశా

భూతపతిమిత్ర హరి ముర

ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా 


🙏ఈ పద్యాలు రచించిన మహా కవులకు తెలుగు జాతి ఋణపడి వుంటుంది. . 


🙏 *పద్య భాషాభిమానులకు జోహార్లు*.


🙏 

*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *

పిండిమ‌ర‌" కష్టాలు* 🤔

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

🤔 *చిన్న‌త‌నంలో "పిండిమ‌ర‌" కష్టాలు* 🤔


చిన్న‌త‌నంలో ఎంత‌ క‌ష్ట‌మైనా రావచ్చుగాని పిండి మ‌ర‌కెళ్ళాల్సిన క‌ష్టం మాత్రం ఎవ్వ‌రికీ రాకూడ‌దు.🤫

అంతా చ‌దివి... మీరే అవునో, కాదో చెప్పండి...🤔


నా బాల్యం అంతా చిన్న టౌన్ లో గ‌డిచింది.. 

అప్ప‌ట్లో *అన్న‌పూర్ణా* ఆటాలు, *ఆశీర్వాద్* ఆటా ఆశీర్వాదాలు మాకు దొర‌క‌ని క‌ష్ట‌కాల‌మాయే..


అంద‌రూ గోధుమ‌లు, ధాన్యం, ప‌ప్పులు మ‌ర ఆడించుకోవ‌ల్సిందే..


ఈ ప‌నికోసం అమ్మ‌లు, అమ్మ‌మ్మ‌లు మ‌మ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమ‌ర‌కుతోలేవాళ్ళు..

మాకు ఇప్ప‌టిపిల్ల‌లంత అవేర్‌నెస్ క‌పోవ‌డంతో..

కార్మిక శాఖ‌కు కంప్లైట్ చేయాల‌ని తెలియ‌దు..

మేము అలా పిండిమ‌ర దారిప‌ట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీ జ‌ల్లులా మ‌ర‌కు పోయి వ‌స్తే పావలానో..

ప‌దిపైస‌లో ఆక‌ర్ష్ ప‌థ‌కానికి ఆశ ప‌డి..

ఈ సాహ‌సానికి సిద్ద‌ప‌డితే మేము ప‌డ్డ క‌ష్టాలు ప‌గవాడికి కూడా వ‌ద్దు...


గోధుమ‌లో మ‌రొక‌టో నాలుగుమూడు కిలోలు క్యాన్‌లో పోసి ఆడించుకు ర‌మ్మ‌ని చెపుతూ.. 

అమ్మ‌లు మ‌ర‌వాడికి ఒక కేజీ త‌క్కువ చేసి చెప్ప‌మ‌ని చెప్పి పంపేవారు... 


మ‌ర‌కు పోయి.. అబ‌ద్దం చెప్ప‌డానికి పూర్తిగా సాహ‌సించ‌లేక పిండిమ‌ర చ‌క్రాలు క‌ర్‌క‌ర్ మ‌ని చేసే సౌండ్‌లో..

అశ్వ‌ద్దామ హ‌తఃకుంజ‌రః అన్న‌ట్లుగా మూడు కేజీల‌ని రెండ‌నో, నాలుగును మూడ‌నో అనేసేవాళ్ళం...


పిండిమ‌ర వాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళ‌ను ఎంతో మందిని చూసుంటారు కదా..

బాల‌య్య బాబులా* కంటి చూపుతో స‌రుకు తూకం క‌నిపెట్టేసి క‌రెక్ట్ గా వ‌సూలు చేసేవాళ్ళు...


ఇంట్లో మ‌ర‌కు పంపేముందు క‌ణ్వ‌మ‌హ‌ర్షి శ‌కుంత‌ల‌కు చేసే అప్ప‌గింత‌ల కంటె ఎక్కువే..

మాకూ బోధ జ‌రిగేది...


*”పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడ‌కు, పిండికాజేస్తారు జాగ్ర‌త్త”* అని, బరకగా ప‌ట్టించ‌మ‌నో, మెత్త‌గా ప‌ట్టించ‌మ‌నో, ప‌సుపు త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో, కారం త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో..

ఆంక్ష‌లు చెప్పి పంపేవారు...


ఇన్ని జాగ్ర‌త్త‌లు చెప్పారు క‌దా అని మేము పిండిమ‌రలో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర‌నుండి..

ముఖ్య‌మంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ క‌న్నుతో చూస్తున్న‌ట్లు చూస్తూ ఉండే వాళ్ళం... 


దీనికితోడు ప్ర‌తి పిండి మ‌ర‌లో ఒక స‌న్న గొట్టం.. 

దొంగ చాటుగా అందులోనుండి కొంత పిండి మ‌ర‌వాళ్ళు కాజేస్తార‌న్న బ‌ల‌మైన‌ రూమరు ప్రచారం లో ఉండేది...


పిండిమ‌ర‌కు చేరుకుని హై ఎల‌ర్ట్ లో వెయిటింగ్‌లో ఉంటే..

ఈ లోపు మ‌ర‌వాళ్ళు మేము పిల్ల‌లం గ‌నుక..

పెద్ద‌ల్ని, నోరుగ‌ల‌వాళ్ళ‌ని ప్ర‌యార్టీలో పెట్టేసేవారు..

ఆ రోజుల్లో క‌రెంట్ ఉన్న స‌మ‌యం కంటే..

క‌రెంట్ క‌ట్ స‌మ‌య‌మే ఎక్కువ కావ‌డంతో..

వెయిటింగ్ త‌ప్పేది కాదు...


ఈ వినోదాన్ని గ‌మ‌నిస్తూ కొంతసేపు వేచి ఉండేసరికి మ‌ర‌లో లేచిన పిండంతా.. 

త‌ల‌మీద ప‌డి మాకు బాల‌వృద్దుల గెట‌ప్ వ‌చ్చేసేది... 


కాసేప‌టికి ఆ గోల‌లోనే ఆప‌రేట‌ర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని..

స్పెసిఫికేష‌న్స్ చెప్పేలోపే పైనున్న బ‌కెట్ లో పోసేసి..

పిండి వ‌చ్చే గొట్టానికి వేలాడుతున్న టార్ప‌లిన్ గుడ్డ‌ను మ‌డిచి..

గొట్టం మీద‌కు తోసి.. 

క‌ర్ క‌ర్ మ‌ని విష్టుమూర్తిలా రెండు చ‌క్రాలు తిప్పేవాడు...


పైన బ‌కెట్‌లో వేసిన గోధుమ‌లు గ్రైండ‌ర్‌లో న‌లిగి క్రింద ఉన్న టిన్‌లో ప‌డ‌టానికి రెండు,మూడు, నిముషాలు ప‌ట్టేది..

పిండి నలిగి కింద‌కు ప‌డే టైమ్ కు మ‌డ‌చి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డ‌బ్బాలోకి సెట్ చేసేవాడు...


ఈ నాలుగైదు నిముషాల్లో పైన వేసినదంతా పిండిగా వ‌స్తుందో లేదో అన్న టెన్ష‌న్‌తో మా న‌రాలు చిట్లుతుండేవి... 

(ఇంట్లో పెట్టిన అప్ప‌గింత‌లు భ‌యాలు సామాన్యమైనవా!) 

మ‌న‌పిండి ఆడుతున్నంత సేపూ ఏ చ‌క్రం తిప్పినా ఎటువెళ్ళినా మ‌న పిండి పోతోంద‌న్న అనుమానంతో మాకు మ‌న‌శ్శాంతి ఉండేదికాదు...


కాసేప‌టికి డ‌బ్బాలో ప‌డ్డ‌పిండిని మ‌న క్యాన్‌లో వొంపి పొమ్మ‌నేవాడు..

మ‌న క‌ళ్ళ‌న్నీ వింబుల్డ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌లో బాల్ వైపే తిరుగుతున్న‌ట్లు ఆప‌రేట‌ర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి...


ఈ అడ్వెంచ‌ర్ ముగించుకుని త‌ల, వొళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో, సైకిల్‌కో త‌గిలించుకుని..

మ‌న‌కు ఇవ్వ‌బోయే పావాలాకు బ‌డ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ..

ఇల్లు చేరేవాళ్ళం... 


ఇంటికి రాగానే క్యాన్ లో వ‌చ్చిన పిండిని తూనిక‌లు కొల‌త‌ల శాఖ‌ల వ‌లె హోమ్ శాఖ‌వారు కొలిచేవారు...


 ఇహ‌మొద‌లు ”ఎటు దిక్కులు చూశావ్‌! 

 మోసం చేసి పిండి కాజేశాడు..

మేము ఎన్ని చెప్పిపంపితే ఏం ప్ర‌యోజ‌నం, అర‌కేజి త‌క్కువొచ్చింది...


మెత్త‌గా ప‌ట్ట‌మంటే బ‌ర‌గ్గా ప‌ట్టాడు. నీకు ఇన్నేళ్ళొచ్చాయి. ఒక్క ప‌నీ వివ‌రంగా చేసుకురాలేవు” అంటూ..

 కేంద్ర్రప్ర‌భుత్వం జి.ఎస్‌.టీ కాంపెన్సేష‌న్ ఎగొట్టిన‌ట్లో, త‌గ్గించిన‌ట్లో వారి ద‌యాదాక్షిణ్యాల‌తో కొంత‌ కోత విధించి ప‌దిపైస‌లే ఇవ్వ‌డ‌మో..

మ‌రీమూడ్ బాగాలేక పోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు... 


ఇలాంటి చేదు అనుభ‌వ‌మైన త‌రువాత మ‌ళ్ళీ మ‌ర‌కు పోకూడ‌దు అనుకునే వాడిని..

కాని ప్ర‌తీసారీ కొత్త రాయితీల‌తో న‌మ్మ‌బ‌లికి పంపేవారు...

క్లైమాక్స్ మాత్రం ఒక్క‌టే, ‘పిండి త‌క్కువ వచ్చింది మోసం జ‌రిగిపోయింది. మీ వ‌ల్ల ఏమీ కాదు’...


ఆ రోజుల్లో పిండిమ‌ర స్వానుభ‌వం అయిన సాటి కామ్రేడ్స్ అంద‌రికీ ఒక్క విష‌యం అర్థ‌మై ఉంటుంది...


యూనివ‌ర్సిటీ వీ.సీ.గా ప‌నిచేసి విద్యార్థుల‌తో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో..

ఎమ్మేల్యేగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రితో మంచి అనిపించుకోవ‌చ్చేమో కానీ..


పిండిమ‌ర‌కెళ్ళొచ్చి మంచి ప‌నిమంతుడ‌నిపించుకోవ‌డం మాత్రం దుర్ల‌భం...

🤔😄