13, జూన్ 2023, మంగళవారం

* సాధకా మేలుకో -6 ఏకత్వ భావన *

 

 * సాధకా మేలుకో -6 ఏకత్వ భావన *

  

గత కండికలో మనం సాధకుడు ఆచరించవలసిన  సమ భావం గురించి   తెలుసుకున్నాము. ఇప్పుడు సాధకుడు అంతకంటే ఉత్కృష్టమైన కఠినమైనది  దాదాపు మోక్షసాధనకు చేరువయినది ఐన ఏకత్వ భావన గురించి తెలుసుకుందాము. 

ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టే ప్రతి సాధకుడు ముందుగా తెలుసుకునేది ఏమిటంటే తాను వేరు భగవంతుడు వేరు తాను భగవంతుని ఆరాధించాలి అనే భావంతో తన సాధన మొదలు పెడతాడు.  ఆరాధనలో ప్రాధమికంగా మూర్తిపూజ నుండి మొదలు పెడతాడు.  సాధన కొద్దికొద్దిగా వృద్ధి చెందుతున్న కొద్దీ గురువుల సహాయంతో ఆత్మా, పరమాత్మ అనే భావనలోకి వస్తాడు.  తదుపరి తాను దేహాన్ని కాదు దేహంలో నిగుడంగా నిక్షిప్తమయిన దేహిని అనే భావనకు వస్తాడు.  అప్పటినుండి తన సాధన మూర్తిపూజనుండి మారాలి పరమాత్మను తెలుసుకోవాలనే తపనతోటి ముందుకు సాగుతుంది.  ఎప్పుడైతే పరమాత్మా వైపు మనసు మళ్లుతుందో అప్పుడే తెలుసుతుంటాడు పరమాత్మా తప్ప మిగిలినవి అన్ని నిత్యమైనవి కావని అవన్నీ అనిత్యలని తెలుసుకొని నిత్యం, సత్యము, ఆనందము అయిన పరమాత్మా వైపు మనసు మళ్లుతుంది. 

నిత్యానిత్య వివేకము కలిగినతరువాత అనిత్యమైన విషయాలమీద విరక్తి కలుగుతుంది దానినే వైరాగ్యము అని అన్నారు. తరువాత మోక్షాన్ని పొందాలనే కోరిక బలంగా కలుగుతుంది దానికి ముముక్షుకత్వము అని పేరు ముముక్షుకత్వం స్థితిలోకి చేరుకున్న సాధకుడు తదుపరి మోక్షాన్ని చేరుకుంటాడు. 

మోక్షాన్ని చేరుకునే విధిని ఒక దుష్టాంతరంతో వివరించే ప్రయత్నం చేస్తాను. పూర్వము కన్నప్ప అనే ఒక కిరాతకుడు ఉండేవాడట అతను అడివిలో వున్న ఒక శివలింగాన్ని నిత్యం ఆరాధించేవాడట. తానూ వేటకు వెళ్లి తెచ్చిన మాంసాన్ని ముందుగా శివలింగానికి నివేదించి తరువాత తాను భుజించేవాడట. ఇలా రోజులు గడుస్తున్నాయి.  కొంతకాలం అయినతరువాత అతని కర్మ పరిపక్వ స్థితిని చేరుకున్నాడు.  అప్పుడు పరమేశ్వరుడు అతని భక్తిని పరీక్షిన్చగోరినవాడై శివ లింగంకు వున్నా ఒక కంటినుండి ధారాపాతంగా నీరు కారటం అయ్యిందట.  అది గమనించిన కిరాతకుడైన కన్నప్ప తన దగ్గరవున్న వస్త్రంతో ఆ కన్నీటిని తుడవ ప్రయత్నం చేసాడు కానీ ఏది ఫలించలేదు. చివరకు తన స్వామి కన్ను చెడిపోయినదని భావించి దాని స్థానంలో తన కన్నును పెట్టాలని ఆలోచించి తన వద్దవున్న బాణంతో తన కన్నును పెరికించి లింగంకు నీరు కారే కంటికి అమర్చాడట వెంటనే ఆ కన్ను నీరు కారటం  ఆగినదట. అది చూసిన కన్నప్పకు సంతోషం కలిగింది స్వామి నా కన్ను పోయినా నీ కన్ను బాగుపడిందని ఆనందించాడట.  కానీ అతని ఆనందం క్షణకాలం కూడా వుండలేదు వెంటనే లింగంకు రెండవ కంటిలోనుండి నీరు కారటం మొదలైనదట అయ్యో ఇప్పుడు ఎట్లా అని ఒక నిముషం ఆలోచనలో పడి తరువాత తన రెండవ కన్నును కూడా పీకి స్వామికి సమర్పించాలని నిర్ణయించుకున్నాడట.  కానీ తన రెండవ కన్ను తీసివేస్తే తాను చూసేది యెట్లా అని ఆలోచనలో పడ్డాడు వెంటనే తన కాళీ బొటన వేలితో పరమేశ్వరుని రెండవ కాంతిని పట్టి గుర్తింపుగా చేసుకొని తన రెండవ కంటిని తీసి స్వామికి సమర్పించారట అప్పుడు పరమేశ్వరుడు ప్రసన్నుడై కన్నప్పను దర్శనమిచ్చి తనలో ఐక్యత చేసుకొన్న విషయం మనందరికీ తెలిసిందే. 

సాధారణ భక్తి భావనలో వున్న సాధకుడికి తాను వేరు భగవంతుడు వేరు అని అనుకుంటాడు కాబట్టి శివలింగం కన్నుకు నీరు కారితే తన కన్ను పెట్టాలని అనుకోడు. 

శివలింగమును కాలితో తాకటం అపచారంగా సాధారణ భక్తులు భావిస్తారు. 

కానీ కన్నప్ప శివుడు వేరు తాను వేరు కాదని ఏకత్వ సాధన చేసిన వాడు కాబాట్టి తనను తానువిస్మరించి కేవలం శివుడే సర్వస్వము అనే భావనలోకి వచ్చాడు అదే ఏకత్వం అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ అనే రెండు వుండవు కేవలం పరమాత్మా తత్వమే ఉంటుంది. దీనినే త్వమేవ అహం అనే భావనగా పేర్కొనవచ్చు. 

 ఇంకా విఫులంగా అర్ధంకావటానికి మరొక దుష్టాంతరం చూద్దాము. పూర్వాము ఒక గ్రామంలో ధర్మపాలుడు అనే ఒక బ్రహ్మచారి ఉండేవాడట వానికి చిన్నప్పటినుంచే దైవచింతన కలిగి ఉండేవాడు తనకు బ్రహ్మజ్ఞ్యానం బోధించగల గురువు ఎవరైనా దొరుకుతారా అని అన్ని చోట్లకు తిరిగి వెతికేవాడట ఆలా వెతుకుతూ వెతుకుతూ ఒక అరణ్య సమీపంలోని ఒక పల్లెకు చేరుకున్నాడు.  అక్కడి వారిని విచారించగా ఆ పల్లెలోని ఒక ఆసామి నాయనా బ్రహ్మ జ్ఞ్యానులు ఎలావుంటారో నాకు తెలియదు కానీ ఈ అరణ్యంలో ఒక పాడుబడిన శివాలయం వుంది అందులో ఒకవ్యక్తి ఉంటాడు అయన ఎటువంటి దుస్తులు ధరించాడు చూడటానికి పిచ్చివానిగా ఉంటాడు ఎవరితోడి మాట్లాడాడు కేవలం ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు బహుశా నీవు వెతికే బ్రహ్మ జ్ఞ్యాని ఆయనే ఏమో చూడు నాయనా అనగా ఆహా ఏమి నా భాగ్యము నేను వెతికే సద్గురువు నాకు తారసపడిపోతున్నాడు నాకు తప్పక జ్ఞనబోధ చేస్తాడు అని ఆలోచిస్తూ ఆ శివాలయాన్ని చేరుకున్నాడు. అది ఒక పాడుపడిన దేవాలయం చుట్టూతా చెట్లు చేమలు వుంది అక్కడికి పోవటానికే దుర్లభంగా వుంది కానీ మన ధర్మపాలకునికి అవేమి కనిపించటం లేదు దేవాలయంలో వుండే తన గురువుగారి అతని ముందర కదులాడుతున్నట్టు  అనిపించింది. ఆ చెట్ల మధ్యనుంచి శివాలయాన్ని  చేరుకున్నారు. శివాలయం అంటా దుమ్ము దూళితో కుడి వుంది ఆలయంలో ఎక్కడ మానవ సంచారం ఉన్నట్లు తెలియటంలేదు.  అలాగే గర్భ గుడికి   అక్కడ మసక వెలుతురో ఒక మనిషి పడుకున్నట్లు కనపడించి బహుశా ఆయనే కాబోలు తాను వెతికే సద్గురువు అని తలంచాడు. 

అతనికి చూడగానే ధర్మపాలునికి మతి పోయినట్లయినది ఆయన శివలింగం మీద తన రెండు పాదాలను మోపి పడుకొని వున్నాడు వెంటనే అతని మీద కోపం వచ్చింది ఇదేమిటి సాక్షాత్తు పరమేశ్వరుని లింగం మీద కాళ్ళు మోపి పడుకునేవాడు ఒక మూర్ఖుడు అవుతాడు కానీ సద్గురువు ఎలా అవుతాడు అని అనుకోని అయన దగ్గర నేను జ్ఞ్యాన సముపార్జన చేయటం అటుంచి ముందుగా ఈయనకు నేను దైవ భక్తిని తెలియచేయాలి అని అనుకోని స్వామి మీరు ఏమి చేస్తున్నారో అర్ధం అవుతున్నదా అని అడిగాడు దానికి ఆయన తెలియదు నాయనా పడుకొని వున్నాను నేను ఏమి చేయటం లేదు అని అన్నాడు. 

స్వామీ మీరు శివలింగం మీద మీ పాదాలు మోపి పడుకున్నారు అపచారం, అపచారం అని అన్నాడు. అలానా నాయనా ఈ మసక చీకటిలో చూసుకోలేదు నాకు కళ్ళు సరిగా కనిపించవు శివలింగం లేని చోట నా కాళ్ళు పెట్టి వేళ్ళు నాయనా అని అన్నారు ఆయన అలాగే అని అతని కాళ్ళను ప్రక్కన ఉంచినాడు మన ధర్మ పాలుడు 

ఆశ్చర్యం ఆయన కాళ్ళు ఎక్కడ పెట్టాడో అక్కడ ఇంకొక శివలింగం ఉద్బవించింది. అక్కడినుండి ఇంకోచోటికి మరల్చాడు అక్కడకూడా ఇంకో లింగం వచ్చింది అట్లా ఆయన కాళ్ళు ఎన్ని చోట్లకు మార్చినా అన్ని చోట్ల శివలింగాలు పుట్టటం వాటిమీదనై ఆయన కాళ్ళు ఉండటం గమనించి మన ధర్మపాలునికి మతి పోయింది స్వామి తమరు ఎవరు ఈ చిత్రం ఏమిటి తెలియచేయమని  వేడుకున్నాడు. 

అప్పుడు ఆ జ్ఞ్యాని ఇలా న్నారు నాయనా నీవు కేవలం శివలింగంలోనే భగవంతుని చూస్తూవున్నావు అన్ని నేను ఈ జగత్తు మొత్తంలో భగవంతుని చూస్తూవున్నాను ఇప్పుడు చెప్పు నేను నా కళ్ళను శివలింగం లేని చోట యెట్లా పెట్టాలో అని అన్నారు. 

అప్పుడు మన ధర్మ పాలుడు ఆ మహా జ్ఞ్యానికి పాదాక్రాంతుడై తనకు బ్రహ్మ జ్ఞనాన్ని బోధించ వలెనని వేడుకొనినాడు. 

కాబట్టి సాధక మిత్రమా ఎప్పుడైతే సాధకుడు తన సాధనలో ముందుకు వెళతాడో అప్పుడు ఏకత్వం సిద్ధిస్తుంది ఆ సిద్దె మోక్ష సిద్దిగా మన మహర్షులు పేర్కొన్నారు.    

ప్రతి సాధకుడు సదా జాగరూకుడై వుండి విచక్షణతో మెలగాలి సాధన సంపత్తితోమోక్షపదాన్ని చేరాలి.

 ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

మీ భార్గవశర్మ

తెలుసుకుందాం

 *దర్గాలంటే ఏంటి అని తెలుసుకుందాం*🙏


ఈ పోస్ట్ చదవకపోతే, మోసపోతూనే ఉంటాం.

"దేవో దుర్బల ఘాతుకః"

అప్పుడు మనల్ని దేవుడు కూడా బాగుచేయలేడు.


*👉దర్గాలో ఉండెది హజ్రత్ లు అంటే?*


*మన హిందూ పూర్వీకులను హత్యలు, మానభంగాలు, హిందూ దేవాలయాల ధ్వంసం చేసే రాక్షసుల సమాధులు...*


ఇప్పట్లో బాగా చదువుకున్న PHD, MBBS, M-TECH చేసిన వారికి, ఆయా కోర్సులకు సంబంధించి "డిగ్రీ పట్టా"లాంటివి అందజేస్తుంటారు..!!


👉 "ముస్లిం" ఆక్రమణదారుల పాలనలో ఉన్న సమయంలో... 


ఎవరైనా ముస్లిం సైనికుడు గానీ, సైనికాధికారి గానీ హిందువులను కనీసం "100 మంది"కి పైచిలుకు, విచ్చలవిడిగా హత్యలు చేసి ఉంటే... అటువంటి సైనికుడ్నీ, ఆ అధికారినీ, ఆ ముస్లిం రాజులు, "హజ్రత్" అనే బిరుదుతో సత్కరించి...

ఆ రాజు ఆస్థానంలోని ఏదైనా ప్రదేశానికి "మెజిస్ట్రేట్"గా నియమించి అక్కడి పన్ను వసూళ్ళూ, పాలనా వ్యవహారాలను వారికందించేవారు.


అందుకే మీకెక్కడైనా దర్గాలు కనిపిస్తే,

ఒకసారి చూడండి.

అక్కడ వాళ్ళ పేరుకు ముందు "హజ్రత్" అని రాసి ఉంటుంది..!!


ఉదాహరణకు:-

హజ్రత్ సయ్యద్, హజ్రత్ హుస్సేని ఆలం, హజ్రత్ అలీ ఖాన్, ఇలా దర్గాలకు పేర్లుంటాయి.


ఈ "హజ్రత్"లు స్థానిక హిందూ యువతులపై విచ్చలవిడిగా అత్యాచారాలకు పాల్పడేవారు. "చిన్న చిన్న ఆడ పిల్లల్ని" ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యుల ముందే, ఇంట్లోని పెళ్ళికాని ఆడపిల్లల్ని, వితంతువుల్ని ఎత్తుకుపోయేవారు. *"అందుకే హిందువులు బాల్యవివాహాలు మొదలుపెట్టారు. వితంతువులు సతీసహగమనం చేసేవారు".* కానీ మన చరిత్ర పుస్తకాలలో "బాల్యవివాహాలు, సతిసహగమనం" దురాచారాలు అని చెప్పారు కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆ పరిస్థితిని చెప్పలేదు.

మరి "బురఖా" కప్పుకోవడం మతాచారం ఎందుకు అయింది?

దురాచారం ఎందుకు కాలేదు?

నలుగురిని పెళ్లి చేసుకోవడం, నలుగురిని కనడం ఎందుకు దురాచారం కాలేదు? 


మన చరిత్ర పుస్తకాలను రాసిన వారు కూడా ముస్లింలే? కావాలంటే గూగుల్ లో "who is first Indian education minister"? అని టైప్ చేసి సెర్చ్ చేయండి. Maulana Abul Kalam Azad అనే ముస్లిం పేరు వస్తుంది. ఆయన మక్కాలో పుట్టారు. మదర్సాలో చదువుకున్నారు. ఆయన 10 సంవత్సరాల 160 రోజులు భారతదేశ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇది కూడా గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. వీళ్లు మొగలులు బ్రిటిష్ వారు గొప్పవారు అని రాశారు తప్ప, అసలు సిసలైన భారతీయ సంస్కృతి, చరిత్రను, భారతీయ రాజుల గురించి పూర్తిగా లేకుండా చేశారు.


వీరికి ఎవరిమీదైనా కన్నుబడితే...

ఆ అమ్మాయి వీరు పిలిస్తే, తప్పక వెళ్ళాల్సిందే... 

లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది..!!


ఇంకా కొత్తగా పెళ్ళైన జంట, వీళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాల్సి వొచ్చేది... 


అలా ఆశీర్వాదాల కోసం వెళ్ళినపుడు, పెళ్ళి కూతురు ఎవరైనా. ఈ "హజ్రత్"లకు నచ్చితే, అటువంటి ప్రతీ అమ్మాయి, ఒక్కతే పూజ పేరుతో మొదటి రాత్రి అతనితో గడపాల్సి వొచ్చేది..!!


అంతే కాకుండా 


ఆ ప్రాంతంలో వీరు అవసరమైనప్పుడల్లా విచ్చలవిడి వసూళ్ళకూ, దోపిడీలకూ పాల్పడుతూ ఉండేవారు..!! హిందువుల ముఖ్యంగా వాళ్లు కష్టపడి సంపాదించిన సంపదను దేవాలయాలలో దాచుకునేవారు. వీళ్ళు ఆ దేవాలయాలను కూడా వదలకుండా దోపిడీ చేసేవారు, అడ్డు వచ్చిన వారిని చంపేవారు.


ఉదాహరణ:-

వేములవాడ రాజన్న దేవాలయం.

హజరత్ సయ్యద్ కాజా అనేవాడు, శివరాత్రి రోజున వేములవాడలో పూజలు జరుగుతున్న సమయంలో, శివలింగంపై మూత్ర విసర్జన చేసాడు. అది చూసిన అక్కడి భక్తులు వాడిని చంపేశారు. అప్పట్లో ముస్లిం రాజులు పరిపాలనలో ఉన్న సమయంలో అక్కడికి ముస్లిం రాజు వచ్చి, అతడి శవాన్ని అక్కడే పూడ్చిపెట్టి, మీరు ముందు సమాధిని (దర్గాను) దర్శించిన తర్వాతే మీ దేవుడి దర్శనానికి వెళ్లాలని, అలా మొగలుల కాలంలో అక్కడ సుఫీ దర్గా వచ్చింది. పీకల మీద కత్తులు పెట్టి, మొక్కేలా చేశారు, బానిసత్వాన్ని అలవాటు చేశారు. అది ఇప్పటికీ అలాగే మన రక్తంలో ఉండిపోయింది.


అలా ఏర్పడ్డవే ఈ "ముస్లిం దర్గాలు"..!!


ఆ ప్రాంతంలోని వారందరూ ఆ "దర్గా"కి "దినా"లనాడు డబ్బులు సమర్పించడం, పూజలు చెయ్యడం లాంటివి చేసి.

ఆ "హజ్రత్ దర్గాల"పైన తమ భయభక్తులూ, గౌరవ మర్యాదలూ చాటుకునే వారు..!!


👉 ఇదే పద్ధతి ఇప్పటికీ దేశంలో చాలా చోట్ల కొత్తగా పెళ్ళైన జంట, ఏదైనా కోరికలున్న వాళ్ళు మొక్కులు మొక్కుకుంటూ.

అక్కడికి వేళ్తే తమ కోరికలు నెరవేరి, తమకు అంతా మంచే జరుగుతుందని భ్రమపడుతూ ఉంటారు.


👉 "నిజాముద్దీన్ దర్గా"... దాని పేరుతో ఉన్న స్పెషల్ ట్రైన్ గురించి (నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్) మీకు తెలియదా?


ఈ దర్గాలకు వెళ్ళడం అచ్చంగా "హిందూబానిసత్వ లక్షణం"


*దర్గా గురించి తెలుసుకున్నాం కనుక, ఇప్పుటి నుండి దర్గాలకు వెళ్ళడం మానుకుందాము.*

*ఈ విషయాన్ని మన హిందువులందరికీ తెలియజేద్దాం.*

🚩🚩జై శ్రీరామ్ 🚩🚩

   🙏🙏🙏



https://kutumbapp.page.link/ytHzGhfUaz3A953w5?ref=F4LTY

Save Hinduism


 


 

రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్.*

 ఇది నిజమేనా🥱💃....


🔷దయచేసి అందరికి షేర్ చేయండి*


🔷స్టార్ హోటల్ లాంటి హాస్పిటల్*


 

 🔷చెన్నై శ్రీపెరంబుదూర్ సమీపంలో ఉంది! అది రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్.*


🔷 శారీరక సమస్య కారణంగా, ఒక వ్యక్తి స్నేహితుడితో వెళ్లాడు! మీరు ప్రవేశించిన వెంటనే, అడ్మిషన్ నుండి స్పెషలిస్ట్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లడానికి ఇద్దరు సిబ్బంది ఉన్నారు.*


🔷ఒక్కో విభాగానికి కనీసం 4 మంది వైద్యులు. ఫస్ట్ క్లాస్ చికిత్స అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకోండి!*


🔷అతన్ని చాలా ఆశ్చర్యపరిచిన విషయం..*


🔷1. వైద్య రుసుము లేదు.*


🔷2. ప్రవేశ రుసుము లేదు.*


3. అడ్మిషన్ తర్వాత, రోగి ఇంటికి వెళ్లే వరకు ఆహారం మరియు మాత్రల గది ఉచితం. ఆహారమే కాదు రుచికరమైన ఆహారం.*


4. ఎక్స్ రే, డిజిటల్ ఈసీజీ, వీడియో ఎండోస్కోపీ, యాంజియోగ్రామ్ అన్నీ ఉచితం.


5. అన్ని శస్త్రచికిత్సలు ఉచితం.*


మందులు కూడా ఉచితం


🔷చాలా పరిశుభ్రమైన ఆసుపత్రి. అద్భుతమైన సంరక్షణ.*


🔷నా స్నేహితుడికి చిన్నపాటి ఆపరేషన్ అవసరమని చెప్పారు. 4 రోజులు ఉండాలి. అపోలోలో లక్షన్నర. పోరూర్ రామచంద్రలో 84,000, మరో చిన్న ఆసుపత్రిలో 45,000. అయితే ఇక్కడ ఇది ఉచితం మరియు స్కాన్, ECG, మందులు ఇలా అన్నీ ఉచితం*


 *దయచేసి ప్రచారం చేయండి.*


🔷రాజలక్ష్మి మెడికల్ కాలేజీ హాస్పిటల్ - చెన్నై (శ్రీపెరంబుదూర్) -


 🔷 ప్రజలందరూ ఆసుపత్రికి వెళ్లేందుకు అన్ని గ్రామాల నుండి ఉచిత బస్సును నడుపుతున్నారు మరియు ఆపరేషన్లు పూర్తిగా ఉచితం.*

*(ఫోన్:- 6364109600

* 9994648533) ************************* _*దయచేసి దీన్ని ఫోరమ్ గ్రూపులకు పంపడం ద్వారా సహాయం చేయండి... ధన్యవాదాలు ..*_

సృష్టి యొక్క అద్భుతం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*ఒక ఆదివారం ఉదయం ఒక ధనవంతుడు తన బాల్కనీలో సూర్యరశ్మిని, కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. బాల్కనీ యొక్క ఒక వైపు నుండి మరొక వైపుకు వెళుతున్న ఒక చిన్న చీమ దాని పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దదైన ఆకును మోసుకెళ్లుతున్నది. ఆ వ్యక్తి గంటకు పైగా దానిని చూశాడు. చీమ తన ప్రయాణంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటూ ఆగి దారి మళ్లించి గమ్యం వైపు వెళ్ళింది. ఒకానొక సమయంలో ఆ చిన్న జీవికి నేలలో పగుళ్లు కనిపించాయి. కాసేపు ఆగి విశ్లేషించి ఆ తర్వాత పెద్ద ఆకును ఆ పగులు మీద ఉంచి ఆకు మీద నడిచి అవతలి వైపుకు వెళ్లి ఆకును తీసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించింది. దేవుని సృష్టిలో చిన్న జీవులలో ఒకటైన చీమ యొక్క తెలివితేటలకు ఆ వ్యక్తి ఆకర్షితుడయ్యాడు. ఈ సంఘటన అతనిని విస్మయానికి గురి చేసింది మరియు సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలా చేసింది. అది సృష్టికర్త గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ళ ముందు దేవుని యొక్క ఈ చిన్న జీవి ఉంది పరిమాణం తక్కువగా ఉంది కానీ విశ్లేషించడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, అన్వేషించడానికి, కనుగొనడానికి మరియు అధిగమించడానికి మెదడును కలిగి ఉంది. కొద్దిసేపటి తరువాత ఆ జీవి తన గమ్యాన్ని చేరుకున్నట్లు ఆ వ్యక్తి చూశాడు. అదే దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం ఉన్న నేలలో ఒక చిన్న రంధ్రం. ఈ సమయంలోనే చీమ యొక్క లోపం ఆ వ్యక్తికి తెలియ వచ్చింది. చీమ తాను జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకు వచ్చిన పెద్ద ఆకును చిన్న రంధ్రంలోకి ఎలా తీసుకెళ్లగలదు? దానికి అది సాధ్యంకాలేదు! అందుకని ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టపడి, మరెంతో శ్రమించి, మార్గమధ్యంలో అన్ని కష్టాలను అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీచేతులతో ఇంటికి (రంధ్రంలోకి) వెళ్లిపోయింది. చీమ సవాళ్లతో కూడిన తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు ముగింపు గురించి ఆలోచించలేదు. చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది తప్ప ఉపయోగపడలేదు. ఆ జీవి తన గమ్యాన్ని చేరుకోవడానికి దానిని విడిచి పెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి గొప్ప పాఠం నేర్చుకున్నాడు. మన జీవితాలకు సంబంధించిన సత్యం కూడా అదే. మనము మన కుటుంబం గురించి చింతిస్తాము. మన ఉద్యోగం గురించి చింతిస్తాము. ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి.  ఎక్కడ నివసించాలి. ఎటువంటి వాహనం కొనాలి. ఎటువంటి దుస్తులు ధరించాలి. ఏ ఉపకరణాలను మేలైనవి కొనాలి అని ఆలోచించి మన గమ్యం (సమాధి) చేరుకోగానే వీటన్నిటినీ వదిలేస్తాం. మన జీవిత ప్రయాణంలో వాటిని కోల్పోతామనే భయంతో, ఎంతో శ్రద్ధతో మోస్తున్న భారాలు మాత్రమేనని, చివరికి అవి నిరుపయోగంగా పడి ఉంటాయని, వాటిని మనతో తీసుకెళ్లలేమని మాత్రం గ్రహించలేము! అందుకే ఒకసారి ఆలోచించండి!*

🙏🏼🙏🏽🙏🏼

*సేకరణ:- వై.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 89*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 89*


ఆ స్వాగత ద్వారము అపూర్వ శిల్పకళా నైపుణ్యము ఉట్టిపడుతూ చూపరుల ప్రశంసలను అందుకుంటోంది. ఆ ద్వారము మధ్య భాగంలో నిర్మించబడిన పద్మము చాలా పెద్దది. 'ఊరేగింపు ఆ ద్వారం మధ్యకు రాగానే ఆ పద్మము రేకులువిచ్చుకుంటాయని, దాని మధ్య నుండి అపూర్వ పుష్ప వర్షము చక్రవర్తిపై కురుస్తుందని' ఆ ప్రాంతాన గుమిగూడిన ప్రజలు చెప్పుకోవడం చాణక్యుని చెవుల పడింది. 


"ఆ ద్వారము నిర్మించిన వారు ఎవరు ?" అని చాణక్యుడు అడిగిన ప్రశ్నకు "దారువర్మ" అని ఎవరో జవాబిచ్చారు. చాణక్యుడు తల తిప్పి ఆ జవాబు ఇచ్చిన వానివైపు చూసాడు. చాణక్యుని దృష్టి తన మీద పడగానే ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వాడు. ఆ వ్యక్తి ప్రచ్చన్న దుస్తుల్లో ఉన్న సేనాని బాగురాయణుడు. 


చాణక్యుడి పెదాల మీద వికృత మందహాసమొకటి తళుక్కున మెరిసి మాయమైంది. అతడు తన గుర్రాన్ని పక్కకు తప్పించి రాజమార్గం ప్రక్కన జనం వెనక నిలిపాడు. 


ఊరేగింపు క్రమంగా ఆ ద్వారాన్ని సమీపించింది. ఒక్కొక్క బృందమే ద్వారం క్రిందినుంచి సాగిపోతోంది. భద్రగజం చంద్రరేఖ ద్వారాన్ని సమీపించింది. జనాలు బిగ్గరగా "జయహో... చంద్రగుప్త మహారాజ్ కి జయ... జయ.." అంటూ ఉత్సాహంతో నినాదాలు చేస్తున్నారు. 


చాణక్యుడు జనం చాటునుంచి రెప్పవాల్చకుండా ఆ ద్వారం మధ్యన అమర్చిన యాంత్రిక పద్మం వైపు చూస్తున్నాడు. చంద్రరేఖ సరిగ్గా యాంత్రిక పద్మం క్రిందికి వచ్చింది. 


అప్పుడు... అప్పుడు... 


చంద్రోదయాన్ని కాంచగానే వికసించిన కమలంలా పద్మం రేఖలు యాంత్రికంగా విచ్చుకున్నాయి. విచ్చుకున్న పద్మదళాల మధ్యనుంచి పుష్ప వర్షం కురుస్తోంది. పుష్ప వర్షం మధ్య నుంచి మెరుపులా భద్రగజం మీదకి దూకాడో వ్యక్తి. అతడు ఏనుగు మీదికి దూకుతూనే బొడ్డులోంచి బాకుతీసి మహారాజు గుండెల్లో పొడిచాడు. 


"అడుగో వాడే దారువర్మ... చక్రవర్తిని పొడిచేశాడు..." 


అరుపులతో పాటు మహారాజు గిలగిలా తన్నుకుంటూ భద్రగజం పైనుంచి కిందికి జారి నేలమీద పడి ప్రాణాలు వదిలాడు. అతడి ముఖానికి అడ్డుగా వ్రేలాడుతున్న పూలహారాలు తొలగిపోయాయి. అతను చంద్రగుప్తుడు కాడని అందరికీ అర్థమైంది. 


"వాడే దారువర్మ... హంతకుడు... వధించండి..." జనం వెనుకనుంచి భీకరస్వరంతో గర్జించాడు చాణక్యుడు. అంతలో భద్రగజానికి ఇరువైపులా అంగరక్షకులుగా వస్తున్న పర్వతక సైనికులు వైరోచనుడి మృతదేహాన్ని చూసి ఆవేశపడుతూ "మోసం ... కుట్ర... ఇదంతా మాగధుల వంచన ... దెబ్బకి దెబ్బ... రక్తానికి రక్తం..." అని అరుస్తూ కత్తులు దూశారు. అదే సమయంలో బాగురాయణుడి సైగలు అందుకొని, జనం వెనుకనుంచి ముందుకు వురికిన మగధసైనికులు వైరోచనుడి అంగరక్షకులను ఎక్కడున్న వాళ్ళని అక్కడే, ఎలావున్న వాళ్ళని అలా నరికి పారేశారు. 


ఆ గొడవ, గందరగోళాలకి భద్రగజం బెదిరి చిందులు తొక్కింది. ఆ కుదుపులకు దానిపైనుంచి దారువర్మ జారి క్రిందపడ్డాడు. భద్రగజం చంద్రరేఖ తన కాళ్ళతో దారువర్మని దారుణంగా తొక్కి చంపేసింది. అదంతా కొద్ది క్షణాలలోనే ... 'ఏం జరిగిందో' జనం గ్రహించే లోపే జరిగిపోయింది... అంతలో... 


"జయహో ... మౌర్య చంద్రగుప్త సార్వభౌమా.... జయహో... జయహో..." అంటూ పెద్ద పెట్టున నినాదాలు ప్రతిధ్వనించసాగాయి. 


అశ్వారుడుడై వేగంగా అక్కడికి చేరుకున్నాడు చంద్రగుప్తుడు. అంతలో రాచబాటపై పడివున్న పర్వతసైనిక మృతదేహాలను మగధసైనికులు క్షణంలో తొలగించివేశారు. చాణక్యుడు జనం మధ్యనుంచి ముందుకు వచ్చి భద్రగజం పైనున్న మావటికి సైగచేశాడు. మావటివాడు భద్రగజాన్ని చంద్రుని సమక్షంలో కూర్చుండబెట్టాడు. 'భద్రగజాన్ని అధిరోహించమన్నట్టు' చిరునవ్వుతో చంద్రుని సూచించాడు చాణుక్యుడు. 


చంద్రుడు మోకాళ్ళమీద వంగి చాణక్యుడికి నమస్కరించాడు. చాణక్యుడు అపరిమితమైన వాత్సల్యంతో చంద్రుని లేవదీసి కౌగిలించుకున్నాడు. ఆ అపూర్వ దృశ్యాన్ని చూస్తూ... 


"జయహో .... మౌర్య చంద్రగుప్త సార్వభౌమా .... జయహో .... జయహో ...." 


"జయహో... మౌర్య సామ్రాజ్య స్థాపనాచార్యా.... ఆర్యచాణక్యదేవా .... జయహో.... జయహో..." 


దశదిశలా ప్రతిధ్వనించేలా ఆ ప్రజల నినాదాలు మిన్నుముట్టుతుండగా... వైతాళికులు జయగీతికలు ఆలపిస్తుండగా చంద్రగుప్త మౌర్యుడు ఆర్యచాణక్యుల వారి ఆదేశానుసారం భద్రగజం చంద్రరేఖని అధిరోహించాడు. మరుక్షణం మంగళతూర్య భేరి నినాదాలు ఉధృతంగా ప్రతిధ్వనిస్తూ ఉత్సాహపూరిత వాతావరణాన్ని వుత్తేజితం చేశాయి. 


చాణక్యుడు చరచర ముందుకెళ్లి వేదాంగ వేత్తలు, పండిత, పురోహిత బృందంతో కలిసి వేద పఠనం చేస్తూ ముందుకు నడిచాడు. మాగధుల జయహోషలతో, దారిపొడవునా పూలవర్షపు జల్లులతో సాగిన ఊరేగింపు సుగాంగ ప్రసాదాన్ని చేరుకుంది. 


రాజపురోహితులు, పండితులు, ' పనస ' చదువుతూ పూర్ణకుంభంతో చంద్రగుప్తునికి స్వాగతం పలికారు. సముద్రతరంగంలా పోటెత్తిన జయజయధ్వనుల మధ్య సుగాంగ ప్రాసాదంలో అడుగుపెట్టాడు చంద్రగుప్తుడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

దశ మహా విద్యలు

 దశ మహా విద్యలు - వాటి ఫలితాలు.

1. తొలి మహా విద్య శ్రీకాళీదేవి

🌟కృష్ణ వర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్రేయసంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహా విద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు నాశనం, దీర్షాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది.

2వ మహావిద్య శ్రీతారాదేవి

🌟దశ మహావిద్యలలో రెండవ మహా విద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది.

3వ మహా విద్య శ్రీషోడశీదేవి

🌟అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతాయి.

4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి

🌟దశ మహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు.

5వ మహావిద్య శ్రీ త్రిపుర భైరవీ దేవి

🌟దశమహావిద్యలలో 5వ మహా విద్య వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపిణికి మాఘమాసం పూర్జిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి, సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది.

6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి

🌟దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ ఛిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచినీ, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికీ ఎంతో ప్రశస్తివుంది. ఈ దేవిని నిష్టతో ఉపాసిస్తే సరస్వతీసిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాలనుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది.

7వ మహావిద్య శ్రీ ధూమవతీ దేవి

🌟దశ మహావిద్యలలో 7వ మహావిద్య.. ధూమ వర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధనవల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది.

8వ మహావిద్య శ్రీ జగళాముఖీ దేవి

🌟దశమహావిద్యలలో 8వ మహావిద్య.. పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్థంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది.

9వ మహావిద్య శ్రీ మాతంగీదేవి

🌟దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య.. మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి కి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగీ, లఘుశ్యామలా, ఉచ్చిష్టచండాలి, అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి.

10వ మహావిద్య శ్రీ కమలాత్మికాదేవి

🌟పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తిపొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈదేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది

మూర్ఖజనచిత్తమును

 శుభోదయం🙏


మూర్ఖజనచిత్తమునుమార్చుటకష్టము!


మకరముఖాంతరస్థమగు మానికమున్బెకలింపవచ్చు బా

యక చలదూర్మికా నికరమైన మహోదధి

దాటవచ్చు,మ

చ్చికగొని పూలదండవలె సర్పమునైన ధరింపవచ్చు ,మ

చ్చికఘటియించి మూర్ఖజన చిత్తముదెల్ప నసాధ్సమేరికిన్!

భర్తృహరి సుభాషితములు.మూర్ఖపధ్ధతి.


       లోకంలో అసాధ్యమైనవెన్నో సుసాధ్సంచేయవచ్చు.కానీ,మూర్ఖునిహృదయాన్ని మాత్రం మార్చలేం.

           ఎలాగంటారా? అయితే వినండిమరి.

   మొసలి బహు భయంకరమైనది 

దానినోరోభయంకర క్రకచం.అంటే రంపం. అలాంటి దానినోటిలో చేయిపెట్టి

అందున్న మాణిక్యమునైనా సులువుగా తీయటంసులువు.

          ఉత్తాలవిశాలచలత్తరంగాలతో మహా భయదమైన సముద్రమునైనా సునాయాసంగా దాటటంతేలిక,

         కంఠదఘ్నమైన ఆశీవిషంతోకూడిన భయంకరమైనసర్పమునైనా పూలదండవలె ధరించటం సుకరం. కానీ

మూర్ఖునిహృదయాన్ని మార్చటంమాత్రం చేతగానిపనే!!!🙏🙏🙏

నిజాలు

 *కొన్ని..... నిజాలు:*


యవ్వనంలో ఉన్నప్పుడు *"మొటిమల్ని"* గురించి బాధపడే వాళ్ళం! 


ముసలితనం వచ్చినప్పుడు  *"ముడతల్ని"*  గురించి బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"ఆమె"* చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురుచూసే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి *"చేయి"*  పట్టుకుంటారా....అని ఎదురు చూస్తుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను *"ఒంటరిగా"* వదిలేస్తే బాగుండును...అనుకునేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు అందరూ *"ఒంటరిగా"* వదిలేస్తారేమో.... అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే *"చికాకు"* పడేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం *"మాట్లాడటం"* లేదే అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"అందాన్ని"* ఆస్వాదించే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ *"అందాన్ని"* చూసుకుంటుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు నాకు *"చావు"* లేదు అనుకుంటాం!


ముసలితనం వచ్చినప్పుడు .... *"రోజులు దగ్గర పడ్డాయి"* అని బాధపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో *"ప్రతి క్షణాన్ని"* పండగ చేసుకునే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఆ *"తీపి జ్ఞాపకాల్ని"*  నెమరు వేసుకుంటుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు *"నిద్రలేవడం"* కష్టంగా ఉండేవాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు *"నిద్రపోవడానికి"* కష్టపడుతుంటాం!!


యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా *"గుండెల మీద"* పిడిగుద్దులతో  గుద్దుకునే వాళ్ళం!


ముసలితనం వచ్చినప్పుడు ఈ *"గుండె ఎప్పుడు ఆగి పోతుందో"*  అని భయపడుతుంటాం!!


కనుక........


జీవితంలో రకరకాల *"ఆటు పోట్లు"* వస్తుంటాయి. 

దేనికీ భయపడ కూడదు. 


ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం  కావాలి.

 అదే నిజమైన *"జీవితానుభవం".* 


అది *"యవ్వనంలో"* నైనా.. *"ముసలితనంలో"* నైనా.....అన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా *"ప్రశాంతంగా"*  ఉంటుంది.


అందుకే, మిత్రమా....


 *యవ్వనంలో..... విర్రవీగకు!*

*వృద్దాప్యంలో..... బాధ పడకు!!*