14, డిసెంబర్ 2023, గురువారం

జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ

 *మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ - ఎలా తుడుచుపెట్టుకు పోతాయో ఒకసారి పరిశీలి ద్దాం…!*


ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోచాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్ర వీగుతుంటాము, కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము కదూ. అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటు చేసుకుంది. అదేమిటో ఒకసారి పరిశీలిద్దామా? 


కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు, తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.


కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విల పిస్తాడు.  చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న అతన్ని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు.


ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు..


”అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండి పోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు?” అని నిలదీస్తాడు.


అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధాన మిస్తాడు…


”ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదు,  నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్ర శోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ,   నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు) ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో, ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి, వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా, అప్పటికే సహనం నశించిన వాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు.


తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండి పోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది.”


”నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా, ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా, నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింప జేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు!” అని అంటాడు.


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు...


”కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.?” అని ప్రశ్నిస్తాడు.


అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి .. 


 “ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి....ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించు కున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాకే నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది!” అని సెలవిస్తాడు.


అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలి పోతాడు.


మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్య ఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకు పోతాయో ఎవరికీ తెలియదు, అందు కోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురిసి పోవడం వద్దు, అహంకార మమ కారాలకు దూరంగా ఉండి, ‘అంతా భగవదేచ్ఛ’ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి.


అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి. భూమి మీదపడి నప్పటినుండి భూమిలో కలిసేంత వరకు అనుక్షణం జాగ్రత్తలో ఉండాలి. 


     ఏ ఆధ్యాత్మిక కధ విన్నా గజేంద్ర మోక్షము కాని, ఏ కధైనా మనకర్మ ఫలమే. నవ్వులో గానీ, మాటలాడుటలో గానీ, అతి జాగ్రత్తవహించాలి. 


గతాన్ని ఏమీ చేయలేకపోయినా ఇప్పటినుండి జాగ్రత్తగా వ్యవహరించాలి!”

అరుణాచలశివ 🌹

కవుల కలములో

 తే.గీ


కవుల కలములో మాయమ్మ కావ్యముగను నిలచి యుండును శ్రీదేవి నీడ వోలె ఘనతకెక్కెడి కావ్యాలు గరునిచేత చేర్చ బడునుట దివిలోకి సిరివిధముగ

పంచాంగం డిసెంబర్-14-గురువారం ,

 శుభోదయం, పంచాంగం 

డిసెంబర్-14-గురువారం   ,

 స్వస్తిశ్రీ  శోభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు*మార్గశిర మాసం* శుక్లపక్షం 

తిథి:  విదియ 2.51pm

బృహస్పతివాసరే

నక్షత్రం:  మూల 11.33 am

వర్జ్యం: 06:44 pm – 08:14 pm

దుర్ముహుర్తం: 10:14 am - 11:05 

03:21 pm - 04:12 pm

రాహుకాలం: 01:30 pm - 03:00 

యోగం:  గండము 01:24 pm

కరణం:  బవ 03:09 am,

 భాలవ 02:05 pm

సూర్యోదయం   : 06:41

సూర్యాస్తమయం : 06:39

విడుదల

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


' విడుదల ' ! 


'ఎదుగుదల'కు - మూలం - 'విడుదల'


నిలకడకు - పునాది - 'విడుదల'


ఎంతో కష్టము - 'విడుదల' - ప్రక్రియ 


సాధన - క్రమశిక్షణ - తో - సాధ్యము - 'విడుదల'


ఆసుపత్రి  నుండి రోగి  - 'విడుదల'


చెర నుండి ఖైదీ  -  'విడుదల'


చెడు ఆలోచనల నుండి మనసు - 'విడుదల'


మంచి వైపు అడుగు - చెడు నుండి - 'విడుదల'


మితము - అన్ని - 'అతి' ల నుండి - 'విడుదల'


వృద్ధాప్యాన - భక్తి, ముక్తి - వైపు - ఆసక్తి, రక్తి - నుండి - 'విడుదల'


భవ బంధనముల  - నుండి - ఆఖరి - 'విడుదల' 


మనిషి - జీవితమే - పట్టు - విడుపుల - మధ్య - ఉయ్యాల 


విడుపులు - ఎక్కువున్న - గెలుపులు - సాధ్యాలు - తెలుసుకున్న !!! 


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మణ్యం  - చెన్నై

10.11.23

నా స్వీయ రచన

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - హేమంత ఋతువు - మార్గశిర మాసం - శుక్ల పక్షం  -‌ ప్రతిపత్ - జేష్ఠ -‌ సౌమ్య వాసరే* *(13-12-2023)* 


ప్రముఖ వేదపండితులు, 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/hmg0asPxSXY?si=uAK84mkGzSRSgck1


🙏🙏

రాశిఫలాలు

 🕉️శ్రీ గురుభ్యోనమః🕉️

 •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*14-12-2023 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో ప్రయత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం పొందుతారు. చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి.

---------------------------------------

వృషభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలు మానసికంగా చికాకుగా కలిగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టించినా ఫలితం కనిపించదు. సోదరులతో  స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మిధునం


వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు.

---------------------------------------

కర్కాటకం


స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు.  ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. చిన్ననాటి మిత్రులతో  విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

---------------------------------------

సింహం


ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. భాగస్వామితో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

---------------------------------------

కన్య


ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట  ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విద్యార్థుల శ్రమ ఫలించదు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు తప్పవు.

---------------------------------------

తుల


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని  సమస్యలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------

వృశ్చికం


పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

ధనస్సు


సోదరులతో స్థిరస్తి వివాదాలలో  నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

---------------------------------------

మకరం


విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.  సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. స్థిరస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు.

---------------------------------------

కుంభం


వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. 

---------------------------------------

మీనం


వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.  బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

దోసావకాయోత్పత్తి

 *దోసావకాయోత్పత్తి వృత్తాంతము::*

పూర్వం 1822 వ సంవత్సరంలో,  దెందులూరు గ్రామమునందు దర్భా ధనుంజయ చైనులు గారు అనెడి ఒక వేదపండితుడు వేదములతో పాటు, సాంప్రదాయ సద్వంటలను కూడా క్షుణ్ణముగా అభ్యసించినాడు!

ఆయన ఒక సాయంత్రము రాత్రి భోజనమునకు దోసకాయ పప్పు చేయవలెనని,  ఒక పుల్లని, గట్టి దోసకాయను ముక్కలు గా చేసి ఒక తప్పాలా యందు వేసికొనినాడు! అటు పిమ్మట ఆయన కించిత్తు వేదపఠనమునందు నిమగ్నుడయినాడు! ఇంతలో ఆయన గారి సతీ మణి, దర్భా దాక్షాయనీ దేవమ్మ, ఆ ఉదయము కొత్త ఆవకాయ పెట్టుటకు వాడిన ఆవపిండి కాస్త ఒక పళ్ళెమునందు మిగిలియుండుట చేత, ఆ ఆవపిండి పళ్ళెమును ఆ దోసకాయ ముక్కల తప్పాలాయందు, దృష్టి లోపమువలన చూచుకొనక పడవైచినది! అటు పిమ్మట ఆమె ఇంకనూ రెండు దినములలో గల లక్ష వత్తుల నోముకు వత్తులు చేసికొనుటకు ఉపక్రమించినది!

అంతలో, వేదపఠనము ముగించుకొని, ఇక ఇంగువ తిరగమాత దోసకాయ పప్పు చేయుదమని వచ్చిన చయనులు గారు, ఆ దోసముక్కల మీద పడియున్న ఆవపిండిని చూచి, 'అకటా, ఇక ఈ రాత్రికి దోసకాయ పప్పు దుర్లభము కదా! ఏమి శాయవలె?' అని ఆలోచించి, 'సరియే, ఈ ఆవపిండి తో కలసిపోయిన దోస ముక్కలను ఎటులయిననూ సద్వినియోగము చేయుదు గాక ' అనుకొనుచూ,  పాక దేవీ మాత పైనుండి దీవించుచుండగా, ఆ దోసముక్కలూ, ఆవపిండీ గల తప్పాలమునందు, కాస్త మచిలీపట్నపు రాళ్ళ ఉప్పూ, నారాకోడూరు ఎర్ర కారమూ కలిపి,  ఆ పైనుండి ధారగా గానుగ నువ్వుల నూనె పోసినాడు! ఆ మిశ్రమమును ఒక బృహద్గరిటె తో బాగుగా కలియ బెట్టినాడు! 'ఇది ఏదియో చూచుటకు మాత్రము బహు ముచ్చటగానున్నదే' అనుకొనినాడు!

ఒక గంట  పిమ్మట, ఆ దంపతులు ఇరువురూ, రాత్రి భోజనమున వేడి వేడి దంపుడు  బియ్యపన్నము నందు ముద్దపప్పు కలిపి, అవనిగడ్డ ఆవునెయ్యి  ధారాళముగా వేసికొని, ఆ ముద్దపప్పన్నము తో పాటు, ఈ తప్పాలమునందలి వింత పదార్ధమును నంచుకొనుచుండగా, వారికి ఆ ఘాటుకు నుదుటినుండి స్వేదము చిందుచూ, అనిర్వచనీయమగు అనుభూతీ, ఆనందమూ లభ్యమైనవి!

ఆ రాత్రి భోజనానంతరము , దర్భా ధనుంజయ చైనులు గారు, ఆ ఎర్రని, ఘాటగు వింత పదార్ధమునకు 'దోస ఆవకాయము ' అని నామకరణమొనర్చినాడు!

ఇతి దోసావకాయోత్పత్తి వృత్తాంతః

ఈ దోసావకాయ గురించి పాకపంచశతి మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక "లో ఫలశృతి చెప్పబడింది. అందులో  జఠమహర్షి, ఉదరానందునకు చెప్పిన  కొన్ని విషయాలు:

ఈ దోసావకాయ అపమృత్యువులను,    అకాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించును. దీనిని  శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం భుజించాలి. అన్ని రోగాలను హరించడానికి గట్టిగా ఉన్న ఒక్క ముక్క చాలును. ఆసక్తి గలవారు  నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ దోసావకాయను తప్పక భుజించాలి. ఊరగాయలు, పచ్చళ్ళలో  దోసావకాయ అసమానమైనది. జిహ్వసక్తి లేనివారికి దీనిని వడ్డించరాదు.

నిత్యకృత్యమునందు, పర్వదినములందు ఎవరీ దోసావకాయను యథాశక్తి విధిగా భుజిస్తారో, వారికి ధన్వాంతరీ అనుగ్రహముచే దీర్ఘాయువు, రథగజతురంగములతో సదా సుప్రసన్నమైన స్థిరసంపదలు సిద్ధించును...

13, డిసెంబర్ 2023, బుధవారం

సంతృప్తి

 సంతృప్తి


ఆఫీస్ కు రెండు రోజులు సెలవు రావడంతో అమ్మా, నాన్నలతో గడపడానికి మా ఊరికి బయలుదేరాను. బస్టాండ్ కు చేరుకున్న నేను, అప్పుడే వచ్చిన బస్ ఎక్కాను. పరిస్థితి చూస్తే కూర్చోడానికి సీటు దొరికేలా లేదు.

అప్పుడే...  ఒకతను లేచి నిలబడి అతని సీటు నాకు ఇచ్చి, అతను వేరే దగ్గరకి వెళ్ళి నిలుచున్నాడు.

హమ్మయ్య... అనుకుంటూ అతనికి థాంక్స్ చెప్పి అక్కడ కూర్చున్నాను.


నాకు సీటు ఇచ్చిన అతనికి పక్కనే ఒక అతను లేవడంతో అతను ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. ఇంతలో వేరే అతను బస్సు ఎక్కడంతో అతను లేచి నిలబడి మళ్లీ అతని సీటు ఆ వచ్చిన అతనికి ఇచ్చాడు.


ఇలా అతను తరువాత నాలుగు అయిదు స్టాపులలో అందరికీ అలాగనే అతను కూర్చున్న సీటు ఇవ్వడం చేస్తూ ఉన్నాడు.

     

ఇదంతా గమనిస్తున్న నేను, చివరి స్టేజీలో బస్సు దిగబోయే ముందు అతనితో మాట్లాడాను.

‘’నువ్వు కూర్చోకుండా ప్రతిసారి నీ సీటు వేరే వాళ్లకు ఎందుకిస్తున్నావు?” అని అడిగాను.


అతని సమాధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ‘’నేను ఏమి చదువుకోలేదు, డబ్బున్నవాణ్ణి కూడ కాదు. కూలి పనులు చేసుకునే వాణ్ణి. ఏ విధంగానూ ఎవరికీ ఏమి ఇవ్వలేక పోయాను. అందువలన నేను రోజూ ఈపని చేస్తున్నాను. ఈ పని తేలిక కూడ” అన్నాడు.

‘’కూలి చేసుకునే నాకు నిలబడడం కష్టం కాదు.


నేను సీట్ ఇచ్చిన వారు తిరిగి నాకు థాంక్స్  చెప్తారు.

ఎవరికి ఏమి ఇవ్వలేని నాకు ఈ తృప్తి చాలు. ఆ తృప్తితో నాకు సుఖంగా నిద్రపడుతుంది” అన్నాడు.

      

నాకు నోటంట మాట లేదు. ప్రతిరోజూ ఏదో ఒకటి ఇవ్వటం అంటే అది వారికి గిఫ్ట్ తో సమానమే. ఎదుటివాళ్లకు ఇవ్వాలంటే మన దగ్గర ఏమీలేకపోయిన ఇవ్వచ్చు అని అతన్ని చూచి తెలుసుకొన్నాను.


మనం ధనవంతులం, స్తితిమంతులం ఐతేనే ఒకళ్లకు ఇవ్వగలం అనుకోవటం తప్పు. ఇచ్చే మనసున్న ఎవరైనా "ధనవంతుడే" అని అతన్ని చూశాక తెలుసుకున్నాను. ఒకరికి ఇవ్వడంలో గల #సంతృప్తి మరెందులోనూ రాదని అర్థమైంది. 


మిత్రులారా! దయచేసి  సేవాగుణాన్ని , సంతృప్తిని పిల్లలలో అలవరచండి!

మనం కూడా అలవరచుకునే ప్రయత్నం చేద్దాం!


మానవసేవ - మాధవసేవ.

నాశనం కాని ఆత్మ

 నాశనమయ్యే ఈ శరీరంలో నాశనం కాని ఆత్మ ఎలా ఉంటుంది ?


గురువు గారు ఇలా అన్నారు ........... ,


పాలు ఉపయోగపడేవే , కానీ ఒక్కరోజుకు మించితే పాడైపోతాయి .....


పాలలో మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది ........


పెరుగు మరొక రోజు వరకూ ఉపయోగపడుతుంది ........


కానీ పెరుగు వేరొక రోజుకి పాడైపోతుంది .........


పెరుగును మదిస్తే వెన్న అవుతుంది .......


వెన్న మరొక రోజు వరకే ఉంటుంది .........


తరువాత అది కూడా పాడైపోతుంది .........


ఆ వెన్నను మరిగిస్తే నెయ్యి అవుతుంది .........


ఈ నెయ్యి ఎన్నటికీ పాడవ్వదు ......... 


ఒక్కరోజులో పాడైపోయే పాలలో ఎన్నటికీ పాడవ్వని నెయ్యి దాగి ఉంది .


అలాగే అశాశ్వతమైన ఈ శరీరమందు శాశ్వతమైన ఆత్మ ఉంటుంది .


మానవ శరీరము పాలు 

సంకీర్తన మజ్జిగ 

సేవ వెన్న 

సాధన నెయ్యి. 


మానవ శరీరాన్ని సాధన చేసి కరిగిస్తే ........

ఆత్మ పవిత్రత పొందుతుంది....*శుభోదయం*

పంచాంగం 12.12.2023 Tuesday,

 ఈ రోజు పంచాంగం 12.12.2023   Tuesday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస కృష్ణ పక్ష: అమావాస్య తిధి భౌమ వాసర: అనురాధ నక్షత్రం ధృతి యోగ: చతుష్పాత్ తదుపరి నాగవం కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అమావాస్య రా.తె 05:01 వరకు . 

అనురాధ పగలు 11:52 వరకు. 

సూర్యోదయం : 06:40

సూర్యాస్తమయం : 05:39

వర్జ్యం : సాయంత్రం 05:16 నుండి 06:49 వరకు.

దుర్ముహూర్తం : పగలు 08:52 నుండి 09:36 వరకు తిరిగి రాత్రి  10:52 నుండి 11:44 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


శుభోదయ:, నమస్కార: