20, డిసెంబర్ 2023, బుధవారం

ఆలోచనాలోచనాలు

 ///// ఆలోచనాలోచనాలు /////       -----***౦ Laziness ౦***-----                               1* If you are idle, you are on the way to ruin and there are no stopping places upon it.---- H.W. Beecher.                 2 * Idleness among children , as among men , is the root of all evil and leads to no other evil more certain than ill temper. ---- Hanah more.                3 * By nature's laws , enjoyment stops where idleness begins. ---- Pollock.             4 * I look upon idleness as a sort of suicide; for the man is efficiently destroyed. ----- Cicero.                         5 * The busy men is troubled with but one devil; the idle by a thousand. ---- Spanish proverb.                             6 * Evil thoughts intrude in an un employed mind; as naturally worms are generated in a stagnant pool. ----- Collier.                               7 * Don't allow idleness to deceive you; for you give him 'today', he steals ' tomorrow' from you. ----- Crowquill.                    8 * Idleness travels very slowly, and poverty soon over takes her.  ----- Hunter. 9 * Idleness is the key of beggars and the root of all evil. ---- Spurgeon.                         10 * Not only is he idle  who is doing nothing, but he that might be better employed.---- Socrates.                              11 * Idleness is many gathered miseries in one name. ----- Richter.12 * No gains without pains.----- Leonard wright.                                13 * To forget is crime -- to be lazy is greater crime, to neglect work and offer excuses is the greatest crime.           14 * The work of today, do not leave for tomorrow.                        15 * One of the best ways to reduce stress is to get organized.               Dt 18--12--2023, Monday, Good morning.

19, డిసెంబర్ 2023, మంగళవారం

కొలమానమవుతుంది

 *1988*

*కం*

పనిముగియగ పనిముట్లను (పరికరముల)

పనిమంతులు తగువిధముగ భద్రము చేయున్.

పనిముట్లకు నిచ్చువిలువ

పనితనముకు మాపనమగు పదపడి సుజనా.

*భావం*:-- ఓ సుజనా! పని ముగిసిన తరువాత పనిమంతులు పనిముట్లను తగువిధంగా భద్రపరచెదరు. అలా పనిముట్లకు ఇచ్చే విలువ యే ఆ పనివారి పనితనానికి కొలమానమవుతుంది.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

విజయములు అందగలవు.

 *1987*

*బహులఘుకందము*

గతమున విఫలములకు గల

స్థితి గతులను పరిగణించి స్థితమతి తోడన్

శ్రితబలముల నొకగతి గొన

స్తుతవిజయములందగలవు తుదకిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! గతంలో పొందిన విఫలములకు గల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని స్థిరమైన మనస్సు తో మనవద్ద యున్న బలములను(శ్రితబలములు) ఒక క్రమమైన పద్ధతిలో స్వీకరించి నచో చివరకు పొగడదగిన విజయములు అందగలవు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నేను అనంతం

 నేను ఇక్కడ ఒక బంధాన్ని

నేను ఇక్కడ ఒక జ్ఞాపకాన్ని 

నేను ఇక్కడ ఒక స్నేహాన్ని 

నేను ఇక్కడ అనేక రకాలుగా ఉన్న జీవాత్మను కానీ నా ప్రయాణం అనంతమైనది దీనికి కారణం 

నాకు విశ్వం విష్ణువు అన్న భావన నాలో లేక పోవడం నేను వేరు విష్ణువు వేరు అనే భావనతో ఉన్నాను

కానీ విశ్వం విష్ణువు అన్న భావన నాలో కలిగిన రోజు విష్ణువులో నేను ఉన్నాను.  

*నేను అనంతం*

కృష్ణార్పణం

 💐🌾❤️ కృష్ణార్పణం❤️🌾💐


ఒక పేద,అమాయకపు కృష్ణభక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ కృష్ణార్పణ మనడం మొదలుపెట్టింది.


ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే నిద్ర లేవగానే కృష్ణార్పణం, పడుకొనే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తరువాత, బయటకెళ్ళే ముందు ఇంటికొచ్చిన తరువాత..కృష్ణార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ కృష్ణార్పణం అనటమే


ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది.


ఆ ఊళ్లోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయం పడుతోంది... ప్రతీ రోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. ఎవరికీ అర్ధంకాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీదా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడి పై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆ దేశపు రాజు గారి దగ్గరకు తీసుకుపోయారు.


రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.. ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ కృష్ణార్పణమంది.


మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా... . ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు. ...ఆమె కటిక నేల పై పడుకొనే ముందు కృష్ణార్పణమనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొనుంది.


ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది. అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు.


అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు.


“మహాప్రభో శ్రీవారి విగ్రహం బ్రొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వ ట్లేదు” అని వాపోయారు.


రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు. నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని.


“నాకు తెలియదు” అంది...


“సరే ఏదో మంత్రం చదివావట కదా ?” అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది.


సభలోని వారందరూ హతాశులయ్యారు.


ఆమెని “నీకు కృష్ణార్పణమంటే ఏమిటో తెలుసా?” అని అడిగితే “తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి.” అని ఏడుస్తూ బేలగా అన్నది.


సభికులందరి కళ్లూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు.


ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామివారి మీద చెత్త పోసాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టా ను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకొంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగునపోయింది.


చిరునవ్వులు రువ్వుతూన్న నందకిశోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణమనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు.


సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు. భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండా రాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు.


ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటా రా?!


ఎందుకు ఇంక ఆలస్యం ఒకసారి 'కృష్ణార్పణం' అని అనుకోండి...


*సేకరణ:- శ్రీ ఎ.వి. రామారావు గారి పోస్టు.*

సిరప్పులి నాయనారు

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 34*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*సిరప్పులి నాయనారు*


సంపద్భరితమైన చోళ దేశంలో తిరువాక్కరు అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో సిరప్పులి నాయనారు అనే శివభక్తుడు జన్మించాడు.

'లేదు' అని వచ్చిన వాళ్లకు లేదనకుండా ఇచ్చే ఉదార స్వభావంగల వాడు

సిరప్పులియారు.


 తన దగ్గరికి వచ్చిన శివభక్తులను మృదు మధురమైన మాటలతో

సంతోషంగా ఆహ్వానించి, షడ్రసోపేతమైన వంటకాలను తయారుచేసి

ప్రీతిగా వారికి వడ్డించేవాడు. వారు కోరిన పదార్థాలను లేదనకుండా ఇస్తూ

వచ్చాడు. జీవితాంతం పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ చివరగా

పరమేశ్వరుని తిరు చరణాల సన్నిధిని చేరుకున్నాడు.


*ముపైనాలుగవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

Vaamu kaaram podi

 


పరాన్నము ద్వారా

 ముఖం దగ్ధం పరాన్నేన

హస్తౌ దగ్దౌప్రతిగ్రహాత్|

మనో దగ్ధం పరస్త్రీభిః

బ్రహ్మశాపం కుత:కలౌ||


పరాన్నము ద్వారా ముఖ వర్చస్సు - వాక్ శక్తి క్షీణిస్తుంది.... (బ్రాహ్మడికి) 


ఎప్పుడు బడితే అప్పుడు - ఎలా బడితే అలా - ఏది బడితే అది - దానం తీసుకోవడం ద్వారా[తర్వాత తథ్సంబంధమైన పరిహార క్రియలు చేసుకోక పోవడం ద్వారా?] చేతికి ఉన్న శక్తి /చేసిన పుణ్యము క్షీణిస్తుంది... 


పరస్త్రీ వ్యామోహం ద్వారా మనసు వికలమై మనోనిగ్రహం లేక [మనశ్శక్తి] మనస్సు దగ్ధమై శక్తి క్షీణిస్తుంది... 


(ఈ మనో వాక్ కాయ కర్మలు అనబడే త్రికరణ శుద్ధి లేని కలియుగ బ్రాహ్మణుడి యొక్క శాపానుగ్రహాలూ ఎలా సిద్ధిస్తాయి - కావున ప్రయత్న పూర్వకంగా త్రికరణశుద్ధి సాధించాలి...) 




ఇక కలిలో బ్రాహ్మాణ శాపం కానీ? (ఆశీర్వచనం కానీ?) ఎలా ఫలిస్తుంది....? ఫలించాలంటే? సాధన తపస్సు ఇంద్రియ నిగ్రహం.... ఇత్యాదులు అవసరం....

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఋత్విక్కులుగా వచ్చిన మునీశ్వరుల మనస్సులు విలవిలలాడాయి. పసిబాలుణ్ణి బలి ఇవ్వడానికి

చేతులు రాలేదు. నరకవలసిన విప్రుడు నేను ఈ ఘాతుకం చెయ్యలేనంటూ కత్తి విసిరేసి వెళ్ళిపోయాడు.

హరిశ్చంద్రుడు అవాక్కయ్యాడు. ఏమి చెయ్యడానికీ తోచలేదు. సభాసదులారా ! తరణోపాయం చెప్పండి

అని అభ్యర్థించాడు. సభలో కలకలం బయలుదేరింది.

అజీగర్తుడు లేచి, మహారాజా! నేను చేస్తాను, వేతనం రెట్టింపు ఇప్పించు, నేను నిరుపేదను.

నాకు ధనం కావాలి. నీకు పని అవ్వాలి అన్నాడు. హరిశ్చంద్రుడు సరే అన్నాడు. నూరుగోవులు

ఇస్తానన్నాడు. అజీగర్తుడు కత్తి అందుకున్నాడు. కొడుకును చంపడానికి సిద్ధపడిన తండ్రిని చూసి జనాలు

ఆశ్చర్యచకితులయ్యారు. హాహాకారాలు చేశారు. వీడు తండ్రి కాదు, పిశాచమంటూ నిందించారు.

మహాపాపీ క్రూరుడా! డబ్బుకోసం కక్కుర్తిపడి కన్నకొడుకును అమ్ముకోవడమేకాక, స్వయంగా

చంపుకోడావికీ సిద్ధమయ్యావా ? ఏం సుఖపడతావ్ ఈ డబ్బుతో. కొడుకంటే ఎవరు ? ఏమి చెబుతోంది

వేదం ? ఆత్మావై జాయతే పుత్రః అంగాద్వై వేదభాషితమ్. ఎంత పాపాత్ముడివిరా అని నలుగురూ

నాలుగు మాటలూ అన్నారు. సభ అంతా కోలాహలమైపోయింది.

అంతలోకీ విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. పరిస్థితి అర్థమయ్యింది. హృదయం ఆక్రోశించింది.

19-12-2023 / మంగళవారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


 •••••┉━•••••┉━•••••┉━•••••┉━  

19-12-2023 / మంగళవారం / రాశి ఫలితాలు

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━ 

మేషం


బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమై నూతన  రుణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు.

---------------------------------------

వృషభం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు రావలసిన పదోన్నతుల పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి.

---------------------------------------

మిధునం


ఉద్యోగాలలో అనుకూల వాతావరణంఉంటుంది. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువులసలహాలు కలసివస్తాయి.  వ్యాపారాలు అనుకులిస్తాయి.

---------------------------------------

కర్కాటకం


స్థిరస్తి ఒప్పందాలలో ఆటంకాలు తప్పవు. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపార విషయంలో జాగ్రత్త అవసరం.

---------------------------------------

సింహం


వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులు కొన్ని విషయాలలో మీతో విబేదిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.

---------------------------------------

కన్య


స్థిరస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి నూతన కార్యకమాలు చేపడతారు. దూరపు బంధువుల కలయిక ఉత్సాహనిస్తుంది. వృత్తి వ్యాపారములలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఆకస్మిక వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు వర్గం నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

తుల


కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం


మిత్రులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. చేపట్టిన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.  ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

---------------------------------------

ధనస్సు


కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. గృహమున కొందరి ప్రవర్తన శిరో భాధలు కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికామౌతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

---------------------------------------

మకరం


ఆత్మీయుల నుంచి వివాదాలకు సంభందించి కీలక సమాచారం. సన్నిహితుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చిన్న నాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి.

---------------------------------------

కుంభం


వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆప్తులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో  ఆలోచనలు స్థిరంగా ఉండవు.

---------------------------------------

మీనం


ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలసిన ప్రమోషన్ లు పొందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

🍀 *శుభం భూయాత్* 🍁