ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
29, డిసెంబర్ 2023, శుక్రవారం
అమృతా గార్డెన్ పంక్షన్ హాల్
*అమృతా గార్డెన్ పంక్షన్ హాల్ అద్దెలో బ్రాహ్మణులకు సగం రాయితీ!*🍇🍇🍇🌾🌾🌾🌾🌹🌹 హైదరాబాద్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు శామీర్ పేట ఎగ్జిట్ నెంబర్ 7 నుండి కేవలం 32 కిలోమీటర్ల దూరంలో రాజీవ్ రహదారి స్టేట్ హైవే వన్ (జెబీస్ - రామగుండం) కు సమీపాన ఉన్న *అమృతా గార్డెన్* లో పెళ్ళిళ్ళు, గేట్ టు గెదర్ లు, సారీ పంక్షన్, దోతీ పంక్షన్ లు, బర్త్ డే పంక్షన్లు...షష్టి పూర్తి పంక్షన్ లు, ఉపనయనాలు ఇలా ఒక్కటేమిటి ప్రతి శుభ కార్యానికి మా *అమృతా గార్డెన్* సిద్దంగా ఉంది...ఈ హాల్ లో శుభ కార్యాలకు హైదరాబాద్ పరిసర జిల్లా ల వారు ఉపయోగించు కోవచ్చు! విశాల మైన రెండు బెడ్ రూం లు విత్ వాష్ రూమ్స్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కు ప్రత్యేక గదులు, విశాల మైన కారు పార్కింగ్, కాకుండా కేటరింగ్ సౌకర్యం ఉంది...అమృతా గార్డెన్ 48 గంటల అద్దె లక్షా 50 వేలు, 24 గంటల అద్దె 75,000 గా ఉంది...బ్రాహ్మణులకు అయితే అందులో సగం అంటే 75,000 48 గంటలు, 24 గంటలకు 37,500 కు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం...కేటరింగ్ విషయానికి వస్తే 200 రూపాయలకు ప్లేట్ భోజనం నుండి 1500 రూపాయలకు ప్లేట్ భోజనం తయారు చేసే బ్రాహ్మణ కేటరర్స్ అందు బాటులో ఉన్నారు...సర్వ్ చేసే అమ్మాయిలు అబ్బాయిలు ఒక్కరికీ 1000 రూపాయలు ఉంటాయి...ఇక సినిమా లేదా టెలివిజన్ ఆర్టిస్ట్ లకు వారి పేరును బట్టి 5000 నుండి 50,000 వరకు, అలాగే కేరళ లేదా ఆంధ్ర సన్నాయి మేళం వారికి 25,000 నుండి 50,000, లేదా లోకల్ సన్నాయి మేళం వారికి 11,000 కి వాళ్ళ ఫోన్ నెంబర్ల ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు...ఇక బర్త్ డే పార్టీ మిమిక్రీ ఆర్టిస్ట్ లు లోకల్ 11,000 లేదా ఎంటర్ టైన్ మెంట్ మిమిక్రీ ఆర్టిస్ట్ 25,000 లకు వారి ఫోన్ నెంబర్ ల ద్వారా బుక్ చేసుకోవచ్చు...ఇక హైదరాబాద్ నుండి 21 సీటర్ లేదా ఫిఫ్టీ సీటర్ బస్ లు కూడా అందు బాటులో ఉన్నాయి! మీకు కావలిస్తే వారి బస్ నెంబర్ల జాబితా ఇస్తాం.. మీరు ఆ బస్ ఆపరేటర్ల తో మాట్లాడు కోవచ్చు! డెకరేషన్ వాళ్ళు కూడా లోకల్, హైదరాబాద్ వాళ్ళు ఉంటారు...వాళ్ళ ఆల్బమ్ డెకరేషన్ ఫొటోస్ ప్రకారం మీరు డెకరేషన్ గురించి వాట్సప్ ద్వారా ఫొటోస్ చూసి మాట్లాడుకోవచ్చు...ఇవే కాకుండా సైట్ సీయింగ్, వర్గల్ సరస్వతి దేవాలయం, కొండ పోచమ్మ ప్రాజెక్ట్, నాచారం లక్ష్మి నరసింహస్వామీ టెంపుల్, కొమురవెల్లి మల్లికార్జున టెంపుల్, అమృతా గార్డెన్ నుండి 15 నుండి ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి...యాదగిరి గుట్ట టెంపుల్ 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గేట్ టు గేదర్ పార్టీల వాళ్లకు సైట్ సీయింగ్ కు 21 సీటర్, 12 సీటర్ బస్సులు రోజు వారి అద్దెబస్సులు విత్ ఏసి 15000 నుండి 20,000 అందుబాటులో ఉన్నాయి...అయితే వారం ముందు సమాచారం ఇచ్చి అడ్వాన్స్ ఇస్తే ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి...బ్రాహ్మణ కుటుంబాలకు ఈ బస్సుల్లో పది శాతం రాయితీ ఉంటుంది! *మరిన్ని వివరాలకి +91 88857 30986* ఫోన్ చేసి తెలుసుకోవచ్చు!
నిశ్శబ్ద సందేశం
🙏🌹🙏🌹🙏🌹🙏🌹
న్యూస్ పేపర్ డెలివరీ బాయ్ చెప్పిన కధ హృదయాల్ని హత్తుకునేల మనస్సులను కదలిస్తుంది
*"సౌండ్ ఆఫ్ నాకింగ్"*
*పేపర్ బాయ్* :
నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్‌బాక్స్ తాళం వేసి ఉంది, అందువలన నేను వారి తలుపు తట్టాను. ఇంట్లోని ప్రసాద్ రావు గారు అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు, నెమ్మదిగా తలుపు తెరిచాడు. పేపర్ బాయ్ అడిగాడు, "సార్, మీ మెయిల్ బాక్స్ ఎందుకు లాక్ చేయబడింది?"
ఉద్దేశపూర్వకంగానే లాక్ చేశాను అని బదులిచ్చారు ప్రసాదరావు చిరునవ్వుతో. ఇంకా ఇలా చెప్పారు , "నువ్వు రోజూ వార్తాపత్రికను నాకు చేతికి అందించాలని కోరుకుంటున్నాను, దయచేసి తలుపు కొట్టు లేదా కాలింగ్ బెల్ నొక్కి నాకు స్వయంగా ఇవ్వు."
పేపర్ బాయ్ అయోమయంలో పడ్డాడు, అలాగే అన్నాడు, కానీ అది ఇద్దరికి అసౌకర్యంగా, సమయం వృధా అవుతుంది" అని జవాబిచ్చాడు.
"ఏమి ఫర్వాలేదు... ప్రతి నెలా నీకు రూ. 500/- అదనంగా ఇస్తాను" అన్నాడు ప్రసాద్ రావు
"నువ్వు తలుపు తడితే నేను తీయలేని పరిస్థితి ఉండే రోజు ఎప్పుడైనా వస్తే, దయచేసి పక్కవాళ్ళని పిలవగలవు!"
పేపర్ బాయ్ షాక్ అయ్యి "ఎందుకు సార్?" అని అడిగాడు.
"నా భార్య చనిపోయింది, కొడుకు విదేశాల్లో భార్య పిల్లలతో స్థిరపడ్డాడు.మా కన్నా మా పిల్లలు పైకి ఎదగాలని కష్టపడి పై చదువులు విదేశాల్లో చదివవించాము. ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను, నాకు సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?"
ఆలా చెబుతున్నపుడు పేపర్ బాయ్ తేమతో చమర్చిన వృద్దుడి కళ్ళని చూశాడు. ఆయన ఇంకా ఇలా అన్నారు , *"నేను పేపర్ చదవలేను......నాకు చూపు మందగించింది ....తలుపు చప్పుడు లేదా డోర్‌బెల్ మోగిన శబ్దం వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను . తెలిసిన వ్యక్తిని చూడటానికి మరియు కొన్ని మాటలు వారి నోటి వెంట విని ఆ రోజు గడపడాని ప్రయత్నం చేస్తూ ఉంటాను !"*
అతను చేతులు జోడించి పేపర్ బాయిని, "చిన్నా , దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయి !
ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ ఫోన్ నంబర్. ఏదో ఒకరోజు నువ్వు తలుపు తట్టినపుడు నా నుండి సమాధానం రాకపోతే, దయచేసి నా కొడుకుకు ఫోన్ చేసి అతనికి తెలియజేయ..." అన్నాడు.
తరువాత పేపర్ బోయికి కర్తవ్యం అర్ధం అయ్యింది , తన స్నేహితుల సర్కిల్‌లో కూడా చాలా మంది ఇళ్లలో ఒంటరిగా ఉన్న వృద్ధులు ఉన్నారు.
వృద్ధాప్యంలో ఉన్న వారు ప్రతి రోజు గుడ్ మార్నింగ్ మెసేజెస్ , వాట్సాప్‌లో ఎందుకు పంపుతారని మీరు ఆశ్చర్యపోవచ్చు/విసుగు చెందవచ్చు.
ఈ ముసోలోళ్ళకి పని పాట ఏమి లేదు ఉదయం 4గంటల నుండే గుడ్ మార్నింగ్ మెస్సేజ్ పెడతారు అనుకుంటూ ఉంటాము.
వాస్తవానికి, ఈ ఉదయం మరియు సాయంత్రం శుభాకాంక్షల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ..........
*భూమ్మిద తమ ఉనికిని తెలియజేసే నిశ్శబ్ద సందేశం*
ఈ రోజుకి మేము ఉన్నాము అని తెలియజేసే చేదు నిజం.
దయచేసి పెద్ద వాళ్ల గుడ్ మార్నింగ్ మెస్సేజ్లను ఇబ్బందిగా తీసుకోవద్దు. మనం కూడా అదే స్థితికి ఏదో ఒక రోజు వస్తాము.
ఈ రోజుల్లో వాట్సాప్ చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇకపై వార్తాపత్రికల సభ్యత్వాన్ని పొందవలసిన అవసరం కూడా లేదు.
*మీకు సమయం ఉంటే, మీ పెద్దవాళ్లకి వాట్సాప్ ఎలా ఉపయోగించాలో నేర్పించండి! వారికి కొంత సమయం కేటాయించండి*
ఏదో ఒకరోజు, మీరు వారి మార్నింగ్ గ్రీటింగ్‌లు లేదా షేర్ చేసిన కథనాలను అందుకోకపోతే, వారు అనారోగ్యంతో ఉండవచ్చు లేదా వారికి ఏదైనా జరిగి ఉండవచ్చు అని గ్రహించండి.
దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించండి.
ఇది చదివితే ఎవరికైనా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. మనస్సు బరువెక్కుతుంది !!!
మనం ఒకరికొకరం పంపే వాట్సాప్ సందేశాల ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకుని వాటికి సమాధానం లేదా కార్యాచరణ పాటించాలి!!!
🌹🙏అందరూ ఆరోగ్యంగా ఉండాలి వారి జీవితం సాఫీగా సాగాలి. అందులో నేను కూడా ఒకడినై ఉండాలి🌹🙏
🙏సర్వే జన సుఖినోభావంతు🙏
శ్రీ దేవీ భాగవతం
శ్రీ దేవీ భాగవతం
.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః
శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|
నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||
శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|
దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||
శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ
సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |
పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా
సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||
శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |
సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||
బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|
మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||
హరిశ్చంద్రుడి మాటలకు వృద్ధ బ్రాహ్మణుడు పెద్దపెట్టున నవ్వేడు. మహారాజా ! ఈ తీర్థం చాలా
పుణ్యప్రదం. పాపనాశకం. ఇందులో సాన్నం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టు. ఇది
శుభముహూర్తం. అటుతరవాత నీ శక్తి కొద్దీ తృణమో పణమో దానం చేద్దువుగాని. ఈ పుణ్యతీర్థంలో చేసిన
స్నానాలూ దానాలూ రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఇలాంటి ప్రదేశాలకు వచ్చి సాన్నం చేయకుండా
వెళ్ళడం మహాపాపం. అది ఆత్మహత్యా సదృశమని స్వయంభువు చెప్పాడు. కనక ముందుగా స్నాన
తర్పణాలు కానియ్యి. అటుతరువాత నీకు దారి చూపిస్తాను. రాజధానికి వెడుదువుగాని. నువ్విచ్చే
దానానికి సంతోషించి నీతోకూడా అందాకా నేనూ వస్తాను.
హరిశ్చంద్రుడు రాజవేషం తొలగించుకుని స్నానోచితంగా నదిలోకి దిగాడు. మూడు మునకలూ
వేశాడు. నదిలోనే నిలబడి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాడు. బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి స్వామి!
దానం చెయ్యాలనుకుంటున్నాను. నీకు ఏది కావాలో కోరుకో. ఆవులా, నేలా, బంగారమా, ఏనుగులా,
రథాలా, అశ్వాలా ? ఏదైనా సరే కోరుకో. కోరుకున్నంతా ఇస్తాను. నా దృష్టిలో- ఇవ్వకూడనిదంటూ
ఏదీలేదు. ఇది నా వ్రతం. రాజసూయంలో మునీశ్వరుల సమక్షంలో చేపట్టాను. ఈ పుణ్యతీర్థమూ,
నువ్వూ అదృష్టవశాత్తూ ఇక్కడ లభించారు. మొగమోటపడక కావలసింది ఏదో కోరి నన్ను చరితార్ధుణ్ణి
చెయ్యి- అని అభ్యర్థించాడు.
నాదేయం మే కిమప్యప్తి కృతమేతద్ర్వతం పురా |
రాజసూయే మఖశ్రేష్టే. మునీనాం సన్నిధావపి
తస్మాత్ త్వమిహ సంప్రాప్తః తీర్థేఽస్మిన్ ప్రవరే మునే |
యత్తేఽస్తి వాంఛితం బ్రూహి దదామి తవ వాంఛితమ్ ॥ (19-12)
రాజన్ ! నీ కీర్తినిగురించి చాలాకాలం క్రితమే విన్నాను. నిన్ను మించిన దాత లేడని వసిష్ఠులవారు
చెప్పారు.
హరిశ్చంద్రో నృపశ్రేష్ఠః సూర్యవంశే మహీపతిః, తాదృశో నృపతిర్దాతానభూతో న భవిష్యతి.
అన్నారాయన
🔥శ్రీ మదగ్ని మహాపురాణము
*🔥శ్రీ మదగ్ని మహాపురాణము🔥*
. *భాగం - 37*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 14*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
*పాండవ చరిత వర్ణనము - 2*
తద్థనుస్తాని చాస్త్రాణి స రథస్తే చ వాఇనః. 10
వినా కృష్ణేన తన్నషటం దానం చాశ్రోత్రియే యథా |
కృష్ణుడు ఈ లోకమును విడచి వెళ్ళిపోయిన తోడనే అర్జునుని అదే ధనస్సు, అవే అస్త్రములు, అదే రథము, అవే గుఱ్ఱములు, అవన్నియు శ్రోత్రియుడు కాని వానికి ఇచ్చిన దానము వలె నష్టమైపోయెను.
తచ్ర్ఛుత్వా ధర్మరాజస్తు రాజ్యే స్థాప్య పరీక్షితమ్.
ప్రస్థానం ప్రస్థితో ధీమాన్ ద్రౌపద్యా భ్రాతృభిః సహ | సంసారానిత్యతాం జ్ఞాత్వా జపన్నష్టశతం హరేః. 12
ధర్మరాజు ఆ వార్త విని, పరీక్షిత్తును రాజ్యపాలనకై నియోగించి, ఈ సంసార మనిత్య మను విషయము గ్రహించినవాడై, ద్రౌపదియు, సోదరులును వెంట రాగా, మహావిష్ణుని అష్టోత్తరశతనాముములు జపించుచు మహా ప్రస్థానమున బయలుదేరెను.
మహాపథే తు పతితా ద్రౌపదీ సహదేవకః | నకులః ఫల్గునో భీమో రాజా వోకపరాయణః. 13
ఇన్ద్రానీతరథారూఢః సానుజః స్వర్గమా స్తవాన్ | దృష్ట్వా దుర్యోధనాదీంశ్చ వాసుదేవం చ హర్షితః. 14
ఏత త్తే భారతం ప్రోక్తం యః పఠేత్స దివం వ్రజేత్.
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మహాభారతాఖ్యానం నామ పఞ్చదశోధ్యాయః.
ఆ మహాప్రస్థానమునందు ద్రౌపది, సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడును పడిపోయిరి. రాజు శోకాతురుడయ్యెను. ఆతడు ఇంద్రుడు తీసికొని వచ్చిన రథము నధిరోహించి, సోదరనహితుడై స్వర్గము చేరెను. ఆచట దుర్యోధనాదులను, వాసుదేవుని చూచి సంతసించెను. నీ కీ భారతకథను చెప్పితిని. దీనిని పఠించినవారు స్వర్గమునకు వెళ్లెదరు.
అగ్ని మహాపురాణములో మహాబారతాఖ్యాన మను పంచదశాధ్యాయము సమాప్తము.
సశేషం....
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🔱🔱⚜️⚜️🔥🔥⚜️⚜️🔱🔱
నవగ్రహా పురాణం🪐*
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
. *🪐నవగ్రహా పురాణం🪐*
. *120వ అధ్యాయం*
*పురాణ పఠనం ప్రారంభం*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐
*నవగ్రహాల పట్టాభిషేకం - 1*
దేవ మహాసభలో వైభవం తాండవిస్తోంది.
క్షీరసాగర తీరం - మహాసభకు విచ్చేసిన దేవతలతో , వాళ్ళ పత్నులతో కళకళలాడుతోంది. ఒక్కొక్కదేవ పురుషుడు , ఒక్కొక్కదేవ పురంధ్రీ ఒక్కొక్కదీపకళికలా వెలిగిపోతున్నారు ! క్షీరసాగర మధుర తరంగాల మీద నుంచి సాగి వస్తున్న శీతలపవనాలు అందర్నీ పారవశ్యంలో ఓలలాడిస్తున్నాయి !
శ్రీమహావిష్ణువు లక్ష్మీ ఉన్నతాసనాల మీద ఆసీనులై ఉన్నారు. ఆ దంపతులకు ఇరువైపులా బ్రహ్మా , సరస్వతీ , పరమేశ్వరుడూ , పార్వతీ కూర్చున్నారు. ఇంద్రాదిదేవతలూ పత్నీ సమేతంగా ఒక వైపున కూర్చున్నారు. బ్రహ్మ మానస పుత్రులూ , వాళ్ళ ధర్మపత్నులూ ఒకవైపునా , మహర్షులందరూ ఒకవైపునా ఉన్నారు.
ఆనాటి మహత్కార్యక్రమానికి నాయకులైన సూర్యుడూ , చంద్రుడూ , కుజుడూ , బుధుడూ , బృహస్పతీ , శుక్రుడూ , శనీ , రాహువు , కేతువూ ప్రత్యేమైన ఆసనాల మీద ఒక బృందంగా కొలువుదీరి ఉన్నారు. ఆ 'నవ నాయకుల' పత్నులు - సంజ్ఞ , అశ్విని మొదలు ఇరవై ఏడుగురు చంద్ర పత్నులూ , శక్తి దేవీ , ఇలా , తారా , ఊర్జస్వతీ , జ్యేష్ఠాదేవీ , సింహిదేవీ , చిత్రలేఖా - ఒక బృందంగా కూర్చుని తమ భర్తలను ఆనందంగా చూస్తున్నారు. త్రిమూర్తులకు దగ్గరగా తొమ్మిది నవరత్న స్వర్ణ సింహాసనాలున్నాయి... ఎవరి కోసమో ఎదురుచూస్తూ !
క్షణం సేపు ధ్యాన ముద్రలో మునిగి , బ్రహ్మ కళ్ళు తెరిచి తన ప్రక్కనే ఉన్న శ్రీమహావిష్ణువు ముఖంలోకి వినయంతో చూశాడు.
*"జనకా ! సుముహూర్తం ఆగమించింది ! ప్రారంభించండి !”*
శ్రీమహావిష్ణువు మహాసభను తన సుందర మందహాస కిరణాలతో స్పృశించాడు. పాలకడలి కెరటాల హోరును అణచి వేస్తూ , ఆయన గంభీర కంఠధ్వని సభాసదుల కర్ణపుటాలను కమనీయంగా తాకింది.
*"కల్పకల్పానికీ ఇతోధికంగా అభివృద్ధి చెందుతున్న మహాసృష్టి విన్యాసంలో 'నవగ్రహాల' సశరీర ఆవిర్భావం ఒక ప్రముఖ ఘట్టం ! లోకాలలోని ప్రాణులు ఆరాధించి , అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం కలిగిస్తూ - సూక్ష్మ రూపాలతో ఉన్న గ్రహ దేవతలు స్థూల తేజో రూపాలతో సశరీరంగా అవతరించడం అవసరమని సృష్టి ప్రారంభంలో నేను సంకల్పించాను ! ఆ సంకల్పం సాకారమై , నవ్యమైన నవ రూపాలతో మన ముందు సాక్షాత్కరించి ఉంది !"* అంటూ శ్రీమహావిష్ణువు తన దక్షిణ హస్తంతో సూర్యాదులను నిర్దేశించాడు. దేవతల మానస పుత్రుల , మహర్షుల శిరస్సులు ఒక్కసారిగా వాళ్ళ వైపు తిరిగాయి. ఆ దేవతల , దేవతా పురంధ్రుల దృష్టి కిరణాలు వాళ్ళను మౌనంగా అభినందిస్తున్నాయి. సూర్యుడు , చంద్రుడూ మొదలైన తొమ్మండుగురూ చేతులు జోడించి సభకు నమస్కరించారు.
శ్రీమహావిష్ణువు కంఠం మళ్ళీ క్షీరసాగర తరంగ నినదాన్ని అవలీలగా అణచి వేసింది.
*“పరమేష్ఠీ , పరమేశ్వరుల సూచనలను అనుసరించి , నవగ్రహదేవతల వరుస క్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఆ గ్రహాల ప్రాధాన్యతా నిర్ణయం వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రాతిపదికగా జరిగింది. ఆయా గ్రహాల శక్తి సామర్ధ్యాలను దృష్టిలో ఉంచుకుని - ఆధిపత్యాలనూ , కారకత్వాలనూ మేము ముగ్గురమూ నిర్ణయించాం ! నవగ్రహ బృందంలో వాళ్ళ స్థానమానాలను నిర్దేశించే వరుస క్రమంలో ఆహ్వానం పలుకుతాను ! ఆహ్వానాన్ని అనుసరిస్తూ గ్రహ దేవతలు వరుసగా ఆగమించి , స్వర్ణాసనాలను అలంకరిస్తారు !"*
ఆసక్తిగా చూస్తున్న సభాసదులను ఒకసారి కలయజూసి , విష్ణువు నవగ్రహాలను ఆహ్వానించడం ప్రారంభించాడు.
*“నవగ్రహాలలో ప్రథమ గ్రహదేవత సూర్యుడు !"*
మహాసభ సమధికోత్సాహంతో చేస్తున్న హర్షధ్వానాల నేపథ్య సంగీతంతో సూర్యుడు లేచి చేతులు జోడించి నడిచాడు. ప్రథమ సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు.
*"ద్వితీయ గ్రహం చంద్రుడు !"* శ్రీమహావిష్ణువు కంఠధ్వని సాగర తీరంలో ప్రతిధ్వనించింది.
*"తృతీయ గ్రహం కుజుడు !”*
*"చతుర్థ గ్రహం బుధుడు !"*
*"పంచమ గ్రహం బృహస్పతి !”*
*"షష్ట గ్రహం శుక్రుడు !"*
*"సప్తమ గ్రహం శనైశ్చరుడు !"*
*"అష్టమ గ్రహం రాహువు !”*
*"నవమ గ్రహం కేతువు !"*
విష్ణువు పిలిచిన క్రమంలో చంద్రుడి నుండి , కేతువు దాకా అందరూ ప్రత్యేక సింహాసనాల మీద ఆసీనులయ్యారు. నవరత్న సింహాసనాల మీద కూర్చున్న నవగ్రహాల మీదనే అందరి దృష్టులూ కేంద్రీకరించబడ్డాయి.
*"నవగ్రహాలలో ఒక్కడైన బృహస్పతి దేవతలకు గురువైన కారణం చేతా , మహాజ్ఞాని అయిన కారణం చేతా - తన నిజ నామధేయంతో కాకుండా 'గురువు' అనే సార్థకనామధేయంతో సుప్రసిద్ధుడవుతాడు !"* శ్రీమహావిష్ణువు హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.
*"సృష్టిలో నవధాన్యాలకూ , నవరత్నాలకూ అధిక ప్రాధాన్యం ఉంది. నవగ్రహ దేవతలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ధాన్యం మీదా , ఒక్కొక్క రత్నం మీదా ఆధిపత్యం ఉండేలా నిర్దేశించబడుతుంది. నవగ్రహాల ధాన్యాధిపత్యాన్ని సృష్టికర్త బ్రహ్మ , రత్నాధిపత్యాన్ని పరమేశ్వరుడూ వెల్లడిస్తారు !"* పరమేష్టి , పరమేశ్వరులను సాభిప్రాయంగా చూస్తూ అన్నాడు శ్రీమహావిష్ణువు.
బ్రహ్మ ఆయనకు నమస్కరించి , ప్రారంభించాడు.
*"సూర్యుడికి గోధుమలూ , చంద్రుడికి వడ్లూ , కుజుడుకి కందులూ , బుధుడికి పెసలూ , గురువుకు శనగలూ , శుక్రుడికి అలసందలూ , శనైశ్చరుడికి నువ్వులూ , రాహుకేతువులకు మినుములూ , ఉలవలూ ఇష్టధాన్యాలుగా ఉంటాయి. ఇష్ట ధాన్యాల మీద వాళ్ళ ఆధిపత్యాలుంటాయి. ఇది త్రిమూర్తుల అనుశాసనం !"*
నవగ్రహ దేవతలు వినయంతో , కృతజ్ఞతతో నమస్కరించారు.
*"నవగ్రహాల ఆధిపత్యాలుండే నవరత్నాలను పేర్కొంటున్నాను..."* అంటూ పరమశివుడు ప్రారంభించాడు.
*"సూర్యుడు - మాణిక్యం , చంద్రుడు - ముత్యం , కుజుడు - పగడం , బుధుడు - మరకతం , గురువు - పుష్యరాగం , శుక్రుడు - వజ్రం , శనైశ్చరుడు - నీలం , రాహువు - గోమేధికం , కేతువు - వైడూర్యం !"* నవగ్రహాలు అభిమానించే నవరత్నాలను పేర్కొన్న పరమశివుడు చెయ్యెత్తి దీవించాడు.
పరమేశ్వరుడి అనుశాసనం వెలువడిన మరుక్షణం జరిగిన దృశ్యం దేవతలను ఆశ్చర్యంలో ముంచివేసింది.
సూర్యుడి మీద మాణిక్యాలు వర్షిస్తున్నాయి ! చంద్రుడి మీద ముత్యాలూ , కుజుడి మీద పగడాలూ , బుధుడి మీద మరకతాలూ , గురువు మీద పుష్యరాగాలూ , శుక్రుడి మీద వజ్రాలూ , శనైశ్చరుడి మీద నీలాలూ , రాహువు మీద గోమేధికాలూ , కేతువు మీద వైడూర్యాలూ వర్షిస్తూ , అందరికీ కనువిందు చేస్తున్నాయి. హర్షధ్వానాలు అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నాయి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐