6, మార్చి 2024, బుధవారం

పంచాంగం 06.03.2024

 ఈ రోజు పంచాంగం 06.03.2024 Wednesday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతు మాఘ మాస కృష్ణ పక్ష: ఏకాదశి తిధి సౌమ్య వాసర: పూర్వాషాఢ నక్షత్రం వ్యతీపాత యోగ: బవ తదుపరి బాలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


ఏకాదశి రా.తె 04:12 వరకు.

పూర్వాషాఢ మధ్యాహ్నం 02:45 వరకు.

సూర్యోదయం : 06:35

సూర్యాస్తమయం : 06:20


వర్జ్యం : రాత్రి 10:09 నుండి 11:38 వరకు. 


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:04 నుండి 12:41 వరకు.


అమృతఘడియలు : పగలు 10:11 నుండి 11:42 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.


యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

సామూహిక ఉపనయనములు

: *బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్* 

గాయత్రి భవన్, సచివాలయనగర్,వనస్థలిపురం,హైదరాబాద్-70

🕉️🕉️


 *సామూహిక ఉపనయనములు*


 *తేది 30.3.24* 

ఫాల్గుణ మాసం, పంచమి, శనివారం. ఉ.9.42 గం లకు


 *వేదిక* 

రామాలయం,గురుద్వారా ప్రక్కన, వనస్థలిపురం, హైదరాబాద్


 *ప్రవేశ రుసుము* ₹ 3000.

ముగ్గురికి భోజనం ఏర్పాటు చేయబడును.

అదనపు భోజనం ఒక్కొక్కరికి ₹150.

(క్రింద పంపుతున్న q r కోడ్ స్కానర్ ద్వారా రుసుము,అసోసియేషన్ ఖాతాలో జమచేసి, వివరములు ,స్క్రీన్ షాట్,వాట్సాప్ ద్వార *6302454218* కు పంప వలయును.)


దీక్షా వస్త్రములు, పూజా సామాగ్రి అసోసియేషన్ ఏర్పాటు చేస్తుంది.


పంచ శిఖలకు ఏర్పాటు కలదు.


 *నమోదుకు చివరి తేదీ* 25.3.24


 *కావలసిన వివరములు* 

వటువు పేరు

తండ్రి పేరు

వటువు వయస్సు

గోత్రం

చిరునామా

పోన్ నెంబరు.


ఇతర వివరములు కావలసినవారు వాట్సాప్ ద్వారా *6302454218* కు తెలియ చేయవలయును.


ఇట్లు

చింతపల్లి మంగపతి రావు

గౌరవ అధ్యక్షులు


పోచంపల్లి శ్రీధర్ రావు

అధ్యక్షులు


నందిరాజు లక్ష్మీ నారాయణ

కార్యదర్శి.


🕉️🕉️

[2/1, 06:40] Lakshmi Narayana Nandiraj: పై మెసేజ్ మీ యితర గ్రూపులకు పంపగలరు.


Kindly send the above message to brahmin groups.


Secretary

తాత్కాలిక కష్టాలు..*

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*తాత్కాలిక కష్టాలు..*


"ఆ స్వామివారిని పూర్తిగా నమ్మి కొలుస్తున్నాము..కష్టమొచ్చినా..సుఖమొచ్చినా...ఆ స్వామి దయ అని భావిస్తున్నాము.."


సర్వ సాధారణంగా చాలా మంది భక్తులు నాతో చెప్పే మాట ఇది..కానీ సుఖాన్ని ఆస్వాదించినంత ఆనందంగా కష్టాన్ని ఓర్చుకోలేరు..చిన్న కష్టం కలగగానే.."శ్రీ స్వామివారిని ఇంతగా పూజిస్తున్నామే..మా కెందుకీ పరీక్ష పెట్టాడో..?" అని సంసాయాత్మక బుద్ధిని బైట పెడుతుంటారు..ఇది మానవ నైజం..సర్వకాలసర్వావస్థలయందూ ఒకే రీతిని స్పందించేవారు బహు అరుదుగా వుంటారు..అటువంటి వారే నిజమైన భక్తులు..వారు సుఖ దుఃఖాలను రెండింటినీ సమంగా చూస్తారు..రెండూ ఆ స్వామివారి ప్రసాదం గానే భావిస్తారు..


సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రిందట..దంపతులిద్దరు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు..ఇద్దరూ అరవై ఏళ్ల పైబడిన వారే..నెల్లూరు ప్రాంతం వారు..శ్రీ స్వామివారికి అత్యంత భక్తులు..శ్రీ స్వామివారు మాలకొండ లో తపోసాధన చేసే రోజుల్లోనే దర్శించుకొని ఆశీర్వాదం పొందివున్నారు.. శ్రీ స్వామివారు మొగలిచెర్ల లో ఆశ్రమం నిర్మించుకొని, తన సాధన కొనసాగిస్తున్న కాలంలో రాలేక పోయినా..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి, సమాధి వద్ద నమస్కారం చేసుకొని వెళుతూవుండేవారు..అన్నదానం అంటే ఆ దంపతులకు మహా ఇష్టం..శ్రీ స్వామివారి దగ్గర అన్నదానానికి ప్రతిసారీ విరాళం ఇచ్చేవారు..


వారికి మొత్తం ముగ్గురు సంతానం..ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల..అందరూ చక్కగా చదువుకున్నారు..మంచి ఉద్యోగాల్లో వున్నారు..వివాహాలూ జరిగాయి..ఏ రకంగానూ పిల్లల గురించి చింత పడాల్సిన అవసరం లేదు..తాము శ్రీ స్వామివారిని మొదటిసారి దర్శించుకున్న రోజే..శ్రీ స్వామివారు.."అంతా మంచి జరుగుతుంది..శుభం.." అని ఆశీర్వదించారనీ..ఆరోజు నుంచీ.. తమకు కానీ..తమ పిల్లలకు కానీ..ఎటువంటి ఇబ్బందీ కలుగాలేదనీ..చెప్పుకుంటారు..రెండోసారి శ్రీ స్వామివారిని కలిసినప్పుడు.."కష్ట సుఖాలు అనేవి..పగలు రాత్రి వంటివి..వస్తూ పోతూ ఉంటాయి..రెండింటినీ సమంగా చూడండి.."అన్నారట..ఆ మాట వాళ్ళిద్దరి మనసులో హత్తుకుపోయింది..


ఈసారి వాళ్లిద్దరూ శ్రీ స్వామివారి మందిరానికి రావడానికి ఒక బలమైన కారణం ఉంది..ఆ భార్యాభర్త లలో ఆవిడకు ఆరోగ్యం దెబ్బతిన్నది..డాక్టర్లు పరీక్షలు చేసి..ఆవిడ కాన్సర్ తో బాధ పడుతున్నదనీ.. మరో ఐదారు నెలల సమయం మాత్రం ఉందనీ..ఆపైన ఆవిడ బ్రతకడం కష్టమని చెప్పారు..బాధ్యతలు అన్నీ తీరిపోయాయి అని తెలిసినా..ఎవరూ మృత్యువును ఆహ్వానించరు.. ఇంకొంత కాలం జీవించి ఉండాలనే కోరుకుంటారు..కానీ ఆ దంపతులు అట్లా ఆలోచించలేదు... తమ జీవితాలు చరమాంకంలో ఉన్నాయనీ.. ఇంతకాలం చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా..మొత్తమ్మీద సంతృప్తి కరమైన జీవితాన్ని గడిపామనీ..శ్రీ స్వామివారు తమతో కష్ట సుఖాలను సమంగా చూడమని చెప్పారు కనుక..ఇప్పుడొచ్చిన ఈ వ్యాధి తాలూకు బాధను కూడా సంతోషంగానే స్వీకరిస్తాననీ ఆవిడ తెలిపారు..ఆ దంపతుల ముఖంలో ఎటువంటి విచారమూ లేదు..ఎప్పటిలాగే శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని..మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చారు..అంత కష్టం లోనూ అన్నదానానికి విరాళం ఇచ్చారు..


తమ ఊరికి బైలుదేరేముందు నా దగ్గరకు వచ్చి.."ఎప్పుడు మృత్యువు వచ్చినా సంతోషమే..కాకుంటే నేను పోయిన తరువాత ఈయన ఇబ్బంది పడతారు..అదొక్కటే నా బాధ..ఈ వయసులో ఒకరికొకరం తోడుగా వున్నాము..తాను ఒంటరి తనం తో బాధ పడతారేమో నని నాకున్న ఒకే ఒక్క ఆలోచన..అంతకు మించి ఇంకేమీలేదు.." అని ఆవిడ చెప్పింది..అదేసమయం లో ఆయన అందుకొని.."ప్రారబ్ధాన్ని తప్పించుకోలేము..అంతా ఆ స్వామి దయ..చూద్దాం..ఆయనదే భారం.." అన్నారు..


ఆ తరువాత ఆ దంపతులు అప్పుడప్పుడూ మందిరానికి వస్తూనే వుండేవారు.. ఆరునెలల కంటే సమయం లేదని చెప్పిన డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయేలా.. మరో ఐదారేళ్ళ పాటు ఆవిడ హాయిగా వున్నది.. "శ్రీ స్వామివారు చెప్పినట్టు..ఆ కాన్సర్ అనే కష్టం కూడా తాత్కాలికంగా వచ్చి వెళ్లిపోయిందేమో ప్రసాద్!.." అని నాతో ఆయన పలుమార్లు చెప్పేవారు..ఒక సంవత్సరం క్రిందట ఆ దంపతులిద్దరిలో ..ముందుగా ఆయన.. ఆ తరువాత మరో ఇరవై రోజుల కల్లా ఆవిడా కన్నుమూసారు..మరణం లోనూ ఎక్కువకాలం ఎడబాటు లేదు ఇద్దరిమధ్యా..


శ్రీ స్వామివారి మీద ఉన్న భక్తీ..విశ్వాసం తో పాటు స్థితప్రజ్ఞత కూడా వాళ్లకు అంతకాలం పాటు రక్షగా ఉన్నది..పుణ్యదంపతులు..


సర్వం..

శ్రీ దత్తకృప!


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగాసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -‌  ఏకాదశి - పూర్వాషాఢ  -‌ సౌమ్య వాసరే* (06.03.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/oL6WMTl7TPA?si=Bpabl5_G2YBn_o64



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విష - ప్రతివిషములు

 విష - ప్రతివిషములు .


      సాధారణముగా మనం తీసుకునే పదార్థాలు కొన్నిసార్లు విషముగా మారి మనిషిని తీవ్ర అస్వస్థతకు గురిచేయవచ్చు. ఒక్కొకరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది. మనుష్యుల రోగాలకు ప్రధానమైన కారణం మనం తీసుకునే ఆహారమే . అతి ఆహారం లేదా విరుద్ధ ఆహారం ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు . కావున తీసుకునే ఆహారం మరియు ఏదన్నా సమస్య వచ్చినపుడు దానికి విరుగుళ్లు తెలుసుకొవడం కూడా ఎంతో అవసరం . అలానే మరొక్క విషయం మీరు సంపూర్ణ ఆరొగ్యవంతులుగా ఉండాలి అనుకుంటే ముందు మీరు తీసుకునే ఆహారం లో తగిన మార్పులు అనగా అప్పటికప్పుడు వండిన ఆహారం మాత్రమే తినండి అలానే అప్పుడప్పుడు కొంచం ఉపవాసాలు చేస్తూ జీర్ణవ్యవస్థకు కొంచం విరామం ఇవ్వడం మంచిది . ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఇది పురాతన ఆయుర్వేద గ్రంథాలలో ఉన్నది. " త్రికాలభోజనే మహారోగి , ద్వికాల భోజనే మహా భోగి , ఎకకాల భోజనే మహాయోగి " అని పురాతన గ్రంథాలలో ఉన్నది. అదేవిధంగా కడుపు నిండగా పీకల వరకు తినవద్దు . మీయొక్క ఉదరం యొక్క కొలతలో సగభాగం వరకు మాత్రమే ఆహారం తీసుకొండి పావు వంతు నీరు తాగవలెను. మిగిలిన సగభాగం వాయుప్రసారానికి అణుగుణంగా ఖాళీగా ఉంచండి. ఇప్పుడు మీకు ఆహారపదార్థములు వాటి విరుగుళ్ల గురించి వివరిస్తాను.


 * అటుకులు - సైన్ధవ లవణం.


 * అతి పులుసు - బెల్లం , పంచదార.


 * అనుములు - మంచి గంథం .


 * ఆవాలు - ఉశిరికపప్పు .


 * ఇంగువ - మంచి జీలకర్ర , ఉప్పు .


 * ఉమ్మెత్త - చింతపులుసు , తామర పువ్వులు .


 * ఉమ్మెత్త గింజలు - నిమ్మరసం , జీలకర్ర.


 * ఉప్పు - జీలకర్ర.


 * ఉడుగ - కరక్కాయలు .


 * కంద - తమలపాకు .


 * కర్పూరం - గుంటకలగర .


 * కోడిమాంసం - పుల్లటి పెరుగు , నిమ్మ రసం.


 * కొబ్బరి - బియ్యము .


 * గంజాయి - నిమ్మరసం , ఉల్లిపాయ.


 * గన్నేరు - కరక్కాయలు .


 * గంధకం - చెరుకు రసం.


 * గుమ్ముడు - మజ్జిగ .


 * గురువింద - నెయ్యి.


 * గోరింటాకు - తానికాయ.


 * గోధుమపిండి - ఉల్లిగడ్డ , దోసకాయ .


 * చింతకాయ - పసుపు .


 * చింతపండు - ఉప్పు , ఉల్లిగడ్డ.


 * జిల్లేడుపాలు - నీలియాకు , చంచలాకు .


 * జిల్లేడు ఆకు - ఉప్పిపండ్లు .


 * జీడి - దూలగోవిల. 


 * జీడిగింజ - మోదుగుపువ్వు , కొబ్బరినూనె .


 * జీర్ణం కాని అన్నం - వాము , ఉప్పు , ఆవాలు .


 * జెముడుపాలు - తంగేడు ఆకు .


 * తాంబూలం వల్ల పొక్కిన - చింతపండు కొబ్బరి.


 * త్రికటుకములు - బియ్యపు కడుగు.


 * తెలకపిండి - నూనె .


 * తేనె - మంచినీరు.


 * నల్లమందు - అల్లం , బాదం , ఆవునెయ్యి.


 * నిమ్మపండు - ఖర్జురపు కాయ .


 * నూనె - తెల్ల గలిజేరు రసం.


 * నెయ్యి - వేడినీరు .


 * నేరేడుపండ్లు - పాలు .


 * నేపాళం - వస మాడ్చిన మసిని మరగకాచిన నీటిలో కలిపి గంటగంటకు తాగించవలెను . మజ్జిగ అన్నం మాత్రమే ఇవ్వవలెను.


 * పనస పండు - శొంటి .


 * పాషాణాలు - పమిడిపత్తి రసం.


 * పెరుగు - ఉప్పు , పంచదార , వేడినీరు .


 * పొత్తిదుంప - శొంటి.


 * బెల్లము - పెసలు , గేదె పెరుగు , మజ్జిగ .


 * మజ్జిగ - చిల్లగింజ .


 * మినప పిండి - ఉప్పు , అల్లం .


 * విషముష్టి - నేరేడు , మొగలి .


 * వత్సనాభి - చిర్రివేళ్ళు , మజ్జిగ , మేకమూత్రం .


 * శనగ పిండి - మంచి జీలకర్ర , ఉప్పు .


 * సున్నము - తిప్పతీగ , పసుపు .


     

        పైనచెప్పిన విధముగా ఆహార పదార్థాలు మరియు వాటి విరుగుళ్లు గురించి తెలుసుకొవడం చాలా మంచిది .


 ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     

     కాళహస్తి వేంకటేశ్వరరావు  


  అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


        9885030034

మూడు ధాతువులు

 మానవశరీరం నందలి మూడు ధాతువులు గురించి సంపూర్ణ వివరణ  -


   మానిషి యొక్క శరీరం నందు ప్రధాన పాత్ర వహించునవి మూడు ధాతువులు అవి .


 1 . వాతం 2 .పిత్తం. 3 . శ్లేష్మం .


    మనిష్యుని యొక్క తల భాగం నుంచి రొమ్ము భాగం వరకు శ్లేష్మ సంబంధ శరీరం ఉండును.  రొమ్ము క్రింద నుంచి నడుము పైభాగం వరకు ఉండునది పిత్త శరీరం . నడుము క్రింద బాగం నుంచి పాదాల వరకు ఉండునది వాత శరీరం.  ప్రతి ఒక్కరిలోనూ ఇదే విధముగా ఉండును.  అవి తమయొక్క స్థానాన్ని దాటి ప్రకోపించినప్పుడు మనుష్యునికి ఆయా సంబంధ వ్యాధులు కలుగును. అనుభవం గల వైద్యుడు సరిగ్గా సమస్యని గుర్తెరిగి వైద్యం చేయవలెను .


      ఇప్పుడు ఈ మూడు ధాతువులు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.


 *  వాతము - 


           కన్ను మూసి తెరవాలి అన్నను , ముక్కుతో శ్వాస పీల్చి వదలాలి అన్నను, కాళ్ళు చేతులు కదల్చాలన్న , రక్తం శరీరం అంతా ప్రవహించాలన్న , జీర్ణక్రియ సంపూర్ణంగా జరగాలన్నా వాయువు సహాయం కావలెను.  ఇక్కడ వాతమునకు మరొక పేరే వాయవు. శరీరంలో నాడుల ద్వారా ఈ క్రియలు అన్నియు జరుగును. ఎప్పుడైనా ఈ క్రియలలో ఆటంకం కలిగి నొప్పులు వచ్చాయి అంటే అది పూర్తిగా వాతసంబంధమైన సమస్యగా పరిగణించాలి.


            ఈ వాతం శారీరక క్రియలనే కాకుండా మానసిక క్రియలను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక మనిషి అతిగా ఆలోచించడం మరియు పిచ్చిపట్టడానికి కూడా ఈ వాతమే కారణం. శరీరంలోని వాతం విపరీతంగా ప్రకోపించి తలకు ఎక్కినప్పుడు మనుష్యునికి పిచ్చిపట్టును. తీవ్రమైన భాధ, విచారం కలిగి ఉండును. ఆయుర్వేద గ్రంధాలలో వాతం యొక్క హెచ్చుతగ్గులు వలన కలిగే రోగాలను 80 రకాలుగా వివరించారు. వాటిని అశీతివాతాలు అంటారు.  ఈ వాత వ్యాధులను నయం చేయాలి అంటే నాడుల్లో ఉండే మాలిన్యాలను తొలగించే ఔషధ సేవన అత్యుత్తమం .


 *  పైత్యం -


           పిత్తమునే పైత్యంగా వ్యవహరిస్తారు .  మనము తీసుకున్న ఆహార పదార్ధాలు అన్ని జీర్ణం కావాలంటే వేడి అవసరం . దేహము నందు ఉండే మాలిన్యాలు అన్నింటిని బయటకు వెడలించుటకు కూడా వేడి అవసరం . శరీరం నందు ఉండు మాలిన్యాలను దహించుటకు కూడా పిత్తం ఎంతో అవసరం . ఈ పిత్తం దేహాన్ని చురుకుగా , చలాకీగా ఉంచుటకు కూడా అవసరం. దేహము యెక్క వేడి నందు హెచ్చుతగ్గులు కలిగినను , భాధలు కలిగినను పైత్యం యొక్క పరిమితిలో సమస్యలు మొదలు అయినవని గ్రహించాలి.


                 ఆకలి లేకున్నను , మితము తప్పిన ఆకలి ఉన్నను , మలమూత్రాదులు ఎక్కువ ఉన్నను, లేకున్నను , చెమట ఎక్కువ పోసినా , పొయ్యకున్నను అది పైత్య సంబంధ సమస్యగా గుర్తించాలి. పైత్యం అనగా అగ్నిసంభంధమైనది. దేహములో ఎక్కడైనను మంటలు పుట్టినాయి అంటే అది ఖచ్చితంగా పైత్య ప్రభావంగా  గుర్తుంచుకోవాలి. దేహంలో యే భాగమైనా కాంతి 

తగ్గినను, దేహంలో ఎక్కడైనా గడ్డకట్టినను జరిగింది అంటే అది పైత్యం తక్కువ కావడం వలన సంభవించిందిగా భావించాలి. దేహం పైన ఎక్కడైనా కురుపు లేచింది అంటే శరీరంలో పైత్యం పెరిగింది అని తెలుసుకోవలెను.  ఈ పైత్య వ్యాధుల నివారణ కొరకు శరీరంలో ఉండు వేడిలో హెచ్చుతగ్గులు లేకుండా సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి.


 *  శ్లేష్మము  -


           మనము తినిన ఆహారం అంతయు జీర్ణావయవముల యందు వచనమై రసముగా మారును. ఈ రసముకే ఆంగ్లము నందు "లింఫ్ " అందురు. జీర్ణశయం నందలి కోట్లాదిగా వ్యాపించి ఉన్న శోషరసకేశ నాళికలు ద్వారా ఈ రసం స్వీకరించబడి శోషరస వాహికలలో చేరుచున్నది.దేహము నందు రక్తనాళాలు ఎట్లు వ్యాపించి ఉండునో ఈ శోషరస వాహికలు దేహమంతా వ్యాపించి ఉండును. ఈ రస వాహికలకు శ్లేష్మరస వాహికలు అని పేరు .


            మన శరీర కదిలికల వలన శరీరం నందలి అతిగా వేడి పుట్టకుండా కాపాడునది ఈ శ్లేష్మము  యంత్రం పనిచేయునప్పుడు యంత్రభాగాల యందు వేడి జనించకుండా కందెన ఎలా ఉపయోగపడునో అదేవిధంగా శ్లేష్మం పనిచేయును. శరీరం నందు శ్లేష్మం తక్కువైనచో శరీరభాగాలు తీవ్రవేడికి గురి అగును.  హెచ్చుతగ్గులు లేని శ్లేష్మం వలన శ్వాసనాళాలు సాఫీగా పనిచేయును .  శ్లేషం దేహమునకు సరిపోనంత ఉండిన నిరుత్సాహము , అలసట , నిస్తేజము వంటి మానసిక ఆందోళనలు యే కాక దేహము నందు వేడి , దేహము యొక్క చివరలు , పాదములు , చేతులు మంటలుగా ఉండటం, కండ్లు తిరుగుట, శోష, దప్పిక , గాబరా , దాహాము మొదలయిన దుర్గుణాలు కనిపించును.


           ఈ శ్లేష్మము దేహావసరాలకు మిగిలియున్నప్పుడు తరువాత వాడుకొనుటకు కొంతభాగం మేధముగా మారును . దీనినే కొవ్వు అనుదురు. ఈ మేధము ఉదరము నందు , రొమ్ముల యందు , పిరుదల యందు చేరి నిలువ ఉండును.  సరైన ఆహారం దొరకనప్పుడు , ఉపవాస సమయాల్లో ఈ కొవ్వుని శరీరం తన క్రియలకు ఉపయోగించుకొనును. ఈ శ్లేష్మం అధికమైనప్పుడు ముక్కునుంచి చీమిడి కారడం, కురుపు నుంచి వెలువడే చీము, పురుషుల్లో కలిగే శుక్లనష్టం, స్త్రీలలో వచ్చు తెల్లబట్ట, గడ్డలలో గట్టిగా ఉండు పదార్థం , మోకాలి సంధి యందు నొప్పి కలుగును.  


              కావున పైన చెప్పిన మూడు ధాతువులలో హెచ్చుతగ్గులు జరగకుండా మంచి ఆహారపు అలవాట్లు ఏర్పరుచుకోవాలి. 


 

  ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

5, మార్చి 2024, మంగళవారం

Panchaag


 

Kaaki


 

సోదరప్రేమ

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సోదరప్రేమ..*


"నా పేరు సురేష్..నెల్లూరు నుంచి వచ్చాను..దాదాపు సంవత్సరం నుంచీ ఇక్కడకు రావాలని అనుకుంటున్నాను..ఇప్పటికి కుదిరింది..ఒక వారం రోజుల పాటు ఇక్కడ వుండవచ్చా?..కుటుంబపరంగా కొన్ని సమస్యలు ఉన్నాయి..ఈ స్వామి వారి వద్ద మ్రొక్కుకుంటే అన్నీ తీరిపోతాయని విన్నాను..స్వామివారు దయ చూపిస్తే నా మనోవేదన తగ్గుతుందని ఆశ!." అన్నారు..ఆయన సుమారు నలభై ఐదేళ్ల వయసు కలిగి ఉంటారు..చూడటానికి నెమ్మదస్తుడిలా కనబడ్డారు..మా సిబ్బందికి చెప్పి, వారికొక రూమును కేటాయించాను..


వచ్చిన రోజు సాయంత్రం శుభ్రంగా స్నానం చేసి, మందిరం లోకి వచ్చి, ఓ గంట సేపు ధ్యానం చేసుకున్నారు..ఆ తరువాత లేచి వెళ్లి..మందిరం వద్ద ఉన్న దుకాణాల లో కొన్ని బిస్కెట్ పొట్లాలు కొని..మందిరం వద్ద ఉన్న కుక్కల కు ఆహారంగా పెట్టారు..రాత్రికి తన రూముకు వెళ్లిపోయారు..రోజూ ఇదే విధంగా ఉదయం, సాయంత్రం ధ్యానం చేసుకోవడమూ..కుక్కలకు ఆహారాన్ని అందివ్వడమూ తన ప్రధాన దినచర్యగా మార్చుకున్నారు..మధ్యాహ్నం మందిరం తరఫున ఉన్న అన్నప్రసాదాన్ని స్వీకరించేవారు..ఐదురోజులు గడిచిపోయాయి..మందిరం వద్ద ఉన్న ఇతర భక్తులూ..మా సిబ్బంది కూడా ఆయనను అమాయకుడి గా భావించసాగారు..కానీ ఆయన ఇవేవీ పట్టించుకోకుండా..అందరితో కలివిడిగా..వుండేవారు..ఏదీ మనసులో దాచుకోకుండా ప్రవర్తించేవారు..శని, ఆదివారాల్లో అన్నదానం వద్ద నిలబడి..అక్కడికి వచ్చి ఆహారం తీసుకునే వాళ్ళను ఆసక్తిగా గమనించేవారు..తానే అన్నదానం చేస్తున్నట్లు గా భావించి..అందరికీ కొసరి కొసరి అన్నం పెట్టేవారు..ఒక తన్మయత్వం ఆయన కళ్ళలో కనబడేది..శనివారం నాటి పల్లకీ సేవలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు..


మరోరెండురోజుల తర్వాత ఒకరోజు ఉదయాన్నే.."ప్రసాద్ గారూ ఈరోజు మందిరం వద్ద ఎన్ని గంటలకు వుంటారు?.." అని నాకు ఫోన్ చేశారు..చెప్పాను..ఉదయం ఎనిమిది గంటల కల్లా మందిరం వద్దకు వెళ్ళాను..నాకోసమే ఎదురు చూస్తున్నట్లుగా మందిరం వెలుపలే వేచి ఉన్నారు..ఆయనను పలకరించి..మందిరం లోపలికి వెళ్లి, శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని వచ్చి కూర్చున్నాను..నేరుగా నా వద్దకు వచ్చేసారు..


"కొన్ని వివరాలు అడుగుతాను..చెపుతారా?.." అన్నారు..చెపుతాను అన్నట్లు తల ఊపాను.."అలా కాదు..నోటితో చెప్పండి.." అన్నారు..పసిపిల్లాడు అడిగినట్లు గా అడిగారు..వారిని చూస్తుంటే..ఏదీ దాచుకోకుండా చెప్పాలని అనిపించింది..


"ఒక వారం పాటు ఇక్కడ అన్నదానానికి అయ్యే మొత్తం ఖర్చు ఎంత?.." అన్నారు..చెప్పాను..

"ఓహో..అలాగా.."అన్నారు..కొద్దిసేపు మౌనంగా వుండి.."ప్రసాద్ గారూ నేను ఇక్కడికి వచ్చిన రోజు మీతో..కొన్ని సమస్యలున్నాయని చెప్పాను..గుర్తుందా?..నాకున్న పెద్ద సమస్య మా తమ్ముడే.. వాడు నాతో విబేధించి..నాతో మాట్లాడటం మానేశాడు..ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతోంది..నిన్న రాత్రి వాడు నాకు ఫోన్ చేశాడండీ..అరగంట సేపు మాట్లాడాడు..ఉన్నఫళంగా నన్ను బయలుదేరి రమ్మన్నాడు..నన్ను చూడాలని అనుకుంటున్నాడట.. తన పొరపాట్లు మన్నించమని అడిగాడు..నేను ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి వద్ద ధ్యానం చేసుకున్న ఫలితం ఇది.. నేను శ్రీ స్వామివారిని నా తమ్ముడికి నాకూ మధ్య ఉన్న అంతరాలను తొలగించమనే కోరుకున్నాను.. శ్రీ స్వామివారు అది తీర్చారు.." 

ఆ మాట చెపుతూ..ఉద్వేగం ఆపుకోలేక..కన్నీళ్లు పెట్టుకున్నారు..


"నేను నాలుగు రోజులపాటు వుందామని అనుకున్నాను..కానీ పదిరోజుల పైనే ఇక్కడ వున్నాను..శ్రీ స్వామివారి కృపతో తమ్ముడి దగ్గరకు వెళుతున్నాను..త్వరలో మా తమ్ముడితో సహా ఇక్కడికి వస్తాను..నాకు చాలా తృప్తిగా వుందండీ..ఇంత చిన్న పల్లెటూరు ప్రక్కన ఉన్న ఈ గుడివద్ద..మీకు ఉన్న పరిమిత వనరులతోనే..మీరు చేస్తున్న అన్నదానం బాగుందండీ.." అన్నారు..


ఆరోజు సురేష్ గారు వాళ్ళ ఊరు వెళ్లేముందు..ఒక వారం రోజుల పాటు అన్నదానానికి సరిపడా సరుకులను మందిరం వద్దకు చేర్పించి మరీ వెళ్లారు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

అమ్మకు అందలం!

 అమ్మకు అందలం!

                   --------------------------

కౌసల్యా..రామా..అనే కాలం ట్యూన్ తో సెల్ ఫోన్ మోగింది.


కొద్ది సేపటికి జానకమ్మ ఫోన్ ఆన్ చేసి "హలో!"అని అంది.


"అమ్మ!నేను సంధ్యని !''అని అవతలి వైపునుండి వినిపించింది.ఆగకుండా తనే "అదేమిటి అంత సేపు పట్టిందేమిటి ఫోన్ తీయడానికి!?"అని ప్రశ్నించింది.


"నువ్వా తల్లి!ఏమి లేదమ్మా !నిద్రపోతున్నాను!"అని అంది జానకమ్మ.


"ఈ టైం లో పడుకోవటమేమిటి!మీ దగ్గర టైం ఎంతయిందేమిటి!?ఆ..సాయంత్రం 5 గంటలై ఉంటుంది.అసుర సంధ్యవేళ పడుకోవద్దని  నువ్వే చెబుతావుగా!వొంట్లో బాగో లేదా!" అని అడిగింది సంధ్య.

"బాగానే ఉందమ్మా!..ఎదో అలిసిపోయినట్టయి కన్ను మూత  పడింది..(అని దగ్గింది..)!"అంది జానకమ్మ.


"నువ్వు అబద్ధం చెబుతున్నావు!ఆ దగ్గేమిటి!మాట మాట్లాడటానికి కూడా ఆయాస పడుతున్నావు!నాన్న ఇంట్లో లేడా!?"అని ఆందోళనగా అడిగింది సంధ్య.


"అంత సీరియస్ గా ఏమి లేదే !సీసన్ మారుతోందిగా (మల్లి దగ్గు..)అందుకే కాస్త జలుబు చేసింది.విక్స్  రాసుకున్నాను.తగ్గిపోయిందిలే!"అంది జానకమ్మ.


"నాన్న ఎడి!ఇంట్లో లేడా! ముందు  ఆ విషయం చెప్పు!నిన్నొకదాన్ని ఇంట్లో వదిలేసి సీరియల్స్ ,షార్ట్ ఫిలిం లంటూ షూటింగులకు వెళ్లాడా!"అని సీరియస్ గా అంది సంధ్య.


"ఎదో ఆయన పనులు ఆయనకుంటాయే.!నాలాగా ఇంట్లో కూర్చుని వంటలు చేసుకొనే మనిషా!వరంగల్ లో ఎదో సీరియల్ షూటింగ్ ఉందని మొన్న వెళ్లారు.రెండు రోజుల్లో వచేస్తారులే!"అని సర్ది చెబుతున్నట్టు అంది జానకమ్మ.


"అదేంటమ్మా!ఉద్యోగం చేసినంత కాలం అటు ఉద్యోగం,ఇటు నాటకాలు,సీరియల్స్ షూటింగ్ లంటూ ఒక్క పూట ఇంట్లో లేకుండా తిరిగాడు.ఆదివారాలైతే అసలే కనబడేవాడు కాదు.నన్ను చెల్లిని కనిబెట్టుకుని రాత్రియంబవళ్ళు నువ్వే కాసావు.అటు వంట పని,ఇంట్లో పని,ఆయనకు సేవలు చేస్తూ నీ జీవితమంతా గడిచిపోయింది.ఒక్క రోజు సుఖపడింది లేదు.యంత్రంలా పనిచేసావు.ఈ రోజు మేము చదువుకొని పెద్ద  పెరిగి అమెరికా లో సెటిల్ అయ్యామంటే అంతా నీ చాకిరివల్లే  గదమ్మ!..రిటైర్ అయ్యాకన్నా ఇంటిపట్టున వుండి  నిన్ను చూసుకుంటాడంటే అదీనూ లేదు!ఇంకా బిజీ అయిపోయాడు!..నీకు వొంట్లో బాలేదని ఆయనకు తెలుసా!"అని ఆవేదనగా అంది సంధ్య.


"అదేంటే నాన్నగారిని అంత మాటంటావు!ఆయన బయట తిరిగి సంపాదించకపోతే మనమందరం బతికే వాళ్లమా!ఇంత బాగుపడేవాళ్ళమా!మా తరం ఆడ వాళ్ళ జీవితమే ఇంతేనమ్మా!మాకు వేరే వ్యాపకమేముంటుంది!సంసారం చేయడం పిల్లలను కనడం,వాళ్ళను కనిపెట్టుకుని వుండి పెంచి పెద్దవాళ్ళను చేయడం!మా అమ్మా అదే చేసింది.నేను అదే చేసాను!అదేదో విడ్డురంలాకా,నేనొక్కదాన్నే కష్టపడిపోయినట్టు మాట్లాడుతావ్!"అని దీర్గాలు తీస్తూ అంది జానకమ్మ!


"నువ్వెప్పుడూ అనేమాటే ఇదిగాని!..నాన్నకు నీ జ్వరం గురించి తెలుసా లేదా!ఆ మాట చెప్పు!"అని విసుగ్గా అంది సంధ్య.


"ఆయన బయలుదేరేటప్పుడే కొద్దిగా మొదలయిందమ్మా!కానీ ఆయన షూటింగ్ అప్పటికే ఫిక్స్ అయింది.అది మానకూడదని చెప్పాడు.నేనే వెళ్ళమని చెప్పానులే!దానిదేముంది అవసరమైతే పక్కింటి ఆంటీని తోడుగా తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళమని చెప్పారు!ఒకటి రెండు రోజుల్లో తగ్గక పోతే ఆ పనే చేస్తాలే!"అని మళ్ళి దగ్గ సాగింది జానకమ్మ.


"పీకలమీదకొచ్చే దాకా ఇంట్లో అలాగే పడుకో!..ఆయనకు బుద్ధి లేదు..నీకు లేదు!నాన్న కనీసం ఫోన్ చేసి తెలుసుకుంటున్నాడా!"అని సంధ్య కోపంగా అంది.


"ఆయన షూటింగ్ చేసే ప్లేసులో ఫోన్ సిగ్నల్స్ వుండవుట!ఆయనేం చేస్తాడు.ఎందుకె ఊరికే అంత ఖంగారు పడి ఇంతెత్తున ఎగురుతున్నావు!నేను ఈ రోజే డాక్టర్ దగ్గరకు వెళ్ళొస్తాలే!"అని అంది జానకమ్మ.


"ఇవాళ మొదటిసారి కాదు గదమ్మ!ఇలా ఎంతకాలం ఒంటరిగా గడుపుతావు.షూటింగులు,నాటకాలంటూ నాన్న ఊరిమీద తిరుగుతుంటాడు.నువ్వేమో పిచ్చిదానిలా ఆ వెధవ టి వి పెట్టుకొని ఆయన ఎప్పుడొస్తాడా ,పాద సేవ చేద్దామని ఎదురు చూస్తుంటావు.అమ్మమ్మంటే చదువుకో లేదు.వాళ్ళ తరం అలా  గడిచి పోయింది.నువ్వు చదువుకున్నా వుద్యోగం లేకుండా మాకోసమే ఇన్నాళ్లు గడిపావు .నీక్కూడా అరవై ఏళ్ళు దాటాయి గదా!ఇప్పటికైనా నిన్ను సుఖంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద లేదా!మేమేమైనా మాట్లాడితే ఆయనకు కోపం.ఇంతెత్తున లేస్తాడు!నువ్వుకూడా మీ అమ్మలాగానే ఇంట్లో మగ్గిపోవాలని అనుకోకు.నీ వెనక మేమున్నాం....ఇది ఇలా కాదుగాని నేను చెల్లి కలిసి ఎదో ఒకటి ఆలోచిస్తాం!..ముందు నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్లిరా!ఏమన్నాడు నాకు మెసేజ్ పెట్టు!ఉంటా!" అని ఫోన్ పెట్టేసింది సంధ్య.ఏమిటో ఈ కాలం పిల్లలు అని అనుకుంటూ వుసూరుమంది జానకమ్మ!

                                                         ++++++++

    వారం రోజులవుతుందనుకున్న షూటింగ్ పదిహేను రోజులవడంతో ప్రముఖ నటుడు

 సుబ్రమణ్యం  ఆలస్యంగా ఇంటికి చేరాడు.షూటింగు తాలూకు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆ నెలలో చేయాల్సిన ఇతర కార్యక్రమాలను సరి చూసుకుంటూ ,తోటి కళాకారులతో మాటలు చెప్పుకుంటూ రిటర్న్  జర్నీ హుషారుగా గడిచి పోయింది.ఇంటిముందు కార్  ఆగే వరకు సమయమే తెలీలేదు.


 చేతిలో సూట్ కేసు తో దిగిన ఆయనకు తన శ్రీమతి ఎదురొస్తుందనుకుంటే గేట్ కు తాళం వెక్కిరిస్తున్నట్టు కనబడింది.దానితో ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డాడు.ఎక్కడకు పోయింది ఈవిడ!అని విసుక్కుంటూ వచ్చి డూప్లికేట్ కీస్ తో తాళం తీసి ఇంట్లోకి ప్రవేశించాడు.ఎప్పుడు తల తళలాడుతూ కనబడే పోర్టికో,వరండా  దుమ్ము ధూళితో ఉండడం చూసి ఆశ్చర్యం కలిగింది.

     "జానకి కి ఏమైంది!ఇల్లంతా దుమ్ముకొట్టుకు పోయుంది.ఎప్పుడు ఇలా వుంచదే!"అని అనుకుంటుంటే ,తాను వెళ్ళేటప్పుడు ఆమెకు జ్వరంతో ఉండడం గుర్తొచ్చింది."కొంపదీసి ఏమి కాలేదుగా?!"గుండె ఒక్కసారిగా ఆందోళనతో వణికింది."ఛీ ఛీ నేనే తప్పు చేసాను!మధ్యలో ఒక్కసారి ఫోన్ కూడా చేయలేదు!"అని తిట్టుకున్నాడాయన.


  "సరే ఇప్పుడేమనుకుని ఏమి లాభం! ఇగనుంచైనా జాగ్రత్తగా ఉండాలి.ఇలా ఎప్పుడు కాలేదు" అని అనుకుంటూనే ఇంటి తలుపును తీసి ఇంట్లోకి ప్రవేశించాడు.హాల్ లో  పరిస్థితి అలాగే వుంది  కనీసం వారం రోజులనుండి ఇంట్లో ఎవరు లేని ఆనవాళ్లు కనబడుతున్నాయి.చేతిలోని సూట్ కేసు ను టీపాయ్ మీద పడేసి జేబులోనుండి ఫోన్ తీసి జానకి నెంబర్ కు డయల్ చేసాడు సుబ్రహ్మణ్యం.భార్యకు ఏమైందో అనే ఆందోళన ఆయన మోహంలో కొట్టొచ్చినట్టు కనబడుతోంది.అవతల రింగవుతోంది కానీ ఎత్తడం లేదు.ఆయనలో ఖంగారు మరింత పెరిగి పోయింది.మరో సారి చేసాడు ఈ సారికూడా నో రిప్లై.కాసేపటికి ఆ ఫోన్ ఇంట్లో బెడ్ రూమ్ లోనుండి రింగ్ అవుతోందని గ్రహించాడు."ఇదేంటి ఫోన్ కూడా ఇంట్లో పడేసి పోయింది!దీనికేమైంది అసలు!"అని అనుకుంటూ బెడ్ రూమ్ లోకి పరిగెత్తాడు.

 అక్కడ బెడ్ పక్కనే వున్నా టీపాయ్ మీద జానకి ఫోన్ వుండి.దాని కిందనే ఒక కాగితం వుంది .

దానిపై...

   "ఏమండి!..మీరు వెళ్ళిపోయాక నాకు జ్వరం పెరిగి పోయింది.పెద్దమ్మాయి ఫోన్ చేసి దాని ఫ్రెండ్ సుజిని పంపి హాస్పిటల్ లో జాయిన్ చేయించింది.దేవుడి దయ వల్ల రెండు రోజుల్లోనే కోలుకున్నాను.ఆ రెండు రోజులు సుజి,వాళ్ళ ఆయన నాతోనే వున్నారు.మీకు ఫోన్ చేస్తే కలవ లేదు.పిల్లలిద్దరూ కలిసి మాట్లాడుకొని నాకు అమెరికాకు టికెట్ బుక్ చేశారు.నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు.మీరు రాగానే మిమ్మలనుకూడా అమెరికాకు రప్పిస్తామని అనడంతో నేను .మొన్న గురువారంనాడు అమెరికాకు  బయలుదేరాను.సుజి వాళ్ళు విమానం ఎక్కే వరకు నాతోటె వున్నారు.మీరు ఇంటికి వచ్చే సరికి నేను లేకపోవడం మీకు ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించడండి.పిల్లలు పట్టుబట్టేసారు.నేను రాకపోతే వాళ్ళ మీద వొట్టే అని బలవంత పెట్టేసారు.మీరు రాగానే పిల్లలకు ఫోన్ చేయండి.నేను మాట్లాడుతాను.---ఇట్లు /జానకి.


కాళ్ళ కింద భూమి కంపించినట్టయింది సుభ్రమన్యానికి!ఇదేమిటి చెప్పా పెట్టకుండా ఎదో అనకాపల్లి కెళ్లినట్టు అమెరికాకు వెళ్లిపోవడమేమిటి! నేను వచ్చే  వరకు ఆగొచ్చుగా!ఈ పిల్లలకు మరీ బుద్ధి లేకుండా పోయింది!అని కోపం నషాళానికెక్కింది.అదే ఆవేశంలో అమెరికాకు ఫోన్ కలిపాడు .కాసేపటికి అవతల సంధ్య ఫోన్ ఎత్తిన్ది!


"ఇదేంటి నాన్న ఇంత రాత్రి ఫోన్ చేసావు.టైం చూసుకోవద్దా!"అని చిరాకు పడింది.


"సారీరా..!నేనిప్పుడే వచ్చాను అమ్మ లేకపోవడంతో ఖంగారులో టైం చూసుకో లేదు.రేపు పొద్దున్న చేస్తాలే!"అని అన్నాడు.."పర్వాలే నాన్న!లేచేసాముగా!మాట్లాడు!"అని అంది సంధ్య.


"అదేరా!అమ్మకు ఎలా ఉందిరా!నేనొచ్చే వరకైనా ఆగక పోయారా!హఠాత్తుగా తీసుకెళ్లి పోయారు!"అని నిష్టురంగా నాడు.


"అమ్మ ఇప్పుడు బాగానే వుంది.ఇక్కడకు వచ్చాక ఒక్క రోజులోనే కోలుకుంది.ఆవిడకు మా మీద మనవళ్ల  మీద బెంగ!నన్ను చెల్లిని చూసి ఎంతో సంతోషించింది.నీకు చెప్పాలంటే నీ ఫోన్ పని చేయలేదు.ఎప్పుడొస్తావో తెలీదు.అమ్మ హాస్పిటలనుండి ఇంటికొచ్చాక ఇంట్లో ఎవరు చూస్తారు.ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా సుజి చూడలేదుగా!దాని సంసారం దానికుంటుంది.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం!"అని కూల్ గా చెప్పింది సంధ్య.


"బాగున్నాయే మీ ప్రేమలు.నన్నొక్కడిని వదిలి పెట్టి పోతే నేనేమైపోతానో అనే ఆలోచన మీకు లేదా!"అని ఆక్రోశంగా అన్నాడు సుభ్రమణ్యం.


"నీకేంటి నాన్న! నెలకు ఇరవై రోజులు పైగా బయటనే తిరుగుతుంటావు.తినడానికి హోటల్ లు ఉండనే వున్నాయి.ఇంట్లో వున్నప్పుడు ఎవరైనా పనివాళ్లను పిలిచి శుభ్రం చేయించుకో!మన కాలనీ లో టిఫిను,భోజనాలు సప్లై చేసే క్యాటరర్లు ఉండనే వున్నారు.అమ్మతో నీకేం పని!.మాదగ్గర మాకు అమ్మతో పనులుంటాయి!అమ్మకూడా సంతోషంగా ఉంటోంది.వీడియో కాల్స్ ఉండనే  వున్నాయి.నీకు వీలైనప్పుడల్లా మాట్లాడు.నాదగ్గర కొన్ని రోజులు,చెల్లిదగ్గర కొన్ని రోజులు ఉంటుంది."అని యధాలాపంగా అంది సంధ్య.


"నీకు తెలివితేటలు పెరిగి పోయాయే!నాకు చెప్పా పెట్టకుండా అమ్మను తీసుకు పోయి వెధవ ఖబుర్లు చెబుతున్నావా!వెంటనే అమ్మను పంపించు."అని ఆగ్రహం తో ఊగి పోయాడు సుభ్రమణ్యం.


"కూల్ నాన్న!కూల్!ఎందుకట్లా అరుస్తావు!అమ్మ నీకెంత స్వంతమో ఆమె కడుపునా పుట్టిన మాకు అంతే స్వంతం!నువ్వు ఉద్యోగం చేసినంతకాలం ఒక్క రోజు ఇంట్లో వున్నా పాపాన పోలేదు.మా చిన్నప్పుడంతా అమ్మే ప్రపంచంగా గడిపాము!ఇప్పుడు అమెరికాలో మేమింత 

పొ జిషన్ లో సెటిల్ అయ్యామంటే అది అమ్మ పెంపకమే!మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని పెంచింది.అలాంటి అమ్మ ఈ వయస్సులో కూడా దిక్కు లేనిదానిలా ఇంట్లో ఒక్కతి జ్వరమొచ్చినా చూసే వాడు లేక పడుంటే చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నాం!నీకు బాధ కలుగుతుందని తెలిసినా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు!..సరే మాకెందుకు..అమ్మకు ఫోన్ ఇస్తా అమ్మతోనే మాట్లాడు.!"అని అంది సంధ్య.


కాసేపటికి జానకి లైన్ లోకి వచ్చింది.


"ఏమండి ఎలా వున్నారు!ఇంటికెప్పుడు వచ్చారు!"అని ఆతృతగా అడిగింది జానకి.


"ఇప్పుడే తగలడ్డాకాని,నువ్వు చేసిన పనేమన్నా బాగుందా!నేను ఇంట్లోలేనప్పుడు ఆ పిల్లల మాట పట్టుకుని చెప్పా పెట్టకుండా అమెరికా చెక్కేస్తావా!నా బాగోగులు ఎవరు చూస్తారే!నీకు నీ సంసారం అక్కర లేదా! నోరుమూసుకుని    వెంటనే బయలు డేరిరా!"అని ఉగ్రంగా అరిచాడు .


"అయ్యయ్యో!అదేంటండి.అలా అంటారు.నా ఆరోగ్యం బాగా లేదని పిల్లలు అలా చేశారు.దీనిలో తప్పేముందండి.మీరెలాను ఇంట్లో వుండరు.ఒక్కదాన్ని ఆ ఇంట్లో పడుండడమెందుకని నేను అనుకున్నాను!ఇక్కడ మన బుజ్జి మనవళ్లను  నేనే చూసుకుంటున్నాను.నా ఆరోగ్యంకూడా కుదుటపడింది.ఇంటికి వస్తానులెండి రాకెక్కడ పోతాను.అయినా మీరు ఇంటికి రాగానే మిమ్మలను కూడా ఇక్కడికి తెప్పిస్తామని పిల్లలు చెప్పారుగా!ఊరికే కోప్పడి పోతున్నారు!"అని జానకి అంది.


అంతలోనే సంధ్య కాల్ లోకి వచ్చింది.."అవును నాన్నా!అమ్మకు మేము అలానే చెప్పాము!నీవు అమ్మతో పూర్తి సమయం  ఎప్పుడుంటావో చెప్పు అప్పుడే నీకు కూడా ఫ్లైట్ టికెట్ లు బుక్ చేస్తాము.అప్పటి దాకా అమ్మను ఇక్కడే ఉండని.మాకు ఆవిడకు మనశాంతిగా ఉంటుంది!"అని అంది సంధ్య.


ఆ మాటకు సుభ్రమణ్యం గొంతులో వెలక్కాయ పడినట్లయింది.

ఆయనకు మరో రెండు రోజుల్లోనే టూర్ వుంది.ఈసారి ఇంకా  బిజి! నెల్లాళ్ళ పాటు అవుట్ స్టేషన్ వెళ్ళాలి.ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ తో లేక లేక అవకాశం దొరికింది.ఏమి సమాధానం చెప్పాలి!


  "అలాగే అమ్మ !నేను ఫ్రీ కాగానే మీకు కాల్ చేస్తాను.అమ్మను జాగ్రత్తగా చూసుకోండి!"అని కాల్ డిస్ కనెక్ట్  చేసి నీరసంగా మంచం మీద వాలి పోయాడు!తాను అల్లుకున్న సాలెగూడులో తానే చిక్కుకున్నట్లుగా అనిపించింది సుబ్రమణ్యానికి!


                                            **********************

              - సత్య భాస్కర్ ఆత్కురు ,9848391638        


  

  


"