24, జూన్ 2024, సోమవారం

కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కధ..

 *మీకు కళ్ళలో నీళ్లు తెప్పించే వాస్తవ కధ.._* 

ఆర్మీ అధికారికి  ఓ వ్యక్తి దగ్గర  నుండి  లేఖ వచ్చింది.*_ 

అందులోని విషయం ఇలా ఉంది ..._* 

అయ్యా!_* 

నా పేరు  సుబ్రహ్మణ్యం నేను ఉపాధ్యాయుడిగా  పని చేస్తూ  రిటైర్ అయ్యాను.*_ 

 _*నా కొడుకు ఆర్మీ లో  ఉద్యోగం చేస్తూ గత ఏడాది కార్గిల్ యుద్ధం  లో వీరమరణం  పొందాడు.*_ 

 _*ఈ ఏడాది అతను  ప్రాణాలు విడిచిన  చోటును చూడాలని నేను నా భార్య మీ అనుమతి కోసం వేచి  చూస్తున్నాము.*_ 

 _*అనుమతి ఇస్తే సంతోషము , అలా కుదరదు  మీ ఉద్యోగాలకు ఏదైనా  ఇబ్బంది కలుగుతుంది  అనుకుంటే  వద్దు  అని ముగించారు.*_  


 _*ఆ ఉత్తరం  చదివాక  ఆ అధికారి కళ్ళు  తడిచాయి  వెంటనే  వారిని  ప్రభుత్వ  ఖర్చులతో  పిలిపించండి.*_  _*అలా ఒకవేళ  ప్రభుత్వం ఖర్చు  పెట్టకపోయినా  సొంతంగా నా ఖర్చులతో పిలిపించండి అని ఉత్తర్వులు జారీచేశారు.*_  


 _*ఆ వృద్ధ  దంపతులకు అక్కడ ఉద్యోగం చేస్తున్నవారంతా  వారికి వందనం చేశారు ఒక వ్యక్తి మాత్రం చివరగా వారి కాళ్ళపై పువ్వులు చల్లి నమస్కరించి వందనం చేశారు.*_ 


 _*ఎందుకు బాబు నువ్వు మాత్రం  ఇలా నువ్వు ఎంత  పెద్ద  అధికారివి  అందరిలా వందనం చేస్తే సరిపోయేది కదా అని అడిగారు.*_  


 _*అందరూ ఇప్పుడు ఉద్యోగంలో చేరిన  వారు నేను మీ అబ్బాయితో  కలిసి పని చేసాను.*_ 

*అని ఒక నిమిషం  మాటలురాక నిలబడిపోయాడు.*  

 _*పర్లేదు బాబు ఏ విషయమైనా  ధైర్యంగా  చెప్పు నేను ఏడవను అని చెప్పాడు.*_ 

 _*మీరు కాదు నేను ఏడవకుండా  ఉండాలి  కదండి అని చెప్పి మళ్ళీ చెప్పడం  మొదలుపెట్టాడు.*_  


 _*ఆనాడు పాకిస్థానీలతో  యుద్ధం జరుగుతున్నది  మా దగ్గర*_ _*ఆయుధాలు* *అయిపోవడంతో నేను డెత్* *ఛార్జ్ తీసుకుంటాను అని*_ _*ముందుకు  వచ్చాను.*_ _*అప్పుడు మీ కొడుకు నన్ను లాగి*_ 

 _*నీకు పిచ్చా నీకు పెళ్ళై  ఇద్దరు పిల్లలు ఉన్నారు.*_ 

 _*నేను డెత్ ఛార్జ్ తీసుకుంటాను  అని ముందుకు వెళ్లి  ఆ తూటాలను  తన శరీరంలో తీసుకున్నాడు.*_  

 _*శత్రువులను 13 మందిని చంపి  ఇక్కడే మరణించాడు.*_ 


 _*అతడిని మొదటగా పట్టుకున్నది  నేను అతడి తల నా చేతిలో ఉండగా ప్రాణాలు  పోయింది*._  _*శరీరంలో 42 తూటాలు  ఉన్నాయి అని చెప్పి ఏడ్చేశాడు.*_  

 _*అక్కడ వింటున్న  తల్లి తన చీర  కొంగును అడ్డుపెట్టుకుని  ఏడ్చేసింది.*_  


 _*ఆరోజు  నేనే శవాన్ని  తీసుకురావలసింది  దగ్గర ఉండి అతడిని మోసిఉండాల్సింది  కానీ నాకు వేరే డ్యూటీ వేశారు ఆరోజు  అతడి కాళ్లపై వేయాల్సిన  ఈ పూలు ఇలా వేసి  నా ఋణం  తీర్చుకుంటున్నాను  అని అన్నాడు.*_ 


 _*బాబు నా కొడుకు పుట్టినరోజుకు  వస్తాడని  బట్టలు కొనిపెట్టాము  కానీ వాడి మరణవార్త వచ్చింది అందుకే ఈ బట్టలు ఇక్కడ  వదిలి  పెట్టాలని తెచ్చాము  కానీ అది అక్కడ కాదు నీకు ఇవ్వాలని  అర్థం అవుతున్నది.*_ 

 _*నీకు అభ్యన్తరం  లేకపోతే  తీసుకో బాబు  అని అతనికి  ఇచ్చి  ఎంతో  గర్వంతో  వెనుకకు  తిరిగారు  ఆ తల్లితండ్రులు.*_  


 _*ఇలాంటి కథలు  వాస్తవాలు  ఇంకెన్నో*_  

 *ఇవేవి మనకు తెలియవు  మనం ఆలోచించను  లేము*  

 *రాజకీయనాయకుడికి పాలాభిషేకం  చేసుకుంటూ*_  

 _*నటించే హీరోలకు  భారీగా         కట్అవుట్లు పెట్టుకుని వాళ్ళే దేవుళ్ళని  మన సమయాన్ని మన విలువని  పోగొట్టుకుంటున్నాము.*_  


*ఇలాంటి వీరజవాన్ల ఎంతో మంది  మనం బాగుండాలని  వారి ప్రాణాలను  త్యాగం చేస్తున్నారు.* 

 _*కనీసం మనం గుర్తించలేక  పోతున్నాం*_ ..

 *

గుణములు సాత్వికమ్ములు

 చం.

గుణములు సాత్వికమ్ములు; నిగూఢ మనోజ్ఞ పరోపకారమున్

ప్రణతుల బొందు రీతి యగు; స్వార్థము లేనివి పాఠ్యబోధనల్;

గణనకు మించి పూజ్యులగు కాశ్యపి యందు వసించు యొజ్జ లే 

ధనముల కాశ బొందని ప్రథానులు వారికి కేలు మోడ్చెదన్ 

మీ 

*~శ్రీశర్మద*

8333844664

శారదా దేవి దివ్య స్వరూపం!

 శు  భో  ద  యం🙏


శారదా దేవి దివ్య స్వరూపం!  


ఉ:  "  అంబ!  నవాంబుజోత్పల  కరాంబుజ  శారద!  చంద్ర  చంద్రికా


          డంబర  చారుమూర్తి; !  ప్రకట స్ఫుట భూషణ  రత్నదీపికా 

          

           చుంబిత  దిగ్విభాగ , శ్రుతి  సూక్తి  వివిక్త  నిజప్రభావ,   భా

            

           వాంబర  వీధి   విశ్రుత  విహారిణి!  నన్ గృపజూడు  భారతీ!


                 హరివంశము- అవతారిక - ఎఱ్ఱాప్రగ్గడ ;


(నవాంబుజోజ్జ్వలయనిపాఠాంతరము)


మాత  సరస్వతిని  కవులందరూ  స్మరించారు. కానీ , కవిత్రయంలో  తృతీయుడు  ఎఱ్ఱన  ప్రస్తుతించిన  తీరు అబ్బురమైనది.

ఆమూర్తిలోని  అంతస్ఫూర్తి  ,నింత గొప్పగా  ఆవిష్కరించిన  కవి  మరియొకఁడు  కానరాడు. బాహిర స్వరూపము నొక్కింత తడవుచు ఆతల్లి యక్షరామృత  వితరణా శీలమును  యెఱ్ఱన  యీపద్యమున  రూపు గట్టించినాడు.

    

         కఠినపదములకు అర్ధము:- అంబుజము-పద్మము; ఉత్పలము-కలువ; చంద్రిక-వెన్నెల;  చారు మూర్తి-  మనోహరాకారము కలది; రత్నదీపిక- రత్న దీపము; చుంబిత -ముద్దిడుకొను ; శ్రుతి-వేదము; సూక్తి-మంచిమాట;

వివిక్త- విశ్లేషణ;( కాళీప్రదేశమని మరొక అర్ధముంది) భావాంబరము- మనస్సనే యాకాశము; విశ్రుత విహారిణి: ప్రసిధ్ధినొందిన విహారముగలది;


           అప్పుడే వికసించిన పద్మములను,కలువలను బోలిన కరములు గలదానా! చంద్రుని వెన్నెలను బోలిన  మనోహర స్వరూపిణీ! ఆభరణములందు గల దీప సదృశములగు రత్నకాంతులను దిగంత పరివ్యాప్త మొనరించుదానా! వేదవాక్యములయందు  నిరూపింపబడు మహా ప్రభావ శాలినీ!  హృదయాకాశమునందు  స్వేఛ్ఛావిహారమొనరించు  మాతా! 

భారతీ!  నన్ను  దయజూడుము;  అని భావము.


                    ఈపద్యంలో 1  నవాంబుజోత్పల కరాంబుజ!


                                        2భూషణ  రత్నదీపికా చుంబిత  దిగ్విభాగ!

   

                                        3 శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ!

       

                                        4 భావాంబర వీధి విశ్రుత విహారిణి!                      అనే యీనాల్గు  విషయాలూ  విశ్లేషింప దగినవి.

మొదటిది: ఆమె కరములు  అంబుజములట! అంబుజములు రెండురకములు .పగటికి తామరలు పద్మములు.రేయికి కలువలు. ఆమెహస్తము లీ  రెంటిని బోలి యుండునట. రేయింబవళ్ళు  ఆమెచేతులకు పని. యేమిపని? జ్ఙానామృతమును పంచుపని.అక్షరామృతమునందించుపని, పద్మమునందు మకరంద ముండును.మాత సరస్వతి హస్తమున జ్ఙానామృతముండును. దానినామె నారాధించువారికి  రేయింబవళ్ళు వితరణ మొనర్చును. ఆహా! ఎఱ్ఱనగారి యూహ యెంత గొప్పది!!!


               ఇఁక రెండవ యంశము: ఆమెభూషణములు  రత్నదీపములట!ఔను రత్నదీపికలే! శ్రుతులే యామెకు నిజభూషణములు. వాటిప్రభావము విశ్వ వ్యాప్తమేగదా! భారతీయ జ్ఙాన వికాసమునకు వాని వెలుగులే  యాధారము.


            3శ్రుతి సూక్తి  వివిక్త  నిజప్రభావ! వేద సూక్తుల యందు ఆమెప్రభావము  అడుగడుగునా ప్రస్ఫుట మగుట మనకు విదితమే"  అక్షరం పరమంపదం"- ఆఅక్షరమైన పరంబ్రహ్మ  స్వరూపావిష్కరణకు  అక్షరం అవసరంగదా! ఆఅక్షరమే ఆమెరూపము, ఆమెస్వభావము, ఆమెప్రభావము. 


                        4  భావాంబర వీధి  విశ్రుత విహారిణి! హృదయాకాంశంలో  తిరుగు లేని సంచారంచేసే తల్లి.ఆమాట నిజమే!

కానీ, భావాంబరమని  " అంబర"- శబ్దాన్ని యెఱ్ఱన ప్రయోగించుటలో  నేదో ప్రత్యేకత యున్నది. అంబరము అనుపదమునకు 

ఆకాశము  అను నర్ధమేగాక  వస్త్రము  అను నర్ధముకూడా ఉన్నది. హృదయమనే కేన్వాసుపై  చెరగని ముద్రవైచుకొని  యెటుబోయిన నటువచ్చు(మూవీ) స్వరూపముగలదట! ఈచిత్ర మెంత చిత్రము!


                               మనము  మరియొక దాని నుపేక్షించితిమి ." శారద  చంద్ర చంద్రికా డంబర  చారుమూర్తి" శరత్కాలమునందలి చంద్రుని వెన్నెలనుదలపించు చల్లని మనోహర రూపిణి! మాత  సరస్వతి  చల్లనిది. ఆమెకరుణ సూర్యాతపమువంటిదికాదు, చంద్రాతపమును బోలి చల్ల నిది. వెన్నెలను జ్ఙానముగా పెద్దల సూచన! అందుచేత చల్లగ మెల్లగ జ్ఙాన సంపదను యిచ్చుతల్లీ!యని కవియను చున్నాడు.


                              ఇటులీ పద్యము  అనవద్యము  హృద్యమునై  చదువుల తల్లి యంతః సత్త్వమును వ్యక్తమొనర్చు

పరమామ్నాయ  సదృశమై  యొప్పారు చున్నది.


                                                                  స్వస్తి!🌷🌷🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

నివేదన – పవిత్రత

 *నివేదన – పవిత్రత* 

 గురువుల సమక్షంలో   ఓ శిష్యుడి ఇంట్లో, సహస్రనామ పాదపూజ  జరుగుతున్నది. శ్రీ గురువుల ప్రక్కన టేబుల్ ఫ్యాన్ ఉంచబడింది. నైవేద్యం తీసుకువచ్చినప్పుడు, శ్రీ గురువులు పంకా (ఫ్యాన్) ను కొద్దిగా ప్రక్కకు త్రిప్పారు. శిష్యుడ్ని పేరు పెట్టి పిలుస్తూ అతని దృష్టిని ఆకర్షించిన శ్రీ గురువులు, “లలితా సహస్రనామంలోని పేర్లు  అతి రహస్యమైనవి, గూడార్థము కలిగినవి. ఉదాహరణకు, “అపర్ణ” పేరును పరిశీలించండి. హిమవంతుని కుమార్తె పార్వతిగా వ్యక్తమైన తరువాత, ఆ తల్లి శివుడిని పొందటానికి తీవ్రమైన తపస్సు చేసింది. ఆ సమయంలో, ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా ఉపవాసం చేసింది. దీనిని గమనించిన దేవతలు ఒక్క ఆకు కూడా తినని ఆ తల్లిని  ‘అపర్ణ’ అని ప్రశంసించారు.ఆ పేరుకు మరో అర్ధం కూడా ఉంది. “అప” మరియు “ర్ణ” గా విభజించండి. అంటే  ఋణం నుండి విముక్తి పొందిన వ్యక్తి అని అర్ధం. ఎవరైనా ఆమె పేరును స్మరించినప్పుడు, ఆమె తన భక్తుడి నుండి ఏదో అందుకున్నట్లు అనిపిస్తుంది. క్షణాలు ఆలస్యం చేయకుండా, ఆమె ఆ భక్తునికి రుణం వుంచుకోకుండా తిరిగి చెల్లిస్తుంది.అలాగే, ఎవరైతే తన రుణాన్ని వెంటనే తీరుస్తారో ఆమెను  నిజంగా అపర్ణ అని అంటారు. ఆమె ఏదీ తన దగ్గర వుంచుకొనదు. నామముల అర్థాన్ని దృష్టిలో ఉంచుకుని తెలుసుకున్నప్పుడు ఆరాధన యొక్క ఆనందం పెరుగుతుంది”. అని పూజ్య గురువులు శెలవిచ్చారు. అటు పిమ్మట శ్రీ గురువులు పూజను కొనసాగించమని శిష్యుడికి సైగ చేసి, ఫ్యాన్ ను యథాస్థితికి త్రిప్పారు. పూజ ముగిసిన తరువాత, శ్రీ గురు చరణులు అందరినీ ఆశీర్వదించి వెళ్లిపోయారు. 

తరువాత, శిష్యుడు జగద్గురువులు బస చేసిఉన్న  చోటుకు వెళ్ళాడు. భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ గురు చరణులను సమీపించి, *" నేను ఎంతో భాగ్యశాలిని, జగన్మాత యొక్క పవిత్ర నామం అయిన అపర్ణ యొక్క అర్ధాలను మీ ద్వారా విన్నందుకు నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను.   మీ పవిత్ర చరణముల ద్వారా ఉద్భవించిన ఈ కథ యొక్క రెండవ వ్యాఖ్యానం కూడా విని నేను ఎంతో ఆశ్చర్యపోయి, ప్రేరణ పొందాను.* 


HH: దాని కోసం నాకు గుర్తింపు, కీర్తిని ఇవ్వవద్దు. ఇందులో నా ప్రమేయం ఏమియూ లేదు. 

శిష్యుడు: మీరు  నిరాడంబరులు. 


H.H: ఇది నమ్రత గురించిన ప్రశ్న కాదు.  నేను ఇచ్చిన అర్ధాలు లలిత-సహస్రనామం శాస్త్ర వ్యాఖ్యానంలో ఉన్నాయి. 

శిష్యుడు: మీ పాద చరణాల నుండి నేను చాలా విలువైన  పాఠాలు నేర్చుకున్నాను. ఆరాధన సమయంలో జపించే నామం యొక్క అర్ధాన్ని, దాని ప్రాముఖ్యతను  తెలుసుకోవడంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా దాని అర్ధం కూడా తెలుసుకునే స్థితిలో ఉండాలి. 

ఫ్యాన్ యొక్క స్థానాలను మార్చడంలో  తమ అంతరార్ధాన్ని నాకు శ్రీచరణులు తర్వాత ఇలా చెప్పారు. *తెచ్చిన నైవేద్యం చాలా వేడిగా ఉందని, నేను దానిని దేవతకు అర్పించే ముందు, మేము పంకాను (fan) దాని వైపుకు త్రిప్పాము. అది చల్లబడిన తరువాత, మళ్లి   పంకాను (fan) యధా స్థానానికి పునరుద్ధరించాము. నివేదన  చల్లబడుతున్నప్పుడు,  ప్రవచిస్తూ తద్వారా ప్రజల దృష్టిని నైవేద్యం వైపు ఆకర్షింపబడకుండా మరలించాను.తద్వారా  వేడి నైవేద్యం  సమర్పణ నివారించడమే కాకుండా, చేసే ఆ తప్పు వలన మా వంశానికి ఎటువంటి అసౌకర్యం, కీడు జరగకుండా శ్రీ గురువులు మమ్ములను రక్షించినారు. గురు దేవుళ్ళ సాధారణ చర్యలు కూడా ఎంతో  బోధనాత్మకమై, భద్రతతో కూడుకున్నవిగా ఉంటాయి.

ప్రశంసలను విస్మరించి శ్రీ గురువులు ఇలా అనుగ్రహించారు, *"పూజలు చేసేటప్పుడు, మనం  దేవుని సన్నిధిలోనే ఉన్నాము,  ఒక చిత్రం ముందు కాదు అన్న స్పృహ, భావన అందరికీ వుండాలి. మనము వేడిగా వున్న  ఆహారాన్ని, చెడిపోయిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడము,  ఒక ముఖ్యమైన అతిథికి కూడా అలాంటి ఆహారాన్ని ఇవ్వము.  అలాగే భగవంతునికి కూడా అలాంటి సమర్పణను ఇవ్వకూడదు. అదేవిధంగా వాడిపోయిన పువ్వులను, వాసన లేని పువ్వులను పక్కన పెట్టాలి.  క్రొత్త వాటిని మాత్రమే పూజకు సమర్పించాలి".*


*-జగద్గురువులు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు*

పరమార్థతత్త్వాన్ని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *తత్త్వం చిన్తయ సతతం చిత్తే*

        *పరిహర చిన్తాం నశ్వరవిత్తే।*

        *క్షణమిహ సజ్జనసఙ్గతిరేకా*

        *భవతి భవార్ణవతరణే నౌకా॥*

 

తా𝕝𝕝 "పరమార్థతత్త్వాన్ని మనసులో సదా ఆలోచించుము. అశాశ్వతమైన ధనసంపదలయందు కోరిక విడనాడుము. *సజ్జనసాంగత్యం ఒక్కటే ఈ సంసారసాగరాన్ని క్షణకాలంలో దాటించగలిగే నౌక అగుచున్నది*."

రాముడిని చూశారా

 ఒకప్పుడు భక్తుడు తులసీదాసుని అడిగాడు.


“మీరు రాముడిని చూశారా ?"


దానికి తులసీదాస్ "అవును నేను చూసాను: అన్నాడు.


భక్తుడు “అప్పుడు నాకు కూడా శ్రీరామదర్శనం చేయించండి "


తులసీదాసు "ఎందుకు కాదు నీకు కూడాశ్రీరామదర్శనం సాధ్యమే! అది చాల సులభం. మీరు ఏ వ్యక్తిని చూసిన అక్కడ మీ కోసం రాముడు కనిపిస్తాడు!"


భక్తుడికి అర్థం కాలేదు. " ఎలా చెప్పండి"


తులసీదాసు అన్నారు :


చూడండి, దీనికి సులభమైన సూత్రం ఉంది.


భక్తుడు మరింత ఉత్సుకతతో, ఆశ్చర్యంతో ఆ సూత్రం ఏమిటి? అని అడిగాడు.


అప్పుడు తులసీదాస్ ఇలా అంటాడు:


"నామ_చతుర్గుణ_పంచతత్త్వమిలన_తాసం_ద్విగుణ_ప్రమాణ_తులసీఅష్టసౌభాగ్యే_అంత_మే_శేష_రామ_హీ_రామ ||"


దీని ప్రకారం, ఏ పేరు అయినా సరే,


అందులోని అక్షరాలను లెక్కించండి. అని


నాలుగు (నాలుగు రెట్లు) ద్వారా గుణించండి. దానితో


ఐదు (పంచతత్త్వ మిలన్) జోడించండి. అప్పుడు


మీరు పొందిన సంఖ్యను రెట్టింపు చేయండి.


.దాన్ని ఎనిమిదితో భాగించండి (అష్టసౌభాగ్యం).


మిగిలేది అదే. ఆ రెండు


అక్షరాలు "రామ"!


భక్తుడు ఆశ్చర్యపోతాడు. అతని పేరు "నిరంజన".


4X4=16; ౧౬ ప్లస్ 5=21;


21X2=42; 42/8= ఆన్సర్ 5. శేషం 2.


అతని భార్య పేరు "నిర్మల".


అక్కడ ఉన్నదానికి సూత్రం ప్రకారం . 3X4=12;


12 + 5=17; 17X2=34; 34/8 =


ఆన్సర్ 4. శేషం 2.


అతని కూతురు పేరు "నిధి".


ఫార్ములా వర్తింపజేయబడింది. 2X4=8; 8 + 5=13;


13X2=26; 26/8 = ఆన్సర్ 3. శేషం = 2


అవును! పేరు ఏదైనా,


అక్షరాలు ఎన్ని ఉన్నా


ముగింపు రెండు అక్షరాలు"రామ" మాత్రమే!


మరియు సూత్రంలోని సంఖ్యలు


గణిత కార్యకలాపాల ప్రాముఖ్యత మీకు తెలుసా?


చతుర్గుణ = ధర్మము, అర్థము, కామము, మోక్షము


నాలుగు పురుషార్థాలు.


పంచతత్త్వం = భూమి, నీరు, అగ్ని,


పంచమహాభూతాలు వాయు మరియు ఆకాశ.


ద్విగుణ = మాయ మరియు బ్రహ్మ.


అష్టసౌభాగ్య = ఆహారం, అర్థం, ఆధిపత్యం,యవ్వనం, కీర్తి, ఇల్లు, బట్టలు, ఆభరణాలు


వీటన్నింటి కోసమే మనం జీవిస్తున్నాం.కానీ చివరికి మిగిలేది భగవంతుని నామం మాత్రమే

జై శ్రీ రామ్ 🙏🙏  జై శ్రీ రామ్

పద్యం జ్ఞాపకముంద

 నయమున బాలుం ద్రావరు

భయమును విషమ్మునైన భక్షింతురుగా

నయమెంత దోసకారియో

భయమే చూపంగవలయు బాగుగ సుమతీ!  - బద్దెన


భావం:- ఓ బుద్ధిమంతుడా!మీరు మర్యాదగా అడిగితే ప్రజలు పాలు తాగరు, కానీ బెదిరించినప్పుడు వారు విషాన్నైనా తాగేస్తారు. కాబట్టి కొన్నిసార్లు పనులు పూర్తి కావడానికి బెదిరింపులు అవసరం.

ఈ పద్యం జ్ఞాపకముంద


 మీ ఇంట్లొ చిన్నారులకు వీటిని నేర్పగలరు.

పరమార్థతత్త్వాన్ని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *తత్త్వం చిన్తయ సతతం చిత్తే*

        *పరిహర చిన్తాం నశ్వరవిత్తే।*

        *క్షణమిహ సజ్జనసఙ్గతిరేకా*

        *భవతి భవార్ణవతరణే నౌకా॥*

 

*తా𝕝𝕝 *పరమార్థతత్త్వాన్ని మనసులో సదా ఆలోచించు అశాశ్వతమైన ధనసంపదలయందు కోరిక విడనాడుము సజ్జనసాంగత్యం ఒక్కటే ఈ సంసారసాగరాన్ని క్షణకాలంలో దాటించగలిగే నౌక అగుచున్నది*.


 ✍️💐🌺🌹🙏

శాసన సభ్యులు - సుపరిపాలన 8*

 *శాసన సభ్యులు - సుపరిపాలన 8*


సభ్యులకు నమస్కారములు.


అధికార పక్షము మరియు ప్రతిపక్షము అను భేదము లేకుండా శాసన సభ్యులందరూ , తమ తమ నియోజక ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉండి, చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించి ప్రజల మన్ననలు పొందవలసి ఉంటుంది. ఫిర్యాదుదారులతో, లబ్ధి దారులతో మాత్రమే గాకుండా నియోజక ప్రజలందరితో మర్యాదా మన్ననలతో  ప్రవర్తిస్తూ, వివరాలను సేకరిస్తూ, జాప్యం జరుగకుండా వేగవంతంగా స్పందిస్తూ ప్రజలకు సహకరిస్తూఉండాలి. 


ప్రతి శాసన సభ్యుడు తమ నియోజక ప్రజల మద్దతుతోనే తాము అధికారంలోకి వచ్చామన్న  భావన సర్వదా కలిగి ఉండాలి. పాలకులు బాధ్యతాయుతంగా అంకిత భావంతో క్రమశిక్షణాయుతంగా వారి వారి  విధులు నిర్వహించాలి. ముఖ్యంగా సమాజంలోనున్న సంఘ విద్రోహశక్తులను, నేరస్తులను, జూదగాళ్లను, మత్తు పదార్థ విక్రయ దారులను, మాన భంగ దుర్మార్గులను,  దౌర్జన్యకారులను ఇత్యాది చట్ట వ్యతిరేక, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించడంలో  రక్షకభట శాఖ సహకారము గైకొని  ప్రజలకు ప్రశాంతమైన వాతావరణము కల్పించాలి.  *నిజాయితీగా, ఋజు వర్తనతో ఉండే అధికారుల విధులలో జోక్యము చేసుకోరాదు* అట్టివారికి  అండదండలుగా  *ఉంటే ప్రజలు హర్షిస్తారు*.


*నేరస్తుల నియంత్రణలో   శాసన సభ్యులు ఎట్టి ప్రలోభాలకు గాని ఆధిష్టానము ఒత్తిడులకు గాని లోంగరాదు* . నేరాల అదుపునకై భద్రతా శాఖ సహకారముతో, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానము వినియోగించుకుంటూ  *శాంతి భద్రతల అంశమునకు ప్రథమ ప్రాధాన్యము ఇవ్వవలసి ఉంటుంది*. 

 

ఎన్నికల సమయంలో  తమ తమ పార్టీలు ఇచ్చిన ప్రజా సంక్షేమ  హామీలను మరియు వాగ్దానాలను అమలు చేయాలి, పూర్తిచేయాలి. ప్రజా సంక్షేమం ఎంత ముఖ్యమో, ప్రజలు స్వయం పోషకులుగా తమ శక్తి సామర్థ్యాలను వినియోగించుకునెలా ఉద్యోగ అవకాశాల కల్పపనలో, పారిశ్రామిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా చర్యలు చేపట్టాలి.  సంక్షేమము తో పాటు  అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వడం మరి మరీ ముఖ్యము.


*ప్రజల సుఖ సంతోషాలు మరియు క్షేమమే తమ కర్తవ్యంగా నాయకులు భావించాలి*.  ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు పార్టీలు ఏవైనా సరే ప్రజా సంక్షేమ పథకాలన్నీ అమలు అయ్యేలా కృషి చేయాలి, దీక్షబూనాలి. *ప్రతి శాసన సభ్యుడు మానవతా దృక్పథంతో సుపరిపాలన అందించి ప్రజల మన్ననలు పొందాలి*.


ధన్యవాదములు.

(*స శేషం*)

పంచాంగం 24.06.2024

 ఈ రోజు పంచాంగం 24.06.2024  Monday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస కృష్ణ పక్ష తృతీయ తిధి ఇందు వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం ఇంద్ర యోగ: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ రాత్రి 01:22 వరకు.

ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03:52 వరకు.


సూర్యోదయం : 05:47

సూర్యాస్తమయం : 06:50


వర్జ్యం : రాత్రి 07:38 నుండి 09:09 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:45 నుండి 01:37 వరకు తిరిగి మధ్యాహ్నం 03:21 నుండి 04:13 వరకు.


అమృతఘడియలు : పగలు 09:46 నుండి 11:17 వరకు.


రాహుకాలం : పగలు 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.



శుభోదయ:, నమస్కార: