2, ఆగస్టు 2024, శుక్రవారం

మాస శివరాత్రి*

 *


            *మాస శివరాత్రి*


      *ఈరోజు ఏమి చేయాలి???*



ప్రదోష సమయంలో ఆ సర్వేశ్వరుడికి అభిషేకం జరిపి, బిల్వదళాలతో అర్చించాలి,

    ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశించడమే కాకుండా దోషాలు తొలగిపోతాయి. 

      దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం, సకలశుభాలు చేకూరతాయని పండితులు చెపుతారు.


అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం (లింగోద్భవం) అని అర్ధం,

     శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి,  

          మహాశివుడు లయ కారకుడు లయానికి (మృత్యువునకు) కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్ధశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. 

        చంద్రోమా మనస్సో జాతః అనే సిద్దాంతము ప్రకారము ఈ చంద్రుడు క్షీణ దశలో ఉన్నప్పుడూ జీవులపై ఈ కేతు ప్రభావము ఉండటము వలన వారి వారి ఆహారపు అలవాట్లపై ప్రభావము చూయించడము వలన జీర్ణశక్తి మందగిస్తుంది. 

        తద్వారా మనస్సు ప్రభావితమవుతుంది, మాస శివరాత్రి నాడు సశాస్త్రీయంగా ఉపవాసము ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడిపితే మంచిదని చెబుతారు , దగ్గరలోని శివాలయ దర్శనం చేయాలి. 

      అవకాశం ఉన్న వారు వారి శక్తి మేర 3, 5, 11, 18, 21, 54, 108 ఇలా ప్రదక్షిణలు చేయవచ్చు. 

        అదేవిధంగా ఆరోజు ప్రదోషవేళ శివునకు మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకాది అర్చనలు చేయడము మంచిది. 

         ఇవేమీ చేయడానికి అవకాశములేని వారు ఆరోగ్యవంతులు అలాగే గృహములో అశౌచ దోషము లేనివారు ఈ రోజు ఉపవాసము ఉండి మూడు పూటల చల్లని నీటితో స్నానం చేయాలి, మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి.


    మెడలో ఎవరికి నచ్చిన రుద్రాక్షను వారు ధరించాలి, దీపాలను పడమర దిక్కున వెలిగించి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108సార్లు జపించాలి. 

       ఇలా చేసిన వారికి పాపాలు పోయి వారికి కైలాసప్రాప్తి లభిస్తుందని విశ్వసిస్తారు.  


      శివుడికి ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకం చేస్తే ఈతి బాధలు, తొలగిపోతాయి, దారిద్య్రం దరిదాపులకు కూడా రాదని చెపుతారు, తెలిసి గాని తెలియక గాని, భక్తితోగాని, గర్వంతోగని, ఈ రోజు ఎవరైతే స్నానం, దానం, ఉపవాసం, జాగారం మొదలైనవి చేస్తారో వారికి శివ సాయుజ్యం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

కండ్ల కలక నివారణ

 కండ్ల కలక నివారణ మార్గాలు - 


 *  30 గ్రాముల పసుపు చూర్ణమును ,250 ml నీటిలో వేసి కలిపి ఆ నీటితో కండ్లను శుభ్రపరచుకొనుచున్న కండ్ల కలకలు తగ్గును . కొట్టిన పసుపు మంచిది . 


 *  పంచదార 3 గ్రాములు 100 ml నీటిలో వేసి కరిగించి గంటకొకసారి ఆ నీళ్లతో కండ్లు తడుపుచున్న కండ్ల కలక హరించును . 


 *  పటిక చూర్ణము 3 గ్రాములు , కోడిగుడ్డు తెల్ల సొనతో నూరి గుడ్డకు పట్టించి నేత్రములపై పట్టి వలె వేయుచుండిన యెడల కండ్లు నీరుకారుట , కండ్ల వాపులు హరించును . 


 * నీరుల్లి ( Red onion ) రసం రెండు లేదా మూడు చుక్కలు కండ్లలో వేయుచుండిన యెడల కండ్ల కలకలు హరించును . 


 *  కలబంద మట్ట పైన పచ్చటి పోర తీసివేసి లోపలి జిగురు వంటి భాగం 11 సార్లు కడిగి పసుపు అద్ది కళ్లు మూసుకుని కనురెప్పల పైన వేసి జారకుండా శుభ్రమైన గుడ్డతో కట్టుకట్టి గంట పాటు ఉంచవలెను . ఇలా రెండుపూటలా చేయుచున్న కంటి ఎరుపులు , దురద , వాపు తగ్గును . 


         ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

సుభాషితం




సుభాషితం!


క్షమ కవచంబు క్రోధమది శత్రువు జ్ఞాతి

 హుతాశనుండు మి

త్రముతగుమందు దుర్జనులు దారుణపన్నగముల్ సువిద్యవిత్త ,ముచి

తలజ్జభూ

షము దాత్తకవిత్వము రాజ్య మీక్షమా

ప్రముఖపదార్ధముల్గలుగుపట్టున దత్కవచాదులేటికిన్;


సుభాషిత త్రిశతి-నీతిశతకం.ఏనుగు లక్ష్మణకవి;🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🕉️🕉️🌷🌷

మేలుచేసేవాడే బంధువు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


     శ్లో𝕝𝕝  *పరోఽపి హితవాన్ బంధుః*

           *బంధురప్యహితః పరః* | 

           *అహితో దేహజో వ్యాధిః* 

           *హితమారణ్యమౌషధం* ||


    తా𝕝𝕝 పరాయివాడైనా మేలుచేసేవాడే బంధువు...బంధువే అయిన కీడుచేసేవాడు శత్రువే....తన దేహంలో పుట్టినదయినా వ్యాధి కీడు చేస్తుంది....అడవిలో పుట్టినదయినా మూలిక మేలు చేస్తుంది.... అనగా *గుణాగుణాలను గుర్తెరిగి తగు విధముగా నడుచుకోవాలని భావము*....

*02-08-2024 / శుక్రవారం / రాశి ఫలితాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🙏☘️


*02-08-2024 / శుక్రవారం / రాశి ఫలితాలు*

•••••┉━•••••┉━•••••┉━•••••

మేషం


సన్నిహితుల  నుండి  శుభవార్తలు అందుతాయి. అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది.  నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలసిరావు. వృధా ఖర్చు విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగములలో అధికారులతో చికాకులు తప్పవు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మిధునం


కుటుంబ సభ్యుల ధన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల పదోన్నతులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారపరంగా భాగస్థులతో చర్చలు అనుకూలస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు  లభిస్తాయి.

---------------------------------------

కర్కాటకం


దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. ఇంటా బయట గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలుంటాయి. స్థిరస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు ఉండవు. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------

సింహం


గృహంలో వివాహది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సమాకూరుతాయి. 

---------------------------------------

కన్య


పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------

తుల


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటాబయటా సమస్యలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో  మరింత కష్టపడాలి. పాత రుణాలు ఒత్తిడి వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది.

---------------------------------------

వృశ్చికం


కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు.

---------------------------------------

ధనస్సు


గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంత వరకు బయట పడతారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారమున అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ  ఉన్నత పదవులు పొందుతారు.

---------------------------------------

మకరం


నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుం. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. నూతన గృహ వాహన యోగం ఉన్నది. బంధు మిత్రులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. 

---------------------------------------

కుంభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక నిరాశ పడతారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

మీనం


నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలుంటాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన మతాపట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

•••••┉━•••••┉━•••••┉━•••••

🍁 *శుభం భూయాత్* 🍀

పంచాంగం

 శుభోదయం, నేటి పంచాంగం       ఓం శ్రీ గురుభ్యోనమః

*శుక్రవారం, ఆగష్టు 2, 2024*

    *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు*

 *ఆషాఢ మాసం -  బహుళ పక్షం*   

తిథి      : *త్రయోదశి* మ3.42 వరకు 

వారం   : *శుక్రవారం* (భృగువాసరే)

నక్షత్రం  : *ఆర్ద్ర* మ12.16 వరకు  

యోగం : *హర్షణం* మ1.52 వరకు

కరణం  : *వణిజ* మ3.42 వరకు

తదుపరి *భద్ర* తె3.38 వరకు

వర్జ్యం : *రా12.32 - 2.10*

దుర్ముహూర్తము : *ఉ8.15 - 9.06* *మ12.31 - 1.22*

అమృతకాలం :  *లేదు*  

రాహుకాలం    :  *ఉ10.30 - 12.00*

యమగండ/కేతుకాలం : *మ3.00 - 4.30*

సూర్యరాశి: *కర్కాటకం* || చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం: *5.42* || సూర్యాస్తమయం:   *6.30* 👉 *మాస శివరాత్రి*

సర్వేజనా సుఖినో భవంతు

02.08.2024. శుక్రవారం

 *జై శ్రీరాం..శుభోదయం..🌹🚩*


02.08.2024.     శుక్రవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు ఆషాఢ మాస బహుళ పక్ష *త్రయోదశి* తిథి మ.03.26 వరకూ తదుపరి *చతుర్దశి* తిథి, *ఆరుద్ర* నక్షత్రం ప.10.59 వరకూ తదుపరి *పునర్వసు* నక్షత్రం,  *హర్షణ* యోగం ఉ.11.45 వరకూ తదుపరి *వజ్రం* యోగం,*వణిజ* కరణం మ.03.26 వరకూ, *భద్ర (విష్టీ)* కరణం రా.03.35 వరకూ ఉంటాయి.

*సూర్య రాశి* : కర్కాటకం (పుష్యమీ నక్షత్రం లో రా.10.06 వరకూ తడుపరి ఆశ్లేష నక్షత్రం లో)

*చంద్ర రాశి* : మిథున రాశిలో రా.రే.తె.05.41 వరకూ తదుపరి కర్కాటక రాశి లో 

*నక్షత్ర వర్జ్యం*: రా.11.29 నుండి రా.01.09 వరకూ

*అమృత కాలం*: లేదు


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.56

*సూర్యాస్తమయం*: సా.06.49

*చంద్రోదయం* : రా.04.38

*చంద్రాస్తమయం*: సా.05.27

*అభిజిత్ ముహూర్తం*:

ప.11.57 నుండి మ.12.48 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.08.30 నుండి 09.22 వరకూ మరలా మ.12.48 నుండి మ.01.40 వరకూ.

*రాహు కాలం*: ఉ.10.46 నుండి 12.22 వరకూ

*గుళిక కాలం*: ఉ.07.32 నుండి ఉ.09.09 వరకూ

*యమగండం*: మ.03.36 నుండి సా.05.12 వరకూ.


ఈరోజు *మాస శివరాత్రి*. బహుళ పక్ష చతుర్దశి తిథి, త్రయోదశి తో కలసి ఉన్న రోజు మాస శివరాత్రి పండుగ జరుపుకోవడానికి చాలా ప్రశస్తమైనది. శివ భక్తులు ప్రతీ బహుళ పక్ష చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి, శివునికి రుద్రాభిషేకం చేస్తారు.


ఉత్తర భారత దేశ పూర్ణిమాంత పంచాంగము ల ప్రకారం ప్రస్తుతం శ్రావణ మాసం జరుగుతున్నది. ఈరోజు  *సావణ్ శివరాత్రి*. కాశీ విశ్వనాథ్ , బద్రీ దామ్  దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.


తమిళ సాంప్రదాయం ప్రకారం *ఆడి పెరుక్కు*,దీనినే *పదునెట్టాం పెరుక్కు* అనికూడా పిలుస్తారు. తమిళ ఆడిమాసం (కర్కాటక మాసం) లో 18 వ రోజు ఈ పండుగను జరుపుకుంటారు.తమిళనాడు లో,శ్రీలంకలో వర్షాకాల ప్రారంభ పండుగగా జరుపుకుంటారు. మానవ జీవనాధారమైన నీటికి కృతజ్ఞత పూర్వకంగా,నదీ పరివాహక ప్రాంతంలో, సరస్సుల దగ్గర,బావుల దగ్గర జలదేవతను పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.


శుక్రవారం,పునర్వసు నక్షత్రం కలయిక ఉండడం వలన, *సర్వార్థ సిద్ధి యోగం* ఈరోజు ప.10.59 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


నిరయన రవి, ఆశ్లేష నక్షత్రం లో      రా.10.06 కి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి *ఆశ్లేష కార్తె* ప్రారంభం అవుతుంది.


శివ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

జాగ్రత్త

 😭🙏::*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*


*హాస్పిటల్ లో "అడ్మిట్" అయ్యే ముందు "పది" సార్లు ఆలోచించండి.*


*మిత్రులారా, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తె "హాస్పిటల్" లో అడ్మిట్ కావద్దు.*


*ఔట్ పేషెంట్ గా బయట క్లినిక్స్ లో ఇద్దరు,ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి. తప్పులేదు.*


*అంతే గానీ ఎట్టిపరిస్థితుల్లో తొందర పడి, వైద్యులు పెట్టె భయాలకు లొంగీ ICU, IP గా జాయిన్ కావద్దు.*


*👤చాలా మంది  కమర్షియల్ అయిపోయారు.* 


*హాస్పిటల్స్ లో జరిగే విషయాలు చాలా భయంకరంగా ఉంటాయి.*


*పైకి కనిపించేంత అందమైనది కాదు.*


*మేనేజ్మెంట్ పెట్టె టార్గెట్స్ రీచ్ కావడానికి నానా "అబద్ధాలు" అడాల్సి వస్తుంది అందులో పని చేసే డాక్టర్స్.*


*డాక్టర్స్ అంటే మనందరికీ దేవుళ్ళు అనే అభిప్రాయం ఉంటుంది.అది డెబ్బై శాతం "అబద్దం". ముప్పై శాతమే నిజం.*


*SP బాల సుబ్రహ్మణ్యం చనిపోవడానికి ప్రధాన కారణం హాస్పిటల్లో రెండు నెలలు ICU లో ఉండటమే.*


*😌ఆయన తనకు వచ్చిన కరోనా ఇంట్లో వారికి ఎక్కడ వస్తుందో అనీ ముందు జాగ్రత్త గా టైం పాస్ కు ఎంజీఎం హాస్పిటల్ లోకి పోయాడు. అదేదో హోటల్ అనుకున్నాడు. అటు నుండి అటే అనే తెలుసుకోలేక పోయాడు.రెండు కోట్లు  బిల్లు వసూలు చేశారు. శవాన్ని ఇచ్చారు.*


*దాసరి నారాయణ రావు, జయలలిత....ఇలా చాలా మంది చావుకు   రోగం కారణం కాదు. నెలల తరబడి ఓకే మంచం మీద పడుకోబెట్టి,టీవీ పెట్టీ, ఏసీ పెట్టీ, "భయంకర"మైన ఆంటీ బయోటిక్స్ ఇచ్చి, అది చేసి ఇదీ చేసి శరీరాన్ని సర్వ నాశనం చేస్తారు.*


*తమను బాగా చూసుకుంటారని, ఏమీ కాదని, ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత చక్కటి వైద్యులు ఉన్నారు కదా అని అనుకుంటారు పేరు,డబ్బు ఉన్నవారు. వైద్యమును చాలా మిస్టరీ గా చేశారు అందరూ కలిసి. ఎంత డబ్బు పెడితే అంత బాగా అయిపోతామని జనాలకు నమ్మకం. "అది" తప్పు.*


*అసలు అన్నీ రోజులు హాస్పిటల్ మంచానికే అంటుకొని పోయి  కదలక మెదలక బాడీ ఉంటే ఏమవుతుంది?* 


*ఉన్న రోగం చిన్నది. రోజుల తరబడి ఉండడం వల్ల కొత్త రోగాలు పుట్టుకొచ్చి బాడీ పూర్తిగా క్షీణించి పోదా??*


*అదే జరిగింది మహానుభావుడు మన ఎస్పీ బాలు విషయంలో. ఇంకో పది ఏండ్లు "బ్రతికే" అవకాశం ఉన్న మనిషి ఆయన.*


*అందుకే మిత్రులారా హాస్పిటల్... అది ఎలాంటి దైనా ఔట్ పేషెంట్ గా సేవలు పొందండి. సెకండ్ opinion తీసుకోండి. ఊరకే జొరబడ వద్దు.*


*అత్యంత మోసపూరిత వ్యవస్థ వైద్యం. కారణం ఫ్యామిలీ డాక్టర్స్ పద్దతి పోయింది. ప్రతీ దానికీ కార్పొరేట్ హాస్పిటల్ లోకి పోవడం కరె క్టు కాదు.*


*కనీసం మీరైనా ఈ విషయాలను మనస్సులో పెట్టుకోండి. ఇంట్లో ఉంటే వంద ఏండ్లు బ్రతుకుతారు. హాస్పిటల్ కు పోతే రేపే ....*


*జాగ్రత్త. జాగ్రత్త. జాగ్రత్త.*


*అందరికీ మంచి జరుగాలనీ కోరుకుంటూ.*

___________________________

పసుపులేటి నరేంద్రస్వామి


*💯% Correct ఎన్ని గ్రూప్ లకైనా షేర్ చేయొచ్చు ఇది సగటు భారతీయుని మనస్సు లోని మాట, ఆవేదన, నగ్నసత్యం మన ప్రియతమ గౌరవ రాష్ట్రపతి మరియు ప్రధాని గార్లకు చేరేవరకు భారత పౌరుని బాధ్యత గా భావించి  షేర్ చేద్దాం.......*

ఆధ్యాత్మిక సాధన

 *_🌹' ఆధ్యాత్మిక సాధన..'🌹_*

   

*_మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు  లాభాలు కలుగుతున్నాయి._*


*_1.మొదటిది:-_*


*_మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది._*


*_2.రెండవది:-_*


*_వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి._*


*_3.మూడవది:-_*


*_ఈ శక్తులు మన వర్తమానం లోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి._*


*_ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు._* 


*_మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును._*


*_మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి._*


*_విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని మూడు జన్మల్లో  హరి వైరులుగా మారి,  శ్రీహరి తో చంపబడి  వైకుంఠం చేరతారా..? లేదా...ఏడు జన్మల్లో  హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా? అని అడిగితే వారు ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము అన్నారు._*


*_మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించుకోవద్దూ? దీనికి మనం ఏమి చేయాలి. దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు._*

                 

_యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జీతాః_

_జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితమ్ బుధాః_

                                                                      

*_భగవద్గీత.. జ్ఞానయోగం..19 శ్లో._*


*_ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో, వారి కర్మలు జ్ఞానం అనేయగ్ని చేత దహించబడతాయి._*

                  

_"యధేయాంసి సమిద్ధో అగ్ని ర్భస్మాత్కురుతే అర్జున_

_జ్ఞానాగ్ని స్సర్వ కర్మాణి భస్మసాత్కతరుతే తధా”_

                                                                 *_జ్ఞాన యోగం: 37 శ్లో._*

    

*_"అర్జునా! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.”_*


*_ఈ ఉపదేశం లో పరమార్ధం ఏమిటి..?_* 


*_జ్ఞానం మనలో  అగ్నిలా జ్వలిస్తే…మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు._*


*_మనం ఈ కర్మ రహస్యాన్ని… జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా! కర్మలు వస్తాయి, మనలని చుట్టుముడతాయి. అవి మనపైన ఏ ప్రభావం చూపవు.✍️_*


*_'శ్రీ గురుభ్యో నమః '🙏🏾_* 


 *_'సర్వం కృష్ణార్పణమస్తు.. 🚩🙏🏾_*


 *_-మీ డా. తుకారాం జాదవ్. 🙏🏾_*


.

02.08.2024. శుక్రవారం

 *జై శ్రీరాం..శుభోదయం..🌹🚩*


02.08.2024.     శుక్రవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు ఆషాఢ మాస బహుళ పక్ష *త్రయోదశి* తిథి మ.03.26 వరకూ తదుపరి *చతుర్దశి* తిథి, *ఆరుద్ర* నక్షత్రం ప.10.59 వరకూ తదుపరి *పునర్వసు* నక్షత్రం,  *హర్షణ* యోగం ఉ.11.45 వరకూ తదుపరి *వజ్రం* యోగం,*వణిజ* కరణం మ.03.26 వరకూ, *భద్ర (విష్టీ)* కరణం రా.03.35 వరకూ ఉంటాయి.

*సూర్య రాశి* : కర్కాటకం (పుష్యమీ నక్షత్రం లో రా.10.06 వరకూ తడుపరి ఆశ్లేష నక్షత్రం లో)

*చంద్ర రాశి* : మిథున రాశిలో రా.రే.తె.05.41 వరకూ తదుపరి కర్కాటక రాశి లో 

*నక్షత్ర వర్జ్యం*: రా.11.29 నుండి రా.01.09 వరకూ

*అమృత కాలం*: లేదు


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.56

*సూర్యాస్తమయం*: సా.06.49

*చంద్రోదయం* : రా.04.38

*చంద్రాస్తమయం*: సా.05.27

*అభిజిత్ ముహూర్తం*:

ప.11.57 నుండి మ.12.48 వరకూ

*దుర్ముహూర్తం*: ఉ.08.30 నుండి 09.22 వరకూ మరలా మ.12.48 నుండి మ.01.40 వరకూ.

*రాహు కాలం*: ఉ.10.46 నుండి 12.22 వరకూ

*గుళిక కాలం*: ఉ.07.32 నుండి ఉ.09.09 వరకూ

*యమగండం*: మ.03.36 నుండి సా.05.12 వరకూ.


ఈరోజు *మాస శివరాత్రి*. బహుళ పక్ష చతుర్దశి తిథి, త్రయోదశి తో కలసి ఉన్న రోజు మాస శివరాత్రి పండుగ జరుపుకోవడానికి చాలా ప్రశస్తమైనది. శివ భక్తులు ప్రతీ బహుళ పక్ష చతుర్దశి తిథి రోజు ఉపవాసం ఉండి, శివునికి రుద్రాభిషేకం చేస్తారు.


ఉత్తర భారత దేశ పూర్ణిమాంత పంచాంగము ల ప్రకారం ప్రస్తుతం శ్రావణ మాసం జరుగుతున్నది. ఈరోజు  *సావణ్ శివరాత్రి*. కాశీ విశ్వనాథ్ , బద్రీ దామ్  దేవాలయాల్లో ఈరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి.


తమిళ సాంప్రదాయం ప్రకారం *ఆడి పెరుక్కు*,దీనినే *పదునెట్టాం పెరుక్కు* అనికూడా పిలుస్తారు. తమిళ ఆడిమాసం (కర్కాటక మాసం) లో 18 వ రోజు ఈ పండుగను జరుపుకుంటారు.తమిళనాడు లో,శ్రీలంకలో వర్షాకాల ప్రారంభ పండుగగా జరుపుకుంటారు. మానవ జీవనాధారమైన నీటికి కృతజ్ఞత పూర్వకంగా,నదీ పరివాహక ప్రాంతంలో, సరస్సుల దగ్గర,బావుల దగ్గర జలదేవతను పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు.


శుక్రవారం,పునర్వసు నక్షత్రం కలయిక ఉండడం వలన, *సర్వార్థ సిద్ధి యోగం* ఈరోజు ప.10.59 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


నిరయన రవి, ఆశ్లేష నక్షత్రం లో      రా.10.06 కి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి *ఆశ్లేష కార్తె* ప్రారంభం అవుతుంది.


శివ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.