4, అక్టోబర్ 2024, శుక్రవారం

04-10-2024) రాశి ఫలితాలు

 రేపు (04-10-2024) రాశి ఫలితాలు


గురు నారాయణ భవిష్యవాణి వారి ఉచిత నిత్య రాశి ఫలితాలు మీ రాశి ఫలితాలు

మీరు ఏ సమస్యల్లో ఉన్నా మీ జాతకం/హస్తరేఖలు చూసి మీ సమస్య లకు పరిష్కారం చేయగలం సమర్ధులం పూజ/గ్రహజపం/హోమం ద్వారా ఖచ్చితంగా పరిష్కారం చేయగలం ఇప్పుడే ఫోన్ చేయండి  "జ్యోతిష్య రత్న" జరిగిన విషయం లు చెప్పి మీ భవిష్యత్తు చెప్పగలం వివాహం నకు జాతకం లు సరిపోల్చుట కూడా చూడబడును మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి 7981622895 గత 35 సంవత్సరంల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం మా దగ్గర సిద్ధి పొందిన మంత్రాలు ఉన్నాయి మా గురువు ల ద్వారా మాకు వచ్చాయి. విద్య ఉద్యోగం వివాహం సంతానం కారాగృహ విముక్తి అనారోగ్యం రాజకీయ పదవులు ఋణ విమోచనం వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి రోగ నివారణ శత్రువులు నుంచి రక్షణ గృహ నిర్మాణం ఇలా ఏదైనా పరిష్కారం చేయగలం సమర్ధులం హోమం ద్వారా ఖచ్చితంగా మీ కోరికలు తీరేలా చేయిస్తాం మీ కోరికలు తీరకపోతే మీ ధనం వాపసు ఇస్తాం షరతులు వర్తిస్తాయి మీ గుంటూరి వేంకట శివ రామ కృష్ణ శర్మ సిద్ధాంతి

సకల శుభ పౌరోహిత్యం కార్యక్రమాలు చేయించబడును



మేషం

 04-10-2024 

ఆప్తుల  నుండి అవసరానికి  ధన  సహకారం అందుతుంది. పాత రుణాలు నుండి విముక్తి లభిస్తుంది. సంతాన విద్యా విషయాలపై  దృష్టి సారించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి  వస్తుంది. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు  లభిస్తాయి.  సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.


వృషభం

 04-10-2024 

చుట్టుపక్కల వారితో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయంతో పదోన్నతులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో  ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు  లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.


మిధునం

 04-10-2024 

ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో ఆప్తులతో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అతికష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.


కర్కాటకం

 04-10-2024 

మిత్రులకు  మీ అభిప్రాయాలు నచ్చవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా  పనులు పూర్తి చేయలేరు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలుంటాయి.  ఇంటా బయట ఒత్తిడి వలన  మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో సహోద్యోగులతో సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలు  మందకోడిగా సాగుతాయి.


సింహం

 04-10-2024 

ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అందరితో  సఖ్యతగా వ్యవహారిస్తారు. సమాజంలో  కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది. జీవిత భాగస్వామితో  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


కన్య

 04-10-2024 

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో  మీ పనితీరుతో అధికారుల నుండి  ప్రశంసలు అందుకుంటారు.


తుల

 04-10-2024 

ముఖ్యమైన విషయాలలో స్వంత  నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున విలువైన పత్రములు  విషయంలో  జాగ్రత్త వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.


వృశ్చికం

 04-10-2024 

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు అనుకూలంగా సాగుతాయి. నూతన  వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 


ధనస్సు

 04-10-2024 

కీలక వ్యవహారాలలో  ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.


మకరం

 04-10-2024 

చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ  వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి.


కుంభం

 04-10-2024 

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. 


మీనం

 04-10-2024 

ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ధన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు.  వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది

కోప్పడడానికి కావలసిన ధైర్యం

 🙏🕉️శ్రీ మాత్రేనమః శుభోదయం 🕉️🙏         🌹ఎదుటి వారు తప్పు చేసినప్పుడు కోప్పడడానికి కావలసిన ధైర్యం కంటే అదే తప్పు మనం చేసినప్పుడు ఎదుటి వారితో క్షమించమని అడగడానికి ఎక్కువ ధైర్యం కావాలి🌹కోపం తెచ్చుకోవడం అనేది అతి సులభమైన పని.. కానీ సరైన వ్యక్తితో, సరైన సమయంలో, సరైన కారణంతో, సరైన పద్దతిలో కొప్పడ్డం అనేది అంత సులభం కాదు🌹ఆత్మ శరీరం ద్వారానే ముక్తిని పొందాలి.. అందుకే ఆత్మకి శరీరం కావాలి.. ఆకలి, నిద్ర, కోరికలు, బాధలు, బందాలు, బాధ్యతలు, ద్వేషాలు, కోపం, పగ, ప్రతీకారం, ప్రేమ వీటన్నిటి మధ్య నలిగిపోతుంది 🌹కోపం మరియు తుఫాన్ రెండు ఒకే విధంగా ఉంటాయి.. శాంతించిన తరువాతే తెలుస్తుంది.. ఎంత నష్టం జరిగిందో అని🌹కోపం, ద్యేషం, కోరకలు, పగ, ప్రతీకారాం, బాధలు శాశ్వతం కాదు..స్వచమైన ప్రేమ శాశ్వతం..అందుకే అన్నీ వదలి ప్రేమని పంచుదాం మిత్రమా!!🌹🌹మీ అల్లంరాజుభాస్కరరావు శ్రీ విజయ శ్రీ విజయ ఆయుర్వేదిక్& జనరల్ ఏజన్సీస్‌. గోకవరంస్టాండ్ దగ్గర .స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి .వైద్య సలహాలుఉచితం94408935939 . 9182075510 🙏🙏🙏🙏🙏

*శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి* 🙏

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము - ధూర్జటి* 🙏


  *పాలుం బువ్వయుఁ బెట్టెదం గుడువరాపాపన్న రాయన్న లే*

  *లే లెమ్మన్న నరంటిపండ్లు గొనితే లేకున్న నే నొల్లనం*

  *టే లాలింపరే తల్లితండ్రు లపు డట్లే తెచ్చి వాత్సల్య ల*

  *క్ష్మీ లీలావచనంబులం గుడువరా శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 52*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! చిన్నపిల్లలు పాలు, అన్నము తెచ్చి తినమంటే, కాదు అరటిపండు కావాలని ఎలా మారాం చేస్తారో, అదే విధముగా నేను కూడా నాకు ఇచ్చిన ఇహలోక సౌఖ్యములను వద్దని మోక్షమార్గము కోసము నిన్ను వేడితిని..... తల్లితండ్రులు ఏ విధముగా ఆ మొండి బాలుని కోరికను తీరుస్తారో అదే విధముగా నీవు నన్నుద్ధరించు ప్రభో....*


✍️🌷🌺🌹🙏

నవరాత్రులు

 నవరాత్రులు - నవ దుర్గలలో దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది.


శైలపుత్రి అమ్మవారి యొక్క ప్రార్ధనా శ్లోకము : 


వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।

వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥


కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.


దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది.


 వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.


నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. మొదటి రోజున యోగులు ఉపాసన ద్వారా తమ మనస్సులను మూలాధార చక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.


.చరిత్ర :


పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక – దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.


సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.


తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.


సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.


‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. 


నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి.

సుదర్శన శతకము*

 *సుదర్శన శతకము*

 *తెలుగు పద్యాను వాదము 17* 

*రచన:*

*పద్య కవితా శిల్పకళానిధి* 

 *మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి* 


 *దేవైరాసీయమానౌ*

 


*తే గీ. చక్ర జ్వాలలు పాపాలు చల్లబరుచ*

*అగ్నికీలలు దావాగ్ని నాపివేసి* 

*దొరలె నక్షత్ర గుంపులు నురుగుగ్రక్కి*

 *అన్ని దిక్కుల తీరాలనధిగమించె*

*రాక్షస బుజదండములకు శిక్ష వేయ*

*మదమునందిన బలమంత మట్టుబెట్టె*

*వృక్షముల వోలె వైరులు విరిగినారు*

*చండ శాసన చేయుమో చక్ర రాజ*


*ఓం నమో భగవతే సుదర్శనాయ*


*💐🌹🙏🙏*

సంప్రదాయం

 🕉️ అమూల్య వాక్కులు 🕉️ 

 మన సంప్రదాయం కొనసాగిద్దాం.

---------------------------------------------

 శ్రీ కృష్ణుడు 5 వేల సంవత్సరాలకు పూర్వం అంటే ద్వాపర యుగం లో సత్యభామ తో కలిసి నరకాసురుణ్ణి చంపడం జరిగింది. ఎందుకంటే నరకాసురుడు వేల మంది కన్యలను చెరబట్టి బంధించాడు, వారికి విముక్తి కలిగించాలని శ్రీ కృష్ణుడు యుద్ధం చెయ్యవలసి వచ్చింది. అతడిని చంపే అవకాశం సత్యభామ కు ఇచ్చాడు శ్రీ కృష్ణుడు.. ఇది జరిగింది ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు.  ఆ సంతోషం లో ప్రజలు మర్నాడు అంటే అమావాస్య నాడు అదే దీపావళి బాణాసంచా (టపాకాయలు) కాల్చారు. చతుర్దశి నాడు తెల్ల వారు ఝామున నువ్వుల నూనె రాసుకుని తలంట్టుకోవాలి. సాయంత్రం దీపాలు పెట్టడం పితృదేవతలకు దారి చూపడానికి దీపావళి నాడు టపాకాయలు కాల్చడం మన సంప్రదాయం. ఇది 5 వేల సంవత్సరాలనుండి వస్తోంది. మనం దీనిని కొనసాగిద్దాం. విదేశాల్లో అంటే అమెరికా, జపాన్ లాంటి దేశాలలో ఏదో ఒక సందర్భం లో టపాకాయలు కలుస్తారు అని మనకు తెలుసు.

-------- ఇవటూరి భవానీ శంకర్. 🕉️

3, అక్టోబర్ 2024, గురువారం

Panchang


 

బ్రాహ్మణ బహు జన ప్రియః*

 .    *బ్రాహ్మణ బహు జన ప్రియః*

.             """""""""""""""""""""""""""""""

బ్రాహ్మణులకు భోజనo పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట. దీన్నే అందరూ 'బ్రాహ్మణ భోజన ప్రియః' అని అపహాస్యం చేస్తారు. నిజానికి 'బ్రాహ్మణ' బహుజన ప్రియ' అని చాలా మంది ఎరుగరు. అసలు శ్లోకం ఏమిటంటే:


       " అలంకార ప్రియో విష్ణు 

        అభిషేక ప్రియః శివ 

        నమస్కార ప్రియః భాను 

      *బ్రాహ్మణ బహుజన ప్రియః* "


సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది. దీని అర్థము ఏమిటంటే "విష్ణువుకు *అలంకారమంటే ఇష్టం*, మరేమో శివునికి *అభిషేకమంటే* ఇష్టము. సూర్యనారాయణుడికి *నమస్కారం* ప్రీతి. బ్రాహ్మణునికి *బహు జన* *(నాలుగు వర్ణముల శ్రేయస్సే)* ఇష్టమని.  అందుకే అందరి శ్రేయస్సు  కోరే "గో బ్రహ్మణేభ్యా" అంటారు. బ్రాహ్మణుడు, గోవు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! అందుకే బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని దీవిస్తాడు. భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు నారాయణుడిని ధ్యానిస్తాడట. నారాయణుడు శివారాధన చేస్తాడట. హరిహరాదులు ఇరువురూ కలిసి 'బ్రాహ్మణుడిని' గోవుని పూజిస్తారట! ఎందుకంటే బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని, ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి మాతకు పరమాప్తులౌతారని"


కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట. 


01. బ్రాహ్మణుడు పేదోడై 'కుచేలుడై' శ్రీ కృష్ణ

       సేవలను అందుకొంటాడు.

02. బ్రాహ్మణుడు అవమానింపబడితే ' 

       చాణక్యుడై' పగ సాధిస్తాడు.

03. బ్రాహ్మణుడు కోపగిస్తే 'పరశురాముడై'

      గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.

04. బ్రాహ్మణుడు విద్య నేర్చితే 'ఆర్య

      భట్టుడై'ప్రపంచానికి 'సున్న'నిస్తాడు. 

05. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే

      'శంకరుడై' వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.

06. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ' చరకుడై'

      లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.

      బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే

      పౌరోహితుడౌతాడు.


    ౧. బ్రాహ్మణ ధర్మం 'వేదము'

   ౨. బ్రాహ్మణ కర్మ 'గాయత్రి'

    ౩. బ్రాహ్మణ జీవనం 'త్యాగం'

    ౪. బ్రాహ్మణ మిత్ర 'సుధాముడు'

    ౫. బ్రాహ్మణ క్రోధం 'పరశురాముడు'

    ౬. బ్రాహ్మణ త్యాగం 'దధీచి' ఋషి 

    ౭. బ్రాహ్మణ రాజు 'బాజీరావ్ పేష్వే'

        మయూర వర్మ'

   ౮. బ్రాహ్మణ ప్రతిజ్ఞ 'చాణక్య శపథం'

   ౯. బ్రాహ్మణ బలిదానం 'మంగళ్ పాండే,

        చంద్ర శేఖర్ ఆజాద్'

౧౦. బ్రాహ్మణ భక్తి 'రావణుడు'

౧౧. బ్రాహ్మణ జ్ఞానం 'శంకర రామానుజ

       మధ్వ' ఆచార్య త్రయం.

౧౨. బ్రాహ్మణ సమాజ సంస్కర్త 'మహర్షి

        దయానంద'

౧౩. బ్రాహ్మణ రాజనీతి 'కౌటిల్యుడు'

౧౪. బ్రాహ్మణ విజ్ఞానం 'ఆర్య భట్ట'

౧౫. బ్రాహ్మణ గణితం' రామానుజo'

౧౬. బ్రాహ్మణ క్రీడాకారులు 'జి ఆర్ విశ్వనాథ్,

       చంద్రశేఖర్, గవాస్కర్'


ఇదంతా ఎలా సాధ్యమైంది?

కర్మ, భక్తి, జ్ఞాన విజ్ఞానం, ధర్మ,శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో,


 01. బ్రాహ్మణ జన్మ 'విష్ణాంశ'

 02. బ్రాహ్మణ బుద్ధి సకల సమస్యా

        పరిష్కారం.

 03. బ్రాహ్మణ వాణి 'వేద విజ్ఞానం'

 04. బ్రాహ్మణ దృష్టి 'సమతా మనోభావం'

 05. బ్రాహ్మణ జాతి 'సంకట హరణo'

 06. బ్రాహ్మణ కృప 'భవసాగరమును ఈదు

       సాధనం'

 07. బ్రాహ్మణ కర్మ 'సర్వజనహితం'

 08. బ్రాహ్మణ వాసం 'దేవాలయం'

 09. బ్రాహ్మణ దర్శనం 'సర్వ మంగళ కరం'

 10. బ్రాహ్మణ ఆశీర్వాదం 'సమస్త సుఖ వైభవ

        ప్రాప్తి'

 11. బ్రాహ్మణ వరదానం 'మోక్షప్రాప్తి'

 12. బ్రాహ్మణ అస్త్రం 'శాపం'

 13. బ్రాహ్మణ శస్త్రం 'లేఖని'

 14. బ్రాహ్మణ దానం 'సమస్త పాప విముక్తి'

 15. బ్రాహ్మణ దక్షిణ 'సప్త జన్మ పాప

       విమోచనం'

 16. బ్రాహ్మణ ఘర్జన 'సర్వ భూత సంహారం'

 17. బ్రాహ్మణ కోపం 'సర్వ నాశనo'

 

🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

అమ్మవారి కథలను ప్రత్యేకంగా

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹 ఎంతో పవిత్రమైన, ఆ జగన్మాతను నిండు మనసుతో ఆరాధించే  శరన్నవరాత్రులు వచ్చేశాయి. ఈ తొమ్మిది రోజులు, విజయ దశమి నాడు ఆ పరాశక్తి కి చేసే పూజలు అనంత ఫలితాలనిస్తాయి. వాటితోపాటు అమ్మవారి దివ్య చరిత్రను, పురాణ కథలను కూడా తెలుసుకోవాలి. శ్రీభారత్ ఛానల్ ఉడుతా భక్తిగా ఆ ప్రయత్నమే చేస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు అందరికీ తెలియని, దేవీ భాగవతం లోని అమ్మవారి కథలను ప్రత్యేకంగా అందిస్తున్నారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

మామిడి పండు