24, నవంబర్ 2024, ఆదివారం

10-15-గీతా మకరందము

 10-15-గీతా మకరందము

          విభూతియోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


స్వయమేవాత్మనాత్మానం 

వేత్థ త్వం పురుషోత్తమ | 

భూతభావన భూతేశ 

దేవదేవ జగత్పతే || 


తా:- ఓ పురుషశ్రేష్ఠా!

సమస్తప్రాణి సృష్టికర్తా!

సకలజీవ నియామకా!

దేవదేవా!

జగన్నాథా!

మిమ్ము మీరే యెఱుగుదురు.

 (మీ స్వరూపము ఇతరులకు దుర్గ్రాహ్యమని భావము).

సంహార బైరవ కాశి

 సంహార బైరవ కాశి 

శ్రీ సంహర్ భైరవుడు


శ్రీ సంహర్ భైరవుడు త్రినేత్రి (మూడు కన్నులు), యువకుడు, దశభుజ (పది చేతులు), పాము మాల ధరించిన భైరవ భగవానుడు తన భక్తులకు ఎనిమిది రకాల సంపదలను ప్రసాదిస్తాడు.  శ్రీ సంహర్ భైరవుడు మెరుస్తున్న చర్మంతో ఉంటారు

 సంహర్ భైరవ తన భక్తుల పాపాలను నశింపజేస్తాడని మరియు అన్ని రకాల ప్రతికూల శక్తులపై విజయం సాధించడంలో వారికి మార్గనిర్దేశం చేస్తాడని నమ్ముతారు. అతను ఈశాన్య దిశకు సంరక్షకుడని నమ్ముతారు. వారణాసిలో, శ్రీ సంహార్ భైరవ దేవాలయం

సంహార బైరవ కాశి

 సంహార బైరవ కాశి 

శ్రీ సంహర్ భైరవుడు


శ్రీ సంహర్ భైరవుడు త్రినేత్రి (మూడు కన్నులు), యువకుడు, దశభుజ (పది చేతులు), పాము మాల ధరించిన భైరవ భగవానుడు తన భక్తులకు ఎనిమిది రకాల సంపదలను ప్రసాదిస్తాడు.  శ్రీ సంహర్ భైరవుడు మెరుస్తున్న చర్మంతో ఉంటారు

 సంహర్ భైరవ తన భక్తుల పాపాలను నశింపజేస్తాడని మరియు అన్ని రకాల ప్రతికూల శక్తులపై విజయం సాధించడంలో వారికి మార్గనిర్దేశం చేస్తాడని నమ్ముతారు. అతను ఈశాన్య దిశకు సంరక్షకుడని నమ్ముతారు. వారణాసిలో, శ్రీ సంహార్ భైరవ దేవాలయం

కార్తీక పురాణం - 24

 _*🚩కార్తీక పురాణం - 24 వ అధ్యాయము🚩*_


🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️


*అంబరీషుని ద్వాదశి వ్రతము*


☘☘☘☘☘☘☘☘☘


అత్రి మహాముని మరల అగస్త్యునితో *"ఓ కుంభసంభవా ! కార్తీకవ్రత ప్రభావము నెంతివిచారించిననూ , యెంత వినిననూ తనివి తీరదు. నాకు తెలిసినంతవరకు వివరింతును. అలకింపుము.*


*"గంగా , గోదావరీ మొదలగు నదులలో స్నానము చేసినందువలనను , సూర్యచంద్ర గ్రహణ సమయములందు స్నానాదులోనరించినను యెంత ఫలము కలుగునో శ్రీమన్నారయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీకవ్రతమందు శుద్ధద్వాదశినాడు భక్తిశ్రద్దలతో దానధర్మములు చేయువారికిని అంత ఫలమే కలుగును. ఆ ద్వాదశినాడు చేసిన సత్కార్యఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటె వేయి రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశీ వ్రతముచేయు విధానమెట్లో చెప్పెదను వినుము.*


*కార్తీక శుద్ధదశమి రోజున , పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసముండి ద్వాదశి ఘడియలు వచ్చిన తరువాతనే భుజింపవలయును. దీనికొక ఇతిహాసము కాలదు. దానిని కూడా వివరించెదను. సావధానుడవై అలకింపుము"* అని ఇట్లు చెప్పుచున్నాడు.


పూర్వము అంబరీషుడను రాజు కలడు. అతడు పరమభాగవతోత్తముడు. ద్వాదశీ వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండ వ్రతము చేయుచుండెడివాడు. ఒక ద్వాదశి నాడు , ద్వాదశి ఘడియలు స్వల్పముగా నుండెను. అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలచి సిద్దముగా నుండెను. అదే సమయమున కచ్చటకు కోపస్వభావుడగు దుర్వాసుడు వచ్చెను. అంబరీషుడు ఆ మునిని గౌరవించి , ద్వాదశి ఘడియలలో పారాయణ చేయవలయునుగాన , తొందరగా స్నానమున కేగిరమ్మనమని కోరెను. దుర్వాసుడందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెడలెను. అంబరీషుడు ఎంత సేపు వేచియున్ననూ దుర్వాసుడు రాలేదు. ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తానిట్లనుకొనెను. *"ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నదికి స్నానముకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకాతిధ్యమిత్తునని మాటయిచ్చి భోజనం పెట్టక పోవుట మహాపాపము. అది గృహస్తునకు ధర్మము గాదు. అయన వచ్చువరకు ఆగితినా ద్వాదశీ ఘడియలు దాటిపొవును. వ్రతభంగమగును. ఈ ముని మహా కోపస్వభావము గలవాడు. ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును. నాకేమియు తోచకున్నది. బ్రాహ్మణ భోజనమతిక్రమించరాదు. ద్వాదశి ఘడియలు మించిపోకూడదు. ఘడియలు దాటిపోయిన పిదప భుజించినయెడల , హరిభక్తిని వదలిన వాడనగుదను. ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్పలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు , భోజనము చేసిన దూర్వాసునకు కోపము వచ్చును. అదియునుగాక , ఈ నియమమును నేను అతిక్రమించిన యెడల వెనుకటి జన్మయందు జేసిన పుణ్యములు నశించును. దానికి ప్రాయశ్చితము లేదు."* అని అలోచించి *"బ్రాహ్మణ శాపమునకు భయము లేదు. ఆ భయమును శ్రీమహావిష్ణువే పోగట్టగలరు. కావున నేను ద్వాదశి ఘడియలలో భోజనము చేయుటయే ఉత్తమము. అయిననూ పెద్దలతో ఆలోచించుట మంచి"* దని , సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో యిట్లు చెప్పెను.


*"ఓ పండిత శ్రేష్టులారా ! నిన్నటి దినమున ఏకాదశి యగుటం జేసి నేను కటిక ఉపవాసము వుంటిని. ఈ దినమున స్వల్పముగా మత్రమే ద్వాదశి ఘడియలున్నవి. ద్వాదశి ఘడియలలోనే భుజించవలసియున్నది. ఇంతలో నా యింటికి దూర్వాస మహాముని విచ్చేసిరి. అ మహామునిని నేను భోజనమునకు ఆహ్వానించితిని. అందులకాయన అంగీకరించి నదికి స్నానర్ధమై వెళ్లి ఇంతవరకూ రాకుండెను. ఇప్పుడు ద్వాదశి ఘడియలు దాటిపోవుచున్నవి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి ఘడియలలో భుజింపవచ్చునా ? లేక , వ్రతభంగమును సమ్మతించి ముని వెచ్చేవరకు వేచియుండవలెనా ? ఈ రెండిటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసిన"* దని కోరెను. అంతట ఆ ధర్మజ్ఞులైన పండితులు , ధర్మ శాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసికొని , దీర్ఘముగా అలోచించి *"మహా రాజా ! సమస్త ప్రాణి కోటుల గర్భకుహరములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధాన్నమును పచనముగావించి దేహేంద్రియాలకు శక్తినొసంగుచున్నాడు. ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును. అ తపము చల్లార్చవలెనన్న అన్నము , నీరు పుచ్చుకొని శాంతపరచవలెను. శరీరమునకు శక్తి కలుగచేయువాడు అగ్నిదేవుడు , దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవునందరు సదాపూజింపవలెను. గృహస్తు , ఇంటికి వచ్చిన అతిధి కడజాతివాడైనాను 'భోజన మిడుదు' నని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదవేదాంగ విద్యావిశారదుడును , మహతపశ్శాలియు , సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహామునిని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును. అందువలన అయుక్షిణము కలుగును. దుర్వాసునంతటి వానిని అవమానమొనరించిన పాపము సంప్రాప్తమగను"* అని విశదపరచిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్యమందలి చతుర్వింశోధ్యాయము - ఇరవై నాలుగో రోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

మహాకవి భారవి

 |మహాకవి భారవి |

సంస్కృత సాహిత్యమున ప్రౌఢ కావ్య నిర్మాతలుగా ప్రసిద్ధికెక్కిన మహాకవులలో భారవి ఒకడు. అతని రచన ' కిరాతార్జునీయము ' మాత్రమే దొరుకుతుంది. ప్రసిద్ధి పొందిన అతని శ్లోకము 

" సహసా విదధీత న క్రియా 

మవివేక:పరమాపదాం

పదo 

వృణుతే హి విమృశ్యకారి

ణం 

గుణాలుబ్దా: స్వయమేవ సంపదః 

-- 

భారవి పేదవాడు. భార్య యొక్క అధిక్షేపాలకు సహించలేక అతడు ఒకనాడు ధనార్జన చేయు తలంపుతో బయలుదేరినాడు. 

ఒక సరస్సు తీరమున విశ్రమించాడు. పండితుడైన భారవికి యొక శ్లోకము స్ఫురించెను. ఆ శ్లోకమును ఒక తామరాకు పై లిఖించాడు. ఆ ప్రాంతపు రాజు వేటకై తిరుగుతు భారవి ఉన్న ప్రదేశమునకు వచ్చియున్నాడు. శ్లోకము రాజుగారు చూచి ఆ శ్లోకమును పఠించి రచనకు ముగ్దుడయ్యాడు. భారవిని మిగుల ప్రశంసించాడు. భారవితో మీకు సమయము దొరికినపుడు తన రాజసౌధానికి రమ్మన్నాడు. రాజుగారు ఆశ్లోకాన్న్ని సువర్ణాక్షరాలతో వ్రాయించి తన శయనమందిరమునoదు 

ఉంచుకొనెను. ఒకనాడు భారవి రాజసందర్శనమునకు వెళ్లెను. కాని అతని దరిద్రవేశము చూచి ద్వారపాలకులు అనుమతించలేదు ఇట్లు కొంతకాలము గడిచెను. 

       మరల ఒకనాడు రాజు వేటకు పోయి నిర్ణీతసమయానికంటే ఆకస్మికముగా తిరికి వచ్చెను. 

తన శయ్య పై రాణి యెవనినో ఆలింగనము చేసుకొని నిద్రించుట చూచెను. క్రుద్ధుడై ఆ ఇరువురిని సంహరింప కత్తి నెత్తినాడు. దైవికముగా అతని దృష్టి గోడపై ఉన్న సువర్ణలిఖిత శ్లోకము మీద ప్రసరించెను. వెంటనే మనసు కుదుట పడింది. వారిని రాజు మేల్కొల్పాడు. విచారించగా ఆపురుషుడు యువరాజని తేలినది. అతడు బాల్యముననే అపహరణకు గురియైనాడు. 

తిరిగి నాటి సాయంకాలముననే రాజప్రాసాదమునకుఁ వచ్చినాడు. పుత్రుని విడవలేక మాతృవాత్సల్యము తో శయ్య పై పరుండ బెట్టినది. 

     తనను మహావిపత్తునుండి రక్షించిన ఆ శ్లోకము రచించిన భారవిని వెతికి రాజ సౌధమునకు పిలిపించి భూరిగా సత్కరించెను.

కవిరాజ విరాజిత

 *!जयगुरुदत्त श्रीगुरुदत्त !: *కవిరాజ విరాజిత* వృత్తములో


1) అఖిలచరాచర విశ్వసు పోషక పాశవిమోచక సూత్రమతే।

సులభ శివాధవ పన్నగ భూషణ చంద్రకళాధర సాధుమతే।

వృషభ రథోపరిభాసిత భాస్కర కోటి సమాకృతి భూతపతే।

జయజయహే  భ్రమరా సహితేశ్వరదేవ గిరీశ్వర పాలయమాం।


 2) విమల యశోధన భూరి కృపాకర కష్టనివారక లోకగురో।

ఋషిజనసంస్తుత సుందర పావన మన్మథ విగ్రహ పాహి విభో।

విధిహరిసేవిత శంకర శీఘ్ర ఫలప్రద భావిత దేవవిభో।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్త శుభంకర పాలయమామ్।


3) సకల సుసేవిత గౌరి మనోహర నాయక దేవర పాలయమామ్।

గురుహరశంకర భూరిధన ప్రద భైరవ వేషక శంకురుమే।

పరమదయాకర శైలవన స్థిత మందిరసుందర భర్గగుణ।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్త శుభంకర పాలయమామ్ ।


 4)కరిముఖ షణ్ముఖ పుత్ర విరాజిత పార్వతి నాయక దేవమణే।

కరివన భూషణ దాన మహాగుణ కారణ భూసుర పాలమహాన్।

కరివరదప్రముఖాదిసువందిత దానవమర్దన ధర్మ నిధే।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్తశుభంకర పాలయమాం।


గురు చరణాంబుజాధ్యాయీ 

విజయ కుమార శర్మా 

✍️విమల శ్రీ

అవధానవిద్య

 అవధానవిద్య నఱయగ 

వ్యవధానములేక సాగు నవధానమ్ముల్ 

అవధానియె సర్వాధిపు 

డవధానియె చక్రవర్తి యావేదికపై 


అవధాని ననుసరింపగ 

వ్యవధానము కోరి జూతు రాపృచ్ఛకులున్ 

అవధానవిద్య యంతయు 

సవరించిన భూషణమ్ము నా వాణికినౌ 


సారస్వత విన్యాసము 

పారీణత పెల్లుబుకెడు పాండిత్యమునౌ 

ధీరత నిండిన సరసత 

భూరిగ పండించు హాస్య ఫుల్లాబ్జములున్ 


వేదికపై పండితకవు 

లాదరమొప్పంగ వాణి నందుకొనంగన్ 

మోదముతో ప్రేక్షకులును 

స్వేదము చిందించుచుండ్రు చిఱునగవులతో 

*~శ్రీశర్మద*

పంచాంగం 24.11.2024

 ఈ రోజు పంచాంగం 24.11.2024

Sunday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి ⁷నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు కార్తీక మాస కృష్ణ పక్ష నవమి తిథి భాను వాసర: పూర్వఫల్గుని నక్షత్రం వైదృతి యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.



రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం  - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  - నవమి - పూర్వాఫల్గణి -‌‌ భాను వాసరే* (24.11.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కాలభైరవాష్టమీ

 *_𝕝𝕝 ॐ 𝕝𝕝 23/11/2024 - కాలభైరవాష్టమీ 𝕝𝕝 卐 𝕝𝕝_*

 

సాక్షాత్ పరమశివుని అవతారం కాలభైరవుడు. కాలము అనే శునకాన్ని వాహనంగా కలిగి వుంటాడు కాబట్టే ఆయనను కాలభైరవుడు అని పిలుస్తారు.


నుదుట విభూతి రేఖలను ధరించి, సాధారణంగా భైరవుడు భయంక రాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదు నైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. ఆయన రూపం భయంకరంగా కనిపించినా, తనను ఆరాధించిన వారిపట్ల ఆయన రక్షకుడుగా వ్యవహరిస్తూ వుంటాడు. ఇవి తెలియక కాలభైరవుడికి కొందరు  కాస్త దూరంగా వుంటారు. దుష్టగ్రహబాధలు నివారించగల  రక్షాదక్షుడు ఈ కాలభైరవుడు.


శైవక్షేత్రాలలో కనిపించే కాలభైరవ స్వామి ముఖ్యంగా కాశీనగరంలోనే కాకుండా చాలా దేవాలయములలో క్షేత్రపాలకుడుగా ఉంటాడు.  

దేవాలయములలో క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు ఉంటే క్రింది శ్లోకమును చెప్పి ముందుగా ఆయన దర్శనం చేయవలెను.


*తీక్ష్ణ దంష్ట్ర ! మహాకాయ !కల్పాంతదహనోపమ |*

*భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి ||*


*అష్టభైరవులు*


అసితాంగ భైరవుడు.

రురు భైరవుడు.

చండ భైరవుడు.

క్రోధ భైరవుడు.

ఉన్మత్త భైరవుడు.

కపాల భైరవుడు.

భీషణ భైరవుడు.

సంహార భైరవుడు.

అనే ఎనిమిది నామాలతో వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ ఉంటాడు.


*కాలభైరవ వృత్తాంతం*


తనను అవమానించిన బ్రహ్మదేవుడిపై శివుడు ఆగ్రహించి భైరవుడిని సృష్టించి బ్రహ్మదేవుడి తలను ఖండించ మని ఆదేశిస్తాడు. క్షణ మైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడి ఐదు శిరస్సులలో అవమానించిన శిరస్సును ఖండించాడు. అనంతరం బ్రహ్మహత్యాపాతకం నుంచి బయట పడటానికై పరమశివుని అనుగ్రహం మేరకు బ్రహ్మదేవుడి కపాలాన్ని చేతితో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఎక్కడైతే ఆ కపాలం పడుతుందో అక్కడితో పాపప్రక్షాళన అవుతుం దని చెప్పాడు. తుదకు భైరవుని చేతిలో కపాలం కాశీ నగరంలో పడటం వలన ఆ నగరమును బ్రహ్మకపాలంగా పిలుస్తారు.


శ్రీకాలభైరవ జయంతినాడు భైరవుడిని పూజిస్తే సకలగ్రహదోషాలు, అపమృత్యుదోషాలు, తొలగిపోతా యని, ఆయురారోగ్యాలు పెంపొందుతా యని మంత్రశాస్త్రగ్రంథాలు చెబుతాయి.


శ్రీకాలభైరవపూజను అన్ని వర్గాలవారు చేయవచ్చు. కాలభైరవపూజను చేసేవారు నల్లని వస్త్రాలు ధరించడం మంచిది. శ్రీకాలభైరవుడి విగ్రహానికి గాని, చిత్రపటానికి గాని పూజ చేయవచ్చు. శని, మంగళవారాలు కాలభైరవుడికి అత్యంత ప్రీతికర మైన రోజులు. 


శ్రీకాలభైరవహోమం చేయించుకుంటే సకల గ్రహబాధలు, అనారోగ్యబాధలు తొలిగిపోతాయి. ఈ రోజున దేవాలయాల్లో కాలభైరవునికి కర్పూరతైల చూర్ణముతో అభిషేకం చేయించాలి. గారెలతో మాల వేసి, కొబ్బరి, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో వున్న సమస్త గ్రహదోషాలూ తొలగి ఈశ్వరుని అనుగ్రహం లభించి ఆయుష్షు పెరుగుతుంది.


ఇంకా ఎనిమిది మిరియాలను ఓ తెల్లని గుడ్డలో కట్టి వత్తుగా చేసి భైరవుని తలచి రెండు దీపాలను నువ్వుల నూనెతో వెలిగిస్తే  అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. శనిదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే పాలను అభిషేకానికి సమర్పించుకున్నా శనిదోషా లుండవు. శ్రీకాలభైరవ అష్టమి రోజున ఆలయంలో భైరవదర్శనం చేసి భైరవునికి పెరుగన్నం, తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా అపమృత్యుదోషాలు తొలగిపోతా యని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.


*శ్లో౹౹ ఉపోషణస్య అంగభూతం అర్ఘ్య దాన మిహస్మృతం*

*తధా జాగరణం రాత్రౌ పూజాయామ చతుష్టయే!!*


ఈ కా భైరవ అష్టమి నాడు ఉపవాసం చేయాలి. ఉపవాసానికి తోడుగా అర్ఘ్యదానం చేయాలి. అలాగే రాత్రి జాగరణ కూడా చేయాలి. నాలుగవ జామున పూజ చేయాలి - అని త్రిస్థలీసేతులో  చెప్పబడింది. 


కాలస్వరూపం తెలిసినవాడు. కాలం లాగే తిరుగులేనివాడు. గ్రహబలాలను అతిక్రమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్య మని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక శాశ్వతుడు, నిత్యుడు అయిన కాలభైరవుణ్ణి అత్యంత పవిత్ర మైనది, మహిమాన్విత మైన  ఈ కాలభైరవ అష్టమి మహాపర్వదినమున

స్తుతించినట్లయితే, ఆ సంవత్సరమంతా ఏ కార్యము చేసినా విఘ్నము లుండవు.* ఈ అష్టమి నాడు సకాలంలో పుణ్య తీర్థములలో స్నానం చేసి మంత్రంతో తర్పణం చేసి అర్ఘ్యం సమర్పించి కాలభైరవుని పూజించినచో పితృ దేవతలు నరకము నుండి ఉద్ధరింప బడుదు రనే ఋషి వచనముల ననుసరించి విహిత కర్మానుష్ఠానము ఆచరించి ఆనందించి కృతకృత్యుల మవుదాం.


*శ్రీ కాలభైరవాష్టకం, భైరవ కవచం, స్తోత్రాలు* పఠించడం వల్ల భైరవానుగ్రహాన్ని పొందవచ్చు.


*కాలభైరవ గాయత్రి*


*ఓం కాలకాలాయ విద్మహే*

*కాలాతీతాయ ధీమహి*

*తన్నో కాలభైరవ ప్రచోదయాత్॥*


 *కాలభైరవాష్టకం*


*దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |*

*నారదాదియోగిబృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||*


*భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |*

*కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||*


*శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |*

*భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||*


*భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |*

*నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||*


*ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |*

*స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||*


*రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |*

*మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||*


*అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్ |*

*అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||*


*భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |*

*నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||*


*కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |*

*శోకమోహలోభదైన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||*


🚩 *_శుభమస్తు!_* 🚩


🙏🏻 *హర హర మహాదేవ!* 🙏🏻


*_𝕝𝕝 లోకాస్సమస్తాః సుఖినో భవన్తు 𝕝𝕝_*