24, ఫిబ్రవరి 2025, సోమవారం

మనసున ఒక భావనతో

 **2020*

*కం*

మనసున ఒక భావనతో

మనిషి కి ముందొండొక విధి మసలెడి జనులన్

కనుగొనగలవారలె సరి

మనుగడ సాగించగలరు మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మనసులో ఒకభావన ఉంచుకుని మనిషి ముందు మరో విధంగా ప్రవర్తించే వారిని కనిపెట్ట గలిగే వారేఈ భూలోకంలో సరైన మనుగడ సాగించగలరు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సోమవారం 24 ఫిబ్రవరి 2025🌷* _*మాఘ పురాణం - 26

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷సోమవారం 24 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 26 వ*_

       _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*పుణ్యక్షేత్రములలో నదీస్నానము*


☘☘☘☘☘☘☘☘☘


ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన మహిమను దిలీప మహారాజునకు వశిష్టులవారు వివరించగా , ఆ రాజు *"మహర్షి ! మీ కృపవలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కాని మరొక సంశయము నాకు గలదు , అది ఏమనగా , మాఘమాసమందు యే యే తీర్థములు దర్శింపవలెనో సెలవిం"* డని వినమ్రుడై కోరగా వశిష్టులవారు మరల యిట్లనిరి. దిలీప మహారాజా ! మాఘస్నానములు చేయుట యందు ఆసక్తి గలవారలకు ముఖ్యమగు తీర్థమహిమలను గురించి వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. మాఘమాసములలో నదీ స్నానము ముఖ్యమైనది. మాఘస్నానములు చేయలేక , తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకము. ఏలననగా మాఘమాసములో యే నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసములో నదీస్నానము సర్వపాపహరమైనది. ఆవశ్యమైనది కూడా , అటులనే ప్రయాగ అతిముఖ్యమైన క్షేత్రం. ఈ భరత ఖండములలో అతి ప్రధానమైన గంగానది సముద్రములో కలియుచోట మాఘస్నాన మాచరించిన యేడు జన్మలలోని పాపములన్నియు సహితము హరించును. మాఘమాసములో నదీస్నానముతో బాటు విష్ణు దేవాలయములు , మహేశ్వరాలయములు మొదలగు మూడువందల అరవై పుణ్యక్షేత్రములు దర్శించిన యెడల గొప్ప ఫలము కల్గుటయేగాక మరల జన్మలనేవి కలుగదు.


ఇక త్రయంబకమను ముఖ్యమైన క్షేత్రం కలదు , ఇది పడమటి కనుమల దగ్గర ఉన్నది. అచటనే పవిత్ర గోదావరి నది జనించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పొగొట్టుకొనుట కిచ్చటనే ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేసి గోహత్య జరిగిన ప్రాంతము మీదుగా గోదావరిని ప్రవహింప జేసినాడు. కావున మాఘమాసములో గోదావరియందు స్నానము చేసిన యెడల తక్షణమే సకల పాపములూ హరించి పోవుటయే గాక , ఇహమందు , పరమందు కూడా సుఖపడుదురు , మన దేశములో యెన్నో నదులున్నవి , ప్రతి నదీతీరమున యెన్నో క్షేత్రములున్నవి , ఆ నదులలో మహానదులు , పుణ్యనదులు ముఖ్యములు అవి వందకు పైగావున్నవి. అటువంటి కొన్నిపేరు స్మరించినచో ఆ నదీ తీరాలలో నున్న క్షేత్రదేవతలను కూడ స్మరించినట్లే అగును. అందుకని కొన్ని ప్రధానమైన నదుల పేర్లను గుర్తుచేసుకొందాము. నందిని , మందాకిని, నళిని , తామ్రవర్ణి , భీమరధి , గంగా , యమున , నేత్రావతి , పంపానది , కృష్ణవేణీ , మహేద్రతనయ , గోదావరి , నర్మదా మొదలైనవి మహానదులు. భగీరధి , గంగ , నర్మద , యమున , సరస్వతి , కృష్ణవేణీ , బాహుద , భీమరధి , తుంగభద్ర , రేణుక , మలావహరి , కావేరి, క్పతమాల , తామ్రపర్ణి , విశోక , కేశికి , గండకి , విచిత్రక , వశిష్ఠప్రవర , కాశ్యపి , సరయు , సర్వపాపహరి , కుశాపతి , పల్గుని కరతోయ , పుణ్యద , ప్రణిత మొదలైనవి పుణ్యనదులు. మహానదులు చిరకాలము నుండి ప్రవహించుచున్నవి. పుణ్యనదులు మహాత్ముల ప్రయత్నమువలన వారి పుణ్యము కొలది ప్రవహించి వారి పుణ్యము నందించునని , మహానదులు , పుణ్యనదులు రెండు విశిష్ట లక్షణములు కలిగిన గంగ , యమున మొదలైన నదులు , మహానదులుగానూ పుణ్యనదులుగాను అయివుండవచ్చును. ఈ నదులలో చేసిన స్నానం విశేషఫలప్రదం , మనము ఆ నదులలో స్నానము చేయలేకపోయినను , పవిత్ర మాఘమాసమున ఆ పేర్లను తలుచుకొన్నను పుణ్యమే కదా. ఈ స్మరణ వలన ఆ నదులను , ఆ నదీతీరములయందున్న పవిత్ర దైవములను కూడా స్మరించినట్లే అగును కదా. గౌతమీనదిలో మరికొన్ని ప్రసిద్దములగు ఉపనదులు కూడా కలసి తమతమ స్నేహసౌభ్రాతృత్వములను చాటుచున్నవి. అటులనే *"వరం తప"* అని ఉపనది ప్రవహించేచోట కూడా శివుడు లింగాకారముతో వెలసి ఉన్నాడు. దానికి ఆవలగా ప్రభావము అను క్షేత్రము కలదు. ఆ క్షేత్రము బ్రహ్మ హత్యా మహాపాపములను సహితము పోగొట్టగలదు. ఇందుకొక ఇతి వృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము.


విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకును , ఈశ్వరునకు అయిదేసి తలలు వుండెడివి. ఈశ్వరునికి పంచరుద్రుదు , త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు ! బ్రహ్మ దేవుడు నాకును ఐదు తలలున్నవి నేనే గొప్పవాడనని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క ఐదుతలలను నరికి వేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొన్నది. శివుడు భయపడి , తాను నరికిన బ్రహ్మ తలను చేతపట్టుకొని ముల్లోకాలు తిరుగుచుండగా క్రమముగా చేతిలోవున్న బ్రహ్మతల యెండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజముగా అందమైనవాడు. అతడు భిక్షాటనకు వచ్చి *"భిక్షాందేహీ"* యనగా గృహిణులు భిక్షపట్టుకొని గుమ్మము కడకురాగా శివుని జగన్మోహనాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి , కోపం కలవారై తమ భార్యలు శివుని వెంటపోవుట సహించలేక , అతనికి *"పురుషత్వము నశించునుగాక"* అని శపించిరి. ఈశ్వరుడును చేయునదిలేక క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమయి పోయినాడు , అట్లు శివుడు లింగాకారముగా మారినందువలన ఆ లింగమమితమైన తేజస్సుతో ప్రకాశించుచుండెను. కోటి సూర్యుల తేజస్సు కలిగి , ప్రళయము సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ , విష్ణువులు , శివుని  వద్దకు వచ్చి వాని నోదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అచట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోగొట్టిరి. ఆ విధముగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటినుండి లింగాకారముగా మారినందున భక్తులు ఆ లింగాకారమునే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందగలుగుచున్నారు.


*మాఘపురాణం ఇరవైఆరావ*  

  *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

సోమవారం🕉️* *🌹24, ఫిబ్రవరి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🕉️సోమవారం🕉️*

*🌹24, ఫిబ్రవరి, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                


        *ఈనాటి పర్వం*

 *సర్వేషాం విజయైకాదశీ*

 

*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః* *మాఘమాసం - కృష్ణపక్షం*


*తిథి       : ఏకాదశి* మ 01.44 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : పూర్వాషాఢ* సా 06.59 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*


*యోగం  : సిద్ధి* ఉ 10.05 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం   : బాలువ* మ 01.44 *కౌలువ* రా 01.21 ఉపరి *తైతుల*


*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 06.00 - 07.30 & 11.00 - 12.30*

అమృత కాలం  : *మ 02.07 - 03.45*

అభిజిత్ కాలం  : *ప 11.57 - 12.44*


*వర్జ్యం          :  రా 02.49 - 04.23 తె*

*దుర్ముహూర్తం  : మ 12.44 - 01.31 & 03.05 - 03.52*

*రాహు కాలం   : ఉ 07.56 - 09.25*

గుళికకాళం       : *మ 01.49 - 03.17*

యమగండం     : *ఉ 10.53 - 12.21*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *ధనస్సు/మకరం*

సూర్యోదయం :*ఉ 06.28* 

సూర్యాస్తమయం :*సా 06.13*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.28 - 08.49*

సంగవ కాలం         :      *08.49 - 11.10*

మధ్యాహ్న కాలం    :      *11.10 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 03.52*


*ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ ద్వాదశి*

సాయంకాలం        :  *సా 03.52 - 06.13*

ప్రదోష కాలం         :  *సా 06.13 - 08.40*

రాత్రి కాలం          :  *రా 08.40 - 11.56*

నిశీధి కాలం          :*రా 11.56 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.50 - 05.39*

________________________________

        *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*అచింత్యమలివృంద రుచి బంధురగలం కురిత కుంద నికురుంబ ధవలం*

*ముకుంద సుర వృంద బల హంతృ కృత వందన లసంతమహికుండల ధరమ్ ।*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

 🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

పానుగంటి లక్ష్మీ నరసింహారావు

 పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి ప్రసిద్ధ వ్యాసాల సంపుటి *సాక్షి* (స్పెక్టేటర్ అనే ఆంగ్ల పత్రికలో జోసెఫ్ అడ్డిసన్, రిచర్డ్ స్టీల్ వ్రాసిన స్పెక్టేటర్ పేపర్స్ వ్యాసాలతో ప్రేరణతో రూపొందించిన పత్రిక) నుండి ఓ మచ్చుతునక ఇదిగో.


*ఒక తెలుగువాడు తెలుగు శ్రోతలతో ఆంగ్లంలో ప్రసంగించేసరికి జంఘాలశాస్త్రి ఉద్వేగభరితుడై ఇలా అంటాడు. -- మ్యావుమని కూయలేని పిల్లి యెచ్చటైననుండునా? కిచకిచలాడలేని కోతిని మీరెక్కడైన చూచితిరా? ... అయ్యయ్యో. మనుజుడే. అంత మనుజుడే. ఆంధ్ర మాతాపితలకు బుట్టినవాడే. .. అట్టివాడాంగ్లేయభాషనభ్యసించినంత మాత్రమున ఇప్పుడాంధ్రమున మాట్లాడలేకుండునా? ఆశ్చర్యము, అవిశ్వసనీయము. అసత్యము. ఆంధ్రమున మాటాడకుండ చేసినది అశక్తికాదు. అనిష్టత. అసహ్యత. అది శిలాక్షరమైన మాట. .. తెలుగుబాస యంత దిక్కుమాలిన బాస లేదనియే యా యాంగ్లేయ తేజస్సు నమ్మకము*

😀😀😀

Krishna Story*

 *Krishna Story*

*Dwarasamudra (Halebidu)*🙏


1. Marriage of Vasudeva and Devaki

2. Krishna killing Putana

3. Krishna killing Bakasura 

4. Krishna killing Sakatasura 

5. Krishna uprooting Yamalarjuna trees and liberating Nalakuvara & Manigriv (Kubera sons)

6. Krishna stealing butter (Navanita Chora Leela)

7. Krishna subduing Kaliya (Kaliya Mardana)

8. Krishna as Veṇugopala with cows (Govinda Leela)

9. Krishna killing Kesi (Kesi vadha)

10. Nanda Maharaja offering gifts to Indra

11. Indra in Svarga (Devaloka)

12. Krishna lifting Govardhana Hill (Govardhana Leela)

13. Krishna revealing his Vishvarupam to Indra, Indra seeking his forgiveness

14. Gopas and Gopis celebrating Govardhana Puja

15. Akrura taking Krishna and Balarama to Mathura

16. Krishna and Balarama crossing the Yamuna river

17. Krishna killing Kuvalayapida  (the elephant sent by Kamsa)

18. Krishna defeating Canura & Mustika  (Kamsa’s wrestlers)

19. Krishna killing Kaṁsa (Kamsa Vadha)

🙏🕉️

ఉమామహేశ్వరులకు

 🈸🈸🈸🈸🈸🈸🈸

ఉమామహేశ్వరులకు నమస్కరిస్తూ ఈ రోజు పఠనం ముగిద్దాం 👆

🈸🈸🈸🈸🈸🈸🈸

*త్రిశాఖైః బిల్వపత్రైశ్చ*


 *అచ్ఛిద్రైః కోమలైః శుభైః*


*శివపూజాం కరిష్యామి*


 *ఏకబిల్వం శివార్పణం!!*


*తాత్పర్యం:-*


*మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను.*


*ఓం నమః శివాయ॥*

🈸🈸🈸🈸🈸🈸🈸

ఓం శాంతిః శాంతిః శాంతిః!

సర్వేజనా సుఖినోభవంతు!!

ఓం తత్సత్!!


సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!

🈸🈸🈸🈸🈸🈸🈸

(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)

🈸🈸🈸🈸🈸🈸🈸

*విష్ణు సహస్రనామ స్తోత్రము*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

 *విష్ణు సహస్రనామ స్తోత్రము*

           *రోజూ ఒక శ్లోకం*

*అర్థం, తాత్పర్యం, ఆడియోతో*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*శ్లోకం (60)*


*భగవాన్ భగహానందీ*

*వనమాలీ హలాయుధః ।*


*ఆదిత్యో జ్యోతిరాదిత్యః*

*సహిష్ణుర్గతిసత్తమః ॥* 


*ప్రతి పదార్థం:~*


*560) భగవాన్ - పూజనీయుడు; పూజ్యులు అందరిలోనూ పూజ్యతముడు;*


*561) భగహా - ప్రళయకాలమున సకల సంపదలను హరించి తనయందే లీనము చేసుకును వాడు;*


*562) ఆనందీ - ఆనందమే స్వరూప స్వభావములుగా కలిగినవాడు*


*563) వనమాలీ -   వనమాలను ధరించినవాడు.*


*564) హలాయుధ: - నాగలిని ఆయుధముగా ధరించిన వాడు.*


*565) ఆదిత్య: - అదితి, కశ్యపులకు జన్మించిన శ్రీ వామన మూర్తి*


*566) జ్యోతిరాదిత్య: -  దివ్య ప్రకాశముతో విరాజిల్లుచున్న సూర్యుడు*


*567) సహిష్ణు: - అపారమైన సహనము కలవాడు; ద్వంద్వములను సహించువాడు.*


*568) గతిసత్తమ: - శరణాగతులకు ఉత్తమమైన గమ్యము;*


*తాత్పర్యము:~*


*ఉత్పత్తి ప్రళయములు, భూతములయొక్క గతాగతములు, వీనిని సంపూర్ణముగా నెరింగినవాడును, ప్రళయకాలమందు ఈ గుణములన్నీ తనలోనే ఆవహింపచేసికొనువాడును, ఆనంద స్వరూపుడును, తన్నాశ్రయించిన భక్తులకు  ఆనందమును ప్రసాదించువాడును, వైజయంతి మాలను సదా ధరించి యుండువాడును, నాగలిని ఆయుధముగా ధరించిన పరశురామావతారమును, వామనావతారమును, జ్యోతి స్వరూపుడైన సూర్య భగవానుడును, ద్వంద్వములను సహించువాడును, శరణాగతులకు ఉత్తమమైన గమ్యము తానే అయినవాడును అగు శ్రీమన్నారాయణుడికి శిరస్సు వంచి వందనం మొనర్చుచున్నాను*


*పాఠకులందరికీ శుభం భవతు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

       ‌        *సూచన*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*స్వాతి నక్షత్రం 4వ పాదం జాతకులు పై 60వ శ్లోకమును, నిత్యం కనీసం 11 పర్యాయములు పఠించడం ద్వారా వారు మంచి ఫలితాలు పొందగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*ఓం నమో నారాయణాయ!*

*ఓం నమః శివాయ!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(59వ రోజు)*

 *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️ *సగరులు - సాగరం; భగీరథుడు*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*‘‘ఈ ముని పెద్ద దొంగ! మన యాగాశ్వాన్ని దొంగిలించాడు. ఇతన్ని క్షమించకూడదు. కొట్టండి, చంపండి.’’ అంటూ సగరపుత్రులంతా ఒక్కసారిగా కపిలమునిని చుట్టుముట్టారు. మారణాయుధాల్ని ఎక్కుపెట్టారు.*


*ఆ కలకలానికి తపోభంగం కలిగింది. కళ్ళు విప్పి చూశాడు కపిలముని. ఆ చూపుల్లో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లాయి. అరవైవేలమంది సగర పుత్రులూ ఆ జ్వాలలకు ఆహూతయిపోయారు. భస్మమయిపోయారు. బూడిదగుట్టలయ్యారు.* 


*కపిలముని నేత్రాగ్నికి తన అరవై వేలమంది పుత్రులూ బూడిదయిపోయారని నారదుడు చెప్పగా తెలుసుకున్నాడు సగరుడు. బాధపడ్డాడు.*


*అప్పుడు మనవడు అంశుమంతుణ్ణి పిలిచాడు. యాగాశ్వాన్ని తీసుకుని రమ్మని అతన్ని పంపాడు. తన పినతండ్రులు తవ్విన సముద్రమార్గం గుండా అంశుమంతుడు రసాతలానికి చేరాడు. అక్కడ బూడిదగుట్టల్నీ, వాటి సమీపంలో తపస్సు చేసుకుంటున్న కపిలమునినీ చూశాడతను. కట్టి వేసి ఉన్న యాగాశ్వాన్ని కూడా గమనించాడు. కపిలమునిని సమీపించాడు. చేతులు జోడించి నమస్కరించాడతనికి. అనేక విధాల స్తుతించాడు.*


*అనుగ్రహించాడు కపిలముని. చల్లగా కళ్ళు తెరచి, మెల మెల్లగా ఇలా చెప్పాడు. ‘‘యాగాశ్వాన్ని నిరభ్యంతరంగా తీసుకుని వెళ్ళు. నీ పినతండ్రులు పవిత్రులు కావాలంటే దానికి గంగాజలమే పరిష్కారం.’’*


*కపిలునికి ప్రదక్షిణ నమస్కారం చేశాడు అంశుమంతుడు. యాగాశ్వాన్ని తీసుకుని బయల్దేరాడు. అశ్వాన్ని తాత సగరునికి అప్పగించాడు. యాగం పూర్తయిందప్పటికి. కొన్నాళ్ళకు రాజ్యభారాన్ని అంశుమంతుడికి అప్పగించి, తపోనిష్ఠలో తనువు చాలించాడు సగరుడు.*


*సగరపుత్రులు తవ్విన కారణంగా సముద్రానికి ‘సాగరం’ అని పేరు వచ్చింది.*


*తన పినతండ్రులకు ఉత్తమ గతులు కల్పించేందుకు అంశుమంతుడు అనేక సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. అయితే అది సాధించకుండానే కాలధర్మం చెందాడు. అంశమంతుడు కొడుకు దిలీపుడు కూడా గంగను రప్పించి, తన పితామహాదులకు ఉత్తమగతులు కల్పించాలని ఎంతగానో ప్రయత్నించాడు. అతని ప్రయత్నం కూడా ఫలించలేదు. చివరకి ఆ కార్యాన్ని దిలీపుని పుత్రుడు భగీరథుడు సాధించాడు.*


*భగీరథుడు:~*


*ఎవరూ సాధించలేని గొప్ప కార్యాన్ని సాధించి ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి చెందాడు భగీరథుడు. దివి నుండి భువికి గంగను తీసుకుని వచ్చింది అతనే!*


*తన పితృదేవతలకు సద్గతి కల్పించాలని భగీరథుడు కఠోరమయిన తపస్సు చేశాడు. అతని తపస్సుకు దేవతలూ మునులూ ఆశ్చర్యపోయారు. ఆఖరికి గంగాదేవి ప్రత్యక్షమయింది. విషయం అడిగి తెలుసుకుంది. అప్పుడు ఇలా అంది. ‘సరే, నీ కోరిక నేను నెరవేరుస్తాను. నీ పితృదేవతలకు సద్గతి కల్పిస్తాను. అయితే నేను స్వర్గలోకం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు నా ప్రవాహవేగాన్ని తట్టుకునే మహనీయుడు కావాలి. లేకపోతే భూతలాన్ని చీల్చుకుని, నేను పాతాళంలోకి జారిపోతాను. నన్ను తట్టుకునే మహనీయుణ్ణి ముందు చూడు.’’*


*‘‘తప్పకుండా తల్లీ’’ అన్నాడు భగీరథుడు.‘*


*‘మరో విషయం. నేను భూమి మీద ఉంటే భూలోకంలోని పాపాత్ములంతా నాలో స్నానం చేసి, తమ పాపాలు నాకు అంటగడతారు. ఆ పాపాల్ని నేనెలా భరించేది?’’ అడిగింది గంగ.*


*ఆలోచించాడు భగీరథుడు. ఇలా అన్నాడు. ‘‘నీ ప్రవాహవేగాన్ని తట్టుకునే మహనీయుడు శంకరుడు ఉన్నాడు. అతడు నిన్ను భరిస్తాడు. విష్ణుపాదోద్భూతమయిన నిన్ను పాపాలు అంటవు. నిప్పును చెదలు అంటుతాయా తల్లీ? దయచేసి నా ప్రార్థన ఆలకించి, భూలోకంలోకి దిగి రా.’’ వేడుకున్నాడు భగీరథుడు.*


*అంగీకరించింది గంగ. తనని తట్టుకుని నిలబడే శంకరుని కోసం ముందు ప్రార్థించమంది. శంకరుని ప్రార్థిస్తూ కఠోర తపస్సు చేశాడు భగీరథుడు. అతని తపస్సును మెచ్చుకున్నాడు శంకరుడు. ప్రత్యక్షమయ్యి భగీరథుని అభీష్టాన్ని నెరవేర్చేందుకు సిద్ధమయ్యాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  -  పూర్వాషాడ -‌‌ ఇందు వాసరే* (24.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

Panchaag