14, డిసెంబర్ 2025, ఆదివారం

దాశరథి కాడు రాముడు దనుజ సుతుడు

  సమస్య:- దాశరథి కాడు రాముడు దనుజ సుతుడు.

(క్రమాలంకార పూరణ)

ఆ.వె

తండ్రి యాజ్ఞ తొ వనముల దరలె నెవరు

లంక గాల్చిన వీరుడు రాముడేన?

నారసింహుని గొలిచిన ధీరుడెవడు?

దాశరథి, కాడు రాముడు, దనుజ సుతుడు.

       పల్లావఝల వెంకట శైలజ, విజయవాడ.

*అంశం ..వర్క్ ఫ్రమ్ హోమ్

  🌹🦜🙏🏽🦜🌹

   


 *అంశం  ..వర్క్ ఫ్రమ్ హోమ్* 

  ............................................ 


 *తేటగీతి..( పంచపాది )* 

సమయ పాలన లేనట్టి సాఫ్టువేరు

నింటనుండుచుఁ బనిచేయ నేమి ఫలము?

నోట్ల యంత్రమై తనయింటఁ బాట్లుపడుచు

ప్రేగు బంధమ్ముతోనైన సాగలేక

బ్రతుకు నీడేర్చు చుండిరి వెతలు పడుచు!!

......................................................

పి.ఎల్.నాగేశ్వరరావు

అగపడదొక్క వేణువు స్వరామృత* *పానముఁ జేసిరెల్లరున్ "*

 


" *అగపడదొక్క వేణువు స్వరామృత* 

  *పానముఁ జేసిరెల్లరున్ "* 

  ..............................................


 *చంపకమాల..* 


మిగుల విశిష్ట శ్రీకరుని మిక్కిలి

భక్తిని జూడనేగి  నే 


సుగమగు స్వామి దర్శనపు శోభను

గాంచ ప్రభాతవేళలో 


నగణిత వాద్యకారులట హ్లాదము

గూర్చుచుఁ బాడఁ గొండపై


యగపడదొక్క వేణువు స్వరామృత

పానముఁ జేసిరెల్లరున్!!

...................................................

శ్రీకరుడు  .. వెంకన్న అనే భావం.

కొండ .. తిరుమల కొండ 

🦄🐓🦜🦢🐘

పి.ఎల్.నాగేశ్వరరావు 

హైదరాబాదు

ఇంగువ

 .

*మన ఆరోగ్యం…!


                 *ఇంగువ.....* 

                 ➖➖➖✍️

```

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, 

గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది, శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది మరియు యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. 


అయితే, అతిగా వాడితే వికారం, కడుపులో ఇబ్బంది వంటి దుష్ప్రభావాలు ఉండవచ్చు.


గర్భిణీ స్త్రీలు దీనిని వాడకపోవడం మంచిది. ```



*ఇంగువ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.....*```


*జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, గ్యాస్ మరియు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. 


*రక్తపోటును నియంత్రిస్తుంది:

ఇంగువ రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. 


*శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం:

శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.


*యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్

ఇంగువలో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇవి జీర్ణక్రియ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఉపయోగపడతాయి.


*క్యాన్సర్ కణాల నివారణ:

ఇంగువ క్యాన్సర్ కణాల నివారణకు కూడా సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. 


*వికారం మరియు కడుపు నొప్పిని తగ్గిస్తుంది:

దీనిలోని సమ్మేళనాలు కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 


*గమనించాల్సిన విషయాలు;

మరియు దుష్ప్రభావాలు;

అలెర్జీ ప్రతిచర్యలు:


కొంతమంది వ్యక్తులలో ఇంగువ వల్ల చర్మంపై దద్దుర్లు, దురద లేదా వాపు వంటి అలెర్జీ ప్రతిచర్యలు రావచ్చు. 


*అధిక వినియోగం:

ఎక్కువ మోతాదులో ఇంగువ సేవించడం వల్ల వికారం, విరేచనాలు, లేదా కడుపులో ఇబ్బంది వంటి సమస్యలు రావచ్చు. 


*గర్భిణీ స్త్రీలు:

గర్భిణీ స్త్రీలు ఇంగువ సేవించడాన్ని నివారించాలి, ఎందుకంటే ఇది గర్భాశయ సంకోచానికి దారితీయవచ్చు.


ప్రసవమైన తరువాత బాలింతలకు 

బాగా వుపయోగపడుతుందంటారు✍️ -సేకరణ.```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పద్దెనిమిది మెట్లు విశిష్ఠత*

  

      *పద్దెనిమిది మెట్లు విశిష్ఠత*

                ➖➖➖✍️

```

మన హిందూ ధర్మసంప్రదాయ ప్రకారము ప్రతీ దేవాలయములలో ముఖ్యమైనది మూలవిరాట్ మాత్రమే, కాని కేరళ రాష్ట్రంలో పరశురామునిచే ప్రతిష్టించబడిన శబరిమలైలో.. 

శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. 


అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవిత్రమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు.


మన హిందు ధర్మసంప్రదాయము ప్రకారము ప్రతీ దేవాలయములలో ముందర ఉన్న ధ్వజస్తంభమును తాకి నమస్కరించిన పిదప దేవతలను దర్శించుకుంటాము. 

కాని శబరిమలై శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో మాత్రము ముందర ఉన్న స్వామివారి 18 మెట్లను తాకి నమస్కరించిన పిమ్మట ధ్వజస్తంభమును తాకి స్వామివారిని దర్శించుకుంటాము, అంటే మన శబరిగిరి వాసుడు అయ్యప్ప 

ఆ పద్దెనిమిది మెట్లకు ఎంత ప్రాముఖ్యత కల్పించాడో ఆ పద్దెనిమిది సంఖ్యకు ఎంత విలువనిచ్చారో, దీనిని బట్టి అర్ధమౌతుంది.


ఇక సంఖ్యా శాస్త్రము ప్రకారము ‘18’ సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది, వ్యాస భగవానుడు ఈ సంఖ్య యొక్క ప్రాధాన్యతను గూర్చి చాలా చక్కగా చెప్పిరి. 1+8=9 అనునది పరిపూర్ణమైన సంఖ్య, అంతే కాక ఆ సంఖ్య నవగ్రహములకు సూచిస్తుంది, కావున భక్తులు అశేషముగా ఆ స్వామి వారిని దర్శించుటకు నియమాల మాల మెడలో ధరించి నిష్టతో దీక్షబూని గురుస్వామి వారికి పూజలు జరిపి, ఇరుముడిని శిరస్సున ధరించి ఆ పద్దెనిమిది మెట్లను అధిరోహించి స్వామి వారిని దర్శించి తరిస్తూ యున్నారు. 


అందుకే మనము మన స్వామి పూజలలో కూడ పడిపూజ అంటామే కాని, అయ్యప్ప పూజ, స్వామివారి పూజ అని ఎక్కడా అనకుండా అయ్యప్పస్వామి వారి పడిపూజ అంటున్నాము. 


మరి ఆ 18 సంఖ్య గూర్చి కొన్ని వివరాలు తెలుసుకుందాం...


అమ్మవారి శక్తిపీఠములు - 18. 

1. శాంకరీ దేవి, 2. కామాక్షీ దేవి, 3. శృంఖలాదేవి, 4. చాముండేశ్వరీ, 5. జోగులాంబ, 6. భ్రమరాంబ, 

7. మహాలక్ష్మీ, 8. ఏకవీరిక, 

9. గిరిజాదేవి, 10. మాణిక్యాంబ, 11. కామరూపిణి, 12. మాధవేశ్వరి, 13. మహాకాళి, 14. పురుహుతిక, 15. వైష్ణవీదేవి, 16. మాంగళ్యగౌరీ, 17. విశాలాక్షీ, 18. సరస్వతి.


వ్యాసమహాముని వ్రాసిన పురాణాలు:18


1. మత్స్యపురాణము, 

2. మార్కండేయ పురాణము, 

3. దేవీభాగవత పురాణము, 

4. భవిష్యత్పురాణము, 5.బ్రహ్మాండపురాణము, 

6. బ్రహ్మవైవక్త పురాణము, 

7. వరాహపురాణము, 

8. వామనపురాణము, 

9. విష్ణు పురాణము, 

10. వాయు పురాణము, 

11. అగ్నిపురాణము, 

12. నారదపురాణము, 

13. పద్మపురాణము, 

14. లింగపురాణము, 

15. గరుడపురాణము, 

16. కూర్మపురాణము, 

17. స్కాంద పురాణము, 

18. బ్రహ్మపురాణము.


మహాభారతములోని పర్వములు-18.


1. ఆదిపర్వము, 2. సభాపర్వము, 3. అరణ్యపర్వము,4.విరాటపర్వము, 5. ఉద్యోగపర్వము(వీటిని ఆది పంచాకాలని), 6. భీష్మపర్వము, 

7. ద్రోణపర్వము, 8. కర్ణపర్వము, 9. శల్యపర్వము, 10. సౌప్తిక పర్వము, 11. శ్రీ పర్వము (వీటిని యుద్ధషష్ఠకములని, 12. శాంతి పర్వము, 13. అనుశాసన పర్వము, 14. ఆశ్రమవాస పర్వము, 

15. అశ్వమేధపర్వము, 

16. మౌసులపర్వము, 

17. మహాప్రస్థాన పర్వము, 

18. స్వర్గారోహణము (వీటిని శాంతి సప్తకములని).


భగవద్గీతలోని అధ్యాయములు-18.


1. అర్జున విషాదయోగము, 2. సంఖ్యాయోగము, 3. కర్మయోగము, 4. జ్ఞాన కర్మసన్యాస యోగము, 

5. కర్మసన్యాస యోగము, 

6. ఆత్మ సంయమయోగము, 

7. జ్ఞానవిజ్ఞాన యోగము, 

8. అక్షర పరబ్రహ్మయోగము, 

9. రాజవిద్యరాజ గుహ్యయోగము, 10. విభూతి యోగము, 

11. విశ్వరూప సందర్శన యోగము, 12. భక్తి యోగము, 13. క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, 14. గుణత్రయ విభాగ యోగము, 15. పురుషోత్తమ ప్రాప్తియోగము, 16. దైవాసుర సంపద్విభాగ యోగము, 

17. శ్రద్దాత్రయ యోగము, 

18. మోక్ష సన్యాస యోగము.


ఉప పురాణముల సంఖ్య - 18.


1. సనత్కుమారము, 2. నృసింహ పురాణము, 3. స్కందపురాణము, 4. శివధర్మ పురాణము, 

5. నందికేశ్వరపురాణము, 

6. దుర్వాసపురాణము, 

7. నారదీయ పురాణము, 

8. కపిల పురాణము, 

9. మానవ ఔజానన పురాణము, 10. మహేశ్వర పురాణము, 

11. వారుణ పురాణము, 

12. కాళీ పురాణము, 

13. సాంబ పురాణము, 

14. సౌర పురాణము, 

15. పరశర పురాణము, 

16. మారీచ పురాణము, 

17. భార్గవ పురాణము, 

18. బ్రహ్మాండ పురాణము.


స్మృతులు - 18.


1.మనుస్మృతి, 2. బ్రహ్మస్మృతి, 

3. దక్షస్మృతి, 4. గౌతమస్మృతి, 

5. యమస్మృతి, 6. అంగీరసస్మృతి, 7. యోగీశ్వరస్మృతి, 8. ప్రచేసస్మృతి, 9. శాతతాప స్మృతి, 

10. పరాశరస్మృతి, 

11. సంవర్తనస్మృతి, 

12. ఉశనస్మృతి, 13. శంఖస్మృతి, 14. లిఖితస్మృతి,15. ఆత్రేయస్మృతి, 16. విష్ణుస్మృతి, 

17. అపస్తంబస్మృతి,

18. హరీతస్మృతి.


సిద్ధులు - 18.


1.అణిమ, 2.లహిమ, 3.మహిమ, 4.ఈశాక్త్వా, 5.వసిత్వ, 6.ప్రాకామ్యా, 7. బుద్ధి, 8. ఇచ్చా, 9. ప్రాప్తి, 10. సర్వకామ, 11.సర్వాసంపత్ప్రద, 12. సర్వప్రియంకర,

13. సర్వమంగళాకారణ, 

14. సర్వదుఃఖవిమోచన, 

15, సర్వమృత్యుప్రవాచ, 

16. సర్వవిఘ్ననివారణ, 

17. సర్వాంగసుందర, 

18. సర్వాసౌభాగ్యదాయక. 



విద్యలు - 18.


1. ఋగ్వేదము, 2. యజుర్వేదము, 3. సామవేదము, 

4. అధర్వణవేదము, 5. శిక్షా, 

6. వ్యాకరణము, 7. చందస్సు, 

8. నిరుక్త, 9. జ్యోతిష్యము, 

10. కల్పము, 11. మీమాంస, 

12. న్యాయశాస్త్రము, 13.పురాణాలు, 14. ధర్మశాస్త్రాలు, 15.ఆయుర్వేదము, 

16. ధనుర్వేదము, 

17. నీతిశాస్త్రము, 

18. అర్ధశాస్త్రము.


మానవ శరీరములో ఉన్న ముఖ్యమైన స్థానము - 18.

1. మూలాధారం, 2. స్వాధిష్ఠానము, 3. మణిపూర్వకము,4.అనాహతము, 5.లంబిక, 6.విశుద్ధి, 7.అంగత, 8.బిందు,9.అర్ధచక్రము, 10.రోధిని, 11. నాధం, 12. సాంధారము, 13. శక్తి, 14.వ్యాపిక, 15.సమన, 16. ఉన్మన, 17. మహాబిందు, 18. సహస్రావరము.


శబరిమలై_ప్రాంతములో_స్వామివారి_

పవిత్రగిరులు_(కొండలు) - 18.


1.శబరిమలై, 2.కాంతమలై(పొన్నంబలమేడు, 

3. నాగమలై, 

4. సుందరమలై(సౌందర్యమలై), 

5. చిత్రంబలమేడు, 6. కల్కిమలై, 7. మదంగమలై(మాతాంగమలై), 

8. శ్రీపాదమలై, 9. గ్రౌండర్మలై (అప్పాచిమేడు), 10. దేవమలై, 11. నైలడంకుండ్రు, 12. తహైప్పార్ మలై, 13. నిలక్కల్ మలై, 

14. పుడుచ్చేరిమలై, 15. కాళైకట్టి, 16. ఇంజిప్పారై, 17. కరిమలై, 

18. నీలిమలై.


అష్టరాగ_పంచేంద్రియ_తిగుణ_జ్ఞానాజ్ఞనములు - 18.


1. కామము, 2. క్రోధము, 

3. లోభము, 4. మోహము, 

5. మాత్సర్యము, 6. దర్పము, 

7. అహంకారము, 8. కన్ను, 

9. ముక్కు, 10. చెవి, 11. నోరు (నాలుక), 12.చర్మము, 13.సత్వ గుణము, 14. తమోగుణము, 

15. రజోగుణము, 16. అవిద్య, 17. విద్య, 18.ఆశ.


పద్దెనిమిది_సార్లు_మాల_ధరించి_వెళ్లి_వచ్చిన_స్వామి_వార్ల_పేర్లు - 18.

1. కన్నెస్వామి, 2. కత్తిస్వామి, 

3. గంటస్వామి, 4. గధాస్వామి, 

5. పెరియస్వామి, 6. జ్యోతిస్వామి (గురుస్వామి), 7. సూర్యస్వామి, 

8. చంద్రస్వామి, 9. త్రిశూలస్వామి, 10. విష్ణుచక్రస్వామి, 11. శంఖదార స్వామి, 12. నాగభరణస్వామి, 

13. శ్రీహరి స్వామి, 14.పద్మస్వామి, 15. శ్రీస్వామి, 16. శ్రీశబరిగీశ్వరస్వామి (రాతిస్వామి), 17. ఓంకారస్వామి, 18. నారికేళస్వామి.


పద్దెనిమిదిసార్లు_శబరిమలై_వెళ్ళిన_స్వాములు_ప్రతీ_ఏట_శరంగుత్తిలో_వదిలి పెట్టే వస్తువులు - 18.

1. శరము (బాణం), 2. కత్తి, 

3. గంట, 4. గధ, 5. విల్లు (ధనస్సు), 6. జ్యోతి (దీపము), 7. సూర్యుడు, 8. చంద్రుడు, 

9. త్రిశూలము, 10. విష్ణు చక్రము, 11. శంఖం, 12. నాగాభరణం, 13. వేలాయుధం, 14. పద్మము (కమలము), 15. శ్రీ, 16. రాయి, 17. ఓం, 18. కొబ్బరిచెట్టు.


కాళికాదేవి_యొక్క_కరములు - 18.

అమ్మవారి యొక్క కాళికారూపములో ఆమె చేతులు మొత్తము పద్దెనిమిది.


భారతయుద్ధము_జరిగిన_దినములు - 18.

కురుక్షేత్ర సంగ్రామములో పాండవులు, కౌరవులు కలిసి యుద్ధము చేసినది పద్దెనిమిది రోజులు.


కురుపితామహుడు_అంపశయ్యమీద వున్న_దిననములు - 18.


పాండవులకు, కౌరవులకు తాతగారైన భీష్ముడు రణరంగములలో నేలకు ఒరగకుండా అర్జునుడు నిర్మించిన అంపశయ్యపైన ఉన్నది 18 దినములు.


భారత_యుద్ధములో_పాల్గొన్న_అక్షౌహిణులు-18, సుప్రసిద్ధమైన భాషలు కూడా పద్దెనిమిది.


అందువలన ఇంతటి విశిష్టత కలిగిన ఈ పద్దెనిమిది సంఖ్యగల పదునెట్టాంబడిని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామివారు శబరిమలై దేవాలయములోను, ప్రతీ అయ్యప్ప దేవాలయాలలోను మరియు స్వామివారి పడిపూజలలోను ఇంత విలువ కలిగియున్నది.✍️```

పద్దెనిమిది మెట్ల సోపానాధిపతయే శరణం అయ్యప్ప🙏

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*షష్టాశ్వాసం ద్వితీయ భాగం*

*590 వ రోజు*


*మధు కైటబులు*


ప్రణవధ్వని వచ్చిన దిక్కుకు పరుగెత్తిన మధుకైటభులకు అక్కడ ఎవరూ కనపడక వేదములు పెట్టిన చోటుకు వెళ్ళి చూసి అక్కడ వేదములు కనిపించక పోవడంతో వారికి భయంకరమైన కోపము వచ్చింది. నానారభస చేస్తూ అటూఇటూ తిరుగుతూ ఉండగా యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి వారికి కనిపించాడు. వారు విష్ణువును యుద్ధముకు ఆహ్వానించగా విష్ణువు యుద్ధోన్మాదులైన మధుకైటబులను సంహరించాడు. అలాసృష్టి జరగడానికి సాయం చేసాడు. బ్రహ్మదేవుడు సృష్టిచేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి హయగ్రీవుడు అన్ని అవతారముల కంటే మహిమాన్వితుడయ్యాడు. వేదములను రక్షించిన హయగ్రీవుడిని వేదములు సదా ఆశ్రయించి ఉంటాయి. జనమేజయమహారాజా ! హరి త్రిగుణములలో హెచ్చుతగ్గులను కలిగిస్తుంటాడు కనుక మానవులలో కూడా త్రిగుణములు హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అందుకే మానవులలో ఒకరు గుణవంతులు మరొకరు గుణరహితులు ఔతారు. మానవులలో త్రిగుణాలకు కారణం అయిన శ్రీహరి త్రిగుణాలను నాశనంచేసే శక్తి ఆయనకే ఉంది. వేదములు, యజ్ఞములు, పుణ్యకార్యములు, పంచభూతములు శ్రీహరి రూపాలే " అని వైశంపాయనుడు చెప్పాడు.


*ఏకాగ్రత*


జనమేజయుడు " మహాత్మా ! ఏకాగ్రచిత్తులు గొప్ప వారు అన్నావు కదా ! అసలు ఏకాగ్రత అంటే ఏమిటి ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పూర్వము శ్రీకృష్ణుడు మీ తాతగారైన అర్జునుడికి భారతయుద్ధ ఆరంభంలో సాంఖ్యము, యోగముల సారము బోధించారు. దానినే భగవద్గీత అంటారు. అది నేను ఎప్పుడో విన్నాను ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా విను. ఏకాగ్రత ధర్మమును పూర్వము నారాయణుడికి ఉపదేశించాడు. దానిని బ్రహ్మ దక్షుడికి ఉపదేశించాడు. దక్షప్రజాపతి తన మనుమడైన సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు. ఇక్ష్వాకుడి నుండి ఆ ఏకాంతిక ధర్మము యోగ్యులైన వారికి పరంపరగా అందజేయబడింది. ఈ ఏకాంతిక ధర్మమును మహావిష్ణువు నుండి ఉపదేశం పొందిన నారదుడు తన శిష్యులకు ఉపదేశించాడు. వారి నుండి వారి శిస్యులకు అలా పరంపరగా సకల జనులకు చేరింది. ఏగాగ్రత ధర్మము దుర్మార్గులకు మాత్రము అవగతము కాదు. ఈ ఏకాగ్రత ధర్మము అహింసకు మూలము. ఈ అహింసా వ్రతముతో శ్రీహరి ప్రీతి చెందుతాడు. హరి అన్నా క్షేత్ర్తజ్ఞుడు అన్నా ఒకటే. శ్రీహరి తన భక్తులకు వాసుదేవాది నాలగు రూపములలో దర్శనం ఇస్తాడు. ఈ నలుగురిలో వాసుదేవుడు ప్రధముడు, రెండవ వాడు సంకర్షుణుడు, మూడవ రూపము ప్రద్యుమ్నుడు, నాల్గవ రూపము అనిరుద్ధుడు. ఎన్ని రూపములలో దర్శనం ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా ఉండే రూపము ఒక్కటే. ఆ దైవస్వరూపము మన ఇంద్రియములకు గోచరం కాదు. అనన్య భక్తి, తపస్సు, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలవారికి మాత్రమే ఆ దైవస్వరూపము గోచరమౌతుంది. ఏకాంతధర్మము శాంత మనస్కుడికి కరతలామలకం. ఈ ఏకాగ్ర ధర్మము మనలోని అన్ని చింతలను తుడిచి వేయు ఆయుధము " అని వైశంపాయనుడు చెప్పాడు.


*నోములు వ్రతాలు*


జనమేజయుడు" మహాత్మా ! ప్రజలు అత్యున్నతమైన ఏకాగ్రతావ్రతం ఆచరించక ఏవోవో పూజలు నోములు వ్రతాలు ఏ ప్రయోజనాన్ని ఆచరిస్తున్నారు ? వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! మనస్సు త్రిగుణముల వలన ప్రభావితమౌతుంది. అందులో ఉత్తమమైన సాత్వికగుణము కలవారి యోగక్షేమములు శ్రీ మహావిష్ణువే చూసుకుంటాడు. వారే ఏకాగ్రచిత్తం కలిగిన ఏకాంతికులు. వారికి దైవచింత తప్ప వేరే వ్యాపకం లేదు. రాజసము తామసము అవలంబించిన వారు ప్రాపంచిక విషయాలలో మునిగి భోగలాలసలో నిమజ్ఞులై ఉంటారు. అలాంటి వారు శ్రీహరికృపకు పాత్రులు కాలేరు. ఏకాంతికులు ఏకాంతచిత్తంతో సేవించే వారు విష్ణుమూర్తి మనసులో చోటుచేసుకుంటారు. ఈ విషయాన్ని వేదాలు కూడా ఉద్ఘాటిస్తున్నాయి. మా గురువుగారు దయతో నాకు ఉపదేశించిన ఈ ఉపదేశము విని నేను పవిత్రుడనైనాను. జనమేజయా ! నీవు కూడా ఆచరించగలిగిన ఏకాగ్రవ్రతము ఆచరించి ఏకాగ్రతతో శ్రీహరిని ధ్యానించి తరించి శాశ్వతత్వాన్ని పొందు " అని వైశంపాయనుడు. జనమేజయుడు" ఓ మహర్షీ ! లోకములో యోగము, సాంఖ్యము, వేదములు, పాశుపతము, పంచరాత్రము, ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి కదా! అన్నిటికీ నిష్టలు ఒకే విధంగా ఉంటాయా ! లేక వేరువేరుగా ఉంటాయా ! అసలు వీటిని ఎవరు ఉపదేశించారు ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! వేదములకు, సాంఖ్యముకు, యోగముకు, ఇతర శాస్త్రాలకు మూలకర్త శ్రీహరే ! అన్నీ ఆయనను చేరడానికి ఉన్న మార్గాలే ! వేదములను నారాయణ పుత్రుడు అయిన వ్యాసుడి చేత ఉపదేశించబడింది. సాంఖ్యమును కపిలుడు ఉపదేశించాడు, యోగమును హిరణ్యగర్భుడు ఉపదేశించాడు, పాశుపతమును శివుడు ఉపదేశించాడు, వైష్ణవము అను పంచరాత్రమును సాక్షాత్తు విష్ణుమూర్తి చేత ఉపదేశింపబడింది " అని వైశంపాయనుడు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ ఉతర రంగనాథర్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1325


⚜  తమిళనాడు : పల్లికొండ - వెల్లూరు


⚜  శ్రీ ఉతర రంగనాథర్ ఆలయం




💠 ఉతర రంగనాథర్ ఆలయం తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని పల్లికొండ గ్రామంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం. 


💠 ఈ ఆలయం పాలార్ నది ఒడ్డున ఉన్నది. ఇక్కడ స్వామివారిని   రంగనాధ స్వామి అని, అమ్మవారిని రంగనాయకి తాయర్ అని పిలుస్తారు. 


💠 బ్రహ్మదేవుని యజ్ఞానికి భంగం కలిగించడానికి ఉద్దేశించిన వరదను అడ్డుకోవడానికి నారాయణుడు తనను తాను శయన కోలంలో ప్రదర్శించిన మూడు ఆలయాలలో ఇది మొదటిది.


💠 ప్రభువు పాల సముద్రంలో (క్షీర సాగర లేదా పాల కడల్) వలె శయన రూపంలో ఉన్నందున, ఈ నదికి పాలార్ అని పేరు పెట్టారు, అంటే 

పాలార్ అనగ క్షీర నది. 

పల్లికొండ అనగా శయనించిన స్వామి అని అర్ధం. 


💠 బ్రహ్మాండ పురాణము ప్రకారము ఈ క్షేత్రములో ఒక దినము గడిపి స్వామిని పూజించిన మోక్షము లభించునని భక్తుల నమ్మకము. మూడు దినములు కాంచిపురములో గడిపి వరదరాజ స్వామిని పూజించిన మోక్షము కలుగునని నమ్మకము. 



🔆 స్థల పురాణం


💠 శ్రీ మహాలక్ష్మి మరియు సరస్వతిల మధ్య ఒకరిపై మరొకరి ఆధిపత్యం గురించి ఒకసారి చర్చ జరిగి వారివురు బ్రహ్మదేవుని వద్దకు తీర్పుకై వచ్చారు. బ్రహ్మ శ్రీ మహాలక్ష్మి సరస్వతిదేవి కంటే ఉన్నతమైనదని తెలిపెను. 

దాంతో సరస్వతీ దేవి కోపించి బ్రహ్మదేవుడిని విడిచిపెట్టి, నంది దుర్గ కొండలకు వచ్చి ఆధిపత్యం కోసం తపస్సు చేయడం ప్రారంభించింది. 

ఈ సమయంలో, బ్రహ్మ దేవుడు శ్రీమన్నారాయుణుడుకు అంకితం చేయుటకు యజ్ఞాన్ని నిర్వహించాడు. నియమం ప్రకారం, ఈ ఆచారాలను అతని భార్యతో నిర్వహించాలి. 

బ్రహ్మ సరస్వతీ దేవిని తనతో కలిసి యజ్ఞానికి ఆహ్వానించాడు, కానీ ఆమె నిరాకరించింది.


💠 బ్రహ్మ మహా సరస్వతి గుణాలతో సావిత్రిని సృష్టించి, ఆమెను వివాహం చేసుకొని, సరస్వతి దేవికి మరింత కోపం తెప్పించిన యజ్ఞాన్ని ప్రారంభించాడు. 

యజ్ఞాన్ని నాశనం చేయడానికి సరస్వతి దేవి, షీరా నది లేదా పాలార్ నదిగా అవతరించి ఉగ్రంగా ప్రవహించడం ప్రారంభించింది. 

వరదను ఆపమని యజ్ఞాన్ని రక్షించమని బ్రహ్మ శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు.


💠 బ్రహ్మ కోరిక మేరకు శ్రీమన్నారాయణుడు జలప్రళయానికి ముందు మూడు పుణ్యక్షేత్రాలలోని ఆదిశేషునిపై దీర్ఘరూపం ధరించి వరదను ఆపి యజ్ఞం విజయవంతంగా ముగించుటకు సహాయపడ్డారు.


💠 మహావిష్ణువు శయన రూపాన్ని పొందిన మొదటి ప్రదేశం ఈ పల్లికొండ క్షేత్రం, దీనిని వడ ఆరంగం అని కూడా పిలుస్తారు, రెండవది కావేరిపక్కం సమీపంలోని తిరుపార్కడల్, మూడవది కాంచీపురంలోని తిరువెక్కా ఆలయం లేదా యథోక్తకారి పెరుమాళ్ (సొణ్ణ వణ్ణం సెయిద పెరుమాళ్).


💠 విదేశీ దండయాత్రల సమయంలో, అసలు ఉత్సవ రంగనాథస్వామి విగ్రహాన్ని దాచిపెట్టి, దాని స్థానంలో కస్తూరి రంగనాథర్ లేదా చొట్ట రంగనాథర్ అని పిలువబడే శ్రీ రంగనాథర్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని ఉంచారు. 

ధండయాత్రలు ముగిసినప్పటికి నేటికినీ ఈ చొట్ట రంగనాథ స్వామికి పూజలు జరుపుతారు. 


💠 సంపతి ఋషి కోరిక మేరకు ఈ క్షేత్రములో స్వామి శెంబగవల్లి తాయారును ఉత్తర పాల్ఘుణి దినమున వివాహము చేసుకొన్నందున ఈ ఆలయములో వివాహములు జరుపుదురు. 

ఇచట వివాహము జరిగిన దంపతుల దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో సాగునని భక్తుల నమ్మకము. 


💠 స్థలపురాణము ప్రకారము బ్రహ్మ విష్ణూమూర్తికి అంకితము చేసిన యజ్ఞమును విజయవంతముగా పూర్తి చేసిన తరువాత యజ్ఞ కుండము నుండి కాంచిపురములోని శ్రీ వరదరాజ స్వామి ఉద్భవించారు. ఇప్పటికిని స్వామి తిరుముగముపై కాలిన మచ్చలు కనిపించును. 


💠 ఇచట రంగనాధ స్వామికి బ్రహ్మ పది దినముల ఉత్సవము జరిపెను. ఈ ఉత్సవమును మొదటి బ్రహ్మోత్సవముగా పరిగణించబడినది. ఈ కాలములో అనేక విష్ణు ఆలయములలో బ్రహ్మోత్సవములు జరుపుచున్నారు గాని ఇచట జరిగిన ఉత్సవము బ్రహ్మ జరిపిన మొదటి బ్రహ్మోత్సవమని పరిగణించబడినది. 


💠 ప్రధాన మూలవర్ ఉతర రంగనాధస్వామి భూదేవి, శ్రీదేవి సమేతముగా బ్రహ్మ నాభి స్థానములో శయన కోలములో కలరు. 

స్వామి వారి విగ్రహము శాలగ్రామ శిలతో చేయబడినది. 


💠 ఉత్సవ మూర్తి రంగనాధ స్వామి శ్రీదేవి భూదేవి సమేతముగా వేంచేసియున్నారు. 

వేరొక ఉత్సవ మూర్తి కస్తూరి రంగనాధ స్వామి కూడ ఇచట కలదు. 

ఈ ఉత్సవ మూర్తికి కూడ ప్రతి దినము ఆరాధన జరుగును. అమ్మవారు రంగనాయకి ప్రత్యేక సన్నిధి  భక్తులకు దర్శనము.


💠 ఈ ఆలయములో శ్రీ రాములవారు, నవనీత కృష్ణుడు, ఆండాళ్, ఆంజనేయుడు, రామానుజలవారు, మనవాల మామునిగళ్, కులశేఖర ఆళ్వార్, నమ్మాళ్వార్, గరుడాళ్వార్ సన్నిధులు ఆలయ ప్రాంగణములో కలవు. ఆలయ తీర్ధము వ్యాస తీర్ధము. 


💠 ఏప్రిల్-మే నెలల్లో బ్రహ్మోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి ఈ ఆలయంలో చాలా కోలాహలంగా జరుపుకుంటారు. 


💠 ఈ ఆలయం వెల్లూరు నుండి 24 కిలోమీటర్లు, చెన్నై నుండి 159 కిలోమీటర్లు దూరంలో ఉంది. 

ఈ ఆలయం వెల్లూరు నుండి కృష్ణగిరి మార్గంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

ఆదివారం,డిసెంబరు.14,2025.

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం,డిసెంబరు.14,2025.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

దక్షిణాయనం - హేమంత ఋతువు

మార్గశిర మాసం - బహుళ పక్షం

తిథి:దశమి రా8.34 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:హస్త ఉ10.59 వరకు

యోగం:సౌభాగ్యం మ2.50 వరకు

కరణం:వణిజ ఉ8.01 వరకు తదుపరి భద్ర రా8.34 వరకు

వర్జ్యం:రా7.37 - 9.21

దుర్ముహూర్తము:సా3.56 - 4.40

అమృతకాలం:తె5.59 నుండి

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 -1.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:కన్య

సూర్యోదయం: 6.25 సూర్యాస్తమయం:5.24  

*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*,

*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - హేమంత ఋతువు - మార్గశిర మాసం - కృష్ణ పక్షం - దశమి  - హస్త / చిత్ర -‌‌ భాను వాసరే* (14.12.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం