24, ఫిబ్రవరి 2026, మంగళవారం

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ:  కర్మ యోగము.


న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ।। 5 ।। 


ప్రతిపదార్థ:


 

న — కాదు; హి — నిజముగా; కశ్చిత్ — ఎవరూ కూడా; క్షణం — క్షణ కాలము; అపి — కూడా; జాతు — ఎప్పటికిని; తిష్ఠతి — ఉండుట; అకర్మ-కృత్ — కర్మ చేయకుండా; కార్యతే — చేయబడును; హి — తప్పకుండా; అవశః — నిస్సహాయంగా; కర్మ — పని; సర్వః — అన్నీ; ప్రకృతి-జైః — భౌతిక ప్రకృతి జనితములైన; గుణైః — గుణముల చేత. 

 

 తాత్పర్యము :   


ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి, అన్ని ప్రాణులు తమతమ ప్రకృతి జనితమైన స్వభావాలచే (త్రి-గుణములు) ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును.



 వివరణ:


కొంత మంది కర్మ అనగా వృత్తి ధర్మము మాత్రమే అనుకుంటారు, అంతేకానీ రోజువారీ పనులైన తినటం, త్రాగటం, నిద్రపోవటం, నడవటం, మరియు ఆలోచించటం వంటివి కూడా కర్మ అని అనుకోరు. కాబట్టి తమ వృత్తిని విడిచిపెట్టినప్పుడు, ఏమీ పనులు చేయటం లేదు అనుకుంటారు. కానీ, శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే అన్ని పనులనూ శ్రీ కృష్ణుడు కర్మలుగానే పరిగణిస్తాడు. అందుకే, ఒక్క క్షణమైనా పూర్తి క్రియా రహితంగా ఉండటం సాధ్యం కాదని అర్జునుడికి చెప్తున్నాడు. ఊరికే కూర్చున్నా సరే, అదొక క్రియ; పడుకుంటే, అది కూడా ఒక క్రియ; మనం నిద్ర పొతే, మనస్సు స్వప్నాల్లో నిమగ్నమవుతుంది; గాఢ నిద్రలో కూడా గుండె మరియు ఇతర శారీరక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి, మనుష్యులకు పూర్తి క్రియా రహిత స్థితి అసాధ్యము అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు, ఎందుకంటే ఈ యొక్క శరీరము-మనస్సు-బుద్ధి వ్యవస్థ తన యొక్క స్వీయ త్రిగుణముల (సత్వ-రజో-తమో గుణములు) చేతనే ఏదో ఒక పని చేయటానికి ప్రేరేపింపబడుతుంది. శ్రీమద్ భాగవతంలో ఇలాంటిదే ఒక శ్లోకం ఉంది.


న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మ-కృత్

కార్యతే హ్యవశః కర్మ గుణైః స్వాభావికైర్బలాత్ (6.1.53)


‘ఎవ్వరూ కూడా ఏ పనీ చేయకుండా ఒక్క క్షణమైనా ఉండలేరు. ప్రతివారూ తమ ప్రకృతి గుణములచే ప్రేరేపింపబడి అప్రయత్నంగా కర్మలు చేస్తారు’

రామోవిగ్రహవాన్ ధర్మ

 రామోవిగ్రహవాన్ ధర్మ

శ్రీరాముడుధర్మవిగ్రహుడు


 శ్రీ్రామునినడతధర్మం

అన్నదమ్ములపైప్రేమ ఆదర్శధర్మం!

గురువుల ఆజ్ఞ పాటించినధర్మం

మునులను కాపాడిన ధర్మం

తండ్రి సమక్షంలో సీతమ్మనుపెండ్లి ఆడటం

వివాహధర్మం

రామప్రభుతండ్రిమాట

తలదాల్చటంధర్మం

నదినిదాటించినగుహునితో స్నేహధర్మం

రాక్షస సంహారం ప్రభుధర్మం

హనుమంతునిపై అనురాగం

సుగ్రీవునితోస్నేహధర్మం

వాలిని 

 చంపటంరాజధర్మం వానరసహయముతోాావరావణునిచంపటంఅవతారధర్మం

సీతమ్మతోఅయోధ్య చేరటం

అయోధ్యపాలనలో రాజధర్మం

ధర్మరక్షణకేరాముని అవతారం

శ్రీరామచంద్రునిధర్మావతారం🙏🙏🙏🙏

జయలక్ష్మి పిరాట్ల

శూర్పణఖ

 అలాగే శూర్పణఖ రాక్షసి కూడా అన్నరాక్షసునితో  

అన్నా ! ఆ రాముడు బాణం తియ్యడం కానీ సంధించడం కానీ వదలడం కానీ చూడలేదన్నయ్యా ! ఒక్కడే పదునాలుగు వేలమంది ఖరదూషణాది రక్కసిమూకని 72 నిమిషాల్లో చంపి దండకవనాన్ని పీనుగుల పెంటగా చేసేసి ఋషులకు మునులకు పరమశాంతిని చేకూర్చాడంటుంది..

ఆ పరాక్రమసౌందర్యాన్ని చూస్తుంటే నాలాంటి వాడికి కనులు చమర్చినవండి 🙏🙏

సుఖమే స్వర్గము

  


    (సుఖమే స్వర్గము. దుఃఖమే నరకము. సర్వవిధాలా దుఃఖాన్ని తొలగించుకోవాలి)



శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                           ------------


ఇప్పటివరకు అనుభవించిన దుఃఖాలేవో అనుభవించాము.

ఈ క్షణం నుండి దుఃఖమును అనుభవించకూడదు (హేయం దుఃఖమనాగతం)

అంటున్నది యోగ శాస్త్రం.


యోగ శాస్త్రం ఇంకా ఈ విధంగా చెబుతున్నది:

ప్రాపంచిక విషయాలు చాలా బలవంతమైనవి. ఇంద్రియములకు విషయములైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములన్నింటిలోనూ, మనకు ఇష్టమో అయిష్టమో ఉంటుంది. 

రాగ ద్వేషములనబడే ఆ ఇష్టానిష్టాలననుసరించి మనం ఆ,యా, విషయాలలో ప్రవర్తిస్తూ ఉంటాం.

రాగం వల్ల పుణ్య కర్మలు, ద్వేషం వల్ల పాప కర్మలు చేస్తాం. 

పుణ్య కర్మల వల్ల సుఖము, పాప కర్మల వల్ల దుఃఖము కలుగుతాయి. 

సుఖం వల్ల మళ్లీ ఆ విషయములందు రాగము,దుఃఖము వల్ల ఆ విషయములందు ద్వేషము కలుగుతాయి. 

రాగము వల్ల మళ్లీ పుణ్యకర్మలు, ద్వేషం వల్ల మళ్లీ పాప కర్మలు, చేస్తాం.

వాటిఫలితంగా మళ్లీ సుఖ దుఃఖాలు, ఈ విధంగా జనన మరణాలతో కూడిన సంసార చక్రం అనంతంగా పరిభ్రమిస్తూ ఉంటుందని యోగ శాస్త్రము చెబుతోంది.

విషయములచే ఆకర్షింపబడిన ఇంద్రియాలు బలవంతంగా మనస్సును విషయములలో ప్రవర్తింప జేస్తాయి.

ఎంత ప్రయత్నం చేసినా,ఎంత పండితుడినైనా ఇంద్రియాలు లొంగదీసుకుంటాయి, అని శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు.


శ్లో// యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత:/

ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః//

( ఓ అర్జునా!మోక్షం కొఱకు తీవ్ర ప్రయత్నం చేస్తున్న మహా పండితుడినైనా, బలవంతమైన ఇంద్రియములు, బలాత్కారంగా వాని మనస్సును ఆకర్షించి సంసారంలో పడవేయును).


కాబట్టి ఈ విషయంలో సామాన్య ప్రయత్నం చాలదు. 

గొప్ప ప్రయత్నం చెయ్యాలి.

" సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో

 దృఢ భూమి: " (పతంజలి మహర్షి)

(ఆ ప్రయత్నం చాలకాలము, నిరంతరము తపస్సు, జపము, దేవతారాధన మొదలైన సత్కర్మలను ఆచరిస్తూ దృఢపరచు కొనవలెను)


ఆ ప్రయత్నం కూడా ఎప్పుడో ముసలితనం

వచ్చాక " కృష్ణా", "రామా" అనుకుంటామంటే, సాధ్యపడదు. 

వార్ధక్యంలో దేహము యోగ సాధనకు సహకరించదు కాబట్టి, ముసలితనం రాక ముందే గట్టి ప్రయత్నం చెయ్యాలి, అంటున్నారు భర్తృహరి మహాయోగి.


శ్లో// యావత్ స్వస్థమిదం శరీర మరుజం యావచ్చ దూరే జరా/

యావచ్చేంద్రియ శక్తి రప్రతిహతా యావత్ క్షయో నాయుష:/

ఆత్మ శ్రేయసి తావదేవ విదుషా కార్య:ప్రయత్నో మహాన్/

సందీప్తే భవనేతు,కూప ఖననం ప్రత్యుద్యమ:కీదృశ://


(ఈ శరీరములో ఆరోగ్యము, స్వస్థత ఉన్నప్పుడే,ముసలితనం రాక ముందే, ఇంద్రియ పాటవం తగ్గక ముందే, ఆయుర్దాయము క్షీణింపక ముందే, తెలివి గలవాడు, తన శ్రేయస్సు కోసం మోక్షప్రాప్తికి, గొప్ప ప్రయత్నం చెయ్యాలి. దేహంలో అన్ని శక్తులు నశించిన పిదప,ప్రయత్నంచేయడము అంటే, ఇల్లు తగలబడి పోతున్నప్పుడు, నీటి కోసం అప్పుడు బావి త్రవ్వడం మొదలు పెట్టడం వంటిది).


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

24-2-'26.

సామెతలు

 *సామెతలు*

1)సర్వేజనా స్సుఖినోభవన్తు అంటే, సర్వే వాళ్ళేనా ? మాసంగతేమిటి ? అని అన్నారుట రెవెన్యూ వాళ్ళు.😄

2) సెహబాస్ మద్దెలగాడా ! అంటే ఆనందంతో ఐదు వ్రేళ్ళూ పగులకొట్టుకొన్నాట్ట.😄

3) రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే బిడ్డలు పుడతారంటే చుట్టుచుట్టుకూ పొట్టని చూసుకొందట ఒకావిడ😁

తల నొప్పిగా ఉంది అంటే


బామ్మ గారు తల నొప్పిగా ఉంది అంటే వేడి చేసి వచ్చిందేమో అని ఇంత పంచదార వేసి గ్లాస్ నిండా చిక్కటి మజ్జిగ ఇచ్చే వారు. దెబ్బ కి తల నొప్పితో పాటు నీరసం కూడా తగ్గేది.


కడుపు నొప్పి వస్తే కాసింత శొంఠి పొడుం వేడివేడి అన్నంలో తొలి ముద్ద గా తినమని చెప్పవారు లేదా రెండుమూడు వాము ఆకులు నమిలి గోరు వెచ్చని నీళ్లు తాగమని చెప్పవారు. వారు చెప్పినట్టు చేసే వాళ్ళం దెబ్బకి కడుపు నొప్పి వస్తే వొట్టు.


అలాగే పిప్పి పంటికి లవంగం బుగ్గన పెట్టుకో మనేవారు.


జలుబు చేస్తే వెల్లుల్లి పాయ కారంపొడి పెట్టేవారు.


దగ్గు వస్తే కరక్కాయ బుగ్గన పెట్టుకోమని చెప్పేవారు.


జ్వరం వస్తే జీలకర్ర కాషాయం. రొంప జ్వరం ఉంటే మిరియాలు కాషాయం తో లంకణం పరమ ఔషధం అనిచెప్పి ఆరోజు అంతా భోజనం పెట్టేవారు కాదు మరునాటికి జ్వరం ఉంటే ఒట్టు.


మలబద్ధకం గా ఉంటే గోరు వెచ్చగా నీళ్లు తాగించే వారు. మోషన్స్ అయితే పల్చగా మజ్జిగ చేసి అందులో పంచదార ఒక నాలుగు చెంచాలు వేసి ఇచ్చే వారు.


జుట్టు ఊడుతుంటే కుంకుడు కాయ తో పాటు ఇన్ని మందారు ఆకులు ను మెత్తగా దంచి తలంటు పోసుకునే వారు.జుట్టు నిగ నిగ లాడుతూ పెరిగేది.


గుండెల్లో మంట గా ఉంటే 

పంచ దార నీళ్లు లేదంటే మజ్జిగ తేట ఇచ్చే వారు.


వడ దెబ్బ తగలకుండా ఇన్ని దబ్బాకులు వేసిన మజ్జిగ బయటకు వెళ్లి వచ్చాక ఇచ్చేవారు..



ఇలా ఇలా అనేక చిట్కాలు... అనేక రోజులు అనుభవం తో నేర్చుకున్న ఇంటి వైద్యాలు...


తలుచుకుంటే అప్పటి వారి మెడికల్ box ఏమిటి అంటే పోపుల పేట్టే...

దురాశ

 


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


' దురాశ ' మనిషిని కట్టుబానిసగా చేసి ఎలా ఆడిస్తుందో శ్రీ భర్తృహరి మహాయోగి ఇలా తెలియజేస్తున్నారు.


శ్లో// ఖలోల్లాపాః సోఢాః కధమపి తదారాధన పరై:/

నిగృహ్యాంతర్బాష్పం హసిత మపి శూన్యేన మనసా/

కృతో విత్త స్తంభ ప్రతిహత థియా మంజలి రపి/

త్వమాశే! మోఘాశే! కిమపరమతో నర్తయసి మామ్//


(నీచులకు సేవ చేస్తూ వారి దుర్భాషలన్నీ సహించాను. 

అవమానకరమైన వారి మాటలకు పొంగి పొంగి వస్తున్న కన్నీళ్లను లో లోపలే మ్రింగుకుంటూ శూన్యమైన మనస్సుతో పైకి వెడ నవ్వు నవ్వాను. 

అహంకారంతో మదించిన ధనవంతులకు(ఈ పదంతో అధికారంలో ఉన్నవారు కూడా సూచింపబడ్డారు) రెండుచేతులూ జోడించి నమస్కారాలు చేశాను.

ఓ పనికిమాలిన ఆశా!నాచేత ఇంకా ఏమి ఆటలు ఆడిస్తావు?).


చ// పలువలు పల్కుమాట లొకభంగి సహించితి, బాష్పవారి లో /

పలనె హరించి శూన్యమగు భావమునన్ వెడనవ్వు నవ్వితిన్ /

బొలుపఱి విత్తజాడ్య హత బుద్ధుల కంజలి చేసితిం గటా /

తలకక యింక నేపనికి దార్చెదు నన్ను దురాశ నీవిటన్ //

(ఏనుగు లక్ష్మణకవి)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

24-2-'26.

నేటి వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - సప్తమి & అష్టమి - కృత్తిక -‌‌ ‌భౌమ వాసరే* (24.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

24ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

 *🌹24ఫిబ్రవరి2026🌹*    

   *దృగ్గణిత పంచాంగం* 

                       

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

  *ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి      : సప్తమి* ‌ఉ 07.01 *అష్టమి* రా.తె 04.51 ఉపరి *నవమి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : కృత్తిక* మ 03.07 వరకు ఉపరి *రోహిణి*

*యోగం  : ఐంద్ర* ఉ 07.24 *వైధృతి* రా.తె 04.26 ఉపరి *విష్కుంబ*

*కరణం   : వణజి* ఉ 07.01 *భద్ర* సా 05.56 ఉపరి బవ రా.తె 04.51 వరకు ఆపైన *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

             *-ఈరోజు లేవు-*

అమృత కాలం  : *ఉ 12.51 - 02.22*

అభిజిత్ కాలం  : *ప 11.57 - 12.44*

*వర్జ్యం            : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 08.49 - 09.36 రా 11.07 - 11.56*

*రాహు కాలం  :మ03.17- 04.45*

గుళికకాళం      :*మ 12.21 - 01.49*

యమగండం    : *ఉ 09.25 - 10.53*

సూర్యరాశి : *కుంభం*                        

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 06.38*  

సూర్యాస్తమయం :*సా 06.21*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ 06.29 - 08.49*

సంగవ కాలం       :*08.49 - 11.10*

మధ్యాహ్న కాలం    :*11.10 - 01.31*

అపరాహ్న కాలం   :*మ 01.31- 03.52*

*ఆబ్ధికం తిధి  :ఫాల్గుణ శుద్ధ అష్టమి*

సాయంకాలం      :*సా03.52 - 06.13*

ప్రదోష కాలం       :*సా 06.13 - 08.40*

రాత్రి కాలం       :*రా 08.40 -11.56*

నిశీధి కాలం      :*రా 11.56 - 12.45*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.50 - 05.39*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*రామరిణా కృతహృతౌ* 

*జనకాత్మజాయా*

*లంకాస్థితా జనకజేతి* 

*సుశోధకారిన్*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పంచాంగం