ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
24, మార్చి 2026, మంగళవారం
శ్రీ ఆంజనేయం
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
💥హనుమ నామస్మరణం...సర్వపాప నివారణం💥
మనోజవం మారుత తుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
వాతాత్మజం వానర యూధ ముఖ్యం
శ్రీరామ దూతం శిరసానమామి
🌹వాయువేగ మనో వేగాలతో ప్రయాణించ గలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతుడు,
అందరిలోకి ఉన్నతుడు, వాయుదేవుని పుత్రుడు, వానర యోధులలోకెల్లా ముఖ్యుడు, శ్రీరామ దూత అయిన ఆంజనేయునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం.
ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తే సకల భయాలు పోతాయి.
B
భక్తి, శ్రద్ధలతో ఆంజనేయస్వామి ఆరాధన అన్ని రకాల శుభాలను ఇస్తుంది. భయాలను పోగొడుతుంది.🌹🌹
రామాయణం - 11)
శ్రీరామ (18 )
( వాల్మీకి రామాయణం - 11)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(23-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)
విశ్వామిత్రుని యాగ సంరక్షణ అయిన మరుసటి రోజు, రామ లక్ష్మణులు, ప్రాతః కాల సంధ్యావందనాది నిత్యకృత్యములు ఆచరించి విశ్వామిత్రునకు నమస్కరించారు.
శ్లో// ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ/
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్//
( ఓ ముని శ్రేష్ఠా! ఇదిగో నీ కింకరులమైన మేము వచ్చాము. ఏమి చేయవలెనో మమ్ము ఆజ్ఞాపించుము).
ఆ విధంగా రామ లక్ష్మణులు అనగానే,విశ్వామిత్రుని అనుజ్ఞ తీసుకుని అక్కడ ఉన్న మహర్షులు, వారితో ఇలా అన్నారు.
" మేమందరము, మిథిలా పట్టణములో, జనకమహారాజు చేస్తున్న యజ్ఞం చూడాలనుకుంటున్నాము.
ఆ జనక మహారాజు దగ్గర అద్భుతమైన శివ ధనస్సు ఉన్నది.
శ్లో//నాస్య దేవా న గన్ధర్వా నాసురా నచ రాక్షసా:/
కర్తు మారోపణం శక్తా న కథంచన మానుషా://
(దేవతలుగాని, గంధర్వులుగాని,అసురులు,రాక్షసులు గాని,ఆ వింటికి శరము సంధించటం, కాదు గదా, కనీసం ఆ ధనస్సును వంచి నారిని కూడా కట్టలేరు.ఇక మనుష్యుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు).
వంశ పారంపర్యంగా జనక వంశీయుల చేత పూజలందుకుంటున్న ఆ ధనస్సును, యజ్ఞమును,నీవు కూడా చూద్దువుగాని. మాతోబాటు మిథిలా నగరానికి, మీ ఇరువురు రండి."
అన్నారు.
సంతోషముతో సమ్మతించిన, రామ లక్ష్మణులతోను, ఋషిగణముతోను,విశ్వామిత్ర మహర్షి, సిద్ధాశ్రమ వనదేవతలను పూజించి,ప్రేమతో తమను అనుసరించి వస్తున్న మృగములను,పక్షులను,వెనుకకు పంపించి, మిథిలా పట్టణానికి ప్రయాణం అయ్యాడు.
అనేక దివ్యమైన పుణ్యగాధలను వినిపిస్తూ, దీర్ఘ ప్రయాణము తరువాత విశ్వామిత్రమహర్షి, మిథిలా నగర ప్రవేశం చేశారు.
ఆ నగరాధి దేవతకు నమస్కరించారు.
వారంతా ఆ పట్టణ సమీపమున పాడుబడి ఉన్న ఒక ఆశ్రమాన్ని చూచారు.
ఆ ఆశ్రమాన్ని గురించి రాముడు అడుగగా మహర్షి ఈ విధంగా చెప్పారు.
" రామా! పూర్వము ఇది దివ్యమైన ఆశ్రమము.
అహల్యాదేవీ సమేతుడై గౌతమమహర్షి ఇక్కడ అనేక సంవత్సరములు తపస్సు చేశాడు.
ఒక రోజు గౌతమ మహర్షి నదీ స్నానమునకు వెళ్ళినప్పుడు, దేవేంద్రుడు, గౌతముని రూపంలో, రహస్యముగా ఆశ్రమంలో ప్రవేశించి, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యతో సంభోగించాడు.
అతడు ఇంద్రుడని తెలిసినా కామం వల్ల ఏర్పడిన బలహీనత వల్ల,అహల్యాదేవి అడ్డు చెప్పలేదు.
ఇంతలో స్నానం పూర్తి చేసుకుని ఆశ్రమానికి వచ్చిన గౌతమ మహర్షి, తన రూపంతో ఆశ్రమం నుండి బయటకు వస్తున్న దేవేంద్రుని చూచాడు.
జరిగిన దుష్కృత్యాన్ని గ్రహించి తీవ్రమైన కోపంతో " నీ వృషణములు పడిపోవుగాక " అని దేవేంద్రుని శపించాడు.
శ్లో//గౌతమే నైవ ముక్తస్య స రోషేణ, మహాత్మనా/
పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్//
(గౌతముడు ఈ విధంగా కోపంతో శపించగానే, దేవేంద్రుని వృషణములు, తక్షణమే,నేలపై పడి పోయినవి)
ఉత్తమమైన తపస్సు ఆచరిస్తున్నా, మనోనిగ్రహము సాధించలేక అధర్మకార్యం చేసిన అహల్యను, "చాలా కాలం పాటు, ఎవరికీ కనిపించకుండా, వాయు భక్షణ చేస్తూ ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండు.
శ్లో//యదా చై తద్వనం ఘోరం రామో దశరథాత్మజః/
ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి//
(నరసంచారంలేకుండా భయంకరంగా అయిన ఈ వనానికి దశరథ కుమారుడైన రాముడు ఎప్పుడు వస్తాడో, అప్పుడు నీవు కల్మషములన్నీ పోయి,పవిత్రురాలవు కాగలవు) "
ఈవిధంగా ఇంద్రుని, అహల్యను,శపించి, గౌతమ మహర్షి, ఆశ్రమమును విడిచిపెట్టి, తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతములకు,వెళ్ళాడు.
నాయనా!రామా! పుణ్యాత్ముడైన ఈ గౌతముని ఆశ్రమంలో ప్రవేశించు.
అత్యంత సౌందర్యవతి,గొప్ప సౌభాగ్యవతి, అయిన అహల్యను తరింపజేయుము" అన్నాడు.
ఆ మాటలు విని లక్ష్మణ సమేతుడైన రాముడు, విశ్వామిత్రుని వెనుక నడచుచు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు.
ఆ ఆశ్రమంలో రాముడు అడుగు పెట్టగానే,
గౌతముని శాపం సమాప్తమైనది.
దివ్యకాంతులతో అహల్యాదేవి కనిపించింది.
తపస్సు చేత అమె దివ్యతేజస్సుతో మెరిసిపోతోంది.
దేవాసురమానవులు, కనులు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని చూడ లేకుండా వున్నారు.
శ్లో//శాపస్యాంతముపాగమ్య తేషామ్ దర్శన మాగతా/
రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా//
(గౌతమ మహర్షి శాపం తొలగి పోవడంవల్ల, రామ లక్ష్మణులకు అహల్యాదేవి కనిపించింది. వారిద్దరూ ఆమె రెండు పాదములను పట్టుకుని నమస్కరించారు).
అహల్యాదేవి గౌతమ మహర్షి వచనములను స్మరించి, శాస్త్రంలో చెప్పిన ప్రకారం వారికి,మిక్కిలి భక్తి,శ్రద్ధలతో ఆర్ఘ్య పాద్యాలుఇచ్చి, అతిధి పూజ చేసింది.
రాముడు ఆ అతిధి పూజ స్వీకరించాడు.
తత్ క్షణమే గౌతమ మహర్షి అక్కడ ప్రత్యక్షమైనాడు.
పరమానందంతో అహల్యను తిరిగి స్వీకరించాడు.
ఆ శుభ సమయంలో,
శ్లో//పుష్ప వృష్టి ర్మహ త్యాసీత్ దేవ దుందుభి నిస్స్వనై:/
గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమ://
(దేవ దుందుభులు మ్రోగినై. పుష్పవృష్టి కురిసింది. గంధర్వులు, అప్సరసలు, ఆట పాటలతో సమాగమమయ్యారు).
శ్లో//సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్/
తపోబల విశుధ్ధాంగీం గౌతమస్య వశానుగామ్//
(తపోబలంతో పవిత్రురాలైనది, గౌతమ మహర్షితో కూడినది, అయిన ఆ అహల్యాదేవిని "బాగు, బాగు" అని నుతిస్తూ దేవతలందరూ పూజించారు)
ఆ తరువాత గౌతమ మహర్షి, అహల్యాదేవితో కలిసి రాముని యధావిధిగా పూజించాడు.
యథా శాస్త్రముగా చేయబడిన ఆ పూజను రాముడు స్వీకరించాడు.
ఆ విధంగా వారిద్దరి అతిధ్యము స్వీకరించిన రామ లక్ష్మణులు, విశ్వామిత్రమహర్షి, మిక్కిలి ఆనందముతో మిథిలా పట్టణానికి వెళ్లారు.
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శా న్తి శ్శాన్తి శ్శాన్తిః
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
24-3-'26
క్రియాశీలకత్వం
క్రియాశీలకత్వం అంటే ఏదైనా పనిచేయాలనే భావన. మనుషులు శక్తిమంతులు చురుకుదనం కలవారికి మాత్రమే క్రియాశీలకత్వం ఉంటుంది. క్రియాశీలకత్వం వున్న మనుషులు ఎల్లప్పుడూ చురుకుగా ఆలోచిస్తూవుంటారు. ఏ కార్యం చేస్తే ఏ ఫలితం వస్తుంది అని ఆలోచించి తదనుగుణంగా ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారు.
క్రియా శీలకత్వమే లక్ష్మీదేవి నివాసాలు ఇది వినటానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నది కదా కానీ ఇది ముమ్మాటికీ నిజం. ముందుగా త్రిమూర్తులను గూర్చి తెలుసుకుందాము. మొదటగా బ్రహ్మగారు ఆయనగారు సృష్టి రచన చేస్తారు అది మనందరికీ తెలుసు. ఆయన ధర్మపత్ని సరస్వతీదేవిగారు అమ్మగారు చదువుల తల్లి. సృష్టి రచనచేయటానికి కావలసింది జ్ఞ్యానం అందుకే ఆయనకు సహధర్మచారిణిగా వున్న తల్లి చదువుల తల్లి, తరువాత విష్ణుమూర్తిగారు ఆయన స్థితికారకుడు అంటే బ్రహ్మ సృష్టించిన సృష్టిని నిర్వహించే (మేనేజ్) దేముడు ఒక సంస్థానిర్వహించాలంటే కావలసింది ధనం అంటే సంపద కాబట్టి ఆయనగారి ధర్మపత్ని లక్ష్మీదేవిగారు ఆ తల్లి సకల సంపదలకు కారకురాలు. ఇక మూడవ దేవుడు పరమశివుడుగారు ఆయన పని లయకారకుడు అనగా సృష్టిని నశింపచేయటం అట్లా చేయాలంటే కావలసింది శక్తీ శక్తిలేకుండా వినాశనం జరగదు అది మనందరికీ తెలుసు అందుకే ఆ దేవదేవుడు పత్ని పార్వతీదేవి ఆ తల్లి శక్తి స్వరూపిణి. ఇటువంటి క్రమాన్ని మనకు అందించిన వేదాలు, మన మహర్షులు ఎంతటి మేధావులొకదా
యతిభావం తత్ భవతి అనే ఆర్యోక్తి ననుసరించి మనం ఏ దేవుడిని లేక ఏదేవతను ఆరాధిస్తామో ఆ దేవీదేవతలు మనకు ప్రసన్నలై వారి ఆధిపత్యంలో వున్న శక్తిని మనకు ప్రసాదిస్తారు. అంటే చదువు కొరకు సరస్వతి అమ్మవారిని, సంపదలకొరకు లక్ష్మి అమ్మవారిని అదేవిధంగా శక్తికొరకు పార్వతి తల్లిని మనం కొలవటం కద్దు.
ప్రతి పురుషుని ప్రయోజకత్వంలో తన ధర్మపత్ని సహాయసహకారాలు ఉంటాయి అంతేకాదు నడిపేశక్తి కేవలం అంటే కేవలం స్త్రీమూర్తిదే అదే మనం మనదేవుళ్ల ద్వారా తెలుసుకోవచ్చు.
ఇక విషయానికి వస్తే క్రియాశీలత్వము అంటే ఒక కార్యం చేయాలనే భావన ఆ భావనే మనం లక్ష్మి అమ్మవారుగా భావించవచ్చు అదెట్లాగో తెలుసుకుందాం.
నీవు నీ ఇంటిని వదిలి ఏదో ఊరుకు వెళ్లి కొంతకాలం తరువాత తిరిగి వచ్చావు అప్పుడు తలుపు తీయంగానే ఇల్లు మొత్తం దుమ్ము దూళితో పేరుకొని వుంది నీ శ్రీమతి వెంటనే మీరు కాసేపు బయట వుండండి ముందు ఇల్లు ఊడుస్తాను అని అనటం పరిపాటి. ఇల్లు ఊడవాలి అనే భావనే క్రియాశీలత్వం దానిని అమలు చేసినతరువాతే అంటే ఊడ్చిన తరువాతే ఇల్లు పరిశుభ్రంగా వున్నది. ఇటువంటివి కోకొల్లలుగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మానధర్మంలో గృహిణిని గృహలక్ష్మి అని పేర్కొన్నారు అని అనిపిస్తుంది.
ఫలానా వారి అబ్బాయికి పెండ్లి అయిందిగా వాళ్ళ కోడలిని చూసావా యెట్లా ఉంటుంది అని ఒకామె అడిగితె దానికి ఆమె స్నేహితురాలు ఇచ్చే జవాబు అమ్మాయి చక్కగా వుంది సాక్షాత్తు లక్షిం దేవిలా వుంది అనటం మనం చూస్తూ ఉంటాము. నిజానికి ప్రపంచంలో ఎవ్వరు లక్ష్మి అమ్మవారిని చూడలేదు మరి ఎలా అలా అంటారు అంటే మనం లక్ష్మి అమ్మవారికి కొన్ని గుణాలను ఉంటాయి అని తెలుసుకున్నాము కాబట్టి అటువంటి సద్గుణాలు వున్న స్త్రీలను ఆ తల్లితో పోలుస్తూవుంటాము.
ప్రతి గృహస్తు తన దైనందిక జీవితాన్ని సుఖవంతంగా గడపటానికి ఏ ఉద్యోగమో, వ్యాపారమో చేయక తప్పదు. గడియారం ముల్లులాగా పరిగెత్తక తప్పదు అందుకే లక్ష్మీదేవిలాంటి సహధర్మచారిణి లభించి ప్రతి విషయంలోనూ తనక్రియాశీలకత్వాన్ని చూపెడితే ఆ పురుషుడు పురుషార్ధాలను సాధించగలడు.
భర్త ఏదైనా కార్యార్థిగా వెళుతుంటే తన కార్యం సఫలంకావాలనే ఆపేక్షతో పత్నిని ఎదురు రమ్మనటం మన సాంప్రదాయం దానికి అర్ధం తన భార్య లక్ష్మి దేవిలాగా చక్కగా నుదిటిన కుంకుమ దిద్దుకొని, కురుల పువ్వులు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని మనోహారిగా ఉన్న భార్య ముఖకమలం చూసి తన కార్యోన్ముఖుడు అయితే ఆ రోజంతా మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండి తానూ చేసే పనిమీద మనసు లగ్నాత చేయగలడు. తత్వారా కార్యసిద్ధి కలుగుతుంది. మన సాంప్రదాయంలో స్త్రీలకు మహోన్నత స్థానాన్ని ఇచ్చారు
యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..' అంటే ఎక్కడ నారీ మణులు పూజింప బడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని.. భారత్‌లో పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పాయి. మన భారతీయ సంస్కృతీ స్త్రీ శక్తిని వేదకాలంలోనే పేర్కొన్నాయి. పురుషుని అభివృద్ధికి స్త్రీమూర్తే కారణం అదేవిధంగా స్త్రీ పౌభాగ్యానికి పురుషుడు కారకుడు.
లక్ష్మి నివాసాలు
గురు భక్తి .దేవ భక్తి .మాతాపితృ భక్తి .కలవారిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
అతి నిద్ర లేని వారిలో. ఉత్సాహం .చురుకుదనం. ఉన్నవారిలో లక్ష్మీకళ ఉంటుంది.
ముగ్గు. పసుపు .కుంకుమ. పువ్వులు .పళ్ళు .పాలు లక్ష్మి స్థానాలు.
దీపం .ధూపం .మంగళ ద్రవ్యాలు .ఆ తల్లికి నివాసాలు.
పాత్ర శుద్ధి శుభ్ర వస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారి నివాస స్థలం.
బుద్ధి .ధైర్యం .నీతి .శ్రర్థ.గౌరవించే స్వభావం .శాంతి. లక్ష్మి ని పెంచే శక్తులు.
సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం.
దీనిని పట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే లక్మి దేవి మంగళకారిని సకల శుభాలకు కారణం లక్షి అమ్మవారి ఆ తల్లి అంటే చురుకుదనం, ఉత్సాహం, సత్వగుణం, శాంత స్వభావం, నిజాయితీ, ధర్మాచరణ ఇటువంటి గుణాలు అంటే ఇవ్వన్నీ కూడా క్రియాశీలకత్వమే కానీ వేఱొక్కటి కాదు. భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి వారు క్రియాశీలకత్వాన్ని పెంపొందించుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించగలరు.
వేద ఆశీర్వచనం
*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*
*కలియుగాబ్ది 5126*
*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - షష్టి - రోహిణీ - బౌమ వాసరే* (24.03.2026)
ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు
*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.
.🙏🙏
భవదీయుడు
దశిక ప్రభాకరశాస్త్రి
9849795167
---------------------------------------------
*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*
హనుమఅశోక
🌸హనుమఅశోక వనంలో ఉన్న సీతాదేవిని దర్శించిన సందర్భం
కడలిని దాటియు హనుమయు కడువేగమునన్.ధరణిజ కడకేగియు నా
గడుసరి రక్కసుల దునిమి
కడకును రామునికథనిక కమ్మగచెప్పెన్
సాహితీ శ్రీ జయలక్ష్మి🌸రామలక్ష్మణులను హనుమ సుగ్రీవునికి పరిచయము చేయు సందర్భము
కనులారగతిలకింపుడు
జనితోడ్కొనితెచ్చితిటకు సంతోషముగన్
ఘనులగు దశరథ తనయులు
నినుకలయగవచ్చినారునృప సుగ్రీవా
సాహితీ శ్రీ జయలక్ష్మి
రామాయణ
శ్రీశ్రీశ్రీ
*ఇంటింటా రామాయణ*
*దివ్యకథా పారాయణము*
**
*6వరోజు*
*మహిమాన్విత* *సుందరకాండ కొనసాగింపు*
*రామయ్యకు శుభవార్త*
***
🌸🌸🌸🌸🌸
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.
***
మనోజవం మారుత తుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసా సమామి
***
లంకలోని అశోక వనం లో సీతామాత దర్శనం కలిగి, ఆమె ఆశీస్సులు అందడంతో హనుంతుడు పట్టరాని సంతోషంతో గంతులు వేశాడు. ఇక పనిలో పనిగా రావణునిచూసి రావణుడి శక్తిసామర్థ్యాలను తెలుసుకోవాలనుకున్నాడు. రావణుడితో ముఖాముఖి మాట్లాడాలనుకున్నాడు. అలాగే యుద్ధ వ్యూహంతో లంకను పరిశీలించాలని నిశ్చయించుకొన్నాడు. అలా చేయడం వల్ల రావణుడిని హెచ్చరించడానికీ, లంక రక్షణా వ్యవస్థను తెలుసుకోవడానికీ వీలవుతుందనుకున్నాడు. అంతే గాకుండా ఆ ప్రయత్నంలో లంకకు వీలయినంత నష్టం కలిగించవచ్చు నని భావించాడు. ఇలా సంకల్పించిన హనుమంతుడు వెంటనే ఉగ్రాకారుడై అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, అడ్డు వచ్చిన వేలాదిమంది రాక్షసులను పిడిగుద్దులు గుద్ది మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు.
ఈ వింత వానరాన్ని బంధించమని రావణుడు అపార సైన్యాన్నిపంపాడు. హనుమంతుడు వెంటనే,
*జయత్యతిబలో రామో,*
*లక్ష్మణశ్చ మహాబల:,*
*రాజా జయతి సుగ్రీవో,*
*రాఘవేణాభిపాలిత:,*
*దాసోహం కోసలేంద్రస్య,*
*రామస్యా క్లిష్ట కర్మణః,*
*హనుమాన్ శత్రు సైన్యానాం,*
*నిహన్తా మారుతాత్మజః అని* జయఘోష చేశాడు -
మహా బలవంతుడైన శ్రీరామునకు జయము.
మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణునకు జయము. రాఘవుల విధేయుడైన కిష్కింధ ప్రభువు సుగ్రీవునకు జయము.
నేను శ్రీరామ దాసుడను, వాయుపుత్రుడను, హనుమంతుడను. శత్రు సైన్యాన్ని నాశనం చేస్తాను. వేయి మంది రావణులైనా యుద్ధంలో నన్నెదిరించలేరు. వేల కొలది శిలలతోను, వృక్షాలతోను సకల రాక్షసులను, లంకాపురిని ఒక్కదెబ్బతో నాశనం చేస్తాను. నా పని ముగించుకొని, సీతమ్మకు నమస్కరించి వెళతాను. రాక్షసులు ఏమీ చేయలేక చూచుచుందురు గాక - అంటూ.... గర్జిస్తూ హనుమంతుడు లంక ముఖద్వారానికి బిగించిన ఇనుప గడియతో రాక్షసులనందరినీ చావ చితకగొట్టాడు. పర్వతాకారంలో దేహాన్ని పెంచి, చైత్య ప్రాసాదాన్ని కూలగొట్టి, ఆ ప్రాసాద పెద్ద స్తంభాన్ని పరిఘలా త్రిప్పుతూ అందరినీ చావగొట్టాడు.
అప్పుడు రావణుడు విషయం తెలుసుకుని, ప్రహస్తుని కుమారుడు, మహా బలశాలీ అయిన జంబుమాలిని పంపాడు. హనుమంతుని చేతి పరిఘతో జంబుమాలి శరీరం చూర్ణమయ్యింది. ఆపై అగ్నివలె తేజరిల్లే యుద్ధవిద్యా నిపుణులైన ఏడుగురు మంత్రి పుత్రులు పెద్ద సేనతో కలిసి హనుమంతునిపై దండెత్తారు. హనుమంతుడు భయంకరంగా గర్జించి కొందరిని అరచేతితోను, కొందరిని ముష్టిఘాతాలతోను, కొందరిని తన వాడిగోళ్ళతోనూ చంపగా లంకాపట్టణ వీధులు రాక్షసుల రక్త మాంసాలతో నిండిపోయాయి.
పిమ్మట విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు అనే గొప్ప సేనా నాయకులు తమ సేనలతో వచ్చి వన ముఖ ద్వారంపై కూర్చున్న హనుమంతునిపై విజృంభించారు. వారంతా కూడా హనుమ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రణ భూమి అంతా రాక్షస కళేబరాలతోను, ఆయుధ, రథ శకలాలతోను నిండిపోయింది.
*అక్షకుమారుడితో భీకరసమరం*
ఇక లాభం లేదనుకుని అక్షకుమారుడు సకలబలములతో హనుమంతుని సమీపించాడు. వారి మధ్య జరిగిన యుద్ధం సురాసురులను సంభ్రమపరచింది. అక్షకుమారుడు హనుమంతుడిపై బాణాల వర్షం కురిపించాడు. అవి హనుమంతుని చాలా నొప్పించాయి. అతని పరాక్రమానికి హనుమంతుడు ముచ్చటపడ్డాడు. అంతటి పరాక్రమశాలిని, తేజోమయుని చంపడానికి తటపటాయించాడు. కాని అతనిని ఉపేక్షిస్తే తనకు పరాభవం తప్పదని తెలిసికొని హనుమంతుడు విజృంభించాడు. ఆకాశానికెగిరి వాయువేగంతో సంచరిస్తూ అరచేతితో అక్షకుమారుని అతని గుర్రాలను చరచి చంపేశాడు. తరువాత, గరుత్మంతుడు మహా సర్పాన్ని పట్టుకొన్నట్లుగా అక్షకుమారుని కాళ్ళను గట్టిగా చేజిక్కించుకొని, గిరగిర త్రిప్పి నేలకు విసరికొట్టాడు. అక్షకుమారుని శరీరం నుగ్గునుగ్గయ్యింది.
*ఇంద్రజిత్తుతో యుద్ధం:*
అక్షకుమారుడు మరణించిన సంగతి తెలుసుకుని రావణుడు కలవరపడడ్డాడు. ఇదెక్కడి వానరం రా అని తలపట్టుకున్నాడు. పెక్కు జాగ్రత్తలు చెప్పి, తన కుమారుడైన ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు బ్రహ్మవర సంపన్నుడు. ఇంద్రాదులకు కూడా నిలువరింప శక్యంగాని పరాక్రమశాలి, మంత్ర తంత్ర యుద్ధవిద్యానిపుణుడు. అతడు తన తండ్రి యైన రావణాసురుడికి నమస్కరించి, రణోత్సాహంతో పొంగిపోతూ, సేనలు లేకుండా ఒకడే దివ్యరథాన్ని అధిరోహించి హనుమంతునిపైకి వెళ్ళాడు. వారిద్దరి మధ్య యుద్ధం చిత్ర విచిత్ర రీతులలో సకల గణాలకు సంభ్రమం కలిగించింది. ఒకరిని ఒకరు జయించడం అశక్యమని ఇద్దరికీ తెలిసిపోయింది. ఇక లాభం లేదు, కనీసం ఆ వానరుని బంధించాలని సంకల్పించి ,ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అది హనుమంతుని బంధించింది. బ్రహ్మ హనుమంతునకిచ్చిన వరం ప్రకారం ,ఆ అస్త్రం అతనిని బాధించకుండా మరుక్షణమే తొలగిపోయింది. అయినా బ్రహ్మదేవునిపట్ల గౌరవసూచకంగా ఆ అస్త్రానికి కట్టుబడిపోయినట్లుగా హనుమంతుడు నటించాడు. ఆ విధంగా రావణునితో మాట్లాడే అవకాశం దొరుకుతుందని హనుమ తాను బంధింపబడినట్టు నటించాడు. రాక్షస సేనలు హనుమంతుని రావణుని సభా ప్రాంగణానికి తీసుకుపోయాయి.
*రావణునితో సంవాదం :*
బ్రహ్మాస్త్రానికి వశుడైనట్లు నటించి, హనుమంతుడు రావణుని సభాభవనంలోకి ప్రవేశించి రావణుని చూశాడు. రావణాసురుని సభాప్రాంగణం మణిమయమై శోభిల్లుతున్నది. రావణుని కిరీటం, ఆభరణాలు, వస్త్రాలు, అత్యద్భుతంగా ఉన్నాయి. మహా తేజశ్శాలి, వీరుడును అయిన రావణుడు పది శిరస్సులు కలిగి ఉన్నాడు. దశ కంఠుడు. మణిమయాలంకృతమైన ఉన్నతాసనంపై కూర్చొని ఉన్నాడు. మంత్రాంగ నిపుణులైన నలుగురు మంత్రులచే పరివేష్టితుడై కాటుక కొండవలె ఉన్నాడు. అప్పుడు హనుమంతుడు ఇలా అనుకొన్నాడు. - ’ఆహా! ఈ రావణుని రూపం అత్యద్భుతం. ధైర్యం నిరుపమానం. సత్వం ప్రశంసార్హం. తేజస్సు అసదృశం. నిజముగా ఈ రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు. అధర్మానికి ఒడి గట్టకపోతే సురలోకానికి సైతం ఇతను ప్రభువయ్యేవాడు. లోకాలన్నీ ఇతనికి భయపడుతున్నాయి. ఇతడు కృద్ధుడైనచో సమస్త జగత్తునూ సముద్రమున ముంచి ప్రళయం సృష్టించగల సమర్ధుడు గదా!’ అని అనుకున్నాడు.
రావణుడు హనుమంతుడిని చూశాడు. కళ్లెర్ర చేసాడు.
హనుమంతుడు ఎవరు? ఎందుకు వచ్చాడు? ఇతనిని ఎవరు పంపారు? - తెలుసుకోమని రావణుడు తన మంత్రులను ఆదేశించాడు. హనుమంతుడు రావణునకు ఇలా చెప్పాడు - రాజా! నేను సుగ్రీవుడి మంత్రిని. రాముని దూతను. హనుమంతుడనే వానరుడను. నీ కుశలము తెలిసికొమ్మని సుగ్రీవుడు స్నేహ భావంతో చెప్పాడు. రాముని పత్ని అయిన సీతను అపహరించితెచ్చి నువ్వు పెద్ద తప్పిదం చేశావు. దీని వలన నీవు చేసుకొన్న పుణ్యమంతా నిష్ఫలమై పోతున్నది.
వాలి అంతటి వాడిని రాముడు సంహరించాడు. రాముని బాణాల ధాటికి నీవు గాని, మరెవరు గాని నిలువజాలరు. ఈ అకృత్యం వలన నీకూ,ఈ లంకకూ చేటు దాపురించింది. రాముడు మానవుడు. నీవు రాక్షసుడవు. నేను వానరుడను, నాకు పక్షపాతం లేదు. కనుక నా మాట విని సీతను రాముడికి అప్పగించి రాముని శరణు వేడుకో. రాముని క్రోధానికి గురియైనవానిని ముల్లోకాలలో ఎవరూ రక్షింపజాలరు. - అని హితవు చెప్పాడు.
ఆ మాట వింటూనే రావణుడు కోపించి ఆ వానరుని చంపమని ఆదేశించాడు. అంతలో విభీషణుడు అడ్డుపడి - దూతను చంపడం రాజ ధర్మం కాదు అన్నాడు. అంతే కాకుండా హనుమంతుడు తిరిగి వెళ్ళకపోతే ,సోదరా నువ్వు శతృవులతో యుద్ధం చేసి వారిని ఓడించే అవకాశం కోల్పోతావు. కనుక, హనుమంతుడిని దండించి వదిలివేయమని రావణుడికి విభీషణుడు సూచించాడు. ఆ మాటలకు కాస్త నెమ్మదించిన రావణుడు ఆ వానరుని తోకకు నిప్పంటించి ఊరంతా త్రిప్పమని ఆదేశించాడు..
*లంకా దహనం*
రాక్షస కింకరులు హనుమంతుని తోకకు పాత గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. ఊరంతా త్రిప్పసాగారు. ఈ అవకాశం చూసుకొని హనుమంతుడు లంకా నగరాన్ని నిశితంగా పరిశీలించాడు. జరిగిన సంగతి విన్న సీతాదేవి కలవరపడింది. హనుమంతుని చల్లగా చూడమని అగ్నిదేవుని ప్రార్థించింది. తన తోక కాలుతున్నా గాని ఏ మాత్రం బాధ లేకపోవడం సీతమ్మ మహిమ వలన అని, తన తండ్రి వాయుదేవుని మిత్రుడైన అగ్ని కరుణ వలన అని గ్రహించిన హనుమంతుడు ఆ అగ్నికి లంకను ఆహుతి చేయాలని సంకల్పించాడు. తన బంధాలను త్రెంచుకొని, ఒక పరిఘతో రాక్షస మూకను చావబాదాడు. పైకెగిరి, మండుతున్న సూర్యునిలా విజృంభించాడు. ప్రహస్తుని ఇంటితో మొదలుపెట్టి లంకలోని అద్భుతభవనాలకు వరుసగా నిప్పంటించాడు. ఒక్క విభీషణుని ఇల్లు తప్ప లంకలో భవనాలను అన్నిటినీ బుగ్గిపాలు చేశాడు.
అప్పుడు ఒక్కమారుగా సీత సంగతి గుర్తుకు వచ్చి హనుమంతుడు హతాశుడయ్యాడు.
తన తొందరపాటువలన లంకతో పాటు సీతమ్మ కూడా అగ్నికి ఆహుతయ్యిందేమో అన్న భయంతో విలవిలలాడిపోయాడు. తన చాంచల్యం వలన తన జాతికి, పనికి కీడు తెచ్చినందుకు రోదించి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. కాని సీత క్షేమంగా ఉన్నదని తెలిసి, ఊరట చెందాడు. మరొక్కమారు సీతమ్మవారిని దర్శించదానికి వెళ్ళాడు. ఆమెకు సాంత్వన వచనాలు పలికి, రాముడు సకల వానరసేనతో త్వరలో లంకపై దండెత్తి రాగలడని మరోమారు చెప్పి సీతమ్మ పాదాలకు నమస్కరించి, ఉత్తరదిశకు హనుమంతుడు తిరుగు ప్రయాణం అయ్యాడు .
ఇలా హనుమంతుడు ,రాముని దూతగా సాగరాన్ని లంఘించి, సీతమ్మను కనుగొని, రాక్షసులను సంహరించి, లంకాదహనం చేసి, రావణుని మదమణచి, సీతమ్మకు సాంత్వన కూర్చి, తిరుగు ప్రయాణానికి అరిష్టము అనే పర్వతాన్ని అధిరోహించాడు.
*తిరుగు ప్రయాణం:*
హనుమంతుడి పద ఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు.
మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు అంగదునకు ప్రణామం చేశాడు. హనుమంతుడు
*కనుగొంటి సీతమ్మను* అని అన్నాడు. ఆమె రాక్షసుల బందీయై, రాముని కొరకు ఎదురు చూస్తూ కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. *"కనుగొంటిని"* అన్న హనుమంతుడిమాటలతో వానరు లందరూ పరమానందము పొందారు. అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శన విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.
ఇంక అంతా కలసి వెళ్ళి లంకను నాశనం చేసి, రావణుని ఓడించి, సీతమ్మను తెచ్చి రామునకు అప్పగించాలని అంగదుడు అభిప్రాయపడ్డాడు. కాని జాంబవంతుడు అందుకు వారించి, ముందుగా జరిగిన సంగతిని రామునకు, సుగ్రీవునకు నివేదించడమే సరైనపని అని ఆ తర్వాత ఏం చేయాలో వారు సూచిస్తారని చెప్పాడు. అందరూ సంరంభంగా కిష్కింధకు బయలుదేరారు.
*మధువనం:*
సీత జాడ తెలియడం వలన అంగదాది వానరులంతా ఉత్సాహంగా హనుమంతుని వెంటబెట్టుకుని కిష్కింధకు బయలుదేరారు. దారిలో మధువనమనే మనోహరమైన వనాన్ని చేరుకొన్నారు. అది సుగ్రీవునిది. దధిముఖుడనే వృద్ధ వానర వీరుని పరిరక్షణలో ఉంది. అంగదుని అనుమతితో వానరులంతా ఆ వనంలో ఫలాలను కోసుకొని తింటూ, మధువులను గ్రోలుతూ, చిందులు వేస్తూ, వనాన్ని ధ్వంసం చేయసాగారు. అడ్డు వచ్చిన దధిముఖుని తీవ్రంగా దండించారు. దిక్కు తోచని దధిముఖుడు తన తోటి వన రక్షకులతో కలిసి వేగంగా సుగ్రీవుని వద్దకు ఎగిరిపోయి జరిగిన అకృత్యం గురించి మొరపెట్టుకొన్నాడు.
సీతాన్వేషణా కార్యం సఫలమయి ఉండకపోతే తన భృత్యులైన వానరులు అంతటి సాహసం చేయజాలరని సుగ్రీవుడు ఊహించాడు. వనభంగం అనే నెపంతో దధిముఖుడు సీతాన్వేషణా సాఫల్య సమాచారాన్ని ముందుగా సూచిస్తున్నాడని, శుభవార్త వినే అవకాశం ఉన్నదని రామలక్ష్మణులకు సుగ్రీవుడు చెప్పాడు. శుభవార్త తెలిపినందుకు దధిముఖుని అభినందించాడు. దధిముఖుడు మధువనానికి తిరిగి వెళ్ళి అంగదాదులతో సాదరంగా మాట్లాడి త్వరగా సుగ్రీవుని వద్దకు వెళ్ళమన్నాడు. అంగదుడు, హనుమంతుడు, తక్కిన బృందం రివ్వున ఆకాశానికెగిరి ఝంఝూమారుతంలాగా సుగ్రీవుని వద్దకు బయలుదేరారు.
*రాముడికి శుభవార్త*
*సీతమ్మ జాడ తెలుపుట:*
అంగదాది ప్రముఖులు, హనుమంతుడు మహోత్సాహంతో సుగ్రీవుడు, రామలక్ష్మణులు మొదలైనవారున్న ప్రస్రవణగిరిపై దిగారు. *దృష్టా దేవీ (చూచాను సీతమ్మను)* అని హనుమంతుడు చెప్పగానే రామలక్ష్మణులు మహదానంద భరితులయ్యారు. హనుమంతుని కార్య సాధనపై విశ్వాసము గల లక్ష్మణుడు సుగ్రీవునివంక ఆదరంగా చూశాడు. తక్కిన వానరుల ప్రోద్బలంతో హనుమంతుడు దక్షిణ దిక్కుకు తిరిగి సీతమ్మకు ప్రణమిల్లి, ఆమె ఇచ్చిన చూడామణిని రామునికి సమర్పించి, తన సాగర లంఘనా వృత్తాంతమును రామలక్ష్మణసుగ్రీవులకు వివరించాడు.
ఓ రామా! సీతామాత నిరంతరం నిన్ను స్మరిస్తూ రాక్షస స్త్రీల నిర్బంధములో దీనురాలై నిరంతరము నీకోసం ఎదురుచూస్తున్నది. అందరిని కుశలమడిగినది. నీవు అనతి కాలములోనే వచ్చి ఆమెను విముక్తురాలను చేసి స్వీకరిస్తావనే ఆశ మాత్రముననే జీవించియున్నది. ఒక నెల లోపల అలా జరగకుంటే తాను ప్రాణాలతో ఉండజాలనన్నది.
రామా! సింహ పరాక్రముడైన రాముని, ధనుష్పాణియైన లక్ష్మణుని త్వరలో లంకా ద్వారంలో చూడగలవని నేను సీతమ్మతల్లికి చెప్పి వచ్చాను. - అని హనుమంతుడు శ్రీరామునకు విన్నవించాడు.
******
రామాయణంలో సుందరకాండకు విశేషమైన స్థానం ఉంది.
బ్రహ్మాండ పురాణం రామాయణంలోని ఒక్కొక్క కాండం పారాయణానికి
ఒక్కొక్క ఫలసిద్ధిని పేర్కొంటూ సుందరకాండ గురించి ...
*"చంద్రబింబ సమాకారం వాంఛితార్ధ ప్రదాయకం*,
*హనూమత్సేవితం ధ్యాయేత్ సుందర కాండ ఉత్తమమ్* అని పేర్కొన్నది.
అంతటి మహిమాన్వితమైనది ఈ సుందర కాండ పారాయణం
***
ఆపదా మపహర్తారం ధాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్
***
నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందు నిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ
***
గోష్పదీకృత వారాశిం
మశకీకృత రాక్షసమ్
రామాయణ మహామాలా
రత్నం వందే అనిలాత్మజమ్.
*రామాయణ పారాయణం* *చేస్తున్న భక్తుని ఎదురుగా కూర్చుని అదృశ్య రూపంలో హనుమ పరవశంతో వింటాడని భక్తుల విస్వాసం.*
అటువంటి మారుతికి మరొక్కమారు భక్తితో
నమస్కారం.....
మనోజవం ,మారుతు తుల్యవేగం
జితేంద్రియం,బుద్ధిమతాం వరిష్టం.
వాతాత్మజం
వానర యూధ ముఖ్యం
శ్రీ రామ దూతం
శిరసా నమామి
*( మహిమాన్విత సుందరకాండ సమాప్తం)*
జీవుడే దేవుడన్న శ్రీ శంకరుల అద్వైతం)
శ్రీరామ (121)
శుభోదయం.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(జీవుడే దేవుడన్న శ్రీ శంకరుల అద్వైతం)
సమస్తమైన ఉపనిషత్తుల సారము ' ప్రేమ '
ప్రతి జీవుడు తనకు తెలియకుండానే తనను తాను ప్రేమిస్తాడు.
అంటే ప్రతి జీవిలోను ప్రేమ ఉంది.
మనలో ప్రేమ అనేది ఉండబట్టే భార్యా పిల్లలనుగాని, ఇతర జీవులనుగాని, ప్రేమించ గలుగుతున్నాము.
మనకు ఉన్నదే ఎవరికైనా ఇవ్వగలంగాని, మనకు లేనిది ఎలా ఇవ్వగలం ?
ఈ ప్రేమే " ఆత్మ " యొక్క స్వరూపం అనగా మనయొక్క నిజమైన స్వరూపం.
భగవంతుడు మనకన్నా వేరే లేడు కాబట్టి ఆత్మ తత్త్వమన్నా భగవంతుని తత్త్వమన్నా ఒకటే.
గురుశుశ్రూష చేసి ప్రేమే ఆత్మ యొక్క స్వరూపం అని తెలిసిన జ్ఞానులు,చీమ, దోమలతో సహా సమస్త జీవులయందు ప్రేమతో ఉంటున్నారు.
క్రమంగా జీవన్ముక్తులు, విదేహముక్తులు, అవుతున్నారు.
ఈ ఆత్మజ్ఞానం లేని వారు కొందరిమీద ప్రేమతోను,కొందరిమీద ద్వేషంతోను, ఉంటూ సంసారచక్రంలో పరిభ్రమిస్తున్నారు.
ఆత్మతత్త్వమే ప్రేమతత్త్వం అని తెలియజేయటానికే,
రాధాకృష్ణుల ప్రేమ, సీతారాముల ప్రేమ,
ప్రకృతి రామణీయకత మీద ప్రేమ,
మొదలైనవాటిని, విజ్ఞులు,
ఆటలు, పాటలు, నృత్యాలు, కవితలు,శిల్పాల రూపంలో ప్రచారంలోకి తెచ్చారు.
శ్లో// అహమస్మి సదాభామి కదాచిన్నాహ మప్రియః /
బ్రహ్మైవాహ మతః సిద్ధం సచ్చిదానన్ద లక్షణమ్ //
(అహం = నేను (అనగా ఆత్మ) అస్మి = ఎల్లప్పుడూ ఉన్నాను (సత్)
మనం అనుకుంటున్న 'మరణం' అనేది ఒక దేహాన్ని వదిలి ఇంకో దేహాన్ని ధరించడమేగాని, జీవుడికి మరణం లేదని శాస్త్రం.
సదాభామి = ఎల్లప్పుడూ ప్రకాశిస్తున్నాను. అనగా తెలివిగా ఉన్నాను (చిత్)
నిద్రలో కూడా ఆత్మ తెలివిగా ఉండబట్టే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలు నడుస్తున్నాయి.
కదాచిన్నాహమప్రియః = ఎప్పుడూ కూడా, నాకు నేను అప్రియుడను కాను. అనగా నేను ఎప్పుడూ ఆనందంగా ఉన్నాను.
అతః = అందువలన,
(బ్రహ్మ అనగా సచ్చిదానంద స్వరూపుడు అని వేదం చెప్పింది)
సచ్చిదానంద లక్షణం = సత్, చిత్, ఆనంద లక్షణమైన,
బ్రహ్మైవాహం = బ్రహ్మనే నేను అని,
సిద్ధం = సిద్ధించినది.
(అద్వైతమకరందం)
గురువులను భక్తితో సేవించి, "అహం బ్రహ్మాస్మి" అని శ్రీ శంకరులు ఉపదేశించిన అద్వైత తత్త్వం తెలుసుకొని, జన్మ సార్థకం చేసుకొందుముగాక.
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
24-3-'26.
రామాయణం - 11)
శ్రీరామ (18 )
( వాల్మీకి రామాయణం - 11)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(23-3-'26 ' సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)
విశ్వామిత్రుని యాగ సంరక్షణ అయిన మరుసటి రోజు, రామ లక్ష్మణులు, ప్రాతః కాల సంధ్యావందనాది నిత్యకృత్యములు ఆచరించి విశ్వామిత్రునకు నమస్కరించారు.
శ్లో// ఇమౌ స్మ ముని శార్దూల కింకరౌ సముపస్థితౌ/
ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్//
( ఓ ముని శ్రేష్ఠా! ఇదిగో నీ కింకరులమైన మేము వచ్చాము. ఏమి చేయవలెనో మమ్ము ఆజ్ఞాపించుము).
ఆ విధంగా రామ లక్ష్మణులు అనగానే,విశ్వామిత్రుని అనుజ్ఞ తీసుకుని అక్కడ ఉన్న మహర్షులు, వారితో ఇలా అన్నారు.
" మేమందరము, మిథిలా పట్టణములో, జనకమహారాజు చేస్తున్న యజ్ఞం చూడాలనుకుంటున్నాము.
ఆ జనక మహారాజు దగ్గర అద్భుతమైన శివ ధనస్సు ఉన్నది.
శ్లో//నాస్య దేవా న గన్ధర్వా నాసురా నచ రాక్షసా:/
కర్తు మారోపణం శక్తా న కథంచన మానుషా://
(దేవతలుగాని, గంధర్వులుగాని,అసురులు,రాక్షసులు గాని,ఆ వింటికి శరము సంధించటం, కాదు గదా, కనీసం ఆ ధనస్సును వంచి నారిని కూడా కట్టలేరు.ఇక మనుష్యుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు).
వంశ పారంపర్యంగా జనక వంశీయుల చేత పూజలందుకుంటున్న ఆ ధనస్సును, యజ్ఞమును,నీవు కూడా చూద్దువుగాని. మాతోబాటు మిథిలా నగరానికి, మీ ఇరువురు రండి."
అన్నారు.
సంతోషముతో సమ్మతించిన, రామ లక్ష్మణులతోను, ఋషిగణముతోను,విశ్వామిత్ర మహర్షి, సిద్ధాశ్రమ వనదేవతలను పూజించి,ప్రేమతో తమను అనుసరించి వస్తున్న మృగములను,పక్షులను,వెనుకకు పంపించి, మిథిలా పట్టణానికి ప్రయాణం అయ్యాడు.
అనేక దివ్యమైన పుణ్యగాధలను వినిపిస్తూ, దీర్ఘ ప్రయాణము తరువాత విశ్వామిత్రమహర్షి, మిథిలా నగర ప్రవేశం చేశారు.
ఆ నగరాధి దేవతకు నమస్కరించారు.
వారంతా ఆ పట్టణ సమీపమున పాడుబడి ఉన్న ఒక ఆశ్రమాన్ని చూచారు.
ఆ ఆశ్రమాన్ని గురించి రాముడు అడుగగా మహర్షి ఈ విధంగా చెప్పారు.
" రామా! పూర్వము ఇది దివ్యమైన ఆశ్రమము.
అహల్యాదేవీ సమేతుడై గౌతమమహర్షి ఇక్కడ అనేక సంవత్సరములు తపస్సు చేశాడు.
ఒక రోజు గౌతమ మహర్షి నదీ స్నానమునకు వెళ్ళినప్పుడు, దేవేంద్రుడు, గౌతముని రూపంలో, రహస్యముగా ఆశ్రమంలో ప్రవేశించి, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యతో సంభోగించాడు.
అతడు ఇంద్రుడని తెలిసినా కామం వల్ల ఏర్పడిన బలహీనత వల్ల,అహల్యాదేవి అడ్డు చెప్పలేదు.
ఇంతలో స్నానం పూర్తి చేసుకుని ఆశ్రమానికి వచ్చిన గౌతమ మహర్షి, తన రూపంతో ఆశ్రమం నుండి బయటకు వస్తున్న దేవేంద్రుని చూచాడు.
జరిగిన దుష్కృత్యాన్ని గ్రహించి తీవ్రమైన కోపంతో " నీ వృషణములు పడిపోవుగాక " అని దేవేంద్రుని శపించాడు.
శ్లో//గౌతమే నైవ ముక్తస్య స రోషేణ, మహాత్మనా/
పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్//
(గౌతముడు ఈ విధంగా కోపంతో శపించగానే, దేవేంద్రుని వృషణములు, తక్షణమే,నేలపై పడి పోయినవి)
ఉత్తమమైన తపస్సు ఆచరిస్తున్నా, మనోనిగ్రహము సాధించలేక అధర్మకార్యం చేసిన అహల్యను, "చాలా కాలం పాటు, ఎవరికీ కనిపించకుండా, వాయు భక్షణ చేస్తూ ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండు.
శ్లో//యదా చై తద్వనం ఘోరం రామో దశరథాత్మజః/
ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి//
(నరసంచారంలేకుండా భయంకరంగా అయిన ఈ వనానికి దశరథ కుమారుడైన రాముడు ఎప్పుడు వస్తాడో, అప్పుడు నీవు కల్మషములన్నీ పోయి,పవిత్రురాలవు కాగలవు) "
ఈవిధంగా ఇంద్రుని, అహల్యను,శపించి, గౌతమ మహర్షి, ఆశ్రమమును విడిచిపెట్టి, తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతములకు,వెళ్ళాడు.
నాయనా!రామా! పుణ్యాత్ముడైన ఈ గౌతముని ఆశ్రమంలో ప్రవేశించు.
అత్యంత సౌందర్యవతి,గొప్ప సౌభాగ్యవతి, అయిన అహల్యను తరింపజేయుము" అన్నాడు.
ఆ మాటలు విని లక్ష్మణ సమేతుడైన రాముడు, విశ్వామిత్రుని వెనుక నడచుచు ఆ ఆశ్రమములో ప్రవేశించాడు.
ఆ ఆశ్రమంలో రాముడు అడుగు పెట్టగానే,
గౌతముని శాపం సమాప్తమైనది.
దివ్యకాంతులతో అహల్యాదేవి కనిపించింది.
తపస్సు చేత అమె దివ్యతేజస్సుతో మెరిసిపోతోంది.
దేవాసురమానవులు, కనులు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిని చూడ లేకుండా వున్నారు.
శ్లో//శాపస్యాంతముపాగమ్య తేషామ్ దర్శన మాగతా/
రాఘవౌ తు తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా//
(గౌతమ మహర్షి శాపం తొలగి పోవడంవల్ల, రామ లక్ష్మణులకు అహల్యాదేవి కనిపించింది. వారిద్దరూ ఆమె రెండు పాదములను పట్టుకుని నమస్కరించారు).
అహల్యాదేవి గౌతమ మహర్షి వచనములను స్మరించి, శాస్త్రంలో చెప్పిన ప్రకారం వారికి,మిక్కిలి భక్తి,శ్రద్ధలతో ఆర్ఘ్య పాద్యాలుఇచ్చి, అతిధి పూజ చేసింది.
రాముడు ఆ అతిధి పూజ స్వీకరించాడు.
తత్ క్షణమే గౌతమ మహర్షి అక్కడ ప్రత్యక్షమైనాడు.
పరమానందంతో అహల్యను తిరిగి స్వీకరించాడు.
ఆ శుభ సమయంలో,
శ్లో//పుష్ప వృష్టి ర్మహ త్యాసీత్ దేవ దుందుభి నిస్స్వనై:/
గంధర్వాప్సరసాం చైవ మహానాసీత్సమాగమ://
(దేవ దుందుభులు మ్రోగినై. పుష్పవృష్టి కురిసింది. గంధర్వులు, అప్సరసలు, ఆట పాటలతో సమాగమమయ్యారు).
శ్లో//సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్/
తపోబల విశుధ్ధాంగీం గౌతమస్య వశానుగామ్//
(తపోబలంతో పవిత్రురాలైనది, గౌతమ మహర్షితో కూడినది, అయిన ఆ అహల్యాదేవిని "బాగు, బాగు" అని నుతిస్తూ దేవతలందరూ పూజించారు)
ఆ తరువాత గౌతమ మహర్షి, అహల్యాదేవితో కలిసి రాముని యధావిధిగా పూజించాడు.
యథా శాస్త్రముగా చేయబడిన ఆ పూజను రాముడు స్వీకరించాడు.
ఆ విధంగా వారిద్దరి అతిధ్యము స్వీకరించిన రామ లక్ష్మణులు, విశ్వామిత్రమహర్షి, మిక్కిలి ఆనందముతో మిథిలా పట్టణానికి వెళ్లారు.
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః