15, మే 2026, శుక్రవారం

వైశాఖ పురాణం🚩*

 *🐚శుక్రవారం 15 మే 2026*


   *🚩వైశాఖ పురాణం🚩*              

      *28వ అధ్యాయము*


*అక్షయతృతీయ విశిష్టత*```


నారదమహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.


పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన యింద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.


ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి యింద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.


ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.


ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు యింద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో యింద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.```


_*వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం*_ 


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

దేవునికి కృతజ్ఞతలు

 *దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి 10 ప్రత్యేక కారణాలు*


1. రోడ్డు మీద టైర్లు నడుస్తున్న కొద్దీ అరిగిపోతాయి, కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం నడిచినా, పరిగెత్తినా దాదాపు అలాగే ఉంటాయి.


2. మానవ శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది, అయినా లక్షలాది రంధ్రాలు ఉన్నా ఒక్క చుక్క కూడా బయటకు కారదు.


3. ఆధారం లేకుండా ఏ వస్తువూ నిలబడలేదు, అయినా మానవ శరీరం తనను తాను సహజంగా సమతుల్యం చేసుకుంటుంది.


4. రీఛార్జింగ్ చేయకుండా ఏ బ్యాటరీ పనిచేయదు, కానీ గుండె పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది.


5. ఏ పంపు కూడా శాశ్వతంగా నడవదు, అయినా రక్తం జీవితాంతం శరీరంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.


6. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్‌లకు సమానమైన నాణ్యతతో చిత్రీకరిస్తాయి.


7. ఏ ప్రయోగశాల కూడా ప్రతి రుచిని పరీక్షించలేదు, అయినా నాలుక ఎలాంటి పరికరాలు లేకుండా వేలాది రుచులను గుర్తిస్తుంది.


8. అత్యంత అధునాతన సెన్సార్లకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన చర్మం అతి చిన్న స్పర్శను, అనుభూతిని కూడా గ్రహించగలదు.


9. ఏ యంత్రమూ ప్రతి ధ్వనినీ సృష్టించజాలదు, కానీ మానవ స్వరం వేలకొద్దీ పౌనఃపున్యాలను సృష్టించగలదు.


10. ఏ పరికరమూ అన్ని ధ్వనులనూ పూర్తిగా విశ్లేషించజాలదు, కానీ మన చెవులు ప్రతి ధ్వనినీ అర్థవంతంగా గ్రహించి, అన్వయించుకుంటాయి.


దేవుడు ప్రసాదించిన ఈ అమూల్యమైన వరాలకు మనం కృతజ్ఞతతో ఉండాలి, ఫిర్యాదు చేయడానికి మనకు నిజంగా ఏ హక్కూ లేదు.


ప్రతి ఉదయం నిద్రలేవడమే ఒక అద్భుతం.

కాబట్టి ప్రతిరోజూ సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలుపండి. 🙏


 జై శ్రీరామ్ జై హనుమాన్🙏

ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

Mantra - 40

  Mantra - 40 ARUNAM 5 anuvaakam


నిన్నటి మంత్రం జీవుడిని పరమాత్మ నుండి వేరు చేస్తున్న అహంకార బంధాన్ని జ్ఞానమనే సూక్ష్మ శక్తితో ఎలా ఛేదించాలో వివరించింది. ఈ రోజు ఈ మంత్రం ఆ ధనుస్సు యొక్క అసలు స్వరూపాన్ని, దాని వెనుక ఉన్న దైవత్వాన్ని వివరిస్తుంది.


“తదిన్ద్ర ధనురిత్యజ్యమ్। 

అభ్ర వర్ణేషు చక్షతే। 

ఏతదేవ శంయోర్బార్హస్పత్యస్య। 

ఏతద్రుద్రస్య ధనుః||”


*భౌతిక అర్ధం:*

‘తదిన్ద్ర ధనురిత్యజ్యమ్’ - ఆ ఇంద్రధనుస్సు ఏదైతే ఉందో, అది 'అ-జ్యం' (నారి లేనిది లేదా సంధించనిది).


‘అభ్ర వర్ణేషు చక్షతే’ - మేఘ సమూహాల మధ్య అది కనిపిస్తుందని పెద్దలు చెబుతారు.


‘ఏతదేవ శంయోర్బార్హస్పత్యస్య’ - ఇది బృహస్పతి కుమారుడైన 'శంయువు'కి సంబంధించినది.


‘ఏతద్రుద్రస్య ధనుః’ - ఇదే రుద్రుని ధనుస్సు (పినాకః).


*పరమార్ధం:*

అద్వైత దృష్టిలో ఇంద్రధనుస్సు అనేది ఒక గొప్ప రూపకం (Metaphor). ఇది సత్యానికి, మిథ్యకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది.


‘తదిన్ద్ర ధనురిత్యజ్యమ్ (అది ఇంద్రుని ధనుస్సు - ఎక్కుపెట్టనిది)’ - ఇంద్ర ధనుస్సు అది కేవలం సూర్యరశ్మి, నీటి తుంపర్ల కలయిక వల్ల కలిగే ఒక ఆభాస. పరమాత్మ యొక్క శక్తి శాంతమైనది. శిక్షించడం లేదా హింసించడం ఆయన ఉద్దేశ్యం కాదు. జ్ఞాని దృష్టిలో పరమాత్మ నిష్క్రియుడు, అచలుడు. ఇంద్రధనుస్సు ఎలాగైతే ఆకాశంలో ఏ ఆధారమూ లేకుండా కనిపిస్తుందో, పరబ్రహ్మం కూడా ఈ జగత్తులో దేనికీ అంటకుండానే అన్నిటినీ ధరించి ఉంటుంది.


‘అభ్ర వర్ణేషు చక్షతే’ (మేఘాల రంగులలో కనిపిస్తుంది) - సూర్యరశ్మి (ఆత్మ) ఒక్కటే అయినప్పటికీ, నీటి బిందువులనే ఉపాధి (Body/Mind) ద్వారా సోకినప్పుడు అనేక రంగులుగా (నానాత్వంగా) కనిపిస్తుంది. జగత్తులో కనిపించే వైవిధ్యం అంతా ఆ ఒక్క పరమాత్మ ప్రకాశమే అని, మాయ వల్ల అది మనకు వేర్వేరుగా కనిపిస్తుందని.


‘ఏతదేవ శంయోర్బార్హస్పత్యస్య’ (ఇది బృహస్పతి కుమారుడైన శంయువు యొక్క ధనుస్సు) - వేదంలో 'శం-యువు' అంటే శాంతిని, సుఖాన్ని ఇచ్చేవాడు. సాధకుడు అద్వైత స్థితిని పొందినప్పుడు, అతనికి భయం తొలగిపోయి 'శం' (పరమ శాంతి) కలుగుతుంది. ఈ ధనుస్సు ఆ శాంతికి ప్రతీక. ఆయుధం ఆయుధంగా కాకుండా, శాంతి చిహ్నంగా మారడమే మోక్ష మార్గం.


‘ఏతద్రుద్రస్య ధనుః’ (ఇదే రుద్రుని ధనుస్సు) -

ఇంద్రధనుస్సే రుద్రధనుస్సు (పినాకం) అని చెబుతోంది. రుద్రుడు అంటే సంహారకారకుడు మాత్రమే కాదు, అజ్ఞానాన్ని సంహరించే జ్ఞానమూర్తి.


ఈ మంత్రం భౌతికమైన ఇంద్రధనుస్సును ఉదాహరణగా తీసుకుని, అదృశ్యంగా ఉన్న పరమాత్మ దృశ్యమాన ప్రపంచంలో ఎలా వ్యక్తమవుతున్నాడో వివరిస్తుంది. ఆకాశం (బ్రహ్మం) లో మేఘాలు (మాయ/ప్రకృతి) ఉన్నంత వరకే ఇంద్రధనుస్సు (జగత్తు/ఈశ్వరుడు) కనిపిస్తుంది. మేఘాలు తొలగిపోతే మిగిలేది నిర్మలమైన ఆకాశమే. అలాగే అజ్ఞానం తొలగితే మిగిలేది కేవలం అద్వైత చైతన్యమే అని ఈ వాక్యాలు అంతర్లీనంగా బోధిస్తున్నాయి.


ఇంద్రధనుస్సు - మాయా విలాసం (The Illusion of Form) - అద్వైతంలో ఇంద్రధనుస్సును మిథ్య కు ఉదాహరణగా చెబుతారు. ఇంద్రధనుస్సు కనిపిస్తుంది కానీ పట్టుకోవడానికి వీలుండదు. అది కేవలం సూర్యరశ్మి, నీటి బిందువుల కలయిక వల్ల కలిగే ఒక ఆభాస.


అలాగే, ఈ జగత్తు కూడా శుద్ధ చైతన్యం (సూర్యుడు) మరియు మాయ (నీటి బిందువు) కలయిక వల్ల రంగురంగులుగా కనిపిస్తోంది. ఇంద్రధనుస్సు నిజానికి సూర్యరశ్మి యొక్క ప్రతిబింబమే కానీ, దానికి స్వతంత్ర అస్తిత్వం లేదు. అలాగే, ఈ జగత్తు అంతా పరమాత్మ చైతన్యం వల్ల భాసిస్తోంది తప్ప, అది సత్యం కాదు అని అర్థం. నిజానికి అక్కడ ఉన్నది ఒక్కటే కాంతి (బ్రహ్మం). ఆ రంగులన్నీ (వైవిధ్యం) తాత్కాలికం.


అజ్య ధనుస్సు - క్రియారహిత స్థితి (Actionless Reality) - "నారి లేని ధనుస్సు" అంటే అర్థం అది ఎవరినీ హింసించడానికి లేదా దేనినో కొట్టడానికి సిద్ధంగా లేదు. అద్వైతంలో పరబ్రహ్మము అకర్త. అంటే ఆయన ఏమీ చేయడు, కానీ ఆయన సన్నిధిలో అంతా జరుగుతుంది. నారి లేని ధనుస్సు ఎలాగైతే కేవలం ఒక రూపంగా ఉండి ఏ బాణాన్ని వదలదో, పరమాత్మ కూడా కేవలం సాక్షిగా ఉండి ఈ సృష్టిని ప్రకాశింపజేస్తాడు.


శంయువు మరియు రుద్రుని ధనుస్సు (Universal Unity)

బృహస్పతి కుమారుడైన శంయువు యొక్క ధనుస్సు అన్నా, రుద్రుని ధనుస్సు అన్నా అది ఒక్కటే అని చెప్పడం ఏకత్వాన్ని సూచిస్తుంది. లోకంలో శాంతిని కలిగించేవాడు (శం-యువు), లయం చేసేవాడు (రుద్రుడు) వేర్వేరు కాదు. జ్ఞాని దృష్టిలో సృష్టి, స్థితి, లయం అనే మూడు ప్రక్రియలు ఆ ఒక్క పరమాత్మవే. శక్తులు వేరైనా మూలం ఒక్కటేనని గుర్తించడమే అద్వైతం.


చక్షతే - జ్ఞాన నేత్రం - ఇంద్రధనుస్సును అందరూ చూస్తారు, కానీ అది కాంతి యొక్క విశ్లేషణ (Refraction, Dispersion) అని శాస్త్రజ్ఞుడికి తెలిసినట్లు... జగత్తును అందరూ చూస్తారు, కానీ ఇదంతా బ్రహ్మ చైతన్యమే అని జ్ఞాని (అభివర్ణిషు) మాత్రమే చూడగలడు.


సారాంశం - ఈ మంత్రం మనకు కనిపిస్తున్న రంగురంగుల ప్రపంచం (ఇంద్రధనుస్సు) వెనుక ఉన్న ఒకే ఒక్క కాంతిని (బ్రహ్మని) దర్శించమని చెబుతోంది. ఆయుధాలు, ఆకృతులు అన్నీ ఆ పరమ సత్యం యొక్క విభిన్న వ్యక్తీకరణలే తప్ప వేరు కాదని దీని భావం.

శనివారం నాడు వచ్చే అమావాస్యను

 శనివారం నాడు వచ్చే అమావాస్యను శని అమావాస్య (లేదా శనిశ్చరి అమావాస్య) అని అంటారు.


*ఈ సంవత్సరంలో శని అమావాస్యలు రెండు మాత్రమే* 


*ఈ ఏడాది తొలి శని అమావాస్య 16-5-2026 తారీఖున ఇవాళే శనీశ్వర జయంతి కూడా*.


*రెండవ శని అమావాస్య 10 అక్టోబర్ 20 26

ఈ రోజున సర్వపితృ అమావాస్య పితృ దోషాలకు శని దోషాలకు మంచి పరిష్కారం చేసుకునే రోజు.*


ఏలినాటి శని (Sade Sati):


కుంభ రాశి: చివరి దశ. మీన రాశి: జన్మ శని (మధ్య దశ). మేష రాశి: మొదటి దశ.


అష్టమ శని (8th House Saturn): సింహ రాశి (29 మార్చి 2025 నుండి జూన్ 3, 2027 వరకు).


అర్థాష్టమ శని (4th House Saturn): వృశ్చిక రాశి (గోచారం ప్రకారం).



*నోట్ :-👆పై రాశుల వారు ఈ రెండు తారీకులలో*

*శనేశ్వర ప్రీతి కొరకై అర్చన చేసుకొని శనేశ్వరానుగ్రహంతో సుఖశాంతులు* *ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు*

*పొందగలరు.**

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*742 వ రోజు*

అశ్వమేధ పర్వము చతుర్ధాస్వాసం

అశ్వము ప్రాగ్జ్యోతిషపురంలో ప్రవేశించుట

తరువాత అశ్వము ప్రాగ్జ్యోతిషపురములో ప్రవేశించింది. భగదత్తుడికుమారుడు వజ్రదత్తుడు ప్రాగ్జ్యోతిషపురమును పాలిస్తున్నాడు. అతడు హయమును అడ్డగించి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. అర్జునుడి వాడి అయిన బాణముల ధాటికి తాళలేక పారి పోయిన వజ్రదత్తుడు హయమును వదిలి పారిపోయి తిరిగి ఏనుగు ఎక్కి వచ్చాడు. అర్జునుడు ముందు వజ్రదత్తుడి బాణములను మధ్యలో తుంచినా అతడి మీద వాడి అయిన బాణ ప్రయోగము చేయ లేదు. వజ్రదత్తుడు అర్జునుడి మీద ప్రయోగించిన వాడి అయిన బాణములకు ప్రతిగా అర్జునుడు కూడా వాడి అయిన బాణములు ప్రయోగించి వజ్రదత్తుడిని కింద పడవేసాడు. కింద పడిన వజ్రదత్తుడు తిరిగి ఏనుగు ఎక్కి అర్జునుడిని తన బాణములతో కప్పి వేసాడు. ఇలా వారి మధ్య మూడు రోజులపాటు హోరాహోరీగా యుద్ధము సాగింది. నాలుగవ రోజున వజ్రదత్తుడు విజృంబించి " అర్జునా ! నా తండ్రి వృద్ధుడు కనుక అతడు యుద్ధములో మీ చేత మరణించాడు. కాని యువకుడిని అయిన నన్ను జయించడము అసాధ్యము " అన్నడు. అంటూ అర్జునుడి మీదకు కొండవంటి ఏనుగును తోలి అర్జునుడి మీద బాణవర్షము కురిపించాడు. అర్జునుడు ఒకే బాణముతో ఆ ఏనుగును పడగొట్టి వజ్రదత్తుడిని కింద పడవేసి అతడిని చూసి " వజ్రదత్తా ! ఈ యాగాశ్వమును వదులుతూ ధర్మరాజు నన్ను ఈ యాగాశ్వముకు రక్షకుడిగా నియమించి " అర్జునా ! ఈ అశ్వమును అడ్డగించిన వారిని వధించక వారిమీద కరుణ వహించు" అని చెప్పాడు. కనుక నేను నిన్ను చంపను. నాకు నీ మీద ఎలాంటి కోపము లేదు. ధర్మరాజు తరఫున నేను నిన్ను బంధుమిత్ర సమేతంగా వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమి నాటికి ధర్మరాజు నిర్వహిస్తున్న అశ్వమేధయాగానికి ఆహ్వానిస్తున్నాను. నీవూ అ యాగముకు వచ్చి యాగమును జయప్రథము చెయ్యి " అని పలికాడు. వజ్రదత్తుడు కూడా అందుకు సమ్మతించి యాగాశ్వమును వదిలి అర్జునుడితో సంధి చేసుకున్నాడు.

అశ్వము సింధుదేశములో ప్రవేశించుట

తరువాత యాగాశ్వము సింధుదేశములో ప్రవేశించింది. సింధుదేశపురాజు సైంధవుడు మహాభారతయుద్ధములో మరణించగా అతడి కుమారులు మనుమలు మాత్రము రాజ్యముచేస్తున్నారు. వారంతా అర్జునుడి మీద ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. వారి ధాటికి అర్జునుడు తట్టుకోలేక గాడీవమును జారవిడిచి తిరిగి శక్తిని కూడతీసుకుని వారిమీద విరుచుకు పడి సింధురాజుల మీద వారి సైన్యాలను చీల్చిచెండాడి రణభూమిని శవాల పెంటకుప్పగా మార్చాడు. సైన్యము చెల్లాచెదురు అయినా సింధురాజులు సైన్యాలను కూడదీసుకుని యుద్ధానికి తలపడ్డారు. అర్జునుడు వారితో ధర్మరాజు చెప్పిన శాంతి వచనాలు చెప్పాడు. అయినా సింధురాజులు వాటిని పెడచెవిన పెట్టి అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు చేసేది ఏమి లేక వారి వీరులను సంహరించారు. అప్పుడు దుస్సల రోదిస్తూ వారి వద్దకు వచ్చింది. అర్జునుడు దుస్సలను చూడగానే రధము దిగి ఆమెను సమీపించాడు. దుస్సల అర్జునుడితో " అన్నయ్యా ! వీడు నీ మేనల్లుడి కుమారుడు. నీ మనుమడు. వీడిని రక్షించు " అన్నది. అర్జునుడు " అమ్మా దుస్సలా ! నా మేనల్లుడు ఎక్కడ? " అని అడిగాడు. దుస్సల " అన్నా ! తన తండ్రి సైంధవుడు నీ చేతిలో భారతయుద్ధములో మరణించిన విషయము తెలిసి నా కుమారుడు చాలా దుఃఖించాడు. ఇప్పుడు నువ్వు వచ్చిన విషయము తెలిసి గుండె ఆగి మరణించాడు. ఇప్పుడు వీడొక్కడే వంశాంకురము మిగిలాడు " అని చెప్పింది. ఆ మాటాలకు అర్జునుడు కూడా దుఃఖించాడు. తిరిగి దుస్సల " అన్నయ్యా అర్జునా ! ధృతరాష్ట్రులు మీకు చేసిన అపకారములు, సైంధవుని అనుచిత ప్రవర్తన మనసులో పెట్టుకోకు. తండ్రి లేని వాడైన నా మనుమడిని రక్షించు " అని మనుమడితో అర్జునుడికి పాదాభివందనము చేయించింది. అర్జునుడు " అమ్మా ! నీ సోదరుడు సుయోధనుడు దుర్మార్గుడే కాని మేము మాత్రము తక్కువా చెప్పు. ఇంతటి ఘోరయుద్ధానికి మేము కూడా కారణం అయ్యాము. రాచకులములో పుట్టడం ఎంతటి మహాపాపము. దుస్సలా ! నీ మనుమడికి హానిచెయ్యను నీవూ భయపడవలసిన పని లేదు " అని పలికాడు. ఆ మాటలకు దుస్సల సంతోషించిన దుస్సల మనుమడిని తీసుకుని వెళ్ళింది. అర్జునుడు అశ్వాన్ని విడిపించుకుని జయిత్రయాత్ర సాగించాడు.



*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

మన గుడి : నెం 1478

  🕉 మన గుడి : నెం 1478


⚜  తమిళనాడు : తిరుముల్లైవాయల్ - తిరువళ్లూరు


⚜  శ్రీ మాసిలమణిశ్వర దేవాలయం



💠 మసిలమణిశ్వర దేవాలయం భారతదేశంలోని చెన్నై - అవడి రహదారిలోని తిరుముల్లైవాయల్‌లో ఉన్న శివునికి అంకితం చేయబడిన దేవాలయం . 


💠 ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో చోళులు నిర్మించారని , తరువాత చోళ రాజులు మరియు తరువాతి పాలక సామ్రాజ్యాలు గణనీయమైన మార్పులు చేశాయని నమ్ముతారు.  


💠 ఈ ఆలయంలో అనేక మందిరాలు ఉన్నాయి, వాటిలో మాసిలమణిశ్వరర్ మరియు కోడియిడై నయగి అమ్మన్ అత్యంత ప్రముఖమైనవి. 


💠 8వ శతాబ్దపు తమిళ శైవ కవి సుందరర్ , 7వ తిరుమురైగా సంకలనం చేయబడిన తేవరంలో పది శ్లోకాలలో మాసిలమణిశ్వరర్‌ను పూజించారు . 

ఈ ఆలయం తేవరంలో గౌరవించబడినందున , దీనిని పాదల్ పెట్రా స్థలంగా వర్గీకరించారు , ఇది శైవ నియమావళిలో ప్రస్తావించబడిన 275 దేవాలయాలలో ఒకటి. 


🪔 స్థల పురాణం 


💠 పురాతన కాలంలో, తిరుముల్లైవాయిల్ చుట్టూ ఉన్న అడవిని కురుంబర్ తెగకు చెందిన వానన్ మరియు ఓనన్ అనే ఇద్దరు ప్రసిద్ధ తెగల వారు పాలించేవారు . వారు తిరుముల్లైవాయిల్ యొక్క సామంత ప్రభువులు. 

తొండైమాన్ రాజు తన ఆధీనంలో ఉన్న ప్రాంతానికి వెళ్లాలనుకున్నాడు. అతని ప్రయత్నాలన్నీ ఫలించలేదు మరియు చివరికి వారిని యుద్ధంలో ఓడించాలని నిర్ణయించుకున్నాడు. 


💠 అతను తన పదాతిదళం మరియు అశ్వికదళంతో ఏనుగులు మరియు రథాలతో యుద్ధానికి బయలుదేరాడు. 

యుద్ధానికి వెళ్ళే మార్గంలో, వారు ముల్లై మొక్కల ( జాస్మిన్ ) దట్టమైన తోట గుండా నడిచారు. 


💠 వారి ఏనుగు పాదం దట్టమైన ఆకులలో చిక్కుకుంది.

రాజు మరియు అతని మనుషులు, ఏనుగును ఈ గందరగోళం నుండి విడిపించే ప్రయత్నంలో, వారి కత్తులతో అడవిని నరికివేశారు. 


💠 అకస్మాత్తుగా వారు ఆకుల నుండి రక్తం కారుతున్నట్లు గమనించారు మరియు ఒక ' లింగం ' రక్తస్రావం అవుతోంది. 

రాజు తాను పాపం చేశానని చాలా బాధపడ్డాడు. 

శివుడిని క్షమాపణ కోరుతూ, ఆయనను ప్రార్థించాడు. 


💠 శివుడు మరియు పార్వతి రాజు ముందు కనిపించారు. 

శివుడు అక్కడే తన కోసం ఒక ఆలయాన్ని నిర్మించమని రాజును కోరాడు మరియు తాను మాసిలమణిశ్వరుడిగా అక్కడ నివసిస్తానని వాగ్దానం చేశాడు, 


💠 రత్నం వలె విలువైన శివుడు, కానీ మరకలు లేనివాడు ['మాసు' - మురికి లేదా మరక (విపరీతంగా రక్తస్రావం కావడం వల్ల కలిగేది), 'ఇల' - లేకుండా, 'మణి' - రత్నం]. 


💠 శివుడు తన నందిని పంపడం ద్వారా కురుంబర్లను నాశనం చేయడంలో అతనికి మద్దతు ఇస్తానని కూడా వాగ్దానం చేశాడని నమ్ముతారు. 

అతని ఆజ్ఞ మేరకు, నంది కూడా రాజు కోసం పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది. 

అందుకే ఈ ఆలయంలోని నంది శివుని ఆదేశం మేరకు యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధంగా భగవంతునికి వ్యతిరేక దిశలో (తూర్పు వైపు) కూర్చుని ఉంటాడు


💠 శివుడు స్వయంమూర్తిగా కనిపిస్తాడు. 

తొండైమాన్‌ను రాజు చేసిన గాయం వల్ల ఆయనను చందనంతో కప్పారు. సంవత్సరానికి ఒకసారి, చితిరై మాసంలోని సత్య నక్షత్రం రోజున, ఆయనను తొలగించి, మరొకదానితో భర్తీ చేస్తారు.


💠 గర్భగుడి యొక్క విమాన ( పైకప్పు ) పల్లవ వాస్తుశిల్పానికి ప్రత్యేకమైన రీతిలో రూపొందించబడింది - గజ పృష్టం, ( గజ - ఏనుగు, పృష్టం - వెనుక భాగం) లాగా కనిపిస్తుంది. 


💠 దేవతను కోడియిడై నయగి అని పిలుస్తారు - మల్లెపూవులా సన్నని నడుము కలిగినది. 

ఆమె చాలా శక్తివంతమైన దేవతగా పరిగణించబడుతుంది మరియు కొత్తగా పెళ్లైన, అవివాహితులైన అమ్మాయిలకు వేగవంతమైన వివాహం మరియు సంతోషకరమైన వివాహ జీవితం కోసం ఆమె దయగల ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. 



💠 లింగంపై ఒక మచ్చ ఉంది , ఇది గంధపు చెక్కతో కప్పబడి ఉంటుంది. పాదరసంతో చేసిన చిన్న లింగం ఉంది, దానిపై అభ్యంగన స్నానం చేస్తారు. 


💠 రాముడి కుమారులైన లవ మరియు కుశ పూజించారని నమ్ముతున్న చోళపురీశ్వర్ మరియు కుచలపురీశ్వర్ కోసం ఆలయంలో చిన్న మందిరాలు ఉన్నాయి .


💠 శివుడు మరియు పార్వతి (కోడియిడై అమ్మన్) దేవతల స్థానాలు కూడా సాధారణంగా శివాలయాలలో కనిపించే దానికి భిన్నంగా పరస్పరం మార్చుకున్నట్లు కనుగొనబడింది. 

శివుడు మరియు అతని భార్య రాజుకు ' దర్శనం ' ఇవ్వడానికి తొందరపడటం వల్ల అలా జరిగిందని నమ్ముతారు .


💠 మూలస్థానం యొక్క ఇరువైపులా గణపతి మరియు సుబ్రమణియర్ విగ్రహం ఉంది. మూలస్థానం యొక్క కోష్టం చుట్టూ నర్తన గణపతి, దక్షిణామూర్తి, మహా విష్ణువు, బ్రహ్మ, దుర్గై మరియు చండికేశ్వరుల విగ్రహాలు కనిపిస్తాయి. మూలస్థానం చుట్టూ ఉన్న లోపలి భాగంలో వీరబద్రర్, నాగదేవతలు, వినాయగర్, అప్పర్, సుందరార్, మాణికవాసగర్ మరియు తిరుజ్ఞాన సమ్మంధర్ (నాళ్వార్), వినాయగర్, నాగదేవతలు, శివలింగం, మహాలక్ష్మి,

మాణికవాసగర్ విగ్రహాలు ఉన్నాయి. 


💠 భక్తులలో ఒక సాధారణ నమ్మకం ఏమిటంటే, వారు 

1) శ్రీ తిరుమనంగేశ్వర ఆలయం, మింజూర్, 2) శ్రీ వడివుడై అమ్మన్ ఆలయం, తిరువొట్టియూర్ మరియు 3) శ్రీ మాసిలమనీశ్వర ఆలయం, తిరుముల్లైవోయల్ లను ఒకే రోజు సందర్శించాలి. 

ఇలా చేస్తే కాశీ మరియు రామేశ్వరం సందర్శించినట్లే.


💠 తిరువళ్లూరు నుండి 27 కి.మీ

,కాంచీపురం నుండి 72 కి.మీ దూరం.


రచన


©️ Santosh Kumar

వైశాఖ పురాణం - 28*

 155f9;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



     *వైశాఖ పురాణం - 28* 

              ➖➖➖✍️

        28 వ అధ్యాయము



*అక్షయతృతీయ విశిష్టత*```

నారదమహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.


పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన యింద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.


ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి యింద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.


ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.


ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు యింద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో యింద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పం.డి.

          ➖▪️➖

పంచాంగం 15.05.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 15.05.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష త్రయోదశి తదుపరి చతుర్దశి తిథి భృగు వాసర అశ్విని నక్షత్రం ఆయుష్మాన్ యోగః వణిజ తదువరి భద్ర తదువరి శకుని కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

  


శ్రాద్ధ తిథి: చతుర్దశి


 

నమస్కారః , శుభోదయం

15-05-2026 శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

15-05-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.  

---------------------------------------


వృషభం


వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

---------------------------------------


మిధునం


సంతానం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో కానీ పూర్తి కావు. వృధా ఖర్చులు ఉంటాయి.

---------------------------------------


కర్కాటకం


ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలలో చికాకులు అధికమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. 

---------------------------------------


సింహం


చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం ఉన్నది.

---------------------------------------


కన్య


చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో సమస్యలు అధిగమిస్తారు. ఉద్యోగాలలో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


తుల


కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చెయ్యవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగవు.  

---------------------------------------


వృశ్చికం


బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. 

---------------------------------------


ధనస్సు


జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. ధనాదాయం బాగుంటుంది. సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


మకరం


పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

---------------------------------------


కుంభం


మిత్రుల నుంచి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


మీనం


ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగులు ఉన్నతహోదాలు పొందుతారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి.

---------------------------------------