4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

అమ్మకు సాయం చేయండి

*(అమ్మకు సాయం చేయండి )..* 
*ఒక సారి ఆలోచించండి .మారండి.*
🤱🤱🤱🤱🤱🤱🤱
*ఆ కాలంలో అంటే మా బామ్మ ,అమ్మమ్మ , తాతమ్మ తరంలో మనిషోకో రకం ఐటమ్ వండటం అనేది లేదు.*

*ఒక కూర , పప్పు , పచ్చడి , రసము లేదా పులుసు ( పెరుగు లేదా మజ్జిగ సిద్ధం చేసి ) ఒకేసారి వండేసి , దేవతార్చన చేసుకుని , వాళ్ళ వరకు విడిగా మడిగా తీసుకుని వంట గదిలో నుండి బయటకు వచ్చేసేవారు.*

*రాత్రికి అల్పాహారము ఏ ఉప్పు పిండో , దిబ్బరొట్టో వేసుకుని తినేసేవారు.*

*ఎవరైనా రాత్రి భోజనము చేసేవారుంటే , వారే వేడిగా ఏ కూర ముక్కో వేయించుకుని , పొద్దున తినగా మిగిలిన పదార్ధాలు వేసుకుని వాటితో తినేసేవారు.*

*మరి ఈ కాలంలో మనిషికో రకం. భర్త తినేది పిల్లలు తినరు. అత్త గారు తినేది భర్త తినడు . పిల్లలు తినేది భర్త , అత్తగారు వేలేసి ముట్టుకోరు . వంట చేయడమంటే ఈ రోజుల్లో అంటే మహా యజ్ఞం చేసినట్లే.*

*ముఖ్యంగా పిల్లలు చాలామంది ఇళ్ళల్లో భోజనము చేయడానికి చాలా పేచీ పెడుతున్నారు*

*చచ్చి చెడీ మనిషో కో రకం చేసినా , తీరా భోజన సమయానికి పీజాలు , పానీ పూరీలు , కుర్ కురేలు లాంటి జంక్ ఫుడ్స్ బయట తినేసి ఇంటికి వస్తారు.*

*అమ్మ భోజనం చేయ మానగానే , నాకాకలిగా లేదు . అన్నం వద్దని మారాం చేస్తారు . ఈ మారానికి ఆడ మగ తేడా అనేదే లేదు.*

*పిల్లలంటే ఏ పదేళ్ళ లోపు వారంటే మీరు పప్పులో కాలేసినట్లే.*

*ఇంజనీరింగ్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ , డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునే యువతీ యువకులు కూడా ఇందులో ఏమీ మినహాయింపు కాదు.*

*వాళ్ళమ్మలకు తిండి దగ్గర ఎంత వరకు నరకం చూపించాలో అంత వరకు చూపిస్తారు*

*రాత్రి 11 దాటినా అన్నం తినరు*

*వండిన కూరలు అన్నం చూసుకుని తల్లి దిగులుపడి తినమని బ్రతిమలాడితే అమ్మ మీద దయ తలచి "అయితే మాకు ముద్దలు కలిపి పెట్టు. అలా పెడితేనే తింటాం " అని అమ్మకు కండిషన్ పెడతారు.*

*పగలల్లా గొడ్డులా ఇంటి చాకిరీ సమస్తం చేసి , అర్ధరాత్రి డస్సిపోయి నిద్ర కళ్ళతో తూగుతూ అమ్మ ఈ పిల్లలకు ముద్దలు కలిపి నోట్లో పెట్టాలి*

*ఈ ముద్దలు కలిపే ప్రహసనం రాత్రే కాదు ఉదయం కూడా . ఒక డిష్ లో కలిపిన అన్నం తీసుకుని , అమ్మ పిల్లల వెనక పిల్లలు స్కూల్ కు , కాలేజీ కి బయల్దేరే దాకా వారి వెనకాల పరిగెత్తుతూనే ఉంటుంది.*

*ఉద్యోగాలుచేసే మాతృమూర్తులకు మరిన్ని సమస్యలు అదనం*

*వాస్తవానికి భోజనము చేయడానికి ఎంత సేపు పడుతుంది ?*

*చాలా విశ్రాంతిగా తిన్నా 20 నిముషాలు మించి పట్టదు*

*రోజు మొత్తములోని 24 గంటలలో 20 నిముషాలు భోజనము చేయడానికి సమయం పిల్లలకు దొరకదా ? వారు ఆ 20 నిముషాల సమయాన్ని కూడా తమంతట తాము తినడానికి కేటాయించ లేరా ?*

*సమయం దొరకక పోవడానికి ప్రధాన కారణం , రాత్రి పది లోపు పడుకుని ఉదయం 5 గంటలకు లేవ వలసిన పిల్లలు , రాత్రి ఒంటి గంట దాకా T.V. లో నానా చెత్త ప్రోగ్రాం లు చూసి అప్పుడు పడుకుని ఉదయం 9,10 గంటలు దాటాక లేచి , ఉరుకులు పరుగులు పెడుతూ " టిఫిన్ వద్దు , భోజనము వద్దు , లంచ్ బాక్స్ వద్దు టైం లేదు " అని నానా హడావుడి చేసి అమ్మను నానా హైరాన పెట్టేస్తారు*

*తర్వాత వీళ్ళకు పెళ్ళిళై , ఉద్యోగాలకు పరిగెత్తుతూ, పిల్లల్ని కని అమ్మ నెత్తిన పడేసి , తమ సంతానానికి కూడా చాకిరీ చేసే అయాగా అమ్మను చేసేస్తారు.*

*మళ్ళీ అమ్మ కష్టాల కధ ప్రారంభం ..*

*అప్పటికే ఆ తల్లులకు 60 దాటి పోయి వయస్సు పై బడి , శరీరంలో ఓపిక నశించి , కాళ్ళ నెప్పులు , కీళ్ళ నెప్పులు , బి .పి . , షుగర్ , ఆయాసం , నీరసం , గుండె దడ వంటి వ్యాధులతో పీడించబడి బాధపడుతూ చాకిరీ చేయలేక, చేయడానికి ఓపిక లేదని ఎవరికీ చెప్పుకోలేక తమ లో తామే నా జీవితం ఇంతేనా ? ఈ చాకిరీకి అంతం లేదా ? దేవుడా !! ఏం పాపం చేసాను ? అని శోకించిన తల్లుల గురించి కూడా నాకు తెలుసు. అలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూసాను. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని చాకిరీ చేస్తారు ?*

*ఈ బాధలు చాలవన్నట్లు , భర్త ఆఫీసు నుంచి లేటుగా విసుగ్గా వచ్చి అడుగుతాడు భార్యను " పిల్లలు భోంచేసారా ? " అని. " ఇంకా తినలేదండీ " అనగానే కారణం దొరికింది కనుక " పిల్లలకు అన్నాలు కూడా పెట్టకుండా ఇంతవరకు నువ్వు వెలగబెడుతున్న రాచకార్యమేమిటి ?" అని భార్య మీద ఇంతెత్తున ఎగిరి పడతాడు. ఆ సమయానికి ఆ ఇల్లాలు అప్పుడే తీరుబడై ఏ T.V . నో చూస్తూ కూచుని ఉందనుకోండి , ఇక ఆయన ఉగ్ర నరసింహావతారం దాలుస్తాడు.*

*అంటే వేళకి భోజనము చేయని పిల్లల వల్ల మాటలు పడుతోంది మీ అమ్మ గారు. గ్రహించారా ?*

*మరి దీనికి పరిష్కారం?* -

 *తన తల్లి పడుతున్న కష్టాన్ని సంతానమైన అబ్బాయి కాని అమ్మాయి కాని గ్రహించాలి. అర్ధం చేసుకోవాలి ..*

🤱🤱🤱🤱🤱🤱🤱🤱

*తల్లికి సాయంచేసే విషయంలో ప్రతి బిడ్డా భాగం పంచుకోవాలి, వంటలో సాయం చేసే మాట దేవునికి ఎరుక. కనీసం మీ తిండి అయినా మీరు తినక పోతే ఎలా ?*

*25 ఏళ్ళు వచ్చినా డిగ్రీలు పూర్తయాక కూడా అమ్మ అన్నం ముద్దలు కలిపి మీ నోట్లో పెట్టాలంటే ఆమెకు ఒంట్లో ఓపిక ఉండవద్దా ?*

*ఈ విషయాలు కూడా చదువుకున్న వారికి మరొకరు చెప్పాలా .. ?*

*మాకన్నా ఉన్నతమైన చదువులు చదువుతున్న వారు మీరు,*
*మీ అంతట మీరే ఆలోచించుకోండి ...*

*అమ్మ కనిపించే దేవత, ఆమె కంట నీరొలకనివ్వకండి. పువ్వుల్లో పెట్టి చూడండి. నవమాసాలూ‌మోసి, కని, దాసీగా మనలను సాకుతున్న దేవతామూర్తికి మనం ఏమిచ్చినా తక్కువే. ప్రతీ మాతృమూర్తికీ పాదాభివందనం*
*నా సోదరిలందరికీ నమస్సులు*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

సాంస్కృతిక వైభవం























మంచి మాటలు


       *బంధాలు* వాటంతటవే *దూరం* కావు , *వ్యక్తిత్వం* వల్లనో *ప్రవర్తన* వల్లనో ఒకరి పట్ల ఒకరు *నిర్లక్ష్యం* చూపడం వల్లనో అవి దూరమవుతాయి .

      *నిజాలు* మాట్లాడే వారు ఎప్పుడూ *ఒంటరిగా* మిగిలిపోతారూ *నిజాయితీగా* ప్రేమించే వారి *ప్రేమను* ఎప్పుటికి పొందలేరూ *బంధాలు* ప్రేమించే వారు ఎప్పుడు *కష్టపడుతూనే* ఉంటారూ *కుటుంబం* కోసం *కష్ట* పడేవారినీ ఎప్పటికి *సుఖ* పడనివ్వరూ . పదిమంది కోసం పాటుపడే వారు *నిందపాలు* అవుతూనే ఉంటారు . *కానీ మనిషి* గా మంచివారి *మనస్సులలో శాశ్వతంగా* ఉంటారు .

     డబ్బు *మనిషిని* పైకి తీసుకెళ్ళ గలదు , అందులో ఎటువంటి అనుమానం లేదు , *కానీ!* మనిషి *పైకి వెళ్ళేటప్పుడు* డబ్బుని తీసుకెళ్ళలేదు ఇందులోను ఎంటువంటి *అనుమానం లేదు !* ఐనా మనిషి *ఆకలి* కోసం చేసే *పోరాటం* కన్నా *పైసలు* కోసం చేసే పోరాటమే ఎక్కువైంది . ఇది *పచ్చి నిజం*

    ఒక వ్యక్తిని *అపార్థం* చేసుకునే ముందు ఆ వ్యక్తి *గతంలో* మనతో ఎలా ఉండేవారో *గుర్తు* చేసుకుంటే *నిజానిజాలు* అర్థమవుతాయి . ఒక్కోసారి మన *కళ్ళే మనల్ని మోసం* చేస్తాయి . అందుకే *గతం* మరిచిపోవద్దు నేస్తమా .

     సంపాదించడం అంటే కేవలం *డబ్బే* కాదు , మనషుల *విలువలను* కూడా సంపాదించాలి *కష్టాల్లో* ఉన్నప్పుడు మనల్ని *గట్టెకించే* వారిని సంపాదించాలి *భాదల్లో* ఉన్నప్పుడు *ధైర్యాన్ని* నింపే వారిని సంపాదించాలి .

 సేకరణ 🖋️ *మీ ... ఏ వి బి సుబ్బారావు 💐🌹🕉️🤝

సంభవామి యుగే యుగే

*🕉️సంభవామి యుగే యుగే!🕉️*

ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతీ యుగంలో జన్మిస్తూనే ఉంటానని భగవద్గీత నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ.

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్‌
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!

‘‘అర్జునా! మంచి వారిని రక్షిస్తాను, చెడ్డవారిని శిక్షిస్తాను. ధర్మసంస్థాపన కోసం ప్రతియుగంలో జన్మిస్తాను’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా జన్మించాడు. కలియుగంలో కల్కి అవతారంగా జన్మిస్తాడు. ఇక్కడ అవతారాల ఆంతర్యాన్ని గమనించండి. మొదట మత్య్సావతారం. పూర్తిగా నీటిలో ఉండే జీవి. ఈ అవతారంలో సోమకాసురుణ్ణి సంహరించి, వేదాలను రక్షించాడు. సోమకాసురుడు వేదాలను తీసుకెళ్ళి నీటిలో పెట్టాడు. అందుకే భగవంతుడు మత్స్యావతారం ఎత్తాడు. సమూహ శక్తి, సామాజిక శక్తిలో నుంచి భగవంతుడి అవతారం పుడుతుంది. తరువాత కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం. ఐదో అవతారం వామనమూర్తి. ఆరో అవతారం పరశురామ అవతారం. ఏడో అవతారం పరిపూర్ణ మానవావతారం రామావతారం. ఆ తరువాత శ్రీకృష్ణావతారం. చివరగా తొమ్మిదోది బుద్ధుని అవతారం.

ఇక కల్కి అవతారం.

*-:గరికిపాటి నరసింహారావు*

కరోనా తొ భయపడనవసరంలేదు




దశిక రాము**



*క్షీరోదన్వత్ ప్రదేశే*
*శుచి మణి విలసత్**
* *సైకతేమౌక్తికానాం*
*మాలాక్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైర్మండితాంగః*
*శుభ్రై-రభ్రై-రదభ్రై-రుపరివిరచితై-ర్ముక్త పీయూష వర్షైః*
*ఆనందీ నః పునీయా దరినళిన గదా శంఖపాణి-ర్ముకుందః.*

*తా:-* స్వచ్ఛమైన మణులతో కూడిన ఇసుకతిన్నెలు గల క్షీరసాగరంలో,ముత్యాల హారాలు ధరించి,మణులతో అలంకరింపబడిన సింహాసనంపై ఆసీనుడై,తెల్లని మేఘసమూహాల నుండి జాలువారిన అమృతవర్ష ధారలచే ప్రకాశిస్తూ,శంఖం,చక్రం,గద,పద్మాలను ధరించి ఆనందమయుడైన ముకుందుడు మనలను పవిత్రులను చేయుగాక.

**మన సంస్కృతి సాంప్రదాయాలు**




**శ్రీఅనంతపద్మనాభస్వామి** దేవాలయం ,కేరళ.🙏

అనంతపద్మనాభుడు అనగా నాభి (బొడ్డు) యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్ధం. శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం శ్రీమహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళా రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది.

చరిత్ర:

ట్రావంకోర్ రాజకుటుంబం చేర వంశానికి చెందిన వారు అలాగే కులశేఖర సన్యాసి ఆళ్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీమహావిష్ణు యొక్క 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యదేశములు అంటే శ్రీమహావిష్ణువు యొక్క ఆలయాలు ఉన్న దివ్యక్షేత్రాలు అని అర్ధం. శ్రీమత్భాగవతంలో బలరామదేవుడు తన తీర్ధయాత్రలో భాగంగా ఫాల్గుణం (ప్రస్తుత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం ) అనే ఈ దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పంచప్సరసులో (పద్మతీర్థంలో) స్నానం చేసినట్లు అలాగే పది వేల ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తుంది. తమిళ ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది (6వ శతాబ్దం-9వ శతాబ్దం).

క్రీ.శ 16వ శతాబ్దం అంతా ఈ ఆలయం అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అపుడు ఈ ఆలయ సుందరగోపుర నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ప్రసిద్ధ తిరువట్రార్ శ్రీ ఆదికేశవపెరుమాళ్ ఆలయానికి ప్రతిరూపం. ఈ ఆలయం కారణంగా కేరళా రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. 'తిరు అనంత పురం ' అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని యొక్క పవిత్ర ఆలయం అని అర్ధం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభస్వరూపమే. హిందుధర్మం భగవంతుడి రూపం సచ్చిదానందం అని చెప్తుంది. (సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి మరియు సంపూర్ణ ఆనందం).

ఆలయ గర్భగృహంలో ప్రధాన దైవమైన పద్మనాభస్వామి అనంతశయనం భంగిమలో (అనంతశేషుడి తల్పం మీద యోగనిద్ర)ఉంటాడు. ట్రివాంకోర్ మహారాజా తనకు తానే పద్మనాభదాసుడని నామకరణం చేసుకున్నాడు. ముఖద్వారం వద్ద హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అన్న ప్రకటన ఉంటుంది. భక్తులకు లోపల ప్రవేశించడానికి ప్రత్యేక మైన వస్త్రధారణ చేయాలన్న నియమం కూడా ఉంది.

అనంత సంపద:

ఇప్పటివరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన తిరుపతి తిరుమల వడ్డి కాసుల వాడు... ఈ మధ్య కాలంలో కేరళ తిరువనంత పురంలోని అనంత పద్మ నాభ స్వామి వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు, వైడుర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు మొదలగు వాటితొ లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో మొదటి స్థానంలో నిలబడగా రెండో స్థానంలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు రెండో స్థానంలో నిలవాల్సి వచ్చింది. ఇంకా బయట పడవలసిన సంపద వున్నందున పూర్తి స్థాయిలో సంపద నంతటిని లెక్కకట్టాల్సి ఉంది. ఆలయంలో దేవునికి సంబంధించిన సంపద నేల మాళిగలలో దాచి వున్నది తెలుసు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసిన పాపాన పోలేదు. 1860 లో మూసివేసిన కొన్ని గదులను మాత్రం 1950 లో సీల్ వేశారు.

స్వాతంత్ర్యానంతరం స్థానిక ఆలయాలన్నిటిని ట్రావెంకూర్ దేవస్తానం బోర్డులో విలీనం చేసినా ఈ ఆలయాన్ని మాత్రం రాజ కుటుంబీకులే తమ పర్వవేక్షణ క్రిందనే వుంచు కున్నారు. ఆ కుటుంబానికి చెందిన చివరి రాజు వితిర్ తిరునాళ్ బలారామ వర్మను అప్పటి ప్రభుత్వం రాజ ప్రముఖ్ గా ప్రకటించింది. ఆ రాజ కుటుంబీకులే ఈ ఆలయ నిర్వహణ ట్రస్టీలుగా కొనసాగారు. ప్రస్తుతం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఉత్తరదామ్ తిరుణాల్ మార్తాండ ట్రస్టీగా కొనసాగుతున్నారు. ఈ ఆలయ సంపద నిర్వహణలో అస్తవ్యస్తంగా వున్నదని దాన్ని గాడిలో పెట్టాలని టి.పి. సుందర రాజన్ అనే న్యాయ వాది సుప్రీం కోర్టులో దావా వేయగా, సుప్రిం కోర్టు ఒక కమిటీని వేసి ఆ సంపదను లెక్కించాలని ఆదేశించింది. ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపదవెలుగుచూసింది.
ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి వుంచ బడి వున్నదని తెలుస్తున్నది. ఇప్పటివరకే బయట పడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయల్పడిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి. పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఇంత సంపద బయల్పడినా ఇంకా అతి పెద్దది, అతి ముఖ్యమైనది అయిన ఆరో గది తెరవాల్సి ఉంది.

వైష్ణవ దివ్యదేశం:

శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
   శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
   అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
   ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||

విశేషం: ఇది కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణము. సన్నిధి కోట మధ్య భాగమున ఉంది. ఇక్కడ స్వామిని మూడు ద్వారములలో దర్శించాలి. ఈ స్వామి విషయమై నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళి ప్రబంధములో (10-2)"అరవిల్ పళ్లి పైన్ఱవన్ పాతజ్గాణ నడుమినో సమర్‌ కళుళ్లీర్" భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.

శ్రీరంగమున అధ్యయనోత్సవమున అరయరులు ఈ పాశురమును గానము చేయగా విని ఆళవందార్లు ఆనందపరవశులై ఆళ్వార్లు కీర్తించిన ఈ క్షేత్రమునకు పోయిరావలయునని వెంటనే తిరువనంతపురమునకు వెళ్ళాడు.

"కురుగైక్కావలప్పన్" అనువారు ఆళ్వందార్లకు యోగరహస్యములను ఉపదేశింప దలచి ఒక సుముహూర్తమును నిర్ణయించాడు. కాని ఆళవందార్లు ఆదినమున తిరువనంతపురములో ఉండేవాడు. ఆకారణమున యోగరహస్యము వారికి లభించ లేదు. "అయ్యో! పుష్పక విమానమైనను లేదే. ఉన్నచో కురుగైక్కావలప్పన్ సన్నిధికి చేరి యోగరహస్యములను పొంది యుండు వారమే" యని ఆళవందార్లు భావించారట.

ఈక్షేత్రమున సేవింపవలసిన విశేషములు పెక్కులు గలవు.ఇచటికి సమీపమునగల "యానైమలై", అగస్త్య పర్వతము, ఏలకకాయల కొండ చూడదగినవి.
🙏🙏🙏
సేకరణ

*ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏

**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**

**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏 

క్రొత్త పదాలు

💐: క్రింద ఇచ్చిన ప్రతి కుడియెడమ పదాలకు తగినైన రెండక్షరాల పదాన్ని, మొదటి పదానికి చివర, దాన్నే రెండవ పదానికి మొదట జోడించి రెండు క్రొత్త పదాలు పొందగలరు.💐

*ఉదాహరణ: కంద......పార*
*జవాబు: కందగడ్డ, గడ్డపార*

01. వెండి......చాప
02. చేతి........సాము
03. మందు....మల్లె
04. ఉక్క.......పాలు
05. మణి.......కథ
06. పూల......యాత్ర
07. ఇంటి.......గడ
08. బొట్టు.......గోచి
09. సిగ..........చీర
10. అల.........వాన
11. మేక.........రాజు
12. మట్టి........ధారి
13. పాల........గోడ
14. సుడి........పటం
15. పులి........వంక
16. చుర.........పీట
17. చెవి..........గాడు
18. నిండు.......పోత
19. కను..........జాజి
20. నర...........పీఠం
21. ఎగ...........బొట్టు
22. బోడి..........సూది
23. పాము.......వాడు
24. చింత.........బలం
25. నిప్పు.........నిద్ర
26. కుక్క..........చుక్క
27. లెక్క...........బడి
28. గద్ద............చెంబు
29. జన్మ...........దారు
30. నిద్ర............మందు
31. అర............మీను
32. వెన్న...........బంతి

తెలుగువాడి

తెలుగువాడి రుచి... చక్కని అభిరుచి
డాక్టర్‌ జి.వి.పూర్ణచందు, విజయవాడ, 9440172642

 
అప్పచ్చులంటే సరదాగా తినే తినుబండారాలు. వాటిని పండక్కో, పబ్బానికో తయారు చేసుకుంటాం. అతిథులొచ్చిన సమయాన్ని కూడా పబ్బం అనే అంటారు. పండుగలూ, పబ్బాలూ అనేవి సంతోషంగా గడిపే సమయాలు మనకి!
తెలుగువారి తొలి పండుగ ఉగాది ‘పచ్చడి’ తినడంతోనే మొదలవుతుంది.. ‘ఉగాది పచ్చడి’ మనకు దైవ ప్రసాదం! నైవేద్యం పెట్టి భక్తితో తింటాం.
ఆధునిక వైద్యశాస్త్రం ఆహారంలో పోషక విలువల్ని విటమిన్లు, మినరల్స్‌, ప్రొటీన్ల నిష్పత్తిని బట్టి కొలుస్తుంది. ఆయుర్వేదశాస్త్రం ఆరు రుచుల నిష్పత్తినిబట్టి నిర్ణయిస్తుంది.
 తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు ఈ ఆరు రుచులూ కలిసిన వంటకం షడ్రసోపేతమైందని అంటారు. అనేక పోషకాలు కలిగిన బలమైన ఆహారం అని దీని భావం. ‘ఉగాది పచ్చడి’ ఆరు రుచులతో కూడిన పదార్థం. దాన్ని పండగ ప్రసాదంగా తినమనేది ఎందుకంటే రోజూ మన ఆహారం ఇలా షడ్రసోపేతంగా ఉండాలని చెప్పటానికే!
వేపపూల పచ్చడి ఒక చేదు టానిక్‌
వేపపూలతో ఉగాది పచ్చడినే కాకుండా రోజువారీగా తినే పచ్చడిగా కూడా చేసుకుని మన పూర్వీకులు ఇష్టంగా తినేవారు.
 ఆది నుంచీ తెలుగు వారు పచ్చడి ప్రియులు. ఉత్తర భారతీయులు ఊరగాయ పచ్చడిని ‘అచార్‌’ అంటారు. అచి, అచ్చర్‌, అచ్చడ్‌, పచ్చడి ఇవన్నీ ఒకే మూలంలోంచి పుట్టిన పదాలు. అట్లతో తినడానికైనా, అన్నంతో తినడానికైనా పచ్చడి అనుకూలంగా ఉంటుంది. అందులో వగరూ, చేదు కలుపుకునేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి, కూరకన్నా పచ్చడిలో గుణగణాలెక్కువ! వేపపూల పచ్చడి ఒక టానిక్‌లాగా పని చేస్తుంది. 100 గ్రాముల పచ్చడిలో 60 గ్రాములు పులుపు ఉంటే, వగరు, చేదు కలిసినప్పుడు అది 30 గ్రాములకు తగ్గుతుంది. ఆ మేరకు గొప్ప మేలు జరిగినట్టే కదా!
ఉగాది వచ్చే సమయానికి చేదుకోసం వేపపూత, పులుపు కోసం కొత్త చింతపండు, వగరు కోసం లేతమామిడి, తీపి కోసం కొత్తబెల్లం అందుబాటులోకొస్తాయి కాబట్టి, వీటితో ‘ఉగాది పచ్చడి’ని నింబకుసుమ భక్ష్యం (వేపపూల పచ్చడి)గా చేసుకుంటారు.
 ఈ సమయంలోనే వేపపూలు సేకరించి, కడిగి శుభ్రం చేసుకొని ఎండబెట్టి లేదా దోరగా వేయించి సంవత్సరం పొడవునా నిల్వ ఉంచుకుంటారు. ఇందులో చేదుతోపాటు ఆరు రుచులూ ఉండేలా బెల్లం, మిరియాలపొడి, ఉప్పు, చింతపండు, పసుపు తగినంతగా కలిపి మెత్తగా నూరి ఇంగువ తాలింపు పెట్టి ‘వేపపూల పచ్చడి’ చేసుకుంటారు. రోజూ అన్నంలో రెండు ముద్దలైనా దీన్ని తినటం మంచిదని చాటి చెప్పడానికే ఉగాది పచ్చడిని ప్రసాదంగా తినే ఆచారం ఏర్పడింది.
వగరూ చేదు రుచుల్ని మరిచిపోవటం వల్ల శరీరంలో ‘చేదులోపం’ ఏర్పడి, మధుమేహం లాంటి వ్యాధులకు కారణం అవుతుంది. కాబట్టి, ‘చేదును కొంచెంగానైనా రోజూ తినండి’ అనే ప్రబోధం ఉగాది పచ్చడి ఇస్తుంది. ఇంకో చేదు ఏదీ మన వంటకాల్లో లేనప్పుడు వేపపూల పచ్చడి కలుపుకొని తినండి.
ఆరు రుచులతో అద్భుతం
 ‘పులిహోర’ తరతరాలుగా తెలుగు వారికి ప్రీతిపాత్రమైంది, పవిత్రమైంది. దైవ సంబంధమైంది. ఆరు రుచుల సమ్మేళనం కావడంతో ఆరోగ్యదాయకం కూడా!
పులిహోర మన వారసత్వ సంపద! తెలుగు పండుగ రోజున తెలుగింటి తొలి వంటకంగా పులిహోరని తినటం... మన ప్రాచీనతను గుర్తు చేసుకోవటమే.
పులిహోరలో చింతపండు రసం ప్రధానం. దానికి బెల్లం, పటిక బెల్లం, ఆవపిండి విరుగుళ్లు. అంటే, చింతపండు కలిగించే దోషాలను ఇవి నివారిస్తాయన్న మాట! కాబట్టి, పులిహోరలో చింతపండు రసంతోపాటు బెల్లం, పసుపు, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆవపిండీ తగుపాళ్లలో కలిపి ఇంగువ తాలింపు వేస్తారు. ఆవపిండి, మెంతిపిండి ద్వారా వగరూ చేదు కలిసి పులుపు వల్ల వచ్చే తీవ్రమైన వాత, పైత్య వ్యాధుల్నీ నివారించేదిగా ఉంటుంది.
నిమ్మకాయ, మామిడి, దబ్బకాయ, పంపర పనసకాయ, రాతి ఉసిరికాయ, దానిమ్మకాయ, టమాటో, చింతకాయ, అటుకుల, మరమరాలు లేదా బొరుగులు, జొన్నరవ్వ, బియ్యపు రవ్వ, సజ్జ రవ్వ... ఇలా దేంతో పులిహోర చేసుకున్నా బెల్లం, పసుపు, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఆవపిండీ, మెంతిపిండీ, కలిపి ఇంగువ తాలింపు వేసుకుంటే ఆ పులిహోర రుచి వర్ణనాతీతం.
అష్టగుణ మండం
బియ్యపు రవ్వలో సగం పెసర రవ్వ కలిపి ఉడికించాలి. అందులో ఇంగువ, ఉప్పు, ధనియాలు, శొంఠి, మిరియాలు, పిప్పళ్లు ఈ ఆరింటినీ సమభాగాలుగా తీసుకొని మెత్తగా దంచిన పొడిని కలుపుకుంటే అదే అష్టగుణ మండం. మండం అంటే, ఒక విధమైన చిక్కని గంజి. దీన్నే పాటేజీ, సాసు లేదా సూపు అంటున్నాం. ఇది బియ్యపురవ్వ, పెసరరవ్వలతో కాచిన పాటేజీ. తేలికగా అరుగుతుంది. మేధాశక్తిని పెంచి, శరీర పుష్టినీ కలిగిస్తుంది.
ఊర్పు
‘‘మేలింపు చవిగుల్కు తాలింపు వంకాయ యూర్పులు గొనియాడ నేర్పు గలదే...’’- అని ‘రాజవాహన విజయం’ కావ్యంలో కాకుమాని మూర్తికవి ‘తాలింపు వంకాయ ఊర్పు’ గురించి ప్రస్తావించాడు. శుకసప్తతి కావ్యంలో కదిరీపతి నాయకుడు ‘‘ఓఱపు దనరార జేపల యూర్పు గూర యిడిన...’’ అంటూ వలపునంతా నింపి వండిన చేపల ఊర్పు గురించి గొప్పగా చెప్పాడు. మధ్యయుగాల్లో ఊర్పు ప్రసిద్ధం.
‘ఉరియు’ అంటే కాల్చటం. తేలికగా వేగటాన్ని లేదా కాల్చటాన్ని ‘ఉర్పెలుట’ అంటారు. కొన్ని రకాల కూరగాయల్ని కుమ్ములో పెట్టిగానీ, సన్నని సెగ మీద ఉంచిగానీ ఉర్పెలనీయాలి. దాన్ని చిదిమి పులుపు కలిపి తాలింపు పెడితే అది ‘ఊర్పు’! ఓవెన్లో గ్రిల్‌ కూడా చేయవచ్చు. దీన్ని చిదిమి చింతపండు పులుసు, బెల్లం కలిపి, సుగంధద్రవ్యాలతో తాలింపు పెట్టిన వంటకమే ఊర్పు. దీన్ని మనం పచ్చిపులుసు అంటున్నాం ఇప్పుడు.
వంకాయ, దోసకాయ, వెలగపండు, అరటికాయ, మామిడికాయ, బెండకాయ, కాకరకాయ ఊర్పులు తెలుగిళ్లలో ప్రసిద్ధాలు. కొత్తతరం వీటన్నింటినీ మరిచిపోతోంది. పచ్చిపులుసు ఇప్పటికీ తింటున్నా, ఊర్పు అనే పేరుని మరిచిపోయాం కదా! కొన్నాళ్లకి ఈ వంటకం కూడా అలానే మరుగున పడిపోతుంది.
వెన్న పడిదెం
‘‘చప్పుడుగాగ నాస్వాదించి జుర్రుజుర్రున బడిదంబు జుర్రుచు గర్రుగర్రున ద్రేన్చుచు.’’ పాల్కురికి సోమనాథ కవి ‘పడిదం’ అనే వంటకాన్ని ఎలా తిన్నారో వర్ణించాడు. దీన్ని బట్టి ఈ వంటకాన్ని కనీసం వెయ్యేళ్ల నుంచీ తెలుగు ప్రజలు ఇష్టంగా తింటున్నారని అర్థమవుతోంది. జవ్వాది, కస్తూరి లాంటి సుగంధ ద్రవ్యాలు ఈ పడిదం ముందు చిన్నబోతాయని శ్రీనాథుడూ ప్రస్తుతించాడు. అంతటి కమ్మనైన వంటకం పడిదెం. దాన్ని వెన్నపూసతో నంజుకొంటే వెన్నపడిదెం అవుతుంది. పడిదెం అంటే ఉలవచారు లాంటి ఒక కమ్మని ద్రవరూప వంటకం.
 ఉలవలు మూత్రపిండాలను బాగు చేసి, గుర్రం అంత శక్తిని కలిగిస్తాయి. ఉలవల వెన్న పడిదెం ఉగాది ప్రత్యేకం కావాలి.
దూదిమణుగులు
‘దూదిమణుగు’ ప్రాచీన కాలం నుంచీ తెలుగు వారు ఇష్టంగా తిన్న ఒక తీపి వంటకం. శ్రీరంగ మాహాత్మ్యం కావ్యంలో అమృత ఫలాదులతోపాటు, అప్పడాల కొండలు, వడల కుప్పలు, దూదిమడుగుల మహాపర్వతాలు వడ్డనకి సిద్ధంగా ఉంచారని భైరవకవి వర్ణించాడు.
మడగు, మడుగు, మణుగు, మణగు అనే పదాలకు తగ్గు, లొంగు, వొంచు, మడచు అని అర్థాలు. మడతలు వేసిన వంటకాన్ని మడుగులు లేక మనుగులు అని పిలిచారు. గోధుమ పిండితో చిన్న అప్పడం వత్తి, వేలితో నేతిని నలువైపులా రాసి, చపాతీలా నాలుగు మడతలు మడిచి మళ్లీ వత్తుతారు. ప్రతిసారీ నెయ్యి రాస్తూ ఇలా ఏడుసార్లు మడిచి వత్తుతూ, రొట్టె లోపలికి నేతిని బాగా ఎక్కిస్తారు. అంటే, ఒక్కొక్కదానిలో కనీసం ఇరవై ఎనిమిది పొరలుంటాయన్న మాట! దాన్ని నూనెలో వేసి వేయించి పంచదార పాకంలో ముంచుతారు. అవి తెల్లగా దూది అంటించినట్టుగా ఉంటాయి. ఇవీ దూదిమణుగులంటే!
ఇవి ఎక్కువ కేలరీలు కలిగిన పోషక ద్రవ్యం. ఎదిగే పిల్లలకు అనుకూలంగా ఉంటాయి. మనసుకు ప్రశాంతతనీ, తృప్తినీ కలిగిస్తాయి. శుష్కించి పోతున్న వారికి బలవర్ధక ఔషధం. గోధుమల్ని నానబెట్టి మూటగడితే మొలకెత్తుతాయి. వాటిని ఎండించి మర పట్టిస్తే గోధుమ మాల్టు అంటారు. దీంతో చేసిన దూది మణుగులు మరింత పోషకంగా ఉంటాయి.
పాఠోళీ
నానిన బియ్యాన్నీ, కడిగిన అటుకుల్నీ, లేత కొబ్బరి కోరునీ కలిపి మెత్తగా రుబ్బి, పసుపు ఆకు లేదా అరటాకు మీద అట్టులా పరుస్తారు. చెంచాడు బెల్లం పాకాన్ని దాని మధ్యలో ఉంచి, ఈ ఆకుని మధ్యకు మడిచి ఆవిరి మీద ఆకుతో సహా ఇడ్లీలా ఉడికిస్తారు. ఉడికిన తరువాత ఆకులోంచి తీస్తే అదే తియ్యని పాఠోళీ!
కోనసీమలో ‘పొట్టేక్కల్‌’ పేరుతో ఇలాంటి వంటకమే ఒకటి వ్యాప్తిలో ఉంది. పనస ఆకుల్ని శంఖం ఆకారంలో దొన్నెలు కుట్టి, ఇడ్లీ పిండి ఆవిరి మీద ఉడికిస్తారు. తీపి లేకుండా తయారు చేసిన ఈ పాఠోళి లేదా పొట్టెక్కల్‌ పొద్దునపూట ఇడ్లీలా తినటానికి అనువుగా ఉంటాయి. ధనియాల పొడి, ఇంగువ, కొత్తిమీర, మిరియాల పొడి కలిపి కూడా తయారు చేసుకోవచ్చు.
తిమ్మనం, తేమనం
‘తాల తిమ్మనం’ అంటే తాలింపు పెట్టిన కారపు వంటకం! ‘పాక తిమ్మనం’ అంటే బెల్లం, బియ్యప్పిండి కలిపి పాకం పట్టిన తీపి వంటకం.
రుబ్బిన బియ్యప్పిండిని ఒక మందపాటి బట్టలో వడగడితే చిక్కని పాలలాంటి ద్రవపదార్థం దిగుతుంది. ఈ పాలలో బెల్లం వేసి గరిట జారుగా పాకం పడితే అది పాక తిమ్మనం. ఏలకులు, జీడిపప్పు, పచ్చకర్పూరం, ఎండుద్రాక్ష (కిస్మిస్‌) కలుపుకోవచ్చు. పాలు లేని పాయసం ఇది! రాగి, జొన్న, సజ్జ, గోధుమల్ని కూడా బియ్యానికి బదులుగా వాడుకోవచ్చు.
తెలుగులో ‘తిమ్మనం’ సంస్కృతంలో తేమనం ఒకటే! క్రీ.శ. 12వ శతాబ్ది నాటి ‘బిమలప్రబంధం’ గ్రంథంలో తేమనం అనే వంటకం గురించి ఉంది. పెరుగుని వడగట్టి, నీళ్లు తీసేసి చిలికి అందులో సంబారాలన్నీ వేసి తాలింపు పెట్టిన మజ్జిగ పులుసుని తేమనం అంటారు. గుజరాతీలు ఇందులో చిట్టిగారెలు గానీ, చిన్న ఉండల్లాంటి పునుగులుగానీ నానబెట్టుకొని తింటారు. శనగపప్పు నానబెట్టి, కొబ్బరి, అల్లం, మిరియాలు, వాము కలిపి గట్టిగా రుబ్బి ఉండలుగా చేసి మజ్జిగ పులుసులో ఉడికిస్తారు. ఇవి తాలతిమ్మనలు. వీటిని మోరుండలు అని కూడా అంటారు. గత వెయ్యేళ్లుగా ఇది దేశవ్యాప్త వంటకం అయి ఉంటుంది. కడీపకోడీ అంటే ఇదే.
గారెలూ, వడలూ, ఆవడలూ
మినప్పప్పుతో తయారయ్యేవి గారెలని శబ్దరత్నాకరం పేర్కొంది. మినప్పప్పుతో కాకుండా ఇతర పప్పుధాన్యాలతో వండిన వాటిని వడ శబ్దంతో కూడా వ్యవహరించి ఉంటారు. వివిధ రకాల ధాన్యాలు, పప్పు ధాన్యాలతో వడలు వండుకోవచ్చు. రుబ్బిన మినప్పిండిలో మొక్క గట్టిన రాగుల పిండి, అల్లం, మిరియాలు, ఉల్లి, కొత్తిమీర, పుదీనా లాంటివి కలిపి చిల్లు పెట్టకుండా వండిన వడలు నూనె పీల్చకుండా ఉంటాయి. తేలికగా అరుగుతాయి. అరటి, బీర, వంకాయ, క్యాబేజీ, ఆలు, క్యారెట్‌, బీట్‌రూట్‌ ఇలా రకరకాల కూరగాయలతో కూడా గారెలు వేసుకోవచ్చు. వాము ఆకుతో వడ చాలా రుచిగా ఉంటుంది.
ఆవ పెట్టిన పెరుగులో నానబెట్టిన వడల్ని ఆవవడలు లేక ఆవడలు అంటారు. దహీవడ, తైరువడలుగా ఇవి దక్షిణాదిలో ప్రసిద్ధి. వడాపావ్‌ అనే పేరు ఎక్కువ వ్యాప్తిలో ఉంది. ఆవపిండి కలిపిన పెరుగులో నానిన గారెలు వాతం చెయ్యకుండా ఉంటాయి. కడుపు ఉబ్బరం కలగదు. శరీరానికి బలం.
అంగారపోళికలు, మడుగు పూలు
గోధుమ పిండిని తడిపి అందులో తీపి కలిపి నిమ్మకాయంత బంతి/ బిళ్లలా చేస్తే దాన్ని ‘పోలి’ అంటారు. దీన్ని నిప్పుల్లో వేసి మగ్గనిస్తారు. వేరుశనగ కాయల్ని తంపట వేసుకొనే పద్ధతిలో దీన్ని కాలుస్తారు. లేదా వేడి కుమ్ములో పెడతారు. ఓవెనులో గ్రిల్‌ చేసి కూడా కాల్చవచ్చు. చల్లారిన తరువాత పైన మాడిన బెరడు తొలగిస్తే, లోపల తెల్లని పువ్వులా విచ్చుకొని కనిపించేది పోలిక. నిప్పుల మీద కాలుస్తారు కాబట్టి అంగార పోళిక అన్నారు. దీన్నే శ్రీనాథుడు అంగార పూవియ అన్నాడు. దీన్నే మడతలు వేసి కాలిస్తే ‘మడుగు పూవులు’ అంటారు. తియ్యని పాలలో గానీ, కారపు సూపులో గానీ వీటిని నంజుకుంటూ తినవచ్చు. ఇది ‘తెలుగు’ బేకింగ్‌ ప్రక్రియ. ‘భావ ప్రకాశ వైద్యం’లో దీని తయారీ విధానం ఉంది.
ఇలా మన తెలుగు వంటకాలు అన్నింటినీ ఒకచోట చేరిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. ఇప్పుడు మనం తింటున్న వేపుడన్నం (ఫ్రైడ్‌రైస్‌), పరోటా, నాన్‌, బర్గర్లవంటి వంటకాలన్నీ మన పూర్వులు కూడా తిన్నారు. వాళ్లూ దేశీయమైన రీతిలో జీవితాన్ని ఆనందించారు. మనం వాళ్లకు వారసులం కదా! మన వంటకాల్లో తెలుగుదనం పట్ల అభిరుచిని పెంచుకుందాం! తెలుగు పండుగ రోజున వాటిని తలచుకుందాం!
(2014 ఉగాది “తెలుగు వెలుగు”లో ప్రచురితం)

* * *