17, మార్చి 2023, శుక్రవారం

తాంత్రిక గ్రంథాలలో

 ప్రాచీన తాంత్రిక గ్రంథాలలో వివరించిన నిధుల రహస్యాలు - 


 ప్రియమితృలకు నమస్కారం , 


       నిధి అనగానే చాలమంది బంగారం , వజ్రాలు అని మాత్రమే అనుకుంటారు. అంతకంటే విలువయిన సంపద అనగా వైద్యానికి , మంత్రశాస్త్రానికి మరియు తంత్రశాస్త్రానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు రాసి ఉన్న తాళపత్ర గ్రంథాలు, రాగిరేకులు పైన చెక్కినటువంటి ఎంతో విలువైన విషయాలు కొన్నికొన్ని రహస్య ప్రదేశాలలో ఈ భూగర్భంలో దాచబడి ఉన్నాయి. అవి వెలికి తీసి అందులో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు . ధనం ను కూడా భూగర్భం నందు దాచిన దానిని కూడా నిధి అంటారు. 


            నిధులు అనేవి ముఖ్యంగా మూడు  రకాలుగా దాచబడి ఉంటాయి.  అందులో మొదటి దాని గురించి చెప్పాలి అంటే జనం దాచుకున్న సోమ్ము . ప్రాచీన కాలంలో ఇప్పటిలా బ్యాంకులు ఉండేవి కావు. ఆ సమయంలో జనం ఇళ్లల్లో , పొలాల్లో తమకు తెలిసిన ప్రదేశాలలో తమ దగ్గర ఉన్న బంగారాన్ని కుండలలో పెట్టి దాచేవారు . అదే సమయంలొ అంటువ్యాధులు చాలా తీవ్రంగా ఉండేవి . మొత్తం వూరిలో శవాన్ని తీయుటకు మనుషుల కూడా లేకుండా మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అలా మరణించుటకు కారణం అయ్యే వ్యాధి పేరు "కలరా" అవి అలా ఉండిపోయి అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.


                 ఇక మనం రెండోవరకం నిధుల గురించి తెలుసుకుందాం . ఈ నిధులు గజదొంగలు వూర్లపైన పడి దోచుకొని కొండ గుహలలో దాచి ఉంచే నిధి . ఈ దాచి ఉంచిన స్థలం వారు మధ్యలో మరణిస్తే వారితోనే అంతం అయిపోతుంది.


          మూడో రకం నిధుల గురించి చెప్పలంటే వీటిని రాజ నిధులు అంటారు. ఇవి పూర్తి ఉద్దేశ 

పూర్వకంగా అత్యంత రహస్య ప్రదేశాలలో మంత్ర,యంత్ర పూజా సమేతంగా నిక్షిప్తం చేస్తారు . ఈ పూజకొరకు చాలా శక్తిమంతం గా ఉండే అస్ఖలిత బ్రహ్మచారులు ను ఉపయోగిస్తారు . ఎక్కువుగా పక్క రాజ్యాల దండయాత్రల సమయంలో ముఖ్యంగా మనదేశంలో బ్రిటిష్ వారి నుంచి తమ రాజ్య ఖజానా కాపాడుకొనుట కొరకు  రాజులు ఈ పద్దతి పాటిస్తారు. ఈ పద్దతిలో రాజు ఎక్కడో ఒకచోట ఈ నిధి గురించిన రహస్యాన్ని పేర్కొంటాడు . అటువంటి కొన్ని మ్యాప్స్ నేను పరిశీలించాను . 


         ఈ శక్తిమంతం అయిన మంత్రపూర్వకంగా దాచి ఉంచిన నిధులను మాంత్రిక , తాంత్రిక వేత్తలు 4 రకాలుగా వర్గీకరించారు  వీటి గురించి శ్రీకంఠ శంభునాథ సిద్దుడు రచించిన "నిధిప్రదీపం" అను గ్రంథం నందు చాలా వివరంగా తెలియజేశాడు . ఈ బుక్ సంస్కృతంలో 1930 లో ముద్రించబడినది.  


              శివుడు ఉపదేశించిన ప్రకారం ఈ నిధులు అనేవి 4 రకాలు .  అవి 


  *   కచ్చప .


 *    మకర .


 *    శంఖ .


 *    పద్మ .


        వీటిలో కచ్చప , మకర నిధులు మాత్రమే స్థిరంగా , అచంచలంగా ఒకేచోట ఉండును. వీటిని ప్రయత్నముచేత , శివానుగ్రహము చేత మాత్రమే పొందగలరు . 


            మిగిలిన శంఖ, పద్మ నిధులు అనేవి మానవుని శబ్దం వినపడిన వెంటనే చంచలమై వేరొక స్థానమునకు వెళ్లిపోవును .వీటిని సాధించుట అసంభవం . శివ, విష్ణు , అమ్మవారి మంత్రముల సిద్ధి పొందిన వారికి మాత్రమే అవి లభ్యం అగును. 


   నిధులు ఉన్న ప్రదేశాలను గుర్తించుటకు కొన్ని గుర్తులు  - 


 *  ఏ ప్రదేశం నందు భూమి నుంచి తామర పువ్వుల వాసన వచ్చుచుండునో ఆ స్థలం నందు నిధి ఉండును అని తెలుసుకొనవలెను .


 *  డేగలు , కాకులు , కొంగలు ఏ ప్రదేశం నందు ఎక్కువ గా సంచరించుచుండునో ఆ స్థలం యందు నిధి ఉండును.


 *  కాకులు విశేష ప్రీతితో సంభోగం చేయుచుండునో అక్కడ నిధి ఉండును. 


 *  ఒక ప్రదేశం నందు అనేక  వృక్షాలు ఉన్నను ఒకే చెట్టు పైన పక్షులు అన్నియు కలిసి నివసించుచుండిన ఆ స్థలం నందు నిధి ఉండునని తెలుసుకొనవలెను .


 *  పురాతన దేవాలయాల యందు , పాడైపోయిన చెరువుల యందు , పాడిపడిన గ్రామాల యందు నిధి ఉండును. 


 *  ప్రతినిత్యం పశువులు మేస్తున్ననూ తెల్లవారే సరికి మిగిలిన ప్రదేశం కంటే నిధి ఉన్న ప్రదెశం నందు గడ్డి తొందరగా పెరుగును . 


 *  ఆకురాలు సమయంలో మిగిలిన చెట్ల ఆకులు ఎండిపోయినను ఏ చెట్టు ఆకులు కోల్పోకుండా పచ్చగా పుష్పాలతో వికసించి ఉండునో ఆ చెట్టు క్రింద తప్పక నిధి ఉండును. 


         పైన చెప్పిన విధముగా చాలా పద్ధతులు ఉన్నాయి . స్థలాభావం వల్లన వివరించలేకున్నా . 


  భూగర్బంలో ఉన్న నిధిని కనుగొనుటకు పురాతన పద్దతి  - 


       ఒక కొత్త కుండ నిండగా గోమూత్రం తీసుకుని నిధి ఉన్నది అనుకున్న ప్రదేశం నందు గోమూత్రంతో నింపి ఉన్న కుండను పాతిపెట్టి ఉంచవలెను . 7 రాత్రులు గడిచిన తరువాత ఆ కుండ పాతిపెట్టబడిన  స్థలం నందు జాగ్రత్తగా తవ్విచూడగా ఆ కుండ యందలి గోమూత్రం హరించిపోయి  ఆ కుండ శిదిలిం అయ్యి ఉన్నచో ఆస్థానమున నిధి ఉన్నదని గుర్తించవలెను.


          

 గమనిక  - 


          ఈ నిధుల వేటలో పడి చాలా మంది కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు . దయచేసి అత్యాశకి పోకండి .మీకు దక్కాలని రాసి ఉంటే ఆ సర్వేశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు .


    

  

         మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


  గమనిక  -


     నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      కాళహస్తి వేంకటేశ్వరరావు 

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


          ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

మంచిని

 శ్లోకం:☝️

*విషాదప్యమృతం గ్రాహ్యం*

 *బాలాదపి సుభాషితమ్ l*

*అమిత్రాదపి సద్వృత్తమ్*

 *అమేధ్యాదపి కాంచనమ్ ॥*


భావం: మట్టి నుండి వచ్చిన బంగారం ఎలా ఆమోదయోగ్యమైనదో - విషం నుండి కూడా అమృతాన్ని గ్రహించవచ్చు. మంచి మాటని బాలుని నుండి కూడా తీసుకోవచ్చు. శత్రువు చేసిన మంచి పని/ప్రవర్తన కూడా అభినందనీయమే! మంచిని ఎక్కడ నుంచైనా గ్రహించవచ్చునని భావం.

మౌనం అంటే ఏమిటి?

 *శుభోదయం*

🙏💐💐🙏


*మౌనం అంటే ఏమిటి?*


మౌనం అంటే మాటలు లేని మూగతనం కాదు.. 


మౌనం అంటే భాషకు భావం లేకుండటం కాదు..


మౌనం అంటే చిత్త వృత్తులతో సతమతమవడం కాదు...

 

మౌనం అంటే మాట శబ్దాన్ని కోల్పోవడం కాదు..

.  

*మరి మౌనానికి అర్థం?* 


మౌనం అంటే మనసు మూగపోవడం.. 


మౌనం అంటే మనసులో భావం లేకుండటం...


మౌనం అంటే మనసును అంతర్ముఖం చేయడం....

 

మౌనం అంటే తనను తాను దర్శించడం...


*మౌనంలో ఏం జరుగుతుంది?*


మౌనంలో మనసు శూన్యం అవుతుంది..


మౌనంలో భాష లోని భావం మూగపోతుంది.. 


మౌనంలో చిత్త వృత్తులు నశిస్థాయి.. 



మౌనంలో ఏ భావమూ లేని, ఏ శబ్దమూ లేని,  శాశ్వత మైన పరమాత్మ తత్వం ఎరుక కలుగుతుంది... 



ఆ ఎరుక కోసమే ఎందరో ఎన్నో దారులలో ప్రయాణించారు... 


*మౌనం కూడా అందులో ఒక దారి...* 


ప్రయాణించి చూద్దామా?... 

మౌనిగా ఉండిపోదామా..?


🙏🙏🙏🙏

ఎవరికివారే బాధ్యులు

: *ఆత్మానమేవ మన్యేత కర్తారం సుఖ దుఃఖయోః|*

*తస్మాత్ శ్రేయస్కరం మార్గం ప్రతిపద్యేతనత్రచేత్||*

                                 

ఆరోగ్యంగా ఉండడానికైనా, రోగాలబారిన పడడానికైనా ఎవరికివారే బాధ్యులు. అందుచే, శ్రేయస్కరమైన దారిని వెతుక్కోవాలి. అప్పుడే, ఆరోగ్యాన్ని గురించిన చింత ఉండదు. 


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

:

 ఈశ్వరుడు అష్టవిధ మూర్తి. కాళిదాస మహాకవి ఈశ్వరుడి అష్టమూర్తి తత్త్వాన్ని ఇలా స్తోత్రం చేశాడు. యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధి హుతాం యా హవిర్యా చహోత్రీ యే ద్వే కాలం విధత్తః శ్రుతి విషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్|| యామాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవనః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః || 'నేల, అగ్ని, నీరు, గాలి, ఆకాశం అనే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, 'నేను' అనే యజమాని- ఈ ఎనిమిది రూపాలలో ఈశ్వరుడు విరాజిల్లుతున్నాడు. విశ్వరూపుడు, మహత్తర శక్తి కలిగిన పరమాత్మ అయిన రుద్రుడిని ఏకాదశ రుద్రాభిషేకాలతో ప్రసన్నుడిని చేయడం వల్ల ప్రకృతి ప్రశాంతత పొందుతుంది' అని వివరించాడు కాళిదాస కవి.

స్నేహితుని సహాయం


ఈ రథయాత్ర అప్పుడే మరొక భక్తుడు తనకు జరిగిన సంఘటనను కూడా అక్కడున్నవారితో పంచుకున్నాడు. ఈ సంఘటన పరమాచార్య స్వామివారి అపార కరుణకు నిదర్శనం.


పేదరికం అతణ్ణి ఎన్నో కష్టాలపాలు చేసింది. అదే సంవత్సరం 1984లో పరమాచార్య స్వామివారు తిరుమంగలక్కుడిలో మకాం చేస్తున్నప్పుడు, ఈ పేదవాడు రోజూ ఆ చోటుకు వెళ్ళేవాడు. ఇతనికి పరమాచార్య స్వామివారు ఎవరని కాని, మహాస్వామి వారి గొప్పతనం కాని తెలియదు. కనుక అతనికి స్వామివారిపై ప్రత్యేకమైన భక్తి ఏమీ లేదు. కాని పేదరికం వల్ల రోజూ కనీసం ఒక్కపూట భోజనం కూడా లేకపోవడంతో, కేవలం ఉదర పోషణార్థం అతను అక్కడకు వెళ్ళేవాడు. అక్కడకు వెళ్ళడం వల్ల కడుపు నిండినా పేదరికం పోలేదు.


మహాస్వామివారు అక్కడినుండి వేరోక్కచోటుకు వెళ్తే, అతనికి ఆ ఒక్కపూట భోజనం కూడా దొరకదు. అయిదు మంది ఉన్న కుటుంబాన్ని పోషించలేక, అప్పులు ఎక్కువై, ఆదాయం లేక చివరకు ఆత్మహత్య తప్ప వేరొక దారి లేదని నిశ్చయించుకున్నాడు.


నిర్ణయం తీసుకుని చివరిసారిగా చనిపోయే ముందు అందరూ గొప్పగా చెప్పుకునే కంచి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళాడు.


అంజలై లాగే ఇతను కూడా నమ్మకంతి కాకుండా ఊరికే స్వామివారిని చూసి తరువాత చనిపోదామని కంచి చేరుకున్నాడు.


ఏమి మాట్లాడకుండా పరమాచార్య స్వామి వారి ముందర నిలబడ్డాడు.

అందరినీ చూసే కరుణాపూరితమైన చూపులతో స్వామివారు అతణ్ణి చూశారు. సర్వజ్ఞులైన స్వామివారు అతణ్ణి ఒక ప్రశ్న అడిగారు, “నీ తరువాతి కార్యక్రమమ ఏమిటి?”.


జీవితం చివర్లో నిలబడియున్న ఆ నిరుపేద ఏమని సమాధానం చెబుతాడు. తాను జీవితాన్ని చాలించాలని నిశ్చయించుకున్నట్లు చెప్పగలడా? “ఏమి చెయ్యాలో నాకు తెలియదు సామి! నేను నా స్థానాన్ని చేరుకోవాలి” అని జీవితం పైన ఆశ చచ్చిపోయిన స్వరంతో, నిరాశ నిస్పృహలు తొంగిచూస్తున్న మాటలతో చెప్పాడు.

“నేను నీకు బస్సుకు డబ్బులు ఏర్పాటు చేస్తాను. నేరుగా నీ ఊరికి వెళ్ళవద్దు. ఇక్కడి నుండి సరాసరి మద్రాసుకు వెళ్ళు. అక్కడ ప్యారీస్ కార్నర్ లో బస్సు దిగి, అక్కడి నుండి మీ ఊరికి బస్సులో వెళ్ళు” అని ఆజ్ఞాపించారు స్వామివారు.

అక్కడే ఉన్న శిష్యులకు ఇక్కడి నుండి మద్రాసుకు, అక్కడి నుండి తన ఊరికి సరిపడా డబ్బులు ఇవ్వమని ఆదేశించారు.


ఎందుకు ఈ సామి పడమరన వేలూరుకు దగ్గరలో ఉన్న తన ఊరికి వెళ్ళడానికి తూర్పున ఉన్న మద్రాసుకు వెళ్లి మరలా అక్కడి నుండి ఊరికి వెళ్ళమని చెబుతున్నారో అతనికి అర్థం కాలేదు. కాని స్వామివారి ఆదేశం కాబట్టి పాటించాడు.


చెన్నైలో ప్యారీస్ కార్నర్ లో దిగి తన ఊరికి వెళ్ళే బస్సు కోసం వెతుకుతున్నాడు. భగవంతుడు పంపినట్టుగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఇతని స్నేహితుడే! చాలా కాలం తరువాత ఇతన్ను చూడడంతో అతను చాలా సంతోషించాడు. దగ్గరలో ఉన్న హోటలుకు తీసుకునివెళ్ళి ఆహారం ఇప్పించాడు. చాలా అకాలితో ఉండడంతో సంతోషంగా తినేశాడు. తన గురించి, కుటుంబం గురించి అడగడంతో, ఇక తట్టుకోవడం చేతకాక ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు.


ఇతను సాక్షాత్తు పరమేశ్వరుడు పంపిన స్నేహితుడు కదా మరి. అతణ్ణి ఓదార్చి మంచి మాటలతో అనునయించాడు. అతని అప్పులన్నీ తీర్చి, కొద్దిగా ధన సహాయం కూడా చేసి కుటుంబాన్ని కూడా ఆదుకుంటానని మాటిచ్చాడు.

అంతటి దీనస్థితి నుండి స్నేహితుని సహాయం వల్ల బయటపడి, ఉద్యోగం కూడా పొంది ఇరవైఅయిదేళ్ళ తరువాత కుమార్తె వివాహం కూడా చేశాడు. పరమాచార్య స్వామివారి ఇప్పుడు రథయాత్రలో శిలా రూపంలో ఇటు రావడంతో కృతజ్ఞతతో కళ్ళ నీరు కారుస్తూ, తన కథను చెప్పుకున్నాడు.


అంతటి కరుణారూపమైన ఈ భగవంతునిపై మనకున్న భక్తి చేత స్వామివారే మనల్ని ఆశీర్వదించి, మనలను కాపాడి, అన్ని సౌఖ్యాలు కలగజేస్తారు.


--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సాక్షీభూతులుగా

 .


         _*సుభాషితమ్*_


శ్లో.

*సూర్యస్సోమో యమఃకాలో*

*మహాభూతాని పఞ్చచ|*

*ఏతేశుభాశుభస్యేహ*

*కర్మణో నవసాక్షిణః||*


భావము:

*సూర్యుఁడు, చన్ద్రుఁడు, యముఁడు, కాలపురుషుఁడు, పఞ్చభూతములైన..నిఙ్గి, నీరు, నిప్పు, భూమి, వాయువు, ఇహములో మనుజుఁడు ఆచరించే *శుభాఽశుభ కర్మలకు ఈ తొమ్మండుగురు సాక్షీభూతులుగా వర్తిస్తారుట*....

16, మార్చి 2023, గురువారం

సంసారంలో సారమైనది

 శ్లోకం||

అసారే ఖలు సంసారే సారం శ్వశురమన్దిరమ్|

క్షీరాబ్ధౌ చ హరిః శేతే శివః శేతే హిమాలయే|

 

తాత్పర్యము-

సారవిహీనమైన ఈ సంసారంలో సారమైనది మామగారి ఇల్లే, అందుచేతనే విష్ణువు క్షీరసముద్రంలో (లక్ష్మి పుట్టిల్లు) శయనిస్తున్నాడు, శివుడు హిమాలయం మీద (హిమాలయంలో భాగమైన కైలాసం మీద)

శయనిస్తునాడు.


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

జీవితం

"గెలవాలి అంటే.. కష్టాలను ఓర్చుకోవాలి,,


"బ్రతకాలి అంటే.. ఇష్టాలని మార్చుకోవాలి,,


"ఒకటి కావాలి అంటే.. మరొకటి ఒదులుకోవాలి,,


!...అదే జీవితం...!



సంచితఫలం

  సంచితఫలం !

🍁🍁🍁🍁🍁


ప్రపంచంలో ఏ మనిషి బతకాలన్నా డబ్బు అవసరం.డబ్బు లేకుంటే ఏ మనిషీ గడప దాటి వెళ్లలేడు.వెళ్లినా ఏ పనినీ సాధించలేడు.ఇది నిత్యసత్యం ! అయితే మనిషికి డబ్బు వస్తున్నప్పుడు దానిని అనుభవించాలి.లేదా దానం చేయాలి.అంతేకానీ అపారంగా కూడబెట్టకూడదు.కూడబెట్టిన డబ్బును ఇతరులు దోచుకుంటారు.దీనికి ఉదాహరణ తేనెటీగలు.అవి ఎంతో శ్రమించి పుష్పరసాన్ని ( తేనెను ) తెచ్చి,ఒకచోట కూడబెడుతాయి.కానీ ఏం లాభం? ఆ తేనెలను మనుషులు దోచుకొని పోతారు.అందుకే మనిషి డబ్బును పుష్కలంగా కూడబెట్టకూడదు.ఇంత మంచి నీతిని ఒక ప్రాచీననీతికారుడు ఎంత బాగా చెప్పాడో చూడండి:


'దాతవ్యం భోక్తవ్యం

ధనవిషయే సంచయో న కర్తవ్య:

పశ్యేహ మధుకరీణాం

సంచితార్థం హరంత్యన్యే !'





            _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*గుణో భూషయతే రూపం*, 

*శీలం భూషయతే కులమ్।*

*సిద్ధిర్భూషయతే విద్యాం*,

*భోగో భూషయతే ధనమ్....॥*

                                    - సూక్తిరత్నావళి.


తా𝕝𝕝 *గుణము రూపమునకు వన్నె దెచ్చును... శీలము కులము నకు వన్నె దెచ్చును.... సిద్ధి విద్యను అలంకరించును. భోగము ధనమునకు వన్నె దెచ్చును*....

ముందు నిర్ణయం!*

 🙏 నమస్కారం అండి 🙏


🙏 *ఓం నారాయణ- ఆదినారాయణ* 🙏


*గ్రంథం:* అమృత వాక్కులు, భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య స్వామివారి దివ్య బోధలు

*రచన:* శ్రీ పెసల సుబ్బరామయ్య మాష్టర్ 


*అంతా ముందు నిర్ణయం!*


ఏఏ జీవి ఏమి తినాలో? ఏమి అనుభవించాలో? ముందే నిర్ణయించబడి భూమి మీద పుడుతారు. అంతకుమించి ఏమీ అనుభవించలేడు. ఆశతో సంపాదించినా ఇనుప పెట్టెలలోను, బ్యాంకులలోను స్థిరాస్తుల రూపాలలో ఉంటే వాటికి కాపలాగా ఉండవలసిందే. తన సంపాదన ఇతరజీవుల రూపంలోని భగవంతునకై వెచ్చిస్తే భగవంతుడు గొప్పగా తృప్తి చెంది ఆశీర్వదిస్తాడని తమ ఆచరణతో శ్రీ స్వామి వారు చూచి నేర్చుకొని తరించమన్నారు. అంతటి విశ్వాసము, ఆచరణ ఉంటే సద్గురువే మనలను వెతుక్కుంటూ వస్తారని బోధిస్తున్నారు. 


*తన గురువుకు ప్రతిరూపమైన అగ్నిని ఒక్క క్షణం ఏమారకుండా సేవించారు. ఈ విశ్వమంతా తన గురురూపమే గనుక అన్ని జీవులూ తన గురురూపంగా భావించి సేవించారు.* సేవిస్తున్నారు. జీవుల గతచరిత్రనే చూడకుండా తన్నాశ్రయించిన ప్రతివారినీ ఆదుకుంటున్నారు. తనయందు విశ్వాసం గల్గి తన మార్గాన జీవిస్తారని చూస్తున్నారు. బొత్తిగా మనలో మార్పేలేకుండా వ్యాపార సరళిలో ప్రవర్తిస్తూ ఇది చేస్తే అది ఇస్తాననే మన నడవడిలో మార్పులేకుంటే *పొయ్యేవాళ్ళను పోనిచ్చేదే గదయ్యా!* అన్నారు. ఇది నేటికీ అక్షరాల నిజమై ఉంది.


🙏 *ఓం నారాయణ -ఆది నారాయణ*🙏


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీసాయినాథ ప్రబోధామృతము పారాయణ.*


రచన:- శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు


             *నూత్న యుగానికి వినూత్న బోధ*


“శ్రీ సాయిసచ్చరిత్ర”లో సాయి చెప్పినట్లు ఆయనబోధ అత్యద్భుతము అద్వితీయము (అధ్యాయం 18). ఆయన స్థితినిగానీ, బోధనుగాని అర్ధం చేసుకోవడఁ చాలాకష్టం. కారణం తాము సద్గురువునని ఆయన ఎన్నడూ చెప్పుకోలేదు. తమను భక్తులెలా భావించవలసినది. సేవించవలసినదీ చెప్పని అత్యంత నిరాడంబరుడు కాని అది తెలియక వారి భక్తులు ఉత్తమ ప్రయోజనం పొందలేకపోవడం గూడ ఆయనకు సమ్మతంగాదు. అందుకే ఆ విషయాలు వారికీ తెలియగలందుకే 'శ్రీగురుచరిత్ర' పారాయణ విధించారు. అయితే ప్రతివారికీ అలా చెప్పలేదు గదా, అంటే అందరూ ముముక్షువులుండరు, ఆ మాట వారే చెప్పారు మామిడిపూత ఉదాహరణతోనూ తనను లౌకిక ప్రయోజనాలాశించి ఆశ్రయిస్తారని చెప్పినపుడూ, మరికొందరికి భిన్నమైన అభిప్రాయాలు దృఢంగానాటుకొని యుండడం వలన సాయి చెప్పినా వారికి శ్రద్ధకల్గదు ఈనాడు మనలోగూడ చాలామందికిది తెలిసినా కలగనట్లే.



మానవుడు

 *శుభోదయం* 💐🙏


మనిషిని *మానవుడు* అని ఎందుకు అంటారు? 


అమ్మలో చివరి అక్షరం 

*మా*

నాన్నలో చివరి అక్షరం 

*న*

గురువులో చివరి అక్షరం.         

 *వు*

దేవుడు లో చివరి అక్షరం

*డు*


అమ్మలోని *ప్రేమ*

నాన్నలోని *బాధ్యత*

గురువులోని *జ్ఞానము*

దేవుడిలోని *ఆత్మ* స్వరూపమే.. *మానవుడు*



సాటి జీవకోటి పట్ల *ప్రేమతో*,  


ప్రకృతి పట్ల *బాధ్యతగా* వ్యవహరిస్తూ,

  

ఈ సృష్టి అంతా తనలాంటి 

*ఆత్మ స్వరూపమే* 


అనే *జ్ఞానం* 

కలిగి ఉండటమే 


*మానవత్వం* 

🙏🙏