26, ఫిబ్రవరి 2026, గురువారం

*శ్రీ మహావిష్ణు పురాణం* ➖➖➖✍️ ఏడవ భాగం

  

        *శ్రీ మహావిష్ణు పురాణం*

                ➖➖➖✍️

                  ఏడవ భాగం


*మధుకైటభ సంహారం:```

విష్ణమాయను ఆవాహింప చేసుకున్న శ్రీమహావిష్ణువు అనేక వేల సంవత్సరాలు యోగ నిద్రలోకి వెళ్లి పోయాడు. కొన్ని వేల సంవత్సరాల నిద్ర తరువాత శ్రీమహావిష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి ఒక శబ్దం ఉత్పన్నమైంది. ఆ శబ్దం క్రమక్రమంగా ఓంకారంగా మారి ప్రణవ నాదమయ్యింది. ప్రణవనాద శబ్దానికి సృష్టికర్త, అయ్యాడు కనుక విష్ణువు "శబ్దబ్రహ్మ". అయ్యాడు. ఈ ఓంకార శబ్దం నుండి శబ్దరూప మైన వేదము ఆవిర్భవించింది. కనుక మహావిష్ణువు వేదమూల మైన "వేద బ్రహ్మ" గా ప్రసిద్ది పొందాడు.


వేదము ఉచ్ఛ్వాస నిశ్వాసగా చేసుకుని నిద్రిస్తున్న విష్ణువు నాభి నుంచి ఒక పుష్పకాండము జనించి పెరగసాగింది. ఆ కాండము పైన ఒక మొగ్గ ఏర్పడి పుష్పించి మహా పద్మము అయ్యింది. పదహారు రేకులు గల ఆ మహా పద్మము ప్రకృతికి ప్రతిరూపమైనది. యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు మాయా మోహితుడై ఉండడం వలన అతని శరీరం నుండి ఒక భ్రమరం జనించింది. తుమ్మెద రూపం దాల్చిన మహావిష్ణువు మహా పద్మము వాలి ప్రణవనాదము చేస్తూ పద్మముతో సంపర్కమయాడు. పురుషుడు ప్రకృతి సంపర్కం వలన పద్మము నుండి విష్ణు తేజస్సుతో చతుర్ముఖుడు, చతుర్భుజుడు బంగారు ఛాయ శరీరంతో పద్మసంభవుడు జన్మించాడు. ఉదరములో పుట్టుకతోనే హిరణ్యము కలిగి ఉండటం వలన హిరణ్యగర్భుడు అయ్యాడు. పరబ్రహ్మము తేజస్సు నుండి పుట్టిన పరబ్రహ్మ పుత్రుడు "బ్రహ్మ" అయ్యాడు.


జన్మించిన బ్రహ్మదేవుడు నాలుగువైపుల నాలుగు ముఖాలతో చూశాడు. అన్ని వైపుల నీరే కనిపించింది. పదహారు రేకులు గలిగి మహాపద్మములో ఆసీనుడైన బ్రహ్మ పద్మము యొక్క కాండము వైపు చూశాడు. నూరుయోజనాల వరకు దూరం కాండము కింద వైపు కలిగివుంది. "చుట్టూ జలం ఉన్నప్పుడు తను ఎలాజన్మించాడు" అనే సందేహం బ్రహ్మకు కలిగింది.

సమాధానంగా ఓంకారనాదము వినిపించ సాగింది. ఈఓంకారము జపిస్తే తన జన్మరహస్యం తెలియవచ్చు అని అనిపించి ఓంకారము జపిస్తూ ధ్యాన నిష్టలో మునిగి పోయాడు.. అనేక సంవత్సరాల జపం తరువాత బ్రహ్మదేవునికి దివ్య దృష్టి లభించింది. దివ్యదృష్టితో తన జన్మకు కారకుడైన శ్రీమహావిష్ణువు అనంత జలరాశి పై యోగనిద్రలో కనపడ్డాడు.


అశరీరవాణి శయనిస్తున్న నారాయణుడే నీ తండ్రి అని పలికింది. తన తండ్రిని చూసిన ఆనందంతో బ్రహ్మదేవుడు చేతులు జోడించి భక్తి శ్రద్థలతో నమస్కరించాడు. ఆయన ముఖం వెంట "ఓం నమో నారాయణాయ" అని అష్టాక్షరి మంత్రం పుట్టుకు వచ్చింది. వెంటనే ఆ మంత్రంతో తపస్సు చేయి" అన్నట్టు "తపః తపః" అనే ఆదేశం వినిపించింది.


హిరణ్యగర్భుడు నారాయణమంత్రం జపిస్తూ వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. అయినా తన జన్మకారణం, తనకర్తవ్యం తెలియరాలేదు. చుట్టూ మహాజలథి మాత్రమే కన్పిస్తోంది. దివ్యదృష్టితో కనిపించిన తన తండ్రి నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను కలసే మార్గం ఏది?" అనుకుంటూ చింతాక్రాంతుడైనాడు.


అదే సమయంలో చాలా కాలము యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు చెవులలో ఏర్పడిన గుబిలి జలప్రవాహము తాకిడి వలన చెవుల నుండి బయటకు వచ్చింది. విష్ణువుని ఆవరించిన యోగమాయ స్పర్శతో ఆ గుబిలి రూపాలు పొంది మధు కైటభులు అనే కవల రాక్షస సోదరులుగా జన్మించారు. గుబిలి మాలిన్యంతో నల్లని శరీరము పొందిన వారు "మేము ఎవరం? మా నామధేయాలు ఏమిటి?" అని గట్టిగా అరవసాగారు.


అశరీరవాణి వారితో "మీరు పరబ్రహ్మ చెవి గుబిలి నుండి జన్మించారు. మీ నామధేయాలు మధు కైటభులు. మీకు స్వేచ్ఛా మరణం వరంగా లభించింది" అని పలికింది. 

వారు అహంకారం పొంది "మమ్మలి ఎదిరించే వారు ఎవరైనా ఉన్నారా!" అంటూ సవాలు చేస్తూ నీటిలో ఈదుతూ ముందుకెళ్ళారు. వంద యోజనాల దూరం వెళ్లగా ఒక మహాపద్మం కనిపించింది. ఆ పద్మము నుండి "ఓం నమో నారాయణాయ" అని జపము చేస్తున్న శబ్దం వినిపించ సాగింది.


మధు కైటభులు కాండము పట్టుకుని పైకెక్కి బ్రహ్మ ఎదుట నిలుచున్నారు. ధ్యానభంగం కలిగిన బ్రహ్మ కన్నులు తెరచి మధుకైటభులను చూసి ఆశ్చర్యపడ్డాడు. జన్మించిన పిమ్మట తండ్రి మహావిష్ణువు తరువాత చూసినది ఈ ఇరువురు దేహధారులనే. బ్రహ్మ సంశయం తీరుస్తూ "మేము మధుకైటభులము. స్వేచ్ఛామరణం వరంగా పొందాము. నీతో యుద్దం చేసి మా బలం నిరూపించుకుంటాము. ఇంతకీ నీవెవరు?" అని అడిగారు.


బ్రహ్మ "నేను చతుర్ముఖ బ్రహ్మను. పరబ్రహ్మమైన నారాయణుడు నా తండ్రి. నా జన్మకి కారణం, నా కర్తవ్యం తెలుసుకోవాలని తపస్సు చేస్తున్నాను. కనుక మీతో యుద్దం చేయలేను" అనడంతో మధుకైటభులు "అయితే మీ తండ్రి ఎక్కడో చెప్పు! ఆయనతోనే యుద్దం చేస్తాం" అన్నారు. 


బ్రహ్మ నిట్టూర్చి "నా తండ్రి నారాయణుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. నారాయణ మంత్రం జపించడం వలన లభించిన దివ్యదృష్టితో ఒక్కసారి మాత్రమే చూడగలిగాను" అని సమాధాన మిచ్చాడు.


"అయితే మంత్రం మాకు ఉపదేశించు! మేము ఆయన దర్శనం పొంది యుద్దం చేస్తాము" అని మధుకైటభులు అనడంతో బ్రహ్మ "తాను సృష్టించిన నారాయణ మంత్రం మరొకరికి ఉపదేశం చేసి గురు స్థానం పొందుతున్నాడు" అని సంతోషపడ్డాడు.  


అష్టాక్షరి మంత్రాన్ని మధుకైటభులకు ఉపదేశించాడు. నారాయణ మంత్రం జపం చేస్తూ వేల సంవత్సరాలు గడిపారు. తాము జపించేది ముక్తి ప్రసాదించే దివ్య మంత్రం అని వారికి తెలియదు.


మంత్రసిద్ధి లభించడంతో వారు బ్రహ్మను వదలి నారాయణుడు ఉండే ప్రదేశానికి వెళ్ళారు. నారాయణుడు నిద్ర లేచి వీరిని చూశాడు. "మేము నీతో యుద్దం చేయాలని మంత్రం జపం చేసాము. మాతో యుద్దం చేయి" అని మధుకైటభులు కోరిన కోరికకు అంగీకరించి విష్ణువు యుద్దానికే సిద్దమయ్యాడు. 


యుద్ధం ప్రారంభమై ఐదువేల సంవత్సరాలు గడిచాయి. ఎవరికీ విజయం లభించలేదు.


మహావిష్ణువు "నారాయణ మంత్రం జపంతో అజేయులైన వీరిని జయించడం సాధ్యం కాదు. ఉపాయంతోనే వీరి సంహారం చేయాలి" అని తలచి వారితో "నాతో ఇంతకాలం పోరాడిన మీ శౌర్యం నాకు నచ్చింది. మీ వీరత్వానికి మెచ్చి వరం ఇస్తాను. కోరుకోండి" అన్నాడు. మధుకైటభులకు విష్ణువు తమ శౌర్యాన్ని పొగిడేసరికే గర్వం కలిగి "మమ్మల్ని జయించ లేని నీవు వరము ఇవ్వటం మేమిటి? మేమే నీకు వరం ఇస్తాము. కోరుకో" అని అహంకారంతో పలికారు.


వెంటనే విష్ణువు "మీరు వరం ఇచ్చేది నిజమైతే, మీరిరువురు నాచేతిలో మరణించేట్టు వరము ఇవ్వండి" అని వరం కోరాడు. 


మధుకైటభులు ఉలిక్కిపడ్డారు. తమ అహంకారమే తమ చావు తెచ్చింది అని గ్రహించారు. తప్పించుకునే ఉపాయం ఆలోచించి "నారాయణా! నీవు కోరిన వరం ఇస్తున్నాము. ఆడిన మాట తప్పం. కానీ ఒక నియమము పాటించాలి. నీరు లేని చోట మాత్రమే మమ్మల్ని నీవు సంహరించ గలవు" అన్నారు.  


సమస్తం నీటితో నిండి ఉంది కనుక విష్ణువు తమని చంపలేడు అని ధైర్యం వారిది.


విష్ణువు దుర్గాదేవిని మనస్సులో తలచుకుని "దేవీ! మధుకైటభులను సంహరించే శక్తి నాకు ప్రసాదించు!" అని అడిగాడు.  


దుర్గాదేవి వెంటనే ఆ మాయాశక్తి ప్రసాదించింది.  


విష్ణువు వెంటనే తన ఊరువులను (తొడలను) పెంచి వాటితో మొత్తం నీరు కనపడకుండా ఆక్రమించాడు. మధుకైటభులకు విష్ణువు చేతిలో తమ మరణం తప్పదని అర్థమైంది.


చక్రం ధరించిన విష్ణువు "మీరు కోరుకున్నట్లే నీటిచుక్క లేని నా ఊరువుల పై మిమ్మల్ని చక్రాయుధంతో సంహరిస్తాను" అన్నాడు. 


మధుకైటభులని అహంకార మద గర్వాలు వదలి పోయాయి. భక్తితో చేతులు జోడించి "నారాయణా! నీ అష్టాక్షరి మంత్ర జపంతో మేము ధన్యులమయ్యాము. మాకు ఇస్తామన్న వరం ఇచ్చి మమ్మల్ని చరితార్థులని చేయుము" అని కోరారు. 


తథాస్తు అని శ్రీమహావిష్ణువు వారిని తన ఊరువులపై తీసుకుని చక్రంతో సంహరించాడు.✍️

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఆనందం అయినవాళ్ళతో పంచుకో

 *🙏🙏 సర్వేజనా: సుఖినోభవన్తు🙏🙏*


*శుభోదయం*

 -------------------

🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

"ఆనందం అయినవాళ్ళతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

"గతంలో నిన్ను బాధ పెట్టిన ఏదైనా విషయాన్ని మర్చిపో కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మరచిపోకు."


🌻🌻🌻🌻🌻🌻🕉️ 

*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*


*సర్వేజనా: సుఖినోభవన్తు - శుభమస్తు🙏*

----------------------------------------

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి*


*🙏🙏🙏భగవంతునిపై విశ్వాసమే భక్తులకు రక్ష*


భగవంతునిపై మనకు పరిపూర్ణమైన, అచంచలమైన విశ్వాసముంటేనే ఆయన దర్శనం,రక్షణ లభిస్తాయి.అయితే ఆ విశ్వాసం ఏమాత్రం సడలనిదై ఉండాలి.దీనికి ఉదాహరణగా ఓ కథ.


ఓ ఊళ్ళో భక్తురాలైన ఓ గొల్ల వనిత ఉండేది. ఆమె ఊళ్ళోని ఏటికి అవతలవైపు ఉన్న ఓ బ్రాహ్మణుని యింటికి రోజూ పాలు తీసుకుని వెళ్లి అమ్ముతుండేది. రోజూ ఆమె ఆలస్యంగా వస్తుండడంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ “ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్?” అని అడిగేడు. దానికా గొల్లవనిత “ నేను ఇంటిదగ్గరనుండి పెందలకడనే బయలుదేరుతున్నాను.కాని ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యమవుతుంది.ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటేవాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమవుతుంది.” అని చెప్పింది. “ భగవన్నామస్మరణ చేస్తూ సంసారసాగరాన్నే ఈదవచ్చు కదా! అలాంటిది ఈ ఏటిని దాటలేవా?” అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా .అలా అనగానే ఆ గొల్లవనిత ‘ఇదేదో బాగుందే’ అనుకుంటూ వెళ్ళిపోయింది.


మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు “ ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంత ముందుగా ఎలా వచ్చేవ్?” అని అడిగేడు. దానికా గొల్లవనిత “ మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటి వచ్చేసేను.నాకింక ఆ తెప్పవాడితో పనిలేదు.” అని చెప్పింది. అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతి పోయింది.”అయితే నువ్వు ఏరు ఎలా దాటేవో నాకు చూపిస్తావా?” అని అడిగేడు.” ఓ దానికేం భాగ్యం? నాతో రండి.” అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్లి “ మీరూ రండి.” అంటూ తాను ఏటి మీద నడచుకుంటూ వెళ్లిపోసాగింది. కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచె పైకెత్తుకుని ఏటిలో దిగడానికి అవస్థలు పడుతున్నాడు. వెంటనే గొల్లవనిత “ అదేంటి స్వామీ? దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటేయవచ్చని మీరే నాకు చెప్పేరు కదా! మరి మీరు అంత భయపడుతున్నారేంటి? అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట.” అంది.


నిజమేకదా! భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనేగా వెల్లడవుతుంది.


భగవంతునిపై విశ్వాసంతో, తీవ్రపరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది.రక్షణ లభిస్తుంది అనడానికి ఉదాహరణగా మరో కథ.


జటిలుడనే ఒక బాలకుడు రోజూ పాఠశాలకు వెళ్ళడానికి ఓ చిట్టడవిగుండా ఒంటరిగా పోవలసివచ్చేది. అలా వెళ్ళడానికి భయపడుతుండేవాడు. ఆ విషయం వాళ్ళమ్మకు చెప్పేడు. అప్పుడు ఆమె ఆ పిల్లవాని భయం పోగొట్టడానికి “ నీకు భయం వేసినప్పుడల్లా ‘కృష్ణా’ అని పిలువు.” అని చెప్పింది. “కృష్ణుడెవరమ్మా?” అని అడిగేడు ఆ అమాయకుడు. “కృష్ణుడు నీ అన్న” అని చెప్పింది తల్లి. “ అయితే సరేనమ్మా” అన్నాడు ఆనందంగా ఆ అర్భకుడు


మర్నాడు ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తూ త్రోవలో భయం వేసి ‘కృష్ణా’ అని పిలిచేడు. ఎవరూ రాకపోయేసరికి ఇంకా బిగ్గరగా “ అన్నా! కృష్ణా! ఎక్కడున్నావు? తొందరగా రా.నాకు భయమేస్తుంది. నాకు తోడుగా రా.” అని ఎలుగెత్తి పిలిచేడు. అంత నిష్కపటంగా మొరపెట్టుకుంటున్న పిల్లవాడి మొరను ఆలకించకుండా ఉంటాడా ఆ ఆర్తత్రాణ పరాయణుడు. వెంటనే కృష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి “ రా తమ్ముడూ! ఇంక నీకేం భయం ఉండదు. నీకు నేను తోడుగా ఉండి పాఠశాలవరకూ వచ్చి దిగబెడతానని అలాగే దిగబెట్టేడు.పైగా “ ఇక నీకు ఎప్పుడు భయం వేసినా నన్ను పిలువు.లేదా రోజూ పిలిచినా వస్తాను” అని చెప్పి అంతర్దానమైపోయేడు ఆ భక్తవత్సలుడు. అలా పసిపిల్లలకుండేలాంటి నిష్కల్మషమైన విశ్వాసం ఉండాలి భగవంతుడిపై మనకు.


ఇతర చింతనలన్నిటినీ మాని నన్నే స్మరించుచూ యే జనులు నన్ను శరణు పొంది ఉపాసించుచున్నారో ఆ జనులయొక్క యోగ క్షేమ భారాన్ని నిత్యం నేను వహిస్తాను.” అని భగవద్గీతలో *🙏🙏 సర్వేజనా: సుఖినోభవన్తు🙏🙏*


*శుభోదయం*

 -------------------

🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

"ఆనందం అయినవాళ్ళతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

"గతంలో నిన్ను బాధ పెట్టిన ఏదైనా విషయాన్ని మర్చిపో కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మరచిపోకు."


🌻🌻🌻🌻🌻🌻🕉️ 

*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*


*సర్వేజనా: సుఖినోభవన్తు - శుభమస్తు🙏*

----------------------------------------

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి*


*🙏🙏🙏భగవంతునిపై విశ్వాసమే భక్తులకు రక్ష*


భగవంతునిపై మనకు పరిపూర్ణమైన, అచంచలమైన విశ్వాసముంటేనే ఆయన దర్శనం,రక్షణ లభిస్తాయి.అయితే ఆ విశ్వాసం ఏమాత్రం సడలనిదై ఉండాలి.దీనికి ఉదాహరణగా ఓ కథ.


ఓ ఊళ్ళో భక్తురాలైన ఓ గొల్ల వనిత ఉండేది. ఆమె ఊళ్ళోని ఏటికి అవతలవైపు ఉన్న ఓ బ్రాహ్మణుని యింటికి రోజూ పాలు తీసుకుని వెళ్లి అమ్ముతుండేది. రోజూ ఆమె ఆలస్యంగా వస్తుండడంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ “ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్?” అని అడిగేడు. దానికా గొల్లవనిత “ నేను ఇంటిదగ్గరనుండి పెందలకడనే బయలుదేరుతున్నాను.కాని ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యమవుతుంది.ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటేవాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమవుతుంది.” అని చెప్పింది. “ భగవన్నామస్మరణ చేస్తూ సంసారసాగరాన్నే ఈదవచ్చు కదా! అలాంటిది ఈ ఏటిని దాటలేవా?” అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా .అలా అనగానే ఆ గొల్లవనిత ‘ఇదేదో బాగుందే’ అనుకుంటూ వెళ్ళిపోయింది.


మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు “ ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంత ముందుగా ఎలా వచ్చేవ్?” అని అడిగేడు. దానికా గొల్లవనిత “ మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటి వచ్చేసేను.నాకింక ఆ తెప్పవాడితో పనిలేదు.” అని చెప్పింది. అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతి పోయింది.”అయితే నువ్వు ఏరు ఎలా దాటేవో నాకు చూపిస్తావా?” అని అడిగేడు.” ఓ దానికేం భాగ్యం? నాతో రండి.” అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్లి “ మీరూ రండి.” అంటూ తాను ఏటి మీద నడచుకుంటూ వెళ్లిపోసాగింది. కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచె పైకెత్తుకుని ఏటిలో దిగడానికి అవస్థలు పడుతున్నాడు. వెంటనే గొల్లవనిత “ అదేంటి స్వామీ? దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటేయవచ్చని మీరే నాకు చెప్పేరు కదా! మరి మీరు అంత భయపడుతున్నారేంటి? అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట.” అంది.


నిజమేకదా! భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనేగా వెల్లడవుతుంది.


భగవంతునిపై విశ్వాసంతో, తీవ్రపరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది.రక్షణ లభిస్తుంది అనడానికి ఉదాహరణగా మరో కథ.


జటిలుడనే ఒక బాలకుడు రోజూ పాఠశాలకు వెళ్ళడానికి ఓ చిట్టడవిగుండా ఒంటరిగా పోవలసివచ్చేది. అలా వెళ్ళడానికి భయపడుతుండేవాడు. ఆ విషయం వాళ్ళమ్మకు చెప్పేడు. అప్పుడు ఆమె ఆ పిల్లవాని భయం పోగొట్టడానికి “ నీకు భయం వేసినప్పుడల్లా ‘కృష్ణా’ అని పిలువు.” అని చెప్పింది. “కృష్ణుడెవరమ్మా?” అని అడిగేడు ఆ అమాయకుడు. “కృష్ణుడు నీ అన్న” అని చెప్పింది తల్లి. “ అయితే సరేనమ్మా” అన్నాడు ఆనందంగా ఆ అర్భకుడు


మర్నాడు ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తూ త్రోవలో భయం వేసి ‘కృష్ణా’ అని పిలిచేడు. ఎవరూ రాకపోయేసరికి ఇంకా బిగ్గరగా “ అన్నా! కృష్ణా! ఎక్కడున్నావు? తొందరగా రా.నాకు భయమేస్తుంది. నాకు తోడుగా రా.” అని ఎలుగెత్తి పిలిచేడు. అంత నిష్కపటంగా మొరపెట్టుకుంటున్న పిల్లవాడి మొరను ఆలకించకుండా ఉంటాడా ఆ ఆర్తత్రాణ పరాయణుడు. వెంటనే కృష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి “ రా తమ్ముడూ! ఇంక నీకేం భయం ఉండదు. నీకు నేను తోడుగా ఉండి పాఠశాలవరకూ వచ్చి దిగబెడతానని అలాగే దిగబెట్టేడు.పైగా “ ఇక నీకు ఎప్పుడు భయం వేసినా నన్ను పిలువు.లేదా రోజూ పిలిచినా వస్తాను” అని చెప్పి అంతర్దానమైపోయేడు ఆ భక్తవత్సలుడు. అలా పసిపిల్లలకుండేలాంటి నిష్కల్మషమైన విశ్వాసం ఉండాలి భగవంతుడిపై మనకు.


ఇతర చింతనలన్నిటినీ మాని నన్నే స్మరించుచూ యే జనులు నన్ను శరణు పొంది ఉపాసించుచున్నారో ఆ జనులయొక్క యోగ క్షేమ భారాన్ని నిత్యం నేను వహిస్తాను.” అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పియున్నాడు.🙏శ్రీకృష్ణ భగవానుడే చెప్పియున్నాడు.🙏

కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు...........

 కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు............!!

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.


4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.


5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?


6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.


7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


8. కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు.


9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.


11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.


12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.


13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......


ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :


1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది

ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు.

పెద్దల మాట 🏵️*

 *సర్వేజనాః సుఖినోభవన్తు*


*🙏 శుభోదయమ్ 🙏*


*🏵️ నేటి పెద్దల మాట 🏵️*


తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా, మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇవ్వడం ద్వారా, మానవుడు కూడా నిస్వార్ధ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం ఇస్తుంది చెట్టు.

                                                      

*🌹నేటి మంచి మాట🌹*


మొక్కపై అలరారుతూ అందంగా వికసించి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కల్గిస్తూ, వాడిపోయక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది పువ్వు.          


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*


*గురువారం, ఫిబ్రవరి 26, 2026*


*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      

*ఉత్తరాయనం - శిశిర ఋతువు*

   *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం*   

తిథి : *దశమి* రా12.43 వరకు

వారం : *గురువారం* (బృహస్పతివాసరే)

నక్షత్రం : *మృగశిర* మ12.37 వరకు

యోగం : *ప్రీతి* రా11.07 వరకు

కరణం : *తైతుల* మ1.50 వరకు

       తదుపరి *గరజి* రా12.43 వరకు

వర్జ్యం : *రా8.29 - 9.59*

దుర్ముహూర్తము : *ఉ10.16 - 11.03*

                 మరల *మ2.55 - 3.41*

అమృతకాలం : *మ1.44 - 3.14*  

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30*

సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం : 6.25 || సూర్యాస్తమయం: 

6.01.



*సర్వేజనా: సుఖినోభవన్తు - శుభమస్తు🙏*

----------------------------------------

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి_*

.


*కష్టం-సుఖం ఈ రెండింటికీ మనం కర్తలం కాదు వచ్చిన కష్టం కానీ సుఖానికి కానీ తానే కర్త అనుకుంటాము మనం. ఇది పొరపాటు. దీని వెనకాల ఉండి నడిపే ఒక గొప్పశక్తి ఉంది. మనం కేవలం ఒక పనిముట్టు మాత్రమే ! దీన్ని ఆమోదిస్తే గొడవ లేదు. బాధ లేదు, లేకుంటే అన్నీ భాధలే.... ఎలా....?!!!_*

                   

గోపురాన్ని భుజస్కంధాలపై మోస్తున్నట్లుండే విగ్రహాన్ని చూస్తుంటాం !బరువంతా తానే భరిస్తున్నట్లు ఫోజు ఉంటుంది, కానీ ఆ బరువు గోపురం వెనకాల భూమిలోని పునాదుల మీద ఉంటుంది. తానే పనులన్నీ చక్కపెట్టేస్తున్నాను అనుకునే మనిషి కూడా అంతే...!


ఈ జగత్తులో జరిగే ఖర్మలకు కూడా మనం సాక్షిభూతులమే, వెనకాల నడిపించేది భగవత్

 శక్తి మాత్రమే, మనం చేసుకున్న పాప పుణ్యాలు మాత్రమే అనుభవించడానికి మనం జన్మ ఎత్తామ్. ఇది తథ్యం...!


మరి అన్నీ ముందే డిసైడ్ అయినప్పుడుమనంచేయాల్సింది ఏమిటి అనేది ప్రశ్న !


కొన్ని కర్మలు అనుభవించాలి, అనుభవించక తప్పదు, ఈ భాధలలో కూడా భగ్వన్నామస్మరణ విడవకుండా ఉండి, సంపూర్ణ శరణాగతి పొందితే భగవత్ అనుగ్రహముతో అనుభవించే ఖర్మను కూడా తప్పించుకోవచ్చు...!


*Ex:*

మహాభారత యుద్ధంలో అర్జునుడిపై వేసిన బాణాలు ఇంతా అంత శక్తివంతమైనవి కాదు, చాలా అఖండమైన శక్తి వంతమైనవి, కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం చేత వాటి శక్తి పని చేయలేదు...!


ఒకసారి శ్రీ కృష్ణుడు యుద్ధానంతరం అర్జునుని 

రథాన్ని దిగమని కోరతాడు. అర్జునుడు దిగిన పిమ్మటనే కృష్ణుడు దిగుతాడు, అప్పుడు రథం భయంకరమైన శబ్దాలతో, అతి భయంకరమైన మంటలతో కాలి పోవడం చూసి అర్జునునుడు భయంతో వణికిపోతాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు చెపుతాడు .... ఇంతవరకు నేను ఈ రథంలో వున్నంతకాలం ఎవరి బాణములు ఏమి చేయలేకపోయాయి... ఇప్పుడు నేను దిగాను వాటి పని అవి చేస్తున్నాయి...!


మన కర్మలు కూడా అంతే భగవంతుడు మనయందు ఉన్నత కాలం మనల్ని ఏమి చేయలేవు... ఆయనకు దూరమైన రోజు అన్ని అనుభవించాలి...! అందుకే ... దైవనామస్మరణ మరియు నిత్య భగవత్ కార్యాలలో 

పాల్గొనడం మంచిది..


🪷🙏🪷🏵️🪷🙏🪷🏵️🙏🪷🙏🏻

నారద భక్తి సూత్రాలు*

 *నారద భక్తి సూత్రాలు* 


 _డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా..._ 


నారద భక్తి సూత్రాలు భగవంతుని పట్ల అత్యున్నతమైన ప్రేమ, అంకితభావం (భక్తి) గురించి వివరించే ప్రాచీన సూత్రాలు. ఇవి 84 సూత్రాలతో కూడి, భక్తి ద్వారా సంసార బంధాల నుండి విముక్తి, శాశ్వత ఆనందం పొందే మార్గాన్ని చూపుతాయి. భగవంతునిపై అత్యంత స్వచ్ఛమైన, ఉన్నతమైన ప్రేమను కలిగి ఉండటం, సమస్త కర్మలను భగవంతునికి అంకితం చేయడం. 


సుఖం-దుఃఖం, ఇష్టం-అనిష్టం వంటి పరిస్థితులలో కూడా భగవంతునిపై నిరంతర ప్రేమను ప్రదర్శించలి.


భక్తి వల్ల భగవంతుని అనుగ్రహం లభించి, మనిషి జన్మ రాహిత్యాన్ని (మోక్షం) పొందుతాడు. అహింస, సత్యం, శౌచం (పవిత్రత), దయ మరియు ఆస్తిక్యం (శాస్త్రాల పట్ల నమ్మకం) వంటి సద్గుణాలను భక్తుడు అలవర్చుకోవాలి.


*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*

                   _ఆధ్యాత్మికం ఆనందం_


https://whatsapp.com/channel/0029Va4lcfO3rZZljOv7ab2B


`కొత్తగా మన డైలీ విష్ ఛానల్ చూస్తున్న వాళ్ళు కింది భాగంలో ఉన్న ఫాలో అనే బటన్ తప్పక ప్రెస్ చేయండి.`


నిరంతరం ధార్మిక సందేశాలను మీ ఫోన్ లో పొందండి...

*శ్రీ మహావిష్ణు పురాణం* ➖➖➖✍️ ఎనిమిదవ భాగం



       *శ్రీ మహావిష్ణు పురాణం*

                ➖➖➖✍️

              ఎనిమిదవ భాగం


*భూగోళ ఆవిర్భావం:-* బ్రహ్మోపదేశం - చతుర్వేద సంపుటి 

```

శ్రీ మహావిష్ణువు మధుకైటభుల విన్నపం మన్నించి వారికి సదా చరితార్థులై బ్రహ్మాండంలో ఉంటారు అని వరమిచ్చి, తన ఊరువులపైకి తీసుకుని చక్రంతో శిరస్సులు ఖండించాడు. 


శిరస్సులు తెగిన మధుకైటభుల మొండాల నుండి రక్తం పొంగి ప్రవహించింది. కొంతసేపటి తరువాత ఖండించబడిన ఇరువురి శిరస్సుల నుండి నల్లని పదార్ధం వెలువడి నీటిలోకి పొంగి ప్రవహించి ఒక్కటై గుండ్రటి పదార్థంగా మారసాగింది.


విష్ణువు వెంటనే తన ఊరువుల పరిమాణము కుదించి మాములుగా చేసాడు. ముధు కైటభుల మేధస్సు నల్లని పదార్ధముగా ఒక్కటై బంతి ఆకృతిలో గుండటి ముద్దగా మారింది. నారాయణుని వక్షస్సులో నివసిస్తున్న లక్ష్మీదేవి చూసి "నాథా! ఏమిటీ నల్లని గోళ పదార్థము? ఎందుకు మధు కైటభుల శిరస్సుల నుండి ప్రవహించి నల్లని గోళంగా మారింది" అని విస్మయంగా అడిగింది.


విష్ణువు "లక్ష్మీ! మధు కైటభుల మేధస్సు అది. నారాయణ నామ స్మరణతో పవిత్రమై "మేధిని" గా మారి భూగ్రహం అవుతుంది. పద్నాలుగు లోకాలకు మూలమైన భూలోకంగా మారి నవగ్రహాలలో ఒకటవుతోంది. 

నా జగత్ సృష్టికి, జగత్ లీలలకు ఈ భూమి మూలం కాబోతుంది. ముల్లోకాలకు పుణ్యభూమిగా, కర్మ భూమిగా ఈ భూగ్రహము తయారవుతుంది" అని పలికాడు.


లక్ష్మీదేవి ఆశ్చర్యపడి "మధుకైటభుల మేధతో ఏర్పడిన నల్లటి మట్టిముద్దకు ఇంతటి గౌరవం, ఆదరం లభిస్తోందా!" అని ప్రశ్నించింది.  


నారాయణుడు నవ్వుతూ "లక్ష్మీ! ఇది సాధారణ మట్టి ముద్ద కాదు. మహామాయ నన్ను ఆవహించినప్పుడు, నా స్పర్శతో ఋతు స్నాత అయ్యింది. ఆ మలినమే నా సంకల్పంతో మధు కైట భులుగా మారారు. వారు మరణించాక వారి మేధ మేధినిగా మారి భూమి రూపం పొందింది.


మహామాయ మేధినిగా మారి ప్రకృతిగా అవతరించి సృష్టికి క్షేత్రము అవుతుంది. అష్టాక్షరి మహామంత్రం పుణ్య ఫలం ఈవిధంగా సృష్టికి కేంద్రం అవుతుంది. నిజానికి ఇదంతా మాయ. ఈ మహామాయ ప్రభావంతో మహాశూన్యంలో అండపిండ బ్రహ్మాండాలు,లోకాలు,లోకాధిపతులు, జీవరాశులు ఆవిర్భవిస్తాయి. 

ఇదే శాశ్వతం, సర్వస్వం అనే మాయలో సకల చరాచర ప్రాణులు ఉంటారు. జనన మరణ చక్రంలో బంధీలు అవుతారు. స్వర్గ నరక భూలోకాల మధ్య తిరుగాడుతుంటారు. 


జ్ఞానము పొంది ఇది అంతా మిధ్య, మాయ,అశాశ్వతం అని తెలుసుకున్నప్పుడు మాత్రమే నన్ను శాశత్వుడని గ్రహిస్తారు. అప్పుడు నన్ను చేరుకుని నాలో లీనమవుతారు. దీనినే మోక్షం అంటారు. పరబ్రహ్మ లీలగా నా చేత ఈ మాయా ప్రపంచం కల్పించబడుతుంది, రక్షించబడు తుంది. చివరికి లయం చెంది నాలో లీనమై పోతుంది. ఇదే నేనాడే లీలావినోద జగన్నాటకం" అనడంతో లక్ష్మీదేవి సంతృప్తురాలైంది.


మధుకైటభుల మరణంతో భయం తొలగిన బ్రహ్మదేవుడు కనపడని శ్రీమన్నారాయణునికి నమస్కరించి "తండ్రీ! నా కర్తవ్యం ఉపదేశించండి" అని అడిగాడు. 


"సృష్టి చేయి! సృష్టి చేయి!" అన్న శబ్దం వినిపించింది.  


చుట్టూపరికించిచూశాడు.అంతా నీరు, నీటి మధ్యలో ఒక మట్టి గోళం కనిపించింది. ఆ మట్టిగోళం నీటితో తడిగానే ఉంది. గట్టి పడలేదు. ఈ మృత్తికాగోళం నీటిపై ఎంత సేపు నిలబడుతుంది? మునిగిపోతుందేమో? నేను ఏమి సృష్టించాలి? ఎక్కడ సృష్టించాలి? ఎలా సృష్టించాలి?


ఈ ప్రశ్నలకు సమాధానం బ్రహ్మదేవుడికి తట్టలేదు. మనస్సులో నారాయణుని తలచి "నీ ఆదేశం పాటించి సృష్టి ఏమి చేయాలో తెలియడం లేదు. నాకు సృష్టించడానికి శక్తి ప్రసాదించండి" అని ప్రార్థించాడు. 


ప్రసన్నుడైన మహావిష్ణువు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమై "చతుర్ముఖా! నీకు మొదట ఉపనయనం చేసి బ్రహ్మోపదేశం చేస్తాను" అని సంకల్పం చేశాడు.


వేదమంత్రాలు వేదబ్రహ్మ ఆదేశంతో ప్రతిధ్వనించ సాగాయి. లక్ష్మీదేవి సువర్ణ యజ్ఞోపవీతం సృష్టించి విష్ణువుకి ఇచ్చింది. బ్రహ్మ మెడలో యజ్ఞోపవీతం వేసి ఉపనయనం పూర్తి చేశాడు. విష్ణు సంకల్పంతో మహాసరస్వతి అక్కడకు వచ్చింది. బ్రహ్మకు పరిచయం చేస్తూ "ఈమె పరబ్రహ్మమైన కృష్ణుడి నుంచి ఆవిర్భవించింది. సమస్త జ్ఞాన స్వరూపిణి, జ్ఞానానికి అధిదేవత. ఈ సరస్వతి అంశరూపంగా గాయత్రీదేవి ఇక్కడ ఉద్భవిస్తుంది" అనగానే సరస్వతి నుండి అంశారూపంగా గాయత్రీదేవి ఉద్భవించింది.


“బ్రహ్మదేవా! నాలుగు ముఖాలతో నీవు పలికిన ఓంకారానికి అధిష్ఠాన దేవత ఈ గాయత్రీదేవి. సమస్త మంత్రాలకు ఈమె మూలము అవుతుంది. ఈ గాయత్రీదేవిని నియమ నిష్టలతో త్రి (మూడు) కాలములలో ఆచరిస్తే సకల శుభాలు కలుగు తాయి" అని బ్రహ్మదేవుడి కుడి చెవిలో మూడు పాదాలు, ఇరవై నాలుగు అక్షరాలు గల గాయత్రీ మంత్రం ఉపదేశం చేశాడు.


బ్రహ్మదేవుడు స్వీకరించి తన నాలుగు ముఖాల ద్వారా ఆరేసి అక్షరాల చొప్పున గాయత్రి మంత్ర జపం చేశాడు. ఫలితంగా గాయత్రీదేవి వచ్చి బ్రహ్మ వాక్కు లో స్థిర నివాసం ఏర్పర చుకుంది. ఇరవైనాలుగు అక్షరాల గాయత్రి జప ఫలంగా వేదము నాలుగు భాగాలై బ్రహ్మ నాలుగు ముఖాల నుండి వెలువడింది. నాలుగు వేదాలు చతుర్వేద సంపుటిగా మారి బ్రహ్మదేవుని హస్తాన్ని అలంకరించాయి. గాయత్రీదేవి వాక్కులో స్థిర నివాసం ఉండటం, వేదాలలోని సమస్త జ్ఞానం లభించడం వలన బ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానము పొందాడు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించాడు.✍️ 

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో

-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు

 ```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

చిరంజీవులు

  

              *చిరంజీవులు*

               ➖➖➖✍️


*చిరంజీవులు అంటే చిరకాలం జీవించి వుండే వారని అర్థం.* 


*1)అశ్వత్థామ,* 

*2)బలిచక్రవర్తి,* 

*3)వ్యాసుడు,* 

*4)హనుమంతుడు,* 

*5)విభీషణుడు,* *6)కృపాచార్యుడు మరియు* *7)పరశురాముడు.* 

```

వీరు ఏడుగురు చిరంజీవులు. నిత్యం వీరిని స్మరించడం వల్ల ఆనందంగా జీవిస్తారు.


సప్త చిరంజీవులు (ఏడుగురు అమరజీవులు) గురించి స్మరించే శ్లోకం ఇది.

హిందూ సంప్రదాయం ప్రకారం ఈ శ్లోకాన్ని ఉదయాన్నే పఠించడం వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు.```


శ్లోకం:~

*అశ్వత్థామా బలిర్వ్యాసో హనూమాంశ్చ విభీషణః |*

*కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః ||*


అర్థం:~

*1) అశ్వత్థామ:~*

ద్రోణాచార్యుని కుమారుడు.


*2) బలి చక్రవర్తి:~*

ప్రహ్లాదుని మనుమడు, దానగుణానికి ప్రసిద్ధి.


*3) వ్యాసుడు:~*

వేదాలను విభజించి, మహాభారతాన్ని రచించిన మహర్షి.


*4) హనుమంతుడు:~*

 రామ భక్తుడు,శక్తికి రూపం.


*5) విభీషణుడు:~* 

రావణుని సోదరుడు, ధర్మానికి కట్టుబడినవాడు.


*6) కృపాచార్యుడు:~* 

కౌరవ-పాండవుల గురువు.


*7) పరశురాముడు:~*

 విష్ణుమూర్తి ఆరవ అవతారం.

```

ఈ ఏడుగురిని స్మరించడం వల్ల అపమృత్యు భయం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. కొన్ని ప్రాంతాలలో మార్కండేయ మహర్షి పేరును కూడా కలిపి "అష్ట చిరంజీవులు" (ఎనిమిది మంది) అని పిలుస్తారు.```


*అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।*


*కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥*


*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయ తథాష్టమం ।*


*జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥*```


శ్రీకృష్ణుని శాపము వలన అశ్వత్థామ, వామనానుగ్రహము వలన బలిచక్రవర్తి, లోకహితముకై వ్యాసుడు, శ్రీరామభక్తితో హనుమంతుడు, రామానుగ్రహము వలన విభీషణుడు, విచిత్రజన్మము వలన కృపుడు, ఉత్క్రుష్ట తపోధనుడైన పరశురాముడు సప్తచిరంజీవులైనారు. శివానుగ్రహము చేత కల్పంజయుడైన మార్కండేయ మహాఋషిని ప్రతినిత్యం తలచుకొన్న సర్వవ్యాధి వివర్జితులై శతాయుష్మంతులు అవుతారని ఈ శ్లోకం తాత్పర్యము.```


*1. అశ్వద్ధామ స్త్రోతం:~*

 *బ్రహ్మసుత్రోజ్వలభుజో రాజత్ కృష్ణా జినాసనః ! అశ్వత్థామ చిరంజీవి దీర్ఘాయుర్ దదాతుమే !!*

*2. బలి చక్రవర్తి స్త్రోతం:~*

 *పాతాళ నిలయో ధనుర్భాణ ధనో నృపః ! విష్ణు పాదాంకిత శిరా: చిరంజీవి ప్రసీదతు!!*


*3. వ్యాస మహర్షి స్త్రోతం:~*

*వ్యాసః సమస్త ధర్మాణం వక్తా మునివరేడితః ! చిరంజీవి దీర్ఘమాయుః దదాతు జటిలో మమ !!*


*4. హనుమత్ స్త్రోతం:~*

*హనుమాన్ రామ పాదాబ్జ సంగీవర్ని వరసుచిః ! సంజీవనో స హర్తాచ రోగ శాంతిం దాదాతుమే !!*

*5. విభీషణ స్త్రోతం:~*

*విభీషణో ధర్మపరో రామార్చన పరాయణ:! దదాతు చిరoజీవిత్త్వం చిరంజీవి జితేంద్రియః !!*


*6. కృపాచార్య స్త్రోతం:~*

*కృపః కృపా పయోరాసిః తపస్వీ చిరవస్త్రద్రుతు ! వితనోతు ప్రసన్నాత్మ యావజ్జీవం ఆరోగతాం !!*


*7. పరశురామ స్త్రోతం:~* 

*పరసూజ్వల హస్తా హస్తాభ్జో జటా మండల మండితః ! దదాతు చిరoజీవిత్త్వం ప్రసన్నాత్మ భృగూద్వః !!*```


వీరితో పాటు మార్కండేయమహర్షి, ధృవుడు మరియు ప్రహ్లాదుడు కూడా జన్మతః చిరంజీవులు అని చెప్పబడుచున్నారు.


ఆవు పాలు, బెల్లము, నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి సప్త చిరంజీవి శ్లోకాన్ని చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!

అనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము


*663 వ రోజు*

పురుగు పూర్వజన్మ

నేను పోయిన జన్మలో శూద్రుడను చాలా ధనవంతుడను. ఆ జన్మలో నేను చాలాక్రూరుడను, అనాచారిని, అతిలోభిని. దయ, జాలి లేని వాడిని. దురుసుగా ఉండే వాడిని. అన్ని దుర్గుణములు కలిగినవాడిని. కాని నేను నా తల్లిని భక్తితో సేవించే వాడిని. ఒక నాడు మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. నేను అతడిని భక్తితో పూజించాను. అందువలన నాకు పునర్జన్మస్మరణ కలిగింది. అప్పటి నుండి నాకు మంచిపనులు చేస్తే సుఖాన్ని ఇస్తాయి అనే స్మురణ కలిగింది. కనుక మునీంద్రా ! నాకు ఆ విషయముల గురించి సవిస్త్రరంగా వివరించండి " అని అడిగింది. వ్యాసుడు " ఓ కీటకమా ! నిన్ను చూడగానే నీ పూర్వజన్మ వృత్తాంతం నాకు తెలిసింది. నీవు గతజన్మలో పాపములు చేసినందు వలన నీకు పురుగుజన్మ వచ్చిందని నాకు తెలుసు. అలాగే నీవు కొన్ని పుణ్య కార్యములు కూడా చేసావు. అందు వలననే నేను నీతో మాట్లాడుతున్నాను. నా తపోబలము చేత నేను నీకు ఈ పురుగుజన్మ నుండి విముక్తి కలిగిస్తాను. నీకు మనుష్యజన్మ ఎత్తి పుణ్యకార్యములు చేయవలెనన్న కోరిక కలగడం కూడా గతజన్మలో నీవు చేసిన పుణ్యకార్యముల ఫలమే ! మానవులు తాముచేసిన పుణ్యకార్యములవలన దేవతలౌతారు. తాము చేసిన పాపకార్యముల వలన ఇలా కీటకముల జన్మ ఎత్తుతారు. నీవు గతజన్మలో చేసిన పుణ్య కార్యముల వలన నీకు గతజన్మస్మృతి కలగడమే కాక నా దర్శనభాగ్యము కూడా కలిగింది. నేను నీకు ఉత్తమగతులు ప్రసాదిస్తాను. ఇక నుండి నీవు జంతువుగాను, మానవులలో వరుసగా శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలెత్తి తుదకు బ్రాహ్మణజన్మ ఎత్తుతావు. నీకు అన్ని జన్మలలో పూర్వ జన్మస్మృతి ఉంటుంది " అని ఆ పురుగుకు వరం ఇచ్చాడు. ఆ పురుగు వ్యాసుడి పాదాలు తాకి ప్రాణాలువదిలింది. ఆ తరువాత వ్యాసుడు వెళ్ళి పోయాడు.

పురుగు తరువాత జన్మలు

కాలక్రమేణా ! ఆ పురుగు వరుసగా అన్ని జన్మలు ఎత్తుతూ క్షత్రియ జన్మలో ఒక రాజ్యానికి రాజయ్యాడు. రాజ్య సుఖాలు అనుభవిస్తున్నాడు. ఒక రోజు ఆ రాజు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వ్యాసుడి పాదాలకు నమస్కరించాడు. వ్యాసుడు రాజుకు తగు విధంగా మర్యాదచేసి " రాజా ! ఈ జన్మలో నీవు తపస్సు చెయ్యి. ఆవుల కొరకు, బ్రాహ్మణుల కొరకు యుద్ధములో ప్రాణములు వదులు. నీకు బ్రాహ్మణజన్మ వస్తుంది " రాజు కూడా వ్యాసుడు చెప్పినది చేసి యుద్ధములో ప్రాణాలు వదిలి మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఆ బ్రాహ్మణజన్మలో ఎన్నో యజ్ఞయాగాలు చేసాడు, పుణ్యక్షేత్రాలు దర్శించాడు, దానధర్మాలు చేసాడు. తరువాత ఒక సారి వేదవ్యాసుడిని దర్శించుకున్నాడు. వ్యాసుడు సంతోషించి అతడిని కీర్తి ప్రతష్ఠలతో అలరారమని దీవించాడు. ధర్మనందనా ! కనుక ధర్మనందనా ! యుద్ధములో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తించుట తధ్యము. ఇందు అనుమానము ఏదీ లేదు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

శ్రీ కూతనూర్ సరస్వతి ఆలయం

  🕉 మన గుడి : నెం 1400


⚜  తమిళనాడు : తిరువారూర్


⚜  శ్రీ కూతనూర్ సరస్వతి ఆలయం



💠 భారతదేశంలో సరస్వతి దేవిని ప్రధాన దేవతగా పూజించే ఆలయాలు చాలా అరుదు.

కూతనూర్ సరస్వతీ దేవాలయం భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ సరస్వతీ దేవాలయాలలో ఒకటి. 


💠 ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది తమిళనాడులో  సరస్వతీ దేవికి అంకితం చేయబడిన ఏకైక ఆలయం. 


💠 యాత్రికుల మంత్రోచ్ఛారణల వల్ల ఈ ప్రదేశం చుట్టూ ఉన్న వాతావరణం ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటుంది. 


💠 పురాణాల ప్రకారం, ఈ ఆలయం 1500 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని నమ్ముతారు. 

ఈ గ్రామాన్ని చోళ రాజు రాజ రాజన్ (II) తన ఆస్థానంలో పనిచేస్తున్న ఒట్టకూథర్ అనే ప్రసిద్ధ కవికి దానం చేశాడు.


💠 ఆ కవి ఈ ఆలయాన్ని సరస్వతి దేవత కోసం నిర్మించాడు. 

ఈ ప్రదేశం కూతనూర్ అనే పేరు ఒట్టకూథర్ (తమిళంలో కూతన్) మరియు ఊర్ (తమిళంలో గ్రామం లేదా పట్టణం) నుండి వచ్చింది.


💠 పురాణాల ప్రకారం, బ్రహ్మ మరియు అతని భార్య సరస్వతి ఒకరితో ఒకరు ఎవరు గొప్ప అనే అహంకార ఘర్షణకు దిగారు. 

వారు ఒకరినొకరు శపించుకున్నారు, దీని ఫలితంగా చివరికి వారు చోళ రాజవంశంలో ఒక జంటకు తోబుట్టువులుగా జన్మించారు.

వారి తల్లిదండ్రులు వారికి తగిన సంబంధాల కోసం వెతకడం ప్రారంభించినప్పుడు, వారు తమ అసలు సంబంధాన్ని గుర్తుచేసుకుని, పరిష్కారం కోసం శివుడిని ఆశ్రయించారు.


💠 శివుడు సరస్వతిని గంగా నదిలో ఒక భాగంగా చేసి, ఆమెను కూతనూర్‌కు 'అరసలార్' నదిగా తీసుకువచ్చాడు. 

వారి మధ్య వివాదం సమసిపోయే వరకు ఇక్కడే ఉండమని ఆమెను కోరారు. 


💠 వారి తల్లిదండ్రులు వారికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, వారిద్దరూ తమ అసలు రూపాన్ని గ్రహించి, అదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు వివరించారు కానీ వారు అన్న చెల్లిగా జన్మించినందున వారి వివాహ ప్రతిపాదనను తిరస్కరించారు.


💠 వారు పరిష్కారం కనుగొనలేకపోయారు మరియు భగవంతుడిని పూజించారు. 

వారు తిరిగి కలవడానికి సహాయం చేయడానికి శివుడు సరస్వతిదేవి కలలో కనిపించి, ఈ యుగం అంతా వివాహం కాని అమ్మాయిగా భూమిపైనే ఉండమని కోరాడు. కూతనూర్‌లోని తన నివాసం నుండి ఆమె తన భక్తులను ఆశీర్వదిస్తుంది.


💠 ఈ ఆలయంలో సరస్వతీ దేవి తూర్పు దిశగా ముఖం చేసి, తన సంగీత వాయిద్యమైన వీణతో ఒక అందమైన పద్మంపై కూర్చుని ఉన్నట్లుగా దర్శనమిస్తుంది.

ఆమె పై రెండు చేతులలో వరుసగా 'జపమాల' అని పిలువబడే అక్షరాల గొలుసును మరియు అమృతంతో నిండిన ఒక పాత్రను పట్టుకుని ఉంటుంది. 

ఆమె కింది రెండు చేతులలో ఒకదానిలో దివ్య గ్రంథాల పుస్తకాన్ని పట్టుకుని, మరొక చేతితో అభయ ముద్రను చూపుతుంది. 


💠 సరిగ్గా పూజిస్తే, ఆమె తన భక్తులను ఎటువంటి సంకోచం లేకుండా ఆశీర్వదిస్తుంది. 

ఆమె జ్ఞాన దేవత కాబట్టి, విద్యార్థులు ఈ ఆలయంలో ప్రార్థించడం మరియు సరస్వతీ పూజ చేయడం చాలా శ్రేయస్కరం.


💠 కూతనూర్ ఆలయ ప్రాముఖ్యత:

కూతనూర్‌ను "త్రివేణి సంగమం" అని పిలుస్తారు, ఇది గంగ, యమునా మరియు సరస్వతి నది సంగమం.


💠 భక్తులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్చుకునే ముందు, పరీక్షా సమయానికి ముందు లేదా పరీక్ష సమయంలో అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ఇక్కడ పూజలు మరియు అభిషేకాలు నిర్వహించవచ్చు.


💠 త్రివేణి సంగమంలో స్నానం చేసి తమ పిల్లల విద్య, పూర్వ జన్మల నుండి విముక్తి కోసం ప్రార్థనలు చేస్తూ భక్తులు ఆలయంలోకి గుమిగూడతారు. 

పౌర్ణమి రాత్రులలో, పిల్లలను ఇక్కడికి తీసుకువచ్చి, తేనెలో ముంచిన కర్రతో వారి నాలుకపై "ఓం" అనే పదాన్ని రాస్తారు. అలాంటి పిల్లలు చక్కటి వక్తలు, కవులు మరియు సంగీతకారులుగా వికసిస్తారని నమ్ముతారు. 


💠 వారంలోని అన్ని రోజులలో ఇక్కడ పూజలు చేయగలిగినప్పటికీ, బుధవారం విద్య మరియు జ్ఞానంలో రాణించడానికి ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. 

విజయ దశమి రోజున భక్తులు తమ పిల్లలతో కలిసి ఆలయాన్ని సందర్శించి పూజతో తమ చదువులను ప్రారంభిస్తారు.


💠 ఈ ఆలయానికి 35 కిలోమీటర్ల దూరంలో కుంభకోణం ఉంది.



రచన

©️ Santosh Kumar

ఆరోగ్యంగా

  


*ఆరోగ్యంగా జీవించాలంటే ఈ 50 చేయండి:*

         ➖➖➖✍️


1. ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకోండి

2. కనీసం 7 గంటలు నిద్రపోండి

3. ప్రతిరోజూ వేళకు తినండి

4. వేడి నీరు తాగడం అలవాటుచేసుకోండి

5. రోజూ ఉదయం 30 నిమిషాలు నడక చేయండి

6. నిద్రించే ముందు ఫోన్ దూరంగా పెట్టండి

7. మితంగా తినడం నేర్చుకోండి

8. మిగిలిన తిండి మళ్లీ వేడి చేయవద్దు

9. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయండి

10. రోజూ ఒక పండు తినండి

11. ఆకుకూరలు వారానికి 4సార్లు తినండి

12. ఆలస్యం కాకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయండి

13. బలమైన డిన్నర్ కాకుండా తేలికగా తినండి

14. నీరు రోజూ కనీసం 2.5 లీటర్లు తాగండి

15. రోజూ సూర్యరశ్మి తగలడానికి ప్రయత్నించండి

16. పొట్ట మీద ఎక్కువ పని చేసే ఆహారం తగ్గించండి

17. ఒత్తిడిని తగ్గించే శ్వాసాభ్యాసం చేయండి

18. పిచ్చి ఆలోచనలు వదిలేసి ప్రశాంతంగా ఉండండి

19. రోజుకు ఒక గంట టైం మీ కోసం ఉంచుకోండి

20. మానసిక ప్రశాంతత కోసం యోగా చేయండి

21. డిప్రెషన్ లక్షణాలు గుర్తించి ముందే జాగ్రత్త పడండి

22. గుండె ఆరోగ్యానికి నూనె తక్కువగా వాడండి

23. పాదాలు, కళ్ళు, దంతాలకు ప్రత్యేక శ్రద్ధ చూపండి

24. డాక్టర్ సలహా మేరకు వార్షిక చెకప్ చేయించుకోండి

25. పొగాకు, మద్యం లాంటివి పూర్తిగా నివారించండి

26. వారానికి ఒకసారి శరీరానికి ఆయిల్ మసాజ్ చేయండి

27. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు లేవని చూసుకోండి

28. ఆరోగ్య సంబంధిత పుస్తకాలు చదవండి

29. ఆహారంలో మానవ కృత్రిమ పదార్థాలు తగ్గించండి

30. నిద్ర సమయంలో గాఢమైన డార్క్‌నెస్ ఉండేలా చూసుకోండి

31. ప్యాకెట్ ఫుడ్స్, సాఫ్ట్ డ్రింక్స్ దూరంగా పెట్టండి

32. చిన్నవి అనుకున్న సమస్యలను అలక్ష్యం చేయకండి

33. మొబైల్ స్క్రీన్ టైమ్ తగ్గించండి

34. నెలకు ఒక్కరోజైనా ఉపవాసం పాటించండి

35. రోజూ ఉదయం నిమ్మకాయ నీళ్లు తాగండి

36. నెమ్మదిగా తినడం అలవాటు చేసుకోండి

37. కల్తీ పదార్థాలపై అవగాహన కలిగి ఉండండి

38. మానసిక ఆనందానికి సంగీతం వినండి

39. స్నానం చేసే నీళ్లు తగిన ఉష్ణోగ్రతలో ఉండాలి

40. బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోండి

41. పునరుత్పత్తి శక్తికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

42. దగ్గు, జ్వరం వంటి చిన్న రుగ్మతలు చిన్నగా చూడవద్దు

43. ప్రతి భోజనం తర్వాత కొంచెం నడవండి

44. ఒత్తిడికి గురయ్యే పని పద్ధతులను మార్చుకోండి

45. బలహీనత ఉంటే వెంటనే రక్తపరీక్షలు చేయించుకోండి

46. పల్లీలు, గింజలు రోజూ తగిన మోతాదులో తీసుకోండి

47. మలాన్ని నిర్బంధంగా వదిలే అలవాటు పెట్టుకోండి

48. ప్రతి రోజు ఒక మంచిపని చేయండి – మనసుకు శాంతి లభిస్తుంది


49. ఆల్కహాల్, కోల్డ్ డ్రింక్‌లు కాకుండా నిమ్మకాయ నీరు, మజ్జిగ, పండ్ల రసాలు తాగండి


50. ఆరోగ్యాన్ని ధనం కంటే విలువైనదిగా గుర్తించండి...✍️

 ⁠—-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖