10, మార్చి 2026, మంగళవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*సోమవారం 9 మార్చి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣5️⃣9️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``

  *సంపూర్ణ మహాభారతము*

              *159 వ రోజు*                     

*వనపర్వము సప్తమాశ్వాసము*

*ధర్మరాజుని కొలను వద్దకు చేరుట*```

వెళ్ళిన తమ్ములెవరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. 

పరిసరాలను పరిశీలించగానే స్పృహతప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. 

అతని హృదయం తల్లడిల్లింది. కొంచం సేపటికి తేరుకుని చుట్టూ కలయ చూసాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించ లేదు. “వారికై వారు అలా కూలి పోవడానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీరు విషపూరితం అనడానికి వారి శరీరంలో విష ప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించ లేదు. ఒక వేళ సుయోధనుడు అతని మిత్రులెవరైనా ఇలా చేసారా కుంతీ దేవికి ఏమి చెప్పాలి?” అనుకుంటూ కొలనులో దిగాడు. 

అప్పుడు ఆకాశవాణి “ధర్మరాజా! నేను ఒక కొంగను. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాట వినక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా స్పృహతప్పి పడి పోయారు. నీవూ నా మాట వినక కొలనులో నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకూ పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీళ్ళుత్రాగు!” అని పలికింది. 

ధర్మరాజు “అయ్యా! కొంగ రూపం ధరించిన రుద్రుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడివో నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు. నీవు ఎవరు? నీ తలపు ఏమిటి, చెప్పు” అని అడిగాడు.

```

      *యక్షడు ప్రశ్నించుట*```

ఆ కొంగ ధర్మరాజుతో "వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడి పోయారు” అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. 

“నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివి కలవాడవు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు” అన్నాడు. 

ధర్మరాజు “అయ్యా! నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా. అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను” అన్నాడు.

```

               *యక్షుడు*

సూర్యుని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతం ఏమిటి?

``

               *ధర్మరాజు*

సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం.

``

                *యక్షుడు*

శ్రోత్రియుడు ఎలా ఔతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా ఔతాడు?

``      

             *ధర్మరాజు*

శ్రుతం వలన శ్రోత్రియుడు ఔతాడు. అనగా వేదము అధ్యయనం వలన. తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సేవచేయడం వలన బుద్ధిమంతుడు ఔతాడు.

             *యక్షుడు*

బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధు భావము ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా ఔతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా ఔతాడు?

``

            *ధర్మరాజు*

వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు ఔతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు ఔతాడు.``

              *(సశేషం)*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భా🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*భాగస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏గస్వామ్యం చేయడమైనది*

 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: