10, మార్చి 2026, మంగళవారం

శుభోదయం

  శ్రీరామ (107)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


జీవన్ముక్తులైన మహాత్ముల దృష్టి మనమీద పడినంత మాత్రాన మన పాపాలన్నీ నశిస్తాయి అని శాస్త్రం తెలియజేస్తోంది.

అటువంటి మహాత్ములు మన మధ్యనే నడయాడుతుంటారు.

పైకి చూడటానికి వారుగూడా మనలాగానే ఉంటారు గనుక పరిశీలించి వారిని మనం గుర్తించగలగాలి.

వారి దృష్టి మనమీద పడటం, అంటే అటువంటి మహాత్ములను సేవించి మనం వారి దృష్టిలో ఉండేటట్లు చేసుకోవడం.


శ్లో // యస్యానుభవ పర్యన్తా తత్త్వే బుద్ధిః ప్రవర్తతే /

తద్ దృష్టి గోచరాః సర్వే ముచ్యన్తే సర్వ పాతకైః //


(ఏ మహానుభావుని బుద్ధి అనుభవపర్యంతము తత్త్వమునందు ప్రవర్తించునో, ఆ మహాత్ముని దృష్టికి గోచరులగు జనులు సర్వ పాపములనుండి విముక్తులగుదురు)

( సూతసంహిత - 2 - 20 - 44 )


అనగా భగవంతుని దర్శనం అయే పర్యంతం,అన్య చింతనలు మాని, భగవంతుడినే ఎవరు నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో, అటువంటి మహాత్ముల దృష్టి మనమీద పడినంత మాత్రాన మన పాపములన్నియు నశించును.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

10-3-'26.

కామెంట్‌లు లేవు: