దానాలకు శ్రేష్ఠం వైశాఖం..................!!
అక్షయ తృతీయ దానాలకు పెట్టింది. పేరైన వైశాఖ మాసంలో వచ్చింది. అసలు వైశాఖమే రకరకాల దానాలకు ప్రశస్తమైన మాసం. సర్వదానాలలో ఉన్న పుణ్యం ఈ మాసంలో జల దానంతో లభిస్తుంది. జలదానం చేయ లేని వారు అందుకు ఇతరులను ప్రోత్స హించాలి. ఆ విధంగా చేయడం కూడా సర్వదానాధికఫలాన్ని ఇస్తుంది. దాహార్తితో ఉన్న వారికి ఉపశమనం కలిగించే చలివేంద్రం ఏర్పరచిన వారికి కోటి కులాలనుద్ధరించిన పుణ్యం వచ్చి విష్ణులోకంలో విరాజిల్లుతారు. ప్రపా దానం(చలివేంద్రం) ఏర్పాటు చేయడ మనేది దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు అత్యంత ప్రీతికరం, అలసటతో ఉన్న వారు ప్రపాదానంతో సంతుష్టులైతే బ్రహ్మ, విష్ము శివాదులను సంతోషింప చేసిన వారవుతారు. నీరు కోరే వారికి నీరు, నీడను కోరే వారికి గొడుగు, విసన కర్రను కోరు వారికి విసనకర్ర వైశాఖ మాసంలో దానం చేయడం శ్రేష్ఠ్యం. వైశాఖ మాసంలో ఉదకకుంభము (నీటితో ఉన్న కుండను) దానం చేయడం మహా పుణ్యప్రదం. దప్పికతో బాధపడుతున్న ఎవరైనా మహానుభావునికి చల్లటి నీరు ఇచ్చినంతనే పదిలక్షల రాజసూయ యాగముల ఫలం లభిస్తుంది. ఎండవేడి వల్ల అలసి బాధపడుతున్న వారిని విసనకర్రతో వీచి స్వస్థత చూకూర్చినంతనే పాపాలు తొలగి గరుడునిగా అవుతారు. కొన్నిరకాల దుఃఖాలను శాంతింపజేసేందుకు వైశాఖ మాసంలో ప్రయత్నపూర్వకంగా ఒక్క సారైనా గొడుగును దానం చేయాలి. ఈ మాసంలో పాదరక్షలను దానం చేసిన వారు నరకాన్ని, ఐహికమైన క్లేశాన్ని పొందరు. మార్గమధ్యంలో శ్రమను హరించే విధంగా విశ్రాంతి మందిరాన్ని నిర్మించిన వారికి వచ్చే ఫలాన్ని బ్రహ్మ కూడా చెప్పలేడు. అన్నం పెట్టిన వారు (అన్నదానం) చేసిన వారిలో సకల తీర్థాలు, సకల దేవతలు, సకల ధర్మాలు ఉంటాయి. వైశాఖ మాసంలో పరుపును దానం చేస్తే అదే జన్మలో సర్వభోగాలు కలవాడై తన వంశం లోరోగాల బాధలు లేకుండా ఆయుర్దాయం, పరమ ఆరోగ్యం, యశస్సు, ధైర్యం కూడా పొందుతారు. నూరు తరాల వరకు వారి వంశంలో అధార్మికుడు పుట్టడు. సకల భోగాలను అనుభవించి సకల పాపాలను తోసిరాజని బ్రహ్మానందాన్ని పొందుతాడు. వైశాఖ మాసంలో గడ్డితో చేసిన చాపను, మరొక చాపను దానం చేస్తే ఎక్కడున్న పరమేశ్వరుడైనా ఆ చాపపై పరుంటాడు. ఇంటిలో పడుకునేందుకు కంబళిని, అటు వంటి వాటిని ఇచ్చిన వారు అంతమాత్రం చేతే ముక్తిని పొందుతారు. అప మృత్యువుకు గురి కాక ఎక్కువ కాలం జీవిస్తారు. తాంబూల దానం చేసిన వారు శరీరంతో చేసిన సకల పాపాల నుంచి విముక్తులవుతారు. తాంబూల దానం చేసినవాడు యశస్సును, ధైర్యాన్ని, సంపదను పొందుతాడు. రోగంతో ఉన్నవారు తాంబూల దానం చేస్తే రోగ విముక్తులు అవుతారు. రోగం లేనివారు ఆ దానం చేస్తే మోక్షాన్ని పొందుతారు. వైశాఖ మాసంలో తాపాన్ని తగ్గించే మజ్జిగను దానం చేస్తే ధనవంతుడు, విద్యావంతుడు అవుతాడు...
గురు భక్తి - Guru Bhakthi
#శ్రీ🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి