18, ఆగస్టు 2020, మంగళవారం

*సుభాషితము*

 *శ్లో:* 
*పండితే చైవ మూర్ఖే చ*
*బలవత్యపి దుర్జనే*
*ఈశ్వరే చ దరిద్రే చ*
*మృత్యోః సర్వత్ర తుల్యతాః*
పండితుడైన, మూర్టుడైన, బలవంతుడైన, దుర్జనుడైన, ఐశ్వర్యవంతుడైన, దరిద్రుడైన 
మృత్యువుకు అందరూ సమానమే.
**********************

వివాహం

మనిషి జీవితం లో వివాహం ఒక ప్రధానమైన సంఘటన అని చెప్పాలి.
జ్యోతిష్య పరంగా చూసినట్లు అయితే పురుషులకు వివాహ కారకుడుగా శుక్రుడు, స్త్రీలకు గురువు ఉంటారని గుర్తించాలి. ఇక శని జాతకుల యొక్క ఆలస్య వివాహాలకు కారకుడు అవుతాడు, జ్యోతిష్య శాస్త్రాల సిద్ధాంతాల ప్రకారం వ్యక్తుల యొక్క.. పురుషులు, లేదా స్త్రీలు, జాతకచక్రం లోని సప్తమ స్థానం వివాహాన్ని సూచిస్తుంది,ఇలాంటి సప్తమస్థానం లో ఉండే గ్రహాలు జాతకుల యొక్క వివాహాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తాయి... అదే విధంగా ఒక స్త్రీ, లేదా పురుషుని జాతకచక్రం లో సప్తమస్థానం లో రవి గ్రహం ఉన్నచో వివాహ ఆలస్యం, అలాగే దాంపత్యం కూడా సమస్యలతో కుడి ఉంటుంది, ఇంకొక విశేషం ఏమిటి కొన్ని కొన్ని గ్రహస్తితుల వలన  అంటే సప్తమ స్థానం లో రవి ఉన్న పురుష జాతకులు వయస్సు మీరీపోయిన వధువులను, లేదా భర్త చనిపోయిన స్త్రీలను, లేదా తన కన్నా వయసులో పెద్దదిగా ఉన్న స్త్రీలను వివాహం చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి.

 అలాగే సప్తమస్థానం లో కుజుడు ఉండడం కూడా చెడు లక్షణమే అని గుర్తించాలి. వివహస్థానం అయిన సప్తమస్థానం లో కుజుడు ఉండడం వలన కుజదోషం ఏర్పడుతుంది
ఫలితంగా వివాహలు ఆలస్యం కావడం లేదా వివాహ జీవితం దుర్భరంగా ఉండడం జరుగుతుంది.
జాతకచక్రం లో పాప గ్రహమైన శని ఉన్నసరే వివాహం ఆలస్యం అవుతుంది.. వివాహ కారకుడైన శుక్రుడు ఏదైనా జాతకమ్ లో రవి, చంద్ర గ్రహాలతో కలిసి సప్తమస్థానం లో ఉన్నసరే వివాహం ఆలస్యం అవుతుంది..  fb..Kerala astro remedies

జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం జాతకచక్రం లోని రెండవ స్థానం, సంసారం గురించి, 7, మరియు 8 స్థానాలు వైవాహిక సుఖం గురించి తెలియ జేస్తాయి.. అదే విధంగా వక్ర గ్రహాల విషయానికి వస్తే ఈ గ్రహాలు నష్టాలు కలిగించేవి గాను, ఆటంకాలు కలిగించేవి గాను కారణం అవుతాయి.. అలాంటి స్వభావం కలిగిన వక్ర గ్రహము జాతకుల యొక్క 2 వ స్థానం లో ఉన్నచో ఆ జాతకులు అనేక సార్లు ప్రయత్నం చేస్తే గాని వివాహం జరగదు, పైన వివరించిన గ్రహస్తితుల వలన మనకి తెలియకుండానే వివాహం అనేది ఆలస్యం అవుతుంది.. కొంత మంది తల్లిదండ్రులు. వారి సంతానము.. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నం లో ఉన్నారు, కనుక ఉద్యోగ, వ్యాపారం లో స్థిరత్వం కలిగిన తర్వాత వివాహం చేయొచ్చు.అనే ఆలోచన తో ఉంటారు కానీ స్థిరత్వం బాగా ఆలస్యం అవుతుంది , అలాగే కొంతమంది వారి సంతానం ఉన్నత చదువులకు విదేశాలు వెళ్లారు, కనుక బాగా చదివి  మంచి ఉద్యోగo సాధించిన తర్వాత కల్యాణం చేయొచ్చులే అనే ఆలోచనతో ఉంటారు..కానీ  వారికి తెలియ కుండానే  వివాహ వయస్సు దాటుతుంది.. కారణం వారి వారి సంతాన జాతకచక్రం లో వివాహ దోషాలు ఉండడం... ఇలా రకరకాలుగా వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది.
 Fb..Kerala Astro remedies
అదే విధంగా జాతకచక్రం లో లగ్నాధిపతి సప్తమస్థానం లో ఏదైనా పాప గ్రహం తో కలిసి ఉన్నచో వివాహం ఆలస్యం అవుతుంది. ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చిన నిలబడవు, సప్తమది పతి జాతక చక్రం లో వ్యయ స్తానం లో ఉన్నసరే వివాహ ఆలస్యం అవుతుంది...జాతకచక్రం లో ఏ స్తానం లో అయిన సరే కుజుడు, మరియు, శుక్రుడు, కలిసి ఉండరాదు, కుజుడు అగ్ని తత్వం కలిగిన గ్రహం, శుక్రుడు జల తత్వం కలిగి ఉంటారు.కనుక ఈ 2 గ్రహాలకు పరస్పర శత్రుత్వం ఉంటుంది. అందువలన ఏ జాతకమ్ లో అయిన సరే ఈ 2 గ్రహలు కలిసి ఉన్నచో వారి వివాహ జీవితం చాలా చెడుగా ఉంటుంది.
 Fb..Kerala Astro remedies
పై వివరించిన గ్రహస్థితుల వలన  వివాహం ఆలస్యం అవుతున్నప్పుడు కేరళ మలయాళ ప్రాచీన జ్యోతిష్య గ్రంధాలలో చెప్పబడ్డ, కృతిగా బలి, చక్ర హోమం, కళ్యాణేష్టి  అనే పరిహరాలు ఆచరించడం వలన వివాహ దోషాలు తొలగుతాయి.. వివాహం అనంతరం జీవితం శుభకారంగా ఉంటుంది.

శుభం భూయాత్////

మీ జీవితం లో ఎదుర్కొంటున్నా సమస్యల నివారణ కొరకు, వివాహ, దాంపత్య, సమస్యలు ఉన్నవారు   గ్రహ దోష నివారణ పరిహారాల కొరకు సంప్రదించండి

*అపాత్రదానం*

మగధరాజ్యం ఉచ్చస్థితిలో వున్న కాలంలో బోధిసత్వుడు ఒకప్పుడు ఆ రాజు వద్ద కోశాధి కారిగా వుండేవాడు. ఆ…ునకు ఎనభైకోట్ల వరహాల సొంత ఆస్తివుండేది. కాశీరాజ్యంలో శ్రీవత్స అనే మరొక ధన వంతుడుండేవాడు. ఆ…ునా ఎనభైకోట్ల వర హాలకు పైబడిన ఆస్తిపరుడు. కోటీశ్వరులైన బోధిసత్వుడూ, శ్రీవత్సా ప్రాణమిత్రులు.

కాలం కలిసిరాక, వ్యాపారంలో విపరీతంగా నష్టపోవడంతో శ్రీవత్స పేదవాడై పో…ూడు. ఆ పరిస్థితుల్లో అతడికి తన మిత్రుడైన బోధి సత్వుడు గుర్తుకు వచ్చాడు. శ్రీవత్స తన భార్యతో కాలినడకన బ…ులు దేరి మగధ రాజ్యం చేరి, బోధిసత్వుణ్ణి చూడ బో…ూడు. బోధిసత్వుడు ఆ…ునకు ఎదురు వెళ్ళి ఎంతో ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడి గాడు.

శ్రీవత్స పెద్దగా నిట్టూరుస్తూ, ‘‘బోధి సత్వా! నా దశ మారి పోయింది. బికారినై పో…ూను. ఇటువంటి స్థితిలో నాకు సహా…ు పడగలవాడివి నీవు ఒక్కడివే అని నమ్మి, ఇలా వచ్చాను,'' అన్నాడు. ‘‘శ్రీవత్సా, విచారించకు. కష్టసమ…ుంలో రావలసిన చోటుకే వచ్చావు,'' అని బోధి సత్వుడు తన దగ్గిర వున్న ధనంలో సగం- నలభైకోట్ల వరహాలు మిత్రుడికివ్వడమే కాక, దానితో పాటు తన పరివారంలోని సగం మందిని అతడి పరం చేశాడు.

కొంతకాలం గడిచింది. రాజ్యంలో చెలరేగిన అరాజకం, అల్లరుల కారణంగా బోధిసత్వుడు ఉద్యోగంతోపాటు ధనాన్ని కూడా పోగొట్టుకుని, దారిద్య్రబాధకు గుర…్యూడు. ఆ…ునకు ఈ స్థితిలో తనకు సా…ుపడగల వాడు మిత్రు డైన శ్రీవత్స తప్ప మరెవరూ లేరన్న నమ్మకం కలిగింది. వెంటనే బోధిసత్వుడు భార్యతో సంగతి చెప్పి, ఆమెతో సహా కాశీరాజ్యానికి బ…ులుదేరాడు. ఆ…ున నగర సరిహద్దులు చేరుతూనే భార్యను ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసు కుంటూ వుండమని చెప్పి, ‘‘నువ్వేమీ ఆదుర్దా పడకు.



ప్రాణమిత్రుడైన శ్రీవత్సకు సంగతి చెప్పి, నీ కోసం బండినీ, పరిచారకులనూ పంపుతాను,'' అని నగరంలోకి వెళ్ళాడు. బోధిసత్వుడు, శ్రీవత్స వుండే భవన ద్వారం కాపలావాడితో తాను ఎవరైనదీ చెప్పి, ఆ సంగతి …ుజమానికి చెప్పమన్నాడు. కాపలావాడు లోపలికి పోయి తిరిగి వచ్చి, బోధిసత్వుణ్ణి తన …ుజమాని రమ్మనమని చెప్పినట్టు తెలి…ుపరిచాడు. శ్రీవత్స, బోధి సత్వుణ్ణి ఎగాదిగా చూసి, ‘‘ఏం పని మీద వచ్చావు?'' అని అడిగాడు.

‘‘మీ దర్శనం కోసం...'' అంటూ బోధి సత్వుడు తలదించుకున్నాడు. ‘‘బస ఎక్కడ చేశావు?'' అన్నాడు శ్రీవత్స. ‘‘ఇంకా బస కుదుర్చుకోలేదు. నా భార్యను పొలిమేర దగ్గిర వదిలి, ఇలా వచ్చాను,'' అన్నాడు బోధిసత్వుడు. ‘‘నా ఇంట బస దొరకదు! చారెడు గింజలు ఇస్తాం, పట్టుకుపోయి గంజి కాచుకు తాగు,'' అన్నాడు శ్రీవత్స కఠినంగా. ఆ మరుక్షణం ఒక సేవకుడు దోసెడు గింజలు తెచ్చి బోధిసత్వుడి ఒడిలో పోశాడు. బోధిసత్వుడు తన భార్య వున్న చోటుకు వెళ్ళాడు.

‘‘మీప్రాణ స్నేహితుడు ఏమి చ్చాడు?'' అని భార్య అడిగింది. ‘‘మిత్రుడు శ్రీవత్స చారెడు గింజలతో మన పీడ వదుల్చుకున్నాడు,'' అన్నాడు బోధిసత్వుడు నిర్వికారంగా. ‘‘అవెందుకు పుచ్చుకున్నారండీ? మనం అతడికిచ్చిన నలభైకోట్ల వరహాలకు ఇది ప్రతిఫలమా? ఇలాంటి కృతఘు్నడి ముఖం చూడటమే, పాపం!''

అన్నది భార్య కోపంగా. కళ్ళ నీళ్ళు పెట్టుకున్న భార్యను ఓదా ర్చుతూ బోధిసత్వుడు, ‘‘ఏది ఏమైనప్పటికీ, ఒకసారి మిత్రులైన వారిమధ్య విరోధభావం ఏర్పడకూడదు. అందుకోసమే, ఈ గింజలు పుచ్చుకున్నాను,'' అన్నాడు.
భార్యా, భర్తలు ఇలా మాట్లాడుకుంటూ వుండగానే సేవకుడొకడు ఆ దారినే వచ్చాడు. వాడు లోగడ బోధిసత్వుడు శ్రీవత్సకు పంచి ఇచ్చిన పరివారంలోనివాడు. వాడు తన పూర్వపు …ుజమానిని గుర్తించి, కాళ్ళ పైబడి, ‘‘అ…్యూ, ఇలా వచ్చారేం?'' అని అడిగాడు. బోధిసత్వుడు వాడికి జరిగినదంతా చెప్పాడు. సేవకుడు బోధిసత్వుణ్ణీ, ఆ…ున భార్యనూ తన ఇంటికి తీసుకుపోయి, భోజనం పెట్టి, ఉండేందుకు ఒక గది ఇచ్చాడు.

వాడు ఆ తరవాత ఈ సంగతి తనతోడి సేవకు లందరికీ చెప్పాడు. క్రమంగా కోటీశ్వరుడైన శ్రీవత్స మిత్ర ద్రోహం సంగతి కాశీరాజుకు తెలిసింది. ఆ…ున బోధిసత్వుణ్ణి పిలిపించి, ‘‘నీవు శ్రీవ త్సకు నలభైకోట్ల వరహాలు ఇచ్చిన సంగతి నిజమేనా?'' అని అడిగాడు. బోధిసత్వుడు రాజుకు అంతా వివరిం చాడు. రాజు శ్రీవత్సకు కబురు చేసి, అతడికి బోధిసత్వుణ్ణి చూపుతూ, ‘‘ఈ…ున నుంచి నువ్వు లోగడ ధన సహా…ుం పొందిన మాట నిజమేనా?'' అని ప్రశ్నించాడు.

‘‘నిజమే, మహారాజా!'' అన్నాడు శ్రీవత్స బిక్కచచ్చిపోతూ. ‘‘అయితే, ఆ సహా…ూనికి బదులు నీ మిత్రుడికి ఎలాంటి ఆదరణ చూపావు?'' అన్నాడు రాజు. శ్రీవత్స సిగ్గుతో, అవమానంతో తల వంచుకున్నాడు. రాజు, తన మంత్రులతో సంప్రతించి, శ్రీవత్స ఆస్తి అంతా బోధిసత్వుడి పరం చేస్తున్నట్టు తీర్పు ఇచ్చాడు.

బోధిసత్వుడు రాజుతో, ‘‘మహారాజా, ఇతరుల సొత్తు నాకు పూచికపుల్ల కూడా వద్దు. నేను ఇచ్చినది నాకు తిరిగి ఇస్తే, అంతే చాలు!'' అన్నాడు. రాజు ఆ ప్రకారమే బోధిసత్వుడికి నలభై కోట్ల వరహాలు శ్రీవత్స చేత ఇప్పించి, బోధి సత్వుడితో, ‘‘అపాత్ర దానం కూడనిపని!'' అన్నాడు. ఈ విధంగా బోధిసత్వుడు తిరిగి ఐశ్వర్య వంతుడై, దానధర్మాలు చేస్తూ చాలాకాలం సుఖంగా జీవించాడు.

        💦🐋🐥🐬💦

*తెలివి తక్కువ రాజు*

ఒక అరణ్యంలో రకకాల పక్షులు, జంతువులు నివసించేవి. అయితే వాటికి రాజు లేడు. తమకు ఒక నాయకుడంటూ ఉంటే బావుంటుందని భావించిన జంతువులు ఒక రోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి. ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని చర్చలు కొనసాగుతుండగా ఒక కోతి ముందుకు వచ్చి తన విచిత్రమైన హావభావాలతో నాట్యం చేసింది. ఆ నాట్యం చూసి జంతువులన్ని కడుపుబ్బ నవ్వాయి. కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి.

ఇదంతా నక్కకు నచ్చలేదు "రాజనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్దిలో, బలంలో అందరినీ మించిన వాడై ఉండాలి. అంతే కాని ఒక కోతి రాజుగా ఉండతగినది కాదు" అని అనుకుంది.

ఒక రోజు ఆ నక్క ఆహరం కోసం సంచరిస్తుండగా ఒక చోట వేటగాడు పన్నిన ఒక ఉచ్చు, దాని మధ్యలో ఒక పెద్ద రొట్టె ముక్క కనబడ్డాయి, ఆ జిత్తులమారి నక్క చాలా ఆకలిగా ఉన్నా ఆహారం జోలికి వెళ్ళకుండా గబగబా కోతి రాజు దగ్గరికి పరిగెత్తింది.

"రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. మీరు నా వెంట వస్తే ఒక రుచికరమైన ఆహారం దొరికేచోటు చూపిస్తాను" అని చెప్పింది నక్క.

కోతి సంతోషంగా నక్క వెంట వెళ్ళింది. నక్క కోతిని ఆ ఉచ్చు దగ్గరకు తీసుకెళ్ళింది.

"ఇదుగో రాజా... ఈ రొట్టె ముక్క మీది. అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు" వినయంగా అంది నక్క.

వెనకా ముందూ ఆలోచించకుండా కోతి ఒక గెంతులో ముందుకు దూకింది. అమాయకంగా వేటగాడి ఉచ్చులో చిక్కుకుపోయింది.

"రాజనే వాడికి కొంచెం తెలివితేటలు ఉండాలి" అని నక్క కోతిని అక్కడే వదిలి వెళ్ళిపోయింది.
        💦🐬🐥🐋💦

శివ శివా..రామ రామా..అనడంలో


శివ శివా..రామ రామా..అనడంలో అంతరార్ధం తెలుసా మీకు ?

ఏదైనా తప్పు జరిగినప్పుడు,
చూడకూడనిది చూసినప్పుడు
శివ శివా, రామరామా,
శ్రీరామా అని అనుకోవటంలో ఆంతర్యం ఏమిటి?
అసలిది ఎప్పటి నుంచి అలవాటైంది?

అనే విషయాన్ని గురించి..వివరించే కథా సందర్భం.

శివమహాపురాణం రుద్రసంహిత ఇరవైనాలుగో అధ్యాయంలో ..ఈ కథాసందర్భం కనిపిస్తుంది.

శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు.
ఆ స్వామి అరణ్యవాసం చేస్తున్నప్పుడు రావణవధ
అనే దైవకార్యం కోసం సీతాపహరణ జరిగింది.
అప్పుడు రాముడు, ఆయనను వెన్నంటి ఉన్న తమ్ముడైన లక్ష్మణుడు ఇద్దరూ ఆ అడవుల్లో సీతకోసం అడుగడుగునా వెతుకుతూ ముందుకు వెళ్లసాగారు.

సీతను వెతికే సమయంలో రామచంద్రుడిని అమితమైన దుఃఖం ఆవరించింది.
అలాంటి స్థితిలో ఉన్న రాముడిని, లక్ష్మణుడిని లోకసంచారం చేస్తూ ఆకాశమార్గాన వెళుతున్న
శివుడు, పార్వతీదేవి చూశారు.

కట్టుకున్న భార్య కోసం రాముడు విలపిస్తున్న
తీరు సతీదేవికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.

భార్య కోసం భర్త నిజంగా ఇంత వేదనను అనుభవిస్తాడా?
పురుషులు స్త్రీల విషయంలో అందులోనూ
భార్య విషయంలో ఇంతగా మమకారాన్ని కలిగి ఉంటారా?
అనే సందేహాలు ఆమెకు కలిగాయి.

అదే విషయాన్ని గురించి శివుడిని సతీదేవి అడిగింది.
అప్పుడు శివుడామెకు శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడని,
ఏ ధర్మాన్ని ఎప్పుడు ఎలా పాటించాలో ఆయనకు
బాగా తెలుసునని,
ఒక భర్తగా భార్యను ప్రేమించటంలోనూ, ఆరాధించటంలోనూ రాముడిని మించినవారు
మరొకరు లేరని వివరించాడు.
అయినా సతీదేవికి ఆ విషయం అంతగా మనసుకు ఎక్కలేదు.

రామచంద్రుడు ఆనందానికి దూరమై దేహకాంతి తగ్గి దుఃఖభారంతో అడుగులు ముందుకేయటం ఇవన్నీ
నటన అని భ్రమించింది.
అందుకే మళ్లీ ఆ పరమేశ్వరి శివుడిని రాముడి గురించి అడుగుతూ రాముడి ప్రవర్తన మీద తమకు నమ్మకం కలగటం లేదని అనుమతిస్తే..
తాను స్వయంగా శ్రీరామచంద్రుడిని పరీక్షించి నిగ్గుతేల్చాలనుకొంటున్నట్లు చెప్పింది.
శివుడు చిరునవ్వు నవ్వి ఎవరు ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా ఏకపత్నీవ్రతం విషయంలో రాముడిదే గెలుపవుతుందని అన్నాడు.
సతీదేవిని వెళ్లి రాముడిని పరీక్షించమని చెప్పి
ఆయనొక మర్రిచెట్టు కిందకు వెళ్లాడు.

సీత రూపంలో సతీదేవి వెంటనే సీతామాతలాగా రూపం మార్చుకొని సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులకు కనిపించే మార్గంలో వారికెదురుగా నడుచుకొంటూ రాసాగింది.
శ్రీరాముడు భార్య భ్రమలో ఉండి తనను సమీపిస్తాడని, తననే భార్యగా అనుకొని సంతోషంతో పొంగిపోతాడని ఆమె అనుకొంది.
కానీ సీతగా రూపం మార్చుకొన్న సతీదేవి సమీపానికి వచ్చేసరికి శ్రీరాముడు శివ శివా అంటూ శివనామస్మరణం చేస్తూ పక్కకు తప్పుకొని వెళ్లిపోయాడు.
లక్ష్మణుడు ఆయననే అనుసరించాడు.

రాముడి గురించి శివుడు చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని అలా సతీదేవి గ్రహించింది.
భార్య మీద ప్రేమానురాగాలు ఏ మేరకుండాలో,
భ్రమలు ఆకర్షణలకు దూరంగా వాస్తవమైన ప్రేమ అనేది ఎలా ఉంటుందో ఇలా రాముడి పాత్ర చిత్రణం ద్వారా శివమహాపురాణం వివరిస్తోంది.
అంతేకాక పరస్త్రీ తన ఎదురుగా ఆకర్షించే రూపంలో వచ్చినప్పుడు రాముడు శివశివా అనటంవల్ల
శివనామం పాపహరణమని,
అది రాముడికి కూడా ఎంతో ఇష్టమైనదని స్పష్టమవుతోంది.

అలాగే శివుడికి రామచంద్రుడి వ్యక్తిత్వం మీద ఎంత నమ్మకమో తెలుస్తుంది.
అందుకే రామనామం శివుడికి ఇష్టమైంది.
పురాణకాలం నుంచి ఇలా చూడకూడనివి చూసినప్పుడు లేదా పాపం అని అనిపించినప్పుడు శివ శివా అని అనుకోవటం ఓ అలవాటుగా వస్తోందని
ఈ పురాణ కథవల్ల తెలుస్తోంది.
ఓం శ్రీ గురుభ్యోనమః
*******************

పోత‌న త‌లపులో ...(23)

ఒక్క‌డే ప‌ర‌మ‌పురుషుడు
విశ్వాధీశుడొక్క‌డే
అనంత‌కోటి స్వ‌రూపమొక్క‌టే
అంటూ స‌ర్వాంత‌ర్యామి త‌త్వాన్ని
తేట‌తెల్లం చేసే ప‌ద్యం.

                       ***
పరమపూరుషుఁ, డొక్కఁ, డాఢ్యుఁడు, పాలనోద్భవ నాశముల్
సొరిదిఁ జేయు; ముకుంద, పద్మజ, శూలి సంజ్ఞలఁ బ్రాకృత
స్ఫురిత సత్త్వ రజస్తమంబులఁ బొందు; నందు శుభస్థితుల్
హరి చరాచరకోటి కిచ్చు ననంత సత్త్వ నిరూఢుఁడై.
                      ***

పరమపురుషుడు ఒక్కడే; ఆయనే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడు; ఆయనే సత్వరజస్తమోగుణాలను స్వీకరించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే మూడు రూపాలు ధరించి ఈ లోకాలను సృష్టిస్తు, రక్షిస్తూ, అంతం చేస్తూ ఉంటాడు; అందులో అనంత సత్త్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు.

🏵️మ‌ధురం మ‌ధురం 🏵️
   🏵️పోత‌న ప‌ద్యం 🏵️
*********************

అగ్నయే రుద్ర రూపాయ

అగ్నిని ధ్యాన శ్లోకంలో యిలా వివరణ కలదు. అగ్నయే రుద్ర రూపాయ అని. మరి అగ్ని పుట్టుక మూలం ఎక్కడ పరిశీలన. సూర్యుడు లేక భూమి సమస్త శూన్యము లేక సమస్త విశ్వ వ్యాపితయైన అగ్ని తత్వం ఏమిటి. దీనినే రుద్ర శబ్దము. అయితే మనకు కనపడే రుద్రునకు అంత అనంత విశ్వవ్యాప్తం ఎలా దానికి మూల కారకుడు ఆయనే కనుక. దాని పరమాణం ఏమిటి ఎలా కొలుచుట వక వేళ అది పదార్ధమును  ఆశ్రయించి యున్నదా. అట్లయిన అది పదార్ధమునకు ఎలా సంభవించినది. అగ్ని మనం తయారు చేయుటా లేక తయారు చేసినది మనం ఉపయెూగించుటా. రాహువు యెుక్క మూల మాగ్నెట్ శక్తి మనం చూడలేదు. దానికి వక ఎన్టీ క్లాక్ వైజ్ లో విశ్వంలో తిరిగే అనంతమైన శక్తి అది పదార్ధం కాదు. కాని దాని చైతన్యమై బిగ్బాంగ్ సూత్ర ప్రకారం ప్రచోదయాత్.చైతన్యమైనది అనగా ప్రచోదనమైనది. అనగా చైతన్యము. అది మనకు తెలుపుటకు వేదం రుద్ర రూప ఆరుద్ర అనే నక్షత్ర రూపం నిర్ణయించి దాని స్ధానం భూమి మధ్య రేఖయైన కర్కాటకరేఖనుండి అనగా మేషరాశి మధ్యలో  67డిగ్రీలనుండి కర్కాటకరాశినుండి 13 డిగ్రీల మధ్యలో శక్తిని నిర్మించిరి. అదియే చైతన్యమై  లక్షణము గల కేతువుగాను మూల నక్షత్ర శక్తిగా నిర్ణయించిరి. కనుక రుద్ర శక్తియే రాహువుగాను  దాని వ్యాప్తంగా విశ్వ వ్యాప్తియైనది. రుద్రుని మరో పేరు వైశ్వానరుడు అనగా అగ్ని వైశ్వానరుడు. వైశ్వ దేవమనే అగ్ని చైతన్య ప్రక్రియ వేద పరంగా కలదు. జగత్తుకు ఆయనే మూల కారకుడు. సాక్షాత్ ఈశ్వర తత్వము వైశ్వానరుడు అది లీలగా మాత్రమే  కనబడును. అనగా లాలీలాయ జ్వాలలు మాత్రమే. అదియే కేతు రూపమైన విషు విష్ణు తత్వ మని అదే కారణమని అందుకే అగ్ని సూర్యోదయం తరువాతనే ప్రజ్వలింప చేయవలెను. అనగా సప్త కిరణ చైతన్యము ఉష కాంతి యే రుద్ర స్వరూపం. దానిని మేషో లసత్ కేతవే అని అశ్వనీ నక్షత్ర మంత్రం గాయత్రీ ప్రారంభం అగ్నితో కలదు. క్రవ్యాది సమస్త పదార్థములు చైతన్య లక్షణమే అగ్నిని అనగా కర్రలను మంత్ర పూర్వక చైతన్యమే అగ్ని యెక్క లక్షణము. అదే హవనపూర్వకమైన హవిస్సు అగ్నికి మరో రూపం. అటువంటి అగ్నియే జీవ సృష్టికి మూలమని తెలియును. యిక్కడ వక శ్లోకం చూసిన అగ్నయే రుద్రరూపాయ నమెూవైశ్వానరాయచ సర్వసంహార రూపాయ జగజ్జీవనమూర్తయే - తస్మై తుభ్యమహంనతో. అగ్ని సకల వ్యాప్తియైనది సప్తార్చ్షితే - సాక్షాత్ ఈశ్వర మూర్తిన్ భేద వపుషే మేషోలసత్ కేతవే. నైవస్యాత్ తక్షణం అప్య శేషభువనం హవ్యాదకవ్యాసన - క్రవ్యాదాది చరాచరాత్మకం యిదం యస్మాద్ పరస్మాద్వృతే అని అగ్ని యెక్క వివరణ. హవనాగ్నియే సృష్టికి మూలమని అది నిత్యం వక యింటిలో నైనా నుండవలెనని అట్లు వుండుట వలన ప్రకృతిలో పరిమిత ప్రాంతంలో విషవాయువులు దహింప బడి వాతావరణ స్వచ్ఛత కలుగును.
***********************

శ్రీ బాలాత్రిపురసుందరీ

బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి...నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.

ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి.

ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.

ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది.

మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.

హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.

బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు.బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.

శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం:-

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే, కామేశ్వర్యై చ ధీమహి, తన్నోబాలా ప్రచోదయాత్.
******************

క్షమాగుణం*

 *క్షమా శస్త్రం కరే యస్య దుర్జనః కిం కరిష్యతి?**
 *అతృణో పతితో వహ్నిః స్వయమేవోపశమ్యతి!!!*

ఎలాగైతే గడ్డి పరక కూడా లేని నేలమీద పడిన  మంట కూడా తనంత తానే ఆరిపోతుందో అలాగే ఎవరి దగ్గరైతే క్షమ అనే శస్త్రం వుంటుందో వారిని దుర్జనులు కూడా ఏమీ చేయలేరుట.

క్షమించడం, క్షమా గుణం కలిగి ఉండడం ధర్మం యొక్క రెండవ లక్షణం. క్షమించడం అన్నమాటని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి.

 ఒకడు బలహీనుడై, ఎదుటివాడు బలవంతుడైనప్పుడు, వాడితో పోరాటం చేయలేక, వాడు ఎన్ని అకృత్యాలు చేస్తున్నా, వాడిని క్షమించేస్తాం. ఇది పరికితనంతో చేసే పని. ఇది క్షమా గుణం కాదు, చేతకానీతనం అంటుంది ధర్మం. ఏలా అంటే, మీకు ఎవరి మీదో బాగా కోపం వచ్చింది,గట్టిగా నాలుగు తగించాలనుకున్నారు, కానీ అవతలివాడు మీకంటే శక్తివంతుడని, మీరు ఒక్క దెబ్బ కొడితే, వాడు పది దెబ్బలేస్తాడని తెలుసు కనుక, మీరు వెనక్కు తగ్గుతారు. అది కాదు క్షమా అంటే అంటుంది ధర్మం.

 మీరు ముందు బలవంతువులుగా మారండి. ఎవరైనా మీ జోలికి వస్తే వాడికి బుద్ధి చెప్పేటంతగా, శారీరికంగానూ, మానసికంగానూ మీరే బలవంతులవ్వాలి. ఎదుటివాడిని మట్టి కరిపించే శక్తి మీకు ఉండాలి. అన్నీ ఉండి, అవతలవాడు బలహీనుడని తెలిసి కూడా మీరు క్షమించగలగాలి. అదే నిజమైన క్షమా గుణం.

ఇదే కర్మయోగం చెప్తుంది. ధర్మం కూడా అటువంటి క్షమాగుణాన్నే అలవరచుకోవాలని చెప్తున్నది.

 ఎందుకంటే ఏమి లేనీవాడు, శక్తిహీనుడు ఎట్లాగో వాదన చేయలేడు, కనుక సర్దుకుపోతాడు. క్షమించడం ధీరులైనవారి లక్షణం.చేతగానితనం బలహీనుల లక్షణం.

 అందుకే బలహీనులు ఎప్పటికి క్షమించలేరు, క్షమించడం బలవంతుల సద్గుణం .
Shri ram jay ram jay jay ram
*************************

17, ఆగస్టు 2020, సోమవారం

నిధి ఉన్న బిచ్చగాడు : మంచి కథ

🍁 ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూచుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు. చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.

🍁 ప్రతి రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.
ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణేన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే. ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది......

🍁 బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు. చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది. తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.

🍁 తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు. ఆ భక్తుడు సరేనన్నాడు.

🍁 ఆ ఘడియ రానే వచ్చింది.
బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు. భక్తుడు అతడడిగిన స్థలం…
*************
: బాలా త్రిపుర సుందరి దేవి అంటే త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి...నిత్య సంతోషం కలుగుతుంది.

త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత.షోడశ విద్యకు ఈ దేవత అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.అసలు బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు.

ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్తలు జాగృత్, స్వప్న , సుషుప్తి.

ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత.

ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది.

మనము ఎన్ని జన్మలు ఎత్తిన ఈ ముడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది.ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివ స్వరూపముతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు ముప్ఫై మంది పిల్లలు. వీళ్ళందరు అవిద్యా వృత్తులకు సంకేతం.

హంసలచే లాగ బడుతున్న కన్యక అనబడే రథం పై వచ్చి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించినవారు. అంత భయంకరమైన వారు, వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట.

బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదు.బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది.హంసల రథం అమ్మది హంసలు అంటే శ్వాసకు సంకేతం.ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు.ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా పిలవబడుతున్నది.

శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం:-

బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే, కామేశ్వర్యై చ ధీమహి, తన్నోబాలా ప్రచోదయాత్.

: హరిఓం  ,
*******************

 ఆతిథ్యం అంటే భోజనం పెట్టడం మాత్రమే కాదు.
ఆత్మీయంగా ఆదరించడం ఆతిథ్యంలోని ప్రధానాంశం. ఇంటి ముందుకొచ్చి అర్థించిన ముష్టివాళ్ళక్కూడా ఆహారం పెడతాం. కానీ, అది ఆతిథ్యం కాదు.
ఈ ప్రపంచంలో మనదంటూ ఏమీ లేదంటుంది యోగవాసిష్ఠం. సకలమూ బ్రహ్మస్వరూపమే. ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు... రూపంలో భేదాలే తప్ప ఇద్దరిలోనూ ఒకే అంతర్యామి కొలువున్నాడు కదా! కనుక భేదం లేదు.
ప్రపంచంలో చెట్ల కన్నా మించిన ఆతిథ్య ధర్మం చూపగలవారు ఉండరు. ఎవరో నాటుతారు. ఇంకెవరో నీరు పోస్తారు. అవి కాలంతోపాటు చెలిమి చేస్తూ ఎదిగి వృక్షాలవుతాయి. పువ్వులు పూస్తాయి. కాయలు కాస్తాయి. పక్షులకు ఆశ్రయం, ఆహారం సమకూరుస్తాయి. బాటసారులకు నీడనిస్తాయి. చివరకు కట్టెలుగా మారి మనిషికి అక్కరకొస్తాయి.
ఇంతటి సేవాధర్మం నిర్వర్తిస్తూ, మౌనంగా జీవితం ప్రారంభించి, మౌనంగానే నిష్క్రమిస్తాయి. దత్తాత్రేయ గురుచరిత్రలో ఒక అవధూత, ప్రకృతిలో ఎందరో తనకు గురువులుగా చెబుతాడు. ప్రతి ప్రాణీ జీవితంలో ఉండే మౌన సందేశాలను అవధూత ఆకళింపు చేసుకుంటాడు. అంతకంటే గొప్ప ఆధ్యాత్మిక పరిపక్వత చూడలేం. ప్రాపంచిక దృష్టితో చూస్తే ఏదీ గొప్పగా అనిపించదు. వస్తువుల్ని, వ్యక్తుల్ని మన కొలబద్దతోనే కొలుస్తాం. మన దృష్టిని బట్టే అంచనాలు వేస్తాం.
శిలను శిల్పంగా మార్చినప్పుడు విలువ పెరుగుతుంది. బంగారం నగగా రూపొందినప్పుడూ అంతే. కొందరు సామాన్యులుగానే కనిపిస్తారు. కానీ, వారిలో అసమాన ప్రజ్ఞ దాగి ఉంటుంది.
వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు ఆయన రూపం, వేషంకేసి అందరూ చులకనగా చూశారట. ఒక మహిళ ఆయనకు ఆతిథ్యం ఇచ్చింది. వివేకానందుడి తొలి సంబోధనతోనే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లి పోయిందని చెబుతారు.ఆయన జ్ఞాన జ్యోతి. కొన్ని తరాలకు సరిపడా జ్ఞాన సంపదను ఆయన జిజ్ఞాసువులకు వదిలి వెళ్ళాడు.

ప్రపంచంలో జీవితావసరాలు లభిస్తాయి. కానీ, జ్ఞానం అంత సులువుగా లభించదు. నచికేతుడి కథలో యముడు ఎన్ని విధాల ప్రలోభపెట్టినా, పట్టుదలగా అతడు జ్ఞానభిక్షనే కోరుకున్నాడు. అంతవరకు నిరాహారంగా, అతిథి మర్యాదలను తిరస్కరించాడు.
ప్రాణాధారమైన అన్నపానాలను గృహస్థు అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించడాన్నే అతిథి యజ్ఞం అంటారు. అంటే, అతిథిని సంతృప్తిపరిస్తే యజ్ఞఫలం దక్కుతుందని అర్థం చేసుకోవాలి. అతిథి రూపంలో ఇంద్రుడు వచ్చి బీదగృహస్థు రంతిదేవుణ్ని పరీక్షించిన కథ సుప్రసిద్ధం. కుచేలుడికి కృష్ణుడు కేవలం స్నేహ వాత్సల్యమే చూపలేదు. అనితర సాధ్యంగా ఆతిథ్యమిచ్చాడు. స్వయంగా పాదాలు కడిగాడు. తన అష్టదేవేరుల చేత సేవలు చేయించాడు. అష్టైశ్వర్యాలూ అనుగ్రహించాడు.
ఇక్కడ మనం గమనించాల్సింది- ఆతిథ్యంలోని ఆత్మీయ భావనకున్న విలువ. ఆదిశంకరులకు గృహిణి ఒక్క ఉసిరికాయను భక్తితో సమర్పించి, కనకధారా స్తోత్రానికి ప్రేరణనిచ్చింది. అదే ప్రపంచానికి కల్పవృక్షమైంది.
అతిథి తృప్తిపడినప్పుడు ‘అన్నదాతా సుఖీభవ’ అన్న ఒక్క మాటకున్న విలువ అమూల్యం. ఆ మాటను అంతర్యామి ఆశీస్సుగానే భావించాలి.
అతిథికి ఆకలి, దాహం తీర్చగల ఆహార పానీయాలు సమకూర్చగలిగితే చాలు. అవి ఖరీదైనవా, సామాన్యమైనవా అనే ప్రసక్తి తలెత్తదు. సర్వదేవతా స్వరూపిణిగా గోమాతను భావించినట్లే అతిథిని దైవ స్వరూపంగా భావించి ఆదరించడమే భారతీయ సంప్రదాయం. అతిథికి కులమతాలతో, జాతితో ఎలాంటి దుర్విచక్షణా చూపకూడదు. అప్పుడే అది అసలైన ఆతిథ్యం అవుతుంది............                        -                    🙏🙏🙏       

***************************           -

ఆనంద యోగం
సంతోషం మానసిక ఉద్వేగం. అది మనిషికి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మనిషికి కావాల్సింది సంతోషం కాదు... ఆనందం. కొంతకాలం మనిషికి హాయి చేకూర్చే సంతోషంకన్నా ఎప్పటికీ తరగని ఆనందం ప్రశాంతతనిస్తుంది.
ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు, చాలాకాలం తరవాత బంధుమిత్రులు కలిసినప్పుడు, కోరినది లభించినప్పుడు సంతోషం తాండవిస్తుంది. ఒక సమయంలో అత్యంత సంతోషాన్ని కలిగించినవే మరొకప్పుడు విసుగు, చిరాకు, ఆందోళనలకు గురిచేస్తాయి. సంతోషం సగం బలం. ఆనందం పూర్తి అభయం.

సంతోషం వస్తుంది, పోతుంది. ఆనందం వస్తుంది, పెరుగుతుంది. శాశ్వతంగా నిలుస్తుంది. ఆనందం మాటలతో వర్ణించలేనిది. హృదయాన్ని పరవశింపజేసే దివ్య వరం. పరమాత్మ ఆనందస్వరూపుడు. భగవంతుడితో సాంగత్యమే ఆనందపు హరివిల్లు. మనిషికి ఈ లోకంలో ఆనందం పంచేందుకు అమ్మను, ప్రకృతిని సృష్టించి దాన్ని అందుకునే ప్రేమ హృదయాన్ని అందించాడు. బృందావనంలో గోప, గోపికల ఆనంద పారవశ్యం శ్రీకృష్ణుడి సాహచర్యఫలమే.

రాసక్రీడల ఆంతర్యం భగవంతుడితో కలిగే ఆనందానికి ప్రతిరూపం.

భృగుమహర్షి బాల్యంలో భగవంతుణ్ని తెలుసుకోవాలని తపస్సు ప్రారంభించాడు. మొదట అన్నం పరబ్రహ్మస్వరూపంగా, ప్రాణం భగవన్మయంగా, ప్రకృతినే పరమేశ్వర రూపంగా భావించాడు. చివరకు భగవంతుడే ఆనందంగా గుర్తించాడని భృగువల్లి పేర్కొంది.

తైత్తిరీయోపనిషత్తులో ఆనందవల్లి ఆనంద స్వరూపాన్ని మూడు విధాలుగా వివరించింది. మనుష్యానందం, గంధర్వానందం, బ్రహ్మానందంగా గుర్తించింది. లోకంలోని అనేక ఆకర్షణలు, అనురాగాలు, బాంధవ్యాలు మనుష్యానందానికి చెందినవి. దేవతారాధన, పూజలు, దానాలు, వ్రతాలు... వీటి వల్ల లభించే ఆనందం గంధర్వానందం.

నిజమైన ఆనందం పరమాత్మ సాంగత్యంలో లభిస్తుంది. ప్రకృతిలో, పంచభూతాల్లో, సూర్యచంద్రుల్లో నిండి భూమిపై గల సర్వప్రాణులకు జీవనాధారాన్ని ప్రసాదించే పరమాత్మ అనుగ్రహ వీక్షణమే బ్రహ్మానందం. సృష్టి సమస్తం బ్రహ్మమయం. దాని ప్రాణాధారమే బ్రహ్మానంద స్థితి. మనిషి సంతోషం నుంచి ప్రయాణం సాగించి బ్రహ్మానందస్థితికి చేరాలని ఆనందవల్లి బోధించింది.

పరమాత్మను హృదయంలో అంతర్యామిగా దర్శించాలి. దానికి సాధనామార్గాలు- ధ్యానం, జపం, పూజ, తపస్సు, యజ్ఞయాగాది క్రతువులు. సామాన్యులకు అవి అందని ద్రాక్షలు. నిరంతరం జీవనపోరాటంలో అలసిపోయే సంసారులకు యోగమార్గాలు ఆకాశదీపాలే.


సామాన్యుల కోసం అయిదు మానవతా విలువలను ఆచరణ మార్గాలుగా వేదం ప్రకటించింది. అవే- సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస. వాటిని నిత్యజీవితంలో అనుసరించి ప్రతి పనినీ భగవంతుడి ప్రీత్యర్థం కావిస్తే ఆనందానికి మనిషి సులువుగా చేరుకుంటాడు.

మంచినే చూడు, మంచినే విను, మంచినే మాట్లాడు అని మూడు కోతి బొమ్మలతో ఆనందరసానుభూతిని చూపు, శ్రవణం, మాటతో పొందవచ్చనే సందేశాన్ని గాంధీ మహాత్ముడు అందించాడు. మనిషి తన జీవితపరమపద సోపానం సంతోషం అనే మొదటి గడి నుంచి ప్రారంభించాలి. ఆరు దుర్గుణాలనే పాములను తప్పించుకోవాలి. మానవతావిలువలు అనే అయిదు నిచ్చెనలను అధిరోహించాలి. చివరకు బ్రహ్మానంద స్థాయి అయిన చివరి గడిని చేరాలి. అదే పరిపూర్ణ ఆనందజీవితం!
***********************
  యస్యజ్ఞాన దయా సింధోరగాధస్యా నఘా గుణాః
సేవ్యతా  మక్షయో ధీరాసశ్రియైచా మృతాయచ
హి ధీరా= ఓ!విద్వాంసులారా జ్ఞానదయా సింధో= జ్ఞానమునకు,దయకు ను ఆశ్రయ భూతుడైన, అగాధస్య=గంభీరుడైన, యస్య=ఏ దేవుని యొక్క, గుణాః=గుణములు అనఘా= రాగాది  దోషములు లేనివో
అక్షయ=నాశ రహితుడైన, సః = ఆదేవుడు, శ్రియైచ= సంపదకోరకును, అమృతాయచ= మోక్షము కొరకు, సేవ్యతాం= సేవింప బడు గాక యిది పరమాత్మ పరమైన అర్థము.సముద్ర పక్షమందు
యస్య=ఏ, అగాధస్య= లోతైన,సింధో= సముద్రుని యొక్క,,గుణాః =రత్నాకరత్వాది గుణములు,  అనఘాః=నిర్దోషము లైనవో  అక్షయ= విష్ణువుకు నివాసమైన సః =ఆ సముద్రుడు, శ్రియైచ=లక్ష్మీదేవి కొరకు
అమృతాయచ =అమృతము కొరకు సేవ్యతాం= సేవింప బడుగాక
అనగా పూర్వము దేవతలు సముద్రమును (మధించి) సేవించి లక్ష్మీ దేవిని, అమృతమును బడసి నట్టు భగవంతుని సేవించు వారలు ధర్మార్థ కామము లనెడి త్రివర్గ సంపదను ,మోక్షమును పొందుదురని తాత్పర్యము.
పూర్వము సంస్కృత పాఠం వినడం యిష్టం లేని కొంత మంది కొంటె కుర్రవాళ్ళు
"యస్య జ్ఞాన దయాసింధో గొడదాటితే అదే సందో " అని గోడ దూకి పారిపోయేవారట
***********************