20, జనవరి 2021, బుధవారం

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము 🌹



సర్వేశ్వరుని కృపన్ సంకల్ప మొందియు 

           యానాటి నుండియు యన్నమయ్య 

దినమున కొకభక్తి  దివ్యగీతంబుతో 

             పరమాత్మ శ్రీ హరిన్ ప్రస్తుతించి 

యానంద పరవశం బనుభవించుచు నుండె 

              యత్యంతగా తన యాత్మ యందు 

అన్నమాచార్యుని  హరి కీర్తనంబులు 

              తిరుమల దాటియు తిరిగె భువిలొ 

వేంకటేశుకు జరిగెడి వేడుకలను 

నిగమ వేద్యుకు జరిగెడి నిత్య పూజ 

శ్రీని వాసుకు జరిగెడి సేవ లన్ని 

వర్ణనము జేసె పాడెను  నన్నమయ్య 


కొండ పైన నతడు కొండలరాయుని 

యర్చనంబు జేసి యనుదినంబు 

తిరిగి పయనమయ్యు తిరుమల నుండియు 

తాళ్ళ పాక జేరె సతుల తోడ 


అన్నమయ్యంతట హరికీర్తనంబుల

        నప్పటి కప్పుడు జెప్పు చుండ 

సంతోషడెందాన సహచరశిష్యులు 

         గ్రంధస్థపరచేరు కంఠబట్టి 

కాలగర్భము నందు గలసిపోకుండగ 

           పదికాలముల పాటు భద్రపరచ 

తదుపరి వానిని తామ్ర రేకుల పైన 

          చెక్కించి యుంచేరు సిద్ధముగను 

యన్నమయ్య నోటి హరికీర్తంబులు 

వాడ వాడ లందు వ్యాప్తి పొంది 

సకల జనుల యొక్క సన్మతి గెలిచియు

నిలిచె పదకవితగ నిఖిల మందు 


తదుపరన్నమయ్య ధర్మపత్నులతోడ 

తీర్థయాత్ర లందు దిరుగ నెంచి 

సకల దేవళముల సందర్శనము సేయ 

పయనమయ్యె తాళ్లపాక నుండి 


              తీర్థ యాత్రలు     


తొలుత తన గ్రామమందున వెలసి యున్న 

చెన్నకేశవు దర్శించి సన్నుతించి 

సకల సంబారముల తోడ సతుల తోడ 

భక్తి మీరగ యాత్రకు పయన మయ్యె 


మార్గ మధ్యమందు మహిమాన్వితంబగు 

నందలూరు గ్రామ నడిమి నున్న 

సౌమ్యనాధ స్వామి సన్నిధిం జేరియు 

ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ 


ఘనత నొంటిమిట్ట గ్రామంబు నందున్న 

రఘుకుల గుణధాము రామచంద్రు

దివ్య  దర్శనంబు భవ్యంబుగా పొంది 

ప్రణతు లిడెను  మిగుల భక్తి తోడ 


కడప నగరమందు కడు వైభవంబున 

వెలసి యుండినట్టి వెంకటేశు 

కన్నులార గాంచి కాన్కల నర్పించి 

ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ 


చనియు నన్నమయ్య చాగలమర్రికి 

చెన్నకేశవుడిని సన్నుతించె 

కన్నులార గాంచి కాన్కల నర్పించి 

ప్రణతు లిడెను మిగుల భక్తి తోడ 


తదుప రన్నమయ్య దారిలో నెలకొన్న 

వివిధ దేవళముల వేడ్క జూచి 

క్షితిని నారసింహ క్షేత్రమై వర్ధిల్లు 

శ్రీ యహోబిలమును జేరె కడకు


✍️గోపాలుని మధుసూదనరావు 🙏

శంఖనిధి, పద్మనిధి

 🌹  *శంఖనిధి, పద్మనిధి అంటే ఎవరో తెలుసా..?* 🌹

(20.1.21)


తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉన్నాయి.  ఆలయంలోనికి ప్రవేశించే ముందు భక్తులు తమ  కాళ్ళను ప్రక్షాళన చేసుకుంటారు. అక్కడే శ్రీవారి ఆలయం గడపకు ఇరుప్రక్కలా కనిపిస్తాయి శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు.  సాధారణంగా భక్తులు తమ కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము. కాబట్టి ఈ శంఖనిధి, పద్మనిధి విగ్రహాలను గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది. దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం.


తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం.


శంఖనిధి, పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షినదిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి, ఇలాగే కుడిప్రక్కన అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించివుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి. ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారంవద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం.


దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడుప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది. ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధిదేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు. ఇంతకు ముందు వీరిని మీరు గమనించివుండకపోతే ఈసారి శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి.

శ్రీచక్రార్చన

 శ్రీచక్రార్చన వివరణ...!! శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది. శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు. శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు. నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది. తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు. శివ, శక్తి, చక్రములతో కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది. అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము. సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము. శ్రీ దేవి నిలయమే ఈ శ్రీచక్రము. శ్రీచక్రమే శ్రీదేవి. శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీచక్రము 3 రకములుగా లోకంలో పూజింపబడుచున్నది. ౧. మేరు ప్రస్తారము ౨. కైలాస ప్రస్తారము ౩. భూ ప్రస్తారము. సప్త కోటి మహా మంత్రములతో సర్వ దేవతా స్వరూపమైన శ్రీచక్రమును విప్పూజించిన యెడల, సర్వ శక్తులూ, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని మన పూర్వీకులు, ఋషులు విప్వక్కాణించి యున్నారు. శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. ఆ ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే దేవీ సాక్షాత్కారం లభించినట్లే. ఈ శ్రీవిద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించెను. పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య సిద్దుల కొరకు చతుషష్టి (64) తంత్రములను సృష్టించెను. కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర తంత్రము వలన కలుగు 

షడాననం

 షడాననం చందన లేపితాంగం

మహోరసం దివ్య మయూర వాహనం

రుద్రస్య సూనుం సురలోక నాథం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


జాజ్వల్య మానం సురబృంద వంద్యం

కుమారధారా తట మంతిరస్తం

కందర్ప రూపం కమనీయ గాత్రం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


ద్విషట్భుజం ద్వాదశ దివ్యనేత్రం

త్రైతనుం శూలమశిం దధానం

శేషావతారం కమనీయరూపం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


సురారి ఘోరాహవ శోభమానం

సురోత్తమం శక్తిధరం కుమారం

సుధార శక్త్యాయుత శోభి హస్తం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


ఇష్టార్థ సిద్ధిప్రద మీశ పుత్రం

ఇష్టాన్నధం భూసుర కామధేనుం

గంగోద్భవం సర్వ జనానుకూలం

బ్రహ్మణ్య దేవం శరణం ప్రపధ్యే


యశ్లోక పంచకమిదం పఠతేచ భక్త్యా

బ్రహ్మణ్య దేవ వినివేశిత మానసః సన్

ప్రాప్నోతి భోగమాఖిలం భువి యద్యదిష్టం

అంతేస గచ్ఛతి ముదాగుహ సామ్యమేవ


                     - ఆది శంకరాచార్యులు

            గానం - శంకరన్ నంబూద్రి

19, జనవరి 2021, మంగళవారం

నిమిషానికి 59సెకన్లే..

 *పెద్ద సమస్యే ఇది.. నిమిషానికి 59సెకన్లే.. శాస్త్రవేత్తల ఆలోచన!*

 తన చుట్టూ తాను తిరుగుతూ ఉండే భూమి వేగం పెంచుకుంది. దీంతో సాధారణ సమయం కంటే సమయం వేగంగా గడిచిపోతోంది. భూమికి ప్రళయ సంకేతాలు కనపడుతున్నాయంటూ చాలా ఏళ్లుగా వార్తలు వస్తుండగా.. ఇప్పడు శాస్త్రవేత్తలు సమయాన్ని కుదించే అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిమిషాకి 59సెకండ్లనే లెక్కగట్టే యోచనలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి తన చుట్టూ తాను వేగంగా భ్రమించగా.. ఒకసారి సూర్యుడిని చుట్టి వచ్చే లోపు భూమి తన చుట్టూ ఏకంగా 419 నుంచి 420 సార్లు తిరిగేదట. అయితే అది కాల క్రమంలో ఆ సమయం తగ్గింది. ప్రస్తుతం 365 సార్లు మాత్రమే పరిభ్రమిస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 6గంటల సమయం ఎక్కువగా ఉంటోంది. దీంతో నాలుగో ఏడాదిని లీపు ఇయర్‌గా పరిగణించి ఏడాదికి 366 రోజులను నిర్ణయించారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఆ లెక్క కూడా మారేలా కనిపిస్తోంది.

భూమి వేగవంతమైన వేగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిమిషాన్ని 59 సెకన్లకు తగ్గించాలని ఆలోచిస్తున్నారు. భూమి యొక్క నిజమైన భ్రమణానికి సమయాన్ని సమకూర్చడానికి కనీసం ఒక “సెకండ్”ను ఒక నిమిషం నుండి తీసివేయవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి వేగం పెరుగుదలలో మార్పులకు అనేక కారణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులు దీనికి ఓ కారణం. చంద్రుడు భూమికి దూరంగా కదులుతుండడం కూడా ఒక కారణమే.

సగటు రోజు సాధారణ 86,400 సెకన్లు ఉంటుంది. అయితే 2021లో 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ‘అయితే దీనిని అడ్జస్ట్ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఇలా ఇంతకుముందు కూడా టైం అడ్జస్ట్ జరిగింది. కానీ అప్పుడు కేవలం 1 మిల్లీ సెకను అడ్జస్ట్ చేశారు. దానివల్లే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చింది. కంప్యూటర్లు, శాటిలైట్లు అన్నీ క్రాష్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒక సెకెండ్ అడ్జెస్ట్ చెయ్యడం అంటే చాలా కష్టమైన పని.

ఒక్క సెకనును ఒక నిమిషం నుండి తీసివేయడం వలన ఖచ్చితమైన సమయపాలనపై ఆధారపడే ప్రదేశాలలో వినాశనం వస్తుంది. తద్వారా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 2012లో సమయానికి జోడించిన ఒక లీపు సెకను కారణంగా సర్వర్లు క్రాష్ అయ్యి అనేక సైట్లు పడిపోయాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు జావాస్క్రిప్ట్ కూడా ఫలితంగా అంతరాయాలను చవిచూసింది. కంప్యూటర్లు సమయాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో ట్రాక్ చేస్తాయి మరియు లీపు సెకను జోడించడం లేదా తీసివేయడం చాలా ప్రమాదం.

 అయినప్పటికీ, శాస్త్రవేత్తలు ఒకరకమైన దిద్దుబాటు అవసరం అని చెబుతున్నారు. 59 సెకన్ల నిమిషంను చెయ్యాలని భావిస్తున్నారు. ఏ దిశను తీసుకోవాలో లేదో నిర్ణయించడానికి చాలా సమయం పట్టవచ్చు. అన్ని సంభావ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, 2023లో జరిగే ప్రపంచ రేడియోకమ్యూనికేషన్ సమావేశం లీపు సెకన్లతో ఎలా ముందుకు వెళ్ళాలో నిర్ణయిస్తుంది.

శృంగేరి కథ

 శృంగేరి కథ కంచి(కి)లో


ఒకసారి మహాస్వామి వారి దర్శనానికి ఒక బ్రహ్మచారి అయిన యువకుడు వచ్చాడు. పరమాచార్య స్వామి వారికి సాష్టాంగం చేసి నిలుచున్నాడు. మహాస్వామి వారు ఆత్రుతగా అతణ్ణి చూసి “నువ్వు కుళితలై శంకరన్ కదూ? ఎలా ఉన్నావు?” అని అడిగారు. ”అవును పెరియవా. బావున్నాను అంతా మీ ఆశీర్వాదం.” శంకరన్ బదులిచ్చాడు.


“సరే ఇప్పుడు నీ వయసెంత?”


“ముప్పై సంవత్సరాలు పెరియవా”


మహాస్వామి వారు నవ్వుతూ “పెళ్ళి చేసుకోకుండా ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోవాలనుకుంటున్నావా?” అని అడిగారు. 


”అవును పెరియవా” అన్నాడు శంకరన్. 


”సరే. ఏమైనా విశేషమా ఇలా రావటం?” అని నవ్వుతూ “కారణం లేకుండా నువ్వు రావు కదా?” అని అన్నారు. 


”అవును పెరియవా. ఒక సందేహ నివృత్తి కోసం ఇక్కడకు వచ్చాను.”


“అలాగా! సరే చెప్పు ఏమా పెద్ద సందేహం” అని అడిగారు. 


“అది మంత్రజపం గురించిన ఒక సందేహం” శంకరన్ బదులిచ్చాడు. పరమాచార్య స్వామి వారు వెంటనే “అది మంత్ర జపం గురించినదైతే.. నువ్వు ఏదైనా మంత్ర జపం చేస్తున్నావా?”


“అవును పెరియవా”


“ఓహో మంత్రోపదేశం తీసుకున్నావన్నమాట.”


“అవును పెరియవా”


“గురువు ఎవరైతే”


“మైసూరు యజ్ఞ నారాయణ గణపదిగళ్” శంకరన్ బదులిచ్చాడు. ”మంచిది. చలా మంచి విద్వాంసుడు; మత్రం ఏదైనా”


శంకరన్ నోరు తెరువక ముందే స్వామి వారు “ఆగాగు.. ఆ మంత్రాన్ని అలా చెప్పకూడదు. అది నీలోనే రహస్యంగా ఉంచుకోవాలి. కేవలం అది ఏ దైవ సబంధమో చెప్పు చాలు”


“హనుమత్ ఉపాసనా పరమాణ మూల మంత్రం పెరియవా”


“సరే నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏమిటి ఈ మంత్ర జపంలో”


“అది పెరియవా నేను ఈ మంత్రాన్ని నాకు 23 సంవత్సరాల వయసున్నప్పటినుండి జపంచేస్తున్నాను మత్రోపదేశం పొందిన తరువాత. నేను గత ఏడు సంవత్సరాలుగా జపం చేస్తున్నాను. కాని నాకు ఏమి తెలియదు”


“నాకు ఏమి తెలియదు అనుటలో అర్థమేమి?” మహాస్వామి వారు ఆశ్చర్యంతో అడిగారు. ”నేను ఏమంటున్నానంటే, పెరియవా నాకు ఆ మంత్ర సిద్ధి కలిగిందో లేదో అర్థం కావటం లేదు” అని దిగాలుగా అన్నాడు.


పరమాచార్య స్వామి వారు వెంటనే “తెలుసుకుని ఏం చేస్తావు? ఏమైనప్పటికీ నీవు జపం చేస్తున్నది ఆత్మార్థం (ఆత్మజ్ఞానం) కోసమా? కామ్యార్థం (ఏదేని కొరిక తీరడం) కోసమా?”


“నేను చేస్తున్నది ఆత్మార్థం కోసమే పెరియవా. కాని నాకు ఆ మంత్ర సిద్ధి కలిగిందో లేదో, ఆ మంత్ర అధిష్టాన దేవత అనుగ్రహం ఉందో లేదో అర్థంకావటం లేదు. దయచేసి నా మంత్ర జపం పురోగతి ఎలా ఉందో తెలపండి.” ఈ మాటలు చెప్తూ తల వంచుకుని కన్నీరు కారుస్తూ నిలబడ్డాడు. 


”ఎవరైతే మంత్ర జపం చేస్తున్నారో వారికి స్వీయ అనుభవం వల్ల మాత్రమే తెలుస్తుంది ఆ మత్రం ఫలించిందో లేదో అని. ఒకానొక సమయంలో అది నీకు కూడా సంభవిస్తుంది, శంకరా” అని వాత్సల్యంతో అన్నారు. 


శంకరన్ కు తృప్తి కలగలేదు, “లేదు పెరియవా. నాకు ఇంతవరకూ ఎటువంటి అనుభవం కలగ లేదు. నాకు దాని గురించి ఏమి అర్థం కావట్లేదు గత 7 సంవత్సరాలుగా మా గురువు గారు చెప్పినట్టు చేస్తున్నా కూడా. ఒక్కోసారి నాకు చాలా అసహనంగా ఉంటుంది ఈ విశయమై. మీరే ఏదో ఒక దారి చూపించాలి” అని శంకరన్ రెండు చేతులు కలిపి అంజలి ఘటించి మహాస్వామి వారికి సాష్టాంగం చేసాడు.


పరమాచార్య స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి, తన భక్తుని మనస్థితిని అర్థంచేసుకుని ఇలా చెప్పారు. ”చాలా సంవత్సరాల క్రితం దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి పీఠానికి మహాత్ముడైన శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారు పీఠాధిపతిగా ఉండేవారు. ఒకరోజు ఆ ప్రాంతం వాడైన ఒక శిష్యుడు వారి దర్శనార్థం వచ్చాడు.”


“వారికి సాష్టాంగం చేసి, తను తెచ్చిన జామ పళ్ళను వారికిచ్చాడు.”


“రా ఎలా ఉన్నావు? చెప్పు నీకేం కావాలి?” అని ప్రేమతో పలకరించారు. 


”స్వామి, నాకు మా గురువు గారు ఉపదేశించిన మంత్రాన్ని నేను చాలా సంవత్సరాలుగా జపిస్తున్నాను. కాని నాకు మంత్ర సిద్ధి కలిగిందో లేదో తెలియడం లేదు. అది తెలుసుకోవడం ఎలా?” అని వినయంగా అడిగాడు. 


స్వామి వారు వెంటనే “ఆత్మార్థం కోసం నువ్వు చేస్తున్న జపం కొనసాగించు. ఆ మంత్ర అధిష్టాన దేవత నీకు ఫలితాన్ని కచ్చితంగా ఇస్తుంది”


ఆ శిష్యుడు స్వామి వారి మాటలకి తృప్తి పడలేదు. “లేదు స్వామి నేను నాకు కలిగిన ఫల సిద్ధి ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరే ఒక దారి చూపించాలి మిమ్మల్ని వేడుకుంటున్నాను.” అని అన్నాడు. 


స్వామి వారు ఆ శిష్యుడి మనస్థితిని అర్థం చేసుకుని దగ్గరకు పిలిచి “దిగులు పడకు. దానికి ఒక మార్గం ఉన్నది” అన్నారు.”


ఉన్నదా? ఐతే నాకు ఆ విషయం దయచేసి తెలియపరచండి స్వామి” అని అడిగాడు. నృసింహ భారతీ స్వామి వారు నవ్వుతూ “ప్రతి రోజూ నువ్వు జపం చేసుకునే ముందు చక్క పీట పైన వడ్లు పరిచి దాని పైన ఒక వస్త్రం కప్పి, దాని పైన కూర్చొని జపం చెయ్యి. రోజూ ఇలాగే చెయ్యి. ఏరోజైతే ఆ పీట పైనున్న వడ్లు వేయించినట్లు పేలాలుగా మారతాయో ఆ రోజు నీకు మంత్ర సిద్ధి కలిగినట్టు. అర్థం అయ్యిందా?” అని చెప్పారు. 


శిష్యుడు అర్థం చెసుకున్నాడు కాని తనను సముదాయించడానికే ఇలా చెప్తున్నారేమో అని కాస్త గందరగోళ పడ్డాడు. 


”స్వామి వారు నన్ను క్షమించాలి. కేవలం తెలుసుకోవాలి అనే జిజ్ఞాసతో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జగద్గురు స్థానంలో ఉన్నవారిని పరీక్షిస్తున్నానని తప్పుగా భావింపవలదు. పీట పైన వడ్లు చల్లడం.. వాటిని వస్త్రంతో కప్పడం.. అవి వేయించటం.. ”


అతను పూర్తి చెయ్యకమునుపే స్వామి వారు నవ్వుతూ “నాకు అలాంటి అనుభవం కలిగిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నావు కదూ?“ అని ఒక చెక్క పీట తెప్పించి తూర్పు అభిముఖంగా వేయించారు. దాని పైన వడ్లు పోయమని చెప్పారు. తరువాత స్వామి వారు దాని పై వారి వస్త్రాన్ని కప్పి పద్మాసనంలో కూర్చుని కళ్ళు మూసుకున్నారు. ఈపాటికి అక్కడకు చాలా మంది వచ్చారు. 


”కేవలం కొన్ని క్షణాల తరువాత వడ్లు టప టప మని పగులుతూ పేలాలుగా మారటం వినిపించింది. కొద్దిగా పొగ కూడా కనిపించింది. స్వామి వారు పైకిలేచి ధాన్యం పై పరచిన వస్త్రం తీయగానే పీట పైన తెల్లని మల్లెపూలవలే ఉన్న పేలాలు కనపడ్డాయి. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు.“ 


ఇది విన్న తరువాత శంకరన్ ఏదో మాట్లాడబోగా, పరమాచార్య స్వామి వారు అడ్డుపడుతూ “ఏమిటి శంకరా? చేసి చూపించమని నన్ను అడుగుతున్నావా?” అని గట్టిగా నవ్వారు. 


శంకరన్ మహాస్వామి వారి పాదాల పై పడి తన అష్ట అంగములు నేలకు తగులుచుండగా “చాలు పెరియవా నాకు జ్ఞానోదయమైంది. మంత్రజపం శక్తిని దాని గొప్పని అర్థం చేసారు. నన్ను దీవించి పంపించండి.”


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

అన్నమాచార్య చరితము

 🌹అన్నమాచార్య చరితము 🌹



ఇరు ధర్మ సతులతో తిరుమల జేరియు 

               యానందు డయ్యెను యన్నమయ్య 

దివ్య పుష్కరణిలో తీర్థ స్నానము జేసి 

              శ్రీ వరాహు గుడిని చేరి మ్రొక్కె 

పసిడి వాకిలి దాటి పరమాత్ము దర్శించి 

              తీర్థ ప్రసాదముల్ తీసుకొనియె 

కడుసంతసంబున కాన్కల నర్పించి 

             సాష్టాంగ దండముల్ సల్పె హరికి 

మంటపంబులు మఱియును వంట శాల 

పరవశంబున  జూచియు బయటకొచ్చి 

స్వామి సత్రంబు నందున సతుల తోడ

స్థిరముగా నుండె దివ్యమౌ తిరుమలందు 


సతు లిద్దఱు పరిచర్యల

నతి నిష్ఠతొ  జేయు చుండ నానందముగన్ 

యతులిత మగు స్థిర భక్తి తొ 

సతతము హర్యర్చనంబు సల్పగ సాగెన్ 


అనయము హరి కీర్తనముల 

వినయంబున పాడు కొనుచు వీడని భక్తిన్ 

ఘనుడగు యా యన్నమయ్య 

వినుతించుచు నుండె హరిని విభవము తోడన్ 


తిరుమలందు కలలొ శ్రీ యన్నమయ్యకు 

వేంకటేశ్వరుండు యెదుట నిలిచి 

యతడు జెప్పినట్టి హరికీర్తనములను 

యమిత శ్రద్ధతోడ యాలకించె


తడుప రన్నమయ్య తత్ కల యోచించి 

పాట వినిన యట్టి ప్రభుని దలచి 

శ్రీనివాసు పైన చెప్పంగ మదిదల్చె 

దినము కొక్క పాట వినయముగను 


దినమున కొక సంకీర్తన 

వినయంబున జెప్పు టకును విడువక యెపుడున్ 

మనమున స్వామిని దలచుచు 

ఘనుడగు శ్రీ యన్నమయ్య కాంక్షించె మదిన్ 




గోపాలుని మధుసూదనరావు 🙏

మిరియాల అన్నం

 🌹🌹 ఆరోగ్యంకోసం 🌹🌹

           🌹సేకరణ🌹

🥀ప్రతి  నెలా  ఒక్కమారు  మిరియాల  అన్నం  తినటం  వలన కలుగు  ఆరోగ్య  ప్రయోజనాలు .🥀 


🥀నెలకోసారి ఇంటిల్లపాదీ మిరియాల అన్నం తినండి.. మీకు అనారోగ్య సమస్యలే రావు..! 


మిరియాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాల్లో ఉపయోగించే చాలా సాధారణమైన మసాలా దినుసులలో ఒకటి. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది. ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాది మందికి, ఇది ఒక ఔషధ మసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి. నెలకోసారి కుటుంబం అంతా మిరియల అన్నం తింటే అద్బుత ప్రయోజనాలున్నాయి..🥀 


🥀మిరియాల అన్నం ఇలా చేయాలి..🥀

🥀కావల్సినవి: 

పొడిపొడిగా ఉడికించిన అన్నం – కప్పు, సెనగపప్పు – అరకప్పు, మిరియాలపొడి – రెండు చెంచాలు, పల్లీలు -అరకప్పు, పచ్చిమిర్చి – ఆరు, తాలింపు దినుసులు -ఒకటిన్నర చెంచా, కరవేపాకు రెబ్బలు – రెండు, కొబ్బరి తురుము – పావుకప్పు కన్నా కొద్దిగా తక్కువ, నూనె – అయిదు చెంచాలు, పసుపు – చిటికెడు, ఉప్పు – తగినంత. 🥀

🥀తయారీ: 

అన్నాన్ని వెడల్పాటి పళ్లెంలోకి తీసుకుని చల్లార్చుకోవాలి. సెనగపప్పులో కొద్దిగా ఉప్పూ, పసుపూ వేసి మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడిచేసి తాలింపుగింజలు వేయించుకోవాలి. తరవాత పచ్చిమిర్చీ, కరివేపాకూ, పల్లీలూ వేయించాలి. ఇందులో ఉడికించిన సెనగపప్పూ, మరికొంచెం ఉప్పూ, కొబ్బరి తురుమూ, మిరియాల పొడీ వేసుకునిబాగా వేయించి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపితే సరిపోతుంది.🥀 


🥀మిరియాల అన్నంతో ప్రయోజనాలు…🥀 


🥀 జీర్ణశక్తిని పెంచుతాయి. కొవ్వు పదార్థాలు జీర్ణమవటాన్ని పెంచుతాయి. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడమే కాకుండా మలినాలు అన్నీ బయటికి పోతాయి.

* మిరియాలతో చేసిన వాటిలో ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచి, గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి.

విశ్రాంతి చేకూరుస్తుంది.

* మిరియాల్లో విటమిన్ ‘C’ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ వైరస్ మరియు బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీర రోగ నిరోధక వ్యవస్థకు చేకూర్చటమేకాకుండా, జీవక్రియ సజావుగా, సాధారణ స్థాయిలో జరిగే విధంగా ప్రోత్సహిస్తుంది. ఆరోగ్యకర రోగ నిరోధక వ్యవస్థ మరియు జీవక్రియలు శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వను నివారించి, బరువు తగ్గుటను ప్రోత్సహిస్తాయి.

* రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది. జలుబు దగ్గు గొంతు గరగర ముక్కుదిబ్బడ జీర్ణశక్తిని పెంచటం గొంతును శుభ్రపరచటం కీళ్లనొప్పులు ఉబ్బసం కలరా మలేరియా ఇలా ఎన్నో వ్యాధులకు మిరియాలు ఔషధం లా ఉపయోగ పడతాయి.🥀

🥀మిరియాలను ఆహారంలో తీసుకుంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం స్రవించడం ద్వారా జీర్ణ ప్రక్రియను తేలిక చేస్తుంది. అలాగే ప్రేగు మరియు కడుపు సంబంధించిన వ్యాధుల నివారణలో సహాయపడుతుంది.

* బాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాలు సహాయపడతాయి. మలబద్ధకం, అతిసారం మరియు ఉదర సంబంధిత వ్యాధుల చికిత్సలో నల్ల మిరియాల యొక్క ప్రభావం ఉందని గుర్తించారు.

* మిరియాలు ఫ్రీ రాడికల్ ని శుద్ధి చేయడం ద్వారా క్యాన్సర్ చికిత్సలో సహాయపడుతుంది. అంతేకాక క్యాన్సర్ యొక్క కొన్ని రకాల కార్యకలాపాల ఉదృతిని తగ్గిస్తుంది. చర్మ క్యాన్సర్ నివారణలో కూడా సహాయపడుతుంది.

* మిరియాలు జీవక్రియను పెంచటానికి సహాయపడి, అవసరంలేని కేలరీలను కరిగించి బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే మిరియాలు స్థూలకాయంనకు వ్యతిరేకంగా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఆహారంలో నల్ల మిరియాలను చేర్చుకుంటే కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

* మిరియాలు ఒక యాంటీ డిప్రెసెంట్ గా పనిచేస్తుంది. మిరియాలలో ఉండే పెపైన్ యాంటీ డిప్రెసెంట్ గా పనిచేసి నాడీ వ్యవస్థ ఉద్దీపనకు సహాయపడుతుంది. దాని పలితంగా అభిజ్ఞతా సామర్థ్యం పెరుగుతుంది.

* మిరియాలలో యాంటి ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన లైన్స్,ముడతలు,నల్లని మచ్చలు, అకాల వృద్ధాప్య చిహ్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మాన్ని రక్షిస్తుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేర్చటం ద్వారా చర్మంపై అద్భుతమైన ప్రభావాన్ని చూడవచ్చు.🥀

శ్రీ కామాక్షీ ధ్యానశ్లోకము-

 శ్రీ కామాక్షీ ధ్యానశ్లోకము-


చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ

కాంచినిలయా మే। చిరతర సుచరిత సులభా

చిత్తం శిశిరయతు చిత్సుధాధారా ।।



శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ మహాస్వామివారి

ధ్యానశ్లోకము-


అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణమ్ ।శ్రీచంద్రశేఖరగురుం

ప్రణమామి ముదాన్వహమ్।।


శ్రీ జయేంద్రసరస్వతీమహాస్వామివారి ధ్యాన

శ్లోకము-


అద్వైతానుభవాభీతి ప్రాపకాయ శివాత్మనే।

కల్యాణకల్పతరవే జయేంద్రగురవే నమ:।।



శ్రీ శంకర విజయేంద్రసరస్వతీమహాస్వామివారి

ధ్యానశ్లోకము-


వేదాంత పీయూషభరార్ద్ర రూపం

లోకైకదీపాయితవాక్ప్రసారమ్।

కారుణ్యసింధుం సతతం నమామి

శ్రీ  దేశికేంద్రం విజయేంద్రదేవమ్।।

ఒక్కడే అయిన పరమాత్మ

 శ్లో!! మృత్పిండమేకం బహుబాంఢరూపం 

సువర్ణమేకం బహు భూషణాని

గోక్షీరమేకం బహు ధేను జాతం

ఏకః పరమాత్మా బహుదేహ వర్తీ


మట్టి అనే ఒక్క పదార్ధం అనేక రూపాలుగా మారినట్లు, బంగారం అనే ఒక్క పదార్ధం అనేక ఆభరణాలుగా మారినట్లు, గోవులలో అనేక రంగులు ఉన్నా క్షీరం ఒకటే అయినట్లు, ఒక్కడే అయిన పరమాత్మ అనేక రూపాలలో ఉన్నాడు.