29, నవంబర్ 2021, సోమవారం

దేవుడు కలలో కనపడితే

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌿🌿🌿🌿🌿🌿🌸


*🌻దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి🌻*


🍃🌹మనం తరచూ కలలు కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి. అయితే మీకు ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా.? ఒకవేళ మీ కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది.? దేవుడు కలలో కనిపిస్తే.. దేనికి సంకేతం.? స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకు ఓ అర్ధం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కలలో దేవుడిని చూస్తే.. దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది. కలలో ఏ దేవుడు కనిపిస్తే.. ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..


*🌻దుర్గామాత కోపంగా కనిపిస్తే..🌻*


🍃🌹మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్ధం.


*🌻శివుడిని కలలో చూస్తే..🌻*

మీ కలలో శివుడిని చూసినట్లయితే, మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అని అర్ధం. శివుడు కలలోకి వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని.. దాని సంకేతం.


*🌻రాముడిని కలలో చూస్తే..🌻*

మీరు కలలో రాముడిని చూస్తే.. చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని అర్థం. అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల సంకేతం.


*🌻కలలో శ్రీకృష్ణుని దర్శనం..🌻*

మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే.. స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని దాని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనది అని అంటారు.


*🌻కలలో విష్ణువు దర్శనం..🌻*

మీ కలలో విష్ణువును చూసినట్లయితే, మీరు విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు.


*🌻లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..🌻*

మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.


🌿☘️🌼🌼🌺🌼🌼☘️🌿

పెళ్లి అడ్డంకులు తొలగించే వ్రతము

 పెళ్లి అడ్డంకులు తొలగించే వ్రతము


సీత,రాముల వివాహా వేడుకనే వివాహపంచమి అని పిలుస్తారు.


హిందూ అచారా సాంప్రదాయాల ప్రకారం సీతారాముల పెళ్ళిరోజును పండుగగా జరుపుకోవటం అనవాయితీగా వస్తుంది. నవంబరు – డిసెంబరు నెలల మధ్యకాలంలో శుక్లపక్షపు ఐదవ రోజున ఈ వేడుక జరుపుకుంటారు. సీతాదేవి శ్రీరామచంద్రుడు వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్పడంతో ప్రతి ఏడాది సీతారాముల వివాహ వార్షికోత్సవం నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.


సీతారాముల వివాహ బంధాన్ని నేటికి అంతా ఆదర్శంగా భావిస్తున్నారు. ఎక్కడైన వివాహ వేడుకకు హాజరైతే తప్పకుండా పెళ్ళిజంటను సీతారాముల్లా కలకాలం అన్యోన్యంగా ఉండాలని దీవిస్తుండటం మనం చూసే ఉంటాం. అంటే సీతారాముల వైవాహిక జీవితం ఎంతగా ఆదర్శవంతంగా మారిందో అర్ధమౌతుంది. సీతకోసం రాముడు, రాముని కోసం సీత ఇలా వారి జీవితం కష్టాల నడుమ సాగిన వైనాన్ని నేటి తరానికి కధలు కధలుగా చెప్తుంటారు.


భర్త అడువులకు వెళుతుంటే రాజప్రసాదంలో ఉండలేక భర్తతో అడవిలో కష్టాలు అనుభవించటానికైనా సిద్దమై అతనితో కలసి అడవుల బాటపడుతుంది. ప్రస్తుతం భార్యభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని ఎలాంటి పరిస్ధితులు ఎదురైనా ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ వైవాహిక జీవితాన్ని ముందుకు సాగించాలి.


రావణుడు సీతను అపహరించుకు వెళ్ళిన సందర్భంలో లంకలో ఆమె మనస్సు మార్చే ప్రయత్నం రావణుడు చేసినప్పటికీ ఆమెకు రామునిపై ఉన్న ప్రేమ,అప్యాయత ఏమాత్రం చెరగలేదు. రాముడు తనను లంకనుండి విడిపించుకు తీసుకువెళతాడన్న నమ్మకంతో ఉంది. అదే సమయంలో రాముడు సైతం భార్యకోసం, ఆమె జాడకోసం అనేక ప్రయత్నాలు చేసి చివరకు ఆమెను విడిపించుకుని తీసుకురావటం కూడా రామునికి సీతపై ఉన్న ప్రేమానురాగాలను తెలియజేప్తుంది.


అలాంటి అదర్శదంపతుల వివాహమహోత్సవపు రోజును నేటికి వివాహ పంచమిగా ప్రతిఏటా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. వివాహ పంచమి వ్రతం ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పక్షంలో 5వ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదిన వివాహ పంచమి నిర్వహించనున్నారు. వివాహ పంచమి డిసెంబర్ 07, 2021 రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 08 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 09 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.


ఈ వివాహ పంచమి వ్రతం రోజు పెళ్లి కాని వారు వివాహ పంచమి వ్రతం చేయటం వల్ల వారికి తొందరగా వివాహ గడియలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోయి అనంతరం వివాహం జరగడమే కాకుండా వీరి వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా గడుపుతారు. వివాహపంచమి రోజు హిందువులు ఈ వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పంచమి రోజు సీతారాముల ప్రతిమలను ప్రతిష్టించి వారికి వివాహం జరిపించి వివిధ రకాల నైవేద్యాలతో పూజించడం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది.


భారతదేశం, నేపాల్ లోని మిథిల ప్రాంతంలో శ్రీ రాముడితో సంబంధం ఉన్న దేవాలయాలు, పవిత్ర స్థలాలలో సీత, రాముడి వివాహ ఉత్సవంగా జరుపుకుంటారు. సీతారాముల ఆలయంల్లో ఘనంగా వేడుకలు, పూజలు, యాగాలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాలలో శ్రీ రామచరితమానస్ పారాయణం చేస్తారు. నేపాల్‌ ప్రాంతంలో సీతాదేవి జన్మ స్థలమని నమ్ముతారు అందుకే ఆప్రాంతంలో వివాహపంచమి వేడుకలను వైభవంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలను తిలకించేందుకు మనదేశం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రతిఏటా తరలి వెళుతుంటారు.

భోళాశంకరుడు

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏


🌹#భోళాశంకరుడు🔱🚩


♦️పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం 


     తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ ”♦️


🌹పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే #అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.


🌹సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిననీ, తనంతటి వారు మరేవరూ లేరని అనుకోవడం మనిషి సహజ అహాంకారం.


🌹ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామనే అహంకారాన్ని వదిలి... అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తే అనుభవించగలుతున్నామని గుర్తించేందుకు శివాభిషేకం చేయాలి.


🌹అందుకు మనసులో నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్న అంతరార్థం.


🌹వినయాన్ని విన్నవించుకోవడం అభిషేకం.


🌹ఎలాగైతే మనం మన శరీరంపై ఉన్న దుమ్ము, ధూళీ, మురికి తొలగించుకోవడానికి స్నానం చేస్తామో...

అలాగే మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళన కావడానికి శివుడికి అభిషేకం చేయాలి.


🌹అభిషేక సమయంలో వినిపించే రుద్రాధ్యాయంలోని మంత్రభాగం మనకు కనువిప్పు కలిగిస్తుంది.

సృష్టిలోని సకలప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేననీ, సకల ప్రాణులకూ శుభం కలగాలని మనం అందులో కోరుకుంటున్నట్లుగా శివాభిషేకం చేయాలి.


🌹అభిషేకం చేసే సమయంలో వెలువడే మంత్రాల అర్థాలు మన అంతరంగాన్ని తట్టి మేల్కోల్పుతాయి. అప్పుడు జ్ఞాన జ్యోతి స్వరూపుడైన #పరమశివుడు మనలో ఆవిర్భవిస్తాడు.


♦️శివో అభిషేక ప్రియ:♦️ అంటే... 

🌹పరమశివుడు అభిషేక ప్రియుడు.


♦️“నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి

  పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు

    గామధేనువు వానింట గాడి పసర

  మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”♦️


🌹#తాత్పర్యము

శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట.

‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట.


🌹శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి. సకల ఐశ్వర్యములు సమకూరతాయి.


ఆవు పాలతో -- సర్వ సౌఖ్యాలు

ఆవు పెరుగు -- ఆరోగ్యం, బలం

ఆవు నెయ్యి -- ఐశ్వర్యాభివృద్ధి

చెరకు రసం (పంచదార) -- దుఃఖ నాశనం, ఆకర్షణ

తేనె -- తేజో వృద్ధి

భస్మ జలం -- మహా పాప హరణం

సుగంధోదకం -- పుత్ర లాభం

పుష్పోదకం -- భూలాభం

బిల్వ జలం -- భోగ భాగ్యాలు

నువ్వుల నూనె -- అపమృత్యు హరణం

రుద్రాక్షోదకం -- మహా ఐశ్వర్యం

సువర్ణ జలం -- దరిద్ర నాశనం

అన్నాభిషేకం -- సుఖ జీవనం

ద్రాక్ష రసం -- సకల కార్యాభివృద్ధి

నారికేళ జలం -- సర్వ సంపద వృద్ధి

ఖర్జూర రసం -- శత్రు నాశనం

దూర్వోదకం (గరిక జలం) -- ద్రవ్య ప్రాప్తి

ధవళొదకమ్ -- శివ సాన్నిధ్యం

గంగోదకం -- సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి

కస్తూరీ జలం -- చక్రవర్తిత్వం

నేరేడు పండ్ల రసం -- వైరాగ్య ప్రాప్తి

నవరత్న జలం -- ధాన్య గృహ ప్రాప్తి

మామిడి పండు రసం -- దీర్ఘ వ్యాధి నాశనం

పసుపు, కుంకుమ -- మంగళ ప్రదం

విభూది -- కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.


🌹నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. 

అందుకే ఆయన "భోళా శంకరుడు"

                    🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱

అద్భుతమైన కథ

 Must Read🙏🙏🙏🙏


ఒక అద్భుతమైన కథ 

  


రాత్రి 11 గంటలకు. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని అడిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.  


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి నీకు పంపాను. డబ్బులు Head Office లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త. ఏమి తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది.  


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు. ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను. "లేదు బాబూ. ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని చెప్పారు.


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను. "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను. నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు. అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము. కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది. నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.  


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు  


పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము. దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము. "ఆనంద్! ఇక నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన. "పర్లేదండి. నేను లీవ్ పెట్టాను" అన్నాను. దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా థాంక్స్ బాబూ! నేను ఊరికి బయల్దేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు. "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను.  


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ! నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి. కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు.  


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ. నా పేరు అరవింద్. మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ చిరునామ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 km ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఆ మిత్రుడికి విషయం చెప్పాను. అయన చాల బాధ పడ్డారు, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది. కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను. బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.  


ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న. "నాన్నా! నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు! ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా! మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.  


"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు. మిగిలినవన్నీ

 దానికి తోడుగా నిలబడతాయి"

ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి 

అవసరం లో ఉన్నవారికి సాయ పడదాం🙏copied..post...

రాముడిలో

 *రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?*

 

*మాయలు మంత్రాలు చూపించలేదు.*

*#విశ్వరూపం ప్రకటించలేదు.*


*జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు... చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు.*


*పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు.*


*కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు.*


*అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు.*


*అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ... ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.*


*💠 శాస్త్ర ధర్మం 💠*


*తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.*


*💠 స్నేహ ధర్మం 💠*


 *మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పు తిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహ ధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.*


 *💠 యుద్ధ ధర్మం 💠*


*వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు... వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.*


*రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు*


*మరణాంతారం వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||*


*‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.*


*💠 దయా ధర్మం 💠*


*సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య.*


*అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకారాజ్యానికి రాజును చేస్తానని ప్రతి


జ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా... అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు.*


*💠 మనుష్య ధర్మం 💠*


*రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.*


*‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’*


*అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.*


*💠 సోదర ధర్మం 💠*


*రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ... పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.*


*పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి... కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం.*


*రాముడు అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది.*


*రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే శ్రీరామ జయరామ జయ జయరామ*


*🕉️🙏🙏🙏 🚩జై శ్రీ రామ్🚩

27, నవంబర్ 2021, శనివారం

బేగి ఎలిపొచ్చీ

 బేగి ఎలిపొచ్చీ...!


       సాహిత్యం... సంగీతం... విజయనగరం! ఈ మూడింటిని వేర్వేరుగా చూడలేం. ఒకరా ఇద్దరా... గురజాడ, గణపతిముని, ఆదిభట్ల, వంగపండు... ఎందరెందరు కవులు, కళాకారులు! ద్వారం, ఘంటసాల, సాలూరి, సుశీల... మరెందరెందరు సుస్వరాల సమ్రాట్టులు! ఇక అక్కడి సంస్థానాలు... జానపదుల నోళ్లలో నానే వాటి వీరగాథలు... అన్నీ అబ్బురమే! ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఆ నేలమాట ఇంకా ప్రత్యేకమైంది. పలుకుల కలకూజితాలతో తనదైన తెలుగు తియ్యందనాన్ని పంచే ఆ జిల్లా అమ్మభాషా విశేషాలు మీకోసం...! 

తెలుగునాడుకు ఉత్తర సరిహద్దులో, తూర్పుతీరపు అంచున... అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు వారధిలా ఉంటుంది విజయనగరం జిల్లా. అనేక భాషల సంగమం ఈ ప్రాంతం. నాగరిక, జానపద సంస్కృతులు దోబూచులాడుతుంటాయి. శాతవాహనుల పాలనలో ‘మధ్యపరగణాలు’గా వ్యవహారంలో ఉందీ ప్రాంతం. తర్వాత కళింగులు, గజపతులు, వెలమరాజులు ఇలా క్రమంగా విజయనగర గజపతుల చేతుల్లోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని భాగాలను విడదీసి 1979లో విజయనగరం జిల్లాను ఏర్పాటుచేశారు. 

      జిల్లా ఉత్తర, పశ్చిమ ప్రాంతమంతా పర్వతమయం. గిరిజనులు ఎక్కువగా ఉంటారు. దీనికితోడు నేడు ఒడిశాలో అంతర్భాగంగా ఉన్న గంజాం ప్రాంతం వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఏలుబడిలో కొన్నాళ్లుంది. ఇలా... తెలుగు, తమిళ, ఒడియా సంస్కృతులతో పాటు హిందీభాషా ప్రభావమూ ఈ ప్రాంతపు తెలుగు మీద బలంగానే ఉంది. భౌగోళికంగా అంతగా సంబంధం లేని హిందీ ఇక్కడికి ఎలా వచ్చిందంటే... ఒకప్పటి మధ్యప్రదేశ్, నేటి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్, జగదల్‌పుర్‌ తదితర ప్రాంతాల ప్రజలు వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించడం వల్ల. మొత్తమ్మీద విజయనగరం తెలుగు ఇన్ని భాషల కలగలుపు. ఉదాహరణకు ‘తన నివాసాన్ని మార్చుకున్నాడు’ అనే అర్థంలో ‘బిచాణా ఎత్తేశాడు’ అంటారు. ‘బిచాణా’ అనేది ఒడియా పదం. అలాగే ‘వేగం’ అనే పదానికి గ్రామ్యరూపం ‘బేగి’. ఈ పద రూపాంతరం మీదా ఒడియా ప్రభావం ఉంది. ఆ భాషీయులు ‘వ’ అక్షరాన్ని పలకరు. దాని బదులు ‘బ’ వాడతారు. వాళ్ల సాపత్యంతో ‘వేగిరం’ అనే ఉచ్చారణ కాస్తా ‘బేగిరం’గా మారింది. కాలక్రమేణా ‘బేగి’గా స్థిరపడిపోయింది. 

భలే భలే మాటలు

వివిధ భాషల సంపర్కంతో తయారైన ‘తెలుగు మాటలు’ ఇక్కడ కొల్లలు. ‘మేనత్త’ను స్థానికులు ‘బాప్ప’ అంటారు. హిందీ ‘బాప్‌’ (నాన్న)కి, తెలుగు ‘అప్ప’ (అక్క) కలిసి ‘నాన్నకి అక్క’... ‘బాప్ప’ అయిందన్న మాట. ఎవరైనా నేరాన్ని కప్పిపుచ్చితే ‘కామప్‌ చేసేశారు’ అంటారు. ఆంగ్లంలోని ‘క్లెయిమ్‌ అప్‌’ (దాచేయడం) దీనికి మూలం. ఎవరైనా అబద్ధాలు చెబుతోంటే, ‘వాడివన్నీ జూటా మాటలు’ అనేస్తారు. ‘ఝాటా’ అంటే హిందీలో అబద్ధం. ఇక ‘పొడవు’నేమో ‘జబరు’ అని పిలుచుకుంటారు. ఇది ఉర్దూ మాట. ఆ భాషలో దీనికి అర్థం ‘ఉన్నతమైన’ అని. ‘ఉష్ణం’ (వేడి) అనే సంస్కృత పదం ‘ఊష్టం’గా మారి విజయనగరం తెలుగులో జ్వరానికి మారుపేరైంది. అలాగే ఉక్కపోతని ‘ఈష్ట’ అంటారు. ఇదీ ‘ఉష్ణం’ రూపాంతరమే. ఇలా సంస్కృతం నుంచి వచ్చిన మరో మాట ‘జిమ్మ’. అంటే... నాలుక. ‘జిహ్వ’ దీనికి మూలం. ‘బైఠాయించు’ అంటే పత్రికా భాష అనుకుంటాం కానీ, ‘కూర్చోవడం’ అనే అర్థంలో స్థానికులు దీన్ని సాధారణంగానే వాడేస్తుంటారు. వీటన్నింటికీ మించి ఆశ్చర్యాన్ని కలిగించే మాట ‘ఎప్పెస్‌’. విజయనగరం భాషలో దానికి అర్థం ‘ఉచితం’. ఆంగ్ల ‘ఫ్రీ సర్వీస్‌’లోని ఎఫ్, ఎస్‌ అక్షరాల గ్రామ్య కలగలుపు ఇది! ఈ జిల్లా భాషని తరచిచూస్తే ఇలాంటి మాటలు చాలానే కనిపిస్తాయి. 

      ఇక్కడి ఊళ్ల పేర్లు కూడా ఆసక్తిదాయకంగా ఉంటాయి. చుట్టూ పర్వతాలు ఉన్న ఊరు మొదట ‘పర్వతపురం’ అయింది. కాలక్రమంలో అది పార్వతీపురంగా మారింది. భేల్‌- ఎలుగుబంటి, గాఁవ్‌- గ్రామం.... ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించే గ్రామం ‘భేల్‌గాఁవ్‌’ అయింది. క్రమేపీ అది ‘బెలగాం’గా మారింది. నిడువైన కల్లు(కొండ) ఉన్న ఊరు ‘నిడువుకల్లు’గా వ్యవహారంలోకి వచ్చి ‘నిడగల్లు’గా రూపాంతరం చెందింది. ముళ్లపొదలు ఎక్కువగా ఉన్న పల్లె ‘కంటకాపల్లి’ అయింది. తాటిచెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతమే ‘తాడివాడ’. కోనేం రకపు చేపలు ఎక్కువగా అమ్ముడయ్యే సముద్రతీర గ్రామమే కోనవాడ.. అదే కోనాడ. ఇలా ప్రతి ఊరిపేరు వెనకా ఓ విశేషం కనిపిస్తుంది. 

వాళ్లది ప్రత్యేకం 

నాగావళి, వేగావతి, సువర్ణముఖి, చంపావతి, గోస్తని, జంఝావతి తదితర నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంత వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే. అయినప్పటికీ ఆహార, వాణిజ్య పంటలకి అనువైన ప్రదేశం. ‘అయ్యకి ఆస్తి లేదు, గర్వమూ లేదు’ అన్న చందాన ఉంటుందీ ప్రాంత ఫలసాయం. తిండికి లోటుండదు. అలాగని అమ్ముకుని సొమ్ము చేసుకుందామంటే చాలదు. అలాంటి ఈ ప్రాంతానికి గోదావరి సీమనుంచి కొన్ని ద్రావిడ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చాయి. అగ్రహారాలను ఏర్పాటు చేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన ఈ శాఖీయులు మొదట గోదావరీ పరీవాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. గోదావరి నదిమీద ఆనకట్ట లేని సమయంలో ప్రబలిన కరవుకు తట్టుకోలేక, వాళ్లలో కొందరు ఈ ప్రాంతానికి వచ్చారన్నది చరిత్ర కథనం. కృష్ణరాయపురం (‘కన్యాశుల్కం’లో దీని ప్రసక్తి ఉంది), అజ్జాడ (హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు స్వస్థలం), కలవరాయి, లోగిశ (కావ్యకంఠ గణపతిముని పుట్టిన ఊరు), సుంకి, చాకరాపల్లి, చల్లపేట... ఇవన్నీ ద్రావిడ బ్రాహ్మణ అగ్రహారాలు. వీటితోపాటు వెలనాటి బ్రాహ్మణుల అగ్రహారాలు- వెంగాపురం, కుసుమూరు, నందబలగ, శివరాంపురం మొదలైనవి కొన్ని ఉన్నాయి. ఈ రెండు రకాలైన అగ్రహారాలనీ కలిపి ‘నందాపురం పట్టీ’ పేరుతో పిలుస్తారు. ఈ ఆగ్రహారికుల మాటతీరు ఒకలా ఉంటుంది. వీళ్ల దగ్గర వివిధ వృత్తుల్లో కుదురుకున్న ఇతరుల మాటతీరు మరోలా ఉంటుంది. కాలక్రమంలో అగ్రహారాలు పోయినా, ఆ రెండు వర్గాల భాషలో మాత్రం ఆ తేడాలు కనిపిస్తూనే ఉంటాయి. 

      ఎక్కువ అనే పదానికి అగ్రహారపు పలుకుబడి ‘లావు’. దాన్నే ఇతర గ్రామీణులేమో ‘వింత’ అంటారు. కొంచెం- కాస్త (అ.ప), కసింత (గ్రా); ఇటువైపు- ఇసుంటా (అ.ప), ఇటింకా (గ్రా); వచ్చేసెయ్‌- ఒచ్చీ, వళపచ్చీ (అ.ప), ఎలిపొచ్చీ (గ్రా); గోళీలు- గొట్టికాయలు (అ.ప), అల్లికాయలు (గ్రా); తొందరగా- వేరంగా (అ.ప), బేగి (గ్రా); అత్యాశ- కాప్యానం, కాపీనం (అ.ప), కాపేనం (గ్రా); సంతృప్తి చెందు- ఆటిపారు (అ.ప), గీటెక్కు (గ్రా); వేళాకోళం- సరసాలు (అ.ప), ఇగటాలు (గ్రా)... ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మాటలు వినపడుతుంటాయి. 

అక్కడ అలా... ఇక్కడ ఇలా!

సాగతీతగానీ, తెగవేతగానీ లేకుండా పూర్తి పదాన్ని ఉచ్చరించడం ఈ జిల్లా ప్రత్యేకత. అంతేకాదు పదోచ్చారణ స్పష్టంగా ఉంటుంది. గ్రామీణభాషలో ‘ము’ వర్ణకాంత ప్రయోగాలు ఎక్కువ. ఉదాహరణకు ‘చేద్దాము’- సేతుము; చూద్దాము- సూతము; విందాము- విందము, ఉందాము- ఉందుము లాంటివి. ఇక ఒకే జిల్లా అయినప్పటికీ, కొన్ని మాటల్లో విజయనగరం ప్రాంత గ్రామ్యానికి, పార్వతీపురం ప్రాంత గ్రామ్యానికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దీనికి కారణం నాడు విజయనగరం తెలుగు రాజుల పాలనలో ఉంటే, పార్వతీపురం కళింగ రాజుల ఏలుబడిలో ఉండేది. దీంతో ఆయా భాషల ప్రభావం స్థానికుల మాటల మీద పడింది.

      పశువులను పార్వతీపురం ప్రాంతంలో ‘సొమ్ములు’ అంటారు. అదే విజయనగరం వాళ్లయితే ‘పసరాలు’ అని పిలుస్తారు. అమ్మాయి, అబ్బాయిలను పార్వతీపురం వాళ్లు ‘గుంట’, ‘గుంటడు’గా వ్యవహరిస్తారు. విజయనగరం ప్రాంతవాసులేమో ‘పిల్ల’, ‘పిల్లడు’గానే ఉచ్చరిస్తారు. అలాగే... గోతులు- గుమ్ములు (పా), గాతలు (వి); నేను- నాను (పా), నీను (వి); ఉంచడం- ఇడ్డం (పా), ఎట్టడం (వి); పలకకుండా- పల్లక (పా), ఒల్లక (వి); కారం- నొర్ర (పా), వర్ర (వి)... లాంటి భేదాలెన్నో కనిపిస్తాయి. ఈ పదాలన్నీ విజయనగరం తెలుగుకు ఓ ప్రత్యేకతను సమకూర్చాయి. 

ఒకే పదానికి రెండు మూడు అర్థాలున్న పదాలూ ఉన్నాయి ఇక్కడ. గుంట- ఆడపిల్ల, రోలు; గూద- తిండియావ, కడుపు; కొర్రు- ఏ పనికైనా అడ్డుపుల్ల వేయడం, మేకు, కొండశిఖరం; పెడ- అరటి అత్తం, ఒకపక్క; జెల్ల- ఓ రకం చేప, లెంపకాయ; కొత్తెం- అరటిపువ్వు చివరి భాగం, తలవెనక భాగంలో కొట్టే చిన్నదెబ్బ... ఇలాంటివి ఎన్నో! ఎన్నెన్నో!! అలాగే, పంచదారను ‘చీనీ’ అని, ముల్లంగిని ‘సొత్తికూర’ అని పిలుస్తారు. 

అందరిదీ అదే బాట

ఈ ప్రాంతంలో పండితులు చాలామందే ప్రవర్ధిల్లారు. సంప్రదాయ సాహిత్యం నుంచి కాల్పనిక సాహిత్యం వరకూ అన్ని రకాల ప్రక్రియలకీ ఆలవాలమైంది ఈ నేల. ఎన్ని రకాల సాహితీ ప్రక్రియలు వెలువడినా, ఈ ప్రాంత భాషకి ప్రాధాన్యమివ్వడం మరవలేదు ఏ సాహిత్యకారుడున్నూ. ఆదిభట్ల అయితే ‘సీమపలుకు వహి’ అనే పేరుతో అచ్చతెలుగు మాటలకూర్పుతో ఓ నిఘంటువునే రూపొందించారు. అందులో కనిపించే విజయనగరం మాటల్లో కొన్ని... అచ్చిక బుచ్చిక (కలుపుగోలుతనం), ఆరిగం (మట్టి కుంపటి), ఇమ్ము (పదిలం), ఈండ్రపడు (మొరాయించు), ఉరిడి (కుమ్మరిపురుగు), ఆసడ్డ (నిర్లక్ష్యం). ఇక గురజాడ అయితే ‘కన్యాశుల్కం’ సంభాషణల రూపంలో విజయనగరం తెలుగుకు చెరగని ఖ్యాతిని తెచ్చిపెట్టారు.  

      ఈ ప్రాంతంలో ప్రజాసాహిత్యమూ ప్రబలంగానే వచ్చింది. దానికి కారణం రైతాంగ సాయుధ పోరాటానికి నెలవుకావడమే. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని భూషణం, వంగపండు తదితరులు ప్రజలభాషలో రచనలు చేశారు. వాళ్ల పాటల్లో వినిపించే ఈ ప్రాంత గ్రామ్య పదాలు కొన్ని... పొవ్వాకు (పొగాకు), టకురు (ముదురు), ఉమ్మిరి (ముమ్మరం), ఎక్కిడి తొక్కిడి (పుష్కలం), ఎమకల (తెల్లవారుజామున), కవుకులు (ఇబ్బందులు), ఒగ్గేసి (వదిలేసి). గ్రామీణుల మాటల్లో దొర్లే ఇలాంటి పదాలకు సాహితీ పట్టం కట్టిన కవులు ఇక్కడ చాలామందే ఉన్నారు. 

      ఇలా ప్రాచీనకాలం నుంచి నేటివరకూ అనేక రూపాంతరాలు చెందుతూ... అటు పండితులను, ఇటు జానపదులను ఒకే బాటలో నడుపుతూ... తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది విజయనగరం తెలుగు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తన మట్టిమాటలకే తొలి ప్రాధాన్యమిచ్చే ప్రాంతమిది.

(అయ్యగారి శ్రీనివాసరావు, విజయనగరం)

పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 

 1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.


 *మత్స్యపురాణం* 


మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.


 *కూర్మపురాణం* 


కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.


 *వామన పురాణం* 


పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.


 *వరాహపురాణం* 


వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.


 *గరుడ పురాణం* 


గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.


 *వాయుపురాణం* 


వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.


 *అగ్నిపురాణం* 


అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.


 *స్కందపురాణం:* 


 కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.


 *లింగపురాణం* 


లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.


 *నారద పురాణం* 


బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.


 *పద్మపురాణం* 


ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.


 *విష్ణుపురాణం* 


 పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.


 *మార్కండేయ పురాణం* 


శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.


 *బ్రహ్మపురాణం* 


బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.


 *భాగవత పురాణం* 


విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.


 *బ్రహ్మాండ పురాణం* 


బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.


 *భవిష్యపురాణం* 


సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.


 *బ్రహ్మావైపర్తపురాణము*


 ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తి సాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

🙏

దక్షిణా దేవి!!*

 *దక్షిణా దేవి!!*


శ్రాద్ధ కర్మలయందు, యజ్ఞ కర్మల యందు..

దక్షిణా దేవి ప్రాముఖ్యత..............!!


ఒక గోపిక... సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి 'దక్షిణా దేవి' విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణా దేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.


రాధా కృష్ణుల ప్రేమ ప్రపంచంలో... ప్రణయ తీరాల్లో విహరిస్తూ వున్న రోజుల్లో 'సుశీల' అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా వుండేది. గోలోకములో రాస లీలా వినోదములో తన్మయుడై యుండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జనించెను. కృష్ణుని దక్షిణ పార్శ్వము నుండి పుట్టినది కావున ఆమెకు దక్షిణా దేవి అను పేరు గలిగెను. ఈమె శ్రీ కృష్ణుని యర్ధాంగి యగు రాధకు ప్రియసఖి రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను. 


ఒకసారి ఆమె శ్రీ కృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ... పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది.. దక్షిణ,గోలోకము వదలి వైకుంఠము నందున్న లక్ష్మీలో ప్రవేశించెను. దక్షిణా దేవి యద్రుశ్యు రాలగుట వలన యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా బోయెను.


'దానం యజ్ఞా నాం వరూధం దక్షిణా' అని శ్రుతి యజ్ఞములు పూర్తియైన తరువాత దక్షిణా దానము తప్పని సరి. ఆ దక్షిణ యజ్ఞ ఫలమును కవచము వలె కాపాడి, యజమానునకిచ్చును..


దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయెను. ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకొనిరి. బ్రహ్మ కోరికపై విష్ణువు, లక్ష్మి నుండి దక్షిణను వేరు చేసెను. యజ్ఞ సంబందమైన సమస్త కార్యములను సంపన్న మొనర్చుటకు దక్షిణాదేవిని తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేసెను. యజ్ఞ పురుషునికి దక్షిణ యందు ఫలుడు (ఫలము ) అను పుత్రుడు గలిగెను.


బ్రహ్మ,కళ్యాణ సమయ మందు దక్షిణా యజ్ఞ పురుషులకు వర మిచ్చెను. 'యజ్ఞము చేసిన తరువాత యోగ్యమైన దక్షిణ నీయనివారికి ఫలము లేక పోవును. దక్షిణా యుక్తమైన యజ్ఞమే ఫలము నిచ్చును' అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందును.


'యే బ్రాహ్మణా బహు విదః తేభ్యో యద్దక్షి ణాన నయేత్, దురిష్టగ్ స్యాత్' అని శ్రుతి బాగుగా చదువుకొన్న బ్రాహ్మణులు, అధ్వర్యులు గాను ఋత్విక్కులు గాను ఇతర పాత్రల లోను నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారి కియ్యవలసినంత దక్షిణ సరిగా నియ్యక పోయినచో యజమానికి అనర్ధము కలుగునని యర్ధము..!


శ్రాద్ధ కర్మలయందు, యజ్ఞ కర్మల యందు, దేవతా ప్రీత్యర్ధం మొనరించిన సకల పూజా కార్యక్రమములందు యజ్ఞ కర్త దక్షిణ ఇవ్వకున్నను, పురోహితుడు దక్షిణ ఆర్జించని యెడల శ్రీ మహాలక్ష్మీ శాపముతో దరిద్రుడై భాదలను అనుభవించునని బ్రహ్మ వైవర్త పురాణం నందు వివరించబడినది.


దక్షిణ ఇవ్వకుండా,తీసుకోకుండా చేయు కర్మ ఫలితాలు బలి చక్రవర్తికి చెందును. శ్రాద్ధ కర్మములందు అర్పించిన వస్తువులన్నియు బలి చక్రవర్తికి భోజన రూపమున చేరగలవు.


దక్షిణా దేవి స్తోత్రమును యజ్ఞ సమయమున పఠించిన వారికి సర్వ యజ్ఞ ఫలములు నిర్విగ్నంగా సంపన్నమగును.


దక్షిణాదేవి దివ్య చరితా శ్రవణ మొనర్చిన వారికి ధనం, విద్య, స్ధిరాస్తులు, లభించును.


అలాంటి దక్షిణా దేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుంచి... బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.


దక్షిణాదేవి ధ్యానము, స్తోత్రము, పూజాదికము, ఆ దక్షిణాదేవిని సాలగ్రామము లేక కలశమున ఆవాహనము చేసి పూజింపవలెను.


ఈదేవిని ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయైస్వాహా అను మూల మంత్రముచే పూజించుచు అర్ఘ్యపాద్యాది షోడశోపచార పూజలను చేయవలెను.


దక్షిణా దేవి స్తోత్రం.


పురా గోలోకగోపీ త్వం గోపీనాం ప్రవరాపరా | రాధాసమా తత్సఖీ చ శ్రీకృష్ణప్రేయసీ ప్రియే || 


కార్తికీ పూర్ణిమాయాంతు రాసేరాధా మహోత్సవే | 

ఆవిర్భూతా దక్షిణాంశాత్‌ కృష్ణస్యాతో హి దక్షిణా || 


పురా త్వం చ సుశీలాఖ్యా శీలేన సుశుభేన చ | 

కృష్ణ దక్షాంశవాసాచ్చ రాధాశాపాచ్చ దక్షిణా || 


గోలోకాత్త్వం పరిద్వస్తా మమభాగ్యాదుపస్థితా | 

కృపాం కురమత్వమేవాద్య స్వామినం కురు మాం ప్రియే || 


కర్తౄణాం కర్మణాం దేవీ త్వమేవ ఫలదా సదా | 

త్వయా వినా చ సర్వేషాం సర్వం కర్మ చ నిష్ఫలం || 


ఫలశాఖా విహీనశ్చ యథావృక్షో మహీతలే | 

త్వయా వినా తథా కర్మ కర్తౄణాం న చ శోభతే || 


బ్రహ్మవిష్ణు మహేశాశ్చ దిక్పాలాదయ ఏవ చ | 

కర్మణశ్చ ఫలం దాతుం న శక్తాశ్చ త్వయా వినా || 


కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరః | 

యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ ||


ఫలదాతా పరం బ్రహ్మ నిర్గుణః ప్రకృతేః పరః | 

స్వయం కృష్ణశ్చ భగవాన్‌ న చ శక్తస్త్వ యా వినా || 


త్వమేవ శక్తిః కాంతే మే శశ్వజ్జన్మని జన్మని | 

సర్వకర్మణి శక్తోహం త్వయాసహ వరాననే |


లక్షీ్మ దక్షాంశ సంభూతాం దక్షిణం కమలాకళాం | 

సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణాం || 


విష్ణోః శక్తి స్వరూపాం చ సుశీలాం శుభదాం భజే | 

ధ్యాత్వానేనైవ వరదాం సుధీర్మూలేన పూజయేత్‌ 


ఈ దక్షిణాఖ్యానమును శ్రద్ధగా విన్నచో అతడు చేయు సత్కర్మలు నిర్విఘ్నముగా పరిపూర్ణమగును. 


పుత్రులు లేని వారికి పుత్రులు, భార్య లేని వారికి గుణవతియగు భార్య, విద్య లేని వానికి విద్య, ధనము లేని వానికి ధనము, భూమి లేని వానికి భూమి లభించును. 


కష్టకాలమున, బంధువుల వియోగకాలమున, కారాగారమున బద్దుడైనప్పుడు దీనిని ఒక నెలవరకు విన్నప్పటికిని అతని కష్టములన్నియు తీరిపోవును.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

సనాతన సాంప్రదాయాలు

 తరతరాలుగా మనం వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. . 

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలీపై నిలబడ రాదు

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలీ

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు

9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు

10. వేడి వేడి అన్నం లోనికి పెరుగు వేసుకోరాడు

11. భోజనం మధ్యలో లేచి పోరాదు

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

15. గోడలకు పాదం ఆనించి పడుకో రాదు

16. రాత్రీ వేళలో బట్టలుతక రాదు

17. విరిగిన గాజులు వేసుకోరాడు

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న ఛాపను మడిచి పెట్టాలి

19. చేతి గోళ్ళను కొరకరాడు

20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు

23. భోజనం తరువాత చతిని ఎండ పెట్టవద్దు

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు

25. ఇంటి గడపపై కూర్చోరాదు

26. తిన్న తక్షణమే పడుకోరాదు

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు

28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి

30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు

31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు

35. ఇంటి లోపలికి చెప్పులు Shoes ధరించి రారాదు

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీడి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి

   మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.

మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.


 కారు మేఘాలు కమ్ముతున్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 

 ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

 *అదీ .. సంస్కారం !* 

 .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! *అదీ .. నమ్మకం !* 🙏

  ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

 *అదీ .. ఆచారం !* 🙏

......................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!

 ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

 *అదీ .. పద్ధతి !* 🙏

 ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…! *అదీ .. సంస్కృతి!*🙏

శ్రీశైల క్షేత్రం.

 శ్రీశైల క్షేత్రం..

#శ్రీశైలం ఆంద్రదేశ్ కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు. 


గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.


సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది 


సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.


అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు. 


శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. 


అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. 


ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.


సర్వాం శివమయం జగత్..🙏

 ॐ సర్వం శివమయం జగత్ ॐ

  ॐ ఓం నమఃశివాయ ॐ

 🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏