14, మార్చి 2023, మంగళవారం

అమ్మాయిల కోరికలు

 అమ్మాయిల ల కోరికలు ఎంత ఘోరంగా వున్నాయి అంటే .. ఒకరు కూడ మంచి family కావాలి , నా కూతురిని మంచిగా  చూసుకునే family కావాలి ఒక్కరు కూడా అలోచిస్తలేడు...

ఎప్పుడూ ఇంత అస్తి వుండాలి ఇన్ని కోట్లు వుండాలి అదే ఆలోచన తప్ప..

మంచి పేరు ఫ్యామిలీ

మంచి సంప్రదాయం గల ఫ్యామిలీ కి ఇవ్వాలి అనేది లేదు..


అమ్మాయి ఉన్న ఇంట్లో అబ్బాయి కూడా వుంటారు చాలా ఫ్యామిలీ లో వాళ్ళకి ఇంత ఘోరంగా వుంటది పరిస్థితి..


తాటి ని తన్నే వాడు వుంటే వాడి తలను తన్నే వాడు వుంటాడు..


2,3 years age Gap అనేది దారుణం మరీ..minimum 5 to 6 years Gap vundali.

ఎందుకంటే.


Same age or 1 or 2 years gap Vunte enni problems వుంటాయో ప్రాక్టికల్ గా ఆలోచిస్తే తెలుస్తుంది..


➡️ఆరోగ్య సమస్యలు 

➡️Age gap minimum లేకుంటే భార్య భర్తలు మధ్య ఎలాంటి ప్రేమ , భక్తి, గౌరవం , ఏమి వుండవు..

➡️నువ్యేంత అంటే నువ్వెంత అనే స్టేజ్ కి వస్తారు..

➡️ఒక 60 years vachaka భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి మంచన పడతారు okarookaru సహాయం చేసే ఓపిక వుండదు..

➡️అమ్మాయి సాలరీ చూసి అంతా కన్న ఎక్కువ సాలరీ expect చేస్తున్నారు.

ఎంత ఘోరం అంటే అమ్మాయి లైఫ్ లాంగ్ job చేసే ఛాన్స్ లేదు.

కానీ అబ్బాయిలు మాత్రం లైఫ్ లాంగ్ job or business చేసి ఫ్యామిలి మి పోషించాలి..

అమ్మాయిల కి పెళ్లి ఐపోగానే పిల్లలు పుట్టగానే ఎలాగూ జాబ్ పిల్లల కోసం కోసం అని 80% జాబ్ మానేస్తున్నారు..


*ఇప్పుడు ఏదో జాబ్ చేస్తుందని గొప్పలకు పోయి న బిడ్డ కన్న ఎక్కడా ప్యాకేజ్ వుండాలి అనే  ఆలోచన మానుకోవాలి*


 కోరికలు ఇంత చెత్త గా వున్నాయి కాబట్టి every Month minimum 250 డైవర్స్ cases Hyderabad lo cosurts lo file అవుతున్నాయి*


ఆలోంచించి మారండి..మీకు అబ్బాయిలు వుంటారు ..మీరే ఇలాంటి కోరికలు కోరుకుంటే రేపు మీ అబ్బాయి కి మీరు వూహించని షాక్ తగిలే అవకాశం ఉంది

ఇది మరో గ్రూపులో వచ్చింది

కొద్ది మార్పులతో

భగవద్గీత

 *ఇక నుండి సెంట్రల్ సిలబస్ లో భగవద్గీత*


*కేంద్ర ప్రభుత్వం అతి పెద్ద నిర్ణయం తీసుకుంది.*

*ఇక నుండి సెంట్రల్ సిలబస్ లోని ఆరు, ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.*


*మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఆరు,ఏడు తరగతులలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చనున్నారు.*


*అలాగే భగవద్గీతలోని శ్లోకాలను పదకొండు, పన్నెండవ తరగతులలో (ఇంటర్మీడియట్) సంస్కృత పుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేరచనున్నట్టు కేంద్ర మంత్రి "అన్నపూర్ణాదేవి" పార్లమెంట్ లో తెలియజేయటం విశేషం.*

ఒక్క ఉత్తముడు చాలు.

 శ్లోకం:☝️

*కిం జాతైర్బహుభిః పుత్రైః*

  *శోకసంతాపకారకైః ।*

*వరమేకః కులాఽఽలంబీ*

  *యత్ర విశ్రామ్యతే కులం ॥*


భావం: తమ చెడు ప్రవర్తనతో దుఃఖాన్ని, శోకాన్ని మిగిల్చే బహు సంతానం కన్నా కుటుంబాన్ని ఉద్ధరించి వంశానికి ఆనందాన్ని కలిగించే ఒక్క ఉత్తముడు చాలు.

నూరుగురు సంతానం ఉన్నా ధృతరాష్ట్రుడికీ, గాంధారికీ శోకమే మిగిలింది.

ఒక్క భగీరథుడు గంగని భామిమీదకి దింపి మొత్తం సగరవంశాన్ని ఉద్ధరించాడు.

హిందూయిజం

 కాంగ్రెస్ మరియు హిందూయిజం


 ఆ తర్వాత కూడా హిందువులు కాంగ్రెస్‌ని అర్థం చేసుకోలేరు.


 ఆర్టికల్ 25, 28, 30 (1950)

 HRCE చట్టం (1951)

 HCB MPL (1956)

 సెక్యులరిజం (1975)

 మైనారిటీ చట్టం (1992)

 POW చట్టం (1991)

 వక్ఫ్ చట్టం (1995)

 రామ్ సేతు అఫిడవిట్ (2007)

 కాషాయ ఉగ్రవాదం (2009)


 వారు ఆర్టికల్ 25 ద్వారా మత మార్పిడిని చట్టబద్ధం చేశారు


 వారు ఆర్టికల్ 28లో హిందువుల నుండి మత విద్యను లాక్కున్నారు కానీ ఆర్టికల్ 30లో ముస్లిం మరియు క్రైస్తవులకు మత విద్యను అనుమతించారు.


 1951 హెచ్‌ఆర్‌సిఇ చట్టం ద్వారా వారు అన్ని దేవాలయాలు మరియు దేవాలయాల సొమ్మును హిందువుల నుండి లాక్కున్నారు


 వారు బహుభార్యత్వాన్ని రద్దు చేశారు


 హిందువులలో, విడాకుల చట్టం, హిందూ కోడ్ బిల్లు ప్రకారం వరకట్న చట్టం ద్వారా కుటుంబాలను నాశనం చేస్తారు కానీ ముస్లిం వ్యక్తిగత చట్టాలను తాకలేదు.  బహుభార్యాత్వాన్ని అనుమతించారు, తద్వారా వారు తమ జనాభాను పెంచుకుంటూ ఉంటారు

 ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలతో సులభంగా పెళ్లి చేసుకునేందుకు 1954లో ప్రత్యేక వివాహ చట్టం తీసుకొచ్చారు.


 1975లో వారు ఎమర్జెన్సీని విధించారు మరియు రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదాన్ని బలవంతంగా జోడించారు మరియు భారతదేశాన్ని బలవంతంగా సెక్యులర్‌గా మార్చారు.


 కానీ కాంగ్రెస్ ఇక్కడితో ఆగలేదు.  1991లో వారు మైనారిటీ కమిషన్ చట్టాన్ని తీసుకువచ్చారు మరియు సెక్యులర్ దేశంలో మెజారిటీ మైనారిటీలు ఉండకూడదు అయితే ముస్లింలను మైనారిటీలుగా ప్రకటించారు.


 వారు మైనారిటీ చట్టం ప్రకారం ముస్లింలకు స్కాలర్‌షిప్, ప్రభుత్వ ప్రయోజనం వంటి ప్రత్యేక హక్కులను ఇచ్చారు


 92లో, వారు తమ దేవాలయాలను చట్టబద్ధంగా తిరిగి తీసుకోకుండా హిందువులను ఆపారు మరియు హిందువుల నుండి 40000 దేవాలయాలను లాక్కొని ముస్లింలకు పూజా స్థలం చట్టం ద్వారా ఇచ్చారు.


 95లో కాంగ్రెస్ ఇక్కడితో ఆగలేదు, ముస్లింలకు ఏ భూమినైనా క్లెయిమ్ చేసుకునే హక్కును కల్పించి, వక్ఫ్ చట్టం ద్వారా హిందువుల భూమిని లాక్కొని ముస్లింలను భారతదేశంలో రెండవ అతిపెద్ద భూ యజమానిగా చేసింది.


 2007లో, వారు రామసేతు అఫిడవిట్‌లో శ్రీరాముని ఉనికిని తిరస్కరించారు మరియు దీనిని హిందూ దేవతగా మార్చారు.


 2009లో కాషాయ టెర్రరిజం అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా కాంగ్రెస్ హిందూ మతాన్ని ఉగ్రవాద మతంగా ప్రకటించడం హిందూ వ్యతిరేక క్రూసేడ్‌లో ఒక విపరీతమైన అంశం.


 అదే కాంగ్రెస్ తమ 136 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఇస్లామిక్ టెర్రరిజం అనే పదాన్ని ఉపయోగించలేదు


 కాంగ్రెస్ నెమ్మదిగా చాలా చాకచక్యంగా హిందువులను విప్పుతూనే ఉంది.


 వారు హిందూ హక్కులను ఒక్కొక్కటిగా తొలగిస్తూనే ఉన్నారు మరియు ఇప్పుడు హిందువు పూర్తిగా నగ్నంగా ఉన్నాడు మరియు తమాషా విషయం ఏమిటంటే వారికి అది కూడా తెలియదు.


 వారికి వారి గుడి లేదు, వారి మత విద్య లేదు, వారి భూమి వారికి శాశ్వతం కాదు.


 N వారు ప్రశ్నలు కూడా అడగరు.


 మసీదు మరియు చర్చి ఉచితం కానీ దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు ఉన్నాయి?


 వారిది ప్రభుత్వ నిధులతో మదర్సా, కాన్వెంట్ స్కూల్ అయితే ప్రభుత్వ నిధులతో గురుకులం ఎందుకు కాదు?


 వారిది వక్ఫ్ చట్టం కానీ హిందూ భూ చట్టం ఎందుకు కాదు?


 వారిది ముస్లిం వ్యక్తిగత బోర్డు కానీ హిందూ వ్యక్తిగత బోర్డు ఎందుకు కాదు?


 భారతదేశం సెక్యులర్ దేశమైతే మెజారిటీ మైనారిటీ ఎందుకు ఉంది?


 పాఠశాలల్లో రామాయణ మహాభారతాన్ని ఎందుకు బోధించరు?


 హిందూ మతాన్ని నాశనం చేయడానికి ఔరంగజేబు కత్తిని ఉపయోగించాడు.

  కత్తి విఫలమైతే రాజ్యాంగం, చట్టం, బిల్లును హిందూమతాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ఉపయోగించింది.


 N తర్వాత మీడియా ఉంది.


 ఎవరైనా ఈ ప్రశ్నలను అడగడానికి ప్రయత్నిస్తే, అతను/ఆమె మతపరమైన, కాషాయ ఉగ్రవాదిగా ప్రకటించబడతారు


 రాజకీయ నాయకులు ఎవరైనా ఈ తప్పులను సరిదిద్దేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు


 శక్తివంతమైన రోమన్ మతం పతనానికి కేవలం 80 సంవత్సరాలు పట్టిందని గుర్తుంచుకోండి.


 రోమన్ నాగరికత పతనం గురించి ప్రతి హిందువు తప్పక చదవాలి.


 ఏ బాహ్య శక్తి వారిని ఓడించలేదు, వారు తమ సొంత పాలకుడు కాన్‌స్టాంటైన్ చేత అంతర్గతంగా ఓడిపోయారు, క్రైస్తవ మతం ద్వారా.


 హిందువులు 1950లో నెహ్రూను ఎన్నుకున్నారు

 73 ఏళ్లు గడిచిపోయాయి


 ఇంకా 7 ఏళ్లు మిగిలి ఉన్నాయి..

భారత్ మాతా కి జై..

 "ఒక్కసారి చదవండి"


మన జీతం పెరగాలి

మన ఇల్లు అద్దె పెరగాలి

మనం కొన్న భూమి ధర పెరగాలి

మనం కొన్న ఇల్లు ధర పెరగాలి

మనం కొన్న బంగారం ధర పెరగాలి

మన దుకాణం గిరాకి పెరగాలి

మన షేర్ మార్కెట్ విలువ పెరగాలి

మన అందం పెరగాలి

మన విలువ పెరగాలి

మన ఆస్తులు అంతస్తులు పెరగాలి


*****


మద్యం ధర పెరగొచ్చు

బస్ టికెట్స్ ధర పెరగొచ్చు

సినిమా టికెట్స్ ధర పెరగొచ్చు

కరెంటు బిల్లు పెరగొచ్చు

ఇంటి బిల్లు పెరగొచ్చు

నల్లా బిల్లు పెరగొచ్చు 

హోటల్ బిల్లు పెరగొచ్చు

మొబైల్ ధర పెరగొచ్చు

పిజ్జా ధర పెరగొచ్చు

బీరు ధర పెరగొచ్చు

బిర్యానీ ధర పెరగొచ్చ

బూట్ల ధర పెరగొచ్చు

స్వీట్ల ధర పెరగొచ్చు... ఇలా 

మాట్లాడుకుంటూ పొతే మహాభారతం 

రాసుకుంటూ పొతే రామాయణం....


*********


కానీ పెట్రోల్ పెరగొద్దు.....

కానీ డీజీల్ పెరగొద్దు.....

కానీ గ్యాస్ పెరగొద్దు......

ఎందుకంటే ఇవి పెంచింది మోడీ 

(అని కొందరి ఉద్దేశ్యం)...


4 సంవత్సరాల క్రితం,

₹ 2 లక్షల రూపాయల బీమా

 ₹5000 / - నుండి ₹6000 / - వరకు....

ఈ రోజు సంవత్సరానికి ₹330 / -


4 సంవత్సరాల క్రితం 

9 సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్లు 

అందుబాటులో ఉన్నాయి, 

నేడు 12 ....


4 సంవత్సరాల క్రితం వరకు - 

LED బల్బ్ ₹400, 

నేడు అది ₹60 /-


4 సంవత్సరాల క్రితం 

లాల్ చౌక్ వద్ద భారత్ 

మాతా కి జై 

మాట్లాడటం నేరం ..


ఈ రోజు అదే లాల్ చౌక్ 

మీద రామ్ దర్బార్ ఉంది.


4 సంవత్సరాల క్రితం రైల్వే స్టేషన్ 

వద్ద మెట్లు ఎక్కి

నడవవలసి వచ్చేది, 

ఈ రోజు మనం ఎస్కలేటర్ ఎక్కుతున్నాము ..


ఈ పెట్రోల్ , డీజిల్ మీద 

ఏడుపులు ఇక ఆపండి !


350 మంది ఎంపీలతో 

ఉన్న వ్యక్తి, మన ముందు

కన్నీళ్లు పెట్టుకుని మద్దతు అడుగుతున్నారు  .....దేనికి ??


ప్రపంచంలోని అన్ని రాజధానిలకు 

వెళ్లి భారతీయుల 

సహాయం కోరారు...


రోజూ 16 నుంచి 20 గంటలు 

పని చేస్తున్న మన ప్రధాని ..


గత పాలనలో ప్రధాన మంత్రుల 

ఏ  సోదరుడైనా కిరాణా దుకాణం నడుపుతున్నాడా?


ఒక విషయం తెలుసుకోండి

మోడీ ఉగ్రవాదాన్ని, నల్లధనాన్ని, అవినీతిని అంతం చేయగలిగిన విధంగా ఇక ముందు ఎవరు 

చేయరు చేయలేరు.


ప్రధాని నరేంద్రమోడీ లాంటి 

జీవితం ఉన్న వ్యక్తి 

బహిరంగ వేదిక నుండి చెప్పిన మాట ....


"#ఈ_వ్యక్తులు_నన్ను_సజీవంగా_ఉంచరు..." అని...


పరిస్థితి చాలా భయంకరముగా ఉందని ఇది స్పష్టం చేస్తుంది.


ఎందుకంటే దేశ చరిత్రలో 

తొలిసారిగా ఒకే మనిషి చాలా 

మంది శత్రువులతో ఒకేసారి పోరాడుతున్నాడు.


మన ప్రధానమంత్రికి 

మద్దతు ఇవ్వాలి…


ఎందుకంటే ఈ రాక్షసులందరు మన  ప్రధానమంత్రికి ఏదైనా సమస్య అంటగట్టడానికి చూస్తున్నారు. 


మన మన నరేంద్ర మోడీని కాపాడుకోలేక పోతే శతాబ్దాలైనా మళ్లీ ఇలాంటి ధైర్యం ఉన్న నాయకుడు పుట్టడు.


#నేను_మన_ప్రధానితో_ఉన్నాను 


మీరు కూడా ఉంటారా ?


#భారత్ మాతా కి జై..🚩🚩🚩


కాపీ పేస్ట్

నిందించడం న్యాయమా

 గంటల తరబడి క్యూలో నిలుచుని..

ఉన్నప్పటికి .. ఆ దేవుడిని దర్శించుకోలేక

ఓ భక్తుడు  దేవుడిని ఒక ప్రశ్న  వేసాడు 

డబ్బులేని భక్తులకు దూరం నుండి..

డబ్బులున్న భక్తుడికేమో దగ్గర నుండి 

దర్శనం ఎందుకయ్యా ఈ అన్యాయం ???

ఇది ఏమైనా భావ్యంగా ఉందా.?....

గట్టిగ నవ్వేస్తూ భగవంతుడు..

*! ఇలా సమాధానం ఇచ్చాడు !*

తల్లికి మించిన  దైవం లేదు అన్నాను.

మీరు ఆవిడను పూజిస్తున్నారా ???

తండ్రి మాటకు మించిన వేదం లేదు అన్నాను. పాటిస్తున్నారా ????

గురువును మరొక దైవం అన్నాను. వినిపించుకున్నారా  ????

ఇందులో ఉన్న అందులో ఉన్న అని కాదు.

నువ్వెక్కడ వెతికినా అక్కడంతా నేను ఉన్నా అన్నాను 

మీరు నమ్మారా  ???

కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయండి.

నాకు చేసినట్టే అన్నాను మరి చేస్తున్నారా  ???

నేను ఎక్కడ ఉండాలో.

నేను ఎప్పుడు దర్శనం ఇవ్వాలో.

నాకు ఎప్పుడు ఉత్సవాలు చేయాలో.

నా మొక్కులు ఎలా చెల్లించాలో..

అన్ని మీరే నిర్ణయించారు,

ఇప్పుడు నాకు ఒక వెల కట్టి అందరూ వచ్చి

చూసి వెళ్లే వస్తువులా నిలబెట్టారు,

అన్ని మీరే చేసి మళ్ళీ నేను చేశాను

అని నిందించడం న్యాయమా ..

అని ఇప్పుడు ఆలోచించడం

అందరి వంతు అయ్యింది...

భక్తుడికి మాటలు రాలేదు.

         🙏 ఓం నమో వేంకటేశాయ నమః🙏

పరివేదన చెందనవసరములేదు.

 జగద్గురు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్య - వైరాగ్య డిండిమ 👍


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః  క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో,  జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు.  యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది.  కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత  జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో,  అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:-  పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:-  చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు. 


11. ఇదం కాష్టం ఇదం కాష్టం 

నధ్యం వహతి సంగతః| 

సంయోగాశ్చ వియోగాశ్చ 

కా తత్ర పరివేదన|| 


తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.

స్థిరముగా ఉండవు

 .


          _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*అభ్రచ్ఛాయా ఖలప్రీతిః* 

*సిద్ధమన్నఞ్చ యోషితః*।

*కిఞ్చిత్కాలోపభోగ్యాని* 

*యౌవనాని ధనాని చ॥*


తా𝕝𝕝 " *మేఘముల నీడ, దుర్జనులతోడి మైత్రి, వండిన అన్నం, స్త్రీలు, యౌవనం, ధనం - ఇవన్నీ స్వల్పకాల భోగ్యాలు... స్థిరముగా ఉండవు*...

దేహిమే ముక్తి శివా

 వయసైపోయిన ఒక భిక్షువు శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూండేది...


ఒక రోజు ఓ యోగిపుంగవుడు శివదర్శనం చేసుకుని వెడుతూంటే, ఆ వృద్ధురాలు ఆయన పాదలమీద పడి " అయ్యా ! నా జీవితం అంతా ఇలానే సాగిపోతోంది, నాకేదైనా మంత్రమో, పద్యమో చెప్పండి.


బతికి ఉన్న నాలుగురోజులు మీరు చెప్పినదే మనస్సులోనే అనుకుంటూ బతుకుతాను " అని ప్రాధేయపడింది...


 ఆ యోగి అప్పుడామెకు ఇలా చెప్పాడు:~

”తవ పాదే మమ శిర: ధారయతాం ! దేహిమే ముక్తి శివా ! " అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు...

ఆమె అది విని ఆనంద పడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతోంది...

 

అలా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలయింది. 

అలాగే ఆ శివాలయం దగ్గర బిక్షాటన చేస్తూ గడుపుతోంది.

 

తిరిగి ఆ యోగి పుంగవుడు శివ దర్శనం చేసుకుని, ఈమెను గుర్తుపట్టి, " ఏమి అవ్వా! నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా ? "అనడిగాడు.


 ఆమె ఆయనకు నమస్కరించి " అయ్యా ! అదీ మరువలేదు. తమరిని మరువలేదు " అన్నది...

 

”ఏదీ చెప్పిన పాఠం అప్పజెప్పు " అని నవ్వుతూ అడిగాడు.

 ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పజెప్పింది.

 

”అవ్వా ! తప్పు చదువుతున్నావు ! నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే, నువ్వు స్వామి శిరసు మీద నీ పాదాలు పెట్టావు ! నీ ఇన్నేళ్ళ ధ్యానం వ్యర్ధం అయ్యింది "అని కోపంతో వెళ్ళిపోయాడు...


 ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ " తవ, మమ " అనే పదాలు అటూ ఇటూ చేసి చదువుతోంది.

 

ఆమె కంటిమింటికి ఏకధారగా ఏడుస్తూ, అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ళ శ్రమ వ్యర్ధం అయ్యింది అని రోజుల తరబడి బాధపడసాగింది.


 ఓ  రాత్రి మన స్వామి ఆ యోగిపుంగవుని కలలో కనబడి " ఏం పని చేశావయ్యా ! నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. 

నేను శ్రద్ధాభక్తులకు వశుడను కానీ, భాషకు కాదయ్యా ! ముందు ఆమె బాధపోగొట్టి, ఆమె అహారం తీసుకునేలా చెయ్యి"అని ఆయనను హెచ్చరిక చేశాడు...


 ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి, శివాలయం దగ్గరకు పరుగుపరుగున వెళ్ళి, ఆ వృద్ధురాలి పాదముల మీద పడి “అమ్మా ! నువ్వు చేసే పూజే స్వామి కి నచ్చింది,  నన్ను క్షమించి ఆహారం స్వీకరించు" అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు...


 కాబట్టి మనం తెలుసుకోవలసింది, స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ,భాషకు కాదని తెలుసుకోవాలి...


 మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. 

పూజల్లో దోషాలు వస్తుంటాయి. అవ్వన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది శ్రద్ధా, భక్తి మాత్రమే.

నిజమైన, భక్తి

 నిజమైన, పరిపూర్ణమైన భక్తి అంటే ఇది కదా అనిపించింది. 


ఎంత ఆరాధనా భావం, ఎంత ఉన్నతమైన మనసు, అన్నిటినీ మించి సనాతన భారతీయ గురుపరంపర పట్ల వారికున్న గౌరవభావం నన్ను ముగ్ధుడిని చేసాయి.


నిన్న (12.03.2023) సాయంత్రం రాజమహేంద్రవరంలోని హోటల్ షెల్టన్ లో జరిగిన డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని, రాత్రి సుమారుగా 9.30 గంటల సమయంలో కారులో విజయవాడకు తిరుగుప్రయాణమయ్యాను. 


కొవ్వూరు వంతెన దాటి, కొంతదూరం వచ్చాక, దారి ఎడమవైపునకు తిరుగుతుంది. అది చాలా పెద్ద కూడలి. అక్కడో ఫ్లైఓవర్ కూడా ఉంది. నాకు ఆ దారిమీద పూర్తి అవగాహన లేదు. అందువల్ల కచ్చితంగా అది ఏ ప్రాంతమో చెప్పలేను.  


అలా... కారు ఎడమవైపునకు మలుపు తీసుకుంటున్న సమయంలో, పెద్ద ఫొటో కనబడింది. అది కంచి స్వామివారు... జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిది. మామూలుగా అయితే, స్వామికి నమస్కారం చేసుకుని, ఆగకుండానే ప్రయాణం చేసేవాడిని. కానీ, అక్కడి సన్నివేశం నన్ను ఎంతో ఆకట్టుకోవడంతో కారు వెనక్కుతిప్పమని డ్రైవర్ కు చెప్పాను.


మీరు ఫొటోలో చూస్తున్నదే ఆ సన్నివేశం. అందులో ప్రత్యేకత ఏమిటంటే...


స్వామివారి ఫొటో కింద ఓ వ్యక్తి పూలు అమ్ముకుంటున్నాడు. అది అతడి వృత్తి. రోజూ అక్కడే పూలు అమ్ముతుంటాడు. రోజూ తాను అమ్మకానికి తెచ్చుకున్న పూలలో కొన్ని స్వామి వారి ఫొటోకి వేసి, నమస్కారం చేసుకుని, ఆ తర్వాత అమ్మకం ప్రారంభిస్తాడు. మంగళవారం, శనివారం స్వామికి ప్రత్యేకంగా అలంకారం కూడా చేస్తాడు.


నిజానికి అది అతను పెట్టుకున్న ఫొటో కాదు. స్వామివారు కొద్దికాలం క్రితం రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఓ సంస్థ ఏర్పాటుచేసిన స్వాగత ప్రకటన అది. ఆ ఫొటోకే అతడు నిత్యం పూలదండలు సమర్పిస్తాడు.


సాధారణంగా అందరూ వారి ఇష్టదైవాల ఫొటోలు పెట్టకుంటారు. కానీ, ఇతడు మాత్రం స్వామి వారి ఫొటోకే దండలు వేసి, ఆరాధిస్తున్నాడు. అతడు వ్యాపారం చేస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించాను. ఏ దేవుడి ఫొటో అక్కడ లేదు. కేవలం స్వామి వారి ఫొటోకే దండలు వేసి ఉన్నాయి. 


కారు దిగి, అతడిని అడిగి ఈ వివరాలు తెలుసుకున్నా. స్వామివారు చాలా గొప్పవారని, ఆయన దేవుడితో సమానమని చెప్పాడతడు అతడి యాసలో.  


నేను కొంత సొమ్ము ఇచ్చి, తీసుకోమంటే... వద్దంటే వద్దన్నాడు. నా దేవుడికి పూలు నేను వేసుకోగలను అన్నాడు. అనేకవిధాలుగా బతిమాలినా ఒప్పుకోలేదు. చివరకు ఆ సొమ్ముకు తగిన పూలు రేపటి రోజున స్వామికి సమర్పించమని చెబితే, సరేనంటూ అంగీకరించాడు. 


ఇది కదా నిజమైన, పరిపూర్ణమైన భక్తి అనిపించింది.  


ఆ పెద్ద మనసు ముందు నేనెంత చిన్నవాడినో తెలిసింది. 


ఇంతటి గొప్ప సన్నివేశాన్ని చూసిన ఆనందంలో ఆ వ్యక్తి పేరు కనుక్కోవడం మర్చిపోయాను. 


అయినా... అంతటి గొప్ప మనసుకి పేరుతో పనేముంది.


కప్ఫగంతు రామకృష్ణ గారు