16, మార్చి 2023, గురువారం

మానవుడు

 *శుభోదయం* 💐🙏


మనిషిని *మానవుడు* అని ఎందుకు అంటారు? 


అమ్మలో చివరి అక్షరం 

*మా*

నాన్నలో చివరి అక్షరం 

*న*

గురువులో చివరి అక్షరం.         

 *వు*

దేవుడు లో చివరి అక్షరం

*డు*


అమ్మలోని *ప్రేమ*

నాన్నలోని *బాధ్యత*

గురువులోని *జ్ఞానము*

దేవుడిలోని *ఆత్మ* స్వరూపమే.. *మానవుడు*



సాటి జీవకోటి పట్ల *ప్రేమతో*,  


ప్రకృతి పట్ల *బాధ్యతగా* వ్యవహరిస్తూ,

  

ఈ సృష్టి అంతా తనలాంటి 

*ఆత్మ స్వరూపమే* 


అనే *జ్ఞానం* 

కలిగి ఉండటమే 


*మానవత్వం* 

🙏🙏

ఆశీర్వాదం

 *🙌పురోహితుని ఆశీర్వాదం విలువ🙌*

                                               

                                                  *ఒకరోజు ఒక కోర్టులో జడ్జి గారి ముందుకు ఒక కేసు వచ్చింది*


*ఫిర్యాదు దారుడు ఒకతను ఈ విధంగా ఫిర్యాదు చేశాడు....*


*"ఒక పురోహితుడు తను సంపాదించిన ధనానికి ప్రభుత్వానికి Tax చెల్లించడం లేదు. కావున తమరు విచారణ జరిపి అతని సంపాదన అక్రమ సంపాదనగా గుర్తించి అతనిని తగిన విధంగా శిక్షించగలరని మనవి."*


*జడ్జిగారు పురోహితునితో "మీరు ధనాన్ని అక్రమంగా సంపాదించారా  లేక సక్రమంగా సంపాదించారా?"  అని ప్రశ్నించారు.*


*దానికి పురోహితుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు....*                         

*"నేను సంపాదించినదంతయు సక్రమమే...* 

*ఇసుమంతయు అక్రమం కాదు ."*


*"అయితే అంత ధనాన్ని  సక్రమంగా ఎలా సంపాదించారో వివరించండి" అని జడ్జిగారు అడిగారు.* 


*"అయ్యా ! ఒక రోజు ధనవంతులైన దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ఒక చెరువు వద్దకు వచ్చారు*.      


  *నేను ఆ సమయంలో సంధ్యావందనం చేస్తున్నాను*.                       

*ఆ సమయంలో వారు చేసుకోబోయే అకృత్యాన్ని చూసి వారించాను.* *'ఆత్మ హత్య మహా పాపం' అని వివరించి వారిని ఆ ప్రయత్నం నుండి విరమింప చేసి స్వాంతన కలిగించాను.*  


 *నా మాటపై విశ్వాసంతో వారు వెనుదిరిగి వెళ్లారు*

*కొద్ది రోజుల తరువాత నాపై గౌరవంతో వద్దన్నా వినకుండా కొంత ధనాన్ని ఇచ్చి 'ఆశీర్వదించండి'* *అని వేడుకున్నారు. అప్పుడు నేను 'సంతాన సిద్ధిరస్తు' అని ఆశీర్వదించాను.*


*కొన్ని సంవత్సరాల తరువాత వారికి కలిగిన సంతానాన్ని వెంటబెట్టుకొని ఆనందంతో నావద్దకు వచ్చి..*నా కుమారునికి మీ ఆశీస్సులు అందచేయండి. 'అని ప్రాధేయపడ్డారు.*


*దానికి నేను 'మీ పిల్లవాడు బాగా చదివి ప్రయోజకుడు అవుతాడు. మీకు మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తాడు.' అని ఆశీర్వదించాను.* 

*ఆ సమయంలో ఆనందంతో వారు  మరికొంత ధనం ఇచ్చి వెళ్ళారు.*


*మరికొన్ని సంవత్సరాల తరువాత ఈ మధ్యనే ఆ ధనవంతుడు తన కుమారుడు ప్రయోజకుడాయ్యాడనే విషయం తెలియ జేయడానికి నా ఇంటికి వచ్చి ఆశీర్వాదం అడిగాడు.*                      *నేను ఆ దంపతులిద్దరిని 'ఆయురారోగ్య వృద్ధిరస్తు' అని ఆశీర్వదించాను.*

*అప్పుడతను తన వద్ద ఉన్న ధనంలో మరికొంత ధనాన్ని ఇచ్చి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు.*


 *అయ్యా! ఈ విధంగా నేను ధనవంతుణ్ణి అయ్యాను. నేను సంపాదించిన ధనము సక్రమమైనదో లేక అక్రమమైనదో తమరే తీర్పు ఇవ్వండి" అన్నారు.*


*పై విషయం అంతా సావధానంగా విన్న జడ్జి గారు ఈ విధంగా తీర్పు ఇచ్చారు...*


*"ఆరోజున ఆత్మ హత్య చేసుకోవాలనుకున్న ఆదంపతులను ఈ పురోహితుడు వారించకుండా ఉంటే వారికి తర్వాత జీవనం ఉండేది కాదు.* *కొన్ని రోజులకు వారు తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కృతజ్ఞతా పూర్వకంగా కొంత ధనం ఇవ్వడం పూర్తిగా ఆమోద యోగ్యమైనదే.*                                   *ఆ ధనం సక్రమమైనదే.*


 *అటుపిమ్మట కొన్ని రోజులకు వారు సంతానవంతులై పుత్రుడు పుట్టాడనే ఆనందంలో మరికొంత ధనం ఇచ్చారు.* *అదియును సక్రమైనదే !*

*మరికొన్ని రోజులకు కొడుకు ప్రయోజకుడాయ్యాడనే సంతోషంతో మరికొంత ధనం ఇచ్చారు. అది కూడా సక్రమమే.*


*మరియు ధనవంతుని శేష జీవితం ఆయురారోగ్యాలతో ఉంటుందని తెలుసుకొని ఆనందంగా జీవిస్తున్నారు.*


*ఈ విషయంలో ఎక్కడా పురోహితుని సంపాదన అక్రమమని తెలుపలేము." అని తీర్పు వెల్లడించారు.* 


*ఈ సందర్భంలోనే జడ్జి గారు*ఇలా అడిగారు.*

*"అయ్యా ఇంత ధనాన్ని మీకు ఇచ్చి పుణ్యాత్ములైన ఆ ధనవంతులు ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహం తో ఉన్నాను.*

*వారు ఎవరో తెలుపగలరా?"* 


*"ఆ పుణ్య దంపతులు మీ తల్లిదండ్రులే !" అని తెలియచేశారు పురోహితుల వారు.* 


*వెంటనే దుఃఖంతో తను కూర్చున్న స్థానం నుంచి దిగి వచ్చి పురోహితునికి సాష్టాంగ నమస్కారం చేసాడు జడ్జి.*


*బ్రాహ్మణుడి ఆశీర్వాద బలం ఎంతో శక్తివంతమైనది !!!*

🙏🏻🙏🏻🙏🏻

ఇట్లు,

మీ 🚩

బహు జన్మల పుణ్య ఫలం

 బహు జన్మల పుణ్య ఫలం, మానవ జన్మ ! సృష్టి కర్త యొసగిన అత్యంత విలువైన జన్మ ! చరాచర జీవజాతి నిత్య ప్రశాంత జీవన గమనంలో తేజో ప్రకాశమై వెలుగొందెడి సుచైతన్య దివ్య దీపిక ! ప్రకృతి అనునిత్యం నేర్పెడి సన్మైత్రీ జీవన దృక్పథ మహోన్నత దార్శనికత ! యుగాలాది నిత్య జీవన చక్రభ్రమణంలో, విశ్వ జీవ సుసంక్షేమాత్మక నిత్య జీవనంలో, విశ్వ మానవాళి ప్రధాన పాత్ర పోషిస్తున్న తీరు, అనాదిగా ప్రత్యేకత సంతరించుకోవడం గమనార్హం ! విశ్వ సురక్షా భావనాత్మకతయే ప్రధానాంశమై, సకల విశ్వ జీవ సుసంక్షేమ జీవన మార్గమై, జరిగే కాలానికి, ప్రతి సెకనూ మహత్తరమై ప్రకాశించే సన్నివేశం ! " తాము సుసంక్షేమాత్మక జీవన బాటలో నడుస్తూ, సకల విశ్వ జీవరాశి కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా నిత్య జీవనం సాగించాలన్నదే ప్రధానాంశంగా, తమకు సృష్టి కర్త యొసగిన బ్రతుకుకు సరియైన రీతిలో సాకారాన్ని పొందాలనే మహోన్నత భావనగా, పరమోన్నత దివ్య సందేశాన్నొసగే ప్రకృతి, ప్రాతఃకాలంలో సకల జీవ జీవకారుణ్యతాత్మక నిత్య జీవన బాటను అందరికీ చేరువ చేస్తున్న నేపథ్యం ! సత్వర వసుధైక కుటుంబక నిర్మాణాత్మక బాధ్యతను, ప్రధానాంశంగా తీసుకోవలసిన విశ్వ మానవాళికి, రమణీయమైన, సుమధురమైన ప్రకృతి ఎల్లవేళలా సముచిత, సమోన్నత నిత్య సుచైతన్య దివ్య స్ఫూర్తి !                                                     ✍️గుళ్లపల్లి ఆంజనేయులు

 https://www.google.com/search?q=gayatri.seva+kasi&oq=gayatri.seva+kasi&aqs=chrome..69i57j33i10i160l2.17496j1j4&client=ms-android-samsung-ga-rev1&sourceid=chrome-mobile&ie=UTF-8

తర్వాత ఏమి సాధ్యమవుతుంది

 శ్లోకం:☝️

*యావత్స్వస్థో హ్యం దేహో*

 *యావన్మృత్యుశ్చ దూరతః ।*

*తావదాత్మహితం కుర్యాత్*

 *ప్రాణాన్తే కిం కరిష్యతి॥*


భావం: ఈ దేహం ఆరోగ్యంగా, వ్యాధి రహితంగా ఉన్నంత కాలం మృత్యువు దూరం. కావున అప్పటి వరకు ఆత్మలాభం కొరకు ధార్మిక ప్రవర్తన, పుణ్యకార్యములు చేయాల్సిందే! మరణం తర్వాత ఏమి సాధ్యమవుతుంది?

15, మార్చి 2023, బుధవారం

జలుబు హరించుటకు

 జలుబు హరించుటకు సులభ ఆయుర్వేద యోగాలు - 


 *  అల్లం , మిరియాలు , తులసి దళాలు సమభాగములుగా తీసుకుని దంచి కషాయం కాచి పూటకు గిద్దెడు (టీ గ్లాసు ) మోతాదులో తీసికొనవలెను . 


 *  పండు జిల్లేడు ఆకు రసం మరియు నువ్వుల నూనె కలిపి శరీరముకు మర్దన చేయుచున్న జలుబు హరించును . 


 *  10 గ్రాముల శొంఠి చూర్ణమును 50 గ్రాముల వేడి నీటిలో కలిపి నిద్రపోయే ముందు పుచ్చుకొనుచుండిన యెడల జలుబు హరించును . 


 *  నల్ల జీలకర్ర చూర్ణమును గుడ్డలో మూటకట్టి వాసన చూచుచుండిన జలుబు త్వరగా తగ్గును . 


 *  వేడి వేడి మినప గుగ్గిళ్లను ఉప్పు కలిపి భోజనము చేసిన పిమ్మట తినుచుండిన యెడల రెండు మూడు రోజుల్లో జలుబు తగ్గిపోవును . 


   పైన వివరించిన ఆయుర్వేద చిట్కాలలో మీకు అనువుగా ఉన్న ఒకదానిని ఎంచుకొని పాటించి సమస్య నుంచి బయటపడగలరు . 


      జలుబు , పడిసం వంటి సమస్యలతో ఇబ్బంది పడున్నప్పుడు చల్లటి పదార్దాలు , పచ్చళ్లు , పాలు మరియు పాల సంబంధ ఉత్పత్తులు , ఫ్రిజ్ నీరు , కూల్డ్రింక్స్ వంటివి సేవించరాదు . 


         

సీతా జయంతి

  సీతా జయంతి!*


ఫల్గుణ మాసంలో కృష్ణ పక్ష అష్టమి నాడు జానకీ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజును సీతాదేవి జనక మహారాజుకు పొలంలో దొరికిన రోజుగా చెప్పుకుంటారు. సీత త్యాగానికి, అంకిత భావానికి ప్రతీక. ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగి పోతాయని నమ్మకం. ఈ రోజున శ్రీరాముడితో పాటు సీతా మాతను కూడా పూజిస్తే లక్ష్మీ నారాయణుల కటాక్షం దొరుకుతుందట. 


ఈ పండుగను ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దక్షిణ భారత దేశంలో మహారాష్ట్ర, తమిళనాడులో కూడా దీనికి ప్రాముఖ్యత ఉంది. సీత భూదేవి పుత్రిక కనుక భూమి అనే పేరుతో కూడా సీతను పిలుస్తారు. జీవితం ముందుకు సాగడానికి, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగేందుకు సీతా జయంతిని జరుపుకుంటారు. సీతా జయంతిని భక్తిగా జరుపుకునే వారికి ఆనందదాయకమైన దాంపత్య జీవితం లభిస్తుందని నమ్మకం. అంతేకాదు వివాహానికి అడ్డంకులు ఎదురవుతున్న వారు కూడా సీతాజయంతి రోజున సీతారాములను ఆరాధించి, ఉపవాసం చేస్తే తప్పకుండా అడ్డంకులన్నీ తొలగిపోయి వివాహం జరుగుతుందని చెబుతారు.

ఆహారముతో నింపవలెను

 .


             _*|సుభాషితమ్*_


 𝕝𝕝శ్లో𝕝𝕝  

*ఉదరం పూరయేదర్థం* 

*అన్నైర్భాగం జలేన చ।*

*వాయోః సఞ్చారణార్థాయ*

*చతుర్థం అవశేషయేత్॥*


తా𝕝𝕝 " *పొట్టను సగభాగం ఆహారముతో నింపవలెను.... మిగిలిన సగభాగంలో సగం నీటితో పూరించవలెను*.... *దేహములోని ప్రాణవాయువు  ప్రసరించుటకు వీలుగా ఆ తక్కిన భాగం ఖాళీగా  ఉంచచలెను.*"...

ధనమును

 *సుభాషితమ్* *అర్థానామార్జనే దుఃఖం*

*ఆర్జితానాం చ రక్షణేl*

*ఆయే దుఃఖం వ్యయే దుఃఖం*    

*ధిగర్థం దుఃఖభాజనమ్|*


*ధనమును సంపాదించుట కష్టం, సంపాదించిన ధనమును రక్షించుట కూడా కష్టమే*

కష్టించి ధనమును ఎట్లో సంపాదించిననూ దానిని భద్రపరచుట కష్టమైనదే. ఇక భద్రపరచిన ధనమును ఖర్చు చేసిననూ ధనము తరిగిపోతున్నదని దుఃఖమే మానవుడికి మిగులుచున్నది.

అందువల్ల *ధనమును ఏ విధంగా చూసిననూ ఏ దశలోనైనా దుఃఖమునే కలిగించేది అని తెలియుచున్నది*


*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*

పునర్జన్మ

 సనాతన ధర్మం - పునర్జన్మ


ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అదగాలని అనుకున్నాడు. వెంతనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు.


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మ యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు. కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెపాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కంచీపురంలో వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా అని కనుక్కున్నారు. అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు.


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు. అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు” అని తన కారులో వెళ్ళిపోయాడు. సాయిత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందు వచ్చాడు. ఆ వివరాలకు స్వామి వారికి చెప్పాడు.


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చెసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.


స్వామివారు అతణ్ణి చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు.


”వీరు పుట్టిన ఈ రెండు రోజులలొ వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు” అని చెప్పాడు.


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం”


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం ||


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం